Repository navigation
Telugu Rangutaddalu
(ల నే జ లేగ, క్. టి లంట స్య న. . ష్ 1 నే ట్ట 1 వాన వ? జో | టో లం య. ల స ఏ... థి గ్ర టీ ట్ ప య సె ఓ క న . ఉం ళ్ న్యు రీ ల ప్ప సు స్ ట్, టే ం న శ న న్య. యయా నస లీ ట్ర న లే " క్ చు ఇ మ టం? ముక ల శర, షన శేష... సం టీ స్తై! శు శ్ న ల్ నం ల లే సథ క సం. మ సస్టు గ ఇలు యత్న! తర. భట పం న . న సం లానసతచాగ? భమ... 1 న 1 ల మ్య! స్టే ల్న ల క టా టు. గ వసస... సం జ్ స వి . సం త ననన. చన * నట. ట్ స " ॥ కః ల య .. లా ॥ టవ హలో జ గ స్ట నం న ఓ ప. కో నా? తత మం హ్ న క య. మళ లుం స మల [1 సు. క. చ టట న గ క . షం. | క శ క వ (1 | ర్య ట్ల ల్ ॥ , ం! ల శజ్మ్య లి న ళ్ (సై మ కో త్త . నయ త్ . న " క్ స్ చ టో తా క. | నహి లి. అపో - ఉట ఎక ముం 2 మేసి య ఇన నాం. బ్ | న్ా న స ఖు యల ళ్ళ్హ2" ే జే , ॥ న. న్ టా లే! ఇ టట అంగం స |. గ్ వ. గా నం జన స్మ య్. శ క లీ . శ స్ రా గ ళ్ 1 లో భో . ఈ స్ట వ. గం యో ం / ఎ కరష నే. లసటళ ఛి. “ళన త టా ల న నా. ల స చు ము స క . యత్ ల కంచన న ల చా పం! గ్ + ఫ్ భల (| ॥ ॥ చే న్య ల. | భష | స ము . .! య న్ శ
శీలా వీర్రాజు కథాసాహిత్యం-4 (1962-63) రంగుటద్దాలు శీలా వీర్రాజు
న గా నం. గ4౫6౮ 741004౬0 00॥600/ 0 5[0 910గ69 0౫ "5౯౬4 ౪7౯౯౧౧4౮ ః వ్రథమ ముద్రణ : ఏల్, 1964 ద్వితీయ ముద్రణ : ఆగను, 2001 ముఖచిత్రం : శీలావి డిటిపి : మను గ్రాఫిక్స్ 103% చిక్కడపల్లి, హైదరాబాదు ముద్రణ : శ్రీ బాలాజీ ఆర్ట్ ఫ్రింటర్స్ చిక్కడపల్లి, హైదరాబాదు + 500 020 వెల:రూ. 40 వ్రతులకు : శీలా సుభద్రాదేవి 2/సి, బ్రహ్మానందనగర్, మలక్‌పేట హైదరాబాదు - 500 036 చురియు దిశ పుస్తక కేంద్రం - చిక్కడపల్లి, హైదరాబాదు-20 నవోదయ బుక్‌హౌస్ - కాచిగుడా బౌరస్తా, హైదరాబాదు-27 ప్రజాశక్తి బుక్‌హౌస్ - చిక్కడ్రపల్లి, 'హైదరాబాద్-20 ళ్ / / “ లిబ! జ సక్రన' [/ , (ంశ్ఞి వ్బట్య! తు %ఓ నన అల్ తాలి పరలోం.. డ్ రా
నవ్వుతున్న మృత్యువు కౌగిట్లోంచి దూరతీరాలకు నన్ను లాక్కుపోయిన ఎస్.మల్లేళ కు
