Repository navigation
Telugu Manjusha
మంజూష (ఆధా ల సత్మిక సాహితి*క వాసన ల" ం ళా సహజ కవి మల్లెమాల ! | వ. మనసుపడి మక్కువతో సేకరించిన . - ఈ పుస్తోన్నిసాహిత్యాణిమానుల కోసం ౦ (| సుందరయ్య విజ్ఞాన కేంఠ్రానికీ . . ఆనందంతో బహూకరిస్తున్నాం షః _ చుల్లెమాల కుటుంబం ష్ట్ర దనోేి 9 జ్వత్రరా సి: గ్రహం ని ను 1. ఇ దా॥ కే. రాజన్నశాస్తి క్ర వై .
మంజూాపష్మ (ఆధ్యాత్మిక సాహిత్యిక వ్యాససమాహారము) భయా పటం అత్హ మ్... శ్ర గ్ జాన్ (4: ఎం శ్వ ఉషా 0 ఇనత్రలుసం్, దా! కే. రాజన్నశాస్త్రీ
కం గే 3542641100 దే స దృ్యయో యురి . న 09165 : 500 5411720402 వఏ22 1925 5౪200220 సెసషగ252261 18-2-2004 91166 : మ.200/- 0016 622 6 136 [011 ; ఏవం మ. 22002 ఏంటా (4 షల461 ౦.౮) 10-115. ౫627 60016 ౨14౧౫42011 జీ గ న లీ గా క : 505425 ఆ 006 స : 08724 - 273302 లిం 2) 52090142 982082 ౯211272 5201141 క్ 5-4-7]3/0 ౫20021 5102 [026 శసడలా2026ే = ఓ వ1026 స0 : 24615481 క చ్యో శంఠొాలయ నా 2 0గ౯- 56660803, శ యా క్రీ 0081. ఈ/6-] రో ర భర్ | న €:2321 4133 (రై గంటల. కీ ఖ్ భ్ 006 56409 : స " సజ్చాల్రి వాదీ ల 0. క2గులయళ20 నలా కక. 6౮౯౫28౮, 2౧02110 ర/ర-! (రై. 232] 4! 33
1॥ సద్గురు ఆనందవనం శ్రీ. కే. శివానందమూర్తి భీముని పట్నం-531163 విశాఖ పట్నం - ఆం.ప్ర. శుభాకాంక్షలు వాక్టర్ శ్రీ కే. రాజన్నశాస్తీి మంచి సంస్కృతాం(ద్రభాషాజ్ఞులలో ఉత్తమ- శ్రేణికి చెందిన పండితులు. “మంజూష పేరు గల్గిన ఈ గ్రంథము నేటి సమాజమునకు మన 'హైందవమతమునందలి ఈశ్వరారాధన, దేవీతత్తము మొదలగు విషయములతోపాటు సంస్కృశాంధ్రసాహిత్యము లందలి విమర్శనాత్మక విషయములనుకూడా విపులీకరించినది. సారస్వతాభిరుచిని కలుగజేయటం, మన సం్రదాయసిద్ధమగు వ్యాకరణ జ్ఞానావశ్యకతను నిరూపించుట మొదలగు ఉత్తమఫలములు ఈ [గ్రంథము యొక్క ప్రయోజనమని నేను భావింతును. వీరి పాండిత్యప్రతిభకు పూర్వమే ప్రచురించబడిన “నిబంధ రత్న సముచ్చయ' మను సంస్కృత[గ్రంథము నిదర్శనము. వీరి ఈ “'మంజూషు పతితృలోకమునకు సాహిత్యాభిరుచిని కలిగించుటలో తప్పక ప్రయోజనకారి కాగలదని నా విశ్వాసము. శ్రీ రాజన్నశాస్త్రి గారిని హృదయపూర్వకముగా అభినందించుచున్నాను. శుభం భూయాత్ సం/- 28-1-2004 శివానందమూర్తి
[౪/ 0౧౦.౧1౧2గ౧౭|4 చీకటిపల్లి 0;01.&4646 ౨6౧౪ 0 161౪6006 హైద్రాబాద్, ఆం.ప్ర ॥ వన ౦౮.(౧910) ఫోన్ నెం : 27661034 [10౧౫| ౧6454100 ౧౧౦8950! 7-2-2004 పస్పశము తెలంగాణం కరీంనగరం జిల్లాలో వేములవాడ, మంథని, ధర్మపురి శ్రేతాగ్నుల వంటి ప్రాచీన పుణ్యక్షేత్రాలు. - అందులో మంథని, ధర్మపురి రెండూ గోదావరీ గంగ తీర్థక్షేత్రాలు. ఆ (గ్రామాల్లో వేదములు గాదెల పోసిన విప్రులు, ఆహితాగ్నులు పౌరాణిక ప్రవరులు, రామాయణ భారత భాగవత కథా మర్శ్మజ్ఞ్డులు, (శౌతస్మార్త కర్మ ధర్మనిష్టాగరిష్టులైన ద్విజులు, గార్జపత్యాగ్నిని తరతరాలుగా కాపాడుతూ ఉంటున్నారు. ధర్మపురి ప్రాచీనమైన లక్ష్మీ నరసింహక్షేతం. - ఒకప్పుడు తెలుగుదేశమంతటా వీథిబడుల్లో పాఠ్యంగా ఉండిన “దుష్ట సంహార నరసింహ దురిత దూర” ముద్రగల నరసింహశతకం ఇక్కడి దేవుని మద శేషప్పకవి రచించినదే. ఇక్కడ గోదావరీ గంగలోని బ్రహ్మగుండంలో శాపవశమున పొమైన భర్తతో స్నానం చేసిన సుందరి - కాళ్ళ్మీరరాజు ధర్మాంగుని కోడలు - శాపముక్తుదైన. రత్నాంగునితో ఈ నరసింహస్వామిని సేవించి తన దేశానికి తిరిగి పోయిన కథ - ధర్మాంగద పాము పాటగా - దేశమంతటా పండిత పామర జనరంజకమైనది, ఈ ధర్మపురి మాహాత్యం చాటేదే. “ఇచట పుట్టిన చిగురొకొమ్మైన చేవ” ఇట్టి ధర్మపురిలో సనాతనాచార పరాయణులు భారద్వాజసగోత్రులు కొరిడె కృష్ణయ్య గంగాబాయమ్మ (శ్రోత్రియదంపతుల నోముపండి ఈ గ్రంథకర్త డా॥కొరిడె రాజన్నళాస్రిగారు (1933) జన్మించినారు. రాజన్నశాస్త్రి బాల్యం చదువు సంప్రదాయ పద్ధతిలో ధర్మపురిలోనే సాగినది. రామాయణ భారత భాగవతాలు ఆర్భవాజ్ఞయం పిన్ననాటనే ఆకళించుకున్న రాజన్నశాస్త్రి నాటి ప్రఖ్యాత నిద్వాంసులు తాడూరి బాలకృష్ణ శాస్త్రి గొల్లపల్లి సాంబశివశాస్త్రి, పాలెపు వెంకటరాజశాస్రి గారల వద్ద ప్రాచీనపద్ధతిలో సంస్కృతం వ్యాకరణాలంకార తీర వేదాంత శాస్త్రాలు అభ్యసించినారు. స్వయంకృషితో ఆయా శాస్త్రాలు అధిగమించి నిర్జష్టమైన కవిత్వం, శాస్తవిచారపటిమ సంపాదించి తమ కవిత్వము, వ్యాసాల ద్వారా ఆంధ్రేతర ప్రాంతాలలో వాసికెక్కినారు. అంతచిన్న వయసులోనే పూరీ గోవర్ధన పీఠాధిపతులచేత (1956) “సాహిత్యరత్న” బీరుదమందినారు. డిగ్రీలు లేని పాండిత్యం ఆధునిక కాలాన రాణించదు కదా! అందుచేత శాస్త్రిగారు
౪
ఆంధ్రవిశ్వవిద్యాలయం వారి సంస్కృత సాహిత్య విద్యాప్రవీణ పరీక్షలో (1961) ఉత్తీర్డులై కరీంనగరం జిల్లాలోని _సుల్తానాబాదు, రాయకల్లు, చొప్పదండి, ధర్మపురి గ్రామాల్లో సంస్కృత తెలుగు పండితులుగా ఉద్యోగం చేసినారు. కేంద్ర ప్రభుత్వం సంస్కృత సాహిత్య పరిశోధనకై శాస్త్రిగారిని ఎంపిక చేసి ఉపకారవేతనం ఇస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత అకాడెమాలో (1964-66) వారణాసి ధర్మసూరి విరచిత సాహిత్యరత్నాకరం పై గొప్ప పరిశోధన చేసినారు. ఇంత కాలం శాస్త్రిగారు కరీంనగరం జిల్లా వివిధ పాఠశాలల్లో ప్రదర్శించిన విద్య ఇరుకుటింటి సాము. హైద్రాబాదులోని పండిత మండలులు, సాహిత్యసంస్థలు ధార్మికసంస్థలు, కళాశాలలు శాస్రిగారి విద్యావైదుష్యం ప్రకటించటానికి విశాలరంగస్థలములైనపి. ఇనుమడించిన ఉత్సాహంతో శాస్త్రిగారు 'పైవేటుగా చదివి ఉస్మానియా యమ్.ఓ.యల్ (1969) ఎం.ఎ. తెలుగు (1972) పరీక్షల్లో ఉత్తీర్ణులై 1972 సం॥ సికింద్రాబాద్ సర్దార్ పటేల్ కాలేజిలో ఆంధ్రోపన్యాసకులుగా చేరినారు. శాస్త్రిగారికి యు.జి.సి ఫెలోషిప్ లభించిన తరువాత “ధ్వని-మసుచరితము” విషయముపై పరిశోధన చేసి 1980 పి హెచ్.డి. డిగ్రీ పొందినారు. భభవదనుగ్రహంతో రాజన్నశాస్రి గారికి 1981 సం॥ ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్తర కేంద్రంలో ఆంధ్రోపన్యాసక పదవిదక్కింది. 1993 సం॥ ఆయన రీడరుగా రిట్రైరైనారు. నల్గురు పిహెచ్.డి. పరిశోధకులకు పర్యవేక్షకులైనారు. ఇది రాజన్నశాస్తిగారి డిగ్రీలు, ఉద్యోగాలకు సంబంధించిన సంక్షిప్తపరిచయం.
రాజన్నశాప్రిగారు 'హైద్రాబాదుకు వచ్చిన తరువాత ఇక్కడి సాహిత్య సంస్థలు, పండిత పరిషత్తులు, దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాలు ధార్మికసంస్థల్లో పురాణగోష్టులు జగద్దురువులసన్నిధిలో జరిగే విద్వద్గోష్టులు, కాశీనుండి కన్యాకుమారిదాకా ఉన్న గీర్వాణభాషా సంస్థలు వారివిద్యావైదుష్యం కవితా పాటవం వ్యాఖ్యానపటిమ ప్రదర్శించటానికి అనువైన వేదికలైనవి. శాస్త్రిగారు మనదేశంలోని సంస్కృతపత్రికల్లో అనేకకవితాఖండికలు వ్యాసాలు వ్యాఖ్యానాలు (వకటించి భారతదేశంలోని 'ప్రముఖపందితులలో ఒకరుగా గుర్తింపు పొందినారు. వారిసంస్కృ్రతరచనలు ఆంధ్రదేశంలోని సంస్కృతభారతి, ఆరాధన, భారతి, వివేచన, వంటి ప్రతికల్లోను వివిధ సంస్థల ప్రత్యేక సంచికల్లోను రాష్ట్రేతరములైన (1) వారణాసివిశ్వవిద్యాలయసారస్వ్పతీసుషమా. (2) సాగర్ విశ్వవిద్యాలయం 'సాగరిక' (3) భారతీయ విద్యాభవన్ వారి సంవిత్ (4) స్వాధ్యాయ మండల్వారి “అమృతలత” (5) వారణాసి ధర్మమండలి సూర్యోదయః (6) మద్రాసు రామకృష్ణ ప్రభ మొ॥ పత్రికల్లో అచ్చైనవి
౪
రాజన్నశాస్రి గారు సంస్కృతాంధ్రాల్లో ప్రకటించిన ప్రామాణిక గ్రంధాలు చాలా ఉన్నవి. అందులో కొన్ని సంస్కృత (గ్రంథాలు. (1) వారణాసి ధర్మసూరి విరచిత సాహిత్యరత్నాకరానికి 'నాకా-మందరం' అనే రెండు ప్రాచీన వ్యాఖ్యానములున్నవి. శాస్రిగారీవ్యాఖ్యానాలను సుష్టుగా పరిశీలించి తమ లఘువ్యాఖ్య సంతరించినారు ఈ ఉధద్గంథం ఉస్మానియా సంస్కృత అకాడెమి పక్షమున మూడుభాగాలుగా 1972, 1974, 1981 సంవత్సరాల్లో వెలువడింది. ఆ గ్రంధం రాజన్నశాస్త్రిగారిని యావద్భారతంలోనిగొప్ప పండితులవరుసలో చేర్చింది. (2) శాస్త్రారి సంస్కృతకవితాసంకలనం “సామనో౩.ఐజలికొ పేరుతో టిప్పణీసహితం (1978) వెలువడింది. అందులోని 16 కవితాఖండికలు గీర్వాణగిరాంధురంధరులమెప్పు పొందినవి (3) శాస్త్రిగారు రచించిన సంస్కృత నాటకం “వసుమతీసుధాకరమ్”. అందులోని ఇతివృత్తం భూసంస్కరణలు. ఇది ఆకాశవాణి ద్వారా (1973) ప్రసారమైనది (4) శాస్రిగారు తమ గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామికి “ధర్మపురీ లక్ష్మీ నరసింహ సుప్రభాతం” పేరుతో రచించి పాడిన మేల్కాల్పులు ఆ దేవస్థానం వారే 1971లో ప్రకటించినారు. అవి ప్రతిదినం, స్వామివారి ప్రభాతసేవలో వినియోగమై భక్తుల హృదయ కమలాలు వికసింపజేస్తున్నవి (5) రాజన్న శాస్ర్రిగారు రచించిన “సంస్కృత పథప్రదర్శిని” సురభారతిసమితివారు 19938 సం! ప్రకటించినారు. ఈ (గ్రంథం సంస్కృతభాష సులభంగా నేర్చుకోవటానికి ఉపకరిస్తుంది. (6) “కవితా విపంచీ” శాస్త్రిగారి సంస్కృతకవితాఖండికల సంకలనం ఈ కవితా ఖండికలు టిప్పణీసహితంగా 1999 సంః॥ ప్రకటించినారు. (7) శాస్త్రిగారి కవితాఖండదికలు కొన్ని, కేంద్రసాహిత్య అకాడెమో వారు (1992) ప్రకటించిన “షోడశీ” కవితా సంకలనంలో, ఢిల్లీ దేవవాణీపరిషత్తువారు ప్రకటించిన “అర్వాచీన సంస్కృతం” లో (1997) శాస్రిగారిపరిచయం అచ్చైనవి. మరియు డా॥ రాజేంద్ర మిశ్ర (9016336 & 626 5409 000౬ ౨ ౮౧1౪౫10 501112) గారి సంపాదకత్వమున 2001లో ఢిల్లీ సంస్కృతఅకాడెమో వారు ప్రచురించిన “విశంతి శతాబ్టీయ నంన్కృతకావ్యామృతం” అను (గ్రంధంలో శాస్త్రిగారి కవితాఖండికలపరిచయం (ప్రకటింపబడింది ఈ మూడు సంకలనాలు రాజన్నశాప్రిగారికి భారతదేశంలోని ఆధునిక సంస్కృత కవుల్లో సముచిత స్థానం సంపాదించినవి.
శాస్త్రిగారి తెలుగుగ్రంథాలు కూడ బహుళాదరం పొందినవి. (1) హైద్రాబాదు శ్రీ విద్యా సేవాసమితిపక్షమున దేవీభాగవతం 8 స్కంధాలకు అనువాదం 1984 అచ్చైనది. (2) శాస్త్రిగారు తమ 11.0 పట్టాకోనం రచించిన సిద్ధాంత (గ్రంధం
౪||
“ధ్వని-మనుచరిత్రము” మేల్తరమైన పరిశోధన (గ్రంథం. ఇది మనుచరిత్రలోని వృత్తి అలంకార, రస, ధ్వని, వ్యంగ్యాది సాహిత్యశాస్త మర్యాదలన్నింటికి లక్ష్యలక్షణసమన్వయం చెప్పే వ్యాఖ్యాన ప్రాయమైన సిద్ధాంతగ్రంథం 1988 లో అవ్వైనది. (3) ఆంధ్రమహాభారతం 'దోణపర్వం పంచమతఆశ్వాసానికి శాస్త్రిగారు 1895 లో (వ్రాసిన ప్రతిపదార్ధ తాత్పర్య విశేషాంశ సహితవ్యాఖ్య తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ సంవత్సరం ప్రకటిస్తున్నారు.
రాజన్నశాస్ర్రిగారు చాలా మంది పండితకవుల[గ్రంథాలకు పీఠికలు ఉపోద్దాతాలు సంతరించినారు. ఆ రచనలు కూడ శాస్త్రిగారి నిశిత పరిశీలన విద్యావైదుష్యం ప్రకటించేవే. అందులో కొన్ని (1) వానమామలైవరదాచార్యుల వారి “వైశాలినీ” నాటకం (1975) (2) ముదిగొండ వీరభద్రమూర్తిగారి “వీరభద్ర సుప్రభాతం” (1980) (3) గౌరీభట్ల రామకృష్ణ శాస్త్రిగారి “ఏకవీరకుమారీయం” (1984) (4) విద్వాన్ నరసింహ శాస్త్రి గారి “రాజతరంగిణొ”” 5వ భాగం (1984) (5) కే.వి. నరసింహరాజుగారి “మేఘసందేశం” (1987) (6) వేదాంతం కాశీనాథం గారి “శ్రీరుద్రస్తోత్రం” (1987) (7) విఠలదేవుని సుందర శర్మగారి “శంభుశతకం” (1982) (8) “సరస్వతీ వైభవమ్” పేరుతో వెలువడిన సరస్వతీస్తోత్రసంకలనం(1990) (9) వాసాల శౌరిగారి “సుమగీతాలు” (1997) (1౧] యన్. జనార్దన రెడ్డి గారి “భగవద్గీతా వివరణము” (11) కొరిడె రామారావుగారి “శ్రీ లక్ష్మీనారసింహ శతకం” (12) బ్రహ్మన్నగారి నరహరి శర్మ గారి “రాజరాజేశ్వరయశోభూషణమ్” (13) దోర్చల విశ్వనాథశర్మగారి “అమరుకశతక ప్యాఖ్యానం”. (అముద్రితం),
రాజన్నశాస్ర్రిగారి, గీర్వాణాంధ్రభాషాసేవలకు మెచ్చి వారిని జగద్దురువులు, ప్రభుత్వంవారు సాహిత్యసంస్థలు సన్మానించిన సందర్భాలు కొన్ని (1) శ్రీ శృంగేరీ జగద్గురువులు శాష్టిగారిని తమ ఆన్థానపండితునిగా నియుక్తి చేసి సన్మానించటం గొప్ప సంఘటన (1992) (2) సారస్వత జ్యోతి మిత్రమండలి వారి ఉత్తమ అధ్యాపక పురస్కారం (1992) సర్వార్ధ సంక్షేమ సమితి వారి శాస్త్రపండిత పురస్కారం (1994) (3) దివాకర్ల ట్రస్టువారి దివాకర్ల సాహితీపురస్కారం (1987) (4) హిందూపురం స్వర్ణభారతీ సాహిత్య వేదిక పక్షాన శాస్త్రిగారికి ఉత్తమసంస్కృతకవిగా స్వర్ణభారతీపురస్మారం లభించింది(1998) (5) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారు ఉత్తమసంస్కృత పండితులుగా ప్రతిభాపురస్మారమిచ్చి గౌరవించినారు (1999) (6) జ్యోత్స్నా కళాపీఠంవారి మిలీనియం
౪||
ఉగాది పుఠస్మారం (2000) (7) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వందారి విక్రమ ఉగాది పురస్కారం (20౧0) (౪) దేవాదాయ శాఖవారి పండితసత్మారం (2000), (9) శ్రీ రాజశ్యామలా సంస్కృత సాహిత్య కళాపీఠం వారి పండిత సత్మారం (200), (11) శ్రీ కందుకూరి శివానందమూర్తిగారి అమృతోత్సవ పండితసత్కారం (2003) .
రాజన్న శాస్త్రిగారు ప్రస్తుతం ప్రకటించిన [గ్రంథం “మంజూష”. ఆధ్యాత్మిక సాహిత్యికవ్యాససమాహారం. అశ్చిన్యాదిరేవతీపర్భంతం సక్ష్మత్రాల వలె ఇందులో 2? వ్యాసాలున్నవి. మొదటి 9 ఆధ్యాత్మికములు, తరువాతి 18 సాహిత్యికములు. సాహిత్యవ్యాసాల్లో 8 తెలుగుకు 8 సంస్కృతానికి సంబంధించినవి: మిగతా రెండింట్లో (1) వ్యాకరణ ప్రయోజనం (2) సంస్కృత ప్రాధాన్యం వివరించే వ్యాసాలు. మొదటి 6 వ్యాసాలు ఆధ్యాత్మిక జిజ్ఞాసువు లందరికి పరమోపాదేయములు. భారతీయుల ఆధ్యాత్మికరహస్యాలకు మూలాలు నిక్షిప్తమైన నమాచారం వీటిలో ఉన్నది. రుద్రాభిషేకమహిమ్లు చిన్న వ్యాసమే అయినా శతరుద్రీయం వలె అమృతత్వం ప్రసాదిస్తుంది. శివభక్తి మహిమను కూడా చిన్న వ్యాసమే ఐనాకూడా ఆశుతోషిలసుగ్రహం మనసుకు హత్తింప జేస్తుంది. "భక్తియోగము దానిప్రాధాన్యము” భాగవతం, నారద శాండిల్య భక్తిసూత్రాలు, భక్తిరసాయనం, భగవద్గీతలసారం ముముక్షువులకు కరతలామలకం చేస్తుంది. “దేవీ భాగవతము - శ్రీదేవీతత్తము” సొందర్భలహరి - పరదేవతాతత్త్వము ఈ రెండు అత్యంతగహనమైన విషయాలు సులభ సుందరంగా బోధిస్తవి.
- “భారతీయసంస్కృతి - వేద ప్రాధాన్యము” వ్యాసము దేహానికంతటికీ రక్త ప్రసారం చేసే గుండెకాయ ఎట్లో మన సంస్కృతి సజీవంగా ఉండటానికి వేదం అటుపంటిదని నిరూపింస్తుంది. “గీతా సుగీతా కర్తవ్యా” “ అహింసా పరమో ధర్మః”, “సత్ర్రవర్తన - ధనము” అనే మూడు వ్యాసాలు నిరీశ్వర వాదులు కూడ తలఎత్తుకొని (్రతుకటానికి అనుసరింపదగిస సర్వమత సమ్మత ప్రవర్తనా సియమాలను బోధిస్తవి.
సాహిత్యికవ్యాసాల్లో “శ్రీమద్రామాయణం - భరతుడు”, “వ్యాస మహాభారతము- కరుడు, * ఆంధ్రమహాభారతము -తిక్యన అనుసృజనకొళలము”, “కవిసమయములు”, ఈ నాలుగు శీర్షికల వ్యాసాలు నాలుగు పి.హెద్.డి సిద్దాంత[గ్రంథాలకు 5౫/౧0:13 లు. “జగన్నాధపండితరాయల కొవ్యమాధురొ, "క్షేమేంద్రునిరచనలు - లోకాజ్ఞానానికి నీరాజనాలు", “నైషథీయ చరిళము-శ్రీ హర్షుని (ప్రతిభాపాందిత్యములు”, ఈ మూడు వ్యాసాలు శాస్త్రిగారి సూక్ష్మ పరిశీలనలోతులారసిన వివేచనా దర్చణాలు. “మయూరః
౫
జాతీయవిహగకొ వ్యాసం మయూరానికున్న పౌరాణిక ప్రాశస్యం చాటే ప్రామాణిక లఘువ్యాసం, వసుచరిత్రను గూర్చిన రెండు వ్యాసాలు పూర్వ వ్యాబ్యాతలు గమనించని, ఆధునికులూహించని సాహిత్య మర్మాలు చాటే వ్యాసాలు. నాకు తెలిసినంత వరకు ఈ లోతులు గుర్తించిన వాదు మద్రాసువాసులు కీ శే. వింజమూరి రంగాచార్యులుగారు, తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం పీరంలో ఆంధ్రాధ్యాపకులు కర్రి నాగార్జున. మూడవవారు రాజన్నశాస్రిగారు. వసుచరిత్రం షష్టాశ్వాసం 94వ పద్యం “సతి సాహిత్య రహస్యమిశు వలనన్ సాధించి” పద్యం ముందుగా చదివి సాహిత్య మర్శజ్డులు తరువాత వసుచరిత్రం చదివితే ఆ కావ్యంలోని ధ్వని- వ్యంగ్యము లవగాహన చేసుకోవచ్చు నన్నయ పెద్దనల ధ్వని మార్గాలను శాస్రిగారు రెందు వ్యాసాల్లో ప్రాచీన కవులను ఆధునికులు అర్ధం చేసుకోవలసిన తీరులు మచ్చుగా. చూపినారు.. “కుతపకాల నిర్ణయం” సర్వామోదయోగ్యమైన పరిష్కారం. తంజావూరు మహారాష్ట్రరాజుల తెలుగు భాషా వరివస్య, (సేవ) ప్రబంధశబ్దం, తెలుగు సాహిత్యంలో సంతరించుకున్న ప్రత్యేకత, అర్ధశక్తిమూలధ్వని, సాహిత్యప్రియులకు అవశ్యపరనీయాలు అచ్చతెలుగు అందులో వెలసినకృతులు తెలంగాణం అచ్చ తెలుగు కవులకు పుట్టినిల్లు ఈనాటి సాహిత్య వ్రతులకు జిజ్ఞాసువులకు క్రొత్త సమాచారం అందిస్తవి. చివరి రెండు వ్యాసాలు “వ్యాకరణము-దాని ప్రయోజనము”, “సంస్కృతము -దానిప్రాధాన్యము” సమస్తభాషల వారికి ప్రత్యేకంగా ఈనాడు కళాశాలల్లో పారాలు చెప్పేవారి కందరికీ కనులు తెరిపించేవి. ఈ వ్యాసాలన్నీ రాజన్నశళాస్ర్రిగారి కలం నుండి అలవోకగా వెలువడినవే. ఆయన వైదుష్యం అట్టిది. ఈ వ్యాసాలన్నీ స్నాతకోత్తర తరగతులకు పారాలు చెప్పే అధ్యాపకులకు బాగా ఉపయోగపదుతవి.
ఇట్టి 27 వ్యాసాల తారహారం ఈ మంజూషలో భద్రపరచి రాజన్న శాస్రిగారు, సద్దురువులు శ్రీ కందుకూరి శివానందమూర్తిగారికి సమర్పించి ధన్యులైనారు. సువాసనా వాసితములైన పూలెన్నో తోటలో పూస్తవి. రసికులా పూలవాసనల కలరితే తోటమాలి సంతోషిస్తాడు కాని అందులోని ఒక్కపూవైనా భగవదర్పితమైతే తోటమాలి ధన్యుడౌతాడు ఈ *'మంజూషి శివానందుల కంకితం చేసి రాజన్నశాస్తి గారు ధన్యులైనారు. శ్రీ శివానందులు అమృతహృదయులైన ఆధునికయోగులు, చుళుకీకృత ప్రాచ్య పాశ్చాత్య విజ్ఞాన సాగరులు. వారి కరుణాకటాక్షములు భక్తుల అధివ్యాధితాపహారకములు, జన్మతారకములు. భారతీయసనాతనధర్మాన్ని పునరుజ్జీవింపచేయటానికి శ్రీవారు చేస్తున్న కృషి అనన్యసామాన్యము. _వేదవేదాంగశాస్తసంగీత సాహిత్యనృత్య చిత్రలేఖన-
స శిల్పాదివిద్యలకు ఆయా విద్యోపాసకులకు ఈ నాడు వారిచ్చే చేయూత, ఆలంబనం కోల్పోయిన లతలను పందిరిపై ్రాకించే మేలు చేత. వారిభాషణములు బుధతోషణములు, పరమోద్భోధకములు. అట్టీ మహాత్మునికి అంకితమైన ఈ కృతి సుకృతి. రాజన్నశాస్త్రిగారు సుకృతులు 'స్నేహశీలురు సాత్వికులు ఆత్మీయులు మిత్రులు దా. కొరిదె రాజన్నశాస్త్రిగారిని గూర్చి పూజ్యులు సద్గురువులు శ్రీ కందుకూరి శివానందమూర్తి గారిని గూర్చి ఈ నాల్గు మాటలు వ్రాయడం నా సుకృతం.
- శ్లో! వైదుష్యం లేఖకత్వం సుగమ ఫణితిభిః సంస్కృతాధ్యాపకత్వం విద్వద్దోష్టీషు చర్చానికషణచణతా శాస్రవాదే పటుత్వమ్ | శక్తి ర్లర్వాణవాణ్యాం విబుధజనసదోభాషణేఇనర్గళా చ. విద్వద్రాజన్నశాస్త్రిన్ ! భవతి విజయతే భారతీసుప్రసాదాత్॥ .-కప్పగంతుల లక్ష్మణశాస్త్రీ (18/12/1966)
- శ్లో॥ విద్యున్నటీ విదధతీవ సువర్దశోభాం యస్మిన్ పదం కృతవతీ కరలేఖినీ తే ॥ తత్ కావ్య మాదృతరసప్రసరం త్వదీయం నిత్యం ధినోతు జలదాగమవన్న్మనో నః 41
- శ్రీ. న.చ.రఘునాధాచార్యః (మార్చి 2002) ఇట్లు బుధజనవిధేయుడు బి. రామరాజు
య 11అ్రీః బహుముఖ ప్రజ్ఞాశాలి,ఎభయకవిమిత్రుడు, ళం లా స క్తి సంస్కృత సాహిత్య రత్న డా. 5. రాజన్నశాస్త్రి (మా నాన్నగారు) కాలాయ వర్ష్మణ్యథ కంథరాయాం పాదేల.థ మూర్హ్యభ్రనదీవతేచ 1 శయ్యావతే నాగవరేణ భూషా వకే నమో మే మహసే£పి కస్మై ॥ (సుమసో౭ంజలి: నమోమహసే-1) రూపమందేకాని, కంఠమందేకాని, నీలవర్జము కలవాడు, పాదమండే కాని, తలయందేకాని గంగానది కల్లియున్నవాడును, శయ్యగా గాని. భూషణముగా గాని నాగపర్యుడు కలిగినవాడును అట్టి మహనీయ తేజోమూర్తియగు దైవమును గూర్చి నమస్మరించుచున్నాను. అని హరిహరులకు అభేదము కప్పంచి ఈశ్వరుని తత్త్వాన్ని నిరూపించి = కప్పులు చా! కొరిడె రాజన్నశాస్త్రిగారు. పుంభావసరస్వతిగా విద్వద్దణముచే కొనియాడబచుచున్నట్లి వారికి, పుత్రునిగా పుట్టదము నా పూర్వజన్మ కృత పూణ్య విశేషమే ! యని చెప్పుటలో నతిశయోక్తి లేదు. సంస్కృతాంధ్రములలో విద్వత్మవివరేణూలే గాక., అనేక గ్రంథకర్తగా వ్యాఖ్యాతగా పీఠికాకర్తగా, సద్విమర్శకుడిగా. అధ్యాపకుడిగా. పౌరాణికుడిగా, నటుడిగా, అవార్డు గ్రహీఠతగా తెలంగాణాకే తలమానికమని పందితవరేణ్యులు ఎరిగినదే ! జన్మస్థలము - జీవిత విశేషాలు దక్తిణవాహిని యగు గోదావరీ నదీ వీచికలతో పావనముచేయు ధర్మపురీ పుణ్యక్షేత్రము శ్రీ నృసింహ. రామలింగేశ్వరులకు ఆలవాలమై హరిహర క్షేత్రముగా 'పసిద్ధినాందినది. సనాతన ధర్మానికి పట్టుకొమ్మ యగు ఈ క్షేత్రము వేడ సంస్కృతులకు
౫|| కాణాచి. ఇట్టి పుణ్యక్షేత్రమున శ్రీ ముఖ నామ సం॥ జ్యేష్ట శుక్ల నవమి తేది. 2.6. 1933 భృగువాసరమున నిరంతర శివార్చనాతత్పరులగు భారద్వాజస గోత్రీయులు బ్రహ్మశ్రీ కొరిడె కిష్టయ్య, గంగూబాయమ్మ దంపతులకు మానాన్నగారు జన్మించిరి. అప్పటికే జ్యేష్టపుత్రశోకముతోనున్న మా తాతగారికి, అట్టి దుఃఖాన్ని పోగొట్టి ఆనందాన్ని కలిగించిరి. చిన్ననాటనే వేదసంస్కృతములను ప్రాచీనవిద్యాపద్ధతిని అభ్యసించిరి. స్టానికసంస్కృత పండితులు కీ॥శే॥ బ్రహ్మశ్రీ తాడూరిబాలకృష్ణశాప్రిగారి వద్ద ఆనాటి కాలముననే అనేకులు శిష్యులుగా చేరి కావ్యశాస్త్రపురాణాదులు నభ్యసించుచుండిరి. అట్టి శాష్ర్రిగారి వద్ద నాన్నగారు శిష్యుడిగా చేరి “పువ్వు పుట్టగానే పరిమళించును” అన్న తీరులో కావ్యారంభమునుండే తన సూక్ష్మగ్రాహిత్వమును ప్రకటించుకొని గురువుగారి మన్ననలను పొందియున్నారు. ప్రతిరోజు మహాన్యాసముతో శ్రీరామలింగేశ్వరుని ఆర్చించుటయే గాక నృసింహాలయములో పంచోప నిషత్తులు సస్వరముగా చెప్పుటలో వైదికపండితుల మెప్పునొందినారు. ఇట్లు శివకేశవులయందు భక్తిప్రపత్తుల చిన్ననాటనే పెంపొందించుకొని యున్నారు.
శ్రీహర్న నైషధీయముతో సహ వంచకావ్యములను, ప్రతాపరుద్రీయాది సాహిత్యశాస్త్రగ్రంథములను వ్యాకరణ, న్యాయ,వేదాంతశాస్త్రములను సవ్యాఖ్యానముగా కంఠస్థము చేసి, పరీక్షించువారిని ఆశ్చర్యచకితులను చేసెడివారు. విద్యార్థిదశయందే, ప్రసిద్ధులైన శాస్రిగారాకరు తనపురాణ ప్రవచనమునందు శ్లోకభావము తప్పుగా చెప్పుట గుర్తించి తెలుపగా, సహృదయుడు పండితోత్తముడు అగు ఆ శాస్త్రిగారు తనదోషమును గుర్తించిన బాలుడైన మానాన్నగారిని చూచి ఆశ్చర్యపడి దోషము దిద్దుకొని ఆశీర్వదించిరి. చిన్ననాటినుండి పురాణశవణమునందు ఆసక్తుదై ప్రసిద్ధపౌరాణికుల పురాణములను వినుచుండెడివారు. వారి పెద్దనాన్నగారగు బ్రహ్మశ్రీ గుండిరాజన్నశాస్త్రి గారి వద్ద అనేకమార్లు శ్రీమద్భాగవత సప్తాహ పురాణములను విని పౌరాణిక విశేషాంశములను (గ్రహించెను. (బ్రహ్మశ్రీ పాలెపు వెంకటరాజ శాస్త్రిగారు పురాణప్రవచనము చేయగా సంస్కృతభారతము మొదటినుండి శాంతిపర్వమువరకు (శ్రవణము చేసిరి. వారు పురాణ ప్రవచనమున
నీలకంఠవ్యాఖ్యా విశేషాంశములను గూడ విశదీకరించెడివారు. “వివాహో విద్యానాశాయ” అని లోకోక్తి కేవలం అల్పులవిషయములో మాత్రమే అని నిరూపించునట్లుగా పదకొండు, పండ్రెండు సంవత్సరముల 'ప్రాయములోనే బ్రహ్మశ్రీ తాడూరి శివరామయ్యగారి కుమారుడైన తాడూరి లక్ష్మీనర్సింల గారి కన్యకయైన (మా
౫11
అమ్మగారగు) ల॥సౌ॥ సులోచనాదేవితో పెండ్లియయ్యెను. పెండ్లినాటికి మా అమ్మ వయస్సు 5,6 వత్సరములు మాత్రమే.
చిన్ననాటి నుండి తాను నేర్చుకున్నవిద్యను తనతోటివారికే కాక తమ్ముడైన శ్రీ నర్సయ్యగారికి ( ప్రస్తుతం అడ్వకేటుగా పనిచేయుచున్నారు. హిందీలో ఎమ్.ఎ. షి. హెచ్.డి. కూడ చేసియున్నారు) మా మేనత్త (తనకు చెల్లెలు) ల|॥ సౌ॥ అన్నపూర్ణగారికి, నేర్చుతుందెడివారు. ఇంకెందరో శిష్యులు కావ్యపాఠమునకై వచ్చెడివారు, వారి వారికి రఘువంశ -నైషధ- ఉత్తరరామచరితాభిజ్ఞాన శాకుంతలకావ్యనాటకములను బోధించేడివారు. గ్రామములో అప్పటికి ఇంగ్లీషు విద్యాభ్యాసము లేకుండెను. మా తాత గారు (విద్యాకమిటి సభ్యుడు) తన స్నేహిత బృందము (గ్రామపెద్దలతో కలిసి ఆర్జికభారమును కూడ భరించి పాఠశాలన్థాయిని పెంచి 8-10 తరగతులు ఏర్పాటుకు సిద్ధపరిచిరి “ఐతే ఉపాధ్యాయుడిని ఒకరిని మాత్రము వీరు నియమించుకొనవలెన్న ప్రభుత్వము వారి నిబంధనకుకట్టుబడి పాఠశాలవిద్యాకమిటివారు కోరగా ఐచ్చిక విషయమగు సంస్కృతమును మూడు సంవత్సరములు ఉచితముగా బోధించుటకు నాన్నగారు సిద్ధపడిరి. ఆకాలముననే తాను చదివిన చదువునకు విశ్వవిద్యాలయము గుర్తింపునకైె పరీక్షలు అవసరమని గమనించిరి. సుమారు 24సం1॥ల వయస్సులో పరీక్షలు ఇచ్చుటకు సిద్ధపడిరి. తెనాలి వాస్తవ్యుడైన శ్రీ సుబ్బరామశాస్త్రిగారు ఇక్కడికి తెలుగుపండితులుగా వచ్చినారు. వారి ప్రోత్సాహముతో గవర్నమెంట్ ఎంట్రన్స్ పరీక్ష తెనాలిలో వ్రాశారు. గ్రంథములన్ని ఆ మూలాగ్రము కంఠస్థము గల వీరిని చూచి అక్కడి ఇంటివారు ఆశ్చర్యపోయిని. తేలికగా ప్రథమశ్రేణిని (1957) సాధించిననాన్నగారు పరీక్షావిధానములో ధర్మపురినగరము నుండి మొదటివ్యక్తి మైనారు. 1959లో విద్యాప్రవీణ (ప్రీవియస్) పూర్తిచేసి 1960లో జిల్లాపరిషత్ కరింనగర్ వారిచే సంస్మృతపండితునిగా నియమితులై నుల్హానాబాద్ హైన్మూల్లో చేరిరి. ఆశ్చర్యకరమైన విషయమేమింటంటే మా చిన్ననాన్నగారు కూడా అదే ఆర్జర్లో హిందీ పండితులుగా సూల్తానాబాద్ స్కూల్లోనే - నియమితులైరి. అన్నదమ్ములు ఇద్దరు కొత్తప్రదేశమునందు ఒకరికినింకొకరు తోడై యుండిరి... నిజమునకు ప్రభుత్వ ఉద్యోగములన్న ఆసక్తి లేకున్నను సాధించవలెనన్న తలంపుతో చేరిరి. సాహిత్యవిద్యాప్రవీణ (వ్రీవియన్ వరీళ్షతోనే ఉద్యోగములో చేరిన మానాన్న గారు క్రమముగా విద్యాప్రమాణములను పెంచుకొనుటకై ఎమ్.ఎ. తో సమానమైన సాహిత్యవిద్యాప్రవీణ
గో (ఆంధ్రాయూనివర్సిటి) ఫైనల్ పరీక్ష పూర్తిచేసిరి. నిరంతర కృషిచే క్రమముగా బి.ఒ.ఎల్,, ఎమ్.ఒ.ఎల్., ఎమ్.ఎ., పిహెచ్.డి. డిగ్రీలు సాధించినారు.
ఏ విశ్వవిద్యాలయ పట్టము లేనికాలముననే వివిధ సంస్కృత పత్రికలలో ప్రచురింపబడిన కవితలు సాహిత్యవిమర్శవ్యాసములు దృష్టియందుంచుకొని సంస్కృతమ్” (సాష్తాపహికం-అయోధ్యా) వార్షికోత్సవసందర్భమున 1956 సంవత్సరమున పూరీ గోవర్థనపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్దురుశంకరాచార్యులు వారిచే “సాహిత్యరత్న (సంస్కృతం) బిరుదు ప్రదానము చేయబడి సత్కృతులైరి. 1964 సం॥లో కేంద్రప్రభుత్వము వారి స్మీము. " లం 3000123019 10 6 [06406 0 కాయ 1002] 52051016 2622312125 ప్రకారము కేంద్రప్రభుత్వమువారిచే పరిశోధసక్రై నియమించబడి ఉస్మానియా విశ్వవిద్యాలయము వారి సంస్కృతఅకొడమో యందు ధర్మసూరిరచించిన సాహిత్యరత్నా కరమును నౌకా, మందర వ్యాఖ్యానములతో పాటుగా పరిశోధనమునకై (గ్రహించి, అవనరానుగుణముగా స్వ లఘువ్యాఖ్యను కూడ చేర్చి సమగ్రముగా, సవిమర్శనాత్మకముగా పరిష్కరించియున్నారు.
నాన్నగారి గురించి డా॥ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు “అలంకార శాస్త్రములో సరియైన అవగాహన ఉన్న అంగుళీపరిగణనీయులైన ఆంధ్రులలో దా॥ శ్రీ రాజన్నశాస్ర్రిగారు ఒకరు. ధర్మసూరి రచించిన సాహిత్యరత్నాకరాన్ని నౌకామందర వ్యాఖ్యానములతో పరిష్కరించి, ఆవళ్యకస్థానములలో పాండితీ సమంచితాలైన టిప్పణులే కాక, ఆయావిషయాలపై పరిశోధకపత్రాలను కూడ ప్రచురించిన డా॥ శ్రీ శాస్త్రిగారి అలంకారశాస్త్రవైదుష్టం విద్వల్లోక విదితమే!” అని ధ్వని-మనుచరిత్ర పీఠికలోని తన “'ప్రరోచన' లో పేర్కొన్నారు. ఆ గ్రంథము సంస్కృతఅకాడమీ (ఉస్మానియా) వారిచే ౩ , భాగములుగా ముద్రితమ్రైనది. నిజమునకు అనాదే పిహెచ్.డి., పొందవలసిన పరిశోధన అది. కాని ఉస్మానియా విశ్వవిద్యాలయ నియమానుసారము 1.1) డిగ్రీకై రిజిస్టేషన్ చేయనందున డాక్టరేట్ అప్పుడు పొందలేకపోయిరి. 1964-1966 వరకు ఈ పరిశోధన గావించి, తిరిగి, కరీంనగర్జిల్లాపరిషత్తు నందు ప్రథమశ్రేణి తెలుగుపండితులుగా ప్రమోషన్పొంది రాయకల్, చొప్పదండి, ధర్మపురి, బండలింగాపురములలోని ఉన్నతపాఠశాలలో విద్యాబోధనతో విద్యార్థులను కృతార్ణులను గావించిరి.
స
1972 సెప్టెంబరులో సికిండ్రాబాద్‌లోని నర్తార్ పటేల్ డిగ్రీ కళాశాలలొ తెలుప ఉపన్యానకులుగా చేరిన. డా దివాకర్షవేకంటాపధాసిగారి మార్గదర్యకత్వమున ఎస్మానియావిశ్వవిడ్యాలయంటు 5ందు “ధృని- దునుచరిత్రమున దాని సమన్వయము” అను అంశమున పరిశోధన గావించిరి. పలుదురు ఆలంకారికులు చెపిన వాప్పశాస్రమంతయు ఈ గ్రంధమున పిందికృతమైనది ధృససిచ్దాంతగ్రహణవిషయములో --ంస్క్యృతాంద్ర విద్యార్దులకు తోడ్వడుగ్రంధమును వ్రాసిరి 1980 సెప్టెంబరులో డాక్టరేట్ అవార్డు గ్రహాంచిర్,
అటుపిమ్మట 1981 లో ఉస్మానియావిశ్వవిద్యాలయమువారిచే నిజాం కళాశాలలో ఉపన్యాసకుడిగా నియమించబడిరి 1986లో విశ్వవిద్యాలయము వారిచే రీడర్‌గా నియమిళతులైరి 199% జూన్ 3౧ న 60సం॥ నిండి యున్నందున విశ్చవిద్యాలయ నియమాసుసారముగా “రిటైర్” అయియున్నారు. బహుపురాణప్రవచనసంతుష్టులైన శ్రీశ్రీశ్రీ శృంగేరీజగద్గురువులచే ఆస్థానపండిత పురస్కారముగైకొనిరి.
- ప్రాచీన పద్దతిచే సంప్రదాయబద్ధముగా సంస్కృతసాహిత్యాది శాస్త్రములను అభ్యసించి పాండిత్యశిఖరమును అధిరోహించుటయే కాక “వృధురవాజణీ”, “సంస్కృతమ్” మొదలైన ప్రముఖ సంస్కృత పత్రికలలో కవితలు విమర్శనాత్మక వ్యాసములు 'ప్రకటించియున్నందుకు గాను నాన్న గారి (ప్రతిభను గుర్తించి అయోధ్యయందలి “సంస్కృతమ్” (సాషాహిక సంస్కృతప్రిక) వార్షికోత్సవసందర్భముగా పూరీగోవర్టస పీరాధిపతి శ్రీశ్రీశ్రీ జగర్గురు శంకరాచార్యుల వారు “సాహిత్యరత్నమ్” (విక్రమ సంవిత్ 2౧౩4) (1956 గీ.1)) అను బిరుదమును (ప్రదానము గావించియున్నారు.
గాందీశతజయంతి సందర్భముగా “సంస్కృతకవిత, తారావళిళకి కరీంసగర్ జిల్లాపరిషత్తు అవార్డు, ఆనాటి విద్మామంత్రి పి.వి నరసింహారావు గారిచే ప్రదానం
ఇంకను అధ్యాపక వృత్తిని స్వీకరించి తమ వాక్సాతుర్యముతో, పాండిత్య ప్రకర్షతో పలుశిష్య బృందములను కృతకృత్యులను కావెంచినందుకు గాను హైద్రాబాద్‌లోని “సారస్వత జ్యోతి మిత్రమండలి” వారు 1992 లో “ఉత్తమ అధ్యాపక” పురస్కారము గావించి సత్మరించిరి.
సంస్కృతభాషాసాహిత్యసేవలకు గుర్తింపుగా ఉత్తమ సంన్కృత కవిగా హిందూప్పురము స్వర్ణభారతీపురస్కారము. లభించినది (తేది 12-04-1098),
ప. ఉత్తమసంస్కృతపండితుడిగా తెలుగు విద్యాలయము హైదరాబాద్ వారిచే “ప్రతిభా
పురస్కారము” గావించబడినది. (1999) హైదరాబాద్ నందలి దివాకర్ల సాహితీ ట్రస్టు వారిచే నాన్నగారి ఉభయ భాషల
సేవలను గుర్తించి “దివాకర్ల సాహితీ పురస్కారము” గావించబడినది. రచనలు
- “సుమనో౭౬౦జలి" అను సంస్కృతకవితలసంపుబి ముద్రితము, ఇందు 1972 వరకు విఖిన్నపటత్రికలద్వారా, రేడియో న్వీయకవితాగానముల ద్వారా, కవిసమ్మేళనములద్వారా 'ప్రకటించబడినకవితలు గలవు. ఇందు ప్రధానమైనది ధర్మపురీ పుణ్యక్షేత్రమునందు వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము, మంగళాశాసనము. ఇది అనాటి నుండి నేటికీ దేవస్థానమునందు ప్రభాతవేళ గానముచేయబడుచున్నవి. 1973 లో ఈ సంపుటి ముద్రైతము.
