Skip to content

Telugu Ramanopanishat

anilkumaranilou-alt edited this page Aug 8, 2026 · 1 revision

వెలి కవ స నం . న క ననన స. తా. . శ్ర టం 50 , వుకోనరలన ' స , ం మ! . | “క నయ స స. క్షి వ (గళ సహఘాటం. / తిరువణ్డామలై... 51013 య.

రమణోపనిషత్‌ తమిళమూలం మురుగనార్‌ *““గురువాచక కోవై? ఆంగ్లానువాదం 206 62742724 6 రడుడ్యా చాజంక!ఇ6066 07 ౦% రొజు పం2020 భావానువాదం శ్రీదోనేపూడి వెంక య్య మూడవ అధ్యాయము “క౯ుంలలంంలొ కు భావానువాదము (శ్రీరమణా శ్రమము తిరువణ్ఞామలై - 606 603 2003

₹2002002బ0 028 (61686) 9 ంల16417/ల014120. 02066 00 120011 ఇంగ “ఆటం *షయజం2 కంళజు” 97 గేటటరులైటం2 - మరం 6120512601 0౦౯ “గం6 6జేజండే 0% ౮4౯౪౫) రాగుల” 09” పెంట్‌ కు రాజు 2య2ంు అహార యల “దుర్దులులగంలో గ౦౯డం9 01౧ ఠికకలత 67 *05.ుకంజంు కెజ!కేంయల కణ ంుటుంుడంవాంంంు 10020030021121-606 603, [006 237292/ 237200, 2టాజబుం 237491, అం: 2110 అ1200202-0101601105్యు 6051106: ఇగిగాన[200302-0020 108103 (అ 56 200 కయ రటటరంజం2121 కం 841601: 1997 - 1000 600016 (96 మ2001201 10036 *సబా2ళా2రే2) ౬7 (00 ర ర 560096 క6414ం0: 2003 -2000 60916 521 దుఖం 2మా2ం0 షు గహర రటుం2121 [౮ .. |] ర్మ " ల ప 66౫0: 3110 య్‌ ౯ జో 153 0: 81-88225-70-3 కన హ్‌ ,లంటట్సై తాలం [20204 (అరుణ రమణ)! 2 డ్ర్‌ గ్గ స ట్‌ వెనముష జం (భీమవరం) ల మ చా ఓ తర గరగలు వజంంై2!086 560 003 ౨006: 3346025

ప్రకాశకుల మనవి

తమిళ మహాకవి శ్రీమురుగునార్‌ రమణ భక్తులలో శశ్రేష్టులు. వీరు శ్రీ రమణుల బోధనలను స్వయముగా విని, అర్ధము చేసికొని, ఆచరించి, ముక్తులై “గురువాచక కోవై అను పేరుతో గీతములు రచించి కృతార్జులైనారు. దానికి ఆంగ్లానువాదము స్రొ. స్వామినాథన్‌ గార ౨6 6జుబు6 01 669 9ఖగుక[కొ. దీనిలోని మూడవ అధ్యాయమునకు భావానువాదము శీదోనెవూడీ వెంకయ్యగారు మనకీ [గ్రంథము నందించారు.

“రమణోపనిషత్‌ అనే సమువితమైన నామంతో ఈ [గ్రంథాన్ని శ్రీరమణ ట్రస్ట్‌, విజయవాడ వారు మొదట ముద్రించారు. వారి అనుమతితో ఇకపై ఈ [గ్రంథ బాధ్యతలను (శ్రీరమణా శ్రమము స్వీకరించి ఈ ద్వితీయ ముద్రణను అందిస్తోంది. ట్రస్ట్‌వారు, అనువాదకులు శ్రీదోనేపూడి వెంకయ్యగారు అభినందనీయులు.

1౫౨ సేవలను తంజీంచిన 'ఆరుణ రవుణ”, భీవువరం వారొపై (శ్రీరమణభగవోనుల కృపాకటాక్షములు సదా ప్రసరించు గాక!

ెళ0కంకీలో' 3 016

911 వేశయయు[్రట3 725 2 88౯12001 00ల6- 92010 26 ₹15 1 క09ల00566సయ0160555 [2202 106 11 రేలంళం[ 00 10 ఆగ 25 అయి9120? 5% కరు జం2'5 106 జర 62011080 ఇసయే 1650 ఉం ఘయు16ేంరే ఇగయి. దేలు లండలదయురముక్రి 019 096 1 2 ంఅలుం12 00001306 జం4 00050404 11011 ౦6౦ “ఆ ఇయ సంా21” 2 14 13 02066 023 9ంలు *టురేల6ి6 1200 20219) ఇ [6 6౭119405 0603'9 కజగం 0 05. రాజగు ము2లీఖు. టం రరపరే యం 0౯1 ౨|66 'మరులులంంరో, ₹13 దమ! 106ి6ే సంం గలేలైైట 0 55 00064641 1020. 0 7/10 02013066 29 అగ్యాం2ర0022ఏ20 0 “55 షి2జణు202 2656, సగ) షజగా26ే2 తీంరమీ2 264టస.

చం 045 [ఆడం క్రంద 1౪76 000 10407 ంగలాండే 10 551 కుజ జం20ు 0 య6 ల 206 లల జల! ఏ 001 006006 షర 960016 661609.

79 206 గల2ం!్య! 10 'తూంం2 షం ఖంళి 30022200 601 ంకలఘుం 01౦ 9ల౦గంయి ఒరే మిష రర 902880 00060646 00 లై1166 206 91ల3 థలయి.

(శ్రీరవుణులు

శ్రీరమణులు 1879సం. డిశంబరు 30వ తేది మార్గశిర బహుళ పాడ్యమి సోమవారం రాత్రి ఒంటి గంటకు తమిళనాడులోని మభుర సమీప గ్రామమైన తిరుచ్చుళిలో జన్మించారు. తల్లిదండ్రులు అలఘమ్ము సుందరమయ్యరులు, వెంకటరామన్‌ అని బాలునికి పేరు పెట్టారు.

ప్రాథమిక విద్యాభ్యాసం తిరుచ్చుళిలోనే జరిగింది. దిండిగల్‌లో ఒక సంవత్సరం, తరువాత మధురలో హైస్కూల్‌ చదువు సాగింది. స్కూల్‌ ఫైనల్‌ క్లాసులోనికి వచ్చిన కొద్ది రోజులలోనే అనగా 1896 జూలై నెలలోనే 16 ఏండఢ్ల వెంక ట్రామన్‌కు ఒకనాడతడు వేడపై పడుకొని యుండగా ఎందులకో తాను చనిపోవృచున్నట్సు అనుభవం కలిగింది. మరణానంతరమున్న నిత్యసద్వస్తువు “తానని గ్రహించాడు.

తరువాత కొద్దికాలమునకే ఎవ్వరికీ చెప్పకుండా మధురను వదలి అరుణాచలం చేరుకొని దేహపతనం వరకు అక్కడనుండి కదలకుండ ఆత్మనిష్టలో ఉండిపోయినారు. ఆయనను చూవి సిత ప్రజ్ఞుడు ఇలా ఉంటారని లోకం గ్రహించింది. ఆయన కారణంగా అద్వైతసీద్ది అంటే ఏమిటో, భారతీయ బుషి పరంపర ఎట్టిదో ప్రపంచానికి అర్ధమైంది.

రమణోపనిషత్‌

1950సం. ఏప్రియల్‌ 14వ తేదీన రాత్రి గం.8-47ని.లకు ఆయన పాంచభౌతిక దేహాన్ని వదిలి అరుణాచలునిలో లీనమైనారు. ఆయన దేహాన్ని వదలే సమయంలో ఆయనలో నుండి ఒక పెద్దజ్యోతి కాంతుల్ని విరజివన్ముతూ ఆకాశంలోనికి లేచి ఈశాన్యదిక్కుగా పయనించి అరుణగిరి శిఖరాల్లో లీనమైంది. ఈ జ్యోతిని మద్రాసు (ఖ్యదిద్మ, బొంబాయి ౧కూాళ్ర్‌ మొదలగు పట్టణాల్లోని ప్రజలుకూడ దర్శించినట్లు వార్తాపత్రికలలో ప్రకటించబడ్డది. అరుణాచల తేజమే (శ్రీరమణుల అవతారము. అందువల్లనే ఆ తేజం అరుణగిరిలో లీనమైంది.

దేశవిదేశాల్లోని ప్రవుఖులెందరో 'శ్రీరవుణులను సందర్శించారు. భక్తులైనారు, ముక్తిని పొందారు.

అరుణాచలము క్షేత్రవములకు క్షేత్రవు. రవుణుడు అరుణాచల శివుడే. అరుణగిరి అరుణాచలేశ్వర దేవాలయం, (శ్రీరమణా శ్రమం నిరంతరాయంగా ఆత్మజ్ఞానాన్ని ప్రపంచమంతా వెదజల్టుతున్నాయి.

విషయసూచిక

  1. అద్వైతస్థితి రెరనలలడ నిన వదిలలరిచ దని లటచ చర వదలవలిదవథకిలవలచవక వ దచివచచద వటం ంంలలటలంటంం క్త
  2. ఆత్మజ్ఞానమే అపరోక్ష జ్ఞానం క ౮
  3. కేవల నిర్వికల్ప సమాధి మనోలయం,

సహజ నిర్వికల్చ సమాధి మనోనాశం......ంంం. 6 4. అన్నింటికీ ఆధారంగా సాక్షీభూతంగా

ఉండటమే జ్ఞాని లక్షణం = 5. అద్వయమైన ఆత్మానుభూతి మాత్రమే సర్వజ్ఞత్వం .................. 12 6. గ్రంథి విచ్చేదం పలిదట చలన రరర రలదనన నవల వం వట రలన చదవటం వటం 0లంంం0ట04002000424 165 7. నిరంతరాత్మ విచారణ వల్ల జాగ్రత్తులో సుషుప్తి లభిస్తుంది ........... 17 8. అన్నీ ఆ బ్రహ్మమే, అన్యము కాదు... 20 9. భూమవిద్య..........౨౨౦౦౦౦ ౦౦౦౦౦0 2 10. శుద్ధ చిదాకాశమే న. 2్క 11. మనః కల్పిత మిథ్యా దృశ్యాలు మరు మరీచికలు

అత్మ నిష్టునకే ఆనంద ప్రాప్తి. 2 12. అహంత తొలగితే ప్రకాశించేది ఆత్మే... 29 13. ఏ సిద్దులు ఆత్మసిద్ధికి సాటిరావు... 32 14. దివ్యానందమయ శివతత్త్వం.......౨ 95 15. మహవాత్ములైన జీవన్ముక్తులు పరమాత్మ స్వరూపులు ................ 39

  1. ముక్త పురుషుని రూపాన్ని సదా ధ్యానిస్తే మనకు

సత్యం గోచరిస్తుంది...............444000 0202222202 బంల2 ల జలం తసి 17. జ్ఞానిది అహంతా నాశానంతర ధృఢ మౌన నిష్ట.................. ఉక 18. జ్ఞాని బ్రహ్మలోక విష్ణులోక శివలోకములకు

ప్రభువు, చక్రవర్తి... ౨౦4 4460200000000 వం వరత లవలవవలంంలంలంంలంం త్తే? 19. జీవన్ముక్తుని గొప్పతనాన్ని అతడు ప్రదర్శించే

సిద్దులను బట్టి నిర్ణయించడం తప్పు ........2..222222444444442=ర్‌0 20. మౌనం మోక్షరాజ్యానికున్న వైక ప్రవేశద్వారం ................... 52 21. అత్మజ్ఞానంలో సర్వసిద్దులు, సర్వశక్తులు కలిసి

ఉంబాయి.........224066 2200200262 22 0 2000626046 02202644420624444442= ర్‌ప్‌ 22. సమస్త కామ్య విముక్త శుద్ద సత్‌గ ఉండుటే ముక్తి .................. 568

(శ్రీ మురుగనార్‌ జీవిత చరిత్ర

శ్రీ మురుగనార్‌ 1890 సం ॥ ఆగస్టు నెల రామనాథ పురమున ఒక సద్పాహ్మణ కుటుంబంలో సుబ్బలష్మి అమ్మాళ్‌, కృష్ణయ్యర్‌ దంపతులకు జన్మించిరి. అతి చిన్న వయస్సులోనే వారి తండ్రి పరమపదించిరి. రామనాథ పురంలో 10వ తరగతి వరకు తరువాత మధురలో 2సం॥లు చదివి మెట్రిక్‌ పరీక్షలో ఉత్తీర్డులైర. తమిళంలో పంచవుహాకావ్యములు, తిరుక్కురల్‌, “నన్న్నూల్‌' అను వ్యాకరణ (గ్రంథములను ఆకళింపు చేసుకొన్నారు. తమిళ భాషా శబ్దరళత్నాకర సంఘములో ముఖ్య సభ్యులై శబ్దరత్నాకరము ్రాసి వెలుగులోకి తెచ్చారు. వారి తమిళ భాషా పాండిత్యం వలన వా8ి పేరు ప్రతిష్టలు రాష్ట్రం నలువమూలలకు ్రాకినవి, వుద్రాసు బాలికల పాఠశాలలో వారు తమిళపండితులుగా పనిచేశారు. మురుగనార్‌ తీవ్రమైన గాంధేయవాది. ఖద్దరు వన్త్రములనే ధరించేవారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. ఆ రోజుల్లోనే స్వాతంత్ర్య సమరము అను దేశభక్తి గీతాల గ్రంథంరచించారు. అహీంసావాది యగుటవలన నోరులేని ప్రాణులగు గుజ్జము, ఎడ్లు కట్టబడిన బండ్లు ఎక్కేవారు కాదు. వారి సన్చీలత ఎందరినో ఆక గ్లించింది.

శ్రీరమణ భక్తులు దండపాణిస్వామి మురుగనార్‌కు మామగారు. వారు మహర్షి వ్రాసిన నేనెవడను, 'అరుణాచల స్తుతి పంచకము మురుగనార్‌కు ఇచ్చినారు, ఆ రెండు గ్రంథములు వారి జీవితమునే మార్చివేసినవి. మొదటిసారిగా దీ22-9-1923న మురుగనారు మహర్షిని సందర్శించినారు. మహర్షి చూపులతోనే వీరపై అనుగ్రహాన్ని వర్షించారు. మురుగునారు నేత్రాలనుండి కన్నీరు ధారగా ప్రవహించింది. ఆ తేజస్సును భరించలేక భయపడి వెళ్ళిపోయినారు. తరువాత మద్రాసు నుండి మహర్ది

రమణోపనిషత్‌

దర్శనానికి వచ్చిన ప్రతిసారి ఆయన సన్నిధిలో తన్మయత్వం పొందేవారు. ఆయన ఉక్కు పిడికిలి నుండి తప్పించుకోవడం సాధ్యముకాదని గ్రహించారు. తల్లి మరణానంతరం 1926 జూలై లో మద్రాసులోని ఉపాధ్యాయ పదవిని, కుటుంబాన్ని వదిలి అరుణాచలం (శ్రీరమణ సన్నిధికి వచ్చేశారు. భిక్షాటన చేసీ జీవిస్తేనే అహంకారం అణగి దేవిత్మభావం నశిస్తుందని భగవాన్‌ ఒక సందర్భంలో చెప్పడం విని, అప్పుటి నుండి పట్టణంలో భిక్షాటనం చేస్తూ జీవించిన విరాగి. పల్లాకొత్తులో ఉండేవారు. భగవాన్‌ను దర్శించినంతనే అవేతనులై నిలిచేవారు.

ఆయన గురుభక్తి సాటిలేనిది. ఆ గురుభక్తికి అక్షరరూపమిచ్చి తమిళంలో దాదాపు ముప్పది వేలకు పైగా పద్యాలు రవించిన భక్తశిరోమణి, భగవాన్‌ తమ భక్తులడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానముల సారాన్ని 1254 పద్యములుగా * గురువాచకకోవై (గురుబోధవచనమాల)ను వ్రాసి అవి సరిదిద్దమని మురుగనార్‌ భగవాన్‌కు చూపిర. భగవాన్‌ వాటిని సరిదిద్ది అవసరమైనచోట 28 పద్యములు తాను స్వయంగా వ్రాసి చేర్చటంతో మొత్తం 2282 పద్యములుగల (గ్రంథముగా తయారైనది.

మహర్షి విరచిత ఉపదేశసారము, ఉన్నది నలుబది, మురుగనార్‌ రచించిన గురువాచకకోవైలను ప్రస్థాన త్రయంగా చెప్పవచ్చును. (శ్రీరమణ సన్నిధివురై, (శ్రీరవుణ చరణాలు కలకాలము వర్టిల్లుగాక), (శ్రీరమణానుభూతి, అక్షరమణమాలకు వ్యాఖ్య - వీరి ఇతర రచనలు,

అట్లా వీరు 83 సం॥ములు జీవించిరి. ది 28-86-1973న విదేహముక్తులైరి. వారి భౌతికకాయం రమణాశ్రమంలో ఉత్తర దిక్కున సమాధి చేయబడినది. 1991లో శ్రీవుురుగనార్‌ శత జయంతి జరుపబడినది. ప్రతి సంవత్సరం వారి నిర్యాణ దినమున సమాధివద్ద పూజలు జరుగుచున్నవి.

నం ను. న! 1 . | (|. న్‌ స్ట ట్‌. 1... షే. | శ 11. /1 1... గ లీ 11 న. య శ న! 1 1111 న. 1 న త . న. ళం! ని ళా [[ ు ము . /1 స [లీ లల ॥ గ న |! న | 11 స్‌ 12 (1. . 1. య్‌ గా... లా శరత టా! గ్గ నం. ఇ ౧. .. ల" //. స్ప గన . న లా బ్‌ గళ టన. వ. స వ్‌ గ్‌ | క్‌. . సట మ. న న. 11 1 ల గ యా లమ న. న్‌ ల బస ఓ 1 శ తో ను సళ !1 శి తల్లో . ప స (గ య 11! ఓ. య. స . / న. ప గ్‌ ॥ క్‌ శ్ర స. స య. న్‌ . 1... [ ప | 1 ] | 0. టే న నాం హ్‌ సట అతి న! (|! న న. ల. స 12 | స. య. టో /ఖైత 111 వ. ల్‌ స గ న , . |. య (| ణ్‌ జ . | . . స చల్లి శ షష న స. న. సట? [. . 1 / 1 ౯? టు చం [ర టె /| ష్‌. | వ. వ. వ. 1 1. లీ ని! శే ఫిన్షోళ్టల సే మ 1 య. వ. | టో న్స్‌ న. న. .. ఏ ..? | | | . క్ట క్ట / (| వ లు స్‌ స్మ న. గ (గ. . . . 1 |. [ (1. వ గ న! జ్‌ . . | మ . (1... . | వ ్‌ 7 1 [| ళ్‌ గ స్ట టన (మ , . | టి శ్‌ టా (1 గ | ఎ కా శ్‌ / (/ న _ ॥| య. " స. (1! న శ్‌ టు వ. య. చ 1 (1 న శ!