శీలా వీర్రాజు రచనలు కథల సంప్తటాలు సమాధి బండిచక్రం హ్లాదిని రంగుటద్దాలు పగా మైనస్ ద్వేషం వాళ్ళమధ్య వంతెన మనసులోని కుంచె డోరు వీడ్కోలు చెప్పింది శీలా వీర్రాజు కథలు (ఎంపిక చేసిన కథల సంపుటి) నవలలు వెలుగు రేఖలు కాంతిపూలు మైనా కరుణించని దేవత కవితా సంప్తటాలు కొడిగట్టిన సూర్యుడు హృదయం దొరికింది మళ్ళీ వెలుగు కిటికీ కన్ను ఎగర్రడబ్బా రైలు పీత (తెలుగు కవితల ఆంగ్లానువాదం) వ్యాస నంప్లుటి కలానికి ఇటూ అటూ ఇతరములు శిల్చరేఖ (లేపాక్షి స్కెచ్ బుక్)
ఇందులో ...... కథకుని వ్యక్తిత్వం (బుచ్చిబాబు పీఠిక) ...........7-14 రంగుటద్దాలు ................. కే5-45 మృత్యువు నవ్వుతోంది ................................46-65 ఉరితీయబడ్డ నిజం..................................... 66-86 చీకటి మడతలు ......................4 తి7-105
అటి రచయిత పరిచయం
రాజమంగ్రీలో 1936లో జన్మించారు. విద్యాభ్యాసమంతా ఆ వూళ్ళోనే జరిగింది. చిన్నప్పటినించీ పుస్తకాలు బాగా చదివే అలవాటువల్ల కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ప్రజామత, ఆంధ్రప్రభ వొరపత్రికల్లో రెండు సీరియల్సు రాశారు. రెండు కథల సంపుటాలు కూడా అప్పుడే వెలువడ్డాయి. 1976 వరకు కథలు, నవలలు రాస్తూ; మరో రెండు నవలలు, ఇంకొక ఏడు కథల నంపుటాలు వెలువరించారు. ఆధునిక కవిత్వంలో కథ చెప్పి “వచన కవిత్వకథికు శ్రీకారం చుట్టారు. చిత్రలేఖనంలోనూ చేయిపెట్టి కలం, కుంచెలను సమాంతరంగా నడిపిస్తున్నారు.
విద్యాభ్యాసం పూర్తికాగానే హైదరాబాదు వచ్చి 1961లో కృష్ణా పత్రికలో చేరి రెండేళ్ళపాటు పనిచేశారు. అ తర్వాత రాష్ట్రప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖలో 1963 జూన్‌లో అనువాదకుడిగా వ్రవేశించి 1990 జనవరిలో ఐచ్చికంగా ఉద్యోగ విరమణ చేశారు.
1971లో మేనమామ కుమార్తె సుభద్రాదేవితో వివాహమైంది. ఆమెకూడా కథలూ, కవితలూ రాస్తుంటారు. ఓ
సాహిత్యంలో ప్రయోగాలంటే యిష్టపడతారు.
జీవితంలోనూ, సాహిత్యంలోనూ నిజాయితీని హర్షిస్తారు. నిరాడంబరతను ఆశిస్తారు.
ప్రగతిశీల భావాలతో రచనలు చేసేవారిని గౌరవిస్తారు.
కథకుని వ్యక్తిత్వం
ఈసంపుటిలో శీలా వీర్రాజువి నాలుగు కధలున్నాయి. ఇప్పుడు నేను వాటిని పరిచయం చెయ్యపూనుకోడంలేదు; పరిచయం చెయ్యడం ఒక విధంగా అవసరమూ కాదు. పరిచయం అనగానే అందలి కథ ఏమిటో చెప్పాలి. పాత్రల మనస్తత్వాలనీ చర్యలనీ పరామర్శించి విలువ కట్టాలి. ఇవన్నీ క్షుణ్ణంగా జరిగితే ఆ కథపట్ట్ల పారకుడి కుతుహాలం సన్నగిలడం సహజం.