౭. “కవితా విపంచీ” 1972 తరువాత వెలవరించబడిన సంస్కృత కవితల సంకలనము 1999 లో ముద్రితము.
- “వసుమతీ సుధాకరమ్” (సంస్కృత నాటకము). రేడియో ద్వారా 1973లో ప్రసారితమైనది. సంస్కృత భారతి పత్రికద్వారా ధారావాహికముగా ముద్రితము (1990)
4 “సంస్కృతపధప్రదర్శిని” తెలుగు వారికి సంస్కృతవ్యాకరణము నేర్చుకొనుటకు అనుకూలముగ (వ్రాయబడిన (గ్రంధము సురభారతిసమితి (హైద్రాబాద్) ద్వారా ముద్రితము. - (1993)
ర్ “బాలప్రౌధవ్యాకరణ వ్యాఖ్యానము ఉస్మానియా విశ్వవిద్యాలయమువారి డిస్టెన్స్ ఎడ్యూకేషన్ ఎమ్.ఎ. తెలుగు విద్వార్డులకై వ్రాయబడినది. అది ఆ డిస్టెంన్స్ ఎడ్యూకేషన్ సెంటర్ వారిచే 1992 ముద్రించబడినది.
- _ దేవీభాగవతము (మూడు స్కంధములు) తెలుగు నందు అనువదించ బడినది. శ్రీ విద్వా సేవాసమితి, సికింద్రాబాద్ వారిచే ముద్రించబడినది. రెండుసార్లు 19875
0/8 మరియు1984).
౫0/11
ఛా ఆసందరామాయణము (సారకాండము) తెలుగువ్యాఖ్య (తాత్చర్య విశేషాంశములు) ఆరాధన పత్రిక యందు అనుస్యూతముగా (సీరియల్‌గా) వెలువరించబడినది. సెప్టెంబర్ 2001 నుండి డిశంబర్ 2003 వరకు.
-
అంధ్ర మహాభారతము ద్రోణపర్వము -పంచమాశ్వాసమునకు తెలుగు వ్యాఖ్య (ప్రతిపదార్ధతాత్పర్య విశేషాంశములు). (గ్రంథరచన 1995. (తి.తి. దేవస్థానం వారి ముద్రణలో నున్నది.
-
_ 'సంస్కృతసాహిత్యరత్నాకరవి (ధర్మసూరి విరచిత - అలంకారశాస్త్ర గ్రంథము) పరిశోధించి స్వవిరచిత టిప్పణితో వెలువరించబడినది. ఇది మూడు భాగములుగా ఉస్మ్నానియావిశ్వవిద్యాలయమువారి సంస్కృత అకాడమివారిచే ముద్రితమైనది.
-
'ధ్వని-మనుచరిత్రము' (1986) 21.0 సిద్ధాంతగ్రంథము. 9 ప్రకరణముల ఈ (గ్రంథమునందు ఎనిమిది ప్రకరణములు ధ్వనిని గురించియే కాక అలంకారశాస్త్రానికి సంబంధించిన అనేక విషయములు విశదీకరించినవి. ఒక (ఎనిమిదప) ప్రకరణమునందు మనుచరిత్రము నందలి ధ్వనిభేదములు సోదాహరణముగా నిరూపించబడినవి. అందుకే డా॥ పుల్లెల రామచం'(డ్రుగారు ఈ గ్రంథము తెలుగు విద్యార్థులకే కాకుండా సంస్కృత విద్యార్థులకు, ఆంధ్ర సంస్కృతోపాధ్యాయులకు కూడ ధ్వనిసిద్ద్ధాంతగ్రహణవిషయములో తోద్బడగలదని నా దృధ విశ్వాసము అని తమఠఅభిప్రాయమును పేర్మ్కొనినారు. “ఇన్నాళ్ళకు మనుచరిత్ర లోని వృత్తి అలంకార రసధ్వని వ్యంగ్యాది సాహిత్యశాస్త్రమర్యాద లన్నింట్కి లక్ష్యలక్షణ సమన్వయము చెప్పే వ్యాఖ్యాన ప్రాయమైన సిద్దాంత గ్రంథము వెలువడిం”దని దా! బిరుదురాజు రామరాజుగారు ప్రశంసించియున్నారు.
-
నిబంధ రత్న సముచ్చయ;ః (సంస్కృత వ్యాససంకలనము) గత 2003 _సవంత్సరము అక్టోబర్ మాసములో ముద్రితమైన (గ్రంథము గత 45, 50 నంవత్సరములుగా వివిధవ్రనిద్ధనంన్కృతనసంచికలలో ప్రచురించినవి ఆలిండియా రెడియో హైద్రాబాద్, ద్వారా ప్రసారితమైనవి యగు సంస్కృత నిబంధములు (వ్యాసములు) ఒక చోట క్రోడీకరించినట్టి వ్యాస సంవ్యటి.
న. సారస్వత సేవ ఒక అధ్యాపకుడిగా శిష్యబృ్బందమునకు విద్యాదానము గావించుటయే (ప్రధాన వృత్తిగా స్వీకరించిననూ చిరకాల పఠన, పారన, పరిశోధనా ప్రావీణ్యం, సంస్కృతాంధ్ర భాషా లక్షణ లక్ష్యసారజ్ఞత, వ్యాకరణాభిజ్ఞత, విజ్ఞత, రసజ్ఞత నాన్నగారిని ఊరకనే కూర్చొనివ్వలేకుండినవి. అందుకే కవిగా, రచయితగా, సద్విమర్శికుడిగా పీరికాకర్తగా, వ్యాఖ్యాతగా, సముద్దండపండితుడిగా అనేకానేక ముద్రితాముద్రిత సుమనో౭ంజలులను (రచనలను) సారన్వత సేవకు వినియోగించుచునే యున్నారు. అచార్య దికాకర్త వేంకటావధానినాయకత్వమున అనేకసాపొతీ ప్రముఖ పండితగణముతో కలిసి 1974 సం॥ నుండి భువన విజయము, నన్నపార్యుని భారతావతరణము, శ్రీనాధునికనకాభిషేకము. మొ సాహిత్య రూపకము లందు నటులుగా సాహితీసేవ ఇప్పటికినీ చేయుచునే యున్నారు. ఆనాటి ముఖ్యమంత్రులైన జలగంవెంగళరావు, చెన్నారెడ్డి, ఎన్.టి రామారావు మొదలుకొని నేటి స్వర్ధాంధ్రనిర్మాతయైన శ్రీ నారాచంద్రబాబు నాయుడువరకుగల ముఖ్యమంత్రులనుండి మరియు ఆనాటివిద్యాశాఖామంత్రి, మాజీ ప్రధానమంత్రియైన శ్రీ పి.వి. నరసింహరావుగారి నుండి కూడ ఉత్తమకవిగా, పండితునిగా పురస్కారములు గ్రహించియున్నారు. తాను ధర్మసూరియొక్క సాహిత్యరత్నాకరాన్ని నౌకామందర వ్యాఖ్యానాలతో పాటుగా పరిష్కరింఎనపుడు మూలములోని శాస్తవిషయములతో తానేకీభవించని విషయాలను, అవి ఎందుకు విరుద్ధములుగా చెప్పదగియున్నవో ఎత్తిచూపి సద్విమర్శక లాక్షణికులుగా పండితులమన్ననలను పొందియున్నారు. సాహిత్యరత్నాకరమునందు ఒకచోట “తస్మాత్ పర్వత నాధసూరి” 1/28 శ్లోకమునందు మూలమున తెలుపబడినట్లు యబ్లమాంబా వియద్గంగా, లసద్గుణమణేః, అనుచోట్ల రూపకాబంకారమను దానిని స శాస్రీయముగా ఖండించి, సావయవ అర్థీ ఉపమాలంకారముగా నిరూపించుట పలువురువిద్వాంసులను ఆశ్చర్యచకితులగాను పునరాలోచనాపరులగాను చేసియున్నది. అదేప్రకారము మూలమును సమర్ధించి దోషాపవాదమును తొలగించుటకు తనవంతుకృషి కూడా కావించినాడు.
స
మనుచరిత్రలోని (ప్రవరుని హిమవన్నగప్రయాణకాలముగురించి బహుకాలమునుండి విమర్శకలోకమున చర్చ సాగినది. వైదికసంప్రదాయమునకు దర్చణము వంటి జీవితానుభవము గలవాడైనందున పై విషయము గురించి క్షుణ్ణ్మముగా చర్చించి పెద్దనార్యుని సమర్ధించినారు. (చూ.ధ్వని-మనుచరిత్రము అనుబంధము) ఇది 1987 లో ఎ.పి. ఓరియంటల్ కాన్ఫరెన్స్‌లో చదివి, పండితుల హర్షామోదము నందుకున్నారు. ఇదియే కాక “భర్శృహరేః విజ్ఞానశతకం నామ చతుర్థం శతకం” అని, త్రిశతికర్త గా ప్రసిద్ధినొందినభర్భృహరిచతుర్ధశతకమును అదే కాన్ఫరెన్స్‌లో ప్రకటించి సభ్యులను ఆశ్చర్యపరిచియున్నారు. ఇట్లే హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటి వారి కాన్ఫరెన్స్‌లో తిక్కన - అనుసృజన కౌశలమును గురించి, మరియు ఉస్మానియా యూరిపర్సిటీ వారి “హైద్రాబాద్ నాలుగు శతాబ్దాలతెలుగుసాహిత్యవికాసం” జాతీయసదస్సులో తెలంగాణాలో అచ్చతెలుగు కవుల గురించి ప్రసంగించియున్నారు. పుట్టపర్తి సాయిబాబా వారి రామాయణ కాన్ఫరెన్స్ (1977) లో ఉత్తరకాండముపై ప్రసంగించి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శుభాశీస్సుల నందుకొన్నారు.
“వసుమతీసుధాకరమ్” అను సంస్కృత నాటకమును వ్రాసి భూసంస్మరణలను కొనియాడుచు సాంఘికదురాచారమైన వరదక్షిణను నిరసించియున్నారు. ఈ నాటకము హైద్రాబాద్ ఆల్ ఇండియా రేడియో ద్వారా 30-10-1975, 9.80 బ్రాడ్కాస్ట్ కాగా, “సంస్కృతభారతి” లో సంస్కృతభాషా ప్రచారసమితి వారు ముద్రించి యున్నారు. (1989). ఉత్తమకవిగా ప్రశస్తి
ఇరువదిసంవత్సరముల ప్రాయమునాటికే వ్రాసిన అనేక కవితలు పలు సంస్కృతపటత్రికలలో ప్రచురించబడినవి. సాధారణముగా నాన్నగారి కవిత్వము ధ్వని ప్రధానమైనది. అన్యాపదేశముగా ఉంటుంది. వర్దనాంశము చమత్మ్కాన- ప్రధానముగా ఉంటుంది. (తార్మాణముగా చూడండి (1) సుమనో౬ంజలి (1973) (2) కవితా విపంచీ (1999)
అందుకే వారి కవిత్వము గురించి ప్రముఖ పండితుల క&ీశే! డా॥ బి. ఆర్ శాస్త్రీ ప్రొఫెసర్, డిపార్టుమెంట్ ఆఫ్ సంస్కృత్ ఉస్మానియా యూనివర్సిటీ హైద్రాబాద్
గగ గారు తమ అభిప్రాయములో “అన్య కవేర్చణితయో భారవి మావాదీనాం పూర్వసూరీణాం కావ్యవిలసితాని స్మారయంతి । అస్య వాణీ శ్లేయమకోపమోశ్రేక్షా- సమాసోక్షాదిఖిరలంకృతా ప్రకాశతే” అని (ప్రశసించి యున్నారు. శ్లేషప్రధానమైనదిగా వ్రాయబడిన 'హరిహరస్తుతిఃి 1954 సంవత్సరమున (తన 21 సం1॥ ప్రాయమునందే) అయోధ్యనుండి వెలువడే సంస్కృతసాప్తాహికమైన సంస్కృతమ్ అను పత్రిక యందు వెలువడినది. ఈ కృతియే “నమో మహసే” పేంట 'సుమనో౭. ౦జలి' యందు ప్రకాశింపజేయ బడినది. (దీని నుండే వ్యాసారంభ శ్లోకము ఉదాహరించబడినది. ) ఇందు హరిహరులకు నభేదము తెలియజేయుచూ, భక్తిని ప్రదర్శించుటయే కాక, శివకేశవులు భిన్నులని తలంచి పరస్పరము కలహించు కొనువారి నోటికి తాళము వేసియున్నారు. చిన్ననాటినుండిహరిహర క్షేత్రమైన ధర్మపురి యందుండుటవలననూ, హరిహరులను భక్తితో పూజించుట వలననూ ఈ ఖండిక ఉద్భవిల్లుటకు కారణమయ్యెను ఇంకను "కాళేశ్వర ప్రస్తుతిః (కవితా విపంచీ) యందు శివస్తవమును, “శ్రీ చక్రరాజనిలయాం కలయే పహృదళ్టే” యందు శ్రీదేవీస్తుతిని, “గణ నాయకతత్త్వ” మందు గణేశుని తత్త్వమును తెలువుచూ భక్తి కవితా ఖండికలు, ఇట్లు ఇంకెన్నో కవితలు వెలువరించియున్నారు. హరిహరస్తుతిః (నమో మహసే) కవితయే ధర్మపురి తీ లక్ష్మీనరసింహ సుప్రభాతమునకు పూర్వ రంగమైనదిగా తలంచవచ్చు. దైవభక్తియైనా, దేశభక్తియెనా నాన్నగారి కవిత్వమునందు ఒక విశిష్ట స్థానము గలదై యుండును. అందునా సహజముగానే ధ్వని అన్యాపదేశము ప్రధానమైనట్టిదే కదా! అందుకే గణనాయకప్రస్తుతి యందు ఒక వంక గణేశ్వరుని స్తుతించుచునే అన్యాపదేశముగొ రాజకీయనాయకుల పద్ధతిని తెలిపియున్నారు. మచ్చునకు ఒక శ్లోకము పరిశీలించండి. శ్లో! అధితిష్థన్నుచ్చపదం, రూపకళా ఖర్వగర్వ యుక్తశ్చ | పరిభూయ త్వాం ద్విజపతి రాష్తశ్చాదర్శనీయతాం సద్యః॥ (కవితా విపంచీ)
(1
“ఉన్నత పదమందుండి రూపకళాగర్వితుడైన చంద్రుడు వినాయకుని చూసి అవమానము గావించుచూ నవ్వి ప్రజాదరణము కోల్పోయెను. అని వినాయక స్తుతి రూపటప్రస్తుతార్ధమును వర్ణించుచూ. అతిగర్వితుడైనవాడు ఉన్నత పదవియందున్ననూ, నిమ్నక్రేణి (రాజకీయ) నాయకులను అవమానించిన అధుపతనము పొందగలడని హెచ్చదిక అన్యాపదేశము ద్వారా చేసియున్నాడు.
దేశభక్తి గలవాదై “సమైక్యం” స్వతంత్రభారతమ్” అనుకృతివొ, వంటి ఖండికలు వ్రాసియున్నారు. దేశ నాయకులైన “మహాత్మగాంధీ, 'జవహర్లాల్ నెహ్రూ*, 'దా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్' లను ప్రశంసించుచూ “తారావళి, “ప్రశస్తి” “నపరత్నాని” వంటి లఘు కావ్యములను వ్రాసి ఆయా సందర్భాలలో కవిసమ్మేళశనములయందు చదివి ప్రశంసలను అందుకొన్నారు. _ వివిధ విషయములపై వ్యంగ్యరచనలు గావించి, సామాజిక రుగ్మతల పై ధ్వజమెత్తియున్నారు. 1971లో 'శర్వరీ' యను కవితలో చలికాలవు రాత్రిని బహుప్రసూతయైన స్త్రీతో పోలుస్తూ కుటుంబనియం(త్రణను సమర్ధించి యున్నారు. 1981లో “మధుపవిగీతిః యను కవితయందు తుమ్మెదను వర్ణిస్తూ అన్యాపదేశముగా మద్యపానాసక్తుడి దుస్థితిని తెలిప, మద్యపాన నిషేధావశ్యకతను తెలిపియున్నారు. కాలాన్ని సంబోధిస్తూ 'కాలవిలసితం' అను కవితలో వరకట్న సమస్యను వర్ణించియున్నారు. 'పరపుష్టదశకం' అనుకవితలో కోకిలను వర్దిస్తూ అన్యాపదేశముగా నేటి రాజకీయనాయకుల నయపంచనను తెలపియున్నారు. “బలిపుష్టవిలసితమ్' లో వాయసమును (కాకిని) వర్ణిస్తూ అవినీతిపరులఆగడాలను అన్యాపదేశముగా ఎత్రిచూపి యున్నారు.
ఇట్లనేక విషయాలపై అన్యాపదేశముగా ధ్వజమెత్తియున్నారు. అందుకే వీరి కవితలను ప్రశంసించుళూ కీ॥శే। విద్వచ్చిరోమణి బ్రహ్మశ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి గారు (ఆనాటి హైద్రాబాద్ ఆకాశవాణి కార్యనిర్వహణాధికారి) “బహుషు పద్యేషు వర్తమానకాలికా: విషయా: శేషోక్తిభి వ్యంగ్యమర్యాదయా, అన్యాపదేశేనే, కృిత్ సాక్షాచ్చ నిపుణముపవర్ణితాః కవేరస్య వాగతీవార్థగాంభీర్య విలసితా, వక్రోక్తిసుందరో హాస్యరసభూయిష్టా చ సతీ సచేతసాం చేతసి చమత్మారమాదధాతి | .... కింబహునా నిపుణోజయం కవిః. నిర్గలద్ రస పిచ్చిలార్థం చేదం కావ్యమ్ అని పేర్మొన్నారు. (సుమనో£.౨జలిః పీరిక)
౫6||
కవితలన్నియు పలుపత్రికలలో ముద్రితములైనవి. అట్టివాటి నన్నిటిని ఏకత్రీకరణ చేయుటకై 1978లో కొన్నింటిని సుమనో£౭౨జలిః పేరిట ముద్రించబడగా 1999లో మరికొన్ని 'కవితావిపంచి పేరిట స్వయముగా ముద్రించి యున్నారు. సుమనోంజలిని (హంసిచుతూ దా! బీ, ఆర్ శాస్త్రిగారు జా
అకల్చితం స్నిగ్ధద్భశా కవిరాజన్నశాస్ర్రిణా 1
కల్పతాం విబుధ ప్రీత్యై స ఏష సుమనో౭ంజలిః!॥* అని పేర్కొన్నారు.
డా! వుల్లెల శ్రీరామచం(ద్రుడు గారు కూడా నాన్న గారి కవిత్వము-
“నిస్సంశయమియం కవితా ప్రాచీనకవితాభ్రాంతిమేవ జనయేత్ సహృదయానామ్” అని ప్రాచీన
కవుల కావ్యరచనను స్ఫురింపజేయునని ప్రశంసించియున్నారు.
డా॥ రాజేంద్ర మిశ్ర గౌగ౦+16301 & 5626, 5209101 ల ౬.2. ౧176510 5%10012) గారిచే “భవన్తః కవిరాజరాజిముకుటకల్పా అర్వాచీన సంస్కృత కవితా౭లంకారభూతాఃో (7.7.2001 లో వ్రాసినలేఖ) అని ప్రశంసింపబడిన మానాన్నగారికవితల పరిచయం, వారి సంపాదకత్వముననే వెలువడిన వింశతి శతాబ్టీయ సంస్కృత కావ్యామృతం ((ప్రథమోభాగణ అను గంథమున చేయబడినది- ఈ (గ్రంథం దిల్లీ ప్రభుత్వము వారి దిల్లీ సంస్కృత అకాడెమా” (న్యూదిల్లీ) వారిచే ('ప్రచురింపబడినది. (2000)
సాగర్ విశ్వవిద్యాలయ సంస్కృతవిభాగాధ్యక్షులు ఆచార్య రాధావల్లభత్రిపాఠి సంపాదకత్వమున వెలువరించిన షోడళీ (1992) (భారతదేశమునందలి 16 మంది సుప్రసిద్ధ సంస్కృతకవుల కవితాసంకలనము) యందు నాన్నగారి మూడు కవితలు ('పరపుష్టదశకమ్, 'బలిపుష్టవిలసితమ్?, 'సాయం') సాహిత్యఅకాడెమి న్యూఢిల్లీ వారిచే (ప్రచురింపబడి అఖిల భారతకవితాఖ్యాతి తెచ్చినవి అనుటలో సందియము లేదు.
ధర్మపురీ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సుప్రభాతము
అతిపురాతన పుణ్యక్షేత్రమైన ధర్మపురీ పట్టణము నవ నరసింహక్షేత్రములలో నొకటిగా 'పసిద్ధినొందినది. అట్టి క్షేత్రాధిపతియైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి భక్తులైన కవులెందరో
౫౫6111 కలరు. ధర్మపురీ లక్ష్మీనారాయణ శతకకర్తయైన శ్రీషదాంధ్రభాగవతరచయిత పోతన, నృసింహ, నరహరి, నృకేసరియను శతకత్రయకర్తయైన శేషాచలం (శేషప్ప/ కవి) ప్రయోగపారిజాత కర్త యైన నృసింహ సూరి వంటి కవులెందరో (లక్ష్మీ నృసింహ స్వామిని) స్తుతించిన వారున్నారు. ఈ ధర్మపురీ లక్ష్మీనృసింహ సుప్రభాతము వ్రాయుటకు నాన్న గారు సిద్ధపడినారు. బహుశః 1969, 70 ప్రాంతములో మా గురువుగారు. కీ॥శే॥ మధ్వాచారి శ్యామసుందరశాస్రిగారు తానుముద్రించబోవు, ధర్మప్పరీక్షేత వైభవమును తెలియజేయు “నాడు-నేడు” (గ్రంథమునందు నాన్నగారి సుప్రభాతము ముద్రించుటకై ఉత్సాపడి నాన్నగారిని సుప్రభాతము వ్రాయుటకు ప్రోత్సాహపరిచిరి. తనకవిత్వమేదైనను అది విశేషాంశములతో కూడి యుండవలెనను నాన్నగారి దీక్ష ఈ సుప్రభాతములోనూ కనబడతుంది. ఇందు ప్రాతః కాలవర్ణన సహృదయుని గోదావరి ఇసుకతిన్నెలలో విహరింపజేయును. శ్లో॥ గోదావరీ విమలవీచి మృదంగ వాద్యే సంవాద్యమాన ఇహ గంధవహేన హృద్యమ్ | బాలా పికాః౭.9.బపతి రమ్యరవేణ గీతం లక్ష్మీనృసింహ ! భగవంస్తవ సుప్రభాతమ్! (సుప్ర.6ళ్లో) నిర్మల గోదావరీ తరంగాల మృదంగ ధ్వనిని వాయువు హృద్యముగా అందించుతుండగా పిల్లకోయిల రమ్యముగా గానము చేయుచున్నది. ఎంత చక్ళని భావన |! మరొక సూర్యోదయవర్హణ - శ్లో! ప్రాచీ విభావసుశిశుం ఖలు మందమంద- మాలంబ్య చాంబరమరం మృదులైః కరాగైః | ఉద్యంత మంకగతమాతనుతే సురక్తా లక్ష్మీనృసింహ 1! భగవంస్తవ సుప్రభాతమ్! (సుప్ర.10 ల్లో) తూరుపు అను తన తల్లి చీరకట్టు కొనుననప్పుడు బాలసూర్యుడు అను బాలుడు ఆమె చీరను తనచిన్నారికరములతో (కిరణములతో) పట్టుకొని లేచి నిలబడుటకు 'ప్రయత్నించుచున్నాడు, అనురాగవతియగు ఆ తల్లి ఆ బాలుని తన అంకమున జేర్చుకొన్నది.
౧06౪
ఇందు అంబరమంటే వస్త్రము. అకాశము - అను రెండు అర్జములు కాగొ, కరములనగా చేతులు, కిరణములు అను రెండు అర్జములు, సురక్తా యనగా పేమతో కూడినది. ఎరుపువర్ణముకలదియను అర్ధములు కలవు. ఇట్లు రూపకాలలంకారముతో చెప్పిన ఈ శ్లోకమునందు శిశుమాతృవాత్సల్యము కడురమ్యృముగా స్పురించుచున్నుది.
ప్రభాతవర్దనయే కాక ధర్మపరిపర్లన. ఇక్కడి సంప్రదాయములు, చరిత్ర, కూడ గలవు.
శః శ్రీ శేషయార్య రచితం శతకం త్వదీయం
గాయంత్య ఏవ తన సద్మని పద్యజాతమ్ | త్వాం సేవితుం 'స్తియ ఇమాః సముపస్థితాశ్చ లక్ష్మీనృసింహ ! భగవంస్తవ సుప్రభాతమ్! (నుప్ర.1) శ్లో.) శ
తెలుగునాట ప్రసిద్ధినొందిన శేషప్ప- నరసింహశతకము ఈ ధర్మపురీశ్వరుడైన నృసింహస్వామిదే యనుట నిస్సందేహమే కదా! అట్టి విషయమును గుర్తు చేయుచూ ఆ శతకాన్ని ఇక్కడి పురవనితలు ్రతినిత్వము ప్రాతఃసాయం సమయములందు గానముచేయుచూ ఆ భగవంతుని. దర్శింతురని తెలిపినారు. ఇది ఈ పురమునందు ఇప్పటికిని అనుస్యూతముగా వచ్చుచున్నయాచారము. కవి ధర్మపురీయుడే కావున ఈ సాంప్రదాయముగా వర్ణించగలిగినారు. “యద్ధర్మవర్మ నృపతిర్ =” అన్న (14ప) శోకమునుండి ఈ క్షేత్ర చారిత్రిక ప్రాముఖ్యములనుగ్గడించినారు. ఇక్కడ జరుగు 'జాతర' ఉత్సవాలలో పాల్గుణశుక్షచతుర్దశి నాటి డోలోత్సవము (19వ శ్లోకములో) ఫాల్గుణ బ॥ పంచమి నాటి రథోత్సవము, నిత్యోత్సవమందలి వేదఘోష (20వ శ్లోకము) అను రసగుళికులను సుప్రభాతము పేర సహృదయులకు అందించియున్నారు.
ముందుగా సుప్రభాత, మంగళాశాసనములను మాత్రమే వ్రాసి (సుమనో౭.జలిలో ముద్రించి) యున్ననూ, సుప్రభాతమునకు అనుగుణముగా స్తోత్రము, ప్రపత్తి కూడ ఉండవలెనను నియమానికి బద్దుడై ధర్మపురిదేవస్థానము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి కోరికతో ప్రోత్సాహితుడై మిగిలిన స్తోత్రప్రపత్తుల కూడ బ్రాసి సంపూర్తి నొనరించినారు. ఈ 'ర్మపురీ
సహస ౧ గ లీపిలో 1979లో ముద్రితమైయు లక్ష్మీనయుంహ సుప్రభాతమ్! దేవస్థానంవారిచే తెలుగు లిపిల్ 19/ ముద్రితమైయున్నది.
౫0/ అవికూడ అనేక ప్రత్యేకతలతో కూడుకొన్నవి. స్తోత్రమునందు భగవత్స్తుతియే కాక దకావతారముల ్రాశస్యమును కూడ తెలిపియున్నారు. స్వామి వారి మూలవిరాట్ స్తారూపానికి చుట్టూ దశావతారాలు చెక్కబడియున్నాయన్న సంగతి. ఇది స్థానికులకు తూడ అనేకులకు తెలియకపోవచ్చు. అట్టి విషయము తెలియజేయుటకే కాబోలు దశావతార తత్త్వములను హృద్యముగా వర్ణించియున్నారు.. అదే కాక ప్రపత్తి యందు అనేక పురాణాంశములను పేర్మొన్నారు. వాటిలో గజేంద్రమోక్షము, మోహినీ అవతారము, అంబరీష వృత్తాంతము మొదలైనవి కలవు. శ్లో శస్తాభిఘాతపరిపూరతయా ద్విషంతో యాన్తూత్తమాం గతిమితి ప్రహిణోషి చక్రమ్! సంకల్ప ఏవ తవ హంతు మలం న్నకిం తాన్ లక్ష్మీనృసింహ ! చరణౌ శరణం ప్రపద్యే ॥ (ప్రపత్తి-6ళ్లో.) “హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వంటి రక్మసులను సంహరింప నీ సంకల్పబలము చాలుకదా! ఈ లోకమంతయును నీ సంకల్పము చేతనే కదా నడుచుచున్నది. మరి వారిని సంకల్పమాగత్రముచేతనే సంహరించక శస్త్రాభిఘాతులను చేసి వధించుచున్నావెందులకు? బహుశః పవిత్రమైన నీ శస్తస్పర్శచే వారికి ఉత్తమగతిని కలిగించవలెనను నీ అభిలాష కావచ్చును అని అవతారముల తత్త్వమును పేర్కొన్నారు. ఇంకను “తత్ త్వత్ కథాఖిరిహ పౌవయితుం స్వభక్తాన్...” (ప్రపత్తి5) అను శ్లోకమున నీ అవతారకధల (శ్రవణ, స్మరణ క్తీల్తనాదుల ద్వారా భక్తులను పునీతులుగా కావించుటకే అని ఆ దశావతార తత్త్వమును స్పష్టపరిచినారు. వీటిలో హృద్యమైన కవిభావనయే కాక వినూత్నములైన వ్యాకరణ శాస్తాది ప్రయోగములు కూడ నున్నవి. 'నయనీక్ళత శయనీకృత, అయనీకృతిమొదలైన పదజాలము అనయనే నయనే కృతా - నయనీకృతో, నయనీకృతా భాస్మరశతరుచీ (సూర్యచంద్రా) యేన సః అను విధమున ప్రయోగించీనారు. కమరన్ (కమర ఇవ ఆచరిన్) లలనన్ “లలనా+ఇవ ఆచరన్) అను విధములుగా ఉపమార్ధక శత్రంతములు కూడ వ్యాకరణ విశేషాంశ ప్రయోగములే !
౫౦/]
శ్లో। నా౭౬౬స్థా గేహే న వసునిచయే నైవ కామోపభోగే
యద్యద్ భవ్యం భవతు భగవన్ ! పూర్వ కర్మానురూషమ్ | యాచే తు త్వామఖిలభువనం సేవయా రేఇస్త్యవంధ్యం భక్తాఘౌఘప్రశమన విభో ! ధర్మపూర్ నారసింహ ! ॥
అని ఆ భగవంతునితో “తనకు ఎట్టి వైభవము వలదని వాటిని కోరుకోవటము లేదని తెలియజేస్తూ పూర్వకర్మానురూపమైన ఫలితమేది కలదో, దానినే జరుగనిమ్మనెను. మరి ఏదియునూ కొరవా? అనుదానికి ఈ భువనమంతయును నీ సేవాతత్సరతతో నిండియుండవలెనని కోరి తన నిస్స్వార్ధ భక్తిని ప్రకటించియున్నారు. నిబంధరత్నసముచ్చయ:
ఈ గతనంవత్సరము (2003) నందే “నిబంధరత్నసముచ్చయః”అను వ్యాససంపుటిని ముద్రించినారు. ఇందు 27 సంస్కృతవ్యాసములు కలవు. ఇవి గత కొన్నిమాసములుగా 'సారస్వతీసుషమా, సూర్యోదయః, సాగరికా, సంవిద్, అమృతలతా సంస్కృతశోధనపత్రికా, సంస్కృతభారతి వంటి ప్రసిద్ధ సంస్కృతపత్రికలయందు ప్రకటించబడి, విద్వాంసుల మన్ననలనుపొంది యున్నవి. అంతేగాక ఆలిండియారేడియో హైదరాబాద్ కేంద్రముద్వారా అమరవాణి, అమరభారతి వంటి సంస్కృత సాహిత్య కార్యక్రమములందు ్రసారితములైన ప్రసంగపాఠములు కూడ చేర్చబడినవి. ప్రసిద్ధ నంన్కృతాలంకారికుడైన ధర్మనూరియొక్క సాహిత్యరత్నాకరమును తొను పరిశోధించు(1964-66) సమయమునందు తత్తద్ విశేషాంశములను పద్య, అలంకార, రసాది విశేషములయందు విమర్శనాత్మకములైన చోట తన అభిష్రాయములను స్పష్టపరుస్తూ చేసిన విమర్శనావిషయములు (ఇందు సమకూర్చబడినవి). అలంకార శాస్రమందలి అమోఘమైన పాండిత్యానికి అవి మచ్చుతునకలుగా పేర్కొనవచ్చును. అటులే సాహిత్యరత్నాకరస్థ విషయములే కాక, “అలంకార శాస్త్రే ప్రతాపరుద్రీయస్య స్థానం మనుచరిత్ర వైభవం, వేజణీసంహారే రసచర్చా, మాలవికాగ్నిమిత్ర నాటకే, వస్తు సౌందర్యం, రత్నావళినాటికా వైశిష్ట్రమ్. నైషధకావ్యే శాస్త్రీయప్రస్తావః, రఘువంశ రామాశ్వమేధయోః సారూప్యం” అను వ్యాసములు వారి కావ్యపఠనాసక్తిని, విమర్శనాదృష్టిని కూడ పేర్కొంటున్నాయి. పాఠకులకు అనేక విషయములను అందించిన ఈ (గ్రంథము “రత్నసముచ్చయ” మనుట అతిశయోక్తి కానేరదు. -
౫౮/1!
మంజూష
నిబంధరత్నసముచ్చయమును ప్రకటించి, సంస్కృతమునందు నిబంధీ కృతములైన వాటిని సంస్కృత పండితుల హస్త భూషణముగా మలిచిరి. తెలుగు వారికి తెలుగు, సంస్కృత విషయములను తెలుగులో అందించవలెనను తలంపుతో మంజూష యను ఈ (గ్రంథమును ముద్రించుటకు సంసిద్దులైరి. ఇందు ఆధ్యాత్మిక వ్యాసములు, సాహిత్యవ్యాసములు క్రోడీకరించబడినవి. ఇవి నాన్నగారి ఉభయభాషాపాండిత్యానికి మచ్చతునకలు.
ఇందలి తెలుగువ్యాసములు అనేకసాహిత్యపత్రికలద్వారా వెలువరించ బడినవి. కొన్ని వ్రనంగపాఠములుగా వలుసాపాత్యనభలలో, ఆలిండియా లేడియో, హైదరాబాద్కేంద్రము ద్వారా సాహిత్య కార్యక్రమములలోను ప్రసంగించినట్టివి. ఇది తెలుగుసాహిత్యలోకానికి అందించుకానుకగా చెప్పుకొనవచ్చును. ఈ సంపుటియందు ఆధ్యాత్మిక సాహిత్యముల వ్యాసములున్నవి కావున ఇది నిబంధరత్నములకు మంజూషయే కదా!
చిననాటినుండి శివభక్తి పరాయణుడై స్థానిక రామలింగేశ్వరాలయమున మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములను. కావించుటలో తత్ప్చరుడైయుండెను. కావుననే అట్టి భక్తిచే ప్రేరేపితుడై 'రుద్రాభిషేక మహిమ', “శివభక్తి మహిమ, “భక్తి యోగము- దాని ప్రాధాన్యము'లు వ్రాసియున్నారు. ఇవి పామరులను భక్తిమార్గముననుసరించుటకై ప్రేరేపించునట్టివి.
పలుచోట్ల దేవీభాగవత ప్రవచనము లనేక మారులు చేసియున్నారు. అందువలనే అందు తాను గ్రహించిన “దేవీభాగవతము - శ్రీదేవీ తత్వమును”, భగవదాదిశంకారాచార్యుల వారి “సౌందర్యలహరి -పరదేవతాతత్తమూ'ను విశదీకరించియున్నారు. ఇట్టి నిబంధములు (వ్యాసములు) పండితులకు కూడ మార్గదర్శకములు కాగలవనుటలో సందేహములేదు.
కాలమందు వచ్చిన మార్పుల వలన నేటి తరములకు మన సంస్కృతి పట్ల అవగాహన కాని, అట్టి దానికి మూలములైన వేద, శాస్తాదుల పట్ల అవగాహన కాని లేడు అను విషయము తెలిసినదే! కావుననే “భారతీయ సంస్కృతి -వేదప్రాధాన్యము,
౫౮/11
గీతా సుగీతాకర్తవ్యా, '“అహింసాపరమోధర్మ" అనుసఎ మన సంస్కృతిప్రాశస్త్యములను తాలియజేయుచున్న వ్యానములు. త్రీవుద్రామయాణవఐనంద లి భరతుసిపాత్రప్రాముఖ్యమును తెలిసి సోదర సౌభ్రాత్రము ఎట్లుండునో విశదీకరంచబడినది.
దుష్టచతుష్టయములో నొకడుగా అపకీర్తినొందిన కర్ణుడి పాత్ర నిజమునకు మహాభారతము చదివిన కాని స్పష్టముకాదు. పాండవుల ధర్మబుద్ధి తెలిసి వారిపట్ల గౌరవము కలవాదైననూ. దుర్యోధనుని పక్షమున చేరినందున తన సర్వము దుర్యోధనుని కొజకే అంకితముచేసి విశ్వాసమును తెలిపినవాడు కర్ణుడు. అట్టి పాత్రము వ్యాసమహర్షి మలచిన తీరుతెన్నులు ప్రశంసించతగినట్టివి. అట్టి పాత్రవైశిష్టమును తెలువు వ్యానము
పంచదుదేదమైన వ్యాసమహాభారతము ఎంత విశిష్టమైనడో ఎంతటి విశాలమైనడో అంత్రీకరించదానికి ఉద్దందపండితులైన మువ్వురు కప్పలు పాటువడవలసివచ్చినదలవై ఆగ్రంథవైశిష్టము ఏమని చెప్పపచ్చుసు * అది ఒక స్పళంత్ర గ్రంథమగు సట్లు కవిత్రయము పాటుపడిరి. అందు. అత్యధిక భాగముసకు నీర్భాతరైన వాడు తిక్కన సోమయాజ ఉభయ కవిమిత్రుడైన అట్టి కవియొక్క అనూదిత భాగమునందలి కౌశలాన్ని గ్రహించి చెప్పవలెనన్న ఉభయ భాషాపండితులైన వారే నదుర్ణులగుదురు కడా! కావుననే ఈ “ఆంధ్రమహాభారతము -తిక్క్మన అనుసృజిక కౌశలం”. అనువదించడములో ఈక గావించిన సృజనాత్మక తత్త్వము వెలికి తీసి చూపించబదనడి.
కవులు క్రీర్యాదులను తెల్లనిదిగా వర్ణించుట, చాతకపక్షులు జలద జలముచై (గోలుట. అశోకవృక్షము పద్మినీ జాతిస్టీలపాదఘాతములచే పుష్పించుట. హంసలు నీరక్షీరములను వేరుచేయుట వంటివానిని ఎన్నింటినో వర్ణింతురు. ఇట్టి సంప్రదాయములు 'కవిసమయము'లని పేరొందినవి. ఇవి కవుల వర్ణనలో మాత్రమే యుండునని తెలు సమీక్ష “కవి-సమయములు”.
రసంగంగాధరకర్తగా ఎనలేని కీర్తిగడించిన లాక్షణికుడు జగన్నాథ పండితరాయలు మంచికవిగా కూడ ప్రసిద్ధి నొందినాడు. రసగంగాధరము నందలి ఉదాహరణము- లనన్నింటిని తన కృతుల ద్వారానే (గ్రహించినట్లు పండితురాయలు పేర్కొన్నారు. అట్టి
త౫౫ 'జగన్నాథ్రపందితరాంసల కావ్యమాధురి'రసాస్వాదనయందు అఖరుపిసి కలుగించుద్యాసము పఎడితరాయలలోని కవిరాజత్నాన్ని ప్రదర్శించునట్టిది. ఆరి, శంని సన. జ రొ న్ క్ష ౭
మరొక ప్రసిద్ధ లాక్షణికుదైన క్షేమేంద్రుడు జెచిత్య విచారచర్చా, “కవి కంఠాభరణము: ల ద్వారా పండితలోకానికి సుపరిచితుడే ! అట్టి సాహితీమణియైన క్షేమేంద్రుని కృతులెన్నో కలవు. 'క్షేమేంద్రుని రచనలు -లోకజ్ఞానానికి నీరాజనాలు ఈ వ్యాసము డ్వారా
౮ వ ఉంటా నాం! టి.
కావ్యరసాస్వాదన పిపాసులైన సహృదయులకు మాక్థొపదేశము - చేసినారు. వేయుచుందురు. ఐనను శీష్టకావ్యముగా పేరొందిన, పండితులకు సకషాయమాణమైనస “వసుచిరెత్రము, శ్లిష్టకావ్యమా?” యని ప్రశిర్నచుచూ శ్రేషకు వ్వనకి గల భేదము తెలియజేయుచూ ధ్వనికాపృముగా సిద్దాంలీకరించి యున్నారు. ఇల వ్యాసమే కాక “రామరాజభూషణుని. ద్రవృ - జాతి- హేళూత్రేక్షదాహరణములు - ఒక పరిశీలనము” సాహితీప్రవంతి ప్రియులకు ఒక చర్వావేదికు.. ఇవి విద్వాంసులను జృసరాలోచించు కొనుసట్టు చేయును.
ధృనిని గురించి ట్రధానముగా పరిశోధన గాఏంచి. తన నైపుణ్యము 'ధృని-
స్ మనుచరిత్ర" ద్వారా విద్యార్ లోకానికి మార్గదర్శకముగావించిస యట్టి పరిశోధనకు పూర్చరలగమైన “మనుచరిత్రము. ధ్వని వైశిష్టము” పెద్దనాక్యుని కవితాప్రశస్తిని న్ య స య్ లం ఉత్తపు కప్పలు ట్వసి ప్రధాసముగా తమ కాప్యములను మలచుదురు. అంధ్రభాషయందు ఆదికవిగా పేరొందిన సన్నయ తన భారతరచసను ధ్వని యుక్తముగా మలచినాడనుటలో స్తై
అశ్చర్యమేమున్నది. అట్టి ధ్వసం వెలికి చూపించు కరదీపికాతుల్యమైన వ్యాసము'నన్నయ భారతము-ధ్వని.
గత కొంతకాలముగా మనుచండత్రలోని కుతప్రకాలముగురించిన ప్రసక్తి చర్చనీయాంశమైనడి. ప్రవరుడు-అతిథి సపర్యలు చేసి. సిద్చుడు పూసిన. దివ్వ పాదలేపనముతో హిమవన్నగము చేరి. చూసి, మౌన్నారాక విధి నిర్వహణకై వంబత్రప్గివచ్చుటకు బ్రవువించెను.. మెదనగాప్ ఈ కథనము. కాలము నిరేశించుటలో
ఎంట అనౌచిత్యముగా నున్నదని పలువురు, విమర్శలకు దిగిరి. వాదోసవాదములు అనేకములు బయళల్టేరినవి. కవిని సమర్ధించుటకై పలువురు చేసిన ప్రయత్నములు సఫలములు కాకున్నవి., కాని ఆచారవ్యవహారములు, జ్యోతిషపరిజ్ఞానములు ఎరిగి యున్నందున నాన్నగారు దీనిని చక్కగా పరిష్మరించిరి. అట్టి వివరణ “కుతపకాల ప్రసక్తి లో చూడవచ్చు. ఇట్లు సంస్కృతాంధ్రకవుల కావ్యసాహిత్య విషయములనే కాక “తెలంగాణా అచ్చతెనుగు కవులను, “తంజావూరు, మహారాష్ట్ర రాజుల తెలుగు భాషా సేవొసు తెలిపి, నూతన విషయములను అందించియున్నారు. వ్యాకరణమెందుకొరకు చదువవలెనో సహేతుకంగా నిరూపించినది - “వ్యాకరణము - దాని ప్రయోజనము” అను వ్యాసం. విభిన్నకోణములనుండి సంస్కృత సాగరమును ఎందరో ప్రశంసించి యున్ననూ. అది సంపూర్తి నొందజాలదు కదా! కొత్త తరములకు కొత్త కోణములలో “సంస్కృతము- దాని (ప్రాధాన్యము”ను అందించుట వఠితలకు నంన్మృతాధ్యయునానక్తిని పంచుతుందనుటలో అతిశయోక్తి కానేరదు. ఇట్లు చెప్పిన వ్యాసములన్నియు దాదాపుగా 80 సంవత్సరములుగా తెలుగులో పలుచోట్ల ప్రసంగించినవి. రేడియోద్వారా ప్రసారితములు, విభిన్నపత్రికల ద్వారా 'ప్రకాశితములైనవి. అనేకాధ్యాత్మిక సాహిత్యిక విషయములు గల ఈ వ్యాసములు సంస్కృత తెనుగు భాషా సారస్వతముల 'ప్రాశస్యములను తెలుపుచున్నట్టివి. పుంభావ నరస్వతులుగా పేరొందిన వారి కలము నుండి జారిన ఈ అక్షరమణిమాలను ప్రస్తుతించుట నాబొటి అల్పజ్జులకు ఒక సాహసమే ! వారి పుత్రుడిగా జన్మించి ధన్యుడైననూ చిన్ననాటి నుండి వారికి ఉద్యోగరీత్యా, నాకు చదువుల రీత్యా వారి సమీపమందున్న కాలము స్వల్పమే! నేనెరిగిన వారి జీవసవిధానాలు కూడా స్వల్పమే ! నేనెరుగని విషయాలెన్నియో! (ప్రస్తుతము సంస్కృతభాషా ప్రచార సమితికి గౌరవ ఉపకులపతిగా వ్యవహరించుచున్నారు. ) కావున 1966 లో కీ॥శే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రిగారు ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక సంపాొదికుడిగా నుండగా వారు నాన్నగారి గురించి ప్రశంసించిన ఈ శ్లోకము సత్యదూరమేమి కాదు కదా! పరికించండి.
ం. శ్లో! వైదుష్యం లేఖకత్వం సుగముఫణితిభి: సంస్కృతాధ్యాపకత్వం విద్వద్ గోష్టీషు చర్చానికషణచణతా శాస్త్రవాదే పటుత్వమ్ 1 శక్తిర్ గ్రైర్వాణవాణ్యాం విబుధజనసదోభాషణేఇనర్గలా చ విద్వద్రాజన్న శాస్త్రిన్ | భవతి విజయతే భారత్సుప్రసాదాత్ | న ఇట్లు స్టం : ధర్మపురి " తేది 6-2-2004 శుభాశీస్సులనభిలషించు సభాను మామప కారిడె విశ్వనాథశర్మ (దితీయపుత్రుడు) 6 ప లా వాను మాఘపూర్ణిమా సంస్కృతోపన్యాసకులు శ్రీలక్ష్మీ నరసింహసంస్క్యృతాంధ్ర కళాశాల ధర్మపురి, కరీంనగర్ జిల్లా, ఆం.ప్ర,
. శ్రీః! కృతి సమర్పణమ్ . టు. 1... శ్లో; శ్రీ శివానందమూర్తే! శమదమగుణగణ్య! సద్దురో! మహిత |! స్వరచిత “మంజూషా” ఖ్యం పుష్పం భవతశ్చ చరణయోరేతత్॥ 2. శ్లోః సురభిళమర్చితుకామః సమర్పయామ్వేష వినయన(మైో౭హమ్! స్వీకురు జన ఏతస్మిన్ దృష్టిం కరుణాతరంగితాం వితర॥ (యుగ్మం) 8. ల్లో దీనార్త భక్త జనతాహృదయాక్రందాళి హిమ - సహస్రాంశుః | అత్మానుభూతిమహితో వైదికవిద్యాసునిప్టితో౭త్యంతమ్ 1॥ శ. శ్లో, మధురో మనసి చ వచసి చ కర్మణి సర్వత్ర బద్ధ దృఢదీక్ష: | కుంకుమను విభూతి రేఖాంకిత నిటలో భారతీయతా మూర్తా ॥ త. శ్లో! నిరుపమ మహిమ గఖీరో వాన్తాఖిలశాస్త్రసారవాగ్విభవః 1 శ్రీకందుకూరి వంశాంబునిధే రాకాసుధాకరో జయతి 1 (విశేషకము) ఇతి సా హమష్షే వ్ స్వభాను మహాశివరాత్రి; సాంజలిబంధ మను(గ్రహమ పెక్షమాణ: దినాంకు - 18-2-2004 సం/- శ భాగ్యనగరం, (హైద్రాబాద్) కే. రాజన్నకాస్తీ
న. శ్రీః రృతజ్ఞతానమోవాకము శ్లో! అభివాదనశీలస్య నిత్యం వృద్దోపసేవినః | చత్వారి తస్య వర్ధంతే ఆయుః ప్రజ్ఞా యశో బలమ్ ॥ -మనుస్మృతి. .
నావిద్యాభ్యాసము ప్రాచీనపద్దతిగా జరిగినది. నాకు అష్టవర్న వయస్సుననే ఉపనయనము జరిగినది. బ॥|శ్రీః గుండ సదాశివ ఘనపాఠిగారి దగ్గర వేదము నభృసించితిని. సంగనభట్ల మాణికృశాపస్రిగారి దగ్గర అమరకోశము నభ్యసించితిని. అధ్యయనమనగా సూర్యోదయమునుండి సూర్యాస్తమయము వరకు పఠించుట - (కించిద్చోజన విరామము తప్ప) - నా పదకొండవ యేట (||శ్రీ తాదూం బాలక్యష్ణశాద్రిగారి సంస్కృత పాఠశాలలో ్రవేశంచితిని. చేదాధ్యయనపద్తతి నాకళించుకొనిన నాకు సంస్కృతాధ్యయన. పద్ధతి సులభమనిపించెను. - శబ్బమంజరి (360 శబ్దములు) సమాసకుసుమావళి కంఠస్థము చేసితిని - కావ్యాధ్యయనము అనగా శోక - పద- అన్వయ-అర్జ - ఆకాంక్షాదండాన్వయములు శబ్ధ సమాస వ్యాఖ్యాన - వ్యాఖ్యానార్థములు = ఇవి యన్నియు కంఠస్థముగా చేసె గురువుగారికి వినుపంచుట జరుగును. ప్రాచీస పద్దతిలో వేదమునకు 1౪ వల్లెలు - సంస్కృత కాచ్వాధ్యయనమునకు 6 వల్లెిలు నసం(వ్రదాయము. రెండు లేడా మూడు వల్లెలకు కంఠస్థమ్రైనను ఆయానియామాను- సారముగా వళ్లెలు పూర్తి చేయవలసినదే పాఠశాలలో గురువు గారు పెద్ద పెద్దతరగతి పాళములు చెప్పును. చిన్నపాతములు అయా సుశిక్షిత శిష్యులే నిర్వహింతురు -. మూడు కావ్యాలు పూర్తి చేయగానే శిష్యులు గురుపుగారి సమక్షమున తమ కావ్య పాఠమును అనగా అ శ్లోకమును, ఆశ్లోకపదచ్చేదము శబ్దములు లింగ ఏభక్రి విశేషవిశేష్య భావాదులు అర్జ సమానములసు విగ్రహవాక్య వ్యాఖ్యాన విశేషాంశములను స్వయముగా వినిపించటయే జరుగును. ఇది ఆనాటి పాఠప్రవచన పద్దతి, శిష్యులందరు కలిస పాఠము చింతన చేయుట. కలసి వల్లె వేయుట జరుగును. కాని పాఠము వ్రాసుకొని అధ్యయనము చేయుట లేదు - మొత్తము 19 మంది. సహాధ్యాయిలము. మేము అందరిలోను నేను అగ్రుడసు. అష్టమి. చతుర్తశి పూర్ణిమ/ ఆమూనా:? ప్రతిపద ఈ
౫0060౪
మూడు దినములు 'ప్రతిపక్షమున అనధ్యాయములు - ప్రతి పక్షము చివర ఆ పక్షము దినముల పారములకు మౌఖిక పరీక్ష జరుగును - ఇట్లు నిరంతర పఠనమే సాగుచుండును.
నాకు ముఖ్యముగా మా గురువుగారి తరువాత గురువు బ॥శ్రీ॥ తుంగూరి శివరామశాస్త్రి - వారి పారప్రవచన శక్తి అద్భుతము - నేనింతవాని నగుటకు కావలసిన సంస్కృత భాషయందలి మెలకువలను నేర్పిన మహనీయుడు. నా 18వ యేటనే నేను సంస్కృత కావ్యనాటకాలంకార శాస్తాదులయందు సునిశిత వ్యుత్పత్తి జ్ఞానములను సంపాదించితిని - శ్రీ తుంగూరి శివరామశాస్త్రిగారు శబ్బసుందరశ్లేషచమత్కతి సమంచితకవివతంసులు - వారే నన్ను కవితలు వ్రాయ ్రేరేపించిరి - నన్ను ప్రియమిక్రునిగా భావించేవారు - వారు మహామేధావులు - భండార్మరు ఆంగ్లమున వాసిన సంస్కృత వ్యాకరణ ప్రధమ ద్వితీయభాగముల సహాయమున సంస్కృత మాధ్యమము ద్వారా ఆంగ్లమును నేర్చుకున్నారు. ఇది అద్భుతము కాదా! రాఘవపాండవీయాది ద్వ్యర్థ కావ్య విశేషములను కూడ నాకు బోధించేవారు - నేను నంస్కృతకవితలో శ్లేషచమత్కృతిని సాధించుటకు వారే ముఖ్యకారణము ప్రతికావ్యమందును నాలుగేసి చొప్పున సర్గలు అధ్యయనము చేయుట జరుగు - అధ్యయనానంతరము నేను నైషధముతో సహా అరుకొవ్వములు ్రతికావ్యము పూర్తిగా సవ్యాఖ్యన విశేషాంశములతో నాలుగుసార్లు మనన పురూసరముగా పరిశీలించితిని - అదియే ఇట్టి కవితను వ్రాయుటకు కారణమైనది. మాతండ్రి బ్ర॥శ్రీ॥ కొరిడె కిష్టయ్య గారు సంస్కృతభాషా జ్ఞానము స్వయంకృషితో సంపాదించినవారు. ఏ శ్లోకమున కైనను వెంటనే తాత్పర్యము విశదీకరించేవారు - మహాభారతము నంతయు పరించినవారు అది కరెంటు లేని కాలము - ఆముదము దీపము వెలుగులో రాత్రి చాలాకాలము [్రంధపరనము చేయుచుందెడివారు. - మా పెద్దనాన్నలు సదాశివఘనాపారి గోపాలం ఘనపాఠులు ఇద్దరును రాష్ట్ర ప్రభుత్వ సన్మానము నొందిన వారు - ముఖ్యముగా మరియొక పెద్దనాన్న బ్ర॥ఃశ్రీ॥! గుండి రాజన్న శాస్త్రిగారు బ్రహ్మనిష్టులు శ్రీమద్భాగవతం (బ్రహ్మసూత్రాలు (గ్రంథ సహాయము లేక యే ప్రవచించేవారు.
నా చిన్నతనము ఏకోపాధ్యాయ పాఠశాల (ఇందాది మదరసా)గా నుండిన పారళాల ఎనిమిదవ తరగతికి చేరినది అది విద్యాకమిటీ సభ్యుడగు మా తండ్రి మొ॥ వారి కృషిఫలితం. అచ్చటిఎనిమీదవ తరగతికి ఐచ్చిక సంస్కృతం బోధిలంచుటకై నన్ను ప్రోత్సహించిరి. రాజన్నగా ఉన్న నాపేరు రాజన్నశాప్ర్రిగా మారెను - వరుసగా ౫ సంవత్సరములు
00
బోధించితిని - ధోతి ఉత్తరీయం ధరించియే పారము చెప్పి వచ్చెడి వానిని - నా చిన్నతనమున నెక్కరు అంగీనే (చొక్కా, ధరించేవాడను - ఉపనయనానంతరం ధోవతి ఉత్తరీయం ధరించుటయే ఆచారం (పరీక్షా ప్రపంచమున కడుగిడిన తరువాత ధోవతి షర్టు ఉత్తరీయం ధరించుట జరిగినది) ఇప్పటికిని మా గ్రామమున నేను ధోవతి ఉత్తరీయమునే ధరింతును
మాతండ్రి 'కల్యాణ' మాసపత్రిక తెప్పించేవారు కల్యాణ పత్రిక పరనము నాకు ఎంతో ఉపకరించినది - నేను మధురవాణీ, భారతవాణీ, సంస్కృతం (సాష్తాహికం) మొదలగు సంస్కృత పత్రికలను తెప్పించి చదివేవానిని సంస్కృత పత్రికల్లో నావ్యాసాలు కవితలు అచ్చైనవి (1953) పాఠశాల పరిశీలనార్ధము వచ్చిన ఒక జిల్లావిద్యాధికారి 'ప్రేరణచే నా దృష్టి పరీక్షల వైపు సాగినది. మొదట నాకు వ్రాయుటయెందుకు? మౌఖింకగా పరీక్షించిన బాగుండు ననిపించినది. - పరీక్షా పార్యగ్రంధములనన్నింటిని కంరస్థము చేసినవాడను కదా ! 1957 ఎంట్రన్స్ పరీక్ష ప్రథమశ్రేణిలో ఉత్తీర్చుడనైతిని, సంస్కృత పత్రికలలో నా సంన్కృతవ్యాసములు కవితలు అప్పటివరకే ముద్రితము అగుచునేయుండెను. నాకు 'సాహిత్యరత్ను బిరుద ప్రదానము పూరీగోవర్థన పీఠాధిపతుల ద్వారా జరిగినది 1956. 1959లో కురుక్షేత్ర విశ్వవిద్యాలయము నుండి “శబ్ద జ్యోత్స్నా! అను ఒక వ్యాకరణ [గ్రంధము నా అభిప్రాయమునకు వచ్చినది - ఆ గ్రంధకర్త భిక్షారామశాస్రి - పాణినీయసూత్రాధ్యయనము కష్టమని భావించి నూతనసూత్రసృష్టి చేసి రచించిన (గ్రంధము - ఆ (గ్రంధాన్ని ఆమూలాగ్రం ఖండించి పాణినీయాధ్యయనమే సులభమని సంస్కృతంలో, అభిప్రాయం వ్రాసి పంపాను. ఈ (గ్రంధఖండనసందర్భంలో వ్రాసిన ఉపోద్దాతమే 'పాణీనీయస్య సుబోధతా” అను పేరున 'సాగరిక యందు ముద్రితము
- ప్రతాపరుద్రీయము - సిద్దాంత కౌముదీ - మీమాంసాన్యాయప్రకాశఃు మొదలగు (గ్రంధములను ఆయా పరీక్షల సందర్భమున కంరస్టము చేసితిని. ( మీమాంసాన్యాయప్రకాశకు ప్రశ్నోత్తరీని కూడ రచించితిని చౌఖంబావారు ముద్రిస్తామన్నారు. కాని పంపలేదు.) విద్యాప్రవీణ పరీక్షోత్తీర్ణుడనై సంస్కృత పండితునిగా నియక్తుడనై సుల్తానాబాదలో నున్నప్పుడు భారతీయవిద్యాభవనం వారి సంస్కృతపరీక్షల నడిపితిని - అధ్యాపకులకందరికి సాయంకాలం సంస్కృతం బోధించితిని - నేనంటే అధ్యాపకులకందరికి అమితాదరం అచ్చటి (సుల్తానాబాడు) గ్రామప్రముఖుల అదరముచే రామాశ్వమేదాది పురాణప్రవచనము చేయబడినది. ఆ సందర్భముననే రచించిన “రఘువంశే రామాశ్వమేధ సారూప్యం"
00/1
అను సంస్కృతవ్యాసం సారస్వతీసుషమా (వారాణసేయ సంస్కృత విశ్వవిద్యాలయ త్రైమాసిక పత్రిక వారాణసీ) యందు అచ్చెనది (1962) ప్రజలచే నెన్నుకొనబడిన రాజకీయ నాయకుల మిడిసిపాటును పరభృతా (కోకిల) న్యాపదేశముగా వర్ణించుకవిత “'పరపుష్టదశకమ్' 1961 లో న్యూడిల్లీ సాహిత్య అకాడెమీ వారి “సంస్కృత ప్రతిభొలో ప్రకాశితమైనది. దీనిచే ఆనాటి మద్రాసు విశ్వవిద్యాలయ సంస్కృతవిభాగాధ్యక్షులు డా॥ వి. రాఘవన్ గౌరి పరిచయమబ్బెను. అట్లే 1963 లో సాగర్ విశ్వవిద్యాలయము వారి “సాగరికా” త్రైమాసిక పత్రికలో మరొక అన్యాపదేశ (ప్రధానమైన కవిత బలిపుష్టవిలసితమ్” ముద్రితమైనది. ఈ కవితలో అవినీతి పరుల యాగడములు అన్యావదేశముగా వర్ణితములైనవి. అవృటివరకే వివిధ విషయములపై నాసంస్కృతవ్యాసములు వివిధ సంస్కృతకవితలు పండిట్ జవహరలాల్ నెహ్రూ, డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రభృతుల పై రచించిన “బాలభారతమ్” మాసికపత్రిక (బొంబై) భారతవాణీ పక్షపత్రిక (పూనా) సంస్కృతమ్ (సాష్తాహకం అయోధ్య) మొదలగు సంస్కృత పత్రికలలో ప్రకాశితములైనవి - దీనిచే నాకు సాగర్ విశ్వవిద్యాలయ నంస్కృత విభాగాధ్యక్షులు డా॥ రాంజీ ఉపాధ్యాయప్రభృతి వివిధ విశ్వవిద్యాలప్రాచార్యులతో ఆయా సంస్కృతపత్రికాసంపాదకులతో పరిచయము పెరిగినది. ఒక ప్రముఖ సంస్కృత పండితుని ఆశుకవిత పత్రికలో నచ్చుకాగా చూచి ఆ కవితను విమర్శించుచు నేను వ్రాసిన సంస్కృతవ్యాసము, అదే సంస్కృతపత్రికలోనచ్చాయెను - దానిచే నా సహృదయ సంస్కృతపండితుడు అచ్చెరువొంది నన్నాశీర్వదించి నా పాండిత్యమును ప్రశంసించుచు శ్లోకములు వ్రాసి పంపెను - ఇది యంతయు జరుగునప్పటికి నా వయస్సు 30 సంవత్సరములు, (1963-64)
నేను 1964-66 రెండు సంవత్సరములు కేంద్ర ప్రభుత్వము వారి స్కాలర్షిస్తో ఉస్మానియా విశ్వవిద్యాలయ, సంస్కత అకాడెమీ సాహిత్యరత్నాకరపరిష్క్మకరణమను నంశమున పరిశోధన గావించితిని. అప్పుడు నాకు వివిధ వ్యాకరణాలంకార మీమాంసాది శాన్త్రగ్రంథముల పరిశీలించునవకాశమేర్చడెను. దినదిన (వ్రవర్థమానమగు సలంకారశాస్త్రమున నెన్నో విషయములు చర్చనీయాంశము లాయెను. వానిపై సంస్కృత వ్యాసములు వ్రాసి వివిధ విశ్వవిద్యాలయ పత్రికలలో (సారస్వతీసుషమా, సాగరికా, సంవిద్, అమృతలతా సంస్కృతమ్ మొ) ప్రకటించితిని. ఈ సంస్కృతవ్యాసములు నేను ఇటీవల ప్రకటించిన నా “నిబంధరత్న సముచ్చయః (2004) అను గ్రంథమున
ను...
చూడవచ్చును. సంస్కృతపాండిత్యమును పురస్కరించుకొని నాకానాడు ప్రముఖ పండితులతో, డా॥ దివాకర్షవెంకటావధాసి గారు. డా బిరుదురాజురామరాజుగారు డా;[భూవతిలక్ష్మీనారాయణరావు గారు మొదలగు వారితో దినదినప్రపర్ధమాన పరిచయమేర్చదెను మేము చాలా విషయములను చర్చించుచుందెడివారము. డా॥ ప్తల్లెల శ్రీరామచంద్రుడు గారు నా సంస్కృతకవితల నెంతగానో మెచ్చుకొన్నారు. మరియు సంస్క్యృతకవిగా నా విషయం యువభారతి ప్రత్యేకసంచికలో ఒక వ్యాసం ప్రకటించుట గమనించదగిన విషయం - దీనితో నేను సంస్కృతకవిగా లబ్ధప్రతిష్టుడనైనాను -
ఇంతవరకు నంన్కృత ఎవ్ ఎ,తో నమానమగు “విద్యావవీణ” స్వాతకోత్తరపట్టభద్రుడునగు నేను బి.ఒ.ఎల్ (తెలుగు) మరియు తెలుగు పండిత ట్రైనింగ్ పరీక్షలు ఈ రెండు సంవత్సరములలో పూర్తి చేసి తిరిగి జిల్లాపరిషత్ కరీంనగర్లో ఉన్నత పారశాలా ప్రధమశ్రేణి తెలుగు పండితునిగా 6 సంవత్సరములు ఉద్యోగము సిర్వహించితిని అప్పుడు కరీంనగర్జిల్లా అనేక సాహిత్యసదస్సులో కవితాగోష్టులలో కుటుంబ- నియంత్రణాద్యనేకాధునిక విషయములపై అన్యాపదేశసంస్కృతకవితలు చదివితిని "శర్వరీ" అను కుటులబనియం(త్రణకవిత (సార్ధతాత్పర్య) కరీంనగర్ జిల్లాపరిషత్తువారు చిన్న పుస్తకం గా ముద్రించియున్నారు. గాంధిశతజయంతి సందర్పమున గాంధీజీవిత చిత్రణపై రచించిన తారాద ఏ: యను నా కవితకు అప్పటివిద్యాశాఖమంత్రి గౌ॥ శ్రీ పి వి నరసింహారావుగారి ద్వారా (1969) నాకు సన్మానము జరిగినది - అద్యాపకుడనై యున్నప్పుడే ప్రైవేటుగా ఎమ్ ఒ.ఎల్.. ఎమ్ ఎ, (తెలుగు) పరీక్షలలో ప్రడదు శ్రేదిలో నుత్రీర్ణుడనై సెప్టెంబరు 1972లో సర్దార్ పటేల్ (డిగ్రీ) కళాశాలలో తెలుగు లెక్టరర్‌గా నియుక్తుదనైతిని,
ఏక పి హెచ్ డి పట్టమునకై ద్రయత్నించితిని ఆనాటి తెలుగు విభాగాధ్యక్షులు దాః దివాకర్ల వేంకబావదాని గారు నాకు పర్యవేక్షకులు గానుండిరి. నేను గ్రహించిన పరిశోధనాంశము - ద్ననితత్త్వము నిర్వచించి దానిని తెలుగు పంచకాప్యములయందు నమన్నయపరచుట ధృ్నని తత్తమునుసిర్నవించుటకే ఏడు. పప్రకరణములు పట్టినవి. విషయవిస్త్యృతి నుపలక్షించి (ప్రధాన (ప్రబంధమగు మనుచరిత్రము నందు మాత్రమే సమన్నయ పరుచుటకై కుదించుకొనుటకును మరియు ఫ్యాకల్టీ ఇంప్రూమెంటు పోగ్రామ్ (51.0) క్రింద 2 సం ॥ పరిశోధన చేయుటకును ఆనాడు తెలుగు విభాగాధ్యక్షులు గానున్న ఆచార్య డా॥ వీ రామరాజు గారు నాకు ఎంతగానో సహకరించిరి. నేను పి హెచ్డి పట్టము. 1980లో పాధించితిని
00/11
1981 ఉస్మానియావిశ్వవిద్యాలయతెలుగు శాఖలో ఉవన్యాన కునిగా నియుక్తుడనైతిని 1957 లో ఎంట్రన్స్ పరీక్షతో ప్రారంభించి 1980లో పి.హెచ్.డి. పూర్తి చేసితిని ఇది 24 సంవత్సరముల అధ్యయన విధి -
హైద్రాబాద్ జీవిత మారంభించిన పిమ్మట డా॥-దివాకర్ల వేంకటావధానిగారి
కతిసుపరిచితుడనగు నేను భువనవిజయాది సాహిత్యరూపకములలో కవి సమ్మేళసములలో ధార్మికకార్యక్రమములలో పాల్గొంటిని - వారి సాహచర్యము వలన నేను ఉపన్యాసము చెప్పుటలోని మెళకువల నాకళించుకొంటిని. వారి ప్రోత్సాహముచేతనే ఏన్నో గ్రంధములకు పీరికలు వ్రాసితిని. ఆయా వార్షిక సంచికలలో వ్యాసములు వ్రాసితిని. శ్రీవిద్యాసేవాసమితి వారి కార్యక్రమములలో ఉపన్వాసకునిగా పురాణప్రవచనకర్తగా పాల్గొంటిని. సంసృతభాషా ప్రచారసమితి వారి కార్యవర్గసభ్యుడనైతిని (ఈనాడు ఉపకులపతిగా నున్నాను) తిక్కన పదప్రయోగకోశము (్రూవులు దిద్దుట నాకప్పగించుటచే ఆం(ధ్రమున నాకెంతో విజ్ఞానాభివృద్ధి జరిగెను.
ఆచార్య డొ॥ బి. రామరాజుగారు సంస్కృతాంధ్ర ప్రాక్కృత భాషా గ్రంధముల నెన్నింటినో పరిషరించుచున్నప్పుడు వారికి తోడుగా నేను పరిశీలించుచుండెడివాదిని దానిచే నాకు వ్రాతప్రతుల పరిశీలనా విషయమున పారాంతర నిర్ణయ విషయమునను విజ్ఞానమినుమడించెను. దా॥ బి రామరాజుగారు నన్ను మిత్రునిగా భావించి గౌరవింతురు 1977 లో బెంగుళూరులో జరిగిన సత్యసాయిబాబావారి రామాయణసదస్సులో పాల్గొని ప్రసంగించుటకు వారి యాదరాభిమానములే కారణము
ఇట్లు నెనెన్నియో సాహిత్య కార్యక్రమములలో పాల్గొన్నాను.
నేను 1993 లో సేవానివృత్తుడ (రిటైర్జు) నయితిని. అయినను హైద్రాబాద నివాసము వీడలేదు. దేవాదాయ శాఖలో అసిస్టెంటు కమీషనర్‌గా నుండి ఆరాధనపత్రికా సంపాదకత్వము నిర్వహించుచున్న ఆగమశాస్త్ర పండితుడు బ్రహ్మశ్రీ బుడిసత్యనారాయణ నిద్ధాంతి గారి (ప్రోత్సావాముతో ఆనందరాదూయణ సారకొాండమునకు తాత్పర్యవిశేషాంశముల వ్యాఖ్య వ్రాసితిని 2 సంవత్సరములు “ఆరాధన” లో అచ్చయినది లక్షీకాపూల్ హనుమాన్ దేవాలయములో దేవీభాగవతం (పూర్తి) పురాణప్రవచనం ఇట్లెన్నియో దేవాలయములలో వాల్మీకి రామాయణ- భారత -భాగవతపురాణ ప్రవచనవమిలు, బ్ర॥శ్రీ మాడుగుల నాగఫణిశర్మ శ్రీ॥ మేడసాని మోహన్" మొదలగు
౫౮61౫ ఆవధానుల అష్టావధానాదులలో పృచ్చకునిగా పాల్గొనుట, కవితా వ్యాసంగము గ్రందరచన ఆకాశవాణి- దూరదర్శన్లలో ప్రసంగించుట (ప్రవచనములు కవితాపరనము వత్యాదిసాహిత్య వ్యాసంగములు కొనసాగుచునే యున్నవి. నాకెన్నియో పండితసత్మారములు సాహితీ సృరస్కారములు అపీంచిన సంగతి సర్వ విదితమే.
౨౮0౮4 ల జులైలో నాసంస్క్యృత వ్యాసముల సంపుటిని నిబంధరత్న సముచ్చయః అసు పేరున వెలయించికిని - ఈనాడు సూర్యాలోకమును పొందుచున్న గ్రంధం “దుంజూప' (అద్యాత్మికసాహిత్యకవ్యాసముల సమాహారం)
సద్గురు శ్రీ శివానందమూర్తిగారు. విజ్ఞానఖనులు ఆధ్యాత్యనిష్టులు నాకృతిని స్వీకరించసమ్మతించిరి. వారి కంకితముగా నా యీ 'మంజూషు యను గ్రంధరూప పుష్పమును శ్రీవారి చరణములయందు సమర్పిస్తున్నాను. డా॥ బి. రామరాజుగారు నన్ను శ్రీ వారికి పరిచయము చేసిన ఫలితంగా నాకీ సుకృతము లభించినది.
శ్రీవారి అమృతోత్సవనమయమున వరంగల్‌లో 5000/- నగదు గ్రంథముద్రణార్ధము నాకు పండితసన్మానము చేసిఇచ్చినారు. మరియు ఈనాడు
శుబాకాంక్షలు” వ్రాసియిచ్చి రూ. 10000/- పదివేల రూపాయల చెక్కు అనుగ్రహించినారు. సహృదయులు కరుణాతరంగితాంతరంగులు పండితపక్షపాతులు పదాన్యులును అగు శ్రీ సద్గురు శివానందమూర్తి గారికి నా కృతజ్ఞతాపూర్వకనమోవాకములు.
నా పాండిత్యగరిమను (గ్రంధగౌరవమును ఇనుమడింపజేయుచు “పస్పశము” (ఉపోద్దాతము) వ్రాసి ఇచ్చిన నైకగ్రంధరచయితలు నైకగ్రంధపరిష్కర్తలు జాతీయాచార్యులు డా॥ బి రామరాజు గారికి నా హార్దిక నమః సుమాంజలులు.
పాల్కురికి సోమనాథుని (గ్రంధపరిష్కరణకై విశేష పరిశోధన చేయుచున్న సహ్య్మదయవిద్వద్వరులు శ్రీ. వి.వి సుబ్రహ్మణ్య శర్మగారు నా యీ గగ్రంధముద్రణార్థము రు 2500/- రెండువేల అయిదువందల రూపాయలు చెక్కుద్వారా పంపినారు. వారికి నా కృతజ్ఞతావందనములు.
నా చుధ్యనమునకేయాటంకము కలుగుకుండ రాత్రిసమయమున నేను పరించునంతవరకు విసనకటజ్దతో వీచుచు (కరెంటులేనిదా కాలము) సహధర్మచారిణి యను పదమునకన్నర్థముచేకూర్చిన నా ధర్మపత్ని ల॥సౌ॥॥ సులోచనకు శుభాశీస్సులు ప(త్రపదమునకన్నర్భృడై సిలిచిన నా ద్వితీయతనయుడు సంస్కృతోపన్యాసకుదు శ్రీ కొరిడె
గం
ఎవిశ్వనాధశర్మ (శ్రీ లక్ష్మీనరసింహసంస్కృతాంధ్రకళాశాల - ధర్మప్పుఠి) నా పరిచయము రచనల ప్రాశస్త్యము ఇహుముఖప్రజ్ఞాశాలి అను వ్యాసమున కీర్తించినాడు - ఆత్మస్టానీయుడగు చిరంజీవి విశ్వనాధశర్మకు చిరాయురారోగ్యైశ్వర్యాభివృద్దిగా నా యాశీర్వాదము.
అందంగా ముద్రించిన అర్.కే ప్రింటర్స్ అధినేత విద్వదవతంసులు బహ్మాశ్రీ కంబంపాట్ సీఠారాంజనేయులు గారికి కృతజ్ఞతానమస్సులు.
గా రచనా వ్యాసంగమును ప్రోత్సహించిన విద్వత్మవి శ్రీ కే రామారావు ప్రబృతి మిత్రబ్బందమునకు నా హార్దిక ప్రణతులు, ఇంకెందరో నాయబిచృద్ధికి సహకరించిన వారు అందరికి నా కృతజ్ఞతాభివందనములు.
ఇట్లు భాగ్యనగరం (హైద్రాబాద్) ఆంధ్రప్రదేశ్ విధేయుడు 1925 శా॥ శకము కే రాజన్నశాస్త్రీ స్వభాను మహాశివరాత్రిః ం64ం 0401001088 0.౮. (10) దినాంకః - 18-2-2004 ఆంధ్రప్రదేశీయ కరీంనగర్ మండలాంతర్ల్గత “ధర్మపురి” వాస్తవ్యులు
విషయానుక్రమణిక విషయము పుట 1 రుద్రాభిషేకమహిమ గ 2. శివభక్తిమహిమ క రె. భక్తియోగము - దాని ప్రాధాన్యము గ 4. _ దేవీభాగవతము- శ్రీదేవీతత్త్వము నన్ 5, _ సౌందర్యలహరి - పరదేవతాతత్త్వము 29 ౮, భారతీయసంస్కృతి ॥ వేదప్రాధాన్యము 38 77 గీతా సుగీతా కర్తవ్యా 50 తి. అహింసా పరమో ధర్మః క్ల్ 9 _ సత్రవర్తన - ధనము 62 10. శ్రీమద్రామాయణము - భరతుడు 67 11 వ్యాసమహాభారతము - కర్టుడు 77 12. _ ఆంధ్రమహాభారతం - తిక్కన అనుసృజనకౌశలం 779 13. కవిసమయములు 96 14. జగన్నాధ పండితరాయల కావ్యమాధురి 104 15. _ క్షేమేంద్రునిరచనలు - లోళజ్ఞానానికి నీరాజనాలు 1138 16. నైషధీయచరితము- శ్రీ హర్షుని ప్రతిభా పాండిత్యములు 126 17. మయూరః జాతీయవిహగః 134 18. వసుచరిత్రము జష్టకావ్యమా? 140 19 _ రామరాజభూషణుని ద్రవ్యజాతి హేతూత్రేక్షోదాహరణములు ఒక పరిశీలనము కేత? 20. నన్నయ భారతము -- ధ్వని 155 21. మనుచరిత్రము - ధ్వనివైశిష్ట్రము 164 22 ప్రవరుని హిమాలయ గమన సమయము-కుతపకాల ప్రసక్తి 170 23. తంజావూరుమవారాష్టరాజులతెలుగుభాషాసేవ రెండవ తుళజా - అమరసింహుడు - రెండవ శరభొజీ 178 త్త, ప్రబంధము - ధ్వని 183 25. తెలంగాణా అచ్చతెలుగుకవులు 194 26. వ్యాకరణము - దానిప్రయోజనము 206 27. సంస్కృతము - దాని ప్రాధాన్యము ప్న
రుద్రాభిషేక మహిమ “విశ్వం భూతం భువనం చిత్రం బహుధాజాతం జాయమానభెచత్ సర్వో హ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు॥ / (కై. ఆ ప్రపా.1 అను 16)
చేతనా చేతనరూపమున నుండి యచ్చెరువు గొలుపునదియును, ఇంతకు పూర్వమే ఉత్పన్నమయినదియును, ఇవ్పుడు ఉత్పన్న మగుచున్నదియును అగు ఈ ప్రపంచమంతయును రుద్రరూపమై యున్నది అట్టి సర్వాత్మకుడగు రుద్రునకు నమస్కారము.
ఈ మంత్రములోని పరమార్ధమును చాటి చెప్పునది రుద్రాధ్యాయము._ ఇది కృష్ణ యజుర్వేద సంహితయందలి నాలుగవ కాండమున చతుర్ధప్రపారకమున నున్నది. దీనినే శతరుద్రీయమనియు నందురు. “శతమిత్యపరిమితత్వం లక్ష్యతే. అవరిమితా రుద్రా యన్మిన్నధ్యాయే (వతిపాద్యంతే సో£ ధ్యాయః శతరు[ద్రీయణ అని శతరుద్రీయపదమును సాయణాచార్యులు నిర్వచించిరి. పరిమితి యను నది లేనివిధముగా రుద్రమూర్తులు ఈ యధ్యాయమున ్రతిపొదింపంబడుచున్నారు కావున దీని కీ నామము కలిగెను. దీనికి 'నమకిమను నామధేయము లోక వ్యవహారమున రూఢమైనది. దీనియందు పదునొకం దనువాకములు గలవు. ఇందు మొదటి యనువాకముచే శివుని ప్రళభయకాలిక రౌద్రరూపమును, అతని యాయుధములను నమస్కారముతో శాంతింపంజేయుట జరిగినది. శివునకు రెండు విదములైన రూపములు గలవు సృష్టిని ఉపసంహరించు సమయమున దాల్చునది ఘోరరూపము మొదటిది. రెండవది యఘోరరూపము. ఇది భక్తుల ననుగ్రహించు సమయమున దాల్చునది - కావుననే మరియును “యా తే రుద్ర శివా తనూ రహోరా2. పావకాశినీ, తయా న నస్తనువా శంతమయా గిరిశంతాభిచాకళీహి.”
ఓ రుద్రా 1ఓభక్తుల ననుగ్రహించు మంగళప్రదమైన యఘోరమను నీ రూపును ప్రకాశింనపంజేసి నన్ను సుఖవంతునిగా జేయుము” అని ప్రార్ధించుట జరిగినది రెండవ దాః కే. రాజన్నశాస్త్రీ
2 మంజూష యనువాకము మొదలు తొమ్మిదవ యనువాకమువజకు గల మంత్రములతో శివుడే ఈ సర్వప్రపంచమును వ్యాపించియున్నట్లు భావించుచు స్తుతించి నమస్మరించుట జరిగినది. ఇట్లు శివుని ప్రసన్నునిగాం జేసికొని పదియవ - పదునొకండవ యనువాకములచే అభయము ( అనుగ్రహము). అర్ధించుట జరిగినది. ఇది సంగ్రహముగా ఈ రుద్రాధ్యాయ (నమక) సారాంశము. ఈ రుద్రాధ్యాయమునే రుద్రోపనిషత్తనియునందురు. దీనియందు (బ్రహ్మవిద్యయు ప్రతిపాదితమైనది. ఎట్లన, బ్రహ్మమునకు మూడు రూపములున్నవి. సర్వోపాదాన మగుటచే సర్వాత్మకమైన కార్యరూప మొకటి, సృష్టి స్థితిసంహారకారణమగు “విరాటొ పురుషరూపము రెండవది. ఇదియే పురుషసూక్త ప్రతిపాద్యము ఈ రెండును అవిద్యచే నేర్సడినవి. ఇక మూడవది సత్యజ్ఞానానందలక్షణమగు నిర్గుణ పరబ్రహ్మరూపము. ఇట్లు పరబ్రహ్మరూపుడగు శివుని అనగా రుద్రుని ప్రతిపాదించుటచే నిది రుద్రోపనిషత్తు. జాబాలోపనిషత్తున నీవిషయ మిట్లు వివరింప బడినది.
“అధ్రహైనం (బ్రహ్మచారిణ ఊచుః | కిం జప్యేనామృతత్వమశ్శుత ఇతి బ్రూహీతి సహోవాచ యాజ్జవల్యః, శతరుద్రీయేణేతి! ఏతాని హ వా అమృతస్య నామధేయాని భవంతి | ఏతైర్హ వా అమృతో భవతి”
దేనిని జపించిన అమృతత్వము (బ్రహ్మత్వము) లభించునని బ్రహ్మచారుః (శిష్యులు) ప్రశ్నింపంగా యాజ్ఞవల్క్యుడు శతరుద్రీయమును జపించిన అమృతత్వము సిద్ధించునని నుడివెను వలన? శతరుద్రీయముననున్న నామము లన్నియును అమృత (బ్రహ్మ) నామములే, కావున వానిచే నమృతత్వము బడయును
ఇట్లు ఈరుద్రాధ్యాయము (నమకము) ఎంతో పవిత్రము, పాపహరము, మోక్షదాయకమును అని యనుబలో నిసుమంత సందియమును లేదు కావుననే శివునకు నభిషేకము నమకాదులం జపించుచు ప్రతిదినము చేయు సంప్రదాయము రూఢమైనది. నమకాదులను ఒకమారు ఆవర్తించి చేయు నభిషేకమును నకృదావర్తన రుద్రాఖిషేక మందురు. ఇంకను రుద్రాభిషేకమున పలుభేదములు గలవు.
ఏకాదశరుద్రాభిషేకము, లఘురుద్రాభిషేకము, మహారుద్రాభిషేకము, అతిరుద్రాభిషేకము అని. వీని ప్రాశస్యము మేరుతంటత్రోక్తమని చెప్పి, భట్టభాస్కరుడిట్లు సం(గ్రహించెను.
“ఏకః పారో “నమస్తే స్య హ్యనువాకః పరస్య చ । ఏవం భవాయ “నమస్తే”
డాః। కే. రాజన్నశాస్రి
రుద్రాభిషేక మహిమ నా స్యోఅగ్నా విష్ణూ” తథైకకమ్। ఇదం రుద్రీ సమాఖ్యాతా రౌద్రపాపనికృంతనీ, అనయా ప్రత్యహం యస్తు కుర్యాల్లింగాభిషేచనమ్ ; జన్మజన్మ కృతం పాపం వర్షమధ్యే ప్రణశ్యతిః రుద్రీభిరేకాదశభిర్లఘురుద్రః ప్రకీర్తితః 11 అనేన సిక్తం యెర్లింగం తే న పశ్యంతి భాస్కరిమ్। ఏకాదశబిరేతైస్తు మహారుద్రః ప్రకీర్తితః ॥ నిర్ధనో ధన మాప్నోతి మహాపాతకనాశనః । అనేన విహితో హోమః సోమయాగ ఫలప్రదః, అనధికారీ దీక్షాయాం కరే పక్షస్త్రయం మతః | ఏకాదశ మహారుదై రతిరుద్రః ప్రకీర్తితః । అతిపాపహరో యస్మాత్, దృష్టాళన్యా నైవ నిష్కృతి?”
“నమస్తే రుద్రమన్యవే” అను వాక్యముతో ప్రారంభమగు రుద్రాధ్యాయమును అనగా నమకమును “నమస్తే అని యందురు. అట్లే “అగ్నా విష్ణూ సజోషసే” అను వాక్యముతో ప్రారంభమగు మం(్రభాగమును “అగ్నా విష్ణూ” అను పదముచే వ్యవహరించుట ప్రసిద్ధము. దీనినే చమకమనియు నందురు “నమః” అను పదము పునఃపునరావృత్తమగుటచే నమకమయినట్లు 'చ మే అను పదములకు పునః పునరావృత్తిచే చమక మయినది. 'చ మే' అనుపదములకు “మరియును నాకు(ఇది కావలెను”) యని యర్థము. ఇహలోకజీవనయాత్రకై వలయు వస్తుసామగగ్రి కావలెనని శివుని ప్రార్థించుట ఇందలి విషయము. ( ఈ చమకము కృష్ణయజుర్వేదము నందలి చతుర్ధకాండమున సప్తమప్రపాఠకమున నున్నది) దీనియందు పదునాకండనువాకములు కలవు. నమకమును పూర్తిగా జపించిన పిమ్మట చమకముయొక్క ఒక యనువాకమును జపించుచు ఇట్లు ఏకాదశవారములు (చమకానువాకములు పూర్తియగునంతవలఅకు) జపించి యఖిషేకము చేయుటను ఏకాదశ రుద్రాభిషేకమందురు.
ఏకాదశ రుద్రాభిషేకము (ప్రతిదినము చేయువానికి ఒక సంవత్సరము పూర్తి కాకమునుపే బహుజన్మార్జితమగు పాపము తొలగిపోవును. ఏకాదశరుద్రములను పదకొండింటిని చేసిన ఒక లఘురుద్రమగును. దీనిచే నతనికి యమ(లోక) దర్శనమనునదియే యుండదు. లఘురుద్రములు పదకొండు పూర్తి చేసిన మహారుద్ర మందురు. దీనిచే మహాపాతకములు నశించి ధనసమృద్ధుండగును మహారుద్ర స్వాహాకారములు (హోమము) చేసిన సోమయాగముచేసినంతటి పుణ్యఫలము లభించును. ఏకాదశ మహారు(ద్రములు పూర్తిచేయుటతో ఒక అతిరుద్రమగును.దీనితో ఎట్టి పాపములైనను నశించును. పాపపరిహార విషయమున ఇంతటి నిష్ఫృతి మజియొకటి లేదని చెప్పంబడినది. దా! కే. రాజన్నశాస్త్రి
| మంజూష అభిషేకము నిర్వర్తించుటలో రెండు విధానములున్నవి. ఒకటి లఘున్యాస పూర్వకము - సామాన్యముగా నిది యందఖిచే నవలంబింపంబడునది- ఇక రెండవది మహాన్యాస పూర్వకము - ఇట్లు చేయుట విశేషము. ఈ రెండు విధానములును జోధాయనోక్తములే. రావణకృత మహాన్యాస ఖండమును నొకటి కలదు. కాని అది మన సంప్రదాయమున లేదు మహాన్యాస విధానమును విశేషమంటిమి ఏలనన “నారుద్రో రుద్రమర్చయేత్' అనగా తాను రుద్రత్వమునొందనిదే రుద్రునర్చింపం జనదు,
- అని యుండుటచే తనయందు రుద్రత్వము నాపాదించు మంత్రభాగమే మహాన్యాసము. ఈ మహాన్యాసమున ప్రధానముగా శివపంచముఖ ధ్యానము, దశాంగ షోడశాంగ రౌద్రీకరణములు, ఆత్మరక్ష, ఆ యా వేదమంత్రములచే (అనువాకములచే) అంగన్యాసకర న్యాసాదులు, శివనంకల్పములు మున్నగు నంశములు కలవు - “తన్మే మనః శివసంకల్పమస్తు” అను మకుటముతో నుండుటచే శివ సంకల్పమను నామ మన్వర్థము. శివుని యందు నా మనఃప్రవృత్తి చెదరకుండును గాక యని ఆ మకుటమున కర్ధము ఈ శివసంకల్పజసము మోక్షదాయకమని చెప్పంబడినది. “య ఇదగ్ం శివసంకల్పగ్ం । సదా ధ్యాయంతి బ్రాహ్మణాః తే పరం మోక్షం గమిష్యంతి । తన్మే మనః శివసంకల్పమస్తు” పరికించగా మహాన్యాసప్రయోగము ఆత్మశుద్దిని చేకూర్చి అభిషేకమునకు ప్రశస్తమైన యోగ్యతను చేకూర్చునది. ఇట్లు విధిపూర్వకముగా రుద్రాభిషేకము చేయుటయే కాని, శతరుద్రీయమును నియతముగా జపించుటయే కాని చేసిన ఎంతో పవిత్రత చేకూరును. మహాపాపములైనను తొలగును. (బ్రహ్మలోకప్రొప్తియు సిద్ధించునుో. ఇతి శమ్. తవా రం 2000? |. సంస్కృతభాషా ప్రచారసమితి (హైద్రాబాద్) వారి “సంస్కృతభారతి (జనవరి 1998) (క్రైమాసిక వత్రిక) యందు ప్రకాశితము మరియు శివరాత్రి సందర్భముగా. (1. రామకృష్ణమరం (చెన్నై) వారి “రామకృష్ణ ప్రభ (పిబ్రవరి 1999) యందు
- సర్వార్థసంక్షేమ సమితి (హైద్రాబాద్) వారి విశ్వప్రకాశం (ప్రిబ్రవరి 1998) ఆధ్యాత్మిక మాసపత్రిక మహాశివరాత్రి ప్రత్యేక సంచికయందును ప్రకాశితము. డా కే. రాజన్నశాస్త్రి
శివభక్తి మహిమ ఖే॥ వపుః ప్రాదుర్భావా దనుమత మిదం జన్మని పురా
పురారే! న క్వాపి క్వచిదపి భవన్తం ప్రణతవాన్ |
నమన్ ముక్తః సంప్రత్యహమతను రగ్రే౭ ప్యనతిమా
నితీశ ! క్షన్తవ్యం తదిదమపరాధద్వయమపి॥!
ఒకానొక బక్తుడు శివునితో నిట్లు వేడుకొనుచున్నాడు. ఓ మహాదేవా! నేను గత జన్మలో మీకు నమస్మరించలేదు ఇక ముందు జన్మలో కూడా మీకు నమస్కరించు నవకాశములేదు కావున నమస్కరించను నా యీ రెండపరాధములను మన్నించుడు ఓ పురారీ! నేను గత జన్మలో మీకు నమస్మరించియే యున్న యెడల నాకు జన్మరాహిత్యమే కలిగియుండెడిది కదా! అట్లుగాక నేనిప్పుడు ఈ శరీరముతోనున్నా ననగా మీకు నేనింతకుముందు జన్మలో నమస్మరించియే యుండలేదని కదా! స్పష్టమగుచున్నది. మఠియు ఇప్పుడు భక్తితో నీ చరణ కమలములకు (మొక్కుచున్నాను కావున నాకు ముక్తి తప్పదు ఇక ముందు జన్మయే లేని నాకు మీకు నమస్కరించు నవకాశము లేదు " ఓ దయామయా! నా ఈ రెండు తప్పులు మన్నించుము. ఇప్పాడ గమనించవలసిన ముఖ్యవిషయమేమనగా శివునకు భక్తితో ఒక నమస్కారము చేసిన చాలును ఆ పుణ్య ప్రభావముచేతనే ఆవ్యక్తి సాంసారిక దుఃఖ వినిర్ముక్తుడై కైవల్యమును పొందును శివరాత్రి మహాత్వమున ఈ విషయము స్పష్టము చేయంబడినది. ఆనాడు శివరాత్రి. ఒక బోయండు వేటకై వెళ్ళి ఏది దొరకకయే దినమంతయు గడచిపోగా, రిక్త హస్తములతో నింటికి వెళ్ళి నాకటితో నలమటించు తనకుటుంబమును చూడనిచ్చగించక రాత్రియంతయు ప్రతీక్షించిన నేదేని దారకక పోదను నాశచే ఉరులుపన్ని ఒకబిల్వవృక్షము నధిరోహించి జాగరూకుందై మృగములకై 'ప్రతీక్షించుచుండెను. అప్పుడప్పుడతని కరచరణాద్యవయవ సంచాలనాదులచే. బిల్వ పత్రములు రాలి ఆ వృక్షమూలమున నున్న శివలింగము పై పడుచుండెను ఇట్లతనికి స్వప్రయత్నమనునది లేకయే నిరశనము, జాగరణ, బిల్వదళములచే శివార్చ్సనయు ఎ! ఏ
దా! కే, రాజన్నశాస్త్రి
6 మంజూష సంభవించెను. ఆనాడు శివరాత్రి కావున శివరాత్రి వ్రతాచరణ పుణ్యపలము లభించి యాతనికి ఉత్తమ లోకప్రాప్తి కలిగె' ననగా నిక భక్తితో చేసిన కలుగునని వేజే చెప్పవలెనా ? శివుని యంతటి యాశుతోషియగు దైవము వేజొకడు లేడు అందుకే శివభక్తిలో నొక విశిష్టత యున్నది భక్తిభావముతో శివుని యనుగ్రహము సంపాదించుటకు అందరును అధికారులే - ఉత్తముండు, అధముండు, స్త్రీ, పురుషుండు, జాతి, మతము, విద్య మున్నగు భేదము లేవియును లేవు ధూర్జటికవి తన శ్రీకాళహస్తీశ్వర శతకమున ఈ విషయమును నిట్లు వివరించెను. “వి వేదంబు పరించె లూత భుజగం బేశాస్త్రముల్ చూచెదా నేవిద్యాభ్యసనంబోనర్చెంగరి ? చెంచేమంత్రమూహించెంబో ధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు, మీపాదసం సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా॥” (శ్రీకా శ పద్య 18) సాలె పురుగు, పాము, ఏనుగు, చెంచు వీరందటును, శివుననుగ్రహమునొందుట కేవిద్యలు చదివిరి కావున భక్తియే ముఖ్యముకాని జాతి, వ్యక్తి, విద్యా వివేకాడులు కావు - తిన్నండు చెప్పుకాలుతో శివనిర్మాల్యమును త్రోసి పుక్కిటినీటితో లింగమును కడిగి ఎంగిలి మాంసమును పరమశివునికి నివేదించినను అతండొక మహాభక్తుడే ఆయెనని శ్రీశంకరాచార్యులును తన శివానందలహరిలో నిట్లు వాక్రుచ్చెను - శ్డోః మార్గావర్తితపాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్టివ్యాభిషేకాయతే ॥ కించిద్భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో ? వనచరో భక్తావతంసాయతే ॥ (శివానందలహరి -శ్లో-63)
- స్మందపురాణమున బోయనితో దేవదూత పలికిన పలుకులివి :- శ్లో శివరాత్రి ప్రభావేణ పాతకం తే క్షయం గతమ్ ॥ ఉపవాసస్తు సంజాతో నిశి జాగరణం కృతమ్ ॥ యామే యామే కృతా పూజా అజ్జానేన శివస్య చ | సర్వపాప వినిర్ముక్తో గచ్చ త్వం రుద్రమందిరమ్॥ (వ్రత చూడామణి -శి.మా,ప్ప 254) దాః కే. రాజన్నశాస్త్రి
శివభక్తి మహిమ ళా
భక్తి హృదయగతములగు అశేషమలినములను (ప్రక్షాళనమొనర్చి వ్యక్తిని పవిత్రునిగా చేయును నారదుడును శాండిల్యుడును తమ తమ భక్తి సూత్రములలో భక్తినిట్లు నిర్వచించిరి.
“సాత్వస్మిన్ పరమ(పేమరూపా”
సా పరా౭ నురక్తి రిశ్వరే”
అనగా భగవంతునియెడలం గనంబఅచు పరమట్రేమయే భక్తి. దానిచే చిత్తము ద్రవీభూతమగును సర్వప్రపంచమును భగవద్రూపమనియే (ప్రేమించును. ఇంక కామ కోధాదులకతని మనమున తావేలేదు. ఇంతటి ఉదారస్వభావమును కలుగ జేయునది భక్తి ఇట్టి భక్తి మానవునకు ఇహపర సాధకమైనది ఇది వరమ శివుని యెడల చేసిన సాంసారిక దుఃఖ వినిర్ముక్తిని కలుగంజేసి కైవల్యప్రాప్తిని అనుగ్రహింపంజేయుననుటలో సందియము లేదు
- అకాశవాణి హైదాబాద్ కేద్రం నుండి మహాశివరాత్రి పర్వదినసందర్భంగా “సూక్తి ముక్తావళి" కార్యక్రమంలో (ప్రసారితమైన ఈ ప్రసంగవ్యాసం సంస్కృతభాషా 'ప్రచారసమితి (హైద్రాబాద్, వారి సంస్కృత భారతి (జనవరి 1988) త్రైమాసిక సంచిక యందు (్రకాశితము.
ఈమె దుల
డా! కే. రాజన్నశాప్ర్రి
భక్తి యోగము - దాని ప్రాధాన్యము శ్లో స వై పుంసాం పరో ధర్మోయతో భక్తి రధోక్షజే | అహైతుక్య ప్రతిహతా యయా౬౭త్మా సంప్రసీదతి। (శ్రీమద్భాగ-1/2/6) మనుష్యునకు నిశ్షేయసప్రాప్తికై మూడు మార్గములు నిర్దిష్టములై యున్నవి -
- జ్ఞానయోగము, 2. కర్మ యోగము, 8. భక్తి యోగము - ఈ మూడింటి కంటె అతిరిక్తమైన మార్గమేదియును లేదు. ఈ విషయము శ్రీమద్భాగవతమున, దేవీ భాగవతమునను ఇట్లు చెప్పబడి యున్నది. శ్డ్యో। యోగాస్త్రయో మయా ప్రోక్తా నృణాం శ్రేయోవిధిత్సయా | జ్ఞానం కర్మ చ భక్తిశ్చ నోపాయో౬ న్యో౭స్తి కుత్రచిత్! (త్రీ మద్చాగ 11/20/6) శ్లో। మార్గాస్తయో మే విఖ్యాతా మోక్షప్రాప్తా నరాధిప ! | కర్మయోగో జ్ఞానయోగో భక్తియోగశ్చ సత్తమ ! (దేభా 7 37.2) జనన మరణ రూపమగు ఈ సంసార సాగరము నుండి తనను తాను సముద్ధరించు కొనుటయే, తాను మనుష్యుడై పుట్టినందుకు పరమ ప్రయోజనము శబ్ద స్పర్శాది విషయ భోగముల ననుభవించుట కాదు - అది పశుపక్ష్యాదులకును సహజమే అట్లేని మనుష్యజన్మలోని విశేషమేమి - మనుష్యజన్మము లభించుటయే దుర్లభము : కావున మోక్షప్రాప్తికై యత్నించి దానిని సార్థకము చేసికొనవలెను. శ్రీ మద్భాగవతము నందలి ఈ శ్లోకము చూడుడు - శ్లోః। లబ్బా సుదుర్లభమిందం బహుసంభవాంతే మానుష్య మర్థదమనిత్యమపీహ ధీరః | దా॥ కే. రాజన్నశాప్రి
చ్క్త యోగము - దాసి పాధాన్వ్నము థి తూర్దం యతేత న పతేదనుమృత్యు యావ న్నిశ్రేయసాయ, విషయ: ఖలు సర్వతః స్పాత్॥ నిత్శేయసప్రాప్సికై నిర్జిష్టములైన మూడు. మూర్గములలో భక్తియోగము బహుసులబమైనది -- జ్ఞానకర్య యోగములు చాలా కరినములైనవి కావననే నారద భక్తి సూత్రమున నిట్లు చెప్పబడినడ్- సూ - అన్యస్మాత్ సౌలభ్యం భక్తా ॥ శ్రీమద్భాగవతము నందును - శ్లోః హరిభక్తి: పరా నూణాం కామధేనూపడూ స్మృతా | తస్యాం సత్యాం పిబన్య్యజ్హాః సంసారగరళం హ్యహో।। (శ్రీ మద్యాగవ 1/1/12) భక్తి కామధేనువు వంటిది - దానిచే అమృ్మతోపమమైన దుగ్దము లభించును - ఎట్టి దానిని కాదని సంసారసౌఖ్యరూప గరళమును సేవించుటకై యత్నించువాడు అజ్జుడు కాక మరేముగును భక్తి స్వరూపము - దేవర్పియగు నారదుడు తన భక్తి సూత్రమున వక్తి స్వరూమునిట్లు నిర్వచించెను సూ - సా తృస్మిన్ పరదు (యేమ రూపా 2 అమృతస్వరూపా చ - 8 భగవంతునియందు ప్రదర్శించు అనన్యమైన (ప్రేమయే భక్తి - అట్టి భక్తి సామాన్యమైనది కాదు: అమృతస్వరూవమైనది - ఆ భక్తి తాపత్రయమును దూరీకరించునది - మనమున కొంగ్రాత్తశక్తిని అవిర్భవింపజేయునది - అమృతత్నమును కలిగించునది. - భగవంతునితో సన్నిహిత సంబంధమును కలుగజేయుట ద్వారా అలౌకిక రసానుభూతిని పొందించుబయ అమృతత్వము శ్రీమద్భాగవతమున జగవద్వాకృముగా- న. | రాజన్నాస్టి
10 మంజూజ శ్డోః। మయిభక్తిర్ణి భూతానామమృతత్వాయ కల్పతే 11 అని శాండిల్య భక్తి నూత్రమునను - సూ - సా పరా౭_నురక్తి రీశ్వరే 11211 తత్సంస్థస్యామృతత్వో పదేశాత్ 11311 అనియు ఈ యంశమే వివరింపబడినది- మధునూదన సరన్వతి తన భక్తి రసాయనమున భక్తి లక్షణము నిట్లు నిర్వచించెను - శ్లో ద్రుతస్య భగవద్ధర్మాద్దారావాహికతాం గతా। సర్వేశే మనసో వృత్తిర్భక్తి రిత్యభిధీయతే | (భక్తి రసాయన 1-3) భగవంతుని గుణములను భక్షసముద్ధరణాది చరితమును (శ్రవణము చేయుటచే కలిగిన సత్త్వగుణోద్రేకముచే కరిగిపోయిన చిత్తము యొక్క ధారాప్రవాహమువలె నిరంతరముగా కొనసాగుచున్న వృత్తియే భక్తి - అనగా బగవత్మదా (శ్రవణమువలన సత్య్యగుణము అతిశయించును - దానిచే చిత్తము (ద్రవీభవించును - ఆచిత్తవృత్తి ధారారూపమై నిరంతరముగా భగవంతుని యందే లగ్నమగును - అదియే బక్తియను పేర పిలువబడుచున్నది = ఇదియే భక్తి స్వరూపము - ఆ విషయమే శాండిల్య నంహిత యందును చెప్పబడినది చూడుడు - శ్లో! సర్వాత్మనా౭. నిమిత్తైవ స్నేహధారానుకారిణీ । వృత్తిః ప్రేమపరిష్వక్తా భక్తిర్మాహాత్వ బోధజా ॥ మన మనస్సు జతుద్రవ్యము (లక్క) వంటిది - లక్క తపింపజేసినప్పుడు (ద్రవీభావము నొందును - అట్లే మనస్సు తాపమునొందినచో ద్రవీభూతమగును- మనస్సునకు తాపము కలిగించునవి కామక్రోధాదులు మాత్రమే కాదు - స్పేహ హర్వాదులుకు - దుఖమున కంట నీరు కార్చినట్ను ఆనండాతిరేకమునను కంట సీరు కాననగుచునే యున్నది - ఇది మనస్సు ద్రవీభావము నొందిన దనుటకు నిదర్శనము. కాచికరిగిన అక్కలో ఏరంగు దేయుదుమూ అరంగు ౪ లక్క గట్టిపడిన పిమ్మటను చా! క రాఎర్టుచానేం
భక్తి యోగము - డాని ప్రాధాన్యము 11 ద్రపీభూతమైన చిత్తవృత్తినే భక్తియని నిర్వచించుట జరిగినడి - భక్తిరసాయనకారుని ఈ శ్లోకమును చూడుడు - శ్లో కామక్రోధభయ స్నేహహర్షశోక దయాదయః తాపకాశ్చిత్తజతునస్తచ్చాన్తా కఠినం తు యత్ ॥1 పూర్వాభిప్రాయమునే ఈ శ్లోకము చెప్పుచున్నది - గౌణి - మరియు పరాభక్తి- దీనినే “పరాభక్తి” యని యందురు - ఇట్టి భక్తి భావమున్నవాడు ఈ జగమునంతయు భగవత్స్వరూపముగా దర్శించును - ఈ పరాభక్తికే శ్రవణ కీర్తనాదులు అంగములు - శ్రవణ కీర్తనాదుల ద్వారా భగవంతుని యెడల ప్రేమ ప్రవృద్ధ మగును- ఇది భక్తి యొక్క ప్రాథమికావస్ట్థ - దీనిని గౌణి యందురు - ఈ “గౌణీభక్తి” పరాభక్తికి అంగము - నవవిధ భక్తి - భక్తి నవవిధములై యుండునని శ్రీమద్భాగవతమున ప్రహ్లాదుడు చెప్పెను - ఎట్లన- శ్లో! శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్ । అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్ 11 ఈ ్రవణాది నవవిధ భక్తియును భగవత్రాప్తికి సాధనము. విష్ణుకథా శ్రపణమున పరీక్షిన్మహారాజు, గుణకీర్తనమున శ్రీశుకాచార్యులు, భగవద్దుణస్మరణముచే (ప్రహ్లాదడును పాదసేవనమున లక్ష్మిదేవియును, అర్భనచే పృథుచక్రవర్తియును, అభివాదనముచే అక్రూరుడును, దాస్యముచేసి హనుమంతుడును, సఖ్యము చేసిఅర్జునుడును, సర్వస్తముతో పాటు ఆత్మనివేదనముచేసి బలిచక్రవర్తియును భగచదను[గ్రహము నొందిరనీ ఈ శ్లోకము చెప్పుచున్నది - చూడుడు - శ్లో శ్రీ విష్ణోః శ్రవణే పరీక్షిదభవత్ చైయాసకిః కీర్తినే ప్రవ్షాదః స్మరణే తడంఘ్రభజనే లక్ష్మీః పృథుః పూజనే |
12 మంజూష అడి నే ల జ్ ద సభ్లే రునః అక్రూరస్త్వభివాదనె, కపిపతిర్దా స్యె౭ ధ సఖ్య౭ ర్జునః సర్వస్వాత్మనివేదనే బలిరభూత్ కృష్ణాస్తి రేషాం పరమ్॥॥
(వణాదులచే భగవంతుని యెడల రతీభావము వ్రవృద్దమ్తై చిత్తవృత్తి బగవదేకాయత్తమగును - ప్రపంచమే భగవన్మయముగా భాసించును - ఇదియే థక్తియోగ మిశ్రిత భక్తి -
ఒకప్పుడు ద్నేషాదులచేతను ఈ చిత్తవృత్తి భగవదేకాయత్తమగును - కావుననే అంతగా ద్నేషించిన హిరణ్యకళిపునకు భగవత్రాప్తి కలిగినది - శిశుపాలుడు కంసుడు ఈ కోవకు చెండిసవారే - వీరికి భగవత్రాప్తి కలుగుటకు కారణము వీ6 చిత్తవృత్తి ద్వేషభయాదులచే భగవదేకాయత్త మగుటయే -
ప్రహ్లాదుడు భక్తి భావముచే సర్వావస్టలలో భగవంకునే గాంచెను - కంసుడును భయముచే అట్లే భగవంతుని కాంచెను - చూడుడు -
శ్రీమద్భాగవతము సప్తమస్మంధము ప్రహ్హాదచరితము (“అధ్యా 4 శ్లో 37 ౫6)-
శ్లో వ్యస్తక్రీడనకో బాలో జడవత్తన్మనస్తయా ।
కృష్ణగ్రహగృ్భహీతాత్మా న వేద జగదీదృశమ్ ॥| ఆసీనః పర్యటన్నశ్నన్ శయానః ప్రపిబన్ బ్రువన్ | నానుసంధత్త ఏతాని గోవింద పరిరంభితః ||
శ్రీమద్ భాగవతముదశమస్మంధము - శ్రీ కృష్ణావతార పుట్టము - కంసస్టితి -
శ్లో స నిత్యదోద్విగ్నధియా తమీశ్వరం పిబన్ వదన్ వా విచరన్ స్వపన్ శ్వసన్ | దదర్శ చక్రాయధ మగ్రతోయ స్త దేవన రూపం దురవాషమాప ॥ (అధ్యా 44 శ్లో 39) కావుననే మధ్వాచార్యులు - డా॥ కే. రాజన్నశాస్రీ
భక్తి యోగము - దాని ప్రాధాన్యము 13 “శ్లో! గ్యోప్యః కామాత్ భయాత్ కంసో ద్వేషాచ్చైద్యాదయో నృపాః;” అను శ్రీమద్చాగవత శ్లోకమును వ్యాఖ్యానించుచు - గోపికలు 'కంసుడు'
శిశుపాలాదులు, హిరణ్యాక్షహిరణ్యకశిపులు, రావణకుంభకర్ణాదులు అక్రూరాదులును భక్తులే
యని నుడివెను - చూడుడు - శ్లో గోప్యః కామయుతా భక్తా కంసావిష్టః స్వయం భృగుః | జ్లేయో భయయుతో భక్తః చైద్యాదిన్థా జయాదయః 1 విద్వేషసంయుతా భక్తాః వృష్టయో బంధుతాయుతాః ॥1 జగమును భగవన్మయముగా గాంచుటయే భక్తి పరమార్ధము - అది కంసాదుల యందును సిద్ధించినది - గోపికాదుల లోనిది కామాదిభావ మిథ్రిత భక్తి-
తామస -రాజస-సాత్విక భక్తిభావము - దుష్టప్రవృత్తి గలవాడైనను అనన్య భావముచే భగవంతుని భజించినచో అతడు
సద్దతిని పొందును - ఈ భగవద్దీతాశ్లోకమును చూడుడు - . శ్లో; అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్
సాధురేవ స మన్తవ్యః సమ్యగ్వ్యవసితో హి సః ॥ (గీతా -9 /30) ఎందుకనగా - భగవత్సంసేవనాదులట్టివి - అగ్నిని, తెలిసి ముట్టినను తెలియక ముట్టినను కాలుట సహజమే కదా! ఈ విషయమును ఈ శ్లోకము వివరించినది - శ్లో హరిర్దరతి పాపాని దుష్టచిత్తెరపి స్మృతః | అనిచ్చయాఇపి సంస్పృష్టు, దహత్యేవ హి పావకః ॥ ఈయభిప్రాయమును పురస్కరించుకొనియే భక్తికి తామస రాజస సాత్త్వికములు అనుమూడు భేదములు శ్రీమద్భాగవతమున చూపబడినవి - శ్లో 1 అభిసంధాయ యో హింసాం దంభం మాత్సర్య మేవవా। సంరంభీ భిన్నదృ్భగ్భావం నుయి కుర్యాత్ స తామసః ॥| శ్తోః। విషయానభిసంధాయ యశ ఐశ్వర్యమేవ వా। అర్పాదావర్చయేద్ యో మాం సృథగ్భావః స రాజసః 11 దాః కే. రాజన్నశాస్తి
శ్డోః కర్మనిర్దారముద్దిశ్య పరస్మిన్ వా తదర్బణమ్ | యజేద్ యస్టవ్యమితి వా పృథగ్భావః స సాత్త్వీకః | (శ్రీమద్భాగ -3స్మం. 29అధ్యా,? నుండి 10 శ్లో పరుల హింసను గోరియేకాని మాత్సర్యముచేతనే కాని దంభముచేతనే కాని భగవంతుని పూజించుట తామస భక్తి - విషయోపభోగములు ధనకనక వస్తువాహనములు, కీర్తి మున్నగు వాని నభిలషించి భగవంతుని నర్చించుట రాజసభక్తి - ఉపాత్త దురితక్షయద్వారా భగవత్రాష్త్యర్థమై సర్వకర్మలను భగవదర్చణ చేయు నుద్దేశము చేతనే కాని, కర్తవ్యబుద్ధితో విధివిహిత కర్మలననుష్టించు నభిప్రాయముచేతనే కాని, భగవంతుని పూజించుట సాత్త్విక భక్తి - ఈ మూడు భక్తి భావములును భేదజ్ఞాన విలసితములైనవి - ఈ మూడును గౌణీ భక్తి భేదములే -
ఈ సాత్త్విక భక్తిలో ఒకప్పుడు మోక్షకామన యుండవచ్చును. లేకపోవచ్చును, కావున ఇదియు భేదభావనతో కూడినదే - కావున ఇది పరాభక్తిలో చేరదు - పరాభక్తియే సర్వోత్తమము - ఈ సాత్త్వికభక్తి సర్వశ్రేష్టము కాదు. పరాభక్తి విశిష్టత -
పరాభక్తి సత్త్వరజస్తమో గుణముల కతీతము. ఇది ఏదో ఒక కోరిక అనునిమిత్తముచే ప్రవృత్తమైనది కాదు - కావుననే దీనిని “అహైతుకి” అని యందురు - కేవలము భగవంతుని యందలి పరమ (ప్రేమ రూపమైనది - ఈ భక్తిభావమేర్చరచుకొనిన భక్తులు తుదకు మోక్షమునైనను కోరరు - కేవలము భగవత్సేవనమే వారికి పరమార్ధము. చూడుడు -
శ్లో। సాలోక్య సార్టి- సామీష్య- నారూప్యైకత్వమప్యుత |
దీయమానం న గృష్టంతి వినా మచ్సేవనం జనాః ॥ (శ్రీమద్దా - 3/29/13) కావుననే సర్వోత్కృష్టమైనది పరాభక్తియే - జగమంతటిని భగవన్మయముగా దర్శింపజేయునది - దా! కే. రాజన్నశాప్ర్రి
సాధనభక్తి - సాధ్యభక్తిః -
ఇంతకు ముందు చెప్పిన 'గౌణీ భక్తి యే సాధన భక్తి. ఈ గౌబీభక్తిచే సాధింపదగినదికావున “పరాభక్తి' సాధ్యభక్తియగును - శ్రీమద్భాగవతము నందలి ఈ శ్లోకమును చూడుడు -
శ్లో! స్మరంతః స్మారయంతశ్చ మిధో౭. ఘౌఘహరం హరిమ్ |
భక్త్యా సంజాతయా భక్త్యా భిభ్రత్యుత్చులకాం తనుమ్ ॥ (శ్రీ మద్భా-11/2/37)
ఈ శ్లోకమున “భక్త్యా సంజాతయా భక్త్యా” భక్తిచే (గౌణీ భక్తిచే) కలిగిన భక్తిచే (పరాభక్తిచే) అని చెప్పుటతో ఒక భక్తికి మరియొక్క భక్తి కారణమగుట వివరించినట్లెనది. భగవంతునిపై భక్తి భావము కలుగుటకు నిమిత్తము :-
భగవద్దీతయందలి ఈ శ్లోకమును చూడుడు -
శ్లో చతుర్విధా భజంతే మాం నరాః సుకృతినో౨_ ర్లున!॥
తాంగ్ చ| జూ ఆర్‌లో జిజ్ఞాసు రర్ధార్థీ జ్ఞానీ చ భరతర్నభః! 1 (గీతా- ౩/36)
భగవంతుని భక్తిభావముతో శరణు వేడుటలో నిమిత్తములు నాలుగు - ఒకటి ఆపద, రెండు విషయోపభోగవాంఛతీరుటకై ధనము, - మూడు జిజ్ఞాస అనగా ఆత్మజ్ఞానము ద్వారా సంసారసాగరమును తరించి మోక్షమును పొందునిచ్చ, నాలుగు - ఏ వాంఛలేక అహైతుకమగు భక్తి నిలుపు జ్ఞానము. ఆపదనుండి రక్షించుటకై గజేంద్రుడు ద్రౌపదియు శరణు వేడిరి - ధ్రువుడు రాజ్యోపభోగములకై భగవంతుని గూర్చి తపము చేసెను - ఉద్ధవుడు భగవంతుని భజించి ఆత్మజ్ఞానము పొందెను - ఇక ఉపమన్యువు మున్నగు ఆత్మారాములు భగవంతునిపై అఖండ భక్తిని నిర్నిమిత్తముగా సలుపుటచే వీరిది “పరాభక్తి” అనగా వీరు జ్ఞానులైన భక్తులు - ఈ ఆర్హాది నిమిత్తములచే భక్తులు నాలుగు విధములుగా నున్నారని గీతా శ్లోకతాత్పర్యము
ఉత్తమ మధ్యమ సాధారణ భక్తులు ;-
శ్రీమద్భాగవతము స్వభావమును బట్టి భక్తులను మూడు థ్రేణులుగా విభజించినది - డా| కే. రాజన్నశాస్త్రి
16 మంజూష శో సర్వభూతేషు యః పశ్యేద్ భగవద్భావమాత్మనః ॥ భూతాని భగవత్యాత్మన్యేష భాగవతోత్తమః ॥
శ్డో। ఈశ్చరే తదధీనేషు బాలిశేషు ద్విషత్సు చ ।
ప్రేమమైత్రీకృపాపేక్షా యః కరోతి స మధ్యమః ॥
శ్లో అర్బాయామేవ హరయే పూజాం యం; శ్రద్ధ యేహతే।
న తద్భక్తేషు చాన్యేషు స భక్తః ప్రాకతః స్మృతః (శ్రీ మద్భాగ - 11/2/45-47)
-
స్వపరభేద భావమును మాని సర్వప్రపంచమును సర్వ[ప్రాణులను భగవన్మయముగా చూచువాడు ఉత్తమడ్రేణికి చెందిన భక్తుడు.
-
భగవంతుని యెడల మిక్కిలి (ప్రేమను, సామాన్యజనుల యందు దయను, శత్రువులపై ఉపేక్షాభావమును ప్రదర్శించువాడు మధ్యమ శ్రేణికి చెందిన భక్తుడు.
-
ఇక కేవలము భగవత్ర్రతిమలయందే భక్తి నిలిపి భగవంతుని పూజించుచు భగవదృక్తులయందును ఇతర ప్రాణులయందును అనాదరము చూపువాడు సాధారణ శ్రేణికి చెందిన భక్తుడు గీతలో చెప్పిన జ్ఞానిభక్తుడు ఉత్తమ[్రేణిలో ఆర్త జిజ్ఞసువులు మధ్యమ గ్రేణిలో అర్ధార్థియను భక్తుడు సాధారణ శ్రేణిలోను చెరుదురని తెలియవలెను. తరణోపాయములలో భక్తి యోగమే సులభము :-
జ్ఞానకర్మ మార్గముల యందువలె భక్తిమార్గమున శమదమాది షద్డుణ సంపద, ఇంద్రెయనిగ్రహము తపోనిష్టురత వ్యయ పప్రయాసములు, ఇవేవియు అవసరము లేదు. కేవలము భగవంతుని యెడల విశ్వాసముంచి అతనిని శరణు వేడిన చాలును. త్రీ కృష్ణ భగవానుని ఈగీతావాక్యము చూడుడు -
శ్లో॥సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ | అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః ॥॥ (28/66) వాల్ళీక రామాయణమునను శ్రీ రాముడిట్లే వచించెను - దా॥ కే. రాజన్నశాస్త్రి
భక్తి యోగము - దాని ప్రాధాన్యము 17 శ్లో; సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే | అభయం సర్వభూతేభ్యో దదామ్మ్యేతద్ వ్రతం మమ ॥ (వాల్మీ-రామా-6/18/25) భగవంతుడు శరణాగత వత్సలుడు - అతనిని శరణువేడి ఆత్మనివేదన చేసికొనినచో సర్వకర్మబంధములు తొలిగిపోవును - సుఖ దుఃఖ మానాపమానాది ద్వంద్వా తీతుదై పరమశాంతిని బడయును - ఈ గీతాళశ్లోకము ఈ విషయమునే నుడువుచున్నది - శ్లో! తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత !। తత్త్రసాదాత్ పరాం శాంతిం స్థానం ్రాప్సుసి శాశ్వతమ్ ॥ (గీతా-18/62) భక్తికి అందరును అధికారులే - భక్తిభావముచే భగవంతుని శరణు వేడుటకు ఉత్తమవర్థాది విశేష యోగ్యతలు ఏవియు నక్కరలేదు - భగవంతుడు భక్తి చేతనే సంతోషించును కాని సత్ములాదులతో కాదు ఈ విషయము ఈ శ్లోకమున స్పష్టపరుపబడినది - చూడుడు - శ్తో। వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయో విద్యా గజేంద్రస్య కా కుబ్బాయాః కిము నామ రూపమధికం కింతత్ సుదామ్నో ధనమ్ । కా జాతిర్విదురస్య యాదవపతే రుగ్రస్య కిం పౌరుషం భక్త్యా తుష్యతి కేవలం న హి గుణై రృక్తిప్రియో మాధవః ॥ కసాయి వృత్తి చే జీవించు ధర్మవ్యాధునిది సదాచరణమా ? (ధ్రువునిది తపస్సు చేయ తగిన వయస్సా ? గజేంద్రునకు చదువెక్కడిది? త్రివక్రయగు కుబ్ద సౌందర్యము తెలియనిదా? కట్టుబట్టయే కరువైన కుచేలునకున్న ధనమెంత ? విదురుని జాతి ఏది? పుత్రుడగు కంసునిచే నిర్చంధింపబడిన ఉగ్రసేన మహారాజు పౌరుషమేపాటిది ? వీరందరును కేవలము భగవంతుని భక్తిభావముతో నాశ్రయించి తరించిరి కాని వారికున్న యోగ్యత కులాదులచే కలిగినదా? భక్తి ప్రియుడగు భగవంతునకు భక్తుల గుణములతో నిమిత్తము లేదు - భక్తి యుంటె చాలును - కావున భగవద్భ్శక్తిని బడయుటకు కులరూపగుణశీలాదులతో నిమిత్తము లేదు - ఈ విషయమును శ్రీ మద్భాగవత శ్లోకమిట్లు నుడువుచున్నది ఆ డా! కే. రాజన్నశాస్తి
18 మంజూష శ్లో; మన్యే ధనాభిజన రూప తపః (శ్రుతీజ్యా స్తేజః ప్రభావబల పౌరుష బుద్ధియోగాః నారాధనాయ హి భవన్తి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూథపాయ ॥ భగవంతుని యందు భక్తిని నిలుపు యోగ్యత అందరికిని యున్నది - భక్తి యనగా ప్రేమ - ప్రేమించుట తెలియని వాడు లోకమున నుండడు - భగవంతునిపై ఆ ప్రేమ భావమును సర్వోత్కృష్టముగా నిరతిశయముగా ్రదర్శించుటయే భక్తి - కాంతాకాంచనాదులను (ప్రేమించుట శాశ్వతముకాదు - భగవంతునిపై చిత్తము నిలిపి సదా భగవద్గుణ గుణాదుల స్మరించి ధ్యానించిన భగవన్మయముగనే ఈమనస్సు మారును. చిత్తవృత్తులన్ని బాహ్యప్రపంచమునుండి తొలగిపోవును; పూర్జానందానుభూతి కలుగును - చిత్తము భగవదేకాయత్త మగుటతోదనే అప్పుడప్పుడు భగవంతునితో ్రత్యక్త్షదర్శన భాషణాది లాభము ననుభవించుచు ఆనందాశ్రువులు జాలువార నృత్యగానాదులు చేయును - ఆ భక్తుని స్థితి భాగవతమున నిట్లు వర్ణింపబడినది - శ్లో॥ వాక్స్ గద్గదా ద్రవతే యస్య చిత్తం రుదత్యభీక్షం హసతి క్వచిచ్చ | . విలజ్జ ఉద్గాయతి నృత్యతే చ మద్భక్తియుక్తో భువనం పునాతి॥ (శ్రీమద్భా-11/14/24) భక్తి సమస్తపాపములను నిర్మూలించును - ఆత్మ జ్ఞానమును కలుగజేయును - కావున భక్తుల డ్రేణిలో జ్ఞానిని ఉత్తమ ్రేణికి చెందిన భక్తుడుగా పేర్కొనినారు -అతదే అద్వైత భావము సిద్ధించిన (బ్రహ్మజ్ఞాని - అద్వైతస్థితిని, భక్తి భావమధురముగా నొనర్చి పలికిన అతని పలుకులిట్లుందును - శ్లో। సత్యపి భేదాపగమే నాథ ! తవాహం న మామకీనస్త్వమ్ । సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః ॥ హే భగవన్, పరమాత్మవగు నీకును జీవాత్మనగు నాకును వాస్తవముగా భేదము లేకున్నను నేను నీవాడనగుదునే కాని నీవు నావాడవు కావు - సముద్రజలరూపమగు తరంగము (అల) సముద్రమునకు చెందినదే యగును కాని సము[ద్రమెన్నటికిని తరంగమునకు చెందినది కాదు కదా- జ్ఞానముచే భేదభావన తొలగినను ఈ భక్తుడు దాః కే. రాజన్నశాస్త్రి
భక్తి యోగము - దాని ప్రాధాన్యము 1 భగవంతుని యౌత్కృష్ట్రమును ఎట్లు చాటుచున్నాడో కాంచితిరి కదా ! ఇదియే జ్ఞాన భక్తి. ఇట్టి భక్తిగల జ్ఞానిభక్తుడే సర్వ (్రేష్టుడని గీత్స నుడువుచున్నది -
“శ్లో! తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే 1” అని
(భగవద్గీత - 7/17)
సులభముగా చరమపురుషార్ధమును కూదా సిద్ధింపజేయునది భక్తియే కావున జ్ఞాన కర్మ భక్షి మార్గములలో భక్తి మార్గము సులభము కావున సర్యోపాదేయము -అందుకే శ్రీమద్భాగవతము - “న వై వుంసాం వరోధర్మఃో అను శ్లోకముచే భక్తిని శ్రేష్టమగు ధర్మముగా కీర్తించినది -
ఇతిశమ్
ఆరాధన (ఆగష్టు 1993) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయధర్మాదాయశాఖ
(హైద్రాబాద్) వారి మాసిక సంచిక యందు ప్రకాశితము. -పిదిపితికా-
డా కే. రాజన్నశాస్త్రి
దేవీభాగవతము - శ్రీ దేవీతత్త్వము శ్లో యన్న దృష్టం హి వేదేషు తత్సర్వం లక్ష్యతే స్మృతా । ఉభయోర్యన్న దృష్టం హి తత్పురాణైః ప్రణీయతే ॥ (నారదీయ పురాణము) వేదములలో సూత్ర ప్రాయముగా నిరూపితములగు నంశములనే స్మృతులు వివరించునవి కాగా పురాణములు వాని నుదాహరణ ముఖమున విశదీకరించునవి - హిందూ సంస్కృతికి మూల భూతములు (శ్రుతులు. వాని వ్యాఖ్యారూపములు స్మృతి పురాణేతిహాసములు - కావుననే - శ్లో ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్బంహయేత్ బిభేత్యల్స (శ్రుతాద్ వేదో మామయం ప్రహరేదితి అని స్మృతికారులు చెప్పియున్నారు - “నత్యం వద” అను (్రుతిచోదిత ధర్మమునే స్టుతులు - ల్లోః సత్యం బ్రూయాత్ ప్రియంబ్రూయాత్ మా బ్రూయాత్ సత్య ప్రియమ్ | ప్రియం చ నాన్ఫతం బ్రూయా దేష ధర్మః సనాతనః ॥ అని సత్యస్వరూపమును వివరించగా పురాణములు హరిశ్చంద్రాద్యుపాఖ్యాన ముఖమున విశదీకరించినవి - ఇట్టి పురాణములు పదునెనిమిది - అవి - శ మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయమ్ । అనాపలింగ కూస్మాని పురాణాని పృధక్ పృధక్ ॥ (దేభా 1/3/2) దా॥। కే. రాజన్నశాస్రి
దేవీభాగవతము - శ్రీ దేవీతత్త్వము 21 మత్స్య - మార్మండేయములు “భవిష్యభాగవతములును” (బ్రాహ్మ - బ్రహ్మవైవర్త (బ్రహ్మాండములును వామన-వాయు - వరాహ - విష్ణు పురాణములును అగ్ని నారదీయ పాద్మ లింగ గారుడ కూర్మ స్క్మాందములనునవి మహాపురాణములు ఇవి గాక ఉపపురాణములును పదునెనిమిది యున్నవి. భాగవతపురాణము మహాపురాణములలో నొకటి ఉపపురాణములలో మజాకటియు కానవచ్చుచున్నది. కొన్ని మహాపురాణములు దేవీభాగవతమును మహాపురాణముగా ప్రతిపాదించగా నితర మహాపురాణములు విష్ణుభక్తి 'ప్రతిపాదక మగు శ్రీమద్భాగవతమును మహాపురాణముగా పేర్కొనినవి. ఈయంశమును దేవీభాగవత వ్యాఖ్యాతలు చర్చించుచు కల్పభేదమున రెండును మహాపురాణములుగా నొప్పునని పూర్వోక్త మహాపురాణ మత భేదమును పరిహరించి; శ్లో యత్రాధికృత్య గాయత్రీం వర్ద్వతే ధర్మవిస్తరః | వృత్రాసురవధోపేతం తద్ భాగవత మిష్యతే॥ అను అక్షణ లక్షితమును - శ్లో! సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణమ్ అను సర్గాది పంచలక్షణ సమన్వితము ను అష్టాదశ సహస్ర గ్రంధాత్మకమునగు మహాప్పరాణ మీ దేవీ భాగవతమేయనియు నిర్ణయించి యున్నారు - ఇందు పురాణమున కుండవలసిన సర్లప్రతిసద్ద వర్ణనము మన్వంతర కధనము భూగోళ ఖగోళ వర్ణనము, నరకవర్డన మున్నగు నెన్నియో యంశములుండనే యున్నవి, కాని బుగ్వేదోక్త దేవీసూక్త - దేవ్వధర్వశీర్నాది ఢ్రుతి శ్రుత్యంత చోదితాంశముల విపులముగా వర్ణించుటయే ఈ మహాపురాణముఖ్యోదేశమై యున్నది - కావుననే “ఆ పరదేవతయే నిఖిల బ్రహ్మండ కోటుల కధీశ్వరి యనియు, తదాదేశముననే బ్రహ్మ విష్ణు రుద్రాదులు జగత్సృష్టిస్టితిలయ రూపకార్యముల నిర్వహించుచున్నారనియు సోదాహరణముగా విశదీకరించుచు, తద్బక్తి భావ(ప్రేరకములు సాధకోపవయుక్తములునగు “దేవీ మహోత్సవములు, దేవీస్థానములు - పూజా విధానము, నవరాత్రోత్సవార్చనా క్రమము, మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్తోత్రార్బనావిధానము, రాధా- తత్త్వము, గాయత్రీ మహిమ పురశ్చరణాదులు, సంధ్యో పాసనాక్రమము” మున్నగు పెక్కంశముల విపులీకరించినదీ మహాపురాణము - డా॥ కే. రాజన్నశాస్రి
22 మంజూష దేవీమహాత్యము నుపపాదించు నుపాఖ్యానములు స్మాందమార్మండేయ పురాణములలో సంగ్రహముగను దేవీభాగవతమున విపులముగను వర్ణితములైనవి - స్మాందపురాణము దేవీమహాత్యమునే కాక దేవీభాగవత-నవాహ (శ్రవణపారాయణ మాహాత్యమును వివరించినది - ఇక మార్కందేయపురాణము జగదంబిక మహిషాసురశుంభనిశుంభాది దుష్టదానవుల వధించి జగత్మళ్యాణము చేసిన విధానము చరిత్రత్రయ రూపమున ఏడువందల శ్లోకములలో వర్డించినది - ఇదియే 'దుర్గానప్తశతి” యను నామమున భక్తజన కల్పవల్లిరై పారాయణ క్రమమున బహుళ ్రచారమున నున్నది - దేవీ భాగవత మీ చరిత్ర త్రయమును మొదట ప్రధమ పంచమ స్కందములలో, విపులముగా వర్ణించియును పిమ్మట దశమస్మందమున పారాయణమున కనువగునట్లు సంగ్రహించి నిరూపించినది - ఈ చరిత్ర త్రయమును పారాయణము చేయ జాలకున్నచో మధ్యమ చరితనుగు మహిషాసుర వధ ఘట్టమునైన జపించిన చాలునని నిద్ధేశించుచు - 'దేవీ సాయుజ్యము నొందిన వాడుకాన మహిషాసురుని (ఛిన్న శీర్షమగు ప్రతికృతిని) దేవీ వామ భాగమునుంచి పూజించవలెనని వైకృతికరహస్యము నుడుపుచున్నది - శ్లో తతః కృతాంజలి ర్ఫూత్వా స్తువీత చరితై రిమైః | ఏకేన వా మధ్యమేన నై కేనేతరయోరిహ (వైర. శో 32) శ్డో। వామభాగే౭౬ [గ్రతో దేవ్యాశ్ళిన్న శీర్షం మహాసురమ్ । పూజయేన్మహిషం యేన ప్రాప్తం సాయుజ్య మీశయా 1 (వైర ఖే.29) దేవీ మాహాత్య ప్రతిపాదకోపాఖ్యానములలో మహిషాసుర వధ ఘట్టము మిక్కిలి పధానమైనదని దీన తెల్లమగుచున్నది - ఆప్రాధాన్య మెట్టిదో ఆలోచింపవలసి యున్నది - పురాణము లేదో నిగూఢార్ధమును కథల ద్వారా నిరూపింపం జూచును - కావునే పురాణము లర్థప్రధానములందురు- ఈ మహిషాసురుడు రంభుడను రాక్షసునకు మపొషి (గేదె) యను చతుష్పాత్సశువున జనించినవాడు - కావున రాక్షసత్వపశుత్వముల కలియకయే ఈ దాః కే. రాజన్నశాస్త్రి
దేవీభాగవతము - శ్రీ దేవీతత్త్వము 2 మహిషాసుర స్వరూపము-రాక్షసత్వము ఘాతుకత్వమున కుపలక్షణము కాగా పశుత్వము అవివేకమునకుపలక్షణ మగుచున్నది -మొదటిది రజోగుణాతిశయమును చాటగా రెండవది తమోగుణభూయిస్టతను చాటుచున్నది - జనన మరణ లక్షణ సంసార బంధమున కీ రెండును కారణములు - మానవునిలోనున్న ఘాతుకత్వమును పోగొట్ట జూపుటయే పురాణముల ్రధానోద్ధేశము - ఇదియే. “శ్లో; పరోపకారః పుణ్యాయ పొపాయ పరపీడనమ్ 1”
అనునది సర్వపురాణ సారాంశమని నుడువుటలోని యాంతర్యము. ఘాతుకత్వములె నవివేకమును అహంకార మమకారములకు కారణమై బంధహేతు వగుచున్నది. అహంకార మమకారములే రెండు కొమ్ములని గుర్తించవలసియున్నది - ఇట్లు బంధ హేతువులగు నీ రజస్తమోగుణాతిశయములను నిర్మూలించవలె నన్న సత్త్వగుణాతిరేకము కావలెను - అదియే దైవీశక్తి - దేవీ శస్తాఘాత పూతుడై మహిషుడు దేవీ సాయుజ్యము నొందె ననగా మానవుడు సత్తోదేకమున రాక్షసత్వ పశుత్వములు అనగా రజస్తమములుడిగి శుద్దసత్వస్పరూపుడై జననమరణ లక్షణ సంసారబంధవినిర్ముక్తుడై
స్త ద్ధ డై 'బ్రహ్మరూపిణి యగు దేవీ సాయుజ్యము నొందుటయే - అట్టి యర్హత సంపాదించినకాని మానవుడు పూజ్యుడుకాడు ఈ పరమార్ధమును - పూజయేన్మహిషం యేన ప్రాప్తం సాయుజ్య మీశయా ॥
అని వైర్యృతిక రహస్యము వెల్లడించినది -
ఇట్లీ మహిషాసురవధ ఘట్ట మాంతరార్థ గర్భితమై ప్రధాన భావము నొందుచున్నది
ఇక నీ మహాపురాజోపవర్డిత పర దేవతాతత్త్వ మెట్టిదన వేద వేదాంత పురాణ 'ప్రతిపాదితార్ధ సమన్వయ రూపమనియే చెప్పనొప్పును -
ఆయా పురాణములు ఆయౌ దేవతల 'ప్రాశస్య - 'పప్రాభవములను మా త్రమే వర్ణించునవియై దేవతా వైవిధ్యమున పామరజన బుద్ధిభేద జనకము లగుచుండగా నీ మహాపురాణము ఆయా దేవతల సముదిత శక్తి స్వ్పరూపమునే జగత్సుష్టి స్టితిలయ - కారణమగు పరతత్త్వముగావర్ణించుచు విభిన్నత్వములో నేకత్వము సాధించుచున్నది డాః కే. రాజన్నశాస్త్రి
తశ మంజూష “భ్రవనేశ్చరియగు పరదేవత వివిధ దేవతల సముదిత శక్తిరూప” యనునీయంశము మహిషోపాఖ్యానమున నిట్లు వర్ణితమైనది - శ్లో! ఇత్యుక్తవతి దేవేశే బ్రహ్మణో వదనాత్ తతః స్వయ మేవోద్చభౌ తేజో రాశిశ్చాతీవ దుస్సహః ॥ శ్లో; అన్యేషాం చైవ దేవానాం శరీరేభ్యో౭ తిభాస్వరమ్ ॥ నిర్ణతం తన్మహత్తేజో రాశిరాసీన్మ హోజ్జ్వలః ॥1 శ్లో పశ్యతాం సర్వదేవానాం తేజః పుంజ సముద్భవా 1 బభూవాతివరా నారీ సుందరీ విస్మయప్రదా ॥ (దే.భా 5/8/33, 43,42) శుంభనిశూంభో పాఖ్యానమీవిషయము మఖింత స్పష్టపరచు చున్నది - ఆయా పురాణములలో కాననగు వర్షనలననుసరించి భూషణవాహనాదులలో వైవిధ్యముచే నొప్పు నాయా దేవతలు భిన్నులు కాక నేకరూపులెట్లగుదురను నానొత్వ భ్రాంతి నివృత్తికై - శ్లో బ్రవ్మాదీనాంచ దేవానాం శక్తయ శ్చండికాం యయుః | యస్య దేవస్య యద్రూపం యథాభూషణవాహనమ్ ॥ శ్లో తాద్భగ్రూపాస్తదా దేవ్యో యయుశ్చ సమరాంగతణే । బ్రహ్మాణీ వరటారూధా సాక్షసూత్ర కమండులుః ॥| (దే.భా 5/28/18-20) ఇట్లు బ్రహ్మమున్నగు దేవతల యాకారభూషణ వాహనములకు తగినట్లు ఆయా దేవతల శక్తుల విడి విడిగా వర్ణించుచు - శుంభాసురుని ముఖమున ఆ నానాత్వభ్రాంతిని- శ్లో బలావలేపాద్ దుష్టే !'త్వం మా దుర్గే ! గర్వమావహ | అన్యాసాం బలమాశ్రిత్య యుద్ధ్యసే యా౭ఇ_తి మానినీ॥ అని వ్యక్తీకరించి - దేవీ ముఖమున - దా॥ కే. రాజన్నశొస్రి
దేవీభాగవతము - భాగవతము - శ్రీ దేవీతత్త్వము 25 శ్లో। వకై వాహం జగత్యత్ర ద్వితీయా కా మమాపరా | షశ్యైతా దుష్ట ! మయ్యేవ విశన్తో మద్విభూతయః ॥॥ (దు.ర్గాస. 10/5) అని తద్రాంతినివృత్తిని చేసిన దీయుపాఖ్యానము = కావున వివిధ దేవతలలలో కాననగు శక్తులు లేదా బ్రహ్మాణ్యాది వివిధ దేవతాశక్తులును వ్యక్తిగతముగా భిన్నములయ్యును సముదిత శక్తిరూపములై లేదా చిచ్చక్తి రూపములై ఏకరూపత్వము నొందుటయే అ పరదేవతాతత్త్వ మనుటలో సందియము లేదు - దేవీభాగవతమీయంశమును దేవీ ముఖమున నిట్లు నడుపుచున్నది - శ్లో నూనం సర్వేషు దేవేషు నానా నామధరా హ్యహమ్ | భవామి శక్తిరూపేణ కరోమి చ పరాక్రమమ్ ॥ (దే.భా.3/6/13) ఇట్లీమహాపురాణము దేవతా భిన్నత్వ (ప్రయుక్తవెషమ్యుమును దూరీకరించి సకల దైవతైక్యమును సాధించినది - కావుననే మత భేదములేక సకల జనులచే సేవించదగిన దీ మహాపురాణమని స్మందపురాణము నుడువు చున్నది - శోః సౌరాశ్చ గాణపత్యాశ్చ శైవాః శాక్తాళ్ళ వైష్టవాః | సర్వేషామపి సేవ్యేయం యతో దేవాః సశక్తయః (స్మాందాంతర్గత-దే-భా. మార్/11) మతియు దేవీభాగవతము. దేవీ ముఖమున శివకేశవాది భేదదృష్టి నిట్లు నిరసించుచున్నదీ య శ్లో; త్వంచ వేధాః శివస్త్వేతే దేవా మద్దుణసంభవాః | మాన్యాః పూజ్యాశ్చ సర్వేషాం భవిష్యంతి న సంశయః ॥ యో హరిః స శివః సాక్షాత్ యః శివః స స్వయం హరిః | ఏతయో ర్ఫేద మాతిష్టన్నరకాయ భవేన్నరః | తథైవ ద్రుహిణో జ్ఞేయో నాత్ర కార్యా విచారణా! (దే-భా 3/6/53-56) ఇది యీ పురాణమునకు గల సర్వమత సమన్వయ సరణి - సర్వదేవతలలో నా భువనేశ్వరీ దేవి శక్తిరూపమున నున్నదను నంశమును సోదా డా! కే. రాజన్నశాస్త్రి
26 మంజూష హరణముగా వివరించుటకై కేనోపనిషదర్ధము ద్వాదశస్మ్కందమున (12/8/19-82) నిక్షిప్త్రమయినది - మజియును “శ్రుతి ప్రతిపాదితమగు సచ్చిదానందరూప నిర్గుణ పరబ్రహ్మము దేవియే కాని తద్చిన్నము కాదు” - ఈ విషయము ప్రశ్నోత్తర రూపమున నిట్లు వర్ణితమైనది శ్లో దృష్టా దృష్ట విఖేదే౭_ స్మిన్ ప్రాక్ త్వత్తో వై పుమాన్ పరః । నాన్యః కో౭_పి తృతీయో9 స్తి ప్రమేయే సువిచారితే ॥ శ్లో ఏకమే వాద్వితీయం యద్ బ్రహ్మ వేదా వదంతి హి । తత్ కిం త్వం వా౭ప్యసౌ వా కిం సందేహం వినివర్తయ ॥ శ్లో; పుమానసి త్వం స్త్రీ వాజి. సి వద విస్తరతో మమ । జ్ఞాత్వా౭ి. హం పరమాం శక్తిం ముక్త స్యాం భవసాగరాత్ ॥ (దే.భా. 3/5/41-46) అను చతుర్ముఖ బ్రహ్మకు కలిగిన సందేహనివృత్తికై దేవి స్వయముగా - శ్లో! సదైకత్వం న బేదో౭_స్తి సర్వదైవ మమాస్య చ । యో౭సౌ సాల హమహంయో౭. సొ భేదో9_.స్తి మతివిభ్రమాత్ శ్లో; ఏక మేవాద్వితీయం వై బ్రహ్మ నిత్యం సనాతనమ్ । ద్వైతభావం పునర్యాతి కాలఉల్పిత్సు సంజ్ఞకే ॥ శ్లో! యధా దీప స్తధోపాధే ర్యోగాత్ సంజాయతే ద్విధా 1 ఛాయేవాదర్భమధ్యే వా ప్రతిబింబం తధా౭.9.వయోః ॥ శ్లో; నాహం స్త్రీ న పుమాంశ్చాహం న క్షీబం సర్గసంక్షయే | సర్గే సతి విభేదః స్యాక్ కల్పితో౭_ యం ధియా పునః ॥ (దే.భా.3/6/2,4,5,7) ఇట్లు తన స్వరూపమును వివరించియున్నది. తేలినదేమన - “వేదవేదాంతమున 'ప్రతిపాద్యమగు బ్రహ్మమునకును అపరదేవతకును భేదము లేదనియు, అపరదేవత జగదుత్చత్తి కాలమున ద్వైరూప్యమున స్రీపుంభావముల నొందుచున్నను సృష్టివిలయ దాః కే. రాజన్నశాస్త్రి
దేవీభాగవతము - శ్రీ దేవీతత్త్వము 27 కాలమున స్రీత్వపుంస్త్వ క్షీబత్వాది భేదరహిత యనియు వేదవేదాంత సమన్వయ మీ పురాణము చేయుచున్నది” - మజియును *“తత్త్వమస్యాదిమ హావాక్యార్థ విచారణమును కతోపనిషదర్ధ సారాంశమును ఈ పురాణమున నిరూవితములై జ్ఞానమార్గమునకు బలమును చేకూర్చుచున్నవి - - అయినను - శ్లో తస్మాత్ సర్వాణి కర్మాణి వైదికాని మహామతే ! । చిత్తశుద్ధ్యర్థమేవ స్యు స్తాని కుర్యాత్ ప్రయత్నతః ॥ (దే.బా.7/34/15) “చిత్తశుర్ధ్యర్థము వైదికకర్మలు అవశ్యానుష్టేయములనియు కర్మమార్గప్రాశస్య్యము వివరింపంబడినది. ఇక భక్తిమార్గ 'ప్రతిపాదనమున నీ మహాపురాణము “పరాకాష్ట నొందినది. సాధకుడా పరతత్త్వమును మాతృరూపమున భజించుటయే ఇందలి విశేషము. తన సకల వ్యాపారములను తల్లియందే యుంచి నిశ్చింతగా నుయ్యలలో పరుండి యున్న శిశువు యోగక్షేమముల తల్లియరయునట్లు తన సర్వవ్యాపారములను పరదేవత యందే నిలిపి యనన్యశరణ భావముతో నున్న భక్తుని గూడ నా భువనేశ్వరి రక్షించు ననుటలో సందియమునకు తావెక్కడిది ? ఇదియే ఈ మాతృరూపమున నర్చించుటలోని పరమార్థము. ఈ విషయము దేవీభాగవతమున నిట్లు వివరింపబడినది - శ్లో అపరాధ సహస్రాణి మాతైవ సహతే యదా । ఇతి జ్ఞాత్వా జగద్యోనిం న భజంతే కుతో జనాః॥ (దే.భా.5/20/38) తనయుడు చేసిన తప్పులు నన్నింటిని క్షమించి యతని సౌఖ్యమునకై పాటుపడునది తల్లి కాక వేజొకరుందురా ? కావుననే శ్రుతి - “మాతృదేవో భవ” యను వాక్యమును పిత్రాచార్యుల కంటె మొదట పఠించినది. దా! కే. రాజన్నశాస్త్రి
శ్రీ శంకరాచార్య పాదులును - శ్లో! కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి । అని దీని ప్రాశస్యము నుగ్గడించియున్నారు. ఇట్లు జ్ఞాన కర్మ భక్తి మార్గములచే నధికోరి బేధమున నుపాసనీయమును జగత్సృష్టి స్థితి లయ సమర్ధమునగు నాపరతత్త్వమే ఈ మహాపురాణ ్రతిపాద్యయగు శ్రీదేవి. జ్ఞాన కర్మ మార్గములకంటెను భక్తిమార్గమే సులభతమమైనది. ఇక నా భువనేశ్వరిని మాతృరూపమున నర్చించుటలోగల బెచిత్యసౌలభ్యముల వేజుగా చెప్పవలయునా? కావున నీ పురాణము భక్తిమార్గమునకే ప్రాధాన్య మొసగినది. ఇట్లీ మహాపురాణము సకలదేవతా సమన్వయమును సర్వమత సామరస్యమును చేయుచు ముముక్షువులకు పరబ్రహ్మరూపమునను త్రివర్గకాములగు మానవులకు మాతృరూపమునను ఆ చిచ్చక్తి రూప శ్రీదేవీ తత్త్వమును వివరించుచు సకల జనోపాదేయ మగుచున్నది. _ శ్లో; దహస్తీ స్మృతా వాసనా బీజజాతం వహన్తీ దృగంతే చ కారుణ్య పూరమ్! ' ధునానా మమైనశ్చిదానంద రూపా లసత్వన్తరజ్లే సదా మామకీనే ॥ (కవితా విపంచీ) ఇది శమ్ శ్రీవిద్యా సేవాసమితి (హైద్రాబాద్) వారి శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవసంచిక (1975) యందు ్రచురితము. “ిప్తుద్తెల్తిస్తకా- దాః కే. రాజన్నశాస్త్రి
సౌందర్యలహరి - పరదేవతాతత్త వము శ్లో, ఓం సర్వవైతన్య రూపాంతా - మాద్యాం దేవీం చ ధీమహి । బుద్ధిం యా నః ప్రచోదయాత్ ॥ (శ్రీమద్దేవీ భాగవతము 1/1) మా బుద్దిని (పేరేపించునదియు అందరిలో చైతన్యరూపమున నుండునదియు నగు ఆ ఆద్యదేవతను (పరదేవతను) ధ్యానించుచున్నాము అని తాత్పర్యము. దీనిని దేవీ గాయ(త్రీ మంతమందురు. దీనితోనే దేవీ భాగవతమవాపురాణము ప్రారంభింపబడుచున్నది - దేవీ భాగవతమహాపురాణ సారాంశమే ఈ మంత్రార్ధము ఆ జగదుత్పత్తి స్టితిలయకార్ణి ఆ ఆదిపరాశక్తి యనుటయే సోపపత్తికముగా సోదాహరణముగా దేవీ భాగవతమున నిరూపింపబడినది. దాని సారాంశమును నిక్షేపించి కవితామృతమును రంగరించి శ్రీమదాద్య శంకర భగవత్పాదులు రచించిన దీ సౌందర్యలహరి. సాధకులు భక్తిభావనతో పూతులై అద్వైతసిద్ధి పొందవలెననియే ఆచార్యుల యాశయము - సౌందర్యలహరిలోని ఈ శ్లోకము పరికించుడు- శ్లో! భవాని ! త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా మితి స్తోతుం వాంఛన్ కధయతి “భవాని ! త్వ” మితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం ముకుంద బ్రహ్మేంద్రస్ఫుటమకుటనీరాజితపదామ్ ॥ (సౌందర్య -22్లో) అమ్మా భవానీ ! నీవు (భవాని | త్వమ్”) - ఈ దాసుడనగు నాయందు దయాదృష్టిని ప్రసరింపజేయుమని వేడుకొనబూని భక్తుడు దేవితో “భవాని త్వం” అని పలుకుటకు మొదలిడగానే “భవాని త్వం” అనుదానికి నేను నీవుగా నీతో నభిన్నుడను కావలయును అని అర్ధముండుటచే, ఆ యర్ధమునే భక్తుని కోరికగా భావించి అతనికి సాయుజ్యపదవిని ఇచ్చుచున్నావు. ఆ సాయుజ్యపదవి యనగాసామాన్యమైనదా ? విష్ణుబ్రహ్మేంద్రాదుల కిరీటములయందలి మాణిక్యములచే నీరాజనము చేయబడిన డా॥ కే. రాజన్నశాస్త్రి
30 మంజూష పాదములు గలది - అనగా వారిచేత నమస్కరింప బడినది. భక్తుడు కోరినది తనను దయతో చూడుమని - ఆ పరదేవత తన సాయుజ్యమునిచ్చి దయయొక్క 'పరాకాష్ట తానే అని ప్రదర్శించినది - ఈ ఒక్క శ్లోకము చాలదా ఈ రచన ఆదిశంకరాచార్యుల వారిదే యనుటకు.
ఈ సౌందర్యలహరికి ఎన్నో వ్యాఖ్యలు. ఆయా శాక్త సంప్రదాయములననుసరించి కలవు - ఏ ఒక్కరో తప్పు ఈ సౌందర్యలహరి ఆచార్యుల రచనయే యని అందరును అంగీకరించినవారే. ఈ సౌందర్యలహరియొక్క ఉత్కృష్టతను తెలుపు మరియొకటి కలదు. సాక్షాత్తు పరమశివుడే దీనిని రచించిరి. శంకరాచార్యుల వారొకప్పుడు కైలాసమున కేగి శివుని యనుగ్రహమును బడసి ఈ గ్రంధమును భువికి తెచ్చుచుండగా నందికేశ్వరుడు వారించి కొంత తన హస్తగతము చేసికొనుటచే కొంతభాగము మాత్రము తనకు దక్కగా శేషభాగమును ధారణాబలముచే పూరించిరి. - ప్రసిద్ధ వ్యాఖ్యాతలు భాస్మరరాయలు లొల్ల లక్ష్మీధరపండితులును ఇది శ్రీ శంకరుల రచనయనియే నుడివిరి-
దేవీ భాగవతమున నిట్లున్నది -
“శక్తి కరోతి బ్రహ్మాండం సా వై పాలయతే౭ ఖిలమ్ । ఇచ్చయా సంహరత్యేషా జగదేతచ్చరాచరమ్ 11 న విష్ణుర్న హరః శక్రో న బ్రహ్మాన చ పావకః న సూర్యో వరుణః శక్తః స్వే స్వే కార్యే కథంచన తయా యుక్తా హి కుర్వంతి స్వాని కార్యాణి తే సురాః 'సైవ కారణకార్యేషు ప్రత్యక్షేణావగమ్యతే 1 (దేవీ భాగ 1/9/36-39) ఆదిపరాశక్రియే జగదుత్పత్తి స్థితిలయములను జేయునట్టిది - (బ్రహ్మవిష్ణు రుద్రులుకాని సూర్యవరుణేంద్రులుకాని తాము నిర్వహించు కార్యములను వేటినైనను స్వయముగా నిర్వహింపజాలరు ఆ పరదేవతచే నియుక్తులై మాత్రమే నిర్వహించ జాలుదురనుట ప్రత్యక్షముగా తెలిసిన విషయము ఈ యంశమే సౌందర్యలహరిలో నిట్లు చెప్పబడినది. చూదుడు- డా! కే. రాజన్నశాస్త్రి
సౌందర్యలహరి - పరదేవతాతత్త్వము ల శ్లో; జగత్ సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశస్తిరయతి ! సదా పూర్వం సర్వం తదిదమనుగృహ్దాతిచ శివ స్తవాజ్ఞామాలంబ్య క్షణచలితయో(ర్భ్ఫూలతికయో: 11 (సౌందర్య - 24శ్లో) (బ్రహ్మస్ఫజించును - విష్ణువు పాలించును -ర్రుదుడు ప్రళయము చేయును - వీరును మహాప్రళభయమున ఈశునివలన తిరోభావమును పొందుదురు - ఆ ఈశుడును (బ్రహ్మవిష్ణురుద్రులతో సదాశివతత్వమున లీనమగును - సదాశివుడు దేవి కనుబొమల సూచనచే అనుమతిని పొంది మళ్ళీ ఈ జగమును సృష్టించును - సృష్టి స్థితి లయ తిరోధాన - అనుగ్రహములు అను పంచకృత్యములు దేవి యనుగ్రహముననే (బ్రహ్మాదులు నిర్వర్తింతురు - ఇంద్రాదులు స్వాధికారములను వరడేవతాను[గ్రవముననే నిర్వహించుచున్నారు - ఇంద్రాదులే కాదు? సాక్షాత్ సదాశివుడైనను శక్తి రూపిణియగు ఆ పరదేవత లేకున్న తాను కదలజులడు కదా? చూడుడు సౌందర్యలహరిలోని ఈ మొదటి శ్లోకము- శ్లో! శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః పప్రభవితుం న చే-దేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి । అతస్త్వా మారాధ్యాం హరి-హర- విరించాదిఖిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి | పరమ శివుడు శక్తితో కూడుకొనినప్పుడే జగత్ సృష్ట్యాదులను చేయగల సమర్హుడు- అట్లు కానినాడు తాను స్వయముగా కదలను కూడా లేడు - కావున హరిహర బ్రహ్మాదులచే ఆరాధింపదగిన నిన్ను నమస్కరింప వలెనన్నను నుతింపవఠతె నన్నను పుణ్యము చేయని వానికెట్లు సాధ్యపడును. కావుననే ఉపనిషత్రిపాద్యమగు పరబ్రహ్మమన మరేదియో కాదు. సాక్షాత్తు ఈ పరదేవతయేయని దేవ్యధర్వశీర్నము చెప్పుచున్నది - “ఓం సర్వే దేవా దేవీ ముపతస్థః కాసి త్వం మహాదేవీతి । సారి బ్రవీక్ - అహం బ్రహ్మస్వరూపిణీ । మత్తు ప్రకృతి పురుషాత్మకం జగత్ । శూన్యం చా శూన్యం చ ॥” దా॥ కే. రాజన్నశాస్త్రి
32 మంజూష దేవతలందరు మహాదేవీయథార్థ స్వరూపమును తెలియగోరగా తాను (బ్రహ్మ స్వరూపిణి యనియు ఈ ప్రకృతి పురుషాత్మకమైన జగమును, శూన్యాశూన్యములను తన వలననే కలిగినవని స్వయముగా చెప్పినది - దేవీ భాగవతమునను ఈ విషయమిట్లు విపులీకరింప బడినది - “వకమే వాద్వితీయం యద్ (బ్రహ్మ వేదా వదంతివై। సాకిం త్వం వా౭_ప్యసౌ వా కిం సందేహం వినివర్తయ ॥ (దే.భా. 3/5/43) వేదములు అద్వితీయ పరబ్రహ్మమని దేనిని నుదువుచున్నవో ఆ తత్త్వము నీవా ? మరియొక పుం వ్యక్తియా ! మాసంశయము నివర్తించుమని ఆ పరదేవతతో బ్రహ్మదేవుడు ప్రశ్నింపగా - ఆ భగవతి పలికిన పలుకులాలకింపుడు - _ సదైకత్వం న భేదో౬స్తి సర్వథైవ మమాస్య చ 1 యో౭.సౌ సా౭హమహం యో౭.సౌ, భేదోి స్తి మతివిభ్రమాత్ ॥ (దేవీ భాగ. 3/6/4) అద్వితీయ పరబ్రహ్మము తానేననియు “నహ(్రశీర్నా పురుషః” అని వేదము వర్ణించు పుంవ్యక్తికిని తనకును భేదము లేదనియు నుడివినది - కావుననే కేనోపనిషదర్ధము నిరూపించు సమయమున దేవీభాగవతమున - “రూపం మదీయం బ్రహ్మై తత్ నర్వకారణకారణం” అని దేవియే తాను పరబ్రహ్మ స్వరూపిణి యని ఇంద్రాదులకు చెప్పినట్లు వర్ణింపబడినది - ఇది ఆ పరదేవత యధార్ధ స్వరూపము - సృష్టికి పూర్వము తాను నిర్గుణ నిరాకార పరబ్రహ్మము, సృష్టికాలమున సగుణమై సాకారమైనది - భక్తుల నుద్ధరించుటకై మాతృరూపము దాల్చినది - భక్తులు దర్శించగోరిన ఆ మాతృరూప మెట్టిది ? క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తన నతా పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా । ధనుర్భాణాన్ పొశం సృణిమపి దధానా కరతబైః పురస్తా దాస్తాం నః పురమథితు రాహోపురుషికా ॥ (సౌందర్య - శ్లో 7) దాః కే. రాజన్నశాస్త్రి
సౌందర్యలహరి - పరదేవతాతత్త్వము 33 “తానే సర్వసమర్జుడ” నని తనకు తానుగా సంభాళించుకొనునంతటి గర్వము సదాశివునకు కలుగుటకు కారణమైనది యగు ఆ పరదేవత ధనుర్హాణములను పాశమును అంకుశమును తాను నాలుగు హస్తములతో ధరించినదై పూర్ణశరచ్చంద్రుని బోలిన ముఖముతో మందహాసము చిలుకుచు అమృతస్తవ్యము నందిచ్చు స్తనభారముచే. నడుము అసియాడగా మొలనూలి చిరుగజ్జలు యమైయగా మాకు సొక్షాత్మరించవలెను. - ఇది భక్తుల తలంపు - ఆయమనివాస మెయ్యది - ఎచ్చటినుండి రావలెను ? అనగా - ఆయమ అమృత సముద్రము నడుమనున్న మణిద్వీపమున నున్నది. ఆ మణిద్వీపము, కల్పవృక్షము మందారము పారిజాతము మున్నగు దివ్య వృక్షలతో శోభిల్లు చున్నది - అట్టి ద్వీపమున నొక కదంబవనము. దానియంద్రొక చింతామణులచే నిర్మిత మైన గృహము - ఆ గృహమున అందమైన మంచము - ఆ మంచమున పరమశివుని అంకమున నున్నది ఆ తల్లి - ఆయమ సాక్షాత్కరించిన చాలును. అజ్ఞానము తొలగి ఆనందము కలుగును - ఆయమ స్వభావము అట్టిది - ఆయమ చిదానందలహరి. అనగా జ్ఞానానందస్వరూపిణి - ఈ విషయము సౌందర్యలహరిలో నిట్లున్నది- సుధాసింధో ర్శధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే | శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిడదానందలహరీమ్ ॥ ఇదియే దేవీభాగవతము తృతీయస్కందమున భువనేశ్వరీ నిర్ణయ ఘట్టమున విపులముగా వర్ణింపబడినది.
"మరియు ఆ భ్లువనేశ్వరియే సృష్టికాలమున తాను స్తీ- పుం రూపమున ద్వైధీభావమును పొందుచున్నదనియు కావున బింబప్రతిబింబములకు వలె ఆయిద్దరికి భేదము లేదనియు వివరింపబడినది. చూడుడు- దేవీభాగవతములోని ఈ శ్లోకములు-
ఏకమేవా ద్వితీయం వై బ్రహ్మ నిత్సం సనాతనమ్ | టీ దబ్వైతఖావం పునర్యాతి కాల ఉల్పిత్సు సక్జికే ॥ దా॥ కే. రాజన్నశాస్త్రి
34 మంజూష యథా దీప స్తథోపాధేర్భేదాత్ సంజాయతే ద్విధా | ఛాయేవాదర్శమధ్యే వా ప్రతిబింబం తథాః.£వయోః | (3/6/405) ఈ విషయమే సౌందర్యలహిరిలో వ్యంగ్యవిధమున సహృదయ రంజకముగా నిట్లు వర్ణితమైనది - చూడుడు - త్వయా హృత్వా వామం వపురపరితృషప్తేన మనసా శరీరార్థం శంభోరపరమపి శంకే హృతమభూత్ | యదేతత్ త్వద్రూపం సకలమరుణాభం (తిణయనం కుచాభ్యామానమ్రం కుటిల శశిచూడాల మకుటమ్ ॥ (సౌందర్భ.ళ్లో 23) ఓ తల్లీ ! మొదట నీవు పరమశివుని దేహార్ధమునే హరించితివి - అంతట -. తృప్తినొందక మొత్తము శరీరమునే హరించినట్లు తోచుచున్నది - లేదేని నీ రూపము మొత్తము ఎజ్జనికాంతితో మూడు కన్నులతో కూడుకొని, స్తనభారముతో వినమ్రమై, కిరీటమున వంకరగానున్న చంద్రరేఖతో ప్రకాశించుచుండుట ఎట్లు కుదురును? కుదురదు. - అనగా సదాశివరూపమును తనలో లీనము చేసికొని తాను స్రీమూర్తిగా నిలిచినదట- ఇట్టి పరదేవతా మూర్తినే శ్రీచక్రమున భక్తులు పూజించి తరింతురు - శ్రీచక్రము శివ శక్ష్యభేదమును తెలుపు యంత్రరాజము. శ్రీ చక్రములోని ఊర్హముఖ కోణములు నాలుగు శివాత్మకములు అధోముఖ కోణములు అయిదు శక్త్యాత్యకములు కావున ఇది పరమేశ్చరికిని, సదాశివునకును అభేదము తెలుపు యంత్రరాజము - దీని స్వరూప వర్ణన సౌందర్యలహరిలో - “చశుర్భిః శ్రీకంఠైః శివయువతిఖిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః ॥ చతుశ్చత్వారింశద్వసుదళ కళాశ్రత్రివలయ త్రిరేఖాఖిః సార్ధం తవ శరణ కోణాః పరిణతా॥;” _ (సౌందర్యశ్లో 11) అను శ్లోకములో చేయబడినది. సంప్రదాయజ్ఞ్జులు శ్రీ చక్రార్చన చేయుదురు. డా॥ కే. రాజన్నశాస్త్రి
సౌందర్యలహరి - పరదేవతాతత్త్వము తక్ దీనినే నవావరణ పూజయని యందురు. ఈ పూజావిధానము దేవ్యనుగ్రహమునకు పాత్రునిగా చేయు తపోదీక్ష వంటిది. కష్టసాధ్యము. ఇది అందరికి సాధ్యమైన పనికాదు. చేయజాలని వారు భక్తిప్రపత్తులతో శ్రీ చక్ర పూజను దర్శించిన మాత్రమున పరాంబా కరుణాకటాక్షము పొందుదురు. కావుననే ఆచార్యుల వారు మాత్యరూపిణియగు పరదేవతా చరణములను శరణువేదుడని అన్యాపదేశముగానిట్లు వర్ణనాచమత్మారము రంగరించి చెప్పిరి. త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణ స్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా । భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే! లోకానాం తవ హి చరణావేవ నిప్పుణా (సౌంద - శ్లో 4) అమ్మా! దేవతలందరు అభయ వరదానముద్రలను ధరించియుండగా నీవు మాత్రము హస్తములతో అభయవరదాన ముద్రలను ప్రకటించి యెజుగవు - లోక శరణ్యురాలవగు నీ చరణములే, దరిజేరిన వారి భయముల తీర్చుటకును కోరిన వానికంటె నెక్కుడుగా వరములనిచ్చుటకును సమర్ధములైయుండగా నీకా ప్రయాసమేల? అందువలననే నీ వాముద్రలను ధరించకుందువు. నూరుశ్లోకములుగల సౌందర్యలహరిలో 42వ శ్లోకము నుండి 91వ శ్లోకము వణకు దేవీకేశాది పాదాంత వర్ణన యున్నది. ఈ వర్ణనలు మహాకావ్య మందలి వర్జనలను తలంపునకు తెచ్చునవిగా నున్నవి - చూడుడు - నిమేషోన్నేషాభ్యాం ప్రకభయముదయం యాతి జగతీ తవేత్యాహుః సంతో ధరణిధరరాజన్యతనయే! । త్వదున్నేషాజ్ఞాతం జగదిదమశేషం ప్రళభయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః 1 ( సౌందర్య - శ్లో 55) మానవులు కన్నుల రెప్ప్టలను మూయుదురు తెరుతురు. దేవతలట్లు కాదు - వారి కన్నులు ఎప్పుడును తెఅచియే యుందును. కన్నుల రెప్పలను మూయుట అనునది వారికుందదు. దేవతలకు దేవతయైన ఆ పరదేవత తానును కన్నులు తెరచియే యుండును కాని ఎన్నడును మూయదు. అది దేవతల స్వభావము - ఈ అంశమును వర్ణించుటపట్ల దా॥ కే. రాజన్నశాస్రి
వెళ మంజూష ఆచార్యులవారు ఒక మాహార్ధమును సూచించెను. ఆయమ్మ కనురెప్పపాటుననే జగముల సృజించి సంహరించునంతటి శక్తి గలది. కన్ను తెలచిన మాత్రమున జగముల సృజించుట జరుగును. అట్లు తన కన్నుల తెచి జగముల సృజించి ముల్లోకములకు తానే యమ్మయైన ఆ కరుణామూర్తియగు పరదేవత ఇక తాను కనురెప్ప పాటు గలిగియున్న యున్నచో కన్నులు మూతపడిన ఆ తృటికాల మాత్రమున ఈ జగములన్నియు నశించునని తన మాతృ హృదయము తల్లడిల్లగా రెప్పవేయక కన్నులనట్లే తెఐచి యుంచినది. ఈ నాటికిని ఆయమ్మ కను రెప్పవేయక అట్లే యుండుట కిదియే కారణమట. ఎంతఅద్భుతమైన వర్ణన - జగముల యుదయ ప్రళయముల రహస్యమును చెప్పిన వర్దన- పరదేవత యొక్క అమేయ శక్తిని ఒక్క మాటలో చెప్పిన వర్ణన. - ఇది ఉ్రేక్షాలంకారముచే కలిగిన వస్తు ధ్వనియని అలంకారికులందురు. ఉ్రేక్షయనగా ఊహించి అందంగా చెప్పుట. ఒకప్పుడు ఉపమాన వస్తువునే ఊహించి చెప్పుదురు. ఇట్లు జరుగుటకు కారణము ఇది కావచ్చునని, కారణము నూహించి చెప్పుదురు. దీనికి ఫలము అనగా ప్రయోజనము ఒది కావచ్చునని, ఫలము నూహించి చెప్పుదురు. ఎట్లు ఊహించినను అది ఉ'ర్రేక్షాలంకారమేయగును ఊహించుట యనగా లేనిదానిని కల్పించి చెప్పుటయే అట్లు ఊపొంచి చెప్పినప్పుడే ద్నత్చేక్ష యగును. ఆచార్యులవారు “శంకే? (ఊహించుచున్నాను) అను మాటతో తానొక ఊహచేసినట్లు సూచించినారు, ఆయమ్మ కనురెప్ప వేయక అట్లే ఈ నాటికిని యుండుటకు ప్రయోజనము నూపాొంచినారు. ఆ ప్రయోజనమేమనగా ఈ జగమును ప్రళయము నుండి కాపాడుటయే - తాను కనురెప్పవేసి కనుమూయు తృటికాలమున ఈ లోకమునకు ప్రళయము సంభవించును కదా ? అందుకే తాను కనురెప్పవేయుట మానుకొని జగమును 'ప్రళయమునుండి కాపాడుకొనినది. ఇదియే ఆయమ్మ అనిమిషయై యుండుటకు ప్రయోజనము ఇది అలంకారికుల దృష్టిలో ఉ్రేక్షయే కావచ్చును. కాని తాత్తికుల దృష్టిలో ఇది ఊవాకాదు ఆమాత్ఫ రూపిఖియగు పరదేవత్ర నిజముగా నట్టిదే ఆచార్యుల వారి యూహ సత్యమైనదే కాని సంభావనాత్మకము అనగా కల్సితము కాదు. ఈ శ్లోకమున జగదుత్పత్తి స్టితిలయములననాయాసముగా చేయ్స సామర్ధ్యము, అపార కరుణా పూరపరిష్తావిత మాతృహృ్ళదయమును వ్యక్తములైనవి మరియొక శ్లోకము - ఇది అమ్మవారి సీమంత వర్జన - సీమంతమనగా పాపట - ఆ తల్లి పాపట యెట్లున్నదనగా ఆ యమ ముఖ సౌందర్య ప్రవాహము పొంగి పొరలి అలుగు వారగా నేర్చడిన దారివలె నున్నదట - ఆ పాపటలో ఆయమ సిందూరము దొ॥ కే. రాజన్నశాప్ట్రి
సౌందర్యలహరి - పరదేవతాతత్త్వము 37 ధరించినది నల్లని ముంగురుల నడుమ ఎజ్జిని సిందూరమున్నదట అనగా ఆ సిందూరము కబరీ భారమనెడు అంధకారముచే బందీకృతమైన సూర్యకిరణమా అనునట్లున్నదనుటచే నిది రూపకాలంకారముచే అనుప్రాణిణితమైన ఉ(శ్రేక్షాలంకారము ఇదిగో ఆ శ్లోకమిది- వహంతీ సిందూరం ప్రబలకబరీభార-తిమిర- త్విషాం బృందై రృందీకృతమివ నవీనార్మకిరణమ్। తనోతు క్షేమం నస్తవ వదనసౌందర్యలహరీ - పరీవాహస్రోతస్సరణిరివ సీమంత సరణిః।। (సౌందర్య శ్లో 44) ఆయా అలంకార శాస్త్రగ్రంధములలో అప్పయదీక్షి తాద్యాలంకారికులు లక్ష్యముగా నుదాహరించిన ప్రసిద్దశ్లోకమిది. ఇట్టి కవితా కళా సౌందర్యముచే నొప్పునట్టి దీ సౌందర్యలహరి- ...... నిర్గణము నిరాకారము సత్యజ్ఞానానందస్వరూమునగు ఆ పరబ్రవ్మమే సగుణమై భక్తుల నుద్ధరించుటకై కరుణామూర్తియగు మాతృరూపమున పరదేవతయై వెలసినది. ఇదియే సౌందర్య లహరీ ప్రతిపాదితమగు పరదేవతా తత్త్వము. దహంతీ స్మృతా వాసనా బీజజాతం వహంతీ దృగంతే చ కారుణ్యపూరమ్ | ధునానా మమైనశ్చిదాంనద రూపా లసత్వంతరంగే సదా మామకీనే (కవితావిపంచీ) (ఇతిశమ్) శ్రీ అభినవభారతి ఎజుకేషనల్ ఎకాడెమీ (హైద్రాబాద్) వారి 50౪5 (1992) యందు ప్రచురితము-మరియు సర్వార్ధసంక్షేమసమితి (హైద్రాబాద్) వారి “విశ్వప్రకాశం” (ఏప్రిల్ 1998) ఆధ్యాత్మిక మాసపత్రిక యందు ప్రకటితము. -ఈిదిర్రిద్తిన్తకా- దాః కే. రాజన్నశాప్రి
భారతీయ సంస్కృతి - వేద ప్రాధాన్యము భారతీయ సంస్కృతి చాలా ప్రాచీనమైనది - చెక్కుచెదరనిది. సద్భావనను పెంచునది - సమైక్యమును కాపాడునది - స్వల్బములైన బేదములనటుంచి చూచిన యావద్భారతదేశమున ఏకరూపముగా దర్శనమిచ్చునది - మనుష్యుడు పుట్టినది మొదలుకొని గిట్టువరకును చేయు దైనందిన వ్యవహారములు వివాహాది సంస్కారములు ('వ్రతనియమాదులు అముష్మికములగు అంత్యేష్ట్యాదులు భారదేశమునందంతటను ఏక రూపములై కానవచ్చుచున్నవి - వీనికి భాషాభేదముతో నిమిత్తము లేదు - దేశభేదము లెక్కకు రాదు. వర్ణభేదమును గణించుబ యుండదు - ఇట్టి చెక్కుచెదరని సుదృథమైన సంస్కృతిని భారతీయ హృదయములో నాటినది మన వేదము - భారతీయ సంస్కృతియన్న వైదిక సంస్కృతియే వేదములనాది - కాన వైదిక సంస్కృతియు అనాదియే. ఈ సృష్టి ఎప్పుడు 'ప్రారంభమైనదియో మనము చెప్పగలమా ? చెప్పనేరము - మన ఊహ సరిపోదు - అందుకే దానిని అనాది యంటిమి సృష్టిలో అతి ప్రాచీనమైన సంస్కృతి యనగా భారతీయుల వేద సంస్కృతి - ఈ ప్రపంచమున జీవసృష్టి ప్రారంభమునకు ముందే సృష్టికర్తయగు “చతుర్ముఖ బ్రహ్మ వేదములను స్మరించెనని యున్నది. అతడు ( బ్రహ్మదేవుడు) ఎంతో తపము చేసి వానిని కనుగొనెను. వేద విజ్ఞానము అనంతము, అశ్చర్యజనకము - మనఊహకు అందరాని వెన్నియో మనము వేదముల వలన తెలియుదుము - మనము ఈ అనంతమైన విశ్వమును చూచుచున్నాము - సృధివ్యాది పంచభూతములు, గ్రహములు నక్షత్రములు వివిధములైన వృక్షజాతులు - వానిచిత్ర విచిత్రములైన వర్ణములు - మృగములు, పక్షులు. అనేకములైన జీవరాశులు -సూక్ష్మములు అతీంద్రియములైన జీవులు, ఇబ్లెన్నియో భూమిపైననేకాక జలమునను అంతరిక్షమునను మరెన్నియో చిత్రవిచిత్రములున్నవి. ఇంత సృష్టి జరిగినదే! దా కే. రాజన్నశాస్రి
భారతీయ సంస్కృతి - వేద ప్రాధాన్యము 0 దీని కంతటకి ముందేమియున్నది - ఇది యంతయు నశించిన పిమ్మటనేముందును, ఈ పంచ మహాభూతములు ఒక్కొక్కటియేచాలును ఈ సృష్టినంతటిని నశింప జేయుటకు. వాయువు లేనిది మనము జీవించలేము సూర్యుడు లేనిదే మన మనుగడ సాగదు - చూచినచో ఈసృష్టియంతయు ఒక క్రమముననుసరించియే సాగుచున్నది. సూర్యుడు తవుము తప్పక ఉదయించుచున్నాడు- వాయువొప్పుడదును తనకు తాను ఉపసంహరించుకొనుట లేదు. సృష్టి ఇట్లు నియమబద్దముగా సొగుటకు కారణమేమి? జీవసృష్టి ఎట్లు జరిగినది? ఈ జీవిత కాలము ముగియగానే జీవి ఈ శరీరమును త్యజించి చేరు గమృమేదైనయున్నదా? ఇట్లు అనంతములైన ప్రశ్నలున్నవి - వీనికి సమాధానములు మన ఊహకు అందనివి - వేదములలో వీనికి సమాధానములు నిక్షిప్తమై యున్నవి - అందువలననే స్మృతికారులు వేద స్వరూపము నిట్లు నిర్వచించియున్నారు - శ్హో॥। ప్రత్యక్షేణానుమానేన యస్తూపాయో న విద్యతే ఏతం విదంతి వేదేన తస్మాద్ వేదస్య వేదతా ॥1 వేనిని చూడజాలమో ? ఏవి ఊహకు అందనివో అట్టి వానిని తెలుపుటకు వేదము తప్ప మరేదియు లేదు - కావున వేదములకు ఆ పేరు వచ్చినది మనుష్యుడు సంఘజీవి - తాను సంఘమున నెట్లు మసలుకొనవలెను జీవితమును సుఖమయము చేసికొనుట ఎట్ల ? కౌటుంబిక జీవన విదానమెట్లుండవలెను తాను తన జీవిత కాలమంతయు తిండి నిద్రలతోనే వెళ్ళబుచ్చవలెనా? జీవితమునకు పరమార్ధమిదియేనా ?* మరేదేని గమ్యమున్నదా? అయితే దానిని పొందు ఎట్లు) ఈ ప్రశ్న పరంపరలన్నింటికిని సమాదానము కనుగొనవలెనని యున్నది కదా ! వేదములలో నివియన్నియు నిక్షిప్తములైయున్నవి ఇట్‌ను మనుష్యులు సుఖమయ జీవితము సాగించుటకును జీవిత గమ్యము చేరుటకును సృష్టి రహస్యాదులు తెలుయుటకును ఉపాయము తెలిపినవి వేదములే తప్ప మరేదియు మొదట లేదు - వేదార్ధమును భావించి బుషులు పిమ్మబ ఆయా స్మృతులను వేదానుగుణముగా రచించిరి వేదార్ధమునకు విరుద్ధములగు స్మృతులు ప్రమాణములు కావు అని (శ్రుతి స్మృతి విరోధే తు (శుతిరేవ గరీయసీ) చెప్పబడినది - కొందరు బుషులు వేదార్ధమును సరిగా భావించియుండక రచించియుండుటయే స్మృతి వాక్యములు అప్రమాణములగుటకు అనగా గ్రాహ్యములు కాకుండుట కారణము - భ్రమ (్రమాదాదులు మనుష్యులకు సహజములు కదా ? దా! కే. రాజన్నశాస్త్రి
40 మంజూష వేదము లట్లుకాదు - అవి అపొరుషేయములు అనగా పురుషనిర్మితములు కావు - కావుననే పురుషులకుండు భ్రమ ప్రమాదాదులు వానిలో చోటు చేసికొనవు. ఈ విషయమే దేవీభాగవతమున నిట్లు చెప్పబడినది. శ్లో ॥ సర్వజ్ఞాత్ సర్వశక్తేశ్చ మత్తో వేదః సముట్ధితః | అజ్ఞానస్య మమాభావా దప్రమాణా న చ (శ్రుతిః ॥ సత్వజ్ఞుడు సర్వశక్తిసమన్వితుడును అగు భగవంతుని నిశ్వాస రూపమున ఉదయించినవి వేదములు కావుననే అవి స్వతః ప్రమాణములైనవి. ఒకడొక విషయమును చెప్పును - అతడు చెప్పిన విషయమున ఇది సంభవమేనా యని మనకు అనుమానము వచ్చును. అప్పుడు వానిని ఇది ఎట్లు పొసగునని (ప్రశ్నింతుము. వాడు దానికి ప్రమాణము చూపును. మెప్పించును. మనము నమ్ముడుము. ఇట్లు ఆ విషయమును విశ్వసించుట జరుగును. వేదమున నిట్లుకాదు. ఆవేదములలోని విషయమును నిర్జారించుటకు వేరుగా (ప్రమాణము అక్కరలేదు. వేదములు అలౌకికి విషయముల నెన్నింటినో చెప్పును. అవి మనకు అనుభవమున లేవు. అట్లని వానిని త్రోసిరాజనరాదు సృష్టికి పూర్వమేముండెనో మనకు తెలియునా ? నాసదీయ సూక్తము పేరున బుగ్వేదము ( పదియవ మండలము 128 వ సూక్తము) మనకు ఆ విషయమును వివరించినది. ఈ సృష్టియంతయు నియమబద్ధముగా సాగుటకు కారణము ఆ భగవచ్చక్తియే యని వేదము నుదడుపుచున్నది. చూడుడు- భీషా2. స్మాద్వాతః పవతే - ఖీషోదేతి సూర్యః | ఖీషా౭ స్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి ॥ (కైత్తిరియోపనిషత్ - ఆనందవల్లి) సకల ప్రాణులకు జీవనాధారమైన గాలి వీచుటయు, సకల లోక వ్యపహారములను 'ప్రవర్తింపజేయు సూర్యుడు నియమ బద్ధముగా నుదయించుటయు - అగ్ని లోకాలకు రాత్రిలో వెలుగు నిచ్చుచ్న్హుపచనాది వ్యవహారముల నిర్వర్తించుటయు - వర్జన్యుడు సస్యానుకూలముగా వర్షించుటయు-మృత్యుదేవత జీవుల కర్మానుసారముగా పుణ్య పాపఫల భోగమునకై మరణధర్మమును నిర్వర్తించుటయు క్రమబద్ధముగా సాగుటకు కారణము సర్వ నియామకుడగు ఆ భగవంతుని శాసనమే - ఇట్లు సర్వేశ్వరునకు గల దొ॥ కే. రాజన్నశాస్తి
భారతీయ సంస్కృతి - వేద ప్రాధాన్యము శ] సృష్టి నియామకత్వము నీ మంత్రము నుడుపుచున్నది ఇక సృష్టి ఎట్లు ఆవిర్భవించెనో దాని క్రమమిట్లున్నదని ఈ ఉపనిషన్మంత్రము తెలుపుచున్నది. చూడుడు- తస్మాద్వా ఏతస్మాదాత్మాన అకాశః సంభూత: 1 ఆకాశాద్ వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః | అద్భ్యః పృథివీ, పృథివ్యాఓషధయః ఓషధీభ్యో౬న్నం అన్నాక్ పురుషు। సవా ఏష పురుషో౭_న్నరసమయః । (తై.ఉ. ఆనందవల్లీ) ఆ పరమాత్మ వలన మొదట ఆకాశము సంభవించినది. దాని నుండి వాయువు, ఆ వాయువు వలన అగ్ని - అగ్నివలన నీరు, నీటివలన పృధివి - పృథివి వలన ఓషధులు
- ఓషధులవలన అన్నము , అన్నమువలన పురుషుడు ఇట్లు సృష్టి ఆవిర్భవించినది. కావున పురుషుడు అనగా శరీరధారి అన్న రసమయుడు ఆకాశము అనగా అవకాశమును కలిగించునదియే కాక శబ్దము అను ఒక గుణము మాత్రము కలిగి యుండునది. వాయువు శబ్దము స్పర్శ అను రెండుగుణములు కలది - అగ్ని శబ్దస్పర్భ రూపములు అను మూడు గుణములు గలది - జలము శబ్ద స్పర్శ రూప రసములు అను నాలుగు గుణములు గలిగియున్నది - ఇక పృధివి శబ్ద స్పర్శ రూప రస గంధములు అను అయిదు గుణములు కలిగియున్నది - ఇది క్రమముగా పంచభూతములయొక్క ఆవిర్భావ విధానము - ప్రళయ కాలమున పంచమహాభూతముల తిరోభావ విధానము శ్రీ మద్భాగవతమున నిట్లు వివరించబడినది - శ్లో తదా భూమేర్గంధగుణం గ్రసంత్యాప ఉపప్పవే | గస్తగంధా తు పృథివీ వ్రలయత్వాయ కల్పతే (1 అపాం రసమధో తేజస్తా వీయంతే౭౬థ నీరసాః గగ్రసతే తేజసో రూపం వాయుస్తద్రహితం తదా ॥ లీయతే చానిలే తేజో వాయోః ఖం గగ్రసతే గుణమ్ | స వై విశతి ఖం రాజన్ ! తతశ్చ నభసో గుణమ్ ॥ శబ్దం గ్రసతి భూతాదిర్నభస్తమనులీయతే [1 (త్రీ మద్భాగ 12/4/14-17) ప్రళయ కాలమున భూమియొక్క గంధగుణమును జలము (గ్రసించగా భూమి దాః కే. రాజన్నశాస్త్రి
జీ2 మంజూష నశించుననియు - అట్లే జలము యొక్క రసగుణమును తేజస్సు గ్రసించుననియు ఈ క్రమమున ఆయా భూతములు విలోమముగా తనుతమ సహజ గుణమును కోల్పోయి తిరోభావమును పాొందునని తెలుపబడినది. ఈ పంచవమహాభూతములు ఎట్లు ఆవిర్భవించెనని వేదము చెప్పినదో పురాణములుకూడా ఆయా భూతములు తాము ఏభూతముల నుండి పుట్టినవో దానియండే లీనమైనట్లు వర్ణించినవి. నిగూఢములైన వేదార్థములను వివరించుటకే పురాణములు ఆవిర్భవించినవి - కావుననే శ్లో ॥ ఇతిహాసపురాణాభ్యాం వేదం సముపబ్బంహయేత్ ॥ బిభేత్యల్పశ్రుతాద్ వేదో మామయం ప్రహరేదితి ॥ (మహాభారతము ఆది 1-64) ఇతిహాసములు అనగా రామాయణ మహాభారతములు, పురాణములు పద్మపురాణాదులు పదునెనిమిది. ఇవి యన్నియు వేదముల యర్ధమును సోదాహరణముగా వివరించునట్టివి. వీనితో పరిచయములేని అల్పజ్డుడు వేదార్ధమును వివరింపబూనినప్పుడు వేదము తనను నశింపజేయునని భయపడునట - అనగా అట్టివాడు వేదములోని రహస్యార్ధమును వివరింప సమర్థుడు కాడని చెప్పినట్రైనది,. ఈ బుగ్వేద మంత్రము చూడుడు. ద్వా సుపర్దా సయుజా సభాయా సమానం వృక్షం పరిషస్వజాతే | తయోరన్యః పిప్పలం స్వాద్వ - త్య నశ్నన్నన్యో అభిచాకశీతి ॥1 (బుగ్వేద 1/164/20) కలిసిమెలసియుండు మిత్రులైన రెండు పక్షులు ఒకే వృక్షమును ఆశ్రయించియున్నవి, వానిలో నొక పక్షి ఆ వృక్ష ఫలమును మధురమని యెంచి తినుచున్నది. కాని మరియొక పక్షి ఆ వృక్ష ఫలమును తినుటలేదు కేవలము చూచుచునే యున్నది రెండు ఫక్షులును వృక్షము చేరి దాని ఫలమును ఒక పక్షి ఆస్వాదించుటయు మరియొక పక్షి ఆస్వాదించక పోవుటలో నేదో వింత యుండియేయుండును. ఇచ్చట చెప్పిన పక్షులు సామాన్య పక్షులు కావు. అట్లే యయినచో రెండును ఫలము నాస్వాదించి యుందెడివి - అట్లు మంత్రమున చెప్పి యుండలేదు. కావున ఈ యర్థము స్పష్టపడవలెనన్న పక్షుల రహస్యమేదో డా॥ కే. రాజన్నశాస్త్రి
భారతీయ సంస్కృతి - వేద ప్రాధాన్యము శవ తెలియవలెను- శ్రీ మద్భాగవతమున పురంజనోపాఖ్యానమను నాక అఖ్యానమున్నది. పురంజనుడను నొక రాజు. ఆతనికి అవిజ్ఞాత నాముడనునాక నఖుడట - పురంజనుడు నవద్వార పురమను నొక పట్టణమును చేరెనట - అచ్చట అతడొక సౌందర్యరాశిని కాంచెనట. ఆయనకు పదిమంది భృత్యులట. అతదామెను పెండ్లియాడి ఆ నవద్వార పట్టణముననే స్టిర నివాస మేర్చరచుకొని, ఆమెయే లోకమనునట్లు వివిధ విషయ భోగముల
ననుభవించెనట - పురము శ్రువులచే జిక్కి తాను బంధింపబడగా తన భార్యా
పుత్రాదులయందలి మమకారము వీడలేక వారినే స్మరించుచు- మరణంచి మరుసటి
జన్మమున రాజపుత్రికయై జన్మించి వివిధ భోగములననుభవించి చివరకు వానప్రస్థా
(థమమున భర్త మరణించగా తానుసహగమనోద్యుక్తురాలాయెనట. అప్పుడు పూర్వపు
మిత్రుడు అవిజ్ఞాత నాముడనువాడు వచ్చి యుద్చోధింపగా తరించెనని ఎంతో
మనోరంజకముగా నీ యాఖ్యానము వర్ణింపబడినది పురంజనుడు జీవుడనియు,
అవిజ్ఞాతనాముడు అను సఖుడు పరమాత్మయనియు పురంజనుడు పెండ్లి యాడిన స్తీ
బుద్ధియనియు నవద్వారపురము దేహమనియు వివిధ విషయ భోగముల
ననుభవించుటయు మరు జన్మమున స్త్రీ జన్మయెత్తుటయును కర్మఫలమనుభవించుటయే
యనియు వానప్రస్థాశమమున సత్మర్మానుష్టముచే భగవదనుగ్రహము కలిగి సద్గతిని పొందెను. అని
ఇట్లు జీవాత్మకే కర్మఫల భోగము కాని పరమాత్మకు దాని సంబంధము లేదని తెల్పినటైనది. ఆ వేదమంత్రమందలి పక్షులేవియో కాదు - జీవాత్మ పరమాత్మలే - వారు ఒకే సంసార వృక్షమును ఆశ్రయించి యున్నారు. కాని ఆ వృక్షఫలము అనగా కర్మ ఫలమును అనుభవించువాడు జీవుడే - పరమాత్మకు ఫలభోగము లేదు బీజరూపుననున్న ఈ యంశమును విస్తరించి ఎంతో రమణీయముగా కధారూపమున శ్రీ మద్భాగవతము వివరించినది (చూ. భాగ కవ స్మం 25 -28 అధ్యాయములు) ఇతిహాస పురాణములచే వేదార్దముల నుపబ్బంహణముచేయవలెననగా నిదియే
రామాయణము రామకధనుపదేశించినది. భారతము పాండవుల కధను వర్ణించినది - వీనిలో వేదార్ధముల ఉపబ్బంహణ మేముండునని యనరాదు మనుష్యుడు ఎట్టి సదాచరణ చేసి లోకమున కీర్తిపొంది అందరిచే పూజ్యుడగునో అట్టి సార్వకాలిక ధర్మములు వేదమున నుపదేశింపబడినవి అట్ట సదుపదేశములకు ఉదాహరణముగా రామాయణము నిలిచినది- మహాభారతమున పాండవుల కథ ప్రరోచకమే కాని ముఖ్య ప్రతిపాద్యము దాః కే. రాజన్నశాస్త్రి
శశ మంజూష కాదు - కధలనిన అందరిష్టపడుదురు. కథాముఖమున నీతి నుపదేశించుట పంచతంత్రాదులలో మనము చూచుచునే యున్నాము. ఈ కోవకు చెందినదే మహా భారతము. శాంతి అనుశాసన పర్వములు పూర్తిగా లౌకిక పారలౌతక విషయముల నెన్నింటినో వివరించుటకయియే రచింప బడినవి. వీనిలో కధ లేశమైనను లేదు. కావుననే శ్రీ మద్భాగవతమున -
“భారతవ్యపదేశేన అమ్నాయార్ధశ్చ దర్శితళా (1-4-28)
అనగా మహాభారతమున కధ అను మిషచే వేదార్థము దర్శింపబడినదని చెప్పబడినది -
మనుష్యుడు సదాచరణ శీలుడు కావలెను - అప్పుడే తన కుటుంబము - తాను కలిసి మెలిసియుందురు. సంఘము బాగు పడును. పూచిన పూవు పరిమళించును దాని గంధము దశ దిశల వ్యాపించును. అట్లే మంచి నడవడి గలవాని కీర్తి దశదిశల వ్యాపించును. ఈ మంత్రము చూడుడు -
“*యగా వృక్షస్య సంపుప్పితస్య దూరాద్గంధో వాత్యేవం
పుణ్యస్య కర్మణో దూరాట్ల్గంధో వాతి.”
(యజురారణ్యకము - తై - ఉప - 4వ ప్రశ్న - 19 వ మంత్రం)
ఇట మంచి నడవడివలన కీర్తికలుగునని యుపదేశింపబడినది ఎంతవరకు ఈ లోకమున కీర్తి యుండునో అంతవరకు ఈ వ్యక్తి ఉత్తమ లోకమున అలౌకిక భోగముల ననుభవించును. కీర్తిచే నొకప్పుడు ఆత్మ శ్లాఘ, అహంకారము పెరుగును, అవి పతనమునకు దారితీయునని యయాతి స్వర్గ భ్రంశ వృత్తాంతముద్వారా మహాభారతము వివరించినది.( చూ. మహాభారత-ఆది-87 నుండి 98 అధ్యా)
అకార్యాచరణము వలన భయపడుట, కీర్తికె పాటుపడుటయు ఉత్తమ లక్షణములు దంభాచరణము వలనను కీర్తి నార్జించుట జరుగును. యజ్ఞయాగాదులు మహాదానములు మున్నగునవి పరిశుద్ధ మనస్సుతో నాచరించిననే నద్ధర్మములగును- స్వార్ధ బుద్ధితో నాచరించిన దాంబికములే యగును వానిచే - కీర్తి వచ్చిన వచ్చుగాక - ఇట్లు క్రీర్తిలో ఒకప్పుడు దంభము చోటు చేసికొనవచ్చును- సత్యమును తప్పుటయే దంభము - మనస్సున అనుకొనినదానినే నోట చెప్పుటయు చెప్పిన దానినే ఆచరించుటయు అను
దాః కే. రాజన్నశాస్రి
భారతీయ సంస్కృతి - వేద ప్రాధాన్యము త్ నిదియే సత్యము - త్రికరణ శుద్దియనగా సత్యమునకు మారు రూపమే - అనుకొనిన దొకటి, చెప్పునదొకటి, చేయునది మరొకటి -అయినచో, దీనినే కపట మందుము. ఇది సత్యవిరుద్ధము - మోసము అగును. లోక వ్యవహారములన్నియు దీనిచేతనే ఆస్తవ్యస్తములగుచున్నవి - కావుననే కపటముతో కూడిన సత్యము సత్యము కాదని (న తత్సత్యం యచ్చలమభ్యుపేతం”) ధర్మజ్జులు చెప్పుదురు - వేదము “సత్యంవద” (సత్యము పలుకవలెను) అని నిర్దేశించినది - “ నత్యం వాచః ప్రతిష్టా” అని మరియొక చోట వేదమే “ సత్యము వాక్కునకు ప్రతిష్ట” యనియు సత్యమహిమ నుగ్గడించినది - ఇంతేగాక “బ్రిహ్వా మే మధుమత్తమా” (నా నాలుక తేనెలొలుకునదై యుండవలెను. అనియు (శ్రుతి నుడుపుచున్నది. ఈ రెండు వాక్యములను సమన్వయ పరచియే స్మృతికారులు సత్యము పలుకుటలోని సూక్ష్మాంశము నిట్లు వివరించిరి. శ్లో! సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ మా బ్రూయాత్ సత్య మఫ్రియమ్ | ప్రియం చ నానృతం బ్రూయా దేష ధర్మః సనాతనః ॥ అనగా సత్యమును పలుకవలెను - ప్రియమైన పలుకునే పలుకవలెను. అట్లని అప్రియమైన సత్యమును కాని, ప్రియమని యెంచి అసత్యమును కాని పలుకరాదు - ఇట్టి కరోర నియమములతో సత్యమును పొందుటలో నెన్నో చిక్కులు ఏర్పడును. ఇట్లు స్కృతులు సత్య స్వరూపమును వివరించగా పురాణములు సత్య ్రాధాన్యమును హరిశ్చంద్రోపాఖ్యానము ద్వారా వివరించినవి - సత్యము ధర్మములన్నింటిలో నుత్తమమైన ఫర్మము - సకల ధర్మములలోను సత్యము వ్యాపించి యున్నదనుటలోని తాత్పర్యము క యా ధర్మముల నేవిధమైన కపటము లేక నిర్వర్తించుబయే - ఇట్లు దంభాదులు లేక నిర్వర్తించు ధర్మమే పురుషార్థమగుచున్నది. ధర్మప్రాధాన్యము నిట్లు వివరించినది (శుతి- = ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్టా, లోకే ధర్మిష్టం ప్రజా ఉప సర్బంతి, ధర్మేణ పాప మ పనుడదతి, ధర్మే సర్వం ప్రతిప్టితం తస్మాద్ధర్మం పరమం వదంతి” (యజురారణ్యక - తై. ఉ - 4 ప్రశ్న 102 మంత్రం) ధర్మము సర్వ ప్రపంచమునకు అధారభూతమైనది. లోకమున ధర్మిష్టునినే ప్రజలు సమీపింతురు. ధర్మము ననుష్టించుటద్వారా పాపము నశించును. ధర్మముననే సర్వము దాః కే. రాజన్నశాస్ట్రి
46 మంజూష ప్రతిష్టితమై యున్నది. కావున ధర్మము శ్రేష్టమని చెప్పుదురు అని దాని యర్థము. కావుననే “ధర్మంచర” అను (శ్రుతి వాక్యము ధర్మము ననుష్టించుమని యుపదేశించు, చున్నది. చోదనాలక్షణోలి_ ర్గోః థర్మః- అనగా వేదము దేనిని చేయుమని ఆదేశించినదో అదియే ధర్మమని ధర్మ లక్షణము - వేదము చెప్పినట్లు నడుచుకొనినవానికి ఐహిక ఆముష్మిక సుఖములు ప్రాప్తించును. *'యతో£. భ్యదయ' నిశ్షేయససిద్ధిః స ధర్మః అనియు ధర్మలక్షణము నిర్వచించుటలోని తాత్పర్య మిదియే - కావున పురుషార్ధములలో మొదటిది ధర్మము - అర్ధకామములును ధర్మా విరుద్ధములైననే పురుషార్థములగును. అర్ధము జీవిత యాత్రా నిర్వహణమున చాలా ముఖ్యమైనది. తానొక వ్యక్తిగా గౌరవింపబడుచు మనుగడ సాగుటకు అర్ధమే ( ధనమే) ప్రధాన భూమిక వహించుచున్నది. కావుననే వేదము అర్ధము నిట్లు ప్రశంసించిరి. “వతావాన్ ఖలు వై వురుషః యాపదన్య విత్తమ్” ఎంతవరకు ధనము తన వశమై యున్నదో అంతవరకే తానొక వ్యక్తిగా విశిష్టత గనును - అని దాని యర్థము. జీవిత నిర్వహణకై న్యాయబద్ధముగా ధనము నార్జించవలెను. ధనార్జన కనేకోపాయములున్నవి - అన్యాయముగా ధనార్జన ఎందుకు చేయనలెను? అక్రమ సంపాదన అనర్థదాయకము. - ఈ విషయమునే బుగ్వేదము అక్షసూక్తమున వివరించినది - అక్షేర్మాదీవ్యః కృషిమిత్ కృషస్వ విత్తీ రమస్వ బహుమన్యమానః ॥ తత్ర గావః కితవ! తత్ర జాయా తన్నే విచష్టే సవితాజ.య మర్యః ॥ (బుగ్వేద - మండల. 10 సూక్త.34 - బుక్) పాచికలతో క్రీడించకుమా! జీవితము' సాగుటకై వ్యవసాయము చేయవలెను. న్యాయముగా సంపాదించిన ధనము అల్బమైనను అధికముగా భావించుచు దానితోడనే సంతృప్తి చెందవలెను. ఓ జూదరీ 1! వ్యవసాయము చేయుట వలననెన్నో లాభములున్నవి. పాడియావులు పోషింపబడి మృష్టాన్న భోజనాదులతో తృప్తి కలుగును. మరియు భార్యా పుత్రాదులు సంతుష్టులైయుండ సంసారిక జీవనము సుఖమయమై యుందును. ఇక ధనము అనాయాసముగా లభించునని దుర్భుద్ధితో ద్యూతమునే ధనార్జ- నోపాయముగా నెంచుకొంటివా ? దానిలో నుండు కష్టములు ఇన్నీ అన్నీ అని కావు. భార్యా పుత్రాదులు తిండి లేక మలమల మాడుదురు. తల్లి పరితపించును. జూదమున దాః కే. రాజన్నశాస్త్రి
భారతీయ సంస్కృతి - వేద ప్రాధాన్యము శా సర్వస్వము కోల్పోయి ఎన్నో అప్పులు చేసి అప్పుల బాధ పడలేక చౌర్యము చేయదలచి రాత్రులలో ఇతరుల ఇంటికి మాటువేయుచు కాలము వెళ్ళ బుచ్చుట చేయుదురే కాని ఇంటి పట్టున సుఖమయ జీవనము గడుపునవకాశముండదని ఈ మంత్రము నుడుపుచున్నది చూడుడు- “జాయా తప్వతే కితవస్య హీనా మాతా పుత్రస్య చరతః క్వస్విత్ | బుణావా బిభ్యద్ధనగ మిచ్చమానో£_ న్యేషా మస్తముప నక్తమేతి (బుగ్వేదము 10 మండల 34 సూ. మంత్ర10) ఇట్లెంతో మనోరంజకముగా డ్యూతాదులచేతనగు అక్రమ ధనార్షనను నిషేధించుచు కృష్యాదులచేత న్యాయముగా ధనము నార్జించుటను ఉపదేశించుచున్నది. ధనార్జనకు ద్యూతమువంటి అధర్మ మార్గము నెన్నుకొనకూడదు. కృషి వంటి ధర్మ మార్గముల నెంచుకొన వలెనని చెప్పుటలోనే (శ్రుతి తాత్పర్యము. కామము ధర్మవిరుద్ధము గాని యెడల పురుషార్థమగును - ధర్మావిరుద్ధముగా కామోప భోగముల ననుభవించవలెను అనగా తానొక ఇంటివాడై సత్సంతతిని బడిసి పితృబుణ విముక్తిని పొందవలెను - (క్రుతియే ఇట్లుచెప్పినది - చూడుడు-
- ప్రజననం వై ప్రతిష్టా లోకే సాధు ప్రజాయా స్తన్తుం తన్వానః పితృణామనృణో భవతి ” (యజురారణ్యక తై. ఉ. 4/100) ఇవియే ధర్మార్థకామములను పురుషార్ధములు మూడు - ఈ మూడింటిని ట్రివర్గమని యందురు త్రివర్గ సాధనమును నెట్లు చేయవలెనో స్మృతులు బాగుగా వివరించినవి. ఈ త్రివర్ద సాధనమున నేర్పడు విఘ్నములను వానిని ఎదుర్మానుటకై మనుష్యుడు ఎట్లు ప్రయత్నింపవలెనో పురాణములు సోదాహరణముగా వివరించినవి. గృహస్థునకు త్రివర్ణ సాధనము ముఖ్యము తన బాధ్యత తీరిన పిమ్మట నిజ్షేయసమునకై యత్నింప వలెను. ఉపనిషద్రూపమైన వేదభాగము జీవాత్మ పరమాత్మల తత్త్వమును వివరించి మోక్ష మార్గమును సుగమము చేసినది. మహాభారతమునందలి భగవద్గీత ఈ వేదాంత రహస్యము సుగమముగా తెలియునట్లు వివరించినది. కావునే - చా కే. రాజన్నశాస్త్రి
శ్లో 1 సర్వోపనిషదో గావః దొగ్గా గోపాలనందనః । పార్షో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ॥ ఉపనిషత్తులు అను గోవులనుండి పార్టుని లేగగా చేసి కృష్ణుడు పితికిన పాలు ఈ గీతామృతము అని చెప్పుట వలన ఉపనిషత్తుల సారాంశము భగవద్గీతయని స్పష్టముగా తెలిపినటైనది - సద్బుద్ధిగల వారందరును గీతార్ధమును తెలియ వలెను - ఇట్లు వేదములలో బీజరూపమున నున్న విషయము లను వివరించుటయే స్మృతులు పురాణములు చేసిన పని కావుననే - శ్లో ॥ సర్వథా వేద ఏవాసౌ సర్వధర్శ 'ప్రమాణకః | తేనావిరుద్ధం యత్ కించిత్ తత్ ప్రమాణం, న చాన్యథా ॥ (దేవీ - భాగ - 11/1/26) ఇది చేయవలయునా ? చేయకూడదా ! అని నిర్ణయించు నది వేదమే - అనగా ధర్మా ధర్మ నిర్ణయమున వేదమే ప్రమాణము. స్మృతులలోనే కాని పురాణములలోనే కాని వేద విరుద్ధములగు నవి యున్నచో నవి అప్రమాణములే యగును. కావుననే వేదము స్వతః ప్రమాణమని చెప్పబడినది. “ వేదోల_ఖిలో ధర్మమూలమ్” ( వేదమంతయు ధర్మమునకు మూలభూతమైనది) అని మనువు చెప్పెను. సౌర పురాణము వేదము నిట్లు ప్రశంసించినది. శ్లో సర్వేషామేవ భూతానాం వేదశ్చక్షుః సనాతనమ్ । - వేదః శ్రేయస్మరః పుంసాం నాన్య ఇత్యబ్రవీద్రవిః (సౌర -17/35) సర్వప్రాణులకు వేదము చక్షువువంటిది - అనగా సర్వ విషయములను దర్శింపజేయునది - కావున శ్రేయమును కూర్చునట్టిది వేదము వంటిది మనుష్యులకు మజీయొకటిలేదు. అనుట ఎంతో సముచితమై యున్నది వేదమొకప్పుడు ఒకటిగానే యుండెను. ద్వాపరయుగాంతమున వ్యాస భగవానుడు దానిని శాఖలుగా విభజించి ఒక్కొక్క శాఖను, ఒక్కొక్క శిష్యునకుపదేశించెను - వారు వారి వారి శాఖను అధ్యయనము చేసి పరంపరగా రక్షించుకొనుచు వచ్చుచున్నారు. కాన్ని నేడు వేదాధ్యయనము. చేసినవారు కనపడుటలేదు. జీవితకాలమంతయు వేదాధ్యయనమునకై ధారపోయవలయును, ఒక వేదము నధ్యయనము చేయవలయుననిన దా॥। కే. రాజన్నశాష్ట్రి
భారతీయ సంస్కృతి - వేద ప్రాధాన్యము శం 12 వత్సరములు పట్టును. అనంతరము దానిని ధరించుటకై అనగా జ్ఞప్రియందుంచు కొనుటకై ఆవర్తన చేయవలయును. “అనొమ్నాయహతా వేదాః” ఆమ్నాయమనగా ఆవర్తనచేయుట(మళ్ళీ మళ్ళీ చదువుట. ) అది చేయనినాడు వేదము తన స్మృతిపథమునుండి నశించును. వేదము గురుముఖము వలననే అధ్యయనము చేయవలసి యుండును. పుస్తకపఠనము వలన స్వయముగా నభ్యసించునది కాదు. ఏ శబ్దము నెట్లుచ్చరింపవలెనో సంప్రదాయము తెలిసిననే కాని తెలియదు. వహ్ని - దీని యుచ్చారణ. వన్హి అని నకారము పిమ్మట హకారోచ్చారణ యుండును ఇది సంప్రదాయము. (ప్రాతిశాఖ్యాదులు ఈ యుచ్చారణాక్రమమును బోధించినవి. (బ్రహ్మఅనుదాని యుచ్చ్భారణమునను బ్రంహ అనువిధముగ మకారము పిమ్మట హకారోచ్చారణ యున్నది. అలౌకార్థ సాధనమున వేదమంత్రములకు సాటిలైైనది మరియొక్కటి లేదు. వేదముల వర్షానువూర్వి యుచ్చారణక్రమమున నిత్యమైనదని “అగ్నిమీళశేవురోపాతం”అను మంత్రమున “అగ్నిపదమునకు బదులు * వహ్ని” అను పర్యాయపదమునుంచి పఠించిన మంత్రసిద్ధి లేదని శాస్త్రకారులు ఘోషించుచున్నారు.
వేదములిన్ని వత్సరములు చెక్కు చెదరక రక్షింప బడుచు వచ్చిన పనిన ఆ వేదవేత్తలు వేదరక్షణకై ఏర్పరచిన * పద - క్రమ - జటా -ఘనలు” అను నవియే కారణము - నిరంతరాధ్యయన శీలులగు ఘనాంతస్వాధ్యాయము చేసిన వారు - ఆ మంత్రముననున్న యక్షరము ఏది ? ఎట్లుచ్చరించ వలెనని ప్రశ్నించిన ఒక క్షణములో సంశయము తీర్తురు. అట్టివారు ఇక మందు వేదరక్షణకై జీవితము ధారపోయు వారేరి?
భారతీయులమగు మనకు మన సంస్కృతి మూల భూతములగు వేదముల రక్షించుట ప్రధాన కర్తవ్యమైయున్నది. వేదము సాక్షాత్ భగవత్స్వరూపము - వేదరక్షణ, మన భారతీయుల కర్తవ్యమై యున్నది. *
అజం రా
న ల =
- ఆరాధన ( ఏప్రిల్ 1982) (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వదేవాదాయ ధర్మాదాయ శాఖ (హైద్రాబాద్) వారి మాసిక సంచిక) యందు ప్రచురితము. దా! కే. రాజన్నశాస్రి
గీతా సుగీతా కర్తవ్యా (గీతాజయంతి సందర్భమును పురస్కరించుకొని ఈ ప్రత్యేక వ్యాసము 'ప్రకటింపబడుచున్నది* - సం) శ్లో 1) గీతా సుగీతా కర్తవ్యా కిమన్వైః శాస్త్ర విస్తరైః 1 యాస్వయం పద్మనాభస్య ముఖపద్మ వినిర్గతా శ్రీ మద్భగవద్గీత నధ్యయనము చేసిన నింక నే శాస్త్రములు చదువవలసిన యవసరము లేదనుటలో నెట్టి సంశయమునకు తావులేదు. శాస్త్రములు విభిన్నములగు పెక్కువిషయములను బోధించునవి - కావుననే శాస్త్రజ్ఞానము లేనివాడు గ్రుడ్డివానితో సమానుడని నుడువుదురు - కన్నులు లేకున్న ప్రపంచమే లేదు కదా! శాస్త్రజ్ఞానము 'లేకున్నవో' ప్రపంచపరిశీలనాజ్ఞానము లోపించుటచే అంధుదే యగును. కన్నులు ఎదుటనున్న విషయములవే తెలియజేయును - శాస్త్రములు ఆలోచనాశక్తికందని అపరోక్ష విషయములనైనను తెలియజేయును - అందుకే వానిని దర్శనములని యందురు. ఆలోచనాశక్తి గలిగిన ప్రతివ్యక్తియును ఈసృష్టి రహాస్యమును గూర్చి అనగా- -నృత్చీయావిర్భావతిరోభావములు ఎట్లు జరిగినవి? అంతమున దీని పరిణామమెట్లుండును- మున్నగు విషయములను గూర్చి యాలోచించుచునే యుండును. కాని తన యాలోచనాశక్తి కందునది యా? యీ సృష్టిరహస్యము. ఈ రహస్యము తెలియవలెనన్న శాస్త్రముల నాశ్రయించవలసినదే తినుట కనుట కునుకుట ఎవడు చేయన్సిపని? పశువులును ఆ పనులు చేయుచునే యున్నవి - కావున యీ మానవ జన్మకు ప్రయోజన మింతియే కాదు. మానవుడు స్వతంత్రుడు - స్వతంత్రమైన జీవన *సంస్కృతభారతి (జనవరి 1989) జ్రైమాసిక పత్రిక, సంస్కృతభాషా ప్రచారసమితి హైద్రాబాద్. దాః కే. రాజన్నశాస్త్రి
గీతా సుగీతా కర్తవ్యా వ్1 విధానమలవణచుకొను శక్తిగలవాడు. తన పుట్టుక ఎట్లు సార్థకమగునో ఆలోచించుటకును, చేయుటకును (ఆలోచించి దానినాచరించుటకును) సమర్భడు - అయినను జనన మరణములను గూర్చి ఎంత యాలోచించినను యాతని కెంత యంతుపట్టును? ప్రశ్నల పరంపర యతని మనస్సును వేధించుచునే యుండును. కాని వాని సమాధానములా ? ఆలోచనా శక్తికి జానెడు దూరముననే పరుగిడుచుండును. పుట్టిన ప్రతివ్యక్తియును గిట్టుచునే యుందును ప్రపంచమున నెన్నియో జీవరాసులు పుట్టుచునే యున్నవి, గిట్టుచునే యున్నవి. చచ్చినవే తిరిగి పుట్టుచున్నవా ? లేక కొంగ్రొత్త జీవరాసులే జన్మనెత్తుచున్ననా ? “ చావు ” అనగా నేమి? కరచరణాద్యవయవ విశిష్టముగు మృతశరీరము మన కన్నుల యెదుటనే కనిపించుచుండగా దీనిలో నేది లోపించి యుండి యీ శరీరనిశ్చేష్టతకు కారణమైనది, అది ఏది ? అట్లు లోపించిన వస్తువేదో యొకటి యుండవలయునా లేదా? లేకున్న ఈ శరీరము పూర్వమువలెగాక ఇట్లు స్తబ్ధమై యుండుటకు కారణమేమి ? శరీరమున నేదియో యొక యపూర్వ వస్తువు లోపించి యుండుననియే నిశ్చయించినను ఆ వస్తువు (జీవ) స్వరూపస్వభావము లెట్లుందును? ఎంత తలటబ్రద్దలు కొట్టుకున్నను యీ విషయములు మన యూహాశక్రి కందునవి కావు కావున యిట్టి అతీంద్రియవిషయములను తెలియుటకు మజేదో సాధనము కావలయును - అదియే శాస్త జ్ఞానము వ్యక్తి సంఘజీవి. సంఘములో తానెట్లు మెదలుకొనవలెనో తెలిసియుండిన సుఖపడును - లేదేని జీవన విధానము దుర్భరమే యగును కావున ప్రపంచమునందలి వ్యక్తుల మనస్తత్తముల తీరు తెలియవలెను. తానే ఈ విషయము ననుభవ పూర్వకముగా గడించుట కెంతయో సమయము కావలసివచ్చును. చీకటిలో పయనించువాడు యెదురుగా నున్నస్తంభము కానరాక తలకు తగిలి గాయపడి యిదిగో యిక్కడ స్తంభమున్నదని తెలియుట కంటె తెలిసినవాడు చెప్పగా విని స్తంభమును చీకటిలోనైనను గుర్తించి, సుఖముగా పయనించుటయే యెంతో శ్రేయస్కరము కదా ! మన మహర్షులు తమ యలౌకికాద్భుతశక్తులతో ప్రపంచమును పరిశీలించి ఆయా వ్యక్తుల స్వరూప స్వభావములను, ఇతరులావ్యక్తులతో మెదలవలసిన విధానములను, ప్రతీకార చర్యలను, వివరించుచు వ్రాసిన ధర్మశాస్త్ర గ్రంధములను పరించినచో తక్కువ సమయములో ఎంతో అనుభవజ్ఞానము గడించవచ్చును. కావున ఆయా విషయ పరిజ్ఞానమున కాయా శాస్త్రములనధ్యయనము చేయవలసియుండును. గీతాధ్యయనముచే ఈ తెలియవలసిన్త విషయముల పరిజ్ఞానము దాః కే, రాజన్నశాస్ర్రి నయా గ్రంథా న్. డా.
చ్2 మంజూష వలసినంత కలుగును - కావున పైశ్లోకమున నట్లు చెప్పంబడినది.
ఇక్కడ ఒక ప్రశ్న ఉదయించును - భారత యుద్దప్రారంభ సమయమున తన బంధువులను చంపవలసి వచ్చునను భయముచే యుద్ధమునకు మొండికెత్తిన అర్జునుని యుద్ద సన్నద్భుని జేయుటకై యుపదేశింపబడిన యీ భగవద్గీతలో యీ సృష్టిరహస్యాది శాస్త్రీయ విషయముల (ప్రసక్తి కలుగుటకు హేతువేమి ? ఈ యంశము పరిశీలించవలసి యున్నది.
అర్జునుడు యుద్ధ సన్ఫద్దుడై యిరువైపుల నున్న యోధులను చూడనెంచి, తన సారధియగు శ్రీ కృష్ణ భగవానుడు - సేనా మధ్యమున రధము నిలుపగా చూచి - అయ్యో! ఈ యుద్ధమున కేతెంచిన వారందణును, ఆచార్యులు, గురువులు, బంధువులే. వీరల నేనెట్లు వధింతును? అట్లు వధించుట ధర్మముకాదు. కావున నేను యుద్ధము చేయను అని విషణ్ణవదనుడై తన యశక్తతను శ్రీ కృష్ణునకు తెలియజేసెను. ఇక అర్జునునిలో కలిగిన యీ మార్పు సమూలముగా నుపశమింపబడిననే కాని యతడు యుద్ధమునకు సన్నద్దుడు కాడు కదా ? అయిన అర్జునునిలో యీ పరివర్తనము వచ్చుటకు కారణమేమి? యుద్ధము క్షత్రియునకు విహితమైన ధర్మము. స్వధర్మపరిత్యాగమైనను గణింపక యిట్లు బేల యగుటకు హేతువేదో గట్టిదే యయియుండును
అర్జునుని కిరువైపులనున్న యోధలనందథిని చూడగా “వీరందలు నావారను భావమేర్చడెను ఇక తన వారిని తాను చంపుకొనునా ? చంపుటయో చచ్చుటయో యీ రెండు పనులే కదా యుద్ధములో నుండునవి. కావున తాను యుద్ధము చేయనని ఆర్మాసించుకొనెను తాను యుద్ధము చేసే చంపకున్న పీంం0దలు బ్రతికి యుందురను భావము దానికి దోహదమొనర్చెను. తాను చంపువాడనని భావించుటకు కారణము యీ శరీర పతనము మరణమని యెంచుటయే ఈయఖిప్రాయము లన్నియు అజ్ఞాన కల్పితములే ఇదియే యర్జునుని స్వధర్మ పరిత్యాగమునకు పురికొల్చెను. అజ్ఞానము నళించిననే కాని అర్జునుడు స్వధర్శమగు యుద్ధమునకు సన్నద్దుడు కాడు. ఈ అజ్ఞానము నశించవలెనన్న పారమార్ధిక దృష్టి యలవడవలెను. అర్జునున కా పారమార్థిక దృష్టి యలవదజేయుటకై సృష్టి రహస్యము, సృష్టియావిర్భావ తిరోభావములు, జీవాత్మ స్వరూప స్వభావములు అనగా జననమరణ రహస్యములు, జీవుని కర్మగతి, స్వధర్శపాలనావశ్యకత, మున్నగు శాస్త్రీయ విషయము లతని కుపదేశింపవలసి వచ్చినవి - ఉపదేశించుటయే
డా! కే, రాజన్నశాస్త్రి
గీతా సుగీతా కర్తవ్యా కై కాదు - పార్టునకు విశ్వరూపమును సందర్శింపజేసి వాని నన్నింటిని ప్రత్యక్ష మొనర్చెను. ఇక సంశయమునకు తావెక్కడిది? కావుననే
శ్లో ॥ నష్టా మోహః స్మృతిర్లబ్ధా త్వ సాదాన్మయా౬ చ్యుత ! |
స్థితో స్మి గతసందేహః కరిష్యే వచనం తవ ॥
అని పార్టుండు శ్రీ కృష్ణుడు చెప్పినట్లు చేయుదునని తన నిశ్చయమును తెలియజేసెను - అతని మాట ప్రకారము స్వధర్మమగు యుద్ధము చేసి కీర్తి గడించెను.
ఈ లోకమున నెందజో స్వపర భేదభావమునాశ్రయించి యహంకార మమకారావిష్టులై తమ జన్మలకొక గమ్యము లేక స్వధర్మభ్రష్టులగుచున్నారు. వీరందటికిని భగవద్గీత యొక కనువిప్పు కావున భగవద్దీత యొక పార్టునకే కాదు మనందటి కొరకును అందువలననే పెద్దలు -
శ్లో “ పార్టో వత్సః సుధీర్ళోక్తా దుగ్ధం గీతామృతం మహత్”
అని నుడివి యున్నారు -
- భగవద్గీత అందటి సాత్తు. దాని నందజికిని నందించవలెను దాని రహస్యములు అందళథికిని సులభముగా నర్ధమగునట్లు ప్రయత్సించవలె” నని యెంచి ఎందజో ఆచార్యులు, మహనీయులు భగవద్గీతకు వ్యాఖ్యలు రచించియున్నారు. భగవద్గీత కున్నన్ని వ్యాఖ్యలు మటే గ్రందమునకును లేవు. మఖియు నెందరో మహానుభావులు విశ్వమానవ కల్యాణమునకై భగవద్గీతకు వ్యాఖ్యలు రచించుచునే యున్నారు. ఇన్ని వ్యాఖ్యానాలు వెలువడుటకు మతియొక కారణము స్వవిహిత ధర్మానుకూలముగా జీవయాత్ర సాగించుటకొక గమ్య ముండవలెను గదా ? ఆ గమ్యము చేరుటకు మూడు ప్రధానమైన మార్గములు గలవు. అవియే భక్తి జ్ఞాన కర్మ మార్గములు వీనిలో నేయొక మార్గమెంచుకొనినను వ్యక్తి సుఖశాంతులతో జీవయాత్ర సాగించి గమ్యము చేరును. గమ్యము యొక్కస్పరూప విషయమునను మత భేదములు కలవు అర్జునుని కర్తవ్యోన్ముఖుని చేయుటకు “గీత” యుపదేశింపబడినను, జీవయాత్ర కొక గమ్యము లేనిది కర్తవ్యనిష్ట దృథపడదు కావున ప్రాప్తవ్య వస్తు (పరమాత్మ) నిర్దేశ. ప్రాప్యపాయములను భగవద్గీతలో పార్భునకుపదేశింపవలసి వచ్చినవి ప్రాష్తవ్య వస్తు నిర్దేశమునను_ ప్రాప్తుపాయ విషయమునను స్వస్వమత వ్యవస్తాపన చేయుటకును బహుజనామోదయోగ్యమగు గీత
డా! కే. రాజన్నశాస్ట్రి
వశే ॥ మంజూష నొక సాధనముగా గొనుటచే దీని కిన్ని వ్యాఖ్యానాలు వెలువడినవి. ఆయా విషయములకు ఆయా ప్రత్యేక శాస్రములున్నను వానినధ్యయనము చేయుట క్లిష్ట మగుటచేతను, అ యా శాప్రీయ విషయములు అన్నియును ఇందు సమాహారరూపమున సంగ్రహింపబడి సుగ్రాహ్యమగుటచేతను భగవద్గీత సర్వులచే నవశ్యపఠనీయ (గ్రంథమై విరాజిల్లుచున్నది. కావుననే - “ గీతా సుగీతా కర్తవ్యా కిమన్వైః శాస్త్ర విస్తరైకొ అను నభియుకోకి యెంతో సమంజసమనునది నిర్విగాదముో. శసంస్కృత భాషా ప్రచారసమితి (హైద్రాబాద్) వారు నిర్వహించు సంస్కృతభారతీ (జనవరి 1989) ైమాసిక పత్రిక యందు ముద్రితము. అలలనకకలలనలుం పనాననిపమిను దొ॥ కే. రాజన్నశాస్రి
అహింసా పరమో ధర్మః “మా హింస్వాత్ సర్వా భూతాని” అను శ్రుతి వాక్యమునకు సమస్త ప్రాణులను అనగా ఏ్రాణిని కూడ హింసించకూడదని తాత్పర్యము “* ఇది సకల వర్ణముల వారు ఆచరించవలసిన పరమ ధర్మము” అని మనుస్మృతిలో చెప్పబడినది. శ్లో ॥ అహింసా సత్యమస్తేయం శౌచమింద్రియనిగ్రహః 1 ఏతం సామాసికం ధర్మం చాతుర్వర్ద్యే బ్రవీన్మనుః 1 (మను - 10/63) సత్యము, అస్తేయము ( దొంగతనము చేయకుండుట) ఇంద్రియని[గ్రహము అను నాలుగింటికంటెను అహింస గొప్పది. కావుననే అది శ్లోకమున మొదట పరిగణింపబడినది. అహింసాధర్మమును ఆచరించువానికి మిగిలిన ధర్మములు ప్రత్యేక ప్రయత్నమక్కణ లేకయే సిద్ధించును. ఈ విషయము మహాభారత - అనుశాసన పర్వమున నిట్లున్నది. శ్లో యథా నాగపదే౭_ న్యాని పదాని పదగామినామ్ । సర్వాణ్యేవ విలీయంతే పదజాతాని కౌంజరే ॥ ఏవం లోకేష్వహింసా తు నిర్ధిష్టా ధర్మతః పురా ॥ (అను .103/67) ఇతర జంతువుల పాదములన్నయు ఏనుగుపాదములో లీనమైనట్లు ఇతర ధర్మములన్నియును అహింసలో లీనమగును. ఎట్లన? - ఒకప్పుడు సత్యమన్ఫత మగును. అన్ఫతము సత్యముకావచ్చును, ఎందుకనగా ప్రాణులకు మేలునుచేకూర్చునదియే సత్యమని నిశ్చయము. లేదేని అది అధర్మము. చూడుడు - శ్లో ॥ అన్ఫతంచ భవేత్ సత్యం సత్యం చైవాన్ఫతం భవేత్ 1 యద్భూతహితమత్యర్థం తత్ సత్యమితి ధారణా ॥॥ దాః కే. రాజన్నశాస్త్రి
విపర్యయకృతో౬. ధర్మః పశ్య ధర్మస్య సూక్ష్మతామ్ ॥ (మహాభారతము వన. 173/ 3,4) కావుననే - శ్లో ॥॥ అహింసా సరమో ధర్మః, తథా౭_హింసా పరో దమః ॥ అహింసా పరమం దానం, అహింసొ పరమం తపః ॥ అని, అహింసయే సకల ధర్మాలుగా కీర్తింపబడినది. అహింస అనునది నాలుగు విధములుగా నుండును. ఒకటి మనస్సుతో హింసించ కుండుట. అనగా రెండవ ప్రాణిని పీడించే తలంపే మనస్సునకు రానీయకూడదు. పరులకు మేలుచేయుతలంపే సత్పురుషలక్షణము కావుననే భవభూతి తన ఉత్తరరామచరితమున - “ప్రకృత్యా కళ్యాణీ మతిః” అని సత్చురుషుల చరితమును వివరించియున్నాడు. పరుల శ్రేయమును కోరుట మానసికమగు తపస్సే అని గీతలో వర్ణింపబడినది. శ్లో ॥ మనఃప్రసాదః సౌమ్యత్యం మౌనమాత్మవినిగ్రహః | భావసంశుద్ధి రిత్యేతత్ తపో మానసముచ్యతే 1 (గీత 17/16) పరద్రోహచింతన పరహింసకు దారితీయును కావున దానిని మాని పరహితమును గూర్చి ఆలోచించుటయే సాధుస్వభావము. సౌమ్య స్వభావమునకు “పరాకాష్ట ఎట్టిదనగా అపకారికైనను మేలు తలపెట్టుటయే శ్లో ॥ ఉపకారిషు యః సాధుః సొధుత్వే తస్య కో గుణః | అపకారిషు యః సాధుః స సాధుః సద్భిరుచ్యతే 11 ( పంచతంత్రం) ఇక రెండవది, వాక్కుతో హింసించకుండుట - ములుకులవంటి మాటలతో వేధించగా ఆప్రాణి అనుభవించు వేదన ఇంతింతకాదు శరీరములో క్రుచ్చుకొనిన బాణాలు బయలువెడలి గాయాలు మానిపోవును కాని హృదయములో క్రుచ్చుకొనిన వాగ్భాణాలు బయలు వెడలక అక్కడనే ఉండి ఎల్లప్పుడును వేధించుచు ఎప్పటికిని మానవు. విదురుడు ధృతరాఘ్లునితో చెప్పిన మాటలివి- దా॥ కే. రాజన్నశాస్రి
శ్లో 1 కర్ణనాలీక నారాచాన్ నిర్హరంతి శరీరతః ॥ వాక్చల్యస్తు న నిర్హర్హుం శక్యో హృదిశయో హి సః ॥ శ్లో | వాక్సాయకా హృదయం నిష్పతంతి యెరాహతు శోచతి రాత్ర్యవాని ; పరస్య నామర్శసు తే పతంతి తాన్ పండితో నావసృడేత్ పరేభ్యః ౫ (విదురనీతి 79,80్లో) కావున మాటలతో ఇతరులను పొంసంచకూడదు. తీయగా మాటాడవలెను. 'ప్రియముగ మాట్లాడిన అందలును సంతోషింతురు కదా । మాటలలో కూడ దారిద్ర్యము దేనికి ? శ్లో ప్రయ వాక్యప్రదానేన సర్వే తుష్యంతి జంతవః ॥| తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రతాః (హితోపదేశు) సత్యమైనను ప్రియము కాకున్నచో చెప్పకూడదన్నారు. స్కృతికారులు - శః సత్యం బ్రూయత్ ప్రియం బ్రూయాత్ మా బ్రూయాత్ సత్యమప్రియమ్ ; ప్రియం చ నానృతం బ్రూయాత్, ఏష ధర్మః సవాతనః | కోవము పరుషభాషణములకు దారితీయును కాన కోపమును దిగమింగి పరుషాలు పలుకకుండుటయే సత్సురుష లక్షణము. శ్లో॥. న క్రుద్ణ హుషం బ్రూయాత్ ఏతక్ సాధోస్తు లక్షూమ్ ॥ (అర్షధ్యు ఇదియే వాజయమగు తపస్సగును - అని గీతలో చెప్పబడినది- శ్లో ॥ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ 1 స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తప ఉచ్యతేః॥ (గీతా 17/15) ఇక మూడవది - కర్మచే - అనగా శారీరికముగా హింసించకుందుట, వధ బంధన తాడనాడులచే శరీరానికి అమితపీడ కలుగును. కావున ఇతర ప్రాణుల కే విధమైన కష్టము దాః కే. రాజన్నశాస్త్రి
కలుగకుండునట్లు ప్రవర్తించవలెను. భూతదయ లేనిచో ఇది సాధ్యపడదు. ప్రాణిపొంనను వాన్పుటకు భూతదయవంటి ఉత్తమగుణము లేదు. భూతదయాపరుడు తానెన్ని కష్టాలైనను. ఓర్చుకొనును. భూతదయకు ' పరాకాష్ట శిబిచక్రవర్తి - శ్యేనపక్షిబారి నుండి కపోతమును రక్షించుటకు తన శరీరమాంసమును కోసి ఇచ్చుటయే కాక తననే ధారపోయుటకు సిద్ధపడెను. శ్లో ॥ న విద్యతే యదా మాంసం కపోతేన సమం ధృతమ్। తతః ప్రక్షీణమాంసో౬. సా వారురోహ తులాం స్వయం ॥ (వనపర్వ 105/8) హింసాప్రవృత్తిని మాన్నుటకు దయాగుణమే ప్రధానము అని బృహదారణ్య కోపనిషత్తులో కథభారూపమున వివరింపబడినది - దేవతలు మనుష్యులు అసురులు ఉపదేశము పొందుటకయి తండ్రియగు (ప్రజాపతిని సేవించగా. ప్రజాపతి వారికి “ద” అనే అక్షరమును ఉపదేశించెను. ఇంద్రియలోలురగు దేవతలుద” అనగా దమము (ఇంద్రియని[గగ్రహము) అని (గ్రహించిరి. లోభావిష్ణులయిన మానవులు “ద' అనగా “దానం” అని గ్రహించిరి. హింసా ప్రవృత్తిగల రాక్షసులు * ది అనగా దయ అని (గగ్రహించిరి- ఇట్లు ముగ్గురికి ఉపదేశించినది “ద" అను అక్షరము ఒక్కటే అయినను వారి యోగ్యతను బట్టి గ్రహించిన తీరును ప్రజాపతి అనుమోదించెను. అధ హైన మసురా ఊచుః బ్రవీతు నో భవానితి తేభ్యో హైతదేవాక్షర మువాచ “ద” ఇతి వ్యజ్ఞాసిష్థా ఇతి, వ్యజ్ఞాసిషేతి హోచు! దయధ్వమితి స ఆభేతి । ఓమితి హోవాచ, వ్యజ్ఞాసిస్టేతి, । తదేతదేషా దైవీ వాగనువదతి స్తనయత్సుఃు ద ద ద ఇతి దామ్యత దత్త దయధ్వమితి తదేతత్తయం శిక్షేతి దదుం దానం దయామితి ॥ (బృ.దా. 5/2) ఇట్లు మనోవాక్కాయకర్శలచే హింసా ప్రవృత్తిని విదుచుటయే అహింస, ఇది సనాతన ధర్మము - దాః కే. రాజన్నశాష్రి
అహింసా పరమో ధర్మః క్ర శ్లో | అద్రోహః సర్వభూతేషు కర్మణా మానసా గిరా అనుగ్రహశ్చ దానం చ సతాం ధర్మః సనాతనః ॥ (మహాభా.వన. 297/35) కొందటు అకారణముగా పరులను పొంనింతురు. మజఖికాందటలు రాగద్వేషపూరితులై స్వప్రయోజనము కౌఅకు పరులను హింసించుదురు, అకారణముగా హింసించు వారిని భర్తృహరి ఇట్లు పేర్కొన్నాడు - శ్లో మృగ మీన సజ్జనానాం తృణజలసంతోష విహిత వృత్తీనాం | లుబ్ధక ధీవర పిశునా నిష్మారణవైరిడో జగతి | (నీతిశతకం) గడ్డిమేసి బ్రతుకు మృగాలకు వేటకాండ్రు, నీటిలో బ్రతుకు చేపలకు బొయవాళ్ళు ఉన్నదానితో తృప్తిపడు సజ్జనులకు చాడీగొట్టువారును నిష్కారణముగా వైరమును ఆచరించుచున్నారు. ఆ వైరానికి కారణము ఏమిటి? మృగాదులు వారికేమైన అపకారము చేసినట్టు లేదే.
మాంసభక్షణ నిమిత్తము ప్రాణి హింస చేయకపోవుట అహింసా ధర్మము యొక్క నాల్లవ ప్రకారము.
అనుశాసన పర్వములో ఈ విషయము ఇట్లు వివరింపబడినది-
“తన ప్రాణాలంటె తనకెట్లు ప్రియమో సర్వప్రాణులకును వారి వారి ప్రాణములు అట్లే ప్రియమైనవి అని ఎంచి జీవహింస మానవలెను. (ప్రాణులను వధించక అభయమునిచ్చువాడు 'ప్రాణదానము చేసిన వాదడగును. ఏదో ఒక (ప్రాణిని వధిస్తే తప్పు మాంసము లభ్యము కాదుకదా - కావున జీవహింస మానుటకై మాంసభక్షణము త్యజించవలెను. మాంసభక్షణము మానినవాడు సకల'ప్రాణులకు విశ్వాస పాత్రుదడగును.
శో ప్రాణా యథా౭_ త్మనో భీష్టా భూతానామపి వై తథా |
అత్మాపమ్యేన గంతవ్యం బుద్ధిమద్భి ర్మృహాత్మభిః ॥
సర్వభూతేషు యో విద్వాన్ దదాత్యభయదక్షిణామ్ ।
దాతా భవతి లోకే స ప్రాణానాం నా౭£.త్ర సంశయః |
న హి మాంసం తృణాత్ కాష్టాత్ ఉపలబ్బా౭ి. పి జాయతే ।
హత్వా జంతుం తనోర్మాంసం తతో దోషో౭స్తి భక్షణే ॥1 దాః కే. రాజన్నశాస్త్రి
ళం మంజూష శరణ్యః సర్వభూతానాం విశ్వాస్యః సర్వజంతుషు | అనుద్వేగకరో లోకేన చాప్యుద్విజతే సదా 11 (అనుశాసనపర్వం 04/20,22,30) మాంస వర్దనము చేసినవానికి నూరు వత్సరముల కఠిన తపము చేసిన వానితో సమానమైన పుణ్యము లభించును. - శ్లో ॥ యస్తు వర్షశతం పూర్ణం తప స్తప్యేత్ సుదారుణమ్ | యశ్చైవ వర్ష్ణయే న్మాసం సమమేతన్మతం మమ ॥ " (అను 104/61) ఇంకొకవిశేషము మహాభారతము వనపర్వములో ధర్మవ్యాధుడు చండకౌశికబుపికి అహింసా ధర్మరహస్యమును వివరించిన తీరు అద్భుతముగా నున్నది.
కౌశికుడు ధర్మవ్యాధునితో నీవు ఈ ఘోరమైన మాంస విక్రయవృత్తి నాశ్రయించుట తగునా అని ప్రశ్నించగా ధర్మవ్యాధుడు -
శ్లో ॥ స్వధర్మ ఇతి కృత్వా తు న త్యజామి ద్విజోత్తమ! |
పురాకృత మితి జ్ఞాత్వా జీవామ్యేతేన కర్మణా | స్వధర్మం త్యజతో బ్రహ్మన్! అధర్మ ఇతి నిర్ణయః ॥
ఓ ద్విజోత్తమా ! ఇది నా స్వధర్మము కావున దీనితో నేను జీవించుచున్నాను - స్వధర్మ త్యాగము అధర్మమే అగును. ఈ నా వృత్తి ఒక్కటే హింసాజహుళమా ఇతర వృత్తులు కావా? వ్యవసాయం శ్రేసమంటారు, నాగటితో దున్నునప్పుడు ఎన్ని భూమిలోనున్న ప్రాణులు హింసింపబడుటలేదు. ధాన్య బీజములు తరులతాఫలాదులన్నియు జీవము కలవి కావా ? నీటిలో ఎన్ని సూక్ష్మప్రాణులు లేవు - కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు నడచునప్పుడు ఎన్నో జీవరాశులు నశించుచున్నవి., ఈ ద్యావాభూములు అనేక సూక్ష్మప్రాణులతో నిండియున్నవి. తెలియకయే మనమెన్నో జీవరాశులను హింసించు చున్నాము. కావున హింసచేయని వారెవరు ?-
శ్లో ॥ అహింసేతి యదుక్తం హి పురుషైర్విస్మితైః పురా |
కే న హింసంతి జీవాంశ్చ లోకే2_స్మిన్ ద్విజనత్తమ! | దాః కే. రాజన్నశాప్రి
అహింసా పరమో ధర్మః 61 ఇహు సంచింత్య ఇహ వై నాస్తి కళ్చిదహింసకః (వన. 173/31. 32) ఇట్లు ధర్మవ్యాధుడు చాలా సూక్ష్మంగా ఆలోచించి స్వధర్మాచరణమే కీర్తికరమని అన్నాడు - శ్లో 11 స్వకర్మ నిరతతోయోహి స యశః ప్రాప్నయాత్ మహత్ ॥ (వన 175/38) కావున తెలిసి తెలిసి మనోవాక్కాయ కర్మలద్వారా ఇతరులకు బాధ కలిగించు ఏ పనికూడ చేయకుండుటలయ్ అహింస. అదియే పరమ ధర్మము ఆ శ్లో ॥ అహింసాలక్షణో ధర్మ ఇతి వేదవిదో విదుః యదహిం(స్రం భవేత్ కర్మ తత్ కుర్యాన్మతిమాన్ నరః ॥॥ (అను. 105/15) ఇతి శమ్ ॥ ఆకాశవాణి హైద్రాబాద్ కేంద్రమునుండి అమరవాణి కార్యక్రమంలో ప్రసారితమైన ఈ ప్రసంగవ్యాసం సంస్కృత భాషా ప్రచారసమితి (హైద్రాబాద్) వారి సంస్కృతభారతి (ఏప్రిల్ 1992) కైమాసిక సంచిక యందు ప్రకాశితము- దా! కే. రాజన్నశాస్త్రి
భో సత్ర్రవర్తన - ధనము
శ్లో; వృత్తం యత్నేన సంరక్షేత్, విత్తమేతి చ యాతి చ ॥
అక్షీణో విత్తతః క్షీణో వృత్తతస్తు హతో హతః ॥
ఈ శ్లోకం విదురనీతిలోని నాల్గవ అధ్యాయంలో ముప్పదియవది - విదుకుడు ధృతరాస్త్ర మహారాజునకు బోధించిన నీతియే- విదురనీతి' అను పేర ప్రసిద్ది చెందినది. ఈ విదురనీతి మహాభారతం ఉద్యోగ పర్వంలోనిది - ధృతరాష్ట్ర మహారాజు సంజయుణ్ణి పాండవుల సమీపానికి రాయబారార్థమై పంపగా సంజయుడు రాయబారం నెరపి వచ్చి ధృత రాష్ట్ర మహారాజుతో ఓ మహారాజా ! నేనిప్పుడు ప్రయాణం చేసి అలసి ఉన్నాను. నేను విశ్రాంతి కోరుతున్నాను. రేపు సభలో అందరి సమక్షంలో ధర్మరాజాదులు మాటాడిన తీరును వివరిస్తాను అని చెప్పి ఆజ్జతీసుకొని వెళ్ళిపోయాడు - ఆ రాత్రి ధృతరాష్షునికి నిద్ర పట్టటం లేదు- అకారణంగా విదురుణ్జి పిలిపించుకున్నాడు. ఆ సందర్భంలో విదురుడు ధృతరా[షష్ట మహారాజుకు మంచి చెడులను గురించిన అనేక విషయాలు చెప్పాడు. లోకం తీరును వివరించాడు - రాజుల తీరును విశదీకరించాడు. అభ్యుదయ పథానికి మార్గాలు, పతనానికి దారితీసే పరిస్థితులను, సద్గుణాలంటె ఏవో, దుర్గుణాల స్వరూపం ఎట్టిదో ఇట్లా ఎన్నో వషయాలు వవరించి చెప్పాడు. ఇంతగా లోకోపయుక్త మైన విషయాలుచోటు చేసుకున్నాయి కాబట్టి ఈ విదురనీతి ఎంతో జగత్ర్రసిద్ధిని పొందింది.
(ప్రకృతశ్లోకంలో సత్రవర్తన ప్రాధాన్యాన్ని వివరిస్తూ-వృత్తము అంటె సత్ష్రవర్తన, విత్తం అంటె ధనము - ఈ రెంటిలో దేనికి ప్రాధాన్యమివ్వాలో తేల్చి చెప్పిన తీరు ఎంతో యుక్తియుక్తంగా ఉంది - ధనం వస్తుంది - పొతుంది, శాశ్వతం కాదు, కాబట్టి వ్యక్తి ముఖ్యంగా మంచినడవడి పై మొగ్గుచూపి ఎన్నికష్టనష్టాలనైనా భరించాలి - మంచి నడవడి కొరవడి చెడ్డపేరు వచ్చేనా ఆ వ్యక్తి సర్వవిధాల నష్టపడిన వాడే అవుతాడు - ఇక ధనమా ! ఒకవేళ అది చేజారిపోయినప్పటికి తిరిగి సంపాదించుకోవచ్చు కాని మంచినడవడి వలన కలిగిన కీర్తిని తిరిగి సంపాదించుట కష్టం - “సంభావితన్య
డా! కే. రాజన్నశాస్త్రి
సత్ర్రవర్తన - ధనము (3 చాకీర్తిః మరణాదతిరిచ్యతే - అనగా అపకీర్తి కలిగిందంటె ఇక మరణించినట్టె అవుతుంది.
శ్లో ॥ శీలం (ప్రధానం పురుషే తద్ యస్యేహ ప్రణస్యతి
నతస్య జీవితేనార్డో న ధనేన న బంధుఖిః ॥ (విదు - 2/48)
వ్యక్తికి సౌశీల్యము అనగా సత్రపవర్తనయే ముఖ్యమైనది. అది నశించిననాడు తాను జీవించి ప్రయోజనం ఏమి? ఎంత ధనమున్నను ఎందరు ఆప్తబంధువులున్నను ప్రయోజనము లేదు. సౌశీల్యము అలవరచుకొని అభివృద్ధి సాధించాలంటె ఆరు దోషాలను విడనాడాలి. ఆరుగుణాలను ఎప్పటికి కూడ విడనాడ రాదు. అవి ఏవి అనగా-
శ్లో ॥ షద్దోషాః పురుషేణేహ హాతవ్యా భూతి మిచ్చతా |
నిద్రా తంద్రా భయం క్రోధ ఆలస్యం దీర్హసూత్రతా ॥ శ్లో॥ షదేవ తు గుణాః పుంసా న ప్టోతవ్యాః కదాచన 1 సత్యం దాన మనాలాస్యమ్ అనసూయా క్షమా ధృతిః ॥
అతినిద్ర, ఏమరుపాటు, పిరికితనము, కోపము, సోమరితనము, - దీర్హసూత్రత - అంటె ప్రతి విషయాన్ని అతిగా సాగదీస్తూ ఎటూ తేల్చకపోవుట - ఇవి ఆరు దోషాలు - నిద్రను జయించకుంటె ఏ పని సాగదు కదా ! ఏమరుపాటు అనర్గానికి దారితీస్తుంది. ఇక పిరికితనముంటె ఏపని ప్రారంభించలేము. అందుకే భర్తృహరి అన్నాడు.
శ్లో ॥ ప్రారభ్యతే న ఖలు విష్నుభయేన నీవైః
ప్రారభ్య విఘ్న నిహితా విరమంతి మధ్యాః | విఘ్ల్నైః పునః పునరపి ప్రతిహన్యమానా : ప్రారబ్ధ ముత్తమజనా న పరిత్యజంతి ॥
విఘ్నభయాన పనిని ప్రారంభం చేయకపోవటం కాదు కావలసింది, ఎన్నీ విఘ్పాలు వచ్చినా వానిని ఎదుర్శొనె ధైర్యం కావాలి. అదే కార్య సాధన - అందుకే పిరికితనం కూడదు. ఇక కోపం ఎన్నో అనర్థాలను కొనితెచ్చిపెట్టేది- క్రోథం వలన తపోహాని, నియమభంగాదులు, యశోహాని మొదలగునని ఎన్నో జరిగినట్లు దృష్టాంతాలు ఉన్నవి - క్రోధం కొన్ని సందర్భాలలో గుణమే అయినా కొన్ని సందర్భాలలో క్రోధాన్ని నియమించుకోవాలి - ఎట్లా నంటె-
లో
దాః కే. రాజన్నశాస్త్రి
64 మంజూష శ్లో ॥ దైవతేషు ప్రయత్నేన రాజసు బ్రాహ్మణేషుచ | నియంతవ్య 1 సదా క్రోధో వృద్ధబాలాతురేషు చ ॥ దేవతలు, వేదవేత్తలు, రాజులు, వృద్దులు, బాలురు రోగగ్రస్తులు అనే వారి విషయంలో కోపం నియమించుకొవాలి కాని వారిపై కోపం ప్రదర్శించకూడదు. కార్యసాధకునకు ఈ కోపం ఎల్లవేళలా కూడదనే కూడదు. సోమరితనం దీర్షసూత్రత ఈ రెండు కూడ కార్యవిఘాతుకాలే. తగిన సమయంలోనే ఏ పనైనా చేయాలి “క్షిపమక్రియమాణస్య కాలః పిఐతి తద్రసమ్ - అంటె తగిన సమయంలో తొందరగా పనిచేయకుంటె దానిలోని సారాన్ని కాలం (గ్రసించి వేన్తుంది - అభ్యుదయ కరకార్యోన్ముఖుడైన వ్యక్తి ఈ ఆరు దోషాలను వర్షించి వేయాలి అని ఆ నీతిశ్లేకతాత్చర్యం జ. ఇక విడువతగని గణాలేవి యనగా- శ్లో షదేవ తు గుణాః పుంసా న హాతవ్యాః కదాచన | సత్యం దానమనాలస్య - మనసూయా క్షమా ధృతిః ॥ (విదు 6 1/86) అభ్యుదయాన్ని ఆకాంక్షించె ప్రతివ్యక్తి అలవరుచుకోవలసిన గుణాలు ఆరు - వానిలో మొదటిది సత్యము - సత్యవర్తనుడైన వ్యక్తిని అందరు విశ్వసిస్తారు - కుటిలవర్తనుని ఎవరు కూడ విశ్వసించరు - సత్యము అంటె మాటలలో చేతలలో భావనలో కూడ ఒకే పద్ధతి అవలంబించి యుండుట - అందుకే సత్పురుషుల స్వభావాన్ని వర్ణిస్తూ పంచతంత్రకారుడు ఇట్లా అన్నాడు - శ్లో ॥ మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనామ్ | మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మ్శణ్యన్యత్ దురాత్మనామ్ ॥ మనోవాక్కాయ కర్మలలో ఒకేరూప్తు కల్లియుందుట మహాత్ముల స్వభావమైతే తద్విరుద్ధంగా మనోవాక్కయ కర్మలలో బిన్న ప్రవృత్తి దుర్దనులది. కావున సత్యవంతుడు సర్వజన విశ్వాసపాత్రుడై ఆదరణీయుడవుతాడు - ఇక రెండవది దానగుణం - దీనినే ఉదారస్వభావం, దాతృత్వం అని కూడా వ్యవహరిస్తుంటారు - వేదం చాన గుణాన్ని ఇట్లా ప్రశంసించింది - దా! కే. రాజన్నశాస్ర్రి
సత్ర్రవర్తన - ధనము 65
“ లోకే దాతారగ్ం సర్వ భూతాన్యుపజీవంతి దానే నారాతీరపానుదంత దానేన ద్విషంతో మిత్రాభవంతి దానే సర్వం ప్రతిష్టితం”
లోకంలో దాతను అందరూ ఆ(శయిస్తారు దానంతో శత్రువులు కూడా మిత్రులవుతారు. అని ఆ మంత్రం సారాశం - దాన గుణం చాల శ్రేష్టమైనదే కాని దానిని అలవరచుకోవటం కష్టం - అందుకే ఏ కొందరికో దాతృత్వగుణం అబ్బుతుంది. కావుననే -
శ్లో ॥॥ దాతృత్వం ప్రియవక్షృత్వం ధీరత్వముచితజ్ఞతా 1
అభ్యాసేన న లభ్యంతే చత్వారః సహజా గుణాః ॥
అంటె దానం చేయుట, ప్రియంగా మాటాడుట, ధైర్యంతో ఆపదలనెదుర్మ్కొనుట, సమయ సందర్భాలను గుర్తించి మెదలుకొనుట, అనే ఈ నాలుగు గుణాలు పుట్టుకతో అబ్బెవే కాని అలవాటుల చేసుకున్న మాత్రాన వచ్చేవి కాదు అని అన్నారు. ఉన్నంతలో ఇతరులకు పంచిపెట్టటం ప్రతి వ్యక్తి చేయవలసిందే. ఇది రెండవ గుణం. ఇక మూడవది అనాలస్యం - సోమరిపోతుగా కాక చురుకుదనం కలిగి యుండుట, అంటె ఉత్సాహంకలిగి యుండుట - ఉత్సాహం లేనిదే ఏ కార్యంకూడ సఫలం కాదుకదా? నాలుగు, అనసూయ అసూయ అనగా ఇతరుల బెన్నత్యాన్ని చూచి ఓర్వలేకపోవుట. ఇది దోషం - ఈ దోషం చేతనే కదా దుర్యోధనాదులు సమూలంగా నశించారు. అట్టి అసూయ లేకుండ ఉండుట అనుసూయ. అయిదు - క్షమ, అంటె ఓర్పు - ఓర్పుగల వానిని ఎంళటి దుర్దనుడైనా ఏమి చేయలేడు. ఇదే విదురనీతిలోని ఈ శ్లోకం చూడండి.
శ్లో శాంతిఖద్గః కరే యస్య కిం కరిష్యతి దుర్దనః |
అత్భణే పతితో వహ్నిః స్వయమేవోపశామ్యతి
శాంతి అనే ఖడ్గం చేతిలో ఉన్నంతవరకు తనను దుర్దనుడేమి చేయలేడు - ఎందుకనగా అగ్ని కాలుస్తుంది - కాని కాల్బటానికి దానికి గడ్జిపోచలుండాలి - ఒక గడ్డి పోచ కూడ లేని చోట ఆ అగ్ని దేనిని కాలుస్తుంది - దానంతట అదే చల్లారిపోతుంది. దుర్దనుడు ఇతరులను దూషిస్తాడు - అది అతని స్వభావం - దానికి (ప్రతిస్పందించి కఠినోక్తులు పలికి కోపం ప్రదర్శించక ఓర్చి ఊరుకుంటె అతడు తననేమి చేయలేడు- ధర్మరాజు ఓరిమి వ్రదర్శించియే గురువులకు విశ్వాసపాత్రుడై శత్రువులను డా! కే రాజన్నశాష్టి
66 మంజూష జయించగలగాడు. ధృతి ఆరవగుణం - ధృతి అంటె సంతుష్టి - ఉన్నదానితో తృప్తిపడుట లేనిదానికై ఆశపడుటకంటె ఉన్నదానితో సంతృప్తి పడుట ఎంతో మేలు - అందుకే విదురుడన్నాడు. శ్లో ॥ నాప్రాప్య నుభివాంఛంతి నష్టం నేచ్ళంతి శోచితుమ్ । ఆపత్సు చ నముహ్యంతి నరాః పండిత బుద్ధయః ॥ వివేకశీలురు పొందవీలులేని దానిని కోరరు - నశించిన దానిని గూర్చి విచారించరు - ఆపదలను ధైర్యంతో ఎదరుర్కొంటారే తప్ప “అయ్యో ఎట్లాగా” అని మోహాన్ని పొందరు - కాబట్టి యధాలాభ సంతుష్టి రూసమైన ఈ ధృతి గుణం ఆరవది.
- ఈ ఆరుగుణాలు ఎట్టి పరిస్థితిలోను విడువకుండ తనలో భద్రపరుచుకోవాలి. అట్టి వ్యక్తి సర్వశ్రేయములను పొంది లోకపూజితుడవుతాడు - అశాశ్వతమైన ధనంతో శాశ్వతమైన కీర్తి సంపాదించుట కష్టం - కావున ధనంకంటె నడవదియె (ప్రధానమైనది కావున వ్యక్తి సత్ప్రవర్తన అలవరచుకున్నపుడే ఇహ పరలోక సౌఖ్యాలననుభవిస్తాడు. * ...... శౌఆక్రాశవాణి హైద్రాబాద్ కేంద్రం నుండి "సూక్తి ముక్తావళి” కార్యక్రమంలో ప్రసారితమైన ఈ ప్రసంగవ్యాసం, అంధ్ర(ప్రదేశ్ ప్రభుత్వదేవదాయ ధర్మాదాయశాఖ (హైద్రాబాద్) వారి “ఆరాధన (ఫిబ్రవరి 1997) మాసిక సంచిక యందు ప్రచురితము- _యయ:1హమి... మొ... దాః కే. రాజన్నశాప్రి
శ్రీ మద్రామాయణము - భరతుండు శ్లో; యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే | తావద్రామాయణకథా లోకేషు ప్రచలిష్యతి ॥ వాల్మీకి మహాకవి శ్రీ మద్రామాయణమును (బ్రహ్మవర ప్రభావమున సకల విషయములను తాను దివ్య ధృష్టిచే ప్రత్యక్షముగా దర్శించి రచించెను. రామాయణము సంస్కృత సాహిత్యమున ఆదికావ్య మయ్యును ఇతిహాసము. అనగా జరిగిన చరిత్రను ఉన్నదున్నట్లు వర్ణించి చెప్పిన (గ్రంథము. విశ్వ కళ్యాణార్థమై యవతరించి ఆదర్శప్రాయమైన జీవన విధానమును లోకు కెరుకపరచు శ్రీరాముని చరితము చిత్రించిన కావ్యేతిహాసమిది. రామాయణ పాత్రలన్నియు సజీవములై మానవుల మనోభావములకు ప్రతీకలై ధర్మబద్ధములై ఆదర్శప్రాయములై యున్నవి. అందు భరతుని గూర్చి ప్రకృతమున ్రస్తావింపబడుచున్నది శ్లో; రామాదపి హి తం మన్యే ధర్మతో బలవత్తరమ్ ( వా.రా. ల/17/62) రామునికంటెను ధర్మవిషయమున దృథమైన నిష్టగలవాడని తండ్రియగు దశరథ మహారాజు చేతను - శ్లో దిష్ట్యా న చలితో ధర్మా దాత్మా తే శుభలక్షణ! 1 వళ్స ! సత్యప్రతిజ్ఞో మే సతాం లోకానవాప్స్యుసి ॥ (వా.రా.2/75/62) “నాయనా భరతా ! నీవు సత్యప్రతిజ్ఞుందవు - నీ బుద్ది ధర్మమునుండి ఎన్నడును దాః కే. రాజన్నశాస్త్రి
విచలితము కాదు- నీవు సచ్చరితుడవు కావుననే సత్పురుషులు పొందవలసిన ఉత్తమలోకమును పొందనర్హుడవు” అని కౌసల్యాదేవి చేతను - శ్లో ॥ జానామి భరతం క్షాంతం గురుసత్కారకారిణమ్! సర్వమేవాత్ర కాళ్యాణం సత్యసంధే మహాత్మని ॥ (వా.రా. 2/11/30) భరతుడు క్షమావంతుడు పెద్దలను గౌరవించువాడు సత్యసంధుడును ఆతని యందు అన్నియు మంచి గుణములే కాని ఏలోపమును లేదు ” అని శ్రీరామునిచేతను శ్లో ధన్యస్త్వ్వం న త్వయా తుల్యం పశ్యామి ధరణీతలే 1 అయత్నా దాగతం రాజ్యం యస్త్వం త్యక్తు మివేచ్చసి 1 (వా.రా. 2/95/1292) భరతా ! నీవు ధన్యుడవు నీబోటివారు ఈ భూతలముననే లేరు. అయత్నముగా 'ప్రాప్తమైన రాజ్య సంపదను త్యజింప నిచ్చగించితివి. ( ఇట్టివాడు మరెవడుండును) అని రాముని చేతను - శ్తోః। త్వయ్యేతత్ పురుషవ్యాఘ్ర! యుక్తం రాఘవవంశజ! 1 గురువృత్తి రమశ్చైవ సాధూనాం చానుయాయితా ॥ (వా.రా. 2/90/20) ఓ పురుషు 1. ఇంద్రియ నిగ్రహము. గుకుప్తుల సనుసరించి మొలంగుట, సత్చురుషుల నడవడి నలవరచుకొనుట, అను నీ గుణములు రఘువంశీయుడవగు నీయందు తగి యున్నవి అని భరద్వాజమునిచేతను ఇట్లు మరెందరిచేతనో ప్రశంసింపబడిన సచ్చరితుడు. భరతుని ధర్మనిష్టను కౌసల్యా దశరథులే కొనియాడిరి. దశరథుడు కైకేయి వివాహ కాలమున కైకేయి తనయునకే రాజ్యపట్టము కట్టుదునని వచన మిచ్చియుందెను. ఈ విషయము కడు రహస్యముగా నుంచంబడినది. కైకేయికి సయితము ఇది తెలిసి యున్నట్లు కనబడదు. కాని భరతునకీ విషయము తెలిసియే యున్నట్లు తోచును. ఎట్లన? భరతుండు మాతుల గృహమునుండి వచ్చి తండ్రి మరణవార్త విని చాలాసేపు విలపించి తల్లితో పలికిన ఈ పలుకులు కనుడు - దా కే. రాజన్నశాస్రి
శ్రీ మద్రామాయణము - భరతుండు న శ్లో ॥ అఖిపేక్ష్యతి రామం తు రాజాయజ్ఞంను యక్ష్యతే 1 ఇత్యహం కృతసంకల్పో హృష్షో యాత్రా మయాసిషమ్ తదిదం హ్యాన్యధా భూతం వ్యవదీర్దం మనో మమ ॥॥ (వా.రా 2/72/28) నేనెన్నో ఆశలతో మాతుల గృహమునకు వెళ్ళితిని. నేను వచ్చులోపల రామునకు పట్టము గట్టి మా తండ్రి యజ్ఞము కూడ చేయునని తలంచితిని. అది యంతయు తలక్రిందులైనది - దీనిచే తాను అయోధ్యలోనున్నవో రామ యౌవరాజ్యపట్టాభిషేకమునకు ప్రతిబంధకముగా నిలువగలనని అతని భావనయై యుండుననియు, లేదేని ఆ యుత్సవము తన పరోక్షమున జరుగవలెనని భావించనవసరము లేదని, అట్లు (ప్రతిబంధకముగా నిలుతునని భావించుటకు కారణము - కైకేయి వివాహ సందర్భమున తండ్రి తన మాతామహునకు ఇచ్చిన రాజ్వశుల్క వాగ్దాన వృత్తాంతము అతనికి తెలిసియే యుండుట యనియు స్పష్టమగును. ఇంతే గాక శ్రీరాముడును చిత్రకూటము నుండియే తనను మళ్ళించి గొనిపోవుటకు వచ్చిన సందర్భమున భరతునకు ఈ విషయము స్పష్టముగా చెప్పియున్నాడు చూడుడు - శ్లో పురా భ్రాతః! పితా నః స మాతరం తే సముద్వహన్ | మాతామహే సమాశ్రౌషీద్ రాజ్యశుల్క మనుత్తమమ్ 1 (నా.రా. 2/103/3) ఇంత తెలినినను తాను రాజ్యాదికారము నెన్నడునాశింవలేదు - తానయోధ్యలోనున్న ఏమి ఘోరము జరుగునో యని మాతుల గృహమునకు వెళ్ళిన సచ్ఫీలుడు - తన తల్లి మూలముననే మళ్ళీ తనను వరించిన రాజ్యలక్షిని సైతము తిరస్మరించిన ఘనత భరతునకే దక్కినది - కులక్రమాగతమైన రాజ్యలక్ష్మి జ్యేష్టనే వరించవలయునను సనాతన కులధర్మమునందమిత(శ్రద్దాసక్తులు కనంబఅచిన ధీరుడు. చూడుడు- శ్లో న హి మన్యే నృశంసే ! త్వం రాజధర్మ మవేక్షసే | గతిం వా న విజానాసి రాజవృత్తస్య శాశ్వతీమ్!। డా! కే. దాజన్నశాస్త్రి
70 మంజూష సతతం రాజపుత్రేషు జ్యేష్టో రాజా౭.భిషిచ్యతే | రాజ్ఞామేతత్ సమం తత్ స్యాదిక్ష్వాకూణాం విశేషతః 1 (వా.రా. 2/7321,22) ఇంతటి ధర్మనిరతి గలవాడు - జ్యేష్టుడగు రాముని తండ్రిగా ఆత్మబంధువుగా నెటింగి తానతనికి దాసునిగా భావించిన ధర్మమూర్తి. కావుననే గుహునిచేతను కౌసల్యా దశరధులచేతను అట్లు కీర్తింపంబడియెను గుహుడు మొదట భరతుని శంకించెను. కాని పిమ్మట అతని వృత్తమును తెలసి ఎంతయో సంతసించెను. గుహుని ద్వారా రామాదుల శయనాసన భోజనాదులను తెలిసికొని భరతుడు పరితాపము జెందిన విధము పరిశీలించినచో అతని మృదుస్వభావము (భ్రాతృభక్తియు వ్యక్తములు కాగలవు. రాముడు శయనించిన ప్రదేశమును కనుగొని తాను తపించిన తీరు గనుడు - శ్లో! హా౬హతో౬స్మి నృశంసో౭స్మి యత్ సభార్యః కృతే మమ | ఈద్భశీం రాఘవః శయ్యా మధిశేతే హ్యనాథవత్ ॥॥ రామునకిట్టి కష్టములు తనవలననే కలిగినందున తాను (క్రూరుడననియు మందభాగ్యుడననియు పరితపించుట ఎంతో హృదయవిదారకమై భరతుని సౌశీల్యమును వ్యక్తము చేయుచున్నది. భరద్వాజమహర్షి భరతుని చిత్తవృత్తిని పరీక్షింపనెంచి రాజోచితాతిధ్యమును చేసెను ఆ సందర్భమున తన తపఃశకిచే వివిధ భోగ్య వస్తువుల స్పజించుటయే కాక భరతునికైె ప్రత్యేకముగా నొక స్వర్థ సింహాసనమును ఛత్రచామరములను కూడ సృజించి భరతుని అందుపవిష్టుని గమ్మని కోరెను. కాని భరతుడు తాను రాజును కాదనియు తన కా యర్హత లేదనియు దాని నధిష్టించునర్హత శ్రీరామునకే యున్నదని ఎంచి తాను మంత్రుల యాసనమున నుపవిష్టుడాయెను ఇట్టి సచ్చరిత్రుని గని భరద్వాజ మహాముని ఎంతో ప్రశంసించెను భరతుని కార్యదీక్షయు దృధమైనది- పితృకార్యాదులు నిర్వర్తించిన పిదప వసిష్టాదులు భరతుని పట్టాభిషిక్తుడవు కమ్మని కోరగా భరతుడు- “ రాజార్డుడు జ్యేష్టుడగు రాముదే యనియు, నేను ఇప్పుడే వనమునకేగి దా॥। కే. రాజన్నశాస్త్రి
శ్రీ మద్రామాయణము - భరతుండు 7 శ్రీరామాదుల తోడొని తెత్తుననియు శ్రీరాముడు నివర్తిల్లని పక్షమున నేను నరణ్యవాసము చేయగలనని నుడివెను - చివరకట్లే నందిగ్రామముననే వసించెను గదా! శ్రీరాముని చూడవలెనను భరతుని యుత్మంఠచూడ అతని బ్రాత్భడ్రేమ ఎట్టిదో వ్యక్తమగును. శ్లో | యావన్న చంద్రసంకాశం తద్ ద్రక్ష్యామి శుభాననమ్ | (భ్రాతుః పద్మవిశాలాక్షం న మే శాంతిర్భవిష్యతి | యావన్న చరణౌ భ్రాతుః పార్ధివవ్యంజనాన్వితౌ। శిరసా ప్రణమిష్యామి నమే శాంతిర్భవిష్యతి ॥ యావన్న రాజ్యే రాజ్యార్హ పితృపైతామహే స్థితః అభిషిక్తో జలక్షిన్నో న మే శాంతి రృవిష్యతి ॥1 (వా.రా. 2/98/7.9. 10) శ్రీరాముని ఆ సుందరవదనారవిందము చూడవలెనట. ఆతని చరణములకు శిరమున ప్రణమిల్లవలెనట. అతడు పితృపైతామహ రాజ్యమున పట్టాభిషిక్తుడై యుండ చూడవలెనట - అప్పుడుగాని అతని మనస్సునకు శాంతిలేదట - అహా! ఎంతటి ధర్మ నిరతి దృఢసంకల్పము (భ్రాతృభక్తియును - భరతుని యావేశమునకు అవధులుండవు. కావుననే అతడు తల్లినైనను లెక్క చటుల ఉండె తూరంనానెచం టీలలో ల్. ఆత జ్యద్హలళ అం ఆఆ” ఆకు శ్లో; న త్వమశ్వపతేః కన్యా ధర్మరాజస్య ధీమతః | రాక్షసీ తత్ర జాతా౭సి కులప్రధ్వంసినీ పితుః 1
- _ రామమేవానుగచ్చామి స రాజా ద్విపదాం వరః । త్రయాణామపి లోకానాం రాఘవో రాజ్యమర్హతి | యది త్వార్యం న శక్ష్యామి వినివర్తయితుం వనాత్ వనే తతైవ వత్స్యామి యథార్యో లక్ష్మణస్తథా[। (వారా.౩/32/16 18) డా! కే. రాజన్నశాస్త్రి
లై మంజూష త్వత్మ లే మే పితా వృత్తో రామ శ్చారణ్య మాళశ్రితః | ఆయశో జీవలోకే మే త్వయాచ ్రతిపాదితం ॥ (వారా 2/74/9,6) ఇంతేగాక - షా త్వమగ్నిం ప్రవిశ వా స్వయం వా విశ దండకాన్ ॥ రజ్జుం బధాన వా కంఠేనహి తే. న్యత్ పరాయణమ్ శః (వారా. 2/74/33) ఇట్లు తల్లిని తూలనాడుటకు ప్రధానకారణము అతని ధర్మనిష్ట బ్రాతృభక్తియే. కావుననే భరతుని ఈ యావేశమును రాముడు తగదని వారించినాడు. శ్లోః బుజాన్నోచయ రాజానం మత్కృతే భరత! ప్రభుమ్ ॥ పితరం. త్రాహి ధర్మజ్ల! మాతరం చాభినందయ ॥ (వా.రా.2/107/10) కైకేయికిచ్చిన వరములు కొత్తవి కాననియు రాజ్యానుదానము కైకేయి వివాహ సందర్భముననే ప్రతిశ్రుతమైనదనియు - కావున మన తండ్రికి బుణమోచనము కలిగించ వలసిన బాధ్యత నాయందేకాక నీయందు నున్నదనియు తల్లిని యధాపూర్వముగా సంభావింపుమనియు శ్రీరాముడు భరతుని సమాశ్వాసించెను. శ్రీరామునికి భరతునియందుగల వాత్సల్యము ఇంతింత యనరాదు సైన్యసమేతముగా వచ్చుచున్న భరతుని శంకించి యుద్ధముచేయ సమకట్టిన లక్ష్మణునితో రాముడు పలికిన పలుకులలోనది ఎట్లు వ్యక్త మగుచున్నదో చూడుదు- శో) నహితే నిష్టురం వాచ్యో భరతో నా ప్రియంవదః అహం హ్యప్రియముక్తు స్యాం భరతస్యా ప్రియే కృతే ॥ (వా.రా. 2/97/15) దాః కే. రాజన్నశాస్త్రి
శ్రీ మద్రామాయణము - భరతుండు ౯ లక్ష్మణా! భరతుని తూలనాడకుము, అతనిని తూలనాడుట యనగా నీవు నన్ను తూలనాడినట్లే యగును - అని లక్ష్మణుని వారించెను రాముని వచనముచొప్పున పాదుకలు గ్రహించి మునివేషధారియై నందిగ్రామమున వసించి రామునిపేర రాజ్యమును నడిపెను - 14 సంవత్సరములు దాటినవెంటనే ఒక దినము ఆలసించినను అగ్ని ప్రవేశము చేయుదునని రాముని హెచ్చరించెను - కావుననే శ్రీరామునిచే - “న నర్వే భాతర స్వ్తాత! భవంతి భరతోవమాః॥। భరతుని బోలు భ్రాతలు దుర్లభులను ప్రశంసకు పాత్రుడాయెను.ో *సంస్కృతభాషా ప్రచార సమితి (హైద్రాబాద్) వారి సంస్కృత భారతీ (జనవరి 1985) ప్రత్యేక సంచికయందు ప్రకాశితము- దా కే. రాజన్నశాస్త్రి
వ్యాసమహాభారతము - కర్షుడు శ్లో స సమాజజనః సర్వో నిశ్చలః స్థిరలోచనః కో౭ యమిత్యాగతక్షోభః కౌాతూహలపరో౭_ భవత్ | (ఆదిపర్వం. అది కుమారుల అస్త్రవిద్యాకౌశల (ప్రదర్శన ఘట్టం. పార్టుని అస్త్రవిద్యా ప్రదర్శనానికి సామాజిక లోకం అబ్బురపడింది. ఒక క్షణం స్తబ్ధత ఏర్పడింది. ఒక అద్భుతవ్యక్తి రంగ ప్రవేశం చేశాడు. ఏవడీతడు అనే కౌతూహలంతో అందరి చూపులు అతని పైననే నిలిచిపోయాయి ఓ పార్టా! నీవు ప్రదర్శించిన అస్రవిద్యాకౌశలాన్ని నేనూ ప్రదర్శించగలను. ఇంత మాత్రానికి ఆశ్చర్యం దేనికి? అని అర్జునుని ఆక్షేపించి అర్జునునికి దీటుగా అస్త్రవిద్యా విశేషాలన్నింటిని తాను కూడ ప్రదర్శించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కర్టుడు. అర్జునునితో సాటివచ్చు అస్త్రవిద్యయేకాక అర్జునునికంటె విశేషం- ఆకారసౌభాగ్యం కూడ అతనిలో ఉంది శ్లో; సహజం కవచం బిభ్రత్ కుండలోద్దోతితాననః 1 ప్రాంశుః కనకతాళాభః సింహసింహననో యువా॥ లోకంలో మరెవ్వరికీ లేని సహజములగు కవచకుందలాలు, బంగారు మేనికాంతి, పాడగరితనము, అతడు ఏ దేవాంశసంభూతుడో కాని సామాన్యుడు కాడని తెలియజేస్తున్నాయి అందుకే సామాజికజనులందరి చూపులు అతని పైననే నిలిచి పోయినవి అతనిని చూడగనే దుర్యోధనుని కన్నులలో ప్రీతి అర్జునునిలో సిగ్గు, కోపము పొడసూపినవి - శ్లో ॥ ప్రీతిశ్చ మనుజవ్యాఘ్ర! దుర్యోధనముపావిశత్ | హీశ్చ క్రోధశ్చ భీభత్సుం క్షణేనాన్వావివేశ హ దాః కే. రాజన్నశాస్త్రి
దుర్యోధనునికి కలిగిన ప్రీతికి కారణం - కర్గునితో మైత్రీబంధం దృథీకరించి అతని సాయమున పాండవులను జయించవచ్చునను కోరిక, కావుననే ఆ సమయాన పార్టునితో ద్వంద్వయుద్ధం చేయాలి, అనే కర్ణుని కోరికను కులం పేరుతో నిరాకరింప జూచిన కృపాచార్యునికి సమాధానంగా వెంటనే కర్గున్ని అంగరాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు దుర్యోధనుడు. చూడండి - శ్లో॥। యద్యయం ఫల్లునో యుద్ధే నారాజ్ఞా యోద్ధు మిచ్చతి। తస్మా దేష్టోః.౦గ విషయే మయా రాజ్యేన. భిషిచ్యతే 1] (ఆదిపర్వం 135/36) కర్టుని అంగరాజ్యాభిషిక్తుణ్ణి చేసి రాజును చేస్తానన్న దుర్యోధనుని పలుకులవి. కర్టుని జన్మరహస్యం ఏమిటో తెలియకపోయినప్పటికి కర్ణుడు ఏదో ఒక మహోన్నత వంశంలో పుట్టినవాడే కాని సూతపుత్రుడు మాత్రం కాదని దుర్యోధనుని విశ్వాసం - ఈ విషయం కర్ణపర్వంలో శల్యుణ్ణి కర్ణసారధిగా ఒప్పించే ప్రయత్నంలో వ్యక్తమయింది చూడండి ఆ దుర్యోధనుని పలుకులు - శ్లో సర్వధా న హ్యయం శల్య ! కర్ణః సూతకులోద్భవః | కధమాదిత్యసదృశం మృగీ వ్యాఘం జనిష్యతి ॥ యథా హ్యస్య భుజౌ పీనౌ నాగరాజకరోపమౌ | వక్ష వశ్య విశాలం చ సర్వశ్రునిబర్హణమ్ ॥1 న త్వేష ప్రాకృతః కశ్చిత్ కర్ణో వైకర్తనో వృషః | మహాత్మా హ్యేష రాజేంద్ర! రామశిష్యః ప్రతాపవాన్ ॥ (కర్ణ -34/161,162) శల్వా! కర్టుడు సూతపుత్రుడుకాదు - లేడి వ్యాఘ్రాన్ని కనునా ! సూర్యుని బోలిన మేనికాంతి పుట్టుకతో వచ్చిన కవచకుండలాలు 'దీర్ణబూహువులు' 'విశాలవక్షము” ఇతడు సామాన్యమానవుడు కాడని చెప్పుచున్నవి. జెను - దుర్యోధనుని ఊహ నిజమే కుంతి సూర్యుని అనుగ్రహం వలన చిన్న తనాన కన్న కొడుకు కర్ణుడు డా॥ కే. రాజన్నశాస్త్రి
ఒకప్పుడు కుంతి దుర్వాస మహర్షి అనుగ్రహించిన దేవతాహ్వానమంత్రాన్ని పరీక్షింప నెంచింది ఉదయించుచున్న భానుబింబాన్ని దర్శించింది. కేవలం ఆ బింబాన్నే కాదు ఆ సూర్య బింబం మధ్యలో కవచకుండల శోభితుదైయున్న ఆ సూర్యుని దివ్య రూపాన్ని కాంచింది. మనసు పడింది. మంత్ర ప్రభావ పరీక్షకై ఆహ్వానించింది మంత్ర ప్రభావంచే సాక్షాత్కరించిన ఆ సూర్య భగవానుడు అట్టి కవచ కుండల శోభితుడైన కుమారుణ్ణే అనుగ్రహిస్తానని ప్రలోభపెట్టాడదు. తన దర్శనం విఫలం కాకూడడన్నాడు. ఆమె అంగీకరించింది. అట్టి కుమారునె కన్నది. కాని లోకానికి భయపడి ఆ శిశువును మంజూషలో భద్రపవచ అ మంజూషను ( పెట్టెను ) వదలలేక వదలలేక నదిలో వదలివేసింది. ఈ విషయం అదిపర్వంలో సంక్షేపంగా, వనపర్వంలో విస్తృతంగా ఉంది వనపర్వంలోని ఈ శ్లోకాలను చూడండి శ్లో | తస్యా దృష్టిరభూత్ దివ్యా సాఒపశ్యత్ దివ్యదర్శనమ్ | ఆముక్తకవచం దేవం కుండలాభ్యాం విభూషితమ్ ॥ ప్రాణానుపస్పృశ్య తదా పహ్యాజుహావ దివాకరమ్ ! అజగామ తతో రాజన్! త్వరమాణో దివాకరః! (వనపర్వం 306/6,8) మరియు - శ్లో తదైవాబద్ధకవచం కనకోజ్వలకుండలమ్ | హర్యక్షం వృషభస్మంధం యథా స పితరం తధా॥! జాతమాత్రం చ తం గర్భం ధాత్రా నమ్మన్య్య భామినీ | మంజూషాయాం సమాధాయ అశు నద్యామవాసృజత్॥ (వన-308/5-7) అతిరధుడనే సూతుడు, అతని భార్య రాధ.మరీజూషలో దొరికిన ఆ శిశువును పెంచి పెద్దచేశారు, ఆ శిశువునకు వసుషేణుడని నామకరణం చేశారు శ్డో। వసువర్మధరం దృష్ట్వా తం బాలం హేమకుండలమ్ ! నామాస్య వసుషేశేతి తతశ్చక్రుర్విజాతయః ( వన - 309/13) దా॥ కే. రాజన్నశాస్త్రి
వ్యాసమహాభారతము - కర్టుడు లాలా కారణం ? బంగారుకవచాన్ని కలిగి యుండుటచే పెద్దలసలహా్రకారం ఆ పేరు పెట్టారు. రాధేయుడు అనే పేరు పెంపుడు తల్లి సంబంధంచే ఏర్పడింది మరోమూదు పేర్లు వైకర్తనుడు, వృషుడు, కర్టుడు, అనేవి - ఇది లోకోత్తర కర్మలచే నేర్పడిన బిరుదనామములు -భిక్షార్ధియై బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఇంద్రునకు కవచ కుండలాలను కోసి ఇచ్చుటచే వైకర్తనుడనే పేరు వచ్చింది. చూడండి - ద్రోణపర్వంలోని ఈ శ్లోకం - శ్లో; ఉత్కృత్య కవచం యస్మాత్ కుండలే విమలే చలే | ప్రాదాత్ శక్రాయ కర్టో వై తేన వైకర్తనః స్మృతః ॥ (ద్రోణ 180/19) ఇక కుండలాలను కర్ట్ణాలనుండి తెంచి ఇచ్చుటచే కర్ణుడనే పేరు వచ్చినట్లు వనపర్వంలోతెలుపబడింది. శ్లో ॥ తదోత్కృత్య ప్రదదే కుండలే తే | కర్ణాత్ తస్మాత్ కర్మణా తేన కర్ణః (వన -310/38) సహజకవచకుండలాలు గల కర్ణుణ్ణి జయించుట ఎవరికి కూడ సాధ్యం కాదు ఎట్లా జయించుటయని ధర్మరాజు పరితపించేవాడు' కావుననే పాండవ హిత్రైషియై ఇంద్రుడు బ్రాహ్మణరూపంలో వచ్చి కవచకుండలాలను ఆర్టించి గ్రహించాడు. ఈ విషయాన్ని పసికట్టియే సూర్యుడు పుత్రహితైషిలై స్వష్నాన సాక్షాత్కరించి విషయం చెప్పి ప్రాణాంతకమైన ఈ దానం చేయవద్దని హెచ్చరించాడు * అయినను కర్గుడు మానలేదు. ప్రాణంకంటె కీర్తియే ముఖ్బం అన్నాడు, నా వ్రతాన్ని చెదగొట్టవద్దని సూర్చుణ్జి వేడుకున్నాడు. చూడంది. శ్లోః న నివార్యో వ్రతాదస్మాదహం యద్యస్మి తే ప్రియః ॥ మద్విధస్యాయశస్యం హి న యుక్తం ప్రాణరక్షణమ్ | యుక్తం హి యశసా యుక్తం మరణం లోకసమ్మతమ్ ॥ (వన 300/24-28) ప్రాణ రక్షణకంటె నాబోటి వానికి మరణమే మేలన్నాడు కర్టుడు ఇంతటి సత్మర్మ నిష్టుడు కాబట్టి వృషడు (ధర్మస్వరూపుడు) అనే కీర్తి గడించాడు. ఈ విషయం దద్రోణపర్వంలో 1 వనపర్వం 309 /22 2 వనపర్వం 300/ 18,19 దాః కే. రాజన్నశాస్త్రి
778 మంజూష ఇట్లా వివరించబడింది శ్లో: బ్రహ్మణ్యః సత్యవాదీ చ తపస్వీ నియతవ్రతః రిపుష్వపి దయావాంశ్చ తస్మాత్ కర్ణో వృషః స్మృతః।। (దోణ - 180/24 బ్రాహ్మణభక్తి సత్యవాక్యసంపన్నత, ప్రతనిషస్ట తపోదీక్ష శత్రువులయందైనను దయచూపే స్వభావం, ఇన్నిగుణాలు కలవాడు కావుననే కర్ణునికి వృషుడనే పేరువచ్చిది. తనదంటూ ఏది లేక సర్వం దుర్యోధనునికయియే త్యాగం చేసిన విశ్వాస పాత్రుడు కర్చుడు - కర్టుని ఈ పలుకులాలకించండి - శ్లో 1 వసు చైవ శరీరంచ పుత్రదారం తధాయశః సర్వం దుర్యోధనస్యాద్ధే త్యక్తం మే భూరిదక్షిణ ! | (భీష్మపర్వం) దుర్యోధనునికి తనపై ఎంతో జయాశ ఉన్నప్పటికి తాను మాత్రం ధర్మానికే జయం కలగాలి అనే సద్బుద్ధిగలవాడు కర్ణుడు - కృష్ణుని ప్రలోభానికి లొంగకపోగా ధర్మరాజునకు తన జన్మ రహస్యం చెప్పవద్దని ప్రాధేయపడుతూ పల్మిన ఈ పలుకులు చూడండి - శ్లో ॥ యది జానాతి మాం రాజా ధర్మాత్మా సంయతేంద్రియః | కుంత్యాం ప్రధమజం పుత్రంసన రాజ్యం కరిష్యతి । న ఏవ రాజా ధర్మాత్మా శాశ్వతో౭ స్తు యుధిష్టిరః 1 (ఉద్యోగ - 141/21,23) తాను కుంతీ ప్రధమ పుత్రుడనని తెలిస్తే ధర్మరాజు రాజ్యంచేయడు - నిజానికి ధర్మాత్ముడు యుధిష్టిరుడే రాజు కాదగినవాడు - ఇది కర్ణుని సదాశయం- అదే సిద్ధించింది దుర్యోధనునికై పోరాడి ప్రాణత్యాగం చేసి విశ్వాసపాత్రుడనిపించుకున్నాడు కర్టుడు ధర్మరాజునకు విజయం చేకూర్చి వృషుడనే పేరు సార్ధకం చేసుకున్నాడు - కర్ణునివంటి విశ్వాసపాత్రత, త్యాగబుద్ధి, ఉదారస్వభావం సద్బుద్ధి ఉన్న వ్యక్తి లోకంలో అరుదు. ఆకాశవాణి హైద్రాబాద్కేంద్రం నుండి 'అమరభారతి ధ్వని సంచికా కార్యక్రమంలో 'ప్రసారితమైన ఈ ప్రసంగవ్యాసం ఆరాధన (ఏప్రిల్ 1993) మాసికసంచికయదు ముద్రితము. జాలక చు గ్ర గ్రషయనారానాలాలా దాః కే. రాజన్నశాస్రి
ఆంధ్రమహాభారతం - తిక్కన అనుసృజనకాశలం సీ ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని న యధ్యాత్మవిదుల వేదాంతమనియు నీతివిచక్షణుల్ నీతిశాస్త్రంబని కవివృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్యసం[గ్రహమని ం యమైతిహాసికు లితిమాసమనియుం బరమపొరాణికుల్ బహుపురాణసముచ్చ యంబని మహిం గొనియాడుచుండ ఆ.వివిధవేదజత్త్వవేది వేదవ్వ్యాసుం డొదిముని పరశరాత్మజుందు విష్ణుసన్నిభుందు విశ్వజనీనమై పరగుచుండం జేసె భారతంబు. (ఆది -1/38) సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యం రామాయణమయితే మన తెలుగు సాహిత్యంలో మొదటి కావ్యం మహాభారతం - రామాయణం వేదార్థోబ్బంహణం కాగా మహాభారతం పంచమవేదంగానే కీర్తింపబడింది. లోకాన్ని సత్చథంలో నడిపేది ధర్మం. ఆ ధర్మం మనకు వేదం ద్వారానే తెలిసింది. వేదార్థాన్ని భావించిన బుషులద్వారా వివరింపబడింది. ధర్మబద్ధ సాంఘిక జీవనమే, వ్యక్తికి, సంఘానికి, లోకానికి శ్రేయం కలుగజేస్తుంది. పారలౌకిక గ్రేయాన్ని కూడ కలుగజేస్తుంది. వ్యాసుని మహాభారత రచనోగ్ధెశాన్ని తిక్కన ఈ విధంగా శ్చాఘించాడు. డా! కే. రాజన్నశాస్రి
న్ మంజూష శా॥। విద్వత్సంస్తవనీయ భవ్య కవితావేశుందడు విజ్ఞాన సం పద్విఖ్యాతుడు సంయమిప్రకరసంభావ్యానుభావుండు కృ ష్ణద్వైపాయను డర్ధి లోకహితనిష్టం బూని కావించె ధ ర్మాద్వైతస్థితి భారతాఖ్యమగు లేఖ్యంబైన యామ్నాయమున్. (విరాట 1/3) వేదార్థాన్ని ప్రపంచించిన మహాభారతం లక్షశ్లోకాత్మకమైన బృహద్ధంధం, అంతటి బృహద్గంథం రచించాలంటే ఎంతో కవితావేశం ఉండాలి. వేద విజ్ఞానాన్ని ప్రపంచించటం అంటే లౌకిక, అలౌకికి విషయాల నెన్నింటినో వివరించాలి. కావున దానికి పరిమితమైన జ్ఞానం చాలదు విజ్ఞాన సంపద విశిష్టంగా ఉండాలి. అట్టి గుణాలు గలిగిన మహానుభావుడు కృష్ణద్వైపాయనుడు అతడు లోక హితార్దమై నిష్టబూని ఈ మహాభారతమనే లేఖ్యమైన (లిఖించదగిన) అమ్నాయాన్ని అనగా ఈ పంచమ వేదాన్ని రచించాడు. ( ఆనాలుగు వేదాలు శ్రుతులు అనగా గురుముఖతః వినియే అధ్యయనం చేయదగినవి) ధర్మాద్వైత స్థితి కలగదానికి అనగా అద్వైతభావనను స్థిరీకరించడానికి రచించాడు. అద్వైత ధర్మంలోనే సర్వదేవ సమత్వ భావన ఉంది. దానిచేతనే లోకహితం చేకూరుతుంది. అద్వైత సంప్రదాయంలోని పూజా విధానంలో ఈనాటికి కూడా శాలిగ్రామాన్ని శివపంచాయతనాన్ని కలిపి పూజించడం అనుభవసిద్ధంగా ఉంది. సంధ్యావందనంలో ప్రతిదినం జపించే ఈ శ్లోక రూప మంత్రాలలో శివకేశవుల అభేదం సర్వదేవసమభావం ఎంత స్పష్టంగా ఉందో చూడండి శ్లో। శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే ॥ శివస్య హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయం శివః | యథా శివమయో విష్ణురేవం విష్ణమయః శివః | యథాలి.౦తరంన పశ్యామి తధా మే స్వస్తి రాయుషే ॥ ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం | సర్వదేవనమస్మారః కేశవం ప్రతి గచ్చతి | (తైత్తరీయ సంధ్యావందనం ) దాః కే. రాజన్నశాప్రి
ఆంధ్రమహాభారతం - తిక్కన అనుసృజనకౌశలం 91
విష్ణురూపుడైన శివునకు, శివరూపుడైన విష్ణువునకును నమస్కారము. శివనియొక్క హృదయమే విష్ణువు. విష్ణువుయొక్క హృదయమే శివుడు. శివస్వరూపుడే విష్ణువు విష్ణు స్వరూపుడే శివుడు- నేను వీరిద్దరిలో భేదం చూడడం లేదు కావున నా ఆయుష్యమునకు క్షేమం కలుగుగాక. ఆకాశం నుండి పడిన నీరు సాగరం చేరుకున్నట్లు దేవతలందరికీ చేసే నమస్కారం ఆ భగవంతునికే చెందుతుంది.
శివ కేశవాభేదాన్ని వ్యాసభగవానుడు ప్రకృత భారత కధాంతర్భాగంగా సూచించాడు.
అభిమన్యు వధలో ముఖ్యప్రాత్రగా బాసించిన సైంధవుణ్జి వదిస్తానని ప్రతిజ్ఞ చేశాడు పార్థుడు. ఆ రాత్రి తాను కృష్ణునితో కలసి కైలాసంలో శివదర్శనం చేసుకున్నట్లు స్వప్నంలో చూశాడు అదే రోజు సాయంకాలం వాసుదేవునకు ఏగంధమాల్యాదులను సమర్పించాడో ఆ గంధమాల్యాద్యుపహారములే శివునిపై దర్శనమిచ్చాయి. దీనిచే కేశవుదే శివుడని, శివకేశవులకు భేదం లేదని వ్యక్తీకరించినట్లు స్పష్టం - ఆ శ్లోకం ఇది - మహాభారతం(సం) ద్రోణపర్వంలోనిది.
శ్లో ॥ తం చోపహారం సుకృతం నైశం నైత్యిక మాత్మనా |
దదర్శ (త్య్రంబకాభ్యాశే వాసుదేవనివేదితం ॥ ( ద్రోణ -81/2) తిక్కన చేసిన శ్లోకానువాదం చూడండి --
వ .... తాను మున్ను ముకుందునందు సమర్పించిన నిశాసమయ పూజామయ (దవ్యంబులను మాల్యాదులను లేవనంబులనద్దేవుని దెవ్యదేహంబునంగాంచి యమ్మురహరపురహరుల యేకత్వంబు మనంబునంగొనియాడి .. (ద్రోణ ద్వితీ -368)
మహాభారతం లోకహితార్ధం వెలసిన పంచమవేదం. కావున నన్నయ ప్రారంభించాడు దానిని తెలుగులో రచించడానికి, కాని అది రెండున్నర పర్వాల రచనతో ఆగిపోయింది చాల కాలం గడిచింది. ఇప్పుడు ఆ మహాభారతాన్ని తెలుగులో రచించి పూర్తిచేయాలని సంకల్పించాడు తిక్కన. అతనికి సంస్కృత మహాభారతం కరతలామలకం వాద ్రతివాదాలు చేసి మత సామరస్యాన్ని చాటి చెప్పిన మహనీయుడు. తిక్కన తాను మహాభారతం రచించాలంటే ఏ గుణాలు వ్యాసునిలో ఉన్నాయని చెప్పాడో తాను, అట్టి గుణాలు, అనగా విద్వత్సంస్తవనీయభవ్యకవితావేశం, విజ్ఞానసంపద్విఖ్యాతి, సంయమిప్రకర
దా! కే. రాజన్నశాస్త్రి
రై మంజూష సంభావ్యానుభావం, ఈ మూడు గుణాలు తనలో కూడ ఉందనే ఉన్నవి. అతని సంకల్పానికి తోడుగా స్వప్నంలో సాక్షాత్మరించి హరిహరనాధుడు తిక్కనతో-
ఉ॥ వైదికమార్గనిష్టమగు వర్తనముం దగ నిర్వహించుచున్ భేదములేని భక్తి మతి నిర్మల వృత్తిగ జేయుచుండు మ త్పాదనిరంతర స్మరణ తత్చరభావముకల్మి నాత్మ స మ్మోదము బొందంగావ్యరసముంగొనియాడుచునుందు దెప్పుడున్!
వ. అందును -
కః పారశర్యుని కృతియయి
భారతమను పేరంబరంగు పంచమవేదం బారాధ్యము జనులకు ద దౌరవమూహించి నీ వఖండితభక్తిన్. తే॥ తెలుంగుబాస వినిర్మింపందివురు టరయ భవ్యపురుషార్ధ తరుపక్వఫలము గాదె దీనికెద నియ్యకొని వేడద్మనూని కృతి ప తిత్వమర్ధించి వచ్చితి తిక్కశర్మ !. (విరా -1/15 -18) తిక్కనకు గల వైదికమార్గనిష్టకు, భేదములేని భక్తికి, భగవత్పాద నిరంతరస్మరణ తత్పరభావానికి ముగ్ధుడై ఆ హరిహరనాధుడే స్వయంగా వచ్చి తెలుగు మహాభారతం కృతి ఇమ్మన్నాడు తిక్కన తన భాగ్యంగా భావించాడు తన కృతిపతి నానతిచ్చిన తీరులో కావ్యరసాన్ని కొనియాడుతూ, తాను సంతోషించే విధంగా రచించుమన్నాడు. అందుకే తిక్కన మహాకవిత్వ దీక్షావిధినొంది రచిస్తానన్నాడు, మరియు వ్యాస భగవానుని కృతి మహాభారతం పంచమవేదంగా జనులందరికీ ఆరాధ్యం గావున, ఆ భారతానికున్న గౌరవం దృష్టిలో పెట్టుకొని భక్తితో రచించుమన్నాడు. కావుననే “సాత్యవతేయ సంస్కృతి శ్రీవిభవాస్పదంబయిన చిత్తముతోడ, _రచిస్తానని చెప్పాడు. మరియు వ్యాస భారతం జనులకు ఆరాధ్యమైన విధంగా తన తెలుగు భారతం కూడ తెలుగు ప్రజలకు మోదం కూర్చి, అరాద్యమయ్యేటట్లు అమృతప్రాయంగా రచిస్తానని ఈ పద్యంలో ప్రతిజ్ఞ చేశాడు దాః కే. రాజన్నశాస్త్రి
ఆంధ్రమహాభారతం - తిక్కన అనుసృృజనకొశలం త్రి తక్కిన, ఇదిగో ఆ పద్యం చూడండి -
ఉ।। కావున భారతామృతము గర్దంపుటంబుల నారగ్రోలి యాం
ధ్రావళలిమోదముంబొరయునట్లుగ సాత్యవతేయ సంస్మృతి శ్రీ విభవాస్పదంబయిన చిత్తముతోడ మహాికవిత్వదీ క్షావిధి నొంది పద్యముల గద్యములన్ రచియించెదన్ కృతుల్ ॥
ఈ పద్యంలో చేసిన ప్రతిజ్ఞ వలన తిక్కన భారతానుసృజన(అనువాద) కౌశలం అనగా సంస్కృత భారతాన్ని ఆంధ్రీకరించటంలో ప్రదర్శించే కౌశలం కైచేసే యత్నం అని స్పష్టపడుతుంది ఆ అంశాలు ఇవి -
- తెలుగువారు ఈ భారత కధామృతాన్ని ఆస్వాదించి, ఆనందించడానికి కావలసిన నుడికారపు సొంపులు గుప్పించటం.
2 చిత్తంలో వ్యాస భగవానుని స్మరించడం అనగా, ఆయా సన్నివేశాల్ని బావాన్ని పెంచినా, కుదించినా త్యజించినా మూల విరోధం లేక బెచిత్యావహమై ఉండి భారత గౌరవాన్ని కాపాడటం.
- మహా కవిత్వ దీక్ష బూనటం అనగా కావ్యమార్గాన్ని అనుసరించి వర్ణనల పెంపు అలంకారాల ఇంపు సంభాషణల సొంపు రసోచిత పదగుంఫనలనేర్పు ద్వారా ప్రదర్శించి మహాకావ్యంగా తీర్చిదిద్దటం.
ఈ మూడు లక్షణాలే భారతానుసజనంలో కౌశలాన్ని సమకూర్చాయి.
సంస్కృత మహాభారతం లక్ష శ్లోకాత్మకమైనది - 18 పర్వములు - వీనిలో 15 పర్వములు తిక్కన తెనిగించినవి ఈ పదునైదు పర్వముల శోక సంఖ్య మొత్తము 72, 741 - దీనిని 20,000 పద్యములలో తిక్కన తెనుగు చేశాడు. తెలుగు నుడికారంలో స్వంతంత్ర కావ్యమా? అనేటట్లు దీనిని తీర్చిదిద్దాడు.
ఒక భాషనుండి మరో భాషలోనికి మార్చుట అంటే చాలా కష్టమైన పని. భాషాంతరీకరణంలో ఎన్నో క్లేశాలుంటాయి. రెండు భాషలలో నిష్ణాతుడు కాకున్నచో ఆభాషలలోని మెళకువలు తెలియవు లేకుంటే భాషాంతరానుస్యజనం పేలవమైపోతుంది. ఒకప్పుడు విరుద్దార్ధ స్ఫూర్తిని కూడ కలుగ జేస్తుంది. మూల[గ్రంధం దీర్హంగా ఉన్నప్పుడు
దా! కే. రాజన్నశాస్త్రి
ర్ మంజూష దాన్నంతా ఆకళించుకొని ముఖ్యాంశాలను త్యజించకుండా అనుసరించాలి, మూలంలోని పదాల్లో అర్ధం అస్పష్టంగా. లేదా క్లిష్టంగా ఉన్నప్పుడు దానిని వివరించాలి. పునరుక్తులను పరిహరించాలి. ఆ భాషలోని నుడికారం అర్ధం చేసుకొని ఈ భాషకు తగినట్లు నుడికారపు సొంపు నింపుతూ అనుసృజనం చేసినప్పుడే కౌశలం ఏర్చడుతుంది. ఇట్టి లక్షణాలన్నీ తిక్కన భారతంలో దర్శనమిస్తాయి దానికి కారణం తిక్కన “ ఉభయ కావ్య ప్రొధింబాటించు శిల్పమున పారగుండు” కావటమే. కావుననే దశకుమారచరిత్రకారునిచే తిక్కన - “లలిత నానాకావ్యములు చెప్పు నుభయభాషలయందు ననుట ప్రశంస త్రోవ” అని కీర్తింప బడ్డాడు. ఉభయకవిమిత్ర బిరుదాంచితుడై లోకంలో వెలుగొందాడు. మహాభారత బృహద్ధంధాన్ని మూడింట రెండు వంతులకు పైగా స్వతంత్ర కావ్యమా అనేటట్లు రచించి, ఆంధ్రావళికి మోదం కలిగించాడు. మహాభారత గౌరవం అఖందిత భక్తితో భావించాడు తన రచన ఒక మహాకావ్యం అయ్యే విధంగా దీక్షబూని రచించాడు. ఉత్తర గోగ్రహణంలోని ఈ సన్నివేశం పరికించండి - సంస్కృత భారతం - ద్రోణుడు భీష్మునితో పలికిన పలుకులు - శ్లోఃవష వీరో మహేష్వాసః సర్వశస్త్రభృతాం వరః । ఆగతః క్లీబవేషేణ పార్టో నాస్యత్ర సంశయః ॥ నదీజ 1! లంకేశవనారికేతు: నగాహ్వయో నామ నగారిసూనుః | ఏషో౭_.౦గనారూపధరః కిరీటి జిత్వాఇవయం నేష్యతి చాద్య గా వః ॥ స ఏష పార్టో విక్రాంతః సవ్యసాచీ పరంతపః । నాయుద్ధేన నివర్తేత సద్వైరపి సురాసురై క్లేశితశ్చ వనే శూరో వాసవేనాపి. శిక్షితః 1 అమర్షవశ మాపన్నో వాసవప్రతిమో యుధి ॥ నేహాస్య ప్రతియోద్ద్ధార మహం పశ్యామి కౌరవ! । మవాదేవో£పి పార్థేన (శ్రూయతే యుధి తోషితః ॥ కిరాతవేషప్రచ్చన్నో గిరా హిమవతి ప్రభుః ॥ (విరాట 39/9-13 శ్లో) దాః కే. రాజన్నశాస్త్రి
ఆంధ్రమహాభారతం - తిక్కన అనుసృజనకౌశలం తక
ఈ ఘట్టానికి తాత్చర్యం తెలుసుకొని తిక్కన దీనిని భావించి తెలుగుసేసిన తీరెట్లా ఉందో సమీక్షిద్దాం -
“ఈ క్షీబ వేషములో వచ్చుచున్నది ఎవరనగా, సకల శస్త్రధారులలో డ్రేష్టుడు, మహా ధనుర్ధారియైన వీరుడు పార్ట్థుడనుటలో సందియము లేదు. ఓ గంగాసుతా. భీష్టా! లంకేశుని అశోకవనమును దహించి వైర భావమును కొనితెచ్చుకొన్న ఆంజనేయుని ద్వజముగా మలుచుకొని, ఒక చెట్టు (అర్జున వృక్షము) పేర ప్రసిద్ధదెయున్న ఇంద్ర కుమారుడగు కిరీటియే, ఇప్పుడు అంగనావేషధరుడై వచ్చుచున్నవాడు. కావున మన గోధనమును. రారాజును కూడ జయించి అపహరించుకొని పోగలడు సవ్యసాచియు, శత్రుతాపనుడు, పరాక్రమశీలుడు అగు ఈ పార్టుడు దేవదానవులు వచ్చినను యుద్ధము చేయక విడుచువాడు కాడు వనవాస క్షేశముననుఖవించి చాలా క్రోధముతోనున్నాడు. యుద్ధమును ఇంద్రుడంతటివాడు, ఇంద్రునిచే శీక్షసలుపబడినవాడు, ఇతని నెదుర్కొను ప్రతివీరుడు నాకు కాననగుట లేదు. పూర్వ మీపార్టుడు హిమవత్పర్వతమున కిరాతవేషమున వచ్చిన మహాదేవుని యుద్ధమున సంతసింపజేసినాడని విన్నాము.” - ఇది అశ్లోతాత్పర్యం.
దీనిని తిక్కన భావించి యనువదించిన తీరు అద్భుతముగా నున్నది. తెలుగుదనముట్టిపడుచున్నది. - చూడండి (అంధ్ర భా.వి శ/90 నుండి)
వ. అని చెప్పి తానప్పుడర్జునునెజింగినవాండు గావున నతనికి నజ్ఞాతవాస సమయభంగం బగునో యను భయంబున సుదనదీసూనువదనంబు వీక్షించి సన్నవాణి నిట్లనియె.
చ వెరవరి గాక వీందు కురువీరులకుం బొడసూపు వాందె య చ్చెరువాక (మ్రానిపేరనిట సేరగవచ్చుచునున్నవాండహం కరణమ కాని యొండదొకటి గానడు మూర్తివిశేషమారయన్ సురపతియట్ల వీని మది చొప్పది యెట్లా యెజుంగ నయ్యెడున్ !.
క అనిన విని యెళజింగికొని యా తని మది సంశయము మాన్పందలంచి నరేంద్రుం గనుంగొనుచు నతనిళో జె ప్పిన భంగి నిగూఢవృత్తి భీష్ముండు పలికెన్ 1.
డా॥ కే. రాజన్నశాస్త్రి
86 మంజూష
క. తలపంగ రిపులకు నిమ్మగు
కొలది గడచి వచ్చితిమి - యకుంఠిత బాహు బలము నెజంప దరి యయ్యెను జలింప వలదింక మనకు శత్రులవలన్.
వ. అనవుడు నాచార్యుందయ్యస్థంబు గనికొని సమయభంగంబువలని సంకటంబు లేకునికి మనంబునం బ్రియంబంది మొగంబునందోంపనీక పుయిలోట దక్కి యిట్లనియె” (విరాటశ/91-94)
ఈ సన్నివేశం సంస్కృత భారతంలో లేదు - తిక్కన భారతంలో ద్రోణుడు దుశ్శకునాలను చూచి, సైన్యాలను సమాయత్తపరిచాడు. క్షీబ రూపంలో ( అంగనావేషంలో) వచ్చేవాడు పార్టుడని గుర్తించాడు భీష్మునితో చెప్పి - బాహాటంగా అర్జునుని ప్రశంసించాడు. తిక్కన రాజనీజ్ఞుడు కదా ? సమయంభంగం వాటిల్లుతుంది అనే శంక పొడమలేదా (దోణునికి? సమయంభంగశంకా పరిహారం అపేక్షణీయమే - అది రహస్యంగా తెలియవలసిన విషయం - కావుననే భీష్ముని జూచి ద్రోణుడు ఆ వచ్చే ఎదుటి వ్యక్తిని గూర్చి మాట్లాడినట్లే మాట్లాడుతూ తన సంశయాన్ని రహస్యంగా సూచించటం జరిగింది. ఎట్లాగంటే, * ఆ వచ్చే వ్యక్తిలో ఆకార సౌభాగ్యం మాత్రమే ఉంది కాని, బుద్ధి వైభవం లేదు. ఉపాయశీలుడెవడైనా అంతటి ప్రసిద్ధి గల కురువీరులతో పోరుకై వస్తాడా ? అహంకారమే తప్ప మరేమీ ఇతనికి తెలియదు. చెట్టువలె పొడవైన ఆకారమే తప్ప, బుద్దిలో దీర్దదర్శిత్వం లేదు. ఇది ద్రోణుని మాటలలో పైకి తెలిసే అర్థం. ఇక భీష్మునికి సూచించిన ఆర్థం - మ్రానిపేర వచ్చుచున్నాడని, ఆకారం ఇంద్రుని వంటిదని చెప్పడంచేత ఇతడు అర్జునుదని సూచించాడు. సమయభంగ భయం లేక ఈ సమయాన కురువీరులకు కనపడటం యుక్తమా ? అని తన సంశయాన్ని “వెరవరి గాక” అనే మాటలో భీష్మునికి సూచించాడు. దీనికి సమాధానంగా భీష్ముడు దుర్యోధనుని చూచి చెప్పుతున్నట్లు పలకుతూ, ద్రోణునికి అజ్ఞాతవాస సమయం పూర్తి అయినట్లు సూచించాడు. దుర్యోధనునితో చెప్పిన మాటల అర్ధం పైకి ఇట్లా తోస్తుంది - “ శత్రువులకు అనుకూలమైన పరిధిని దాటి వచ్చాం - ఇక మనం అకుంఠిత బాహుబలాన్ని చూపవలసిన సమయం ఆసన్నమయింది. శత్రువులకు భయపడవలసిన పని మనకు ఇక లేదు” దీనివలన దుర్యోధనునక్తు. అర్థమయింది ఏమంటే - “శత్రువులకు అనుకూల పరిస్థితి లేదు కావున శత్రువులకు
దా! కే. రాజన్నశాస్త్రి
ఆంధ్రమహాభారతం - తిక్కన అనుసృజనకౌశలం 97 భయపడవలసిన పని మనకు లేదు. బలపరాక్రమాలు చూపించి శత్రువులను సులభంగా జయించవచ్చు” - అనేది భీష్ముని మాటల సారాంశంగా దుర్యోధనుడు గ్రహించాడు. ఇక ద్రోణుడు ఈ మాటల సారాన్ని తన సంశయానికి సమాధానంగా ఇట్లా గ్రహించాడు. “శత్రువులైన దుర్యోధనాదులకు సుఖకరమైన కొలదిని - అనగా అజ్ఞాతవాస కాల పరిమితిని దాటివచ్చాము.” మిగిలిన అర్ధం ఉభయత్ర సమానం. దీనిని వస్తుధ్వని అంటారు. ఇది అర్ధ శక్తి మూలము - చెప్ప వలసిన వారికి చెప్పక ఆ విషయం మరొకరితో చెప్పి సూచించడమే ఇక్కడ ఉన్న విశేషం, ఈ శేషార్ధమున్నట్లు కవి 'నిగూఢ వృత్తి అనే మాటతో సూచించాడు. '“వెరవరి గాకి అనే పద్యంలో రెండంశాలు మాత్రం మూలంనుంచి (గ్రహించాడు. మూలంలోని 'నగాహ్వయం' అనుపదానికి “మ్రానిపేర నిట” అనునది తెలుగు సేత - మరియు * వానవప్రతిమో ” అను పదాన్ని “మూర్తి విశేషమారయన్ సురపతి యట్లు” అని తెనిగించాదు. ఈరెండు పదాలు తెలుగు మాటల కూర్పులో అర్జాంతర స్ఫూరికి చాలా ఉపయోగపడ్డాయి. ద్రోణుని సంశయం బాగుంది - పైకి మాత్రం ఆ భావం కనపదనీయక ఇట్లా అన్నాడు శాఃః సింగంబాకటితో గుహాంతరమునం జేట్పాటుమైనుండి మా తంగ స్పూర్జిత యూధ దర్శన సముద్యత్మోధమై వచ్చునో జంగాంతార నివాస ఖిన్నమతి నస్మత్సేనపై వీందె వ చ్చెం గుంతీసుతమధ్యముండు సమర స్టేమాభిరామాకృతిన్, (విరా. శృ/5) సంస్కృతమూలంలొ “ క్షేశితశ్చ వనే” అని “అమర్నవశమాపన్నః” అని మాత్రం ఉంది ఆ రెండు పదాల అర్ధం భావించి వివరించన తీరు ఈ పద్యంగా రూపుదిద్దుకుంది. ఆకలి గొన్న సింహం గజయూధాన్ని చూచి వేటకై బయలుదేరిందంటే అది చంపక విడుస్తుందా? అ సింహంతో కుంతీసుత మధ్యముణ్జి పోల్చి చెప్పడం ఉపమాలంకారం దీనిచే “తప్పక కురువీరులను జయించ గలడు పార్టాడ నే వస్తువు వ్యంగ్యం - ఇది అలంకారంచే కలిగిన వస్తు ధ్వని ఈ కల్చన అంతా తిక్కన భావనాబలవిలసితమే కదా ? దా! కే. రాజన్నశాస్త్రి
సంస్కృత భారత శ్లోక భావాన్ని తెలుగు తియ్యదనంతో నింపి రచించిన ఈ
పద్యం చూడండి -
ఉ॥ ఈతనితోడి కయ్యమునకియ్యకొనం దగువార లస్మదీ
యాతత సేనలో గులుగుటారయ సంశయమెల్లభంగి గో వ్రాత నివర్తనంబు నుకరంబ కిరిటి కితండు రుద్రునిం భ్రీతునింజేసెనా వినమె పెంపెసలారెడు బాహుసంపదన్. (విరా. 4/96) “నేహాస్య ప్రతియోద్ధారం” (39/12) అనే సార్ట శ్లోకానికి తెలుగుసేత. “ గోవ్రాత నివర్తనంబు సుకరంబ కిరీటిక అనునది మాత్రం “జిత్వా వయం నేష్యతి చాద్య గావళో అనే 10వ శ్లోకంలోని భావం. ఇలా ఆ యా సన్నివేశాలను తిక్కన మనస్సులో భావించి మెరుగులు దిద్ది రచించడం చేతనే తిక్కన కవితావేశం విద్వంత్సంస్తసీయమై భాసించింది. ఇది సన్నివేశ భావన.
ఇక అలంకారిక భావనలో కనపరచిన నేర్పు - బీష్మ కధను విని ధృతరాష్ట్రుడు
సంజయునితో పలికిన ఈ పలుకులలో భీష్ముని మేఘంగా, శిఖండిని కృత్రిమ వాయువుగా చిత్రీకరించిన తీరు మూలానికి మెరుగులు దిద్దుతోంది, చూండడి.
ఉ ॥ అంచిత తాళకేతుకిరణాళి మెలుంగులు గాంగ మౌర్వి మో యించుట గర్హ చందముగ నేచి విరోధి దవానలంబు మా యించు శితాస్త్రవర్షమున నిట్టిది భీష్ణ- మహాభ్ర మె టడం గించెనొకో శిఖండీ యను కృత్రిమవాయువు దాంకి దైవమా,
(భీష్మపర్వం -) భీష్ముడొక మహామేఘం - తాళ ధ్వజ కరములు మెరుపులు మౌర్వీధ్వని యే గర్జవం - వైరివీరులు అనే దావాగ్నిని తీక్షములైన అస్తాలనే వర్షంతో అడ్డగించటమే ఆ మేఘ స్వభావం - అటువంటి మేఘాన్ని ఈ శిఖండి అనే కృత్రిమ వాయువు - అనగా అల్పవాయువు ఎలా అడ్డగించిందో కదా, దైవమా? ఇది దైవ విలసితమే కాని, ఇట్లగుట సంభావ్యమా ? అని ధృతరాష్ట్రుని విలాపాన్ని మూలానుగుణంగా వర్ణించినట్లే ఉన్నప్పటికీ, ఎంతో విశేషం కానవస్తుంది, ఈ సంస్కృతమూలం చూడండి. - దా! కే. రాజన్నశాస్త్రీ
ఆంధ్రమహాభారతం - తిక్మన అనుసృజనకౌశలం గవ శ్లో! మౌర్వీఘోషస్తనయిత్నుః పృషత్మ పృషతో మహాన్ ధనుగర్హాదమహాశబ్టో మహామేఘ ఇవోన్నతళను యో౨_ భ్యవర్షత కొంతేయాన్ సపాంచాలాన్ సస్ఫంజయాన్ నిఘ్నన్ పరరధాన్ వీరో దానవానిన వజభ్బత్ . (భీష్మ -1427,28) మౌర్వీ ఘఫోషస్తనయిత్ను (అల్లెత్రాటిధ్వని ఉరుముగా గలది) ధనుర్దాద మహాశబ్ద (ధనస్సు ధ్వని గొప్ప శబ్బముగా గలది) - ఈ రెంటి తొత్పర్యమొకటి కదా? మహా మేఘ ఇవ - అను ఉపమాలంకారం ్రకృతానుగుణంగా లేదు. ఇట్లే శ్లోకంలో అలంకార సౌష్టవం కొరవడింది. దీనిని సర్వాంగ సుందరంగా తీర్చి రూపకాలంకారాన్ని గ్రధించిన తీరు తిక్కన అలంకారిక భావనాపటిమకు నిదర్శనం భీష్మపర్వంలోని ఈశ్లోకం చూడండి శ్లో॥; యుధ్యతామేవ వీరాణాం భాస్మరేఇ స్తముపాగతే | సంధ్యా సమభవద్దోరా ..........” (భీష్మ -100/1) ఈ సూర్యాస్తమయాన్ని ప్రకృత కథానుగుణంగా ఉత్రేక్షించి చెప్పిన తీరు ఎంత కరుణార్టంగా స్ఫురింపజేశాడో, ఆస్వాదించండి. క. తా నస్త గిరి మణువదం బొని యపుడు పొండురాజపుత్ర విరాజ తేన పొడవడుగునను కృప నో నలినాప్తుందు గ్రుంకెనుర్వీనాథా 1 (భీష్మ - ౩271) ఇది భీష్ముని తొమ్మిదవనాటి యుద్దం - అతని ధాటికి పాండవుల సైన్యం ఆగలేకపోయింది అప్పటి సూర్యాస్తమయ వర్ణన ఇది. సూర్యుడస్తగిరికి చాటయి అంధకారం సృష్టించి, యుద్ధం ఆపక పోతే పాండవుల సైన్యం భంగపడవలసిందే. అది అట్లు కాకూడదు. ధర్మానికి విజయం కావాలి కదా ? కావున దయ దలచియా అనేటట్లు సూర్యుడు కదా! దడా, కే. రాజన్నశాస్త్రి
9 మంజూష ఇలా వర్ణనలను ప్రకృత కథా సన్నివేశానుగుణంగా మలచి యుత్రేక్షించుట అనంతర కవులకు ఆదర్శప్రాయమైంది మనుచరిత్రలోని ఈ వర్ణన చూడంది. తరుణి ననన్య కాంత నతి దారుణ పుష్పశిలీముఖ వ్యథా భరవివశాంగి నంగభవు బారికి నగ్గము చేసి క్రూరుదై యరిగె మహీసురాధము డహంకృతితో నని రోషఖీషణ స్ఫురణ వహించెనో యన నభోమణి దాల్చెంగషాయ దీధితిన్. (మను -3/10) ప్రవరుని చేతకు సూర్యునికి కోపం వచ్చిందా ? అనునట్లు ఎజ్జబారాడు అని చెప్పడం మనుచరిత్రకారుడు ప్రకృత సన్నివేశానికి చేసిన వ్యాఖ్యానం వలె ఉంది. సూర్యుడు వరూథినీ పక్షపాతం వహించాడు. అందుకు కారణం అయమ అనన్యకాంత యగుటయే. ఉత్తర కథాంశం దీనితోనే ముడిపడి ఉంది కదా. కావున ప్రకృతానుగుణంగా మనుచరిత్రకారుని కల్పన సాగింది. ఇటెన్నో ప్రబంధకారుల వర్ణనలు కానవస్తాయి. మరొక ఉదాహరణం తిక్కన భారతంనుండి - దానికి సంస్కృత మూలం ఇట్లా ఉంది. శ్లో[ ప్రాప్తే చాస్తం దినకరే న ప్రాజ్జాయత కించన” ఇది సూర్యాస్తమయమయినట్లు సూచన మాత్రమే. దీనిని తిక్కన కావ్య దృష్టితో పెంచిన తీరు ఇట్లా ఉందె. క. శాంతనపుడు తేజోదు ర్థాంతుందై నా వెలుంగు ధరకెల్లను జా లింత నినుడంస్త శైలో పాంతమునకు. జనిన నేమి యని నట్లుందెన్. క, సోమాన్వయ ప్రదీపకుం దేమెయిం దేజోవిశేష మెసకం బెసగం గా మెోఅయుట గనుగొని సి గ్గె మఖువడు మాడు గ్రుంకె నర్ముండంతన్. దా॥। కే. రాజన్నశాస్త్రి
ఆంధ్రమహాభారతం - తిక్కన అనుసృజనకౌశలం తే తె. జలరుహంబులు పాండవ సైనికులమొ గంబులట్టుల విన్ననై కాంతి దథింగె వాని మనముల భీత్యంధకారమడరు కరణింజీంకటి యెడనెడ గవియుదెంచె (భిష్మ - 1/298, 299,300) ఇది మొదటి రోజు యుద్ధం నాటి సాయంకాల వర్ణన - భీష్ముని యుద్ధమానాడు శత్రుదురాధర్నమై ఉంది. అతడు సూర్యుని వలె వెలుగుచున్నాడు. ఈ యంశాన్నే కవి మొదటి పద్యంలో ఉ్రేక్షాలంకారం ద్వారా వ్యక్తీకరించాడు. సూర్యుడు అస్తాద్రికి వెళ్ళినా వెళ్ళనీ - ఎందుకంటే తేజో దుర్దాంతుడై శాంతనవుడు (భీష్ముడు) వెలుగుచునే ఉన్నాడు కదా ? ఇదే ఈ ధరకు చాలదా - అని ప్రజలు భావించిన తీరుగా ఆ సాయం సమయ సూర్యాస్తమయం జరిగిందట. ఇక రెండవ పద్యంలో - చంద్రవంశ ప్రదీపకుడు భీష్ముడు తేజోవిశేషం అతిశయించగా వెలుగుట చూచి సిగ్గుపడ్డాడా? అనేటట్లు సూర్యుడు మరుగుజొచ్చాడు. ఇదియు సూర్యునికంటె భీష్ముడే ప్రతాపశాలియె వెలుగొందాడు అనే ప్రకృతార్థాన్ని సూచిస్తుంది. ఇది ఉత్ర్రేక్షాలంకారంచే కలిగిన వస్తుధ్వని. ఇక మూడవ పద్యంలో ప్రతీపాలంకారం ఉంది. పాండవుల సైనికుల ముఖాల వలె కమలాలు కాంతి విహీనాలయినాయట. ఆ సైనికుల మనస్సులలో భయం 'కమినట్లు చీకటి అంతట వ్యాపించించట. భీష్ముని యుద్ధం ఆనాడు పాండవ సైన్యానికి చాషాట్రాాడా బి ఆ ాాల్ర న లె మహాభయాన్ని కలిగించిందనే సూచన ఇందులో ఉండనే ఉన్నది. వర్ణనలను ప్రకృతానుగుణంగా మలుచుకోవటం తిక్కన అనుసృజనంలో ఆలంకారికభావనాశిల్పం. ఇట్లే విరాట పర్వంలోని తృతీయాశ్వాసంలో * తన మనుమలు-(198) “సమరంబున -” (194) అను రెండు పద్యాలలోని సూర్యాస్తమయ వర్జనా చమత్కృతి కూదా గమనించాలి. కీచకుడు సైరంధ్రితో నర్తనశాలలో కలియుటకు సమయమేర్చరచుకొనిన నాటి సూర్యాస్తమయ వర్ణనలో శృంగార రసం ఒలికించిన తీరు ఎంత హృదయాహ్ల్హాదకరంగా ఉందో చూడండి - ద్ కే. రాజన్నశాస్రి
92 మంజూష క. ఇనుడు తనకదడకు నేతెం చిన రాగము బొందుటది యుచితమనగాం గెం పున మెఅసి పశ్చిమాశాం గన జన సంభావనముల గౌరవమందెన్. (విరా 2/318) ఇచ్చట రాగ శబ్బానికి ఎజుపు, అనురాగం అని రెండర్జాలు. నాయకుదేతెంచిన నాయిక రాగాన్ని (ప్రదర్శించడం ఉచితం కావున ఇనుడు ( తన విభుడు - సూర్యుడు ) తనను సమీపించగానే పశ్చిమ దిశాంగన మెజసి పోయిందట. ఇట్టి ఉచిత వర్తనకు జనులు సంతసించారట. ఇదియంతా తిక్కన భావనాపటిమకు తార్మాణం. ఇక మూలంలోని ఆ యా పదాలను విశదీకరించే సందర్భంలో తెలుగు నుడికారం ఉట్టిపదేటట్లు తిక్షన (ప్రదర్శించిన నేర్పు నితాంతం హృద్యం. ఈ పద్యం చూడండి - క. నమ్ముము కైదువు మోపగు జమ్మి వెసం బ్రాంకి విడిచి చాపము నాకం దిమ్మనుడు చేయునది లే కమ్ముగ్గుం డమ్మహీజ మలసత నెక్కెన్. (విరా 4/1/2 పద్యం) ఉత్తరునితో బృహన్నల, శమీవృక్షం ఎక్కి అమ్ములు తెమ్మనిన సందర్భంలోనిదీ సడ ఇనా చూలాణేీ శ్ శ్లోః॥ ఏవ ముక్తు స పార్థేన రధాత్ ప్రస్మన్వ్య కుందలీ | ఆరురోహ శమీవృక్షం వైరాటి రవశస్తదా (విరాట పర్వం 41/6 శ్లో) ప్రకృత సన్నివేశానుగుణంగా సంభాషణల కల్పనాచాతురితోపాటు తెలుగు నుడికారపు సొంపు నింపుట కూడ ఈ పద్యంలో కనిపిస్తుంది “అవశః” అనే సంస్కృత మూలానికి అనువాదం “చేయునది లేక” అను తెలుగు జాతీయం అలసత అనునది తిక్కన చేర్చిన మాటయే ఇష్టం లేని పని అని సూచించుటకై ఆమాట వాడాడు. శ్లోక దొ కే. రాజన్నశాస్త్రి
ఆంధ్రమహాభారతం - తిక్కన అనుసృజనకౌశలం ల! పూర్వార్ధం విడిచాడు పద్యంలోని మిగిలిన భాగం తిక్కన సంభాషణ సంగ్రంధన చమత్కృతియే సాభిప్రాయ విశేష్య విశేషణ వాచక పదాలను వాడటం తిక్కన సొత్తు. మూలంలో ఉత్తరుని తెల్పుటకై “ కుండలీ” అని వాడగా, తిక్కన “అమ్ముగ్గుందడు” అని ఉత్తరుని తెల్పుటకై వాడిన పదంలో ఎంతో సాభిప్రాయత చూపాడు. విశేష్యాలను సాభిప్రాయంగా వాడటం 'పరికరాంకురి మనే అలంకారం అని అలంకారికులు చెప్పారు. తిక్కన ఆలంకారిక భావన మహోదాత్తమై ఉంటుంది మూలానికే మెరుగులు దిద్దిన అలంకారిక భావన ఇంతకు ముందే ఉదాహరించాను. స్వయంగా, అనగా అమూలకంగా చేసిన ఆలంకారిక భావనలో సునిశిత ఆలంకార తత్తావగాహన కనపడుతుంది. చూడండి - ద్రోణాచార్యుడు అర్జునుని ప్రశంసించిన తీరు ఈ పద్యంలో ఉంది మ. విలసద్దాండివ చాలనోద్ధతి, కనద్విద్యుల్లతాలీలగా నలఘు స్ఫారకపిధ్వజధ్వని, సముద్యద్గర్ద చందంబుగా జలదాకారత నొందె దేరితండు పర్జన్యాకృతిం బొల్బెం దో రృలతీవ్రారినిదాఘదుర్విషహగర్వస్ఫూర్తి నిర్మూర్తిగాన్ (విరా. 4/251) ఇది సావయవ ఉపమాలంకారం. ఇందులో రధాన్ని మేఘంతో పోల్చాడు. రధాధిష్టితుడైన అర్జునుణ్ణి పర్జన్యునితో పోల్చాడు. పర్జన్యుడనగా వర్నాధిష్టాన దేవతయగు ఇం(ద్రుడు ఇంద్రుడు మేఘవాహనుడు కదా ? నిదాఘం వలె సహింపరాని శత్రుగర్వాన్ని నిర్మూర్తిగా, అనగా అకార శూన్యంగా, అసగా, లేకుండా, చేశాడు. ఎంతటి కల్ప్చనయ?? సహృదయులే అర్థం చేసుకోవాలి సన్నివేశ భావనలో ప్రకృతానుగుణకధాంశోన్నయనం, దానికి తగిన సంభాషణల కూర్చు ఉదాహరించాను ఆలంకారిక భావనలో మూలానికి మెజుగులు, స్వయంగా భావించిన తీరులోని సొగసులు, ఉదాహరించాను ఇదంతా తిక్కన భారతం ఒక మహాకావ్యంగా తీర్చి దిద్దడంలో కనపరచిన తీరు మహా కవిత్సదీక్షబూనానని చెప్పాడు కదా, - అంతేగాక, నన్నయ కూడ “కవి వృషభులు మహాకావ్యమని” బావిస్తారని సంస్కృత మహాభారతాన్ని గూర్చి చెప్పిన అంశం తన మహాభారతానుసృజనానికి తిక్కన అన్వయించుకొన్నాడు మహాకావ్యంగా తెలుగు భారతాన్ని తీర్చిదిద్దాడు ఆంధ్రులకు మోదం దాః కే. రాజన్నశాష్త్రి
94 మంజూష కూర్చాడు. ఇంకా ఒకటి రెందు అంశాలు ప్రస్తావించ వలసియున్నది. ఒకటి రసోచిత ఖావన, రసములు స్టాయి భావములు. వ్యభిచారిభావములు. ఇవి వాచ్యాలు కాకూడదు కోపం వచ్చింది అని చెప్పే బదులు, కన్నులెల్బబారినవని అనుభావముఖంగా చెప్పాలి ఇట్టి రసోచిత భావన తిక్కన అనుసృజనంలో ఎడనెడ కానవస్తుంది మచ్చునకొకటి - సైరంధ్రికి కూడ తనయెద అనురాగం ఉన్నట్లు కీచకుడు భావించిన తీరు ఎంత హృద్యంగా వర్ణించాడో, చూడండి : సీ వెఅవక నను జూచు వీడని యెదంగలు షించిన నొందొండ చెమట వాడమ ననుచిత కృత్యంబు లాచరించు విధాతృ బలిమికి నివ్వెజపాటు దోంప నిచ్చట దిక్కులేరెవ్వరు నాకను భయమున మేన గంపంబు పుట్టం జేయంగనేమి యుపాయంబు లేమి నా ననమున వెల్ల దనంబు గదుర త్తే నున్న పాంచాలిగనుగొని యన్నరాధ ముండు వివేకవిహీనుడై ముదితుడగుచు మదనవికృతియ కాం దన మదిందలంచి రాగ సాగర పూర నిర్మగ్నుం డయ్యె. స్వేదం, కంపం, స్తంభం, మొదలైనవి శృంగారానుభవములే, కాని, సైరం(్రికవి కలగడానికి భయం కారణం కాన అవి ఇచ్చట భయానక రసానుభావములు కీచకుడు ఆ స్వేదాదులకు తనయందు సైరంధ్రి అనురక్తురాలాయెనని భావించాడు ఇచ్చట కీచకుడట్లా భావించదానికి కారణం - అతనకి గల కాముకత్వ పరాకాష్టయే - అందుకే కాళిదాసు శాకుంతలంలో అన్నాడు, “అహో ! కామీ స్వతాం పశ్యంతి"- కాముకులు తాము కామించిన యువతి చేష్టలు అన్నీ కూడా తమను గురించి చేసినట్టుగా భావిస్తారు, ఎంత ఆశ్వము ? అని యన్నాడు ఇట్లు అన్యరసానుభావాలను అన్యరసానుభావాలుగా మలచి, భ్రాంతి కలిగించటం రసనిర్వహణలోని భావనకు పరాకాష్ట డా॥! కే. రాజన్నశాస్తి
ఆంధ్రమహాభారతం - తిక్కన అనుసృజనకాశలం ర్తి
మహాభారత గౌరవానికి బంగం కలుగకుండా ప్రకృతానుగుణంగానే అనుసృజనం చేశాడని చెప్పటానికి, భగవద్గీతను అవసరానికనుగుణంగా సంగ్రహించటం - సనత్సు జాతీయం వేదాంత తత్త్వ బోధకం కావున, దానికి ప్రకృతోపయోగం లేకపోవడంచే త్యజించడం, ఉదాహరణలు, అవి రెండు - ఉపనిషత్త్వఖ్యాతి గడించాయి
ఇట్లు తిక్కన తాను ప్రతిజ్ఞ బూనినట్లు తెలుగు వారికి సంతోషం కూర్చునట్లు, తెలుగు నుడికారాలతో మహాకావ్యత్వ దీక్షబూనటానికనుగుణంగా రసాలంకార సన్నివేశాదులను భావించి దీర్చి దిద్ది, మహాభారత గౌరవాన్ని తరగనీయక, అవసరమైన వాటిని సంగ్రహించి, పెంచి, విడిచి, మహాభారతానుసృజనం చేశాడు. దీని ద్వారా ఎడనెడ ఎట్టి కౌశలం ప్రదర్శించాడో దిజ్మాత్రంగా ప్రదర్శించాను ల
“హైద్రాబాద్ కేంద్రవిశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారు తిక్కన భాషా సాహిత్యలపై నిర్వహించిన జాతీయ సదస్సు (20,22 మార్చి 19982) లో చేసిన ప్రసంగవ్యాసం, వారే ప్రచురించిన “తిక్కన భారతి” (మార్చి 2001) లో ప్రకాశితం.
బానంటలాా
దా! కే. రాజన్నశాస్త్రి
సం కవిసమయములు శ్డో। నియతికృతనియమరహితాం హ్లాదైకమయీ మనన్య పరతంత్రామ్ । నవరసరుచిరాం నిర్మితి మాదధతీ భారతీ కవేర్ణయతి ॥(కావ్య ప్రకాశః) కవయతీతి కవి “కవృవర్ణనే” అను వ్యుత్పత్తిని బట్టి చూడ కవి యనగా
వర్ణించువాడని యర్థము. “కవేఃకర్మ కావ్యమ్” లనగా అట్టి కవి చేయు పనిని కావ్య మందురు. సృష్టిలోని ప్రతివిషయమును తాను దర్శించి సర్వాంగసుందరముగా తీర్చిదిద్ది ఆ విషయమును సహ్బృదయులకందిచ్చువాడు కవి. సహృదయులు దానిని గ్రహించి ఆనందరస మగ్నులగుదురు. కావున కావ్యము ఆనందమును కూర్చునదై యుండవలెను. అదియేకదా కావ్యమునకు పరమ ప్రయోజనము. కావుననే మమ్మటాచార్యులు కవిసృష్టి కేవలముగా ఆనంద రూపమై యుడునని చెప్పెను. అనగా కావ్యము సహృదయ హృదయముల నలరించునదై యుండవలెను. కవులు తమ కావ్యములట్లుండుకై ప్రయత్నింతురు. కావ్యమునందలి ప్రతివిషయమును తీర్చిదిద్దుదురు. అట్లు కావ్య సౌందర్య సాధనలో వారి కే నియమమును అద్దురాదు. వర్యవస్తువును సర్వోత్మృష్టముగా తీర్చిదిద్దుటకై ఎట్లు చెప్పిన తమ కావ్యమునకందమినుమడించునో అట్లు చెప్పుదురు. కావ్యమునకు వన్నెతెచ్చు ప్రతివిషయము కవికల్చనావిలసితము. కొందటికి పుట్టుకతోనే కావ్యకళ యుందును. వారు కవితల నల్నుదురు. ప్రజల నలరింతురు. కవితాకళ వృద్దిని పొందవలెనన్న కావ్యశిక్ష యవసరము. కొందరికి పుట్టుకతో కాక కావ్యశిక్షావశమున కవితాకళ యబ్బును. కావ్యశిక్ష కవితలకు మెలుగులు దిద్దును. మాటల తీరులోని సోయగము లెట్లుండునో ఆలంకారశాస్త్రము వివరించి కావ్యశిక్ష నెరపుచున్నది. కావ్యమునెట్లు వ్రాయవలెనో ప్రారంభశిక్షను క్షేమేంద్రుడు తన 'కవికంఠాభరణ” మున తెలిపెను. ఏయే ఛందములను ఏయే వర్జనలలో వాడవలెనో అతడే తన “సువృత్తతిలక' మున ఛందఃశిక్షను బోధించెను.
దాః కే
Lalo Learning Hub — Languages, Literature & Cultural Bridges
Maintained by Srinivas Anil Kumar Varanasi
- Language‑Index
- Telugu · Telugu‑Alphabet · Telugu‑Grammar · Telugu‑Phrasebook
- Sanskrit · Trimuni‑Sanskrit‑Grammar · Telugu‐Index · Telugu-Links
- Hindi
- Telangana · Telangana‑Index
- Telangana‑Culture · Telangana‑Language · Telangana‑Grammar · Telangana‑History
- Kaloji: Kaloji‑Na‑Godava‑Poems · Kaloji Telangana Bhasha Bathuku