రమణోపనిషత్‌

  1. అద్వైతస్థితి

త్రిపుటులను త్యజించినట్టి జ్ఞానుల హృదయంలో వెలిగే మహోదాత్త అద్వైతస్థితిని, ద్వంద్వాత్మకమై తలపుల వలయమైన మిథ్యాజగత్తును మాత్రమే చూడగలిగిన మనస్సు గ్రహింపజాలదు. శివుడంటే శుద్దవిద్రూపమే. అది తలపులకు అతీతం. తలపుల నుండి విడివడి, మనోనాశమొనర్చి, హృన్నిష్టులగు జ్ఞానధీరులు మాత్రమే దానిని ఎజుగగలరు. తలపుల ముడులలో చిక్కువడివున్న మనస్సుకు అది చిక్కదు. సచ్చిదానంద స్వరూప నిష్టులయి, పరమోన్నతాద్వైత శిఖరాన్ని చేరుకొనేందుకు శ్రద్దాళువులై సాధన చేసే ముముక్షువులే అక్కడికి ఆహ్వానింపబడతారు. అది వారికి 'సులభగమ్యం. ఈ మార్గం సూటి అయినది, సూక్మమయినది. దీనిని అనుసరించ లేని మందబుద్దులు సంశయాత్ములు '*' అద్వైతం వల్ల ఏం లాభం ?** అంటారు. అనాదిగా మనకు తెలిసిన విషయ ప్రపంచమూ, విషయ వాంఛారణ్యమూ వాగతీత శుద్దశాంత చిద్గగన సామ్రాజ్యమే. మరేమీ కాదు. తదన్యమని వెప్పే విషయజ్ఞానం స్వపష్నదర్శనతుల్యం. పారమార్టికమగు సచ్చిదానంద స్వరూపం ఏమిటో నాకిప్పుడు తేట తెల్లమైంది. నాకింకో విషయం కూడా అవగతమయింది. నేనెన్నడూ బద్దుడను కాలేదు. ముక్తుడనూ కాలేదు. అయితే ఆత్మనుండి వేరుపడినట్లుగా మాత్రం

2 రమణోపనిషత్‌ భ్రమించాను నేనోకసా8ి. ఇప్పటికి నేను కనుగొన్నాను. జనులు విశ్వసించే మతాలన్నీ, వారు ప్రకటించే సిద్దాంతాలు సమస్తమూ సద్వస్తు సాకాత్కారవునే ఏకైక లక్ష్యాన్ని సూచిస్తున్నాయి, నిస్సంశయంగా. సత్యములైన వేదములచే కొనియాడబడే. ఆ శుద్ద సచ్చిత్‌ స్వరూపంలో నిలిచియున్న జ్ఞానికి దేశకాలాలు దృర్చృశ్య దర్శనాలు మొదలయిన ఎట్టి తేడాలు గోచరించవు. పరమాచార్యుడైన శ్రీరమణ దేవుడు కరుణతో నా ఎదుట ప్రత్యక్షమై మౌనోపదేశం చేయగా ఆ మౌనానికి వ్యాఖ్యాన రూపంగా నాకీ సూక్ష్మ సూక్మతర తాత్త్విక రహస్యాలన్నీ స్ఫురించాయి. నా దృష్టిలో నేను ఉన్నాను. నీవు లేవు. నీ దృష్టిలో నీవే ఉన్నావు. నేను లేను. ఆత్మదృష్టిలో ఆత్మే ఉన్నది. అన్యము లేదు. నిజానికి నేను, నీవు, అందరూ ఆత్మకంటే భిన్నం కాదు. నేను ఎవరికీ లేను. నాకెవ్వరూ లేరు. నేను బానిసనూ కాదు, యజమానినీ కాదు. ఏ విధులూ నన్ను బంధింపవు. నేను కర్తనూ కాదు, భోక్తనూ కాదు. వూయావివోహితుడనై ఆర్తితో మొటిపెట్టాను నేను, బద్దుడనై నట్టుగా. అంతట ఆత్మ నా ఎట్ట ఎదుట గురు రూపముగా ప్రత్యక్షమైంది. నాకు మార్గదర్శనం. లభించింది. ఆ చిత్రకాశానికిి ఆ ఆత్మకు ఇవే శత శత నమోవాకాలు. చిద్వస్తువైన ఆ అరుణాచల రమణునికే నేను దాసుడను. ఎన్ని కష్టాలు రానీ ఎంతటి దుఃఖం కల్లనీ, నన్నీ జగన్మాయా శక్తి బంధింపజాలదు, సర్వోత్తమ ధర్మమైన విశుద్ధ ఆత్మతత్త్వంలో నెలకొన్న జ్ఞానికి కులమూ లేదు, కుటుంబ బాధ్యతలూ లేవు. అన్ని విధములయినవి విధులు, నియమాలూ

రమణోపనిషత్‌ వె ఈ క్షుద్ర మిథ్యా శరీరానికే. శుద్దాత్మకు కాదు. అన్నింటిలోను ఒకే సద్వస్తువును చూసేదే ఆత్మవైతన్యం. ఏకత్వానుభూతి అంటే అదే. అదే ధర్మం. అదే సత్యం. అదే సర్వసం[గ్రాహక జ్ఞానస్వరూపం. అంతటా ఏకాత్మతను దర్శించిన జ్ఞానులు కీర్తించింది దానినే . అత్మజ్ఞాన ప్రతిష్టితుడై అనంత శాంతి తరంగాలలో తేలియాడే జ్ఞానికి అహంతా ప్రతీతి ఉండదు. అట్టివాడు పొగడ్తలకు పొంగడు. తెగడ్తలకు క్రుంగడు. మిట్టమధ్యాహ్నపుటెండలో ఎండమావి తోచినట్టుగా ఈ మిథ్యా జగతులో ప్రారబ్బాన్ని బట్టి తరచూ కలివిలేవఎలు కలుగుతుంటాయి. జ్ఞానికి ఉన్ననాడు సంతోషమూ లేదు, లేనివాడు దుఃఖమూ లేదు. జ్ఞానులు దేనినీ కాంక్షించరు. దేనికోసమూ ప్రార్ధించరు. లోకంలో వారుండటమే సహజ తపస్సు. వారివల్ల జనులకు యోగక్షేమములు సమకూరుతాయి. సకల కామ్యములు నెరవేరతాయి. 2. అత్మజ్ఞానవే అపరోత్ష జ్ఞానం ఆత్మ ఒకటే నిజమైన కన్ను. ఆత్మను గురించి మాత్రమే ఎవరికన్నా అపరోక్షజ్ఞానం సాధ్యం. ఆత్మనుండి వైదొలగిన మనస్సు ఇంద్రియముల ద్వారా ఆత్మ భిన్నమయిన లోకాన్ని చూసి, దాన్ని అపరోక్షంగా గ్రహించగలనని భ్రమిస్తుంది. ఆత్మ అనంతమయిన చక్షువు, జ్ఞానచక్షువు. దివ్య శుద్ధ వైతన్యజ్వాల. అన్యములనన్నింటినీ అది దర్ధమొనర్చి వానిని దేదీష్యమానమైన తన జ్యోతిస్సులో ఇముడ్చుకుంటుంది. అనంతమయిన ఆ నేశత్రమే

శ రమణోవనిషత్‌ శుద్ధజ్ఞానం. అది ర0డవ వస్తువును చూడదు. ద్వంద్వములను ఎరుగదు. మంచి చెడులు, ద్రష్ర్రదృశ్యములు, దేశకాలములు, బీజఫలములు-- వీని కది ఆతీతం.

మిధథ్యాస్వరూపవంంయిన అహంకార నిర్మూలనవేఎ అంతరాన్వేషణకు ఏకైక ఫలం. అది పూర్ణం. “ఒకడు ఆత్మను పొందాడు'* అని చెప్పటం తప్పు. ఆత్మ ఎప్పుడూ ఉన్నదే, నిరంతరమూ స్పష్టమై. గదిలో ఖాళీ ఏర్పడాలంటే గది నిండా ఉన్న వస్తువులను బయట వేస్తాం. కొత్తగా గదిలో ఖాళీని తెచ్చి పెడతామా? దశముడి కథలోని దశముడు ఎప్పుడూ వుండనే ఉన్నాడు. అలాగే ఆత్మ శుద్ధజ్ఞాన స్వరూవంగా, నిత్య ప్రత్యక్షంగా, స్వయం వ్యక్తమై వెలుగుతూనే ఉంది. మిథ్యాజ్ఞానం అనగా అజ్ఞానం, అంటే మరపు తొలగింపబడినవ్చుడు మనం ఏదో నూతన వస్తువును పొందము. ఉన్న దానిని గురించిన నిశ్చయజ్ఞానాన్ని పొందుతాము. బంగారు ఆభరణాలన్నింటినీ కరిగించి ముద్దగా చేస్తేనేగాని అవి బంగారం కావా? ఆభరణాల రూపంలో ఉన్నప్పుడు కూడా అవి బంగారమే. జగళ్తు, జీవుడు, ఈశ్వరుడు- ఈ మూడు తత్తాలూ ఒకే సవ్చైతన్యంతో చేయబడినట్టివే. ఒక స్తీ తన మెడలోనే వ్రేలాడుతున్న హారం ఎక్కడో పోయిందని భ్రమించి అంతటా వెతకి వెతకి చివరకు తన మెడను తాకగానే కనిపించి ఆ హారాన్ని కనుగొన్నాననుకుంటుంది. అదే విధంగా ఆత్మ ఇక్కడే, లోన ఉంది. దానికై వెతకాలి, కనుగొనాలి.

హృదయంలో శాశ్వతానందమనే తరగని గని ఉంది. ఎంత దృఢ ప్రయత్నం చేసినా, కర్మల ద్వారానో మరే ఇతర మార్గముల

రమణోపనిషత్‌ వ్‌

ద్వారానో దాన్ని చేరుకోవటం సాధ్యం కాదు. అరూపమయిన నేను తలపును వెతకుట ఒకటే మార్గం. అదే ఆత్మ విచారం. తీవ్ర తపస్సాధన ద్వారా ఎప్పుడో పొందాలనుకునే ఆ అద్వయానందస్రితి, ఆ సమాధి స్థితి సత్యమైనదే అయితే అప్పుడెలా ఉంటుందో ఇప్పుడూ అలాగే ఉండనే ఉంది. ఇప్పుడది లేనిదనీీ తదుపరి లభిస్తుందనీ అంటే అది మన స్వస్థితి కాదన్నమాటే. శాశ్వతంగా ఉండనిదే అయితే అది వచ్చేది పోయేది అని చెప్పినట్టవుతుంది.

అది పూర్ణం. ఇదీ పూర్ణమే. పూర్చాన్ని పూర్చానికి కలిపితే పూర్ణమే. పూర్ణంలో నుండి పూర్చాన్ని తీసివేస్తే పూర్ణమే. అదే పరమాత్మ. నీవు సైతం పరమాత్మవే ““తత్త్వమసి"” అనే మహావాక్యం పరమాత్మయే. ఆ అఖండ సచ్చిదానంద ఘనమునకు భిన్నంగా వచ్చేది పోయేది క్రొత్తగా ఏమీ లేదు. అహంతానాశమే మ్యుక్తి. ఆత్మ ఎన్నటికీ ముక్తమే.

అన్నింటికీ ఆధారం ఆ పరిపూర్ణ అద్వైతాత్మయే. వ్యావహారిక జగత్తులో అది, ఇదీ అన్నీ సత్యమైనవి కానే కావు. అవి అన్నీ ఆత్మలో గోచరవుయ్యే మిథ్యాదృశ్యాలు. ఆత్మయే ఏకైకం. పరవుసత్యం. అనేకంగా కనిపించే ఆ వస్తువు ఏకవేం అని బుషులబోధ. సృష్ట్యాది నుండి జీవులందరూ ఆ పరమాత్మ స్వరూపాలే. ముక్తి అంటే ఆ సవ్చైతన్యముతో ఐక్యం చెందటమే.

ఆత్మయొక్క అద్ర్వైతస్వరూపాన్ని సాక్షాత్భ రంపజేసుకొనేందుకు ప్రయత్నించే సాధకుడు ఎన్నో తప్పటడుగులు వేస్తాడు. అతని ప్రయత్నాలు విసలమవుతాయి మాటిమాటికీ. చిట్టచివరకు ప్రయత్నాలన్నీ ఆగిపోతాయి. అప్పుడే, అప్పుడే అతని హృదయంలో జ్ఞానస్వరూపంగా ఆత్మ ప్రకాశిస్తుంది.

6 రమణోపనిషత్‌ 3. కేవల నిర్వికల్ప సమాధి వునోలయం, సహజ నిర్వికల్ప సమాధి వునోనాశం ఈ కనిపించే సృష్టి వైచిత్రిని చూడకపోవటం నిజమయిన నిర్వికల్ప సమాధికి గుర్తు కానేరదు. మనస్సు నశొస్తే భేదభావం ఇక ఎన్నటికీ తలెత్తదు. అదే నిశ్చలస్టితి, నిజమయిన నిర్వికల్పం. . కేవల నిర్వికల్ప సవూధి కాష్టసదృళవము, జడ్టితి, తాత్కాలికమైనట్టిది. అది లయం మాత్రమే. నీటిలో మునిగిన పాత్ర మరల పైకి రావచ్చును. కాని సహజ నిర్వికల్ప సమాధి అంటే శాశ్వతముగా వైతన్యంలో విలీనం కావటం, ఉప్పుబొమ్మ కడలి నీటిలో మునిగి కరిగిపోయి తన రూపాన్ని కోల్పోయినట్లు. మనోనాశం అంటే అదే. నేనున్నాను అనేది “శుద్దసత్‌*. ఈ సహజావస్టలో ప్టేరంగా నెలకొని ఉండటమే నిజమైన సమాధి. “నేనిది అనో, *నేనది అనో లేక “ఇంకొకటి” అనో పరిమిత దృష్టి వీడి అనంతాఖండ చిద్దనముగా నిల్సి ఉండు. వమన ప్రావీన బుషులు జ్ఞానం యొక్క పరవు లక్ష్యం మౌసమాధి అని చెప్పారు. అది కేవలం నిరహం స్థితి. ఆ మౌన శాంతస్థితిని పొందేదాకా అఆహంతానాశమొక్కటే నీ సాధ్యమూ సాధనము కావాలి. అహంత పొంగుతుంది, క్రుంగుతుంది. సత్యాత్మ అలా కాక ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది. మిథ్యాహంకృతినుండి వెనుదిరిగి ఆ విధంగా దాన్ని నిర్మూలించు. కేవలాత్మగా వెలుగొందు. . అయ్యో, ఇదేమిటి, ఓ నా హృదయమా! నీవు జీవుడవని తలచి నిస్సవాయస్టితిని అనుభవిస్తున్నావు. నీవలా అనుకున్నంత

రమణోపనిషత్‌ 7 కాలము నీకు దుఃఖం తప్పుదు. సచ్చిదానంద స్టితిలో ఈ నేను లేదు. అత్మ ఒకటే ఉంది. ఆదే హృదయం. నిశ్చలము, నిరీహము అయిన వునస్సు అఖండ శుద్దసత్‌ యెక్క అనుభూతిని పొందితే అదే సమాధి. ఆ స్థితిలో మనస్సు పరమాత్మగా మిగులుతుంది. చిత్తము చిత్త్వమవుతుంది. భగవత్తత్త్వమవుతుంది. మనస్సు ఒక అల. అల సముద్రములోని ఒక కదలిక. అల నిశ్చలమైతే అది జలమే. మనస్సు నిశ్చలమైతే అది ఆత్మే,

సర్వ విజ్ఞానానికి ఆధారము అధిష్థానము అయిన శుద్దవిత్‌ను చేరి ఆ స్టితిలో ఉండటమెలాగో చెబుతాను విను. ఇంద్రియ విషయములనుండి మనస్సును వెనుకకు మరల్చు,. తనను తాను వెతుకుకొనేందుకు లోనికి త్రిప్పు. అది సరాసరి నిన్ను లోనికి లక్ష్యానికి చేరుస్తుంది. శివస్టితి అంటే అఖండ నిశ్చలజ్ఞానమే. చూచేవాణ్ణి చూచేందుకు ద్రష్టవేరే ఎవడూ లేడు. శుద్ధవిత్‌ సత్‌ మాత్రమే. అదే శివుని శుద్దస్వరూపం. ఆనందమే స్వరూపం. అది అఖండ మౌన సామ్రాజ్యం, జ్ఞాన గమ్యం. ఇది బుషుల వాక్కు. సకలానికి ఆధారమైన దివ్యజ్యోతి ఒకటి ఉన్నది. అందులో “ఇక్కడి, “అక్కడి అనేవన్నీ లయమై అంతటా ఒకే వైతన్యం వ్యాప్తమై ఉంటుంది. దేహాత్మ భావనను అధిగమిస్తే సృష్టి అంతటిలో “సత్‌ గా “చిత్‌ గా ఆత్మ నిండి ఉంటుంది.

“నేనున్నాను అనేది సర్వాధిష్టాన తత్త్వం. దాని స్వరూపం వౌనం. అది నేనా, ఇది నేనా అని తర్కిస్తూ ఎందుకు కష్టపడటం? ధ్యానమంటే నిశ్చలత్వమే, నేను నశించటమే. నేను పోతే తలపులకు నెలవు ఏది? '“అహం (బ్రవ్మాస్మ

8 రమణోపనిషణ్‌ “సోలి హం,” 'శినో£.హం,” ఇవన్నీ ఆత్మవిచారణ కాదు. 'నే నెవిడనో అన్వేపీస్తే “నేను నశిస్తుంది, అదే అసలయిన ఆత్మ విచారణ,

మీరంతా తెలివిగలవారు గొప్పవారు, ఇది చెప్పండి దయచేసి, గతిశీలమయిన ఈ జగత్తు సత్యమయి నదా? పొంగుతూ క్రుంగుతూ ఉండే సృష్టిలోని మార్పులు నిజంగా సత్చదార్హలో వున్నాయా? లేక వచ్చి పోయే మిథ్యా దృశ్యాలు మాత్రమేనా అవి? మీ నిశ్చితాభిప్రాయం ఏమిటి? మీ తుది నిర్ణయం ఏమిటో తెలపండి:

ఈ మాయా శరీరం యొక్క పుట్టుట గిట్టటల పై ఈ జగత్తుయొక్క చావు పుట్టుకలు ఆధారపడి ఉన్నాయి. అవి శుద్ద జ్ఞాన స్వరూపం అయిన ఆత్మలో జరిగే మార్పులు అని తలంచుట అజ్ఞానం. ఆకాశంలో వస్తూ పోతూ ఉండే వేఘవూలికల కదలికలను ఆకాశానికి అంటగట్టగలమా? ఆత్మయే అసలు “నేను శుద్దజ్ఞానం. నిరంతరం మార్చు చెందుతున్న ఈ జగత్తును ఆత్మ చూడనే చూడదు. అట్టి ఆత్మలో మార్చులుంచాయని భావిస్తే అది అజ్ఞానవుఎ. నిరంతర పరిణావూల కారణంగా కష్టాలు ఎదురవుతున్నాయి. అవి ఆత్మకు ఏ వూత్రవూ అంటవు. పృథివ్యాపస్తేజోవాయు తత్వాలలో ఏర్పడే మార్పులూ, దోషాలు ఆకాశాన్ని ఏ మాత్రమూ అంటవు. ఆకాశం అన్నింటిలో వ్యాపించి ఉంది, అన్నింటినీ అధిగమించి వుంది. ఒకే (స్త్రీని ఒకరు తల్లిగా, మరోకరు భార్యగా, ఇంకొకరు చెల్లెలుగా మరొకరు కోడలిగా భావిస్తారు. అంతమాత్రాన ఆమె స్వరూపంలో కించిత్తయినా మార్చు ఉంటుందా? జీవజగదీశ్వరులు వివిధ నామరూపములు,

రమణోపనిషల్‌ 9 అవి వచ్చి పోయేవి. ఆత్మ ఒక్కటే, అది మార్చు లేనిది, అనేకంగా కనిపించినప్పటికీ, 4.అన్నింటకీ ఆధారంగా సాక్షీభూతంగా ఉండటవేం జ్ఞాని లక్షణం,

వుముక్షువులు అలవరచుకోవలసీిన అనేక గుణాలలో ఏకాంతవాసాభిలాషను మించింది మరొకటి లేదు, వాసనల నుండి విముక్తి పొందటమే ఏకాంతవాసం,. వాసనల నుండి, తలపుల నుండి, అనగా గతస్పృతుల నుండి భవిష్యదాకాంక్షలనుండి విడివడాలనే తహతహ ముముక్షువైన వానికవసరం,

ఓ హృదయమా! నీ సన్నిధిలో ఒక అమోఘశక్తి వుంది. నీ సమక్షంలో తత్త్వములన్నీ పరస్పరాకర్షణకు లోనై క్రీడిస్తున్నాయి. నీవు వీనికి అతీతంగా సాక్షివలె నిల్చుని వుండి ఈ జగన్నాటకాన్ని వీక్షిస్తున్నావు. స్వస్రితుడవై అచలుడవై ఉన్నావు. దేన్ని అయినా 'సరే అతి- పెద్దదిగానీ చిన్నదిగానీ పొందవచ్చు లేదా పోగొట్టుకోవచ్చు. అన్నింటికీ ఆధారంగా సాక్షీభూతంగా ఉండటమే జ్ఞానవంతుని లక్షణం. గాలిలో ఇటూ అటూ కొట్టుమిట్టాడుతున్న గడ్డిపరక మాదిరిగ వుండటం జ్ఞానం అనిపించుకోదు. ఆత్మ ఒక సినిమా తెరలాంటిది. తెరమీద బొమ్మలు ఆడుతుంటాయి. తెర వాటికి ఆధారంగా ఉంటుంది. బొమ్మలలో కనిపించే వరదలు, మంటలు తెరను స్పృశించ లేవు. లోపలా బయటా అంతటా అన్నింటిలో ఆకాశం వ్యాపించి వుంది. దాన్ని ఏదీ స్పృశించలేదు. ఏదీ బంధించలేదు. తనను తాను పారమార్థికమయిన శుద్దాత్మగా

10 రమణోపనిషత్‌ తెలుసుకో లేనివాడు జగత్తులోని మిథ్యాబంధనాలలో చిక్కుకోక తప్పదు. ఆత్మజ్ఞానళూన్యుడు ప్రపంచంలో అనాసక్తుడై జీవించటం అసంభవం. పాతవాసనలే నిజమయిన బంధహేతువులు. వానిని నశింపజేయాలి. సమస్త వాసనలకు నిలయమైన మనస్సును నిక్హించిన మహాత్ములు ఆయా వర్ణాశ్రమాలకు తగిన పవిత్ర జీవనాన్ని గడపవచ్చు. చంచలంగా ఊగిసలాడే మనస్సులకు ఎల్లప్పుడూ వైఫల్యాలూ నిరాశానిస్పృహలే ఎదురౌతుంటాయి. వాయువేగాన్ని మించిన వేగంతో పరుగెడుతుంటుంది అశాంతమయిన మనస్సు. దాన్ని ఎండగట్టాలి. అప్పుడది కుంటిదై కదలక ఒకచోట పడి ఉంటుంది. అమరత్వాన్ని పొందటవుంటే అదే. బు*ల మనస్సు కుంటిదిగా ఉంటుంది. అది చూస్తుంది, కానీ కదలదు. తాను నిశ్చలంగా సాక్షిగా జనన మరణాది వివిధ సంఘటనలను చూస్తూ ఉండటమంటే అమరత్వాన్ని రుచి చూడటమే. దేశకాల వస్తువులతో కాక ఆత్మతో తాదాత్మ్యం పొందితే ఇది సాధ్యవువుతుంది. కామక్రోధలోభాది కలుపు మొక్కలు పెరిగి పెద్దవికాక ముందే పీక్రి పారవెయ్యాలి. గాలికి పైకి లేచే చిరు కెరగాల పొంగుకు చలింపనట్టి అపార ఆగాధ ప్రశాంత సాగరంలా గంభీరంగా స్వయం సమృద్ధంగా మనస్సును ఉంచుకోవాలి. ఇదే నిజమయిన వివేకం. సకల దుఃఖాలకూ ఆలయమైన పంచేంద్రైయాల లోనికి దూకకుండా మనస్సుని అరికట్టాలి. మహోత్తాల తరంగాలతో 'ఘోాషిస్తున్న సముద్రం శాంతించి నిస్తరంగమ్రైనట్టు వునస్సు అణగాలి. స్థిరంగా నిలవాలి. ఇదే నిజమయిన వివేకం. దట్టంగా

రమణోపనిషత్‌ [1 వేఘూలు అలముకొని ఉన్న ఆకాశంలో చండకిరణుడయిన సూర్యుడు కన్నులకు గోచరం కాడు. తలపుల మేఘ మాలికలు చుట్టుముట్టి మనస్సు చీకటిమయం అయినప్పుడు తన ఆత్మ.తనకు క న్పించదు. తలపులను నిర్జించినవాడే జ్ఞానగజారోహణ చేసి చక్రవర్తిలాగా కూర్చుని ఉంచాడు. ఒకటి నిశ్చయంగా తెలుసుకో. అన్ని దుఃఖాలకు అన్ని కష్టాలకు కారణం మనస్సులోని కదలికలే. వునళ్ళలనవేం లేని శాంతము స్పష్టము అయిన ఎజుకయే దృఢసమాధి. అదే మోక్షస్టితి. శ్రద్ధగా ప్రయత్నించి నిన్ను వంచించే ఆ దుష్ట తలపులనుండి నీ మనస్సును విముక్తం చేయి. హృదయ నైర్మల్యాన్ని శుద్ధ జ్ఞానస్టితిని అనుభవించు. ఆత్మ దృష్టిపడితే గానీ అహంత నశించదు. మనస్సు నశించనిదే దుఃఖావిలమయిన స్వప్నము వంటి వ్యావహారిక జగత్తు మాయం కాదు. మనస్సును ఎవరూ ఎదిరించి జయింపజాలదు. అసత్యమయినదనీ, మిథ్యా వస్తువు అనీ దాన్ని తృణీకరించు. ఆత్మ ఒక్కటే అధిష్టానమని (గ్రహించు. దానిలోనే సుస్టరుడవై నెలకొని ఉండు. వునో వైకల్యాలన్నీ క్రమంగా సద్దుమణుగుతాయి. వాలికి ఎదుటివారి శక్తి సగం వచ్చేది. అందుకే వాలికెదురుగా నిలవకుండా రాముడు చంపవలసి వచ్చింది. మనస్సును" నీవు” అని మధ్యమ పురుషగా భావించకూడదు. దాన్ని నిర్లక్ష్యం చెయ్యాలి. ఉత్తమపురుష అయిన ఆత్మ పైనే దృష్టిని నిలపాలి. మనస్సును ఎలా స్టిరమొనర్పాలో, ఎలా నిర్మూలించాలో తెలియక నీవు ప్రయత్నిస్తున్నావు, విఫలమవుతున్నావు. నిస్పృహకు లోనవుతున్నావు. స్వర్ణాభరణము వలె మరు మరీచికవలె, స్వష్డు

12 రమణోపనిషత్‌ దృశ్యము వలె చూచేవస్తువులు సమస్తమూ ఆత్మలో నివే. ఆత్మకు అవి భిన్నములని భావించటం అవివేకం. 5. అద్వయమైను ఆత్మానా భూతి వూత్రవే సర్వజ్ఞత్వం

“నేను దేవోన్ని అనేది ఒక తలపు మాత్రమే. దీనితో మొదలై సాగిన తలపుల ప్రవాహపు తెరవెనుక అత్మ దాగి ఉంది, తలపుల చలనమాగి మనస్సు స్టిరమై పని చేయటం మానివేస్తే అప్పుడు అది చిదానంద మందిరంగా మిగులుతుంది.

శుద్ద శివఫ్టితి అంటే ఏమిటి? ఏకము నిత్యము సత్యము అయిః స్వస్థితి, అది అఖండ బ్రహ్మానందం, అందులో మిథ్యా ద్వైతానికి తావులేదు. ఇప్పుడు అప్పుడు, ఇక్కడ, అక్కడ ఉన్నది, లేదు - అనేవి ఉండని స్టీతి అది. ఆత్మ వినా అన్యమైన సద్వస్తువు ఏముంది? సర్వజ్ఞత్వం శుద్ధజ్ఞానమే. అది అఖండత్వము, పూర్ణత్వము. అది భూతభవిష్యద్వర్హమాన కాలాలలోని సంభవాలను గురించిన జ్ఞానం కాదు, జాగ్రత్‌ జ్ఞానం అహంతా జన్యమైనట్టిది. ఆ అహంత మూలాజ్ఞాన జన్యం. సర్వజ్ఞత్వం అంటే అన్నీ తానుగా వుండటం. ఆత్మకంటె అన్యమెజటుగకుండటం. మనస్సు పూర్తిగా అణగనివానిది మిథ్యాజ్ఞానమే, దానివల్ల దుఃఖభారం పెరుగుతుంది. దాన్ని 'పెంచుకుంటూపోతే మాయా తిమిరం ఇంకా దట్టమౌతుంది. దాని వల్ల జీవితానికి ఏ లాభమూ లేదు. ఆత్మగా ఉండటం అన్నింటినీ ఆత్మగా చూడటం - ఇదే సర్వజ్ఞత్వం, విషయాలను గురించి ఇంకొ ఇంకా తెలుసుకోవటం కాదు. ఆత్మ ఒక్కటే ఉన్నది.

రమణోపనిషత్‌ 13 లేనిదున్నట్లుగా తోచేది జగత్తు, దీనిని తాను చూస్తున్నానని భావిస్తాడు వమునిషీ అట్టి వారికి అపారవుయిన విజ్ఞునవేం సర్వజ్ఞత్వంగా తోస్తుంది. మాయనథిగమించిన జ్ఞానికి ఇలాంటి విజ్ఞానమంతా మిథ్యా సదృశమే, తాను “జ్ఞాత” నని భావించే వాని॥ తనకున్న జ్ఞానం బహు పరిమితం అనే దిగులు ఉంటుంది. కాని అత్మ జ్ఞానపు వెలుగులో సర్వవిజ్ఞానమూ అల్పజ్ఞానమే. నశించి పోయేదే. తనకేదో కొంత తెలిసిందని మురిసిపోయేవా 6 కోసమై “ఆ జగత్రభువు సర్వజ్ఞుడు” అని వేదాలు క్షీర్తిస్తున్నాయి. కాని మనం సత్యం ఇదని గ్రహిస్తే అనంతం అఖండం స్వద్దనం అయిన ఆ ప్రభువు ఏమీ '“'ఎలుగడు'. ముక్తపురుషుడు కూడా తక్కినవారికి వలెనే ఈ జగత్తునూ ఇందులోని వైచి త్రినీ చూస్తుంచాడనీ, అయితే అందులో ఏకత్వాన్ని దర్శిస్తాడనీ అంటారు. కాని ఇది సరికాదు, మిథ్యాదృష్టికారణంగా సృష్టిలో ని వైవిధ్యాన్ని చూసేవారికి ముక్తుడు కూడా తమలాగానే ద్రష్రఅనితోస్తుంది. కాని జ్ఞాని ద్రష్టకాదు, ముక్తునికి వ్యక్తి త్వవున్నదని భావించటం అజ్ఞానం వల్లనే, శుద్ధమయిన చిదాకాశంలో ముక్తులు వేరుగా కనిపించరు. బద్దులకు మాత్రమే వారువేరుగా తోస్తారు. జ్ఞాని సచ్చిదానందస్వరూపుడు. జగత్తును చూసే దేహధారి కాదు. చూసే వాడినిచూసే మనస్సు కూడా కాదు. ఎదుట కనిపించే విషయాలను గురించిన జ్ఞానమే జ్ఞానవుని భావించటం కారణంగానే నాకు తెలీసిందింతే అని అనుకోవటం జరుగుతుంది. లోనికి దృష్టిబరపి ఆత్మక్రై అన్వేషిస్తే ఈ పరిమిత జ్ఞానాన్ని అధిగవించిన సంపూర్మ జ్ఞానం మిగులుతుంది.

14 రమణోపనిషత్‌

ఒక్కటిగా ఉన్న ఆత్మ, భ్రాంతి కారణంగా అనేకంగా భాసిస్తోంది. విశాలమై వైవిధ్యంతో కూడిన జగత్తుగా గోచరిస్తోంది. అద్వయమయిన ఆత్మానుభూతి మాత్రమే సర్వజ్ఞత్వం. మరొకటి కాదు. స్వప్నంలో చూసే వస్తువులు మనఃకల్పనలు మాత్రమే. జా[గ్రత్తులో ఉంటూనే ఆత్మానుభూతిని పొందితే అన్నింటిలోనూ ఆత్మయొక్క ఏకత్వమే కన్పిస్తుంది. ఇదే సర్వజ్ఞత్వం.

వె౮ంసపూరితమైన ఇంద్రియ సుఖాలను వర్దించాలి. బాహిరమయిన విజ్ఞానాపేక్షకు స్వస్తి చెప్పాలి. శివుడికీ జీవుడికీ నడుమ బేధాన్ని రూపుమూపాలి. అప్పుడు శివజ్ఞానం యొక్క చిదానంద స్వరూపం ఏమిటో తెలుస్తుంది.

అహంత నశించిన జ్ఞానిని జాగ్రత్‌ స్వప్న సుషుషృడవష్టలు అంటవు. జ్ఞానిది తురీయ స్టేతి. అది సత్‌ చిత్‌ స్థితి. సర్వాతీతము ఆద్వయువఎ అయిన తురీయు సతి వలవాడవ'స్టలూ తాత్కాలికములు. మిథ్యామాత్రములు. వాని కధిష్టానంగా ఆత్మ ఉంది. ఒక వేళ అవస్థాత్రయం సత్యమైనదే అయితే అప్పుడు శుద్ద వైతన్యమయిన జాగ్రత్‌ సుషుప్తి '“చతుర్ధం”” అవుతుంది ఆ మూడవస్థలూ తురీయంలో తోస్తున్నాయి కాబట్టి. ఆ చతుర్జావస్టకు కూడా అతీతమై తురీయాతీతం ఉంది. శుద్ధజ్ఞానముయిన ఆ తురీయస్టితిని వెలకువ నెజుగని వుహాసుషుప్తి అనిగానీ ఆస్టిరవుయిన నిద్రాస్పర్శ నెజుగని నిత్య జాగ్రత్‌ అని గ్గానీ పిలవవచ్చును. లుకు.

య్యుక్రంథాలయ మ్మో | ( వున రాజులని. ,ై హై మ

రమణోపనిషత్‌ 15

  1. [గ్రంథి విచ్చేదం

వునో వృత్తులే నావురూపాలకు కారణం. బ్రహ్మము శుద్ధసత్తు. అది భావాతీతము. వృత్తిరహితము. పూర్ణమౌనము, అట్టి జ్ఞానమును బ్రహ్మాకారవృత్తి అనకూడదు. బ్రహ్మములో వృత్తి ఎలా ఉంటుంది? సముద్రంలో కలసి తన అస్తిత్వాన్ని కోలోోయిన నదిని సముద్రాకార నది అని ఎలా అంచాము?

సర్వత్ర సమదృష్టి కలిగి ఉండి దుఃఖములయందు నిస్తరంగ నిర్మల సరస్సువలె అనుద్విగ్నుడై సుఖములయందు విగతస్పుహుడై ఉన్నట్లయితే గ్రం థివిచ్చేదమయినట్లు గుర్తు. ఇది జరిగిందని గానీ, ఇది జరగబోతోందని గానీ చింతలేకుండా, కండ్లెదుట జరిగేదానికి సాక్షిమాత్రుడిగా తన్మయానందునిగా ఉన్నట్లయితే గ్రంథి విచ్చేః మయినట్లు గుర్తు. ఏ తలపులు తలెత్తనీ ఏమయింది? ఆత్మ లేనిదే దేనికీ మనికి లేదుకదా! ఇట్టి నిశ్చయజ్ఞానం కలిగిన వివేకికి సర్వాత్మమనే స్వసష్టితి జారిపోతుందనే భయం ఉండదు.

విషయానుభవాలు ఎట్టివైనా ఎవరైనా ఎక్కడైనా ఏమిటి నిజానికి? ఆత్మానుభవం యొక్క ఆంశిక రూపాలే అన్నీను. ఆత్మ సాక్షాత్కారం అయినప్పుడు మనస్సు ఇక తలెత్తలేక కొట్టుకొనిపోయి హృదయంలో విలీనమవుతుంది. అలా ఆత్మ అంటే శుద్రజ్ఞానమే. ఇది తలపులను దాటినట్టిది. దాన్ని “దుఃఖ” వ్యతిరిక్రమయిన ''సుఖంి* అని పిలవటం కూడా తప్పు అవుతుంది. తప్పు దారి బట్టినట్టు అవుతుంది. సుఖాతీతము సైతవుయిన సద్వస్తువు ఆత్మ. విచారణద్వారా ఆత్మను తెలుసుకొని అనుభవించినప్పుడు ఎవరికోసం ఏ సుఖం కోసం సద్గురువు కోరికతో వ్యాకులత చెందాలి?

16 రమణోపనిషత్‌ కర్సత్వాభిమానాంధకారాన్ని నిర్మూలించిన జ్ఞానిని ఏ శా(న్త్రవిధులూ బంధించ నేరవు, అయినా జ్ఞానులు విద్యుక్తకర్మలు కొన్నింటిని నిర్వర్తించటం కద్దు. వైదిక ధర్మ సంరక్షణకై మాత్రమే వారలా చేస్తారు. అహంత నశించిన జ్ఞానులు ఆనందాతీతులు. వారికీ ఇక సాధించవలసిందేమీ లేదు, వారు చేయవలసిన ప్రయత్నాలు లేవు, కార్యాలు లేవు, జీవితంలో వారు కృతకృత్యులు, స్వస్టితి అనేది స్వతః సిద్దము సత్యము శివము. దానియందు నెలకొనియున్న వానికి చేయవలసిన కర్మలేదు, అతడు సర్వకర్మలు చేసినవాడు, కృతకృత్యుడు. అట్టివాడు పరిపూర్ణ శాంత్యానందాలను అనుభవిస్తాడు. అత్మానుభవం యొక్క పూర్ణత్వం లభించిన పరమాచార్యుడు ఆత్మకంటే అన్యవెజుగడు, ద్వైత జగత్తుకతీతమ్రైన ఆ బ్రహ్మానందావుతాన్ని ఇదమిచ్చం అని వునస్సు ఎలా గగ్రహించగలుగుతుంది? అది ఖండితము, భ్రమితము కదా |! హృదయం సత్బదార్ధమే, ప్రతీజీవిలోనూ వెలుగుతున్న ఆ హృదయం నిర్మలానందసాగరం. అందువల్ల దఃఖం అనేది ఎక్కడ ఉంది? అది ఆకొశంలో నీలంరంగు వంటిది.! కేవలం మనస్సులోని (భ్రాంతి, సత్యవు కాదు. ఆనందవేం నిత్యసత్యవు, దుఃఖమనఃకల్పన, మిథ్య, మన సత్‌ స్వరూపం మాయాంధకారాన్ని చూడని సహస్రకిరణము. ఆ సద్వస్తువు దుఃఖస్పర్శ ఎరుగనట్టిది. మోహభ్రాంతితో '“నేను ఆత్మను కాను” నేను దేహాన్ని!” అని భావించటం వల్లనే దుఃఖాన్ని కొనితెచ్చుకుంటున్నాం మనం. మన స్వస్వరూపం ఆత్మయే. అది ఆనందమయము, మంగళకరము,. ఇది తెలుసుకున్న వారికి జీవితంలో ఏ దుఃఖాలు ఏ బాధలూ

రమణోపనిషత్‌ 17 కనిపించవు. తన్ను తాను ఏకాత్మ స్వరూపంగా చూడకపోవటం వల్లనే మనిషి భయోద్వేగాలకు లోనై దుఃభిస్తున్నాడు. దేహాత్మ భావనను నిర్మూలించు. దృఢవుయిన ఆత్మజ్ఞాన నిష్టతో సత్యాద్వైతఫ్టితుడవు కా,

నీ గమ్యం సత్యం, అది ఆత్మజ్ఞానవే. ఆ గమ్యాన్ని చేరుకోవడవుంటే సకల బాధాకారణవుయిన (ఖబ్రాంతిని నశింపజేయటమే. 7. నిరంతరాత్మ విచారణ వల్ల జాగ్రత్తులో సుషుప్తి లభిస్తుంది.

సుషుప్తి స్వప్నా వస్టలోకికూడా వ్యాపించలేదని ఎందుకు అంత కలవరం, అంత నిరాశ? జూగ్రద్దశలో సుషుప్తి యొక్క అద్వయానందాన్ని పొందితే అది స్వప్నంలోకి కూడా ప్రవేశిస్తుంది. స్వప్నంలో దేహస్స్ఫురణను తొలగించుకొనేందుకు ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన పని లేదు. అద్వైతానంద ప్రాప్తి పర్యంతం జా గ్రద్దశలో ఆత్మవిచారణను వదలకుండా చెయ్యాలి. ఆ ఆనందం స్వష్నంలోకి కూడా చొారబడాలి, వ్యాపించాలి, విచారణ అప్పటిదాకా చేస్తూనే ఉండాలి. నిరంతరాత్మ విచారణ వల్ల జాగ్రత్తులో సుషుప్తి సిద్దిస్తుంది. ఈ సుషుస్త్యానందం జాగ్రత్‌ స్వప్నవయమలయుందు సమానంగా సీద్ధించేందుకే విచారణ కొనసాగింపు.

ఈ సంసారమనే మాయాజాలంలో నీవు చిక్కుకొని ఉన్నావు, దుఃఖదిగ్రబాణ హతుడవై బాధతో అలవుటిస్తున్నావు, మోక్ష

18 రమణోపనిషత్‌

తత్పరుడవై ఉన్నావు. అకయానందమంటే ఏమిటో తెలుసుకో! పూర్ణజ్ఞానముతో కూడిన సుషుప్తి అది. మిథ్యామాత్రములయిన ఇం[ద్రియవటలకు కట్టుబడక హృదయు కవులవుఎన ందే సు(ప్రతిసష్టితుడము కా. జాగ్రత్‌ సుషుప్తి లభిస్తుంది. చిదానందానుభూతి సంప్రాప్తిస్తుంది. అదే మోక్షం. అన్యులు మిథ్యా జగత్తుయొక్క గాఢ తమ మనస్సులో నిద్రావశులై తమను తాము కోల్పోతారు.

“నమఃశివాయి మంత్రానుష్థానం ద్వారా అహంత భస్మమై నశిస్తుంది. భక్తి దీపం నిలుకడగా వెలుగుతుంది. అదే ఆత్మానుభవం ప్రకాశం. **శివో2_ హం” అంటే అదే. తీవ్ర ఆత్మ విచారణ ద్వారా హృదయమనే చెకుముకిరాయిపై మనస్సును రాపిడి పెడితే విస్ఫులింగాలు లేస్తాయి. అప్పుడు శుద్రజ్ఞానం ద్యోతకమవుతుంది. “అన్‌- అల్‌-హక్‌”” అంటే అదే. “నేనంటే నేనే”.

అద్వైత జ్ఞానమునందలి దృఢనిష్టయే నిజమయిన ధీరత్వం. ఈ వ్యావహారిక మిథ్యా జగత్తులో సర్వశత్రు విజయం లభించినా అది భయం వల్ల కలిగిందే. ద్వైతమే భయానికి మూలకారణం. కోరికలకూ శక్తి ప్రదర్శనకూ కూడా అదే కారణం.

మిథ్య “నేను మనల్ని విమోహితుల్ని చేస్తుంది. అది సృష్టించే విభేదాల కత్రీతమైనది సమ్యక్‌ జ్ఞానం. ఆ పారమార్ధిక జ్ఞానం, ఆ పరమ ప్రశాంత స్థితి వుహాత్ములకు అనుభవగ మ్యవుయిన అత్యుత్తమస్థితి.

పరమేశ్వరుని వైపు నీవు ఒక్క అడుగు వేస్తే ఆయన నీవైపు తొమ్మిది అడుగులు వేస్తాడు, మవూతృ (ప్రేవును మించిన

రమణోపనిషత్‌ 19 వాత్సల్యంతో నిన్ను స్వీకరించేందుకు. గుర్వనుగ్రహం కూడా అలాంటిదే. ఉన్న వస్తువు సదా వెలుగుతున్నది అనుగ్రహంగా, నేనుగా, ఆత్మగా, హృదయంగా. ఆ అను[గ్రహ స్వరూపానికి ఆనఎ(గ్రహం లేదని నిందించటం ఎలా సాధ్యం? దోషం, అంతర్ముఖులై ప్రేమ విహ్వలులై ఆత్మను చూడని వారిదే. మనస్సు అంతర్ముఖం కాగానే అహంత నశిస్తుంది. చిదానందాత్మ ప్రకాశిస్తుంది. నామరూపాలను అధిగమించినదయినప్పటికీ అదే గురువుగా సాక్షాత్కరిస్తుంది. అలా ఆత్మ అయిన భగవంతుడు గురురూపంలో తన అనుగ్రహాన్ని వర్షిస్తాడు. ఈశ్వరుడు, గురువు, ఆత్మ ఒకే సత్యము యొక్క త్రివిధ రూపాలు. అట్టి అను(గ్రహాన్ని అనంఎభవించిన వాని హృదయువు శుధ్ధ సద్రూపంగా వెలుగొందుతుంది. ఇంతదాకా వ్యావెళాహానికి (భ్రాంతికి కారణవుయిన చిజ్జడ [గ్రంథి శాశ్వతంగా నశించిపోతుంది. అనుగ్రహం అనే అమృత ప్రవాహ జలాలు మనల్ని అన్ని వైపులా చుట్టుకొని ఉన్నాంఎయి. అయినా వునం (భాంతితో దుఃఖిస్తున్నాము, అపార గంగా జలాల నడుమ నిలిచి దప్పికతో అలవుటిస్తూ ఆ దప్పికను ఎలా తీర్చుకోవాలో తెలియని మూర్చునిలాగ. ఆ ““సర్వేశ్వరుని అనుగ్రహ వీక్షణాలు అందరొపైన సమానంగా ప్రసరిస్తాయి కదా - కొందరు “పాపాత్ములు” అవి పాందరేమి ?”* అని అనవచ్చు. సర్వతోముఖమైన ఆ జ్ఞాన చక్షువు ఎవరినీ విసర్టించదు. మనమే అంధులం, పైకి చూస్తాం, లోనికి చూడము.

20 రమణోపనిషత్‌ 8. అన్నీ ఆ బ్రహ్మవేఎ అన్యము కాదు.

మనస్సు బహిర్విషయాల వెంట పరుగెత్తకుండా వెనుతిరిగి స్వస్థానమైన హృదయమందిరాన్ని చేరుకుంటే సచ్చిదానందాత్మకమైన నిజస్టితి తిరిగి సిద్ధిస్తుంది, శాశ్వతంగా నిలుస్తుంది. చిత్త్వమైః మనస్సు తన వ్యాపారాలనన్నింటినీ నిరోధించినప్పుడు తనను తాను సద్రూపంగా కనుగొంటుంది. సత్త్వము చిత్తముతో మిళితమైతే ఆనందానుభవం కలుగుతుంది. అది ఆత్మ కాక మరేమిటి? దేహాత్మ భావనారూపమెన్ర అహంత నశించినప్పుడు జడముతో ముడిపడి ఉన్న జీవుడు చిన్మాత్రునిగా ప్రకాశిస్తాడు. చిద్రూపము సద్రూపమే. చిరంతన ఆత్మానందమే. అఖండ ఆత్మజ్ఞానమే సత్యమైన దివ్యభక్తి మార్గం, ప్రేమపథం, మన స్వరూపం పరమానంద ఘనమన్న జ్ఞానం (ప్రేమగా ఉప్పొంగుతుంది. అసత్యం అశాశ్వతం అయిన అహంత కణికమైన జగత్తును సత్యమనీ, శాశ్వతమనీ భ్రమింపజేస్తుంది. ఆ అహంత నశొస్తే ఆత్మ కేవల సద్రూపంగా ఈ వ్యావహారిక జగత్తు కాధారంగా నిలుస్తుంది. అజ్జ్ఞానరూపం అయిన అహంతా పిశాచం జీవులకు వైతన్యం ఉందని భావిస్తుంది. ఆ అహంత నశొస్తే ఆత్మ కేవల చిద్రూపంగా సకల భూతముల యందలి వైతన్యానికి ఆధారంగా నిలుస్తుంది. వేదనామయం, అభిమానయుతం అయిన అహంత మనోహరములయిన ఇంద్రియ విషయాలలో ఆనందం లభిస్తుందని భావిస్తుంది. ఆ అహంత నశిస్తే ఆత్మ కేవలానందంగా సర్వ విషయ సుఖాలకధిష్టానంగా నిలుస్తుంది.

“ఆనంద స్వరూపంగా ఉండటం కంటే ఆనందాన్ని అనుభవించటం మంచిది” అని ద్వైతులు వాదిస్తారు. కాని

రమణోపనిషల్‌ 21 ఆత్మానందం జడపదార్ధం కాదు పంచదారలాగ, మనమే ఆనందం, సత్తు చిత్తు ఆనందం అని క్రివిధ అంశాలుగా మనం పేర్కొన్నప్పటికీ అవి నిజానికి ఒకే ఆత్మానుభవాన్ని సూచిస్తాయి. నిర్మల జలాన్ని రుచి చూచినప్పుడు అది ఒకేసారి తడిగా తీయగా చల్లగా ఉంటుంది కదా !

మన స్వరూపం శుద్ద సత్తు. శాశ్వతంగా ఉండేది అదే. తద్భిన్నంగా వమునం చూచే విషయాలన్నీ వచ్చి పోయే మిథ్యా దృశ్యసమూహాలు. సత్యము కదలదు. మారదు. ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది. శుద్దవిత్‌ స్వరూపమైన ఆత్మ లేకపోవుట అంటూ ఎన్నడూ లేదు. సాపేక్ష జ్ఞానం అంతమై మిథ్యాకల్పిత ద్వైతం లేకుండా పోయినప్పుడు చిత్‌ స్వరూపమయిన ఆత్మ అలాగే నిలిచి ఉంటుంది, ఎక్కడికీ పోక. సచ్చిత్‌ స్వరూపమైన స్వాత్మలో మనం ““అల్పాత్మ” నొక దానిని ఊహించుకొని అజ్జానమయ జగత్తును సృష్టించుకుంటాం. అందులో పరమాత్మే లేనట్టుగా తోస్తుంది. తాను బహిర్విషయాలను చూచే ద్రష్ట అనే భ్రాంతికి లోను కానివాడు, తన నిజస్టీతి పరవూత్మ స్వరూపవేం అని తెలుసుకున్నవాడు అష్టసిద్ధులను తృణీకరిస్తాడు. శాంత్యానంద సామ్రాజ్యాన్ని సంపాదిస్తాడు. పరమాత్మలో నెలకొన్న ధీరునికి భయ సందేహాలుండవు. ద్వితీయం ఉంటేనే కదా భయమైనా సంశయమైనా. వివిధ మిథ్యా విషయాలను ప్రతిబింబించే సాపేక్ష జ్ఞానంగా అగుపించేది మన స్వరూప వైతన్యమే. అఖండ చిత్‌ స్వరూపాన్ని తెలుసుకొని సిద్దిపొందిన వారికి విషయాలన్నీ ఆత్మ మాత్రములే. సనాతనమైన ఆత్మ ఒకటే ఉన్నది. ఆ పరమాత్మ

22 రమణోపనిషత్‌ వైతన్యం కంటే భిన్నంగా ఏదీలేదు. అట్టి శివ స్వరూపంలో ఏది కన్సించినా అది అంతా పరవూత్మే, అన్యము కాదు. సత్యా సత్యములు, జ్ఞాతాజ్ఞాతములు, సుఖ దుఃఖములు - అన్నీ ఆ బ్రహ్మమే, అన్యము కాదు. విశ్వాసావిశ్వాసాలు, రాగద్వేషాలు, మంచి చెడ్డలు - అన్నీ, అన్నీ ఆ బ్రహ్మమే, అన్యము కాదు. 9. భూవు విద్య జ్ఞాన లక్ష్యమూ వేదాంత లక్షణమూ మౌనమే. అందువల్ల అన్ని . మతాలూ నిత్య శుద్ద బుద్ధ ముక్త స్టితి అయిన అద్రైతస్థితికి సాధనాలుగా ఉపకరిస్తాయి, సహకరిస్తాయి. నీచులు సంకుచిత బుద్దులూ ఒక క్రొత్తమతాన్ని స్థాపించవచ్చు. అదిసైతం విశుద్ర పర సంవిదాత్మకునిగా వెలిగే ఆ శివునికి చెందినదే అవుతుంది. నీవు ఏ మత సంప్రదాయాన్ని విశ్వసించినా, దృఢవిశ్వాసంతో నీ చూపును లోనికి మరల్చి ఆ మతాన్నే అనుసరించు. దాని ప్రకారం జీవించు. ఇతరుల విశ్వాసాలను ద్వేషించటమో వానిపై దాడి చేయటమో ఎందుకు? ద్వైతమనీ, విశిష్ట్రా ద్వైతమనీ, శుద్దాద్వైతవమనీ ఎందుకీ అల్పమైన వివాదాలు? ఉత్తమమయిన ఆత్మ విచారాన్ని ఎన్నుకో. నీ తపస్సు తీవ్రతరమొనర్చు. దైవాన్ని ధ్యానించు. ఆయన అనుగ్రహాన్ని పొందు. మనస్సున్నంత కాలం మతాలూ ఉంటాయి, ఆత్మాన్వేషణకై మనస్సు అంతర్ముఖమైన హృదయంలో కట్టుబడితే నిర్మలమైన ఆ శాంతి రాజ్యంలో ఏ మతమూ నిలువలేదు. వూనవకోటి అంతటిలో వునోవ్యాపారము లెరుగని పసీబాలురుల వంటి బుషిసత్తములే జగత్పితరులకు అత్యంత

రమణోపనిషత్‌ 23 ప్రీతిపాత్రులు. మనోవ్యాపారములుడిగిన మహాత్ములే నిజమైన ఆనందాన్ని అనుభవిస్తుంటారు. వారెప్పుడూ వీడక తల్లి వొడిలో ఆనంద పయః పాన మళ్తులై క్రీడిస్తూంటారు.

అహంత నశించిన అద్వయ అఖండ స్టితిలో “నేను, “వాడు” లేకుండా పోయి మనస్సు సత్యాత్మలో విలీనమవుతుంది. ఆ శుద్ద వైతన్య సామ్రాజ్యమే పరమోత్తమమైన శవైక్యస్టితి. రెండుగా ఉన్న “నేను, “వాడు ఒకటి ఐన మౌన సంయోగంలో వాక్రాణముల ప్రసక్తి ఏముంటుంది? ప్రేమికుల రెండు కన్నుల జంట పరస్పరం కలుసుకొని ఐకవుత్యవుయినట్లు “నేను*” నశించినప్పుడు నోటిమాటలతో పనియేముంటుంది? ఈ ఆత్మ సంయోగాన్ని పొందినవార్‌కే అందలి ఆనందం ఏమిటో తెలుస్తుంది. మరోవిధంగా ఎలా దాన్ని తెలుసుకోగలం? తేనె త్రాగి మత్తుగా, మౌనంగా ఉన్న తేనెటీగల లాగా ఆ అనుభూతిని పొందినవారు అది తప్ప అన్యమెరుగరు. వారు ఆ ఆనందాన్ని అనుభవించగలరే గాని దాన్ని గురించి తలంచలేరు. మనస్సు నశించిన ఆ పరమానంద మౌనస్థితి తమకెలా సంప్రాప్తమైందో కూడా వారెరుగరు. జగత్తును ఆత్మకంటే భిన్నముగా చూస్తుంది అహంత. దానికుండే ఈ సాపేక్ష జ్ఞానం అజ్ఞానమే. అహంత నశీస్తే సాపేక్ష జ్ఞానానికి మూలానికి మూలమైన శుద్దాద్వైత సచ్చి జ్యోతి వెలుగుతుంది. సత్తే చిత్తుగా వెలుగుతుంది, అనందిస్తుంది. తలపు కేవల సచ్చేతనంలో విలీనమయ్యేదాకా, పాపం, ద్వైతదృష్టి కలిగే మనస్సు సచ్చిద్ధనమును తెలుసుకోజాలదు. తూరుపు ఆకాశంలో సూర్యుడుదయించే వరకే చంద్రుని వెన్నెలలు

ల రమణోపనిషత్‌ గర్వంగా భూమిమీద ప్రసరిస్తూ ఉంచాయి. జ్ఞానము సిద్దించి మిథ్యాహంత నశించే వరకే జీవుని వునస్సు తలెత్తుకొని తిరుగుతుంటుంది.

వఎంహర్న్షల హృదయువుందిరంలో ఆత్మ నిత్యం వెలుగుతుంటుంది. అది ఉదయాస్తమయములెరుగని రవి. దానికి మనస్సుతో పని లేదు. మిట్టమధ్యాహ్నపు టెండలో ఈ విశాల జగత్తుకు చంద్రునితో పనేముంటుంది? మిథ్యా జగత్తును దర్శింపజేసే వునఃప్రకాశం అధడ్బంలో ప్రతిబింబించిన వెలుగులాంటిది. సచ్చైతన్యం నిత్యవు, సత్యవు, స్వయం్రకాశమానము. అది మనస్సుకు జన్మస్టానం, హృదయం.

అక్కడ అన్యము కన్పించదు. అన్యము విన్సించదు. అన్యము తెలియదు. భూమవిద్య అంటే అదే. వివిధ విషయాలను చూచుట, వినుట, ఎలుగుట అనే దోషం లేని అద్వయ అనంత జ్ఞానమే నిర్మలమయిన పరమానందం. 10. శుద్ద చిదాకాశవేం ఆత్మ

సత్యాన్వేషణ తత్పరుడవై మహాత్ములను వెతుక్కుంటూ (ప్రపంచవుంతా తిరుగాడుతున్నావే నువ్వు! ఆ వుహాత్ములు నిర్దారణచేసి బోధించేదేమిటి? వివుర్శించి చూడు. కేవలం శుద్రశూన్య చిదాకాశమే అది. లోకంలో అటూ ఇటూ పరుగులు తీస్తూ గురువుల కోసం గాలించే సాధకులు చివరకు కనుగొనేదేమిటి? వాత్సల్యంతో గురువులొసగే కానుక అద్భుత శుద్ధ చిదాకాశం మాత్రమే. ఆనందం కొరకు ఇక్కడా అక్కడా

రమణోవనిషత్‌ 25 సర్వత్ర వెతకి వెతకి అలసీపోయినవారికి అంతిము చిరంతన విశ్రాంతిస్టలం ఏమిటి? అద్భుత తురీియాకాశమే. ఈశ్వరీయ శుద్ర బుద్ధ సత్య జ్ఞాన తేజోవిరాజితులగు మహాత్ములు వెల్లడి పరచేది అదే. పాము తన కుబుసాన్ని విడిచినట్లు సమస్త కామనలనూ త్యజించి తీవ్రంగా తుదిదాకా ఆత్మానుసంధాన మగ్నుడైన వానికి లభించే పరమానుభవం ఏమిటి? అది దివ్య అనంత శుద్ద చిదాకాశమే.

జ్ఞానాగ్ని జీవుడినీ, జీవుని అసంఖ్యాక మిథ్యాప్రత్యయాలనూ దద్ధ మొనర్చినప్పుడు దివ్య శుద్ద జ్ఞాన తేజోరాశి ఆ స్మశాన సప్టలమంతటా విస్తరిస్తుంది. అది విశాలమయిన కీకారణ్యమంతటినీ ద గ్రంచేసిన దావాగ్ని ప్రచండాగ్ని జ్వాలర్మై వెలిగినట్టుంటుంది. “నేను దేహాన్ని” అనే మిథ్యాభావన నశించినప్పుడు ఏది ఉండతగినదో అదే మిగులుతుంది. అది అనంత దివ్య మౌనాకాశం, అదే ఆత్మ. అదే. నిజానికి సర్వదుఃఖహరం. సర్వకామనావర్షితం, శుద్ధ సదాత్మ స్టితి. సకల దోషాలకూ మూలం అహంత. దాన్ని నిర్మూలించగలిగేది గురువొక్కడే.

ఆ గుర్వనుగ్రహమే లేకపోతే దివ్య అనంతసచ్చిదాకాశపు నిరతిశయ ఐశ్వర్యాన్ని ఎవ్వరూ తెలుసుకోజాలరు. జ్ఞానానందాకాశ సంపదను దర్శించినవాడు సాక్షాచ్చివుని మాదిరిగా మౌనముద్రాలంకృతుడై ఉంటాడు. “నేను”, “నాది” అనే మిథ్యా తాదాత్మ పరిణామమయిన అసంఖ్యాక జనన మరణ శృంఖలా విచ్చేదం చేస్తాడు. మహాశూన్యమగు ఈ చిదాకాశమే వ్యాపారాత్మక పరమేశ్వరశక్తికి ఉద్గమస్టానం, అద్భుత క్రీడారంగం. శబ్ద స్పర్శ

26 రమణోపనిషత్‌ రూపరస గంధాత్మక పంచేంద్రియ విషయ జగత్‌ సృష్టి స్థిత్యాది కార్యము లొనర్చ్బేది ఈ శక్తియే.

స్వయం ప్రకాశితమగు అంతర్జ్యోతి సర్వదా “నేను నేను అని వెలుగుతోంది. దానికై ఇక్కడని అక్కడని వెతుకుతూ పోవటమేమిటి, పూర్ణవం ద్రుణ్ణి మనకు కన్పించనీయక మరుగుపర్చే చండకిరణుని కోసం చేత దీపంతో మిట్టవుధ్యాహ్నపువేళ వెతకినట్లు? “నేను మిథ్య. '“జగత్తు మిథ్య. “ఈ జగత్తు ను “నేను చూడటం మిథ్య. త్రిపుటిని సృష్టించే మాయ అనే మూలాజ్ఞానం కూడా మిథ్యే- అద్భుతం, దివ్యం అయిన అంతరజ్యోతి, సచ్చిదాత్మ ఒకటే సత్యం. ఈ విశాల విచిత్ర లోకాల కన్నింటికీ ఆధారంగా ఉన్న ఆత్మ చైతన్యం కొందరికి లేనట్టు తోస్తుంది. అట్టివారికి జీవితపు పరమ పురుషార్ధం అందనంత దూరంలో వుంటుంది. పంచేంద్రియ గోచరవుయిన దానినే నిజమని నమ్ముతూ వారు (భ్రాంతికి లోనవుతారు. తెరమీద ఆడే బొమ్మలు తెరను మరుగుపరుస్తాయి కదా! అంతర అఖండ నిష్కళంక ఆత్మవైతన్య మహిమానుభూతి పావన నిర్మల మానసులై శివ సములయిన జ్ఞానులకు తప్ప అన్యులకు లభించునా?

అంతర చైతన్యమే పరమ శివ స్వరూపం, వాగతీత సత్పదార్దం. సాక్షాచ్చివ స్వరూపుడయిన శ్రీరమణ మహర్షి ఈ సత్యాత్మను నాకు (మురుగునార్‌కు) ఎరుక పరిచాడు. ఒకానొక ఆత్మిక కణంలో ఒకానొక ఆత్మిక స్థలంలో ఆత్మ ఆత్మను కలుసుకోగోరగా ఆత్మ ఆత్మను ఆత్మకు సాక్షాత్కరింపజేసింది. ఆత్మను ఆత్మగా కనుగొన్నది. జీవుడు ఆత్మను తెలుసుకోలేడు. ఆత్మకంటె

రమణోపనిషత్‌ 27 భిన్నమయినది మాయమైతే ఆత్మ శుద్ద జ్ఞానంగా నిలుస్తుంది. దేశ కాలములకు నడుమ, గురు శిష్యులకు నడుమ భేదాన్ని నశింపజేసి శుద్ద శివ జ్ఞానమే పరమ సత్యమని భగవాన్‌ (శ్రీరమణులు తెలియ జెప్పారు.

  1. వమునః కల్పిత మిథ్యా దృశ్యాలు వురు వురీచికలు - ఆత్మ నిష్టనకే ఆనంద ప్రాప్తి

అహంత లోకాన్ని మనకు చూపిస్తుంది. కాని అహంతను మనం చూడలేం. అహంత అంతర్ముఖమై తన మూలాన్ని అన్వేషిస్తే హృదయంలో **నేను నేను” అనే స్ఫురణ కలుగుతుంది. అదే మన నిత్య సత్యం. పాపిష్టి మనస్సు బాహ్య విషయాలవల్ల విచలితం కాకుండా లోనికి తిరిగి చూచి *“నేనెవడను?” అని వెదకి తనకు ఆధారమయిన ఆత్మలో నిలివి వుంటే అదే స్వస్వరూపం. ఏ ఆశ్రమంలో ఉండనీ, ఏ వర్ణంలో పుట్టనీ, జ్ఞాని కేవలం ఆత్మస్టుడు. ఆత్మప్టితియే స్వస్వరూపం. ఇతరములన్నీ మిథ్యా మాత్రములు. వర్గాశ్రమాలకూ జ్ఞానానికీ సంబంధం లేదు. జ్ఞాని అత్యాశ్రమి. సత్యస్థతి ఆత్మ స్వరూపమే. అది ప్రేమ స్వరూపం. సత్యము (ప్రేమయే, స్వర్ల సౌఖ్యాలనుభవించే దివ్యజీవనం వంటి ఇతరములన్నీ మిథ్యా దృశ్యమాత్రములు. మనఃకల్పితమయిన మరు మరీచికవలె గగనకుసుమంవలె అవి మనల్ని ఇంకా ఇంకా మాయా మోహితుల్ని చేస్తాయి. స్వస్థ్రితి పరమానందమే,. బాహ్య విషయాలలో సుఖం ఉందని, పాపపు మనస్సు తాపత్రయం చెంది అంతర్నిహితమయిన ఆనందాన్ని మనం కోల్పోయేలా చేస్తుంది. కలతలేని నిద్రలో మనం

28 రమణోపనిషత్‌ ఆనందంగా ఉన్నాము. జాగ్రదవస్టలో కూడా నిరహంకారంగా తలపులు లేకుండా ఉంటే స్వస్వరూపమైన ఆనందాన్ని అనుభవించగలం. పరమానంద రూపవుయిన ఆత్మరసాన్ని ఆస్వాదించిన జ్ఞానులు ఆత్మనిష్టులై ఉంటారు. స్వయంసిద్దమై కేవలమయిన పరమానందం ఆత్మలోనే ఉన్నదని ఎజుగని అజ్ఞానులు ఎప్పుడూ విషయాసక్తులై ఉంటారు. స్వస్వరూపం ఆనందమే అని చూడలేనివారు సంభ్రాంతులై తిరుగుతుంటారు, అడవిలో కస్తూరి మృగం మాదిరిగా. స్వాత్మను తిన్నగా ఎలఅీగినవారు విషయ ప్రపంచ పరిభ్రమణం చాలించి సహజ ఫ్రితిలో, స్వఫ్టితిలో ఉంచారు. ఆత్మ స్వభావమే ఆనందం. బ్రహ్మానందమే ఆత్మ. సద్వస్తువు ఆనందమే. ఇది తెలుసుకొని ఆత్మనిష్టుడవై శాశ్వతానందాన్ని పొందు. ఆత్మనిష్టుడయిన మహర్షి సకల కామములను శాశ్వతంగా నిర్మూలించి వేస్తాడు. అతడు తన జ్ఞానా(న్త్రుంతో అజేయుడయిన యముడి మదమడంచిన శివుడు, మాయాంధకారాన్ని తొలగించిన సూర్యుడు. పంచేంద్రియములు, మనస్సు ఈ ఆరింటి ద్వారా జగత్తును సృష్టించి భోగించేవాడు శూరపద్ముడనే ఆహంత. షడింద్రియములతో ఈ విశ్వాన్ని చూస్తూ పోషిస్తూ ప్రాణాంతక శక్తి కల్గిన అహంతా పీశాచాన్ని హృదయంలో నుండి బయటికి నెట్టి క్రోధంతో ఎదిరించే షణ్ముఖుడు. ఆయన బ్రహ్మానందదాయకుడు, జ్ఞాన సూర్యుడు. సత్యమునెరిగి దృఢజ్ఞాన నిష్టను కలిగి సమస్తమయిన కోరికలను నశింపజేసిన జ్ఞానాగ్ని స్వరూపుడే స్వయంగా యముడికి యముడు కాల పురుషుడు, శివుడు, మృత్యుంజయుడు.

రమణోపనిషత్‌ 29 12. ఆహంత తాలగితే ప్రకాశించేది ఆత్మే ఈ దేహం ఒక బొమ్మ. దీన్ని నేనని అనుకుంటున్నావు. బొమ్మ ఆలోచించగలదా? ఆలోచించేదీ ఆలోచించకుండా ఉండగలిగేది జీవుడే. జీవుడు ఒకప్పుడు తాను శరీరమని అనుకున్నాడు. కాని ఇప్పుడు తెలుసుకొన్నాడు కాదు మరొకటి అనీ, దేహంలో మరొక జీవుడు ఆడుతూ దేహంగా నర్తిస్తున్నాడనీ. జీవుని లోపల ఉన్న ఈ ఇంకొక జీవుడే స్వస్వరూపం. జాగ్రత్‌ స్వప్నవఎలలో జగత్తుంది. నిద్రలో జగత్తు లేదు. ఈ అవస్థాత్రయములో అశరీరుడవై నీవు మెలగుతూనే ఉన్నావు. నీవాత్మవు. నీ సహజ స్వభావం అదే. కనిపిస్తున్న జగత్తు నిజమైనా, కాక ఒట్టి ఊహే అయినాజ్ఞాతగా, జ్ఞానంగా నీవుండనే ఉన్నావుకదా! శుద్ధజ్ఞానమైన ఆ స్వరూపమే అత్మ. జ్ఞానాజ్ఞానముల కతీతమైన శుద్ద జ్ఞానరూపమే ఆత్మ, సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపం. పూర్ణ జ్ఞానంలో అజ్ఞానానికి తావెక్కడ? అజ్ఞాన స్పర్శ లేశమైనా లేని అది అత్యంత విశుద్ధం, పూర్ణ జ్ఞానం, కేవల స్వరూపం. అది సత్యజ్ఞానరూపమే కాకపోతే అందులోనుండి విజ్ఞానం అనగా బుద్ది ఎలా జనిస్తుంది? జ్ఞానం ఆత్మయొక్క గుణం కాదు. ఆత్మ గుణరహితం, జ్ఞానం ఆత్మయొక్క వ్యాపారం కాదు. ఆత్మ నిష్కియం. ఆత్మ వున స్వస్వరూపం. అది “ఉన్నది. ఉన్నదే జ్ఞానం. లోపల అద్వితీయమై అఖండమై “నేనున్నాను*, “నేనున్నాను” అని అది వెలుగుతోంది. ఆ సచ్చక్తి రూపం సర్వోపాధుల కతీతమై శుద్ధజ్ఞానమై వుంది. మన నిజస్వభావం అదే. సత్యాత్మ శుద్ధ జ్ఞానప్రకాశం. విషయాలను తెలుసుకున్నట్టుగా దానిని తెలుసుకోవటం ఎలా?

30 రమణోపనిషత్‌ మిథ్య అయిన అహంత అదృశ్యమైనపుడు, మనలో అంతశ్శాంతి నెలకొన్నప్పుడు ఆత్మ సహజంగా తానై వెలుగుతుంది. “నే ననేది లేకపోతే త్రిపుటి లేదు. అయినా ఆత్మగా మనం ఈ త్రిపుటులలో ఏదీ కాము. ఆత్మగా ఈ త్రిపుటులు అన్నింటికీ ఆధారంగా అధిష్టానంగా మనమున్నాం. త్రిపుటిలో “నేను? ఉన్నది (ద్రష్టు దృష్టి దృశ్యం కాని ఈ *నేను అహంత, ఆత్మ కాదు. అయితే స్వరూపం లేకుండా చూడటం ఉండదు. ఆత్మే స్వరూపం, చూడటానికీ, తదితర క్రియాకలాపాలన్నింటికీ అదే అధిష్టానం. పైన తోచే దృక్‌ ద్రష్రు దృశ్వముల కాధారమైన సత్పదార్థం ఆత్మ, ఆత్మ శాశ్వతం, సంపూర్శం, సవుగ్రం, ఏకం. దాన్ని తెలుసుకోలేము. అది అద్వైతం. యోగం లేక కలయిక అంటే జ్ఞానస్వరూపంగా ఉండటం. అంతేగాని దేనినో తెలుసుకోవటం కాదు. మన నిజస్వరూహమే జ్ఞానం. స్వూల సూక్మములు, శూన్యత్వ పూర్మ్శత్వవఎలు, 'సుఖదుఃఖవఎలలు వెంందలయిన ద్వంద్వములన్నింటికీ ఆధారం ఏకాత్మయే. అది అనంత జ్ఞానం. అదే “నేను. బహుగతులతో కూడిన మిథ్యాహంత ఏవేవో సత్కార్యాలను దుష్కార్యాలను చేస్తున్నట్లుగా తత్పరిణామములు వమనఃకల్పితములు అయిన దుఃఖాలెన్నో అనుభవిస్తున్నట్టుగా తోస్తుంది. కాని ఈ గడబిడకంతటికీ ఆధారం ఏకైకాశ్రయం మన సత్‌ స్వరూపం. అదే జ్ఞానం. ఏదో ఒక దేహానికి బద్దమై ఉండకుండా ““నేనున్నాను, నేనున్నాను” అనే సహజ స్ఫురణ మొకటి వుంది. అది సూర్యునివలె దివ్యమై స్పష్టమై స్వయం ప్రకాశమై హృద్దామమై వెలుగుతోంది. అదే సత్యాత్మ. శుద్ద సచ్చిత్ర్రకాశం సూక్ష్మం,

రమణోపనిషత్‌ వే అహంతా రహితము, దృశ్యాతీతము, మౌనము. మనస్సు “నాకు తెలియదు” అని అంగీకరించేవరకు అది ఊరుకోదు. ఆయాస పెడుతుంది, గాబరా పెడుతుంది. అది స్వరూప జ్ఞానం, ఆత్మ. ఆత్మ అంటే వాస్తవమైన ఎరుకయే. అది ఎప్పుడూ ప్రశాంతంగా తెర మాదిరి కదలక ఉంటుంది. దృక్‌ ద్రష్ట. దృశ్య రూపంగా ఉన్న జగత్తు ఆ తెరపై కదలాడే బొమ్మ, సప్త స్వరాలలో వ్యాప్తమై వానికి ఆధారంగా ఉండి పరిత్యజింప వీలులేని శ్రుతివలె తనపై ఎన్నో బొమ్మలు కదలాడుతున్నా తాను కదలని సినిమా తెరవలె ఆత్మ స్థిరముగా నిష్కళంకముగా, నిష్పందముగా ఉన్నది. దృగ్గోచరమయ్యే జగద్రూపంగా భాసిస్తున్నదీ, లేని దానిని ఉన్నదిగా తోపింపజేసేదీ ఆత్మయే. వవ్చిపోయే నామ రూపములను వర్ణిస్తే సర్వత్ర సర్వదా పరబ్రహ్మ స్వరూపముగా నిల్చి ఉండేది ఆత్మ ఒక్కటే. అవినాశి అయిన పరవూత్మ సకల జీవుల లోపల అంతర్యామిగా దాగి ఉన్నాడు. తన ఉపకరణంగా చేసుకొని ఆగక, అలుపెరుగక ప్రతి దేహాన్ని త్రిప్పుతున్నాడు. ఆత్మ అహంత కాదు. అహంత వితశ్రాంతి లేని బండి చక్రం. లేస్తుంది పడుతుంది. నిరంతరం కష్టపడుతుంది. ఆత్మ ఆ చక్రానికున్న ఇరుసు. అది కదలదు. సత్యవుదే. ఈ దృళ్య ప్రపంచం కనిపించనీ, అదృశ్యమయిపోనీ _- ఆత్మ వైతన్యానికి రండూ ఒకటే. సర్వత్ర వ్యాప్తమై ఉన్న శుద్ద శివ స్వరూపార్ణవంలో విషయములన్ని మునిగిపోయినప్పుడు కూడా మిగిలి నిలిచి ఉండేది ఆత్మ స్వరూపమే. అది యేది అని విచారించి చూస్తే మనల్ని వంచించే అహంత నశిస్తుంది చవూయవువుతుంది. అప్పుడు ఆత్మ

32 రమణోపనిషత్‌ శుద్దజ్ఞానంగా విశదమవుతుంది. భగవదను[గ్రహ తాత్పర్యంగా ఉపనిషత్తులు పేర్కొనేది అదే. తాండవవూడే శివుని దివ్య దర్శనమదే. అద్వితీయ పరబ్రహ్మరూపం పరమానందం. అది శూన్యంగా

తోచినా శూన్యం కాదు. పూర్ణ జ్ఞాన స్వరూపం. ఏకైక సత్యం. “నేను” తలపు అసలు లేనివోటు మౌనమనీ, అదే ఆత్మ అనీ ద్రష్టలు వచించారు. ఈ ఆత్మయే ఈ మౌనమే జీవ జగదీశ్వరులు. ఆత్మయే సృష్టిస్తుంది, చూస్తుంది. ఆత్మయే జగత్తు. ఆకాశంలాగా మనకు గోచరించే విషయాలన్నింటిలో సారభూత ద్రవ్యం ఆత్మయే. అదే జీవ జగదీశ్వరులు, అదే పారమార్థిక సత్యం. చరమస్టానం, పరమ శివ స్వరూపం.

  1. ఏ సిద్దులు ఆత్మసిద్దికి సాటిరావు

కేవల సద్వస్తు వైభవంలో ద్రష్టతాను చూసే జగత్తు అవుతాడు

కనుక ఆత్మయే పైక సత్యం. “చూచే అహంత అదృశ్యమైనప్పుడు స్వచ్చ మౌనం ఆవరిస్తుంది. అది శుద్ద వైతన్యం, ఆత్మ. చిదానంద నిలయమైన ఆత్మ అపార గంభీర శాంతి పాఠరావారం. మనస్సును లోనికి మరల్చి దాని లోతులకు చొచ్చుకొనిపోతే ఆత్మాను గ్రహమనే పెన్నిధి లభ్యమవుతుంది. శ్రేష్టమైనది ఆత్మయే. అంతకంటే శ్రేష్టతరమైనది లేదు. అట్టి ఆత్మను వమూల్యముగా చెల్లించి కొనుక్కోవలసిన వస్తువు మరొకటి మనకు లేదు, లేనేలేదు. ఏ సిద్దులూ ఆత్మ సిద్దికి సాటి రావు. పరమాత్మ వైభవ ప్రాప్తిని మించిన శ్రేయస్సు ఈ ఇహలోక జీవనంలో మరొకటి లేదు. దాన్ని పొంది

రమణోపనిషత్‌ తవ ఆనందించేందుకు లోన వెదకు. మిథ్య అహంత నిరర్టకమైనట్టిది. దాన్ని ముందుగా నిర్మూలించు. ఆత్మనిత్యసిద్దం. ఉజ్జ్వల అమూల్య రత్నం. అపురూపమైన నిధి. లోనికి చూడు, దాన్ని కనుగొను, గట్టిగా పట్టుకో. నీ లేమి తత్కాలంలో వూయమవుతుంది. నీవిప్టుడు మహాభ్రాంతిలో ఉన్నావు. లేమిని అనుభవిస్తున్నావు. ఈ భూమిపైన నీ కష్టాలన్నింటికీ ఇదే మూలం. ఈ లేమి, తనం నశించాలి. తన జన్మ హక్కు అయిన లో పెన్నిధానాన్ని తెలుసుకోలేక మందబుద్దులు నశిస్తుంచారు. మహాత్ములు మర్మమును గ్రహించి, దానిని వెతకి కనుగొంటారు. శాశ్వతానందాన్ని పొందుతారు. “నే నెవడను?*” అని స్టిమితవముగా వెదకి, పొంది, చిద్రూపాత్మగా నిలువక దానినుండి వేరుకావటం ఎందుకు? దుష్ట్రములైన ఇంద్రియ విషయాలకు చిక్కి దుఃఖాలనుభవించటం ఎందుకు? అందరూ అభిలషించే అష్ట సిద్దులు ఒక్కుమ్మడిగా లభించవచ్చును గాక! కాని హృదయ గ్రంథిని భేదించి ఏకైక పూర్ణము అయిన ఆత్మవణిని తిరిగి పొందలేకపోతే సిద్ధించిన జ్ఞానము యావత్తు వ్యర్థమే. స్టిరమయి విచ్యుతిలేని శివ జ్ఞానానుగ్రహ రూపమగు మౌనమే నిజమయిన సంపద. తలపుల యొక్క సమూల నాశనముకై ఏకాగ్రతతో యత్నించేవారికి ఆ అపూర్వ దివ్యనిధి లభ్యమవుతుంది. ముత్యములను వెతకేవారు తదేక మనస్కులై నడుముకు రాయి కట్టుకొని సముద్ర జలాలలోకి దూకుతారు, లోతులకు పోతారు, అత్యంత విలువైన ముత్యములు వెలికితీస్తారు, ఆనందిస్తారు. అలాగే తీవ్ర వైరాగ్య భావనతో హృదయంలో మునుగు. ఆత్మ నిధిని పొందు. సమస్తశోకాలను దుఃఖాలను అంతం

34 రమణోపనిషత్‌ చేసుకో. నిష్కలంకవుయిన ఆ ఆత్మ స్వరూపంలో “నేను” “నాద్రూ? అనే భావాలుండవు. అట్టి శుద్రజ్ఞాననిష్టా సాధనను మించిన మహా విజయం మరొకటి లేదు.

దివ్య నిష్కళంక స్వరూప జ్ఞానమే పరమార్హ స్టితి. అక్కడ మనఃప్రాణములకు పరమ సుఖప్రాప్తి కలుగుతుంది. శాంతి తరంగ ప్లావితవుయిన ఈ పరమాను[గ్రహ సిద్ది ఒక వుహదౌషధం కూడానం. వ్యాకులతా వ్యాధి[గ్రస్త వంన స్సుకు వంఠలల శాంత్యారో గ్యములు చేకూర్చే దివ్యౌషధం. ఈ శరీరం అశాశ్వతం. మిథ్య. దీన్ని తాముగా భావిస్తారు కొందరు. తాము సత్యాత్మ అనీ నిత్యస్వరూపం అనీ తెలుసుకోరు. అట్టి వారికి ఒక్కొక్కప్పుడు ఆయా దేవీ దేవతా రూప సందర్శనం కలుగుతుంది. దానికే ఆనందంతో పులకరించిపోయి వారు తన్మయులవుతుంటారు. అనాత్మను పూజించటం వల్ల అనిత్యములైన అనేక ప్రయోజనాలు సమకూరవచ్చును. కాని శివస్టితి సత్యమైనట్టిది, శాశ్వతమైనట్టిది. అది జ్ఞానపదం, శాశ్వత జీవనం. అది ఏ ఇతర దేవతలూ ప్రసాదించేది కాదు. '*నాకు దివ్య దర్శనం అయింది - ఇప్పుడది పోయింది.” ఇలా కొందరు చెబుతారు. వారికి సత్యము తెలియదు, నిద్రలో వారేమీ చూడరు. ఆ శూన్యమునకు వారు సాక్షులు. జా[గ్రత్తులో వారు సర్వము చూస్తారు. దానికీ వారు సాక్షులే. మనం శ్రథృతో ఆరాధించే దేవతలు వునకు ద ర్శన విఎస్తారు, అదృశ్యమవుతారు. కాని సహజమైన జ్ఞానం ఉన్నది. అది నిల్చి ఉండేది. ఎన్నటికీ మారేది కాదు. స్పష్టమై సునిశ్చితమైన అదే నిజానికి పరవేశ్వర స్వరూపం. వునం ఇక్కడ ఈ వస్తువు

రమణోపనిషత్‌ వ్‌

చూస్తాము, అక్కడ ఆ వస్తువు చూస్తాము. ఇలా మనం ఏ వస్తువులను చూసీనా వాని అన్నింటిలోని నిజవుయిన ఉనికి శుద్ద దివ్య చిదాకాశమే. అదే ఆత్మగా వెలుగుతోంది. ఇది అనీ అది ఆనీ మనం పేర్కొనే వస్తువులన్నీ మనఃకల్పనలే. ఇది (గ్రహించాలి. మన హృదయాంతరాళపు లోతులలో సత్యము, సంపూర్ణశాంతి స్వరూపంగా వెలుగుతున్నది. ఆ అద్భుత సవ్చైతన్యమే అత్మ. ది(గ్రమతో పరమసత్యమయిన ఆత్మసత్యత్వమును గురించి కాకుండా అన్యవస్తు సత్యత్వమును గురించి వెదకటం మూర్జత. మంగలి నేలమీద రాలిపడిన జుట్టును వెంటనే ఊడ్చి పారవేయక శ్రమించి పరిశీలించడం వంటిది ఇది. ఆత్మను ప్రేమిస్తూహృదయంలోనే నిమగ్నులైన వారికి ఆనందం క్షణంక్షణం పైకి పొంగిపొారలుతుంది, (ప్రేమగా, శివునిగాా అనుగ్రహంగా, జ్ఞానంగా, శాంతిగా, వోక్షంగా, ఆనందవేం ఆత్మయొక్క నిజస్వరూపం. 14. దివ్యానందవుయ శివతత్త్యం

ఈ మూర్జమనస్సు భేదాలను చూస్తుంది కనుక దేవతలకు కూడా భయం తప్పదు. నేతి ద్వారా ఆత్మనుచేరి అద్వయ పరమ పదంలో భయువెజుగక స్టరంగా నిల్చి ఉండటవేం జ్ఞాన వునిపించుకుంటుంది. ఆత్మలబ్దివల్లనే నితాంతానంత సుఖమయ శాంతి లభిస్తుంది. ఈ సర్వగత అద్వయ అఖండ ఆనందమోక్ష సామ్రాజ్యంలో ఏ కోరికా ఉండదు, ఏ భయమూ ఉండదు.

3ెర రమణోపనిషత్‌

ఘటంలోగాని గృహంలోగాని ఆకాశం ఎప్పుడూ ఒక్కటే. సవమానవేఎ. ఆకాళంలాగానే జ్ఞానం కూడా ఒక్కటే. ఆత్మ జీవేశ్వరులుగా వివిధ రూపాలుగా కన్పించినప్పుటికీ తత్త్వతః అది ఎట్టి వూర్ప్చును చెందదు. శిముడనీ జీభుడనీ రెండు తత్తాలున్నాయా? మధురామృతంతో చేసిన రెండు బొమ్మలలో బానిస బొమ్మకూ యజమాని బొమ్మకూ నడుమ నిజంగా రుచిలో ఏదయినా తేడా ఉన్నదా? చెప్పు! ఓ భగవాన్‌! తన ఉనికినే సందేహించేవాడు మాత్రమే నీవు లేవని చెబుతాడు. తన్ను గురించిన సత్యాన్ని తెలుసుకున్నవాడు సద్రూపుడవు చిద్రూపుడవు అయిన నీవు లేవనగలడా? (శ్రద్దాళువులైన వారికి హృదయంలో జ్ఞానరూపుడై భగవంతుడున్నాడు. కలుషిత చిత్తములలో ఆయన ఉండనే ఉండడు. నిర్మల మనస్కులై భ్రమను వీడి లోనికి సూటిగా చూస్తే దైవం స్పష్టంగా ప్రకాశాంశగా ఆనందాంశగా అత్మయై వెలుగుతాడు. అస్తికుడన్న ఉత్తమ నామంతో పిలవబడటానిక్రి యోగ్యుడెవరు? స్వచ్చమయిన తన మనస్సులోని జ్ఞానాంశను ఆత్మగా తెలుసుకొనే వివేకి. బుద్దుడు అంటే అతడే.

ఆకాళంలాగా స్వచ్భమై విశాలమై సూర్యునిలాగా 'ప్రకాశవంతమయిన తన చిద్రూపాన్ని తెలుసుకొన్న బుషిని భ్రాంతి అనే చీకటి ఎన్నటికీ స్పృశించదు. “నేను దేహాన్ని" అని భావించే (గ్రుడ్డివాళ్ళు మాత్రం అజ్ఞానాంధకారంలో దుఃఖిస్తుంటారు. ఆత్మవిచారణ ఎవరికి? జ్ఞానసిద్ధి ఎవరికి? భ్రాంతిలో చిక్కుపడిన జీవునకే! సదా ముక్తమై ఉన్న అద్వైతాత్మను ఏ దోషాలూ అంటవు, బంధించవు. సద్రూపమయిన ఆత్మ యావద్విశ్వంలోను నిండి

రమణోపనిషత్‌ వె? ఉంది. దాన్ని మాయా మరీవిక ఎన్నడయినా బంధించగలదా? నీవు బద్దుడవని ఊరక వణకిపోకు. శాంతుడవై ఉండు. తేటగా ఆలోచించు. సత్యాన్ని చూడు. ఈ శరిరం నిన్ను చుట్టుకొని ఉన్నదనీ, నీవు బద్దుడవనీ ఎందుకు వ్యర్ధంగా దుఃఖిస్తావు? భేదభావ ముక్తుడవై నిద్రలో ఉన్న వేళలో సయితం నీ స్వస్వరూపం పూర్ణంగా చెక్కుచెదరక నిళ్ళి ఉంది. జీవితంపై నీకు మక్కువ ఉంది. కాని జీవించటం ఎలాగో నీకు తెలియదు. శూన్యంలోకి ఇంకా ఇంకా దిగబడిపోతుండే నిస్సారమయిన మిథ్యాజా[గ్రత్‌ స్వప్నవే 'జీవితం* అని నీవు భావిస్తున్నావు. “జీవిస్తున్నా నని దంభోక్తులు పల్కుతున్నావు. ఈ భ్రాంతిని పటాపంచలు చేయి. వెళ్ళు. శాశ్వత జీవనమయిన సత్యాన్ని పట్టుకో. కామక్రోధాలను వర్జించు. సంభ్రమానికి కారణవముయిన మిథ్యా భావనలను నిర్మూలించు, ఎల్లప్పుడూ స్పిమితంగా ఉండు. నిరాసక్తుడవై వ్యవహరించు. ఇదే యథార్థ జీవనం. దీన్నే దృఢంగా పట్టుకొని నిలు. స్వస్వరూప స్టితుడవుకా. హృదయముప్పాంగి పొరలి వచ్చే నిశ్చల నిరాతంక ్రేవు ప్రవాహసదృశ జీవనుడవుకా. ఇదే దివ్యానందమయ శివతత్వం. నిన్ను వంచించి పట్టుకొని పీడించే మిథ్యాహంతను శాశ్వతంగా మట్టుపెట్టేది ఇదే. బుషులైనవారు తమ జీవన గమనంలోని సర్వసమస్యాభారాన్ని పరము శివచరణ సన్నిధికి సమర్పించి ఉదాత్తంగా ఉదాసీనంగా నిశ్చలంగా నిర్మలంగా నిర్భయులై దివ్యతేజో విరాజితులై జీవిస్తారు. వారు సత్యసౌందర్యసముపేతులు. ఆనందరాజ్య సంస్టితులు. ఆత్మను యదార్ధంగా తెలుసుకొన్న

3ెరి రమణోపనిషత్‌ హృదయం (ప్రేమ భావనాపూర్ణమై ఉంటుంది. అందులోనుండి బ్రహ్మానందం నిరంతరం పొంగి పారలుతుంది. అక్కడ కోరికలకు, వారి నీడలయిన దుఃఖాలకు తావులేదు. అట్టి స్వస్వరూపోద్గత నిర్మల జీవనం ప్రశాంత గంభీరంగా ముందుకు సాగుతుంది. సచ్చిత్‌ స్వరూప పరమానంద రసాన్వేషణమే ఎన్నుకోద గిన వైైక లక్ష్యం. నిరంతర స్మరణం, హృదయంలో స్వస్వరూపనిష్ట , ఇదే పూర్ణ జీవన సాఫల్య లక్షణాలు. ఆ పరమాను[గ్రహ జీవనమే పూర్ణ జీవనం. యథార్థ స్వరూపం. మిథ్యా విషయాలకు, భయాందోళనలకు ఆలవాలవుయిన ఈ ప్రాపంచిక జీవనం (భ్రాంతి యొక్క అగాధాల్గోకి దిగబడిపోతూనే ఉంటుంది. అది సాఫల్యయుత జీవనం కాదు.

లోగడ పంచేంద్రియములకు ప్రపంచం యథార్ధంగా తోచింది. ఇప్పుడు దృటప్టి, ప్రపంచంవైపే తిరగటం లేదు. లోగడ నామరూపాత్మకవుయిన మిథ్యాజగత్తు కారణంగా మనస్సు ఖేదమోదాలు పొందింది. ఆందోళితమయింది. ఇప్పుడు చిత్తం శాంతినొందింది. వారి అహంత నశించింది. వారు సుఖదుఃఖాది ద్వంద్వములను అధిగమించారు. జగత్తును వారు ఆత్మగా మాత్రమే చూస్తున్నారు. ఇప్పుడు అను గ్రహయుక్త జీవనాన్ని గడుపుతున్నారు. వారు ఇక ఏ తపస్స్ఫూ చేయనక్కరలేదు.

రమణోపనిషత్‌ 39 15. వుహాత్ములైన జీవన్ముక్తులు పరమాత్మ స్వరూపులు నాకు రూపముంచెే ఉనికికి మూలమైన ఆ ప్రభువు కూడా

రూపంతోటే కనిపిస్తాడు. నేను అశరీరుణ్డి, రూపరహితుణ్ణై అయితే అన్యవిషయ జ్ఞానం ఉండదు. అటువంటప్పుడు భగవంతుడికి రూపం ఉందని ఎలా చెప్పటం? ద్వీరక్రాలంపాటు అవిరామంగా ధ్యానం చేసేభక్తులు ఆ పరవేఎశ్వరునికి అనంత నావఎంరూపగుణాదుంలను కల్పించవచ్చు గాక! ఆయన సత్యస్వరూపం మాత్రం రూపరహితమే. అది శుద్దజ్ఞానం. గీతలో 11వ అధ్యాయంలో అర్జునునితో తనకిష్టమైన రూపముల నన్నింటినీ తన రూపములుగా దర్శించమన్నాడు కృష్ణుడు. పూర్ణశాంతి ప్రభాభాసిత హృదయం నుండి వెలువడే పారమార్ధిక వాక్కు వూత్రవే ఆ సత్‌ స్వరూపానికి చేసే నిజవైన పూజ. సర్వశక్తిమంతమయిన ఆద్యస్వరూపాన్ని సరిగా దర్శ్థింపజేసేది అంతర్జ్యూతి. మాత్రవే. ఆకాళపు నీలివుయో, నావురూపములోకాదు. ఆత్మజ్ఞానులచే గానం చేయబడిన వేదమంత్రాలతో కీర్తింపబడింది పరమాత్మయే. అదే హృదయం. సర్వశాన్త్రువులకు అది కేంద్రబిందువు. ఏదో నావువో రూపవెోకాదు. సూర్యచంద్రుల కలయిక. ఇది నిజంగా అత్యాశ్చర్యకరం,. పైకెత్తిన నటరాజపాదం ఆత్మవిచారణానందానికి చిహ్నం; యజమాని సేవకుని కొరకు ప్రీతితో చేసే అన్వేషణ; హృదయం, వునస్సు - వీని నడువు ఉన్న పరస్పరాకర్షణ. వునశ్చంద్రుడు. పట్టుబడి హృదయ రవి చుట్టూ

40 రమణోపనిషత్‌

నాట్యమాడుతున్నాడు. వివిధ లక్ష్యములను సాధించేందుకు

వెతుకుతూ అన్ని దిశలా పరుగిడుతూ జీవితాన్ని వ్యర్ధం చేయటం మూర్ధ్థత. నిరంతర శివశంకర మౌనసంకేతమైన పరవేశ్వర పాదకమలములపై దృఢనిష్టను అభ్యాసం చేయి. తద్వారా మాత్రమే అహంతా చాంచల్యాన్ని అణవివేయగలవు. హృదయగత వైతన్య నిష్ట కలవారు మాత్రమే నిష్కళంకమైన స్వరూప స్రితిని తెలుసుకోగలరు. మిగిలినవారికి స్వరూపం వచ్చిపోయేదిగా అనగా జాగ్రద్దశలో స్మరించేది, నిద్రావస్టలో మర్చిపోయేదిగా తోస్తుంది.

జ్ఞాని అనిర్విణ్ణుడు. కలవరం చెందడు. శరిరధారి అయి ఉన్నా

జ్ఞానికి కర్మ, ధ్యానము, నిద్ర-వీనిలో వ్యత్యాసము తోచదు, బండిలో నిద్రిస్తున్న వ్యక్తికి ఆ బండి కదలినా, నిల్చినా లేక ఎద్దులను విప్పినా తెలియనట్లే జ్ఞాని చూచేవారికి దేహంగా కనిపిస్తాడు. నిజానికి అతడే ఈ విశ్వమంతా. జ్ఞానిది శుద్ధ మనస్సు. అతడు యావద్విశ్వాన్ని సాక్షివలె చూస్తుంటాడు. అతడి మనసు అద్దం లాంటిది. ఆ సన్నిధికి వచ్చే అజ్ఞానుల తలపులు అందులో ప్రతిఫలిస్తాయి. ఆ తలపులు జ్ఞానివే అని భ్రమిస్తారు. జ్ఞాని ఎల్లప్పుడూ సహజనిస్టలో ఉంటాడు. అది సత్త్వగుణానికి కూడా అవ్వలిది. కర్పృత్వ భావనాబద్దులకు ఒక్కొక్కసారి జ్ఞానులలో రజోగుణం తోస్తుంది. అంత మాత్రాన జ్ఞానిస్టితిని తక్కువ అంచనా వేయవద్దు. దోషం చూచేవారిలో ఉంది. మహాత్ములైన జీవన్ముక్తులు సదా పరమాత్మ స్వరూపంగా వెలుగుతుంటారు. వారికెవరయినీ అపచారం చేసారో ఆ దుష్కృత పాప భారాన్ని వారు జన్మజన్మల పర్యంతం వోయవలసి వస్తుంది. గానుగనాడే కొయ్యకూ

రమణోపనిషత్‌ క! శివలింగానికి నడుమ తేడా తెలియని కుక్క రెంటినీ నాకుతుంది. అలాగే క్షుద్రులు కొందరు మహర్షులలో తమకు మించిన గొప్ప ఏముందని భావించి వ్యవహరిస్తారు. సూర్యుణ్ణి చూస్తూ కుక్క మొరుగుతుంది. దానివల్ల సూర్యునికి ఏం బాధ? అదే విధంగా, నీచులు అవమానిస్తే ఆ అవమూనం వుహర్షులను అంటవు. అమోఘమైన వారి ఉజ్జ్వల జ్ఞాన కాంతులు రవి కిరణములవలె ప్రకాశిస్తాయి.

స్టతప్రజ్ఞుడంటే ఎవరు? అంతర్ముఖత్వానికీ బహిర్ముఖాత్మానికీ వ్యత్యాసం ఎరుగక నిరంతర నిశ్చలస్వరరూప జ్ఞానస్టితిలో నెలకొని వెలుగుతుండే వాడే. స్థిత ప్రజ్ఞాడైన వాడు అహంతారహితుడై శివునిగా ఆత్మగా అంతః స్ఫురణతో ఉంటాడు. అన్ని చలనములనుండి ముక్తుడై అచలమౌన స్టితిలో ఉంచాడు. 16. ముక్త పురుషుని రూపాన్ని సదా ధ్యానిస్తే వునకు సత్యం గోచరిస్తుంది

ఇంద్రియములచే వంచితుడైన అజ్జూని జగత్తును నానావిధ విషయ సముదాయంగా కనుగొంచాడు. కాని హృదయ గ్రంథి విశ్చేదమైన జ్ఞానికి అధిష్ట్రానంగా ఒకే చైతన్యం సర్వత్రా దర్శనమిస్తుంది. జ్ఞాని అస్తమించని రవి. ఆరని జ్యోత్కి స్వయం జ్యోతి. నానారీతులుగా విస్మయావహమై తోచే విషయ ప్రపంచం అమాంతం అదృశ్యమవుతుంది జ్ఞాని సన్నిధిలో, ఆత్మకు భిన్నంగా చూడబడదు కనుకు హృదయంలో ప్రతిష్టితుడై ఆత్మానంద పరవళశుడయిన జ్ఞాని జగత్తును మిథ్యామాత్రమని గాని ఆత్మబిన్నమని గాని భావించడు. మనం ఎటీగిన

42 రమణోపనిషత్‌ ఈ జగత్తుఅంతటినీ జ్ఞాని ఎజుకగా చూస్తాడు. ఎటుక వినా అన్యమేమీ లేదు. ఎజుక కాని ఉనికి లేదని గ్రహించిన జ్ఞాని ఆత్మ చైతన్య రూపునిగా తన్మయానంద ఫ్రీతునిగా నెలకొని ఉంటాడు. జ్ఞానులను ఈ మిథ్యా విషయ జగజ్జీవనం కలవరపెట్టదు. వారి మనస్సులు పూర్జాద్వైతార్థవంలో మునిగి నశించాయి. పరమపావన వైభవోపేతమైన విశుద్ద స్వరూవ జ్ఞానంలో “అహంి * ఇదం” అనేవి లేని “తతొ ఒక్కటే ఉంటుంది. కర్పత్వ భావనా గ్రంథి విచఛేదమైన జ్ఞానికి ఇకపై నిర్వహించవలసిన “విధులు ఏవీ మిగిలి ఉండవు. కృతకృత్యత అది. ఆ జ్ఞానదశలో అన్యులు లేరు విషయములు లేవు. కనుక సందేహం లేదు, భ్రాంతి లేదు. స్వరూప విజ్ఞాన కిరణకాంతి పరినిస్టితుడైన జ్ఞాని మనస్సుకు మునుపటి వలెనే శబ్దస్పర్థురూప రస గంధాదులు తోచవచ్చు. అయినా ఆత్మ విచారణాబలం కారణంగా సంసార బంధము తెగిపోయి ఉంటుంది. విశుద్ధ జ్ఞానమయ జీవనులైన వారు హృదయపు లోతుల్లో జీవిస్తుంటారు. వారికి తుచ్చమగు ఇంద్రియ సుఖాలలో ఆనందం పొడసూపదు. ఆ నిశ్చల మౌన స్వరూప ప్రతియే అఖండ అనంత బ్రహ్మానంద పదవి కాదా? సముద్రంలో కలిసిన నది మరల నదిగా తన ప్రత్యేకత నిలుపుకో జూలదు. స్వరూపజ్డానం పౌొందినవానికి ఆత్మవిస్కృతి గాని పునర్దన్మగాని ఉండవు. మఅపుతో కూడిన మనస్సులు గల మర్తులు మరణించేందుకు జన్మిస్తారు. జన్మించేందుకు మరణిస్తారు. కాని మనస్సు నశించిన జ్ఞానులు పరమాత్మయందు వ్రతిస్టితులై జనన మరణాతీత్సులై పరిఢవిల్టుతారు. తనను తాను ఉనికిగా ఎయికగా చూచినవాడు సదాశివుళ్లి చూచినవాడు. భయంకరమగు ద్వైతం యొక్క మృత్యువును చూచినవాడు. తన సహజస్టితి అయిన

రమణోపనిషత్‌ త్వ తురీయావస్టను చూచినవాడు. అట్టి మవాత్ముడు పునర్జన్మను ఎయబిగనివాడు. ఒకసారి గ్రంథివిచ్చేదమయితే మరల ఆ వ్యక్తి బద్దుడు కాడు. అది అతనికి సహజమయిన ఉనికి. అది దైవీస్టితి. అది పరాశక్తి. అది పరమశాంతి. లోని ఆత్మను పరవూత్మగా దర్శించినవాడు ఈ భూవుండలముపై విరాగియ్టై సంచ రిస్తున్నప్పుడు సాక్షాత్‌ భగవంతుడే ప్రక్కన రక్షకుడై నిల్చి ఏ వాని జరుగకుండా కాపాడుతుంటాడు. మనస్సు నశించిన జ్ఞాని సాక్షాచ్చివుడే. అతడు సమానంగా ప్రతి జీవిలోను జీవశక్తిగా ఉంటాడు. దివ్యమైన అట్టి ముక్తపురుషుని రూపాన్ని సదాధ్యానిస్తే మనలో వెలుగుతున్న సధిధితి స్పష్టమై సాక్షాత్కరిస్తుంది. కోటి సూర్య కాంతులను విరజిమ్ముతూ మరణాన్ని జయించిన జ్ఞానుల కటాక్ష వీక్షణ ప్రసారమాత్రంచేత ఆ కనుల కాంతులలో మున్కలు వేసే భక్తగణానికి అమరత్వం సిద్ధిస్తుంది. తమదైన బ్రహ్మ చైతన్యస్పూర్తి కలుగుతుంది. శివానందలహరిలో తేలియాడే జ్ఞానులు మాత్రమే కోరికల మరుమరీచికలతో నిండిన ఎడారి మనస్సును సారవంతమైన దివ్యక్షేత్రంగా మార్చగలరు. శాంతి తరంగములతో పొంగిపారలే జ్ఞాని హృదయం తనను సమీపించినవారి మనస్సులను ఆనంద తరంగితం చేస్తుంది. అట్టి జ్ఞానాచార్యుని ముఖ మండలంలో ఎంత ప్రశాంతి, ఎంత తేజస్సు, ఎంత ఆనందం! అది పూర్ణ వికసితపద్మం. దాని చుట్టూ తుమ్మెదలు పరిభ్రమించవా మరి? జ్ఞాని అయిన ఆ మహాపురుషునికి విధేయుడై పరిచర్యలు చేసిన వ్యక్తికి మాయాబంధ విముక్తి కలుగుతుంది అను[గ్రహ సంపద

తశ రమణోపనిషత్‌ సవుకూరుతుంది. అట్టి ధన్యుడు సర్వాభీష్ట్రప్రదాయకమైన జీవితాన్ని గడుపుతాడు. గ. జ్ఞానిది అహంతా నాశానంతర దృఢ వరౌననిష్ట శాళ్వతవఎగా సవమయాలవుఎగా సవఎస్త వాసనలను నిర్మూలించిన జ్ఞాని దేహాత్మభావనా ముక్తుడు. అందువల్ల స్వాప్నిక మనస్సం (భ్రమ వినిర్ముక్తుడు కూడా. అల్పజీవులయిన జంతువులు, పక్షులు ఎడతెగక చలించే మనస్సులతో జీవిస్తాయి. జ్ఞానికి ఏ తలపువల్లా మనస్సు విచలితం కాదు. అట్టి అచల స్వరూపుని జీవితమే నిజమైన మానవ జీవితం. వాసనలు నశించిన జ్ఞాని మహాకార్యములను చేపట్టి సాధించినట్లు కన్పించవచ్చు. కాని నిజానికీ అతడేమీ చేయడు. పురాణగాథను వినే జనుల నడుమ మనస్సెక్కడో పెట్టుకొని గంటల తరబడి కూర్చుని యుండే వ్యక్తివలె. జ్ఞాని కర్పత్వ భావన లేకుండా నిష్కామ భావనతో పనులు చేస్తాడు. వాసనలు నశించని వ్యక్తి కదలకుండా కూర్చొనియున్నా తలమున్కలుగా పనులు చేస్తున్న కర్మలంపటుడై ఉండవచ్చు, ప్రక్కమీద నిద్రిస్తూ కొండకొమ్ము పైకెక్కి క్రింద గోతిలో తలక్రిందులుగా పడ్డట్టు కలగన్న వ్యక్తివలె. కర్తృత్వ భావన నశించినప్పుటికీ, ““జ్ఞానిని కర్మబంధములు వీడిన ముక్తపురుషునిగా ఎలా పరిగణించగలం? అతడు తింటూ తిరుగుతూ, పనులుచేస్తూ, రక్తవమాంసమయ శరీరధారియై ప్రారబ్బాన్ని అనుభవిస్తూ, దుఃఖించటం చూస్తున్నాం కదా?” అని నీవడిగతే జవాబు ఇది. “నిజమే. నీ దృష్టికి అతడు దుఃఖితునిగా

రమణోపనిషత్‌ తీవ్‌ కన్పిస్తున్నాడు. అతడు దుఃఖించటం నీవు చూస్తున్నావు. అయితే తాను దుఃభిస్తున్నానని అతడు నీతో చెప్పాడా?”** శరీరం ఒక రేడియోసెట్టు వంటిది. అది మాట్లాడుతున్నట్లు, పాడుతున్నట్లు తోస్తుంది. బ్రహ్మానందానుభూతి స్వస్వరూపానుభవంగా కలిగిన జ్ఞానిని అజ్ఞానులు దుఃఖిస్తున్న ఒక దేహంగా చూస్తారు. అది వారి దోషం. కర్పృత్వ భావశూన్యుడై పరమేశ్వరఆరాధనాతత్పరుడైన జ్ఞాని పుణ్యపాపములు రెంటినీ సంపాదిస్తున్నాడని తోస్తుంది. అయితే పుణ్యం అతనిని కీర్తించేవారికీ, పాపం అతనిని దూషించేవారికీ చెందుతాయి. **“కర్త్పృత్వ భావన నశిస్తే కర్మ లొనర్బటం ఎలా సాధ్యపడుతుంది? మరి ముక్తులు కర్మ లొనర్చటం చూస్తున్నాం కదా?” అని అడిగితే దానికి జవాబు ఇది, *వారు అహంకారరహితులు. వాఠ హృదయస్టుడయిన భగవంతుడే ఆ కర్మల్‌ొ నరిస్తాడు.” జీవన్ముక్తుడు సమాధిస్టునివలె శాంతుడై కర్మ లొనరిస్తాడు. వానిలో “నేను *నాదొ అనే భావం ఉండదు. నిద్రిస్తున్న శిశువు నిద్రలోనే తనకు తెలియకుండా అన్నం తినడం వంటిది ఇది. శిశువుకు తాను అన్నం తింటున్నానని తెలియదు. అన్నం తిన్న అనుభవమూ ఉండదు. కూలివాడు నెత్తిపై మోస్తున్న బరువును గమ్యం చేరగానే క్రిందికి దించుతాడు. అలాగే జ్ఞాని దేహత్యాగం చేయవలసిన సమయం ఆసన్నమైనపుడు బరువును దించుకున్నట్టుగా భావిస్తాడు. . సముద్రజలాల అగాధాల్లోకి మునిగిపోతున్న ఒక అల్ప క్రిమి తలయెత్తి తనను తాను రక్షించుకోగలదా? దేహానికి బందీ అయిన అహంత శుద్ధబోధ స్వరూప మౌన తరంగాల పొంగుపైకి తలెత్తి

4ర రమణోపనిషత్‌ చూడగలదా? ఆత్మస్వరూప దివ్యవైభవ ప్రదిప్తుుయిన అహంకార విరహిత పూర్ణమానసం ఈ విషయ ప్రపంచ దృశ్యాలవల్ల విచలితం అవుతుందా? వుహనీయాద్బుత శుద్దచిదాకాశంలో ఈ మనఃకల్పితానేక మిథ్యా దృశ్యాలు మూర్తిమంతము లౌతాయా? పుట్టిగిట్టే జీవుడు కోరుకోవలసింద్‌, ప్రయత్నించి సాధించవలసింది అయిన ఈ సర్వోత్కృష్ట. దివ్య జీవన్ముక్తి దశా వైభవం ఎట్టిది? ఆత్మను తెలుసుకొనటం, ఆత్మగా ఉండటం, స్వరూప విసృతి కారణంగా చెలరేగుతున్న అహంతను నిర్మూలించటం, ఇవే. కర్పత్వం నశిస్తే కర్తకూడా నశిస్తాడు. అప్పుడు ముగ్గరు భార్యలు అనగా అతని త్రివిధ కర్మలు నిస్సహాయములయి అనాథలవుతాయి. ఈ విధిని తప్పించుకొని ఒక భార్య సనాథగా నిల్చి ఉండగలదా? జ్ఞానికి సంచితాగాములు నశించినా ప్రారబ్దం మిగిలి ఉంటుందని చెబుతారు. కాని జ్ఞానకి ప్రారబ్ధంనుండి కూడా విముక్తి లభిస్తుంది. ప్రారబ్వాధీనవై. జన్మించిన దేహం ప్రారబ్వాన్ని తప్పించుకోలేకపోవచ్చు. నిజమే. కాని చిజ్ఞ్ణడముల నడుమ ఏర్పడిన గ్రంథిని ఛేదించిన జీవన్ముక్తుడు ప్రారబ్ద కర్మాన్ని అధిగమించినవాడు. ఎవరయినా అడుగవచ్చు, * ఈ దేహం ప్రారబ్దం వలన ప్రారబ్బ్దంకొరకు ఏర్పడింది కదా! అటువంటప్పుడు ప్రారబ్దం నశిస్తే దేహం పతనం కాదా?” దానికి జవాబు ఇది. “ముందిది చెప్పు. భౌతికమైన దేహం ఎవరి దృష్టిలో ఎవరికోసం ఉన్నట్లు కన్పిస్తోంది?” చిత్తుగా తాగి మత్తెక్కి కండ్లుగానని మనిషికి తన ఒంటిపై దుస్తులు ఉన్నాయో లేవో అని కూడా స్పృహ ఉండదు. అలాగే సచ్చిన్మాత్ర

రమణోపనిషత్‌ 47 స్వరూపుడయిన జ్ఞానికి అసత్యము, జడము, దృశ్యము అయిన దేహం ఉన్నా, ఊడినా తెలియదు. నీరు కావిరంగు పట్టుబట్ట కాలి బూడిదగా మారినా బట్టగానే తోస్తుంది. అయినా అది బట్టకానట్లే, నిష్కళంకుడు నిరహంకారుడు అయిన జీవన్న్ముక్తుని శరీరం నామమాత్రంగా ఉంటుంది, అతని నిజజీవితాన్ని మరుగుపరుస్తూ. పాము జాడ పాముకు తెలిసినట్లు జ్ఞాని లక్షణం జ్ఞానికే తెలుస్తుంది. అన్యులు ఉన్న విషయం ఉన్నట్టు తెలుసుకోలేరు, తప్పుగా అర్ధం చేసుకుంటారు.

జ్ఞానిది అహంతా నాశానంతర దృఢమౌననిషస్ట ఆత్మజ్ఞాన దశ. బ్రాహ్మీఫ్టితి. పరమానంద బోధ. అది అద్వితీయం. ఆ అనుభవాన్ని ఎవ్వరూ అర్ధం చేసుకోజాలరు. అహంతా నిర్మూలమొనర్చి సచ్చిన్మాత్రునిగా నిత్య జాగ్రత్తులో ఉన్న జ్ఞానికి సాధించవలసింది వురేవుంది మిగిలి? కృతకృత్యడయిన అతడాత్మకంటె అన్యవెంజుగడు. అట్టి తన్మయానందుని స్బతి ఇది అని తెలుసుకొనటం ఎవరికి సాధ్యం? 18. జ్ఞాని బ్రహ్మలోక విష్ణులోక శివలోకములకు ప్రభువు, చక్రవర్తి

జ్ఞాని యొక్క మాహాత్మ్యం వాక్కుతో వర్ణింపనలవి కానట్టి సన్మాత్రస్థితి. అది ఆకాశంకంటె విశాలమైనది, పర్వతం కంటె దృఢమైనది. దానిని జ్ఞాని మాత్రమే తెలుసుకోగలడు. నీకా అనుభూతి లభించాలంటే మొదట నీవు దేహాత్మ భావనను త్యజించాలి. ఆత్మ సకల రూపములను వెలుగ జేయునట్టి రూపము లేని వెలుగు, అది

తం రమణోపనిషత్‌

సన్నిహితము, నిత్య ప్రత్యక్షము అయిన స్వరూప సంపద్ర్వైభవం. అట్టి ఆత్మను సాక్షాత్కరింపజేసుకున్న జ్ఞాని బ్రహ్మలోక విష్ణులోక శివలోకములకు ప్రభువు, చక్రవర్తి. ప్రశాంత గంభీర నిర్వికల్ప బ్రహ్మానంద సాగర నిమజ్జనశీలుడై ఆత్మస్వరూపనిష్టుడై జా గ్రత్‌ సుష్తుప్తియందుండే జ్ఞాని ఈ వినాశకర జగత్తులోకి మరల దిగజారి దుఃఖముల పాలు కాడు. స్వస్వరూపమైన ఆత్మను పోవిడిచి స్వప్నసదృశమైన మిథ్యా జగత్తును చూసి దాన్నికై వెంపరలాడే వ్యక్తి చదువరి కావచ్చు, పండితుడు కావచ్చు. కాని ఆత్మవైతన్య పోద్యలబ్రిగాంచిన వ్యక్తి సంగతి వేరు. అతడు జ్ఞాని. శాస్త్రాలను ఎంతగా శోధించినా అవి మనకు చెప్పేదొకటే, “నీలోని ఆత్మను వెదకు, కనుగొను.** ఎవడైనా అద్దంలోకి ఎందుకు చూసుకుంటాడు? తన ముఖాన్ని తాను స్నష్టంగా చూసుకొని తనకు తాను ఆనందించటానికే! “తెలుసుకోవలసింది ఆత్మనే: అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆది అద్ధంలాగా చేతిలో ఉండగా అదేమిటో, అనేకులు శా(స్తాలనూ భాష్య గ్రంథాలనూ అలా పఠిస్తూనే ఉంటారు. ఏ కొందరో ఆత్మను అన్వేషిస్తారు, దివ్య జీవనాన్ని పొందుతారు. వేదశా (స్తాలను క్షుణ్ణంగా చదివిన పండితునికీ జ్ఞానికీ చాలా వ్యత్యాసం ఉంది. అజ్ఞాన బంధవిముక్తిని కాంక్షించేవారు పండితుల జోలి మాని పరమాత్మ ఫ్రీులైన జ్ఞానుల సన్నిధికి చేరటం శ్రేయస్కరం. స్వరూవ సాక్షాత్కారం' పొందినవాడు జ్ఞాని. అతని కృపావీక్షణ కాంతులలో ఈ విశ్వం నిల్చి ఉంది. అజ్జానాంధకారంలో చిక్కుపడి కొట్టుమిట్చాడుతున్న వారికి జ్ఞాని నోట వెలువడిన ఒక్కమాట చాలు. వారికదే ఊతక[ర్ర, అదే సాధనం, అదే సాధ్యం అవుతుంది.

రమణోపనిషత్‌ శం _ అకర్మణ్యతయే జ్ఞానానికి గుర్తు అని అనుకుంటే నిస్సహాయుడైన కుష్టురోగి యొక్క అకర్మణ్యత సైతం జ్ఞానం అనిపించుకుంటుంది. కనుక ఇష్టానిష్టాల నధిగమించి కర్సత్వ భావన లేకుండా కర్మ లొనర్చటమే నిజమయిన స్టితి. భావ శూన్య సచ్చిదానంద సుస్టితులై జీవనం గడపే వారికి ఏ తలపులతోనైనా ఏమిపని? దివ్యశాంతియే వారి నిత్యానుభవం. ఈ పరమానుభవ దశలో “అన్య మయినది లేదు. పొందవలసింది లేదు. సన్మాత్రస్టితియే తమ నిజ స్వభావమని ఎటిగి తలపులు లేని స్వస్వరూపంలో నిల్చి ఉండే జ్ఞానులు సహస్రాధిక కర్మలొనర్చినా వారు అకర్తలే. కర్మలకు తామే కర్తలమని వారెన్న్షడూ (భ్రమించరు. పూర్ణ ధర్మసాధన ద్వారా సహజ ఆత్మభావాన్ని పొందిన జ్ఞానులు బాహ్యములయిన సాధనా నియమములను పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఏమిచేసినా వారి నడవడిలో ఆత్మసౌందర్యమే తొణకిసలాడుతుంటుంది. ముక్తుడు దేహరహితుడు, సర్వగతుడు ఐనప్పటికి దేహధారియై సంచరిస్తున్నట్లు కన్పిస్తాడు. మూడడుగులతో విశ్వమంతటినీ కొలిచిన విష్ణువులాగా ముక్తపురుషుడు నిరతిశయ పరమవైతన్యాకాశ పరిమాణాన్ని కొలుస్తాడు. కర్మలొనర్చే కర్తకు బహిరంగవములయిన దశేంద్రియములు చతుర్వొధవుయిన అంతఃకరణము ఉంటాయి. కాని ఈ బహిరంగ అంతరంగ సాధనములకు సాక్షిర్ల. ఉదాసీనుడై ఉండే జ్ఞాని కర్మలొనర్చినట్లు తోచినా కర్త కాడు. యదృచ్చాలాభ సంతుష్టులు, విమత్సరులు, ద్వంద్వాతీతులు, శాంతులు, జయాపజయములందు సములు అయిన జ్ఞానులు కర్మలొనర్చినట్లు తోచినా కర్మబద్దులు కారు.

50 రమణోపనిషత్‌ 19. జీవన్న్ముక్తుని గొప్పతనాన్ని అతడు ప్రదర్శించే సిద్ధులను బట్టి నిర్ణయించడం తప్పు. బాహ్య చిహ్నాలను బట్టి ఒక జ్ఞానికి విలువకట్టేవారు నిష్టలులయి భంగపాటు చెందుతారు. జ్ఞాని హృదయంలో వెలిగే దివ్యజ్యోతిని వారు తమ చర్మ చక్షువులతో ఎలా చూడగలరు? జీవన్ముక్తుని గొప్పతనాన్ని అతడు ప్రదర్శించే సిద్దులను బట్టి నిర్ణయించటం తప్పు. సిద్దులుండనీ లేకపోనీ అతడు ఒకేరీతిగా తేజరిల్లుతాడు. సిద్దులనగానే నోళ్ళు తెజిచుకొని అచ్చెరువుతో చూసేవారికి జీవన్ముక్తుని గురించి తెలియదు. లోకం పిచ్చివాళ్ళతో నిండి ఉంది. వారు జ్ఞాని మహత్తును తక్కువ అంచనా వేస్తారు. భ్రాంతికి లోనయ్యే వారి అల్బ మనస్సులు ముక్తుని మహనీయ స్వచ్భస్వరూపాన్ని దర్శిస్తూ అతనిలో ఏవేవో సిద్దులున్నట్లు భావిస్తాయి. ఆత్మసాక్షాత్కారం పొందిన జ్ఞాని గొప్పతనాన్ని అతడొనర్చే అద్భుతాలనుబట్టి నిర్ణయంచటమా? ఇంటి కప్పులోని సన్నని బెజ్జం గుండా గులాబిరంగు కిరణం ఒకటి సన్నగా అందంగా ప్రాకి పొడుచుకుని వస్తుంది. దాన్ని బట్టి సూర్య కాంతి తీక్షణతను కొలువగలమా? దేహము, జగత్తు రెండూ వైతన్య విలసితములే అని తెలుసుకొన్న జ్ఞాని జగత్తుతో తాదాత్మ్యం చెంది జీవిస్తాడు. ఇతరుల దృష్టికి అతడు జగత్తులో ఒక దేహాన్ని ధరించి జీవిస్తున్నట్టు కన్పిస్తాడు. అంతమాత్రాన బాహ్యరూపాన్ని బట్టి ఎవరూ ముక్తుని విలువ కట్టరాదు. శబ్దానికి మూలం సత్తు. అదే చిత్తు. హృదయకుహరంలో అదే నిరంతరం తానుగా వెలుగుతుంటుంది. ఆ అక్షర వస్తువును

రమణోపనిషత్‌ 51

వ్రాసి తెలుపగలమా? ఉచ్చరించే ప్రతి శబ్దానికి మూలమై సత్యమై స్పష్టమైన ఆ పరావాక్కు ఏమిటి? మౌనమే. మౌనం ద్వారానే వటవిటపి సమీపంలో జ్ఞానమూర్తియై దక్షిణామూర్తి బోధించాడు. అసంఖ్య వ్యాఖ్యాన [గ్రంథములు గూడా ఆ అనంత పరబ్రహ్మ స్వరూపాన్ని వివరించలేవు. కాని ఆశ్చర్యం! సద్గురుని మౌనం దాన్ని వెల్లడి చేస్తుంది. అట్టి వౌనం వాక్కుకంటె ఎన్నో రెట్లు శక్తివంతమైనది. సత్యముగా తోచే ఈ అనిత్య జగత్తుకు ఆధారం దేహస్ఫురణ. దానికి ఆధారం స్టిర ఘన దృఢ ఆద్య మౌనం. సత్యమైన మతం ఏమిటి? **అది ఉనికి. కాదు. దానికి ఉనికి లేదు. దానికి రూపం ఉంది. లేదు. దానికి రూపం లేదు. అది అద్వైతం.” ఇలా అస్టిర మనఃకల్పనా మాత్రమైనది కాదు మతం. అది అంతులేని వాగ్జాలమూ కాదు. అది మౌనం. శాశ్వత సచ్చిదానందానుభూతి. వరశౌనానుగ్రహపూర్ణ జీవనం వునస్సులో పరివ్యాప్తవుయి జ్ఞానోదయం కానంతకాలమూ బహువిధ కర్మకాండల ద్వారా ద్వైతస్టిత భేదభావం నశించదు. నదులన్నీపోయి సముద్రంలో కలుస్తాయి. అలాగే అన్ని మతాల గమ్యమూ ఒకటే. అవి అన్నీ తాము నశించి స్టర గంభీర చిదానంద సాగరవుయిన శివునిలో విలీనమౌతాయి. అందువల్ల మతాల పేరిట భేదాలకు తావేలేదు. లోనమునిగి ““నేనెవడను? ఈ మతాల మధ్య భేదాలు గమనించే వాడెవడు” అని విచారణ చేస్తే ఆత్మయే మిగులుతుంది. అహంత దిక్కువూలినదై వూయవువుతుంది. ఆ నిశ్చల వరౌనంలో భేదభావం నిలువగలదా? భేదభావన లేదు సరే, ఆ మహామౌనంలో అభేద భావన ఉందా అంటే, అదీ లేదు. జ్ఞానులు కీర్తించే ఆ అద్వైతం

52 రమణోపనిషత్‌ సమస్త భేదభావ శూన్య ఫ్రితియే. లోతుగా ఆలోచిస్తే ఈ చిక్కు ప్రశ్నలూ వాటికి జవాబులూ రెండూ ద్వైతభాషకు చెందినవి. అద్వైత భాషమౌనం. అది పరావాక్కు. అందులో వేనికీ అవకాశం లేదు. ఆత్మ విచారణాశీలుడైన శిష్యునికీ జ్ఞానసిద్దుడయిన గురువుకూ నడువముసాగే నిరంతర సత్యసంభాషణ ఒకటే. ఆ ఇరువురూ స్వరూపనిష్టలో ఉండటవేు. అపుడు ఇరువు6 మనస్సులూ కలిసిపోతాయి. ఒకటౌతాయి. 20. వరౌనం మోక్షరాజ్యానికున్న ఏకైక ప్రవేశద్వారం సూక్ష్మ విచారణ ద్వారా లభించే పరమానందం ఏమిటి? హృదయంలోని ఆత్మానుభూతి ఏమిటి? అది మిథ్యాద్వైత జ్ఞాన ముక్తమైన శుద్ద వవౌొనం. ఆ అద్వయ శుద్దైక వరౌనానందం౦ దుష్టాహంమతిగత ప్రత్యయ శూన్య దివ్యజ్యోతి ప్రకాశం. అనంత సచ్చిన్మాత్రానుభవం. భావ శూన్య శుద్ద మానసంలో పరిఢవిల్లే మౌనం మోక్షరాజ్యానికున్న ఏకైక ప్రవేశద్వారం. నీవే మార్గాన్ని అనుసరించినా అంతివు ద్వారం మౌనవేం. ఛునస్పంతటినీ కూడగట్టుకొని అవిచ్చిన్నంగా అద్వయ సద్వస్తువెన ఆత్మయందు లగ్నం చేయటమే. పరమోత్కృష్ట. శుద్దమవౌనం. అదే గమ్యం. అంతేగాని మౌనం అంటే మనస్సు యొక్క సోమరితనం కాదు. జడస్ట్రితి కాదు. అజ్ఞానపు చీకటి కాదు. ఆంతరమౌనం స్థిరమైనది. దృఢమైనది. శివుణ్ణి కీర్షించవలసింది నీరవమైన అట్టి దివ్యభాషలోనే. మాటలకందని ఆ భాష్క ఆ మౌనం శివునికి సహజ ఆరాధన. శివునిలో స్వస్వరూపాన్ని దర్శించినవాడే మౌనం యొక్క పూర్ణతను

రమణోపనిషత్‌ 53 తిరిగి పొందగలడు. అతడు శివునితో తప్ప ఇతరమైన దేనితోనూ తాదాత్మ్యం చెందక సతత శివనిష్టలో ఉంటాడు. శివునివలె ముక్తస్టితి యందు నెలకొని యుండి కర్మవిముక్తిని గాంచుతాడు. సంపూర్ణ శరణాగతి యొక్క శక్తీ, సారమూ ఈ మహామౌనమే. ఆ స్థితిలో ఈ నేను ఎవడో, ఈ మిథ్య అహంత ఎవడో విచారించినట్లయితే “నేనూ నశించి నిరుపాధిక నిర్గుణ పర బ్రహ్మమైన ఆత్మలో, స్వస్వరూపంలో విలీనమవుతాడు. ప్రారబ్దం మిగిలి ఉన్నంత వరకు పరమేశ్వరుడు జీవుణ్ణి తదనుగుణంగానే నడిపిస్తుంచాడు. ఈలోగా ఎన్ని ప్రయత్నాలు చేసినా జరీగీ దానిని నిరోధించటం ఎవఠి తరమూ కాదు. కనక మౌనం బూని ఉండటమే వివేకం. సర్వ శక్తిమంతుడైన పరమేశ్వరుని ఆజ్ఞానుసారమే ఏదైనా జరుగుతుంది. దాన్ని కాదని ఎవరూ ఏమీ చేయలేరు. అందువల్ల అన్ని చింతలూ మాని మౌనము బూని ఈ మిథ్యా మానసం ప్రభుచరణ సన్నిధిలో విరతిని పొందటమే వివేకం. అహంతా రూపం మన ఆంతరంగముల యందు ప్రతిబింబించి కదలుతుంటుంది. దాని చలనాన్ని ఆపటం ఎలా? నిశ్చలత్వాన్ని పొందటం ఎలా? అంటే ఆ కదలికలను గమనించవద్దు. దానికి బదులు ఆత్మకై వెదకు. తద్ద్వారా మౌనాన్ని సాధించి అందులో నిల్చియుండటమే వివేకం. అహంతా రహిత చిన్మాత్ర స్వరూప నిష్టయే శుద్ద మౌనమని బుషులు చెప్పారు. తలపులు లేని అట్టి వరౌనవుంటే హృదయవుఎనందున్న ఆత్మను పట్టుకోవటమే.

పెకి చూస్తూ బాహ్య వస్తువులను గమనించటం మాని హృదయస్టాత్మ వైతన్యనిష్టడై ఉంటే అహంత మాయమవుతుంది. _

వడ రమణోపనిషత్‌ అప్పుడు ప్రకాశించే శుద్ధ మౌనమే జ్ఞానగమ్యము. నిద్రపోయేవాడు కలలో ఎన్నో విషయాలు చూస్తాడు. మేల్కొాన్న పిదప అవి అన్నీ మిథ్య అనీ హాస్యాస్పదమైనవనీ తెలుసుకుంటాడు. అలాగే జ్ఞాని కూడా జ్ఞాన స్పతిలో తన జీవితంలోని సంఘటనలన్నీ కల్పనామాత్రములుగా మిథ్యాదృశ్యములుగా కనుగొంటాడు. చీకటిలో పడివున్న వానికి పరవేశ్వరానుగ్రహ కారణంగా స్వస్వరూప దర్శనమైనప్పుడు అతడు శివానందానుభూతిని పొందుతాడు. అంతట శుద్ద మౌనంలో విలీనమై మాయమవుతాడు. అహంత యొక్క సవుస్త విచిత్ర కల్పనలకు స్వస్తి చెప్పి ఆత్మజ్ఞానానంద దివ్యసాగరమయిన మౌనంలో, హృదయంలో మునిగినప్పటి స్టితియే పరావాక్కు అని బుషులు అభివర్షించారు. నిశ్చలత్వవేం పరావాక్కు. అందులోనుండి నేను తలపు ఉదయిస్తుంది. ఆ మౌనం నుండే మంత్రనాదం ఉద్భవిస్తుంది. ప్రశాంత మనస్సుతో భగవంతుని కృపావాక్కును, ఆ పరావాక్కును, ఆ శుద్ధవరౌనాన్ని విననివార్హే *+వీీశానాదం౦ం మధురం, వేణునాదం మధురం, పసిపిల్లల ముద్దు మాటలు మధురతరం? అని చెపుతారు. తలపులు సద్దుమణి గితేనేగొని మౌనములోని అనిర్వచనీయానందం అనుభవంలోకి రాదు. మనోవ్యాపారాన్ని నశింపజేసినవారు మౌననిష్ట నుండి ఎన్నడూ వైదొలగరు, శస్త్రధారులై యుద్ధరంగమధ్యంలో ఉన్నప్పటికీ “నేను దేహాన్ని" అనే మిథ్యాభావన లేకుండాపోయి హృదయంలో సచ్చిన్మాత్ర స్వరూపంగా నెలకొని ఉండటమే మౌనం. *“నేనెవడను అని విచారణ చేయకుండా కేవలం వాక్‌ మౌనాన్ని పాటించడం

రమణోపనిషత్‌ ర్‌5్‌ మనస్సుచేసే గారడీ తప్ప మరేమీ కాదు. వెజ్లిగా అల్బమయిన మిథ్యా విషయాల వెంటబడి పోకుండా అహంత తన మూలంలో అణగి నశిస్తే బ్రహ్మానంద స్వరూపవుగు ఆత్మజ్ఞానవుయ జీవనం తేజరిల్టుతుంది. హృదయంలో మౌనం నెలకొనగా శాశ్వత ఆత్మ జ్ఞానానందామృతం పొంగి పొరలుతుంది. అట్టి వ్యక్తి జగత్తును కన్నెత్తి చూడడు. వురులు గొలిపే అందలి అల్ప విషయ భోగాలకు చిక్కుపడడు. సకల శాన్హ్రముల లక్ష్యముగా బుషులు దర్శించిన సత్యము, సకలధర్మములు ప్రబోధించిన సన్మార్గము ఈ మౌనమే. ఇదే నిర్మల శాంతి, పరమోత్కృష్టస్టితి. స్వచ్చ శాంతియుత మోక సంపత్సమేతుడు ధర్మార్ధ కావుములను సవూలముగా త్యజిస్తాడు. కనుక అన్యలక్ష్యములకు స్వస్తి చెప్పు. మౌనాన్ని అభ్యసించు. మౌనమంటే శివుడు. మౌనమంటే సత్పదార్థ్హము. ఇతర పురుషార్హములు సరియైన సాధనములూకావు, సాధ్యములూ కావు. ఆత్మవిచారణ మాత్రమే స్వస్వరూప శాంత్యానంద స్థితియందు నిలుపుతుంది. తదితర యోగ్య విషయములనన్నింటినీ సయితము సమకూరుస్తుంది. 21. ఆత్మజ్ఞానంలో సర్వసిద్దులు, సర్వళక్తులు కలిసి ఉంటాయి పరాభక్తి అంటే పరమేశ్వరుని చరణములయందుసంపూర్ణ శరణాగతి. అది అఖండ శాంతి. అందు ఏ తలపూ ఉండదు. ప్రా న్రించటము ఉండదు. మొటిపెట్టుకోవటము ఉండదు. దేహంతో ముడివడ్డ అహంతకు అజ్ఞానమే జ్ఞానంగా తోస్తుంది. అజ్ఞానానికి

56 రమణోపనిషత్‌ గుర్తు క్షు[ద్రచింతలుండటం. భగవత్కప ఉంటే హృదయం ఉజ్వ్వలానంద నిలయం అముతుంది. ఆనంద ంతోనిండిన హృదయంలో క్షుద్రవింతలకు తామంటుందా? ఇతర తలపులున్నంత కాలం దైవాన్ని గురించిన తలపుకూడా ఉంటుంది. _ వదలదు. దైవాన్ని గురించిన తలపుతోపాటుగా తలపులన్నీ ఆగిపోతే అది భావశూన్యష్టితి. సద్భావస్థితి, తలపులు లేని తలపు, నిజమయిన తలపు. ఏ తలపూలేని సన్మాత్ర శాంతిస్టితిని తలపు అని చెప్పటం ఎలాగా అని అడుగవచ్చు. దానికి జవాబు ఇది - అప్పుడు మాత్రమే కేవలమగు శాశ్వత సచ్చిచ్చక్తి మరుగున పడక, ఉజ్జ్వలంగా స్పష్టమై ప్రకాశిస్తుంది. అజ్ఞానాంధకారం తొలగి పోయినప్పుడు హృథ్గగనవుండలం ఉజ్జ్వల గంభీర శాంతి వుండలవుయి అంతర(్రేమ స్రోతస్సు ఉవ్వెత్తున పొంగి పొరలుతుంది. అదే పరాఖభక్తి పరమేశ్వరుని మాంగళ్యరూపం. నిరంతరం ఆత్మనిష్టులగు ధన్యాత్ములే సత్యాన్ని సాకాత్కరింప జేసుకొన్నవారు. తదితరులకు ఆ పరవు కృపానిలయం అంతులేని దూరంలో ఉంటుంది. సద్భక్తులంటే ఆత్మనిష్టాపరాయణులే. నిరతిశయ సర్వోత్కృష్ట

బ్రహ్మానంద ప్రాప్తి వారికే.

సిద్దులనేకం ఏవేవో వర్షింపబడ్డాయి. కాని జ్ఞానసిద్దియే అన్నింటిలో తలమానికమైనట్టిది. ఇతర సిద్దులు సాధించినవారు సయితం జ్ఞాన స్రాప్తిక తహతహలాడతారు. జ్ఞానసిద్దులు మరింకేదీ అభిలషించరు. ఆత్మసిద్ది అయితే తత్కాలంలో ఇతర సిద్దులన్నీ లభించినట్లే. ఆకాశంలో ఈ విశ్వం యావత్తూ నిల్చి ఉన్నట్లుగా అత్మజ్ఞానములో సర్వసిద్దులూ సర్వశక్తులూ కలిసి ఉంటాయి.

రమణోపనిషణ్‌ 57 అవి పైకి కనిపించనీ, కనిపించకపోనీ. హృద యుంలోని అగాధాల్గొమునిగినవానికి తాను ఒక దీనహీన మర్వుడనన్న భావం తొలగిపోతుంది. జ్ఞానసమ్ముఖాన స్వర్గాధిపతి ఇంద్రుడు సైతం నతమస్తకుడవుతాడు. జ్ఞానానికున్న సార్వభౌమత్వం అలాంటిది. శక్తి అలాంటిది.

జీవ జగదిశ్వరులన్న మూడు తత్త్వములూ మాయలో భాగాలే. సద్రూపమైన మహావైతన్యం ఆడే చదరంగపుటాటలో ఆటబల్లకూడా అత్మయే, సదానందమే. తెరపై ఎన్నో బొమ్మలు కదలాడుతుంటాయి. బొమ్మలను చూసేవాడు వానికి ఆధారంగా కదలక నిల్చి ఉన్న తెరను చూడడు. కదలని తెరను చూచేవాడు తెరపై కదలాడుతున్న బొమ్మలను చూడడు. సినిమా ఆటలో జరిగేదిదే. సినిమా హాలులో కదలని తెర లేకపోతే కదలాడే బొమ్మ లేదు. కాని చూడు. కదలాడే బొమ్మ లేనప్పుడు కూడా ఆ బొమ్మలన్నింటికీ భిన్నంగా విడిగా తెర నిల్చి ఉంటుంది. బ్రహ్మము కదలని తెర. ఆధారభూమి. ఈశ్వరుడు, జీవుడు, జగత్తు కదలాడే బొమ్మలు. మనం చూసే విషయాలన్నీ మిథ్యాదృశ్యములుు మాయా వినోద మాత్రములు. కదలాడే చిత్రంలో ఒక బొమ్మ అయిన జీవుడు తనలాంటి ఇతర బొమ్మలతోపాటు ఈ జగచ్చిత్రాన్ని చూస్తాడు. ఈళ్వర చిత్రాన్ని చూస్తాడు. ఈ జగచ్చిత్రంలో భంగపడి దుఃఖిస్తాడు. ఆత్మ కదలని తెర. ఆధారభూమి. మనం కదలాడే బొమ్మలవుని భావిస్తాం. అందువల్ల దుఃఖానికి లోనవుతాం. యోగ్యమయినదేమిటంటే - ఈ మనస్సంచలనాలన్నీ ఆగిపోయి, మనం సంపూర్ణ మౌననిష్టలో ఉండిపోవటమే.

58 రమణోపనిషత్‌ 22. సమస్త కామ్య విముక్తశుద్ద్ధ సత్‌ గానుండుటే ముక్తి ““బద్దుడెవరు?”” అని విచారణ చేసి బంధభావనను, దానితో పాటుగా బంధవిముక్తి భావమును వదల్పుకుంటే హృదయంలో * ఉన్న వస్తువు స్వరూపంగా మిగులుతుంది. అదే ముక్తి అంటే. విశుద్దజ్ఞానంగా సంపూర్ణ శాంతిగా వెలిగే ఏకాత్మవస్తువే పరమేశ్వర స్వరూపం. అది అహంతారహిత మౌనం, పరమాత్మస్వరూపం. అదే ముక్తి అంటే. దృశ్యములన్నింటికీ ఆధారమూ అధిష్టానమూ -_ ఎటుక, అదే అత్మ ఆత్మవిచారణ ద్వారా పరమశాంతిని పొంది, నిశ్చల దృఢనిష్టలో ఉండటం, అసత్యములని తెలుసుకొని సమస్త విషయములను పరిత్యజించటం, - అదే ముక్తి అంటే. బహిర్విషయ జ్ఞానం అంతం కానంతవరకూ ఇం ద్రియనిర్మిత జగద్బంధ విముక్తి ' లభించదు. ఈ విషయజ్డానం ఆత్మయందలి దృఢనిష్టవ్యల్ల నశిస్తుంది. అప్పుడు మిగిలేది ముక్తి. బ్రహ్మానందం. కామమే మన శత్రువు. జన్మమృత్యుబంధ కారణమీ కామమే. కనుక తెలుసుకో. కోరికలను నిర్మూలించేందుకు సాధన చేయి. సమస్త కామ్య విముక్తమైనది శుద్ధ సత్‌ స్వరూపం. అదే ముక్తి అంటే. బుషులు దర్శించి వెల్లడించిన వేదసారమయిన అంతిమ సత్యం ఇది. ఆత్మజ్ఞానమే శుద్ధ బుద్ద సద్రూపము. అ ఆత్మజ్ఞాన దివ్యప్రకాశములో జీవించటవేం పరమోజ్ఞ్య్వలమగు ముక్తి. సృష్టిలేదు. సంహారం లేదు. బద్దులెవరూ లేరు. ముక్తికై సాధనవేసే వారులేరు, ముక్తిని పొందేవారే లేరు. పరమసత్యమిదే అని గ్రహించు. ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నదిగా కన్పింపజేసేది

రమణోపనిషణ్‌ 59 వూయయే. శుద్ద స్వరూపంలో ఈ వాయలు భ్రాంతులు పనిచేయవు. సత్యము ఒకటే. విషయములన్నీ చిన్మయ మాత్రములు. ““ధాన్యం నుండి పొట్టును విడదీస్తే బియ్యం వచ్చినట్టుగా జీవునికి బంధ విముక్తి అవుతుంది, ఆత్మ లభిస్తుందొ” అని చెబుతారు. ఈ బంధముక్తుల భాష అంతా జ్ఞాన రూపమగు ఆత్మలో తోచే రుజాగ్రస్త మనోభావన.

నీవు ఉన్నాయనుకునే విషయాలు నిజానికి లేవు. ఉన్నదని గాని లేదనిగాని చెప్పలేనట్టిద్క, నీ వెటుగనిద్కీ అయిన ఆ వస్తువు మాత్రమే ఉన్నది. ఆత్మయే పరమసత్యం. అది జ్ఞానరూపం. అది తెలియబడదు. పరస్పర భిన్నములై అసంపూర్ణములైన వివిధ విషయుజ్ఞానవఎలనుఎ ఏకీకృతవెఎనర్చి తనయుందు విలీనమొనర్చుకొనే సర్వవ్యాపక సర్వాతీత పరమసత్‌ స్వరూపాన్ని లేదన్సీ కాదనీ అనగలదా నిస్సారమయిన ఈ మనస్సు? “అది ఉన్నదా, లేదా?” అని తలంచక నిశ్చలంగా ఉన్నట్లయితే ఆ నామరూప రహిత సద్వస్తువు “నేనున్నాను అని సదా వెలుగుతుంది. అదే ఎటుక. అదే ఉనికి. అనాది అయిన షడ్డర్శనవములలో అద్వైతమొక్కటే అంతం లేనిది. మాయ అంతం అయితే మిగిలిన ఐదూ అంత౦కావలసిందే. ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. షడ్డర్శ్గనవఎటలలో అద్ద్వైతవెుక్కటే సవ్చిదానందవుఎను మాయాతీతమైన పరమాత్మ స్వరూపంగా పేర్కొంటుంది. సత్యము ఒక్కటే. అది శాశ్వతమైనది. సంపూర్ణమైనది. సూక్మబుద్దులైన బుషులు హృదయంలో దానిని అన్వేషించి, అనుభవించి, అనేక రీతులలో వర్షించారు. మతాలు ఎన్నో ఉన్నాయి. వాని అన్నింటిలో

60 రమణోపనిషత్‌ అద్వైతమే మకుచాయమానమైనట్టిది. అది మౌనం. శుద్దజ్ఞానం. వుతాల నడువు ఈ విభేదాలు సృష్టించిన అహంతను, ఆ విషయబీజాన్ని నశింపజేసి అద్వైతం తాను మిగులుతుంది. ఆ ఏకైక సత్‌ స్వరూపానికి మొదలు లేదు. తుది లేదు. మార్పులేదు. కారణంలేదు. అది అనన్యం. అద్వితీయం. ఆ పరమోన్నత లక్ష్యాన్ని సాధించినవారు జ్ఞానులు. మిథ్య అయిన మనస్సుకు అది అందదు. సర్వం శ్రీరవుణార్ప్చణవుస్తు సకలా ళా ' టా ఉం (ఉ00 జ ల9 69 ను ॥ శ న త్‌ వకవ న్‌ా

న నం న వనన నా 7 గ కక 1 ననన మ్‌ చే క 11 సి | ళ్‌ | ననన శ న ॥ . ప. వ. " . య పి! | “ఇ. శ " త్త. 11 నంటే . " గ. " లై... | న “టి ం ( జ. హ్‌ త! ,! శై వ క్షా [| _ ॥ | [| 1 ఖ్‌ న. జీ. - కై. ం. ||| వ! |. టి. శ, తో | + "ఖై వినా. / ॥ | *. వలీ! ,! (క్‌ ఖీ. | న (; మ. వచే త్న (- +! 1. 11 టూ 158%: 81-88225-70-3

Clone this wiki locally