రచయితనీ, రచననీ విడగొట్టడం కాస్తో కూస్తో సాధ్యంఅయితే, అది కథానికల విషయంలో సాధ్యమవుతుందనుకుంటాను. కథానిక పుట్టుపూర్వోత్తరాలు, పరిణామము, రచయిత అనుభవం తెరలవెనక మరుగుస్థడినా, అది స్వరూపం తెచ్చుకుని కథగా అవతరించాక, రచయిత అంతరంగంతో దానికింక నిమిత్తం వుండదు.ఒక మంచి కథను, ఏ మంచి కథకుడైనా వ్రాయగలడు, కాని ఒకరకం మంచికథ వ్యక్తిత్వం గల కథకుడికే _ సాధ్యం. ఆ విధంగా కథకుడి వ్యక్తిత్వం పరిచయంచేసే అవసరముంది.
రచయిత వ్యక్తిత్వం అంటే ఏమిటో అనుకుని భయపడనక్కరలేదు. రచనా విధానంలో వ్యక్తమయ్యే మెళకువలు, మర్యాదలు-వ్యక్తిత్వానికి ప్రతిబింబాలన్నమాట. ఏదో ఒక బాధ, తపన వల్ల కాని రచనకు పూనుకోడు. తనకి జరిగినదాన్ని ఉన్నదున్నట్లుగా చెప్పివేస్తే నలుగురి నడుమా నగ్నంగా నిలబడినట్లు సిగ్గుపడతాడు. అది సాధ్యంకాదు.
క! రంగుటడ్డాలు తన బాధని ఇతరుల బాధగా భావించి, దాన్ని భరించగల సన్నివేశం కల్పించి, తనలో వాక అంతసు, స్థాయిగల వ్యక్తుల్ని సృష్టించ, కథగా మలచగానే, (్రేరణచేసిన తొలి అనుభవం స్వరూపం పోయి కొత్త ఆకృతిని రూపొందించడంలో కళానుభూతిని పొంది, తొలిబాధనుండి విముక్తుడవుతాడు. అది సాధించిన కథకుడు వ్యక్తిత్వంగల కథకుడు. వ్యక్తిత్వం , నిజాయితీ గల కథకుడు వీర్రాజు. ఈ సంపుటిలో నాలుగు కథలలోనూ, మూడు రచయిత 'నేను' అని చెప్పిన కథలే. ఈ 'నేను' కేవలం రచయిత అనుకోకూడదు. రచయితలో వొళటి రెండు ఛాయలున్న వొక పాత్ర. 'నేను' కథ చెప్తాడు. కుతూహలం రేపుతాడు. వ్యాఖ్యానం చేస్తాడు. మనలో కలగవలసిన మార్పుని సూచిస్తాడు. కథలోని ప్రధానరసాన్ని ఆస్వాదించేటందుకు మనల్ని సిద్ధంచేస్తాడు. ఈ శేను' పాఠకుడికంటే తెలివైన వాడవకూడదు. తెలివితక్కువవాడూ అనకూడదు. అతని ఇష్టాఇష్టాలు, అభిరుచులు సామాన్యంగా మనందరిలోనూ వున్నవే అవాలి. “అబద్ధం ఆడకూడదని ఎన్నోసార్లు అనుకున్నా అది మూత్రం సాధ్యం కావడంలేదు నాకు” అని వొక కథలో 'నేను' చెప్తాడు. మనందరి వ్యవహారమూ అట్లాంటిదే. మొదటి కథలో కథకుడు వొక స్నేహితురాలితో కలిసి ఎగ్జిబిషన్లో కొన్ని నగ్న శిల్పాలను చూస్తూ “ఆమె ఎదురుగా వాటిని తీక్షణంగా చూడ్డం ఇష్టంలేక చూసీచూడనట్టు వెళ్ళిపోతున్నాను" అని వ్రాస్తాడు. అట్లాంటి సందర్భంలో ఆ మాదిరి బెదురు మనందరిలోనూ వుంటుందనుకుంటాను. ఆ కథలోనే స్నేహితురాలితో కబుర్లు చెబుతూ నడిచివొస్తుంటే వర్షం వాస్తుంది. “చిన్న పిల్లాళ్ళల్లా పరుగెత్తడం యిష్టంలేక సగం సగం తడిసి ఆమె యింటిని చేరుకున్నాం" అని చెప్పడంలో రచయిత పరిశీలనా శక్తి వ్యక్తమవుతుంది. మూడవ కథలో కధానాయిక మలీజరిని గూర్చిన యీ వాక్యాలు చూడండి. 'అమె ఏ ఆర్టిస్కకు మోడలుగానో, ఏ రసికుడికి భార్యగానో వుండవలసిన ఆడది... ప్రపంచంముందు నిల్బోబెట్టాల్సిన స్త్రీ ఆమె. ఆమె అందాన్ని నలుగురికీ చూపించాలి. నగరం శివార్లలో నిర్మానుష్యమైన పాలాల్గో, విశాలమైన ఆకాశం కింద పరుగెత్తనివ్వాలి.' “ఆమె అందాన్ని నలుగురికీ చూపించాలి. ' అని వ్రాశాక “నిర్మానుష్యమైన పాలాల్గో' పరుగెత్తనివ్వాలి అని ఎందుకు బ్రాశాడో చటుక్కున అర్థంకాలేదు. తర్వాత
కథకుని వ్యక్తిత్వం త్ర వాక్యాలు చదివాక కొంత తెలిసినట్టనిపించింది. అ తర్వాత వాక్యం చూడండి- “ఆమెను మూడవతరగతి రైలుపెట్టెలో దేశమంతా తిప్పి తీసుకురావాలి' . అంటే ఏమన్నమాట? ఈ రచయితకి ప్రజాస్వామ్యంపట్ల ఎంతో అభిమానం వుందని తెలుస్తుంది. ఆమె మూడవతరగతి పెట్టెలో ప్రయాణం చేస్తేనే, సామాన్య ప్రజలందరూ ఆమెను చూసి ఆనందించగలరన్న ధ్వని వుంది. ఏం, ఫస్ట్‌క్లాస్ పెట్టెలోవారు ఆమెను చూడకూడదా? నిజానికి, కాస్త డబ్బూ, తీరికా వున్నవారే ఫస్టు క్లాసులో ప్రయాణం చేస్తారు. ఆ రెండూ వున్నవి కాబట్టే, సౌందర్యాన్ని చూసి ఆనందించగల అనక్తి వారిలో వుంటుంది. మూడవ తరగతిలోవారు, జాగా చూసుకున్ది, సామాన్లు సర్ది, వాటిని కనిపెట్టుకుని వుండడంలో నిమగ్నులై, ఆమె కేసే చూడకపోవచ్చు. ఆమె నిర్యానుష్యమైన పాలాల్లో పరుగెత్తాలని ఎందుకు వ్రాశాడో యిప్పుడు కాస్త అర్ధమవుతుంది. పాలందున్నే రైతు, కలుపుతీసే కూలిజనం- సామన్యప్రజలు. వారు ఆ పొలంలో వొక భాగం. వారే చూడాలి. ఆమెను వారు ఎల్లానూ చూస్తారు. వారు మినహా యింకెవ్వరూ వుండకూడదని. ఇట్లా వ్రాయడంలో సామాన్య'ప్రజల వట్ట రచయితకి ఎంతటి ఆపేక్ష వున్నదీ తెలున్తుందనుకుంటాను. ఈ మంజరి కథకి ఉరితీయబడ్డ నిజం' అని నామకరణం చేశాడు రచయిత, ఈ కథలో వొస్తువు సున్నితమైనది. రచన సుకుమారంగా, ముద్దుగా సాగుతుంది. ఇందులో హత్యలూ, అత్మహత్యలూ, ఉరికంబాలూ, కోర్టులూ, శిక్షలూ లేవు. రోడ్డురోలరు కింద సీతాకోకచిలుకలాంటి 'నిజం” నలిగింది. గగుర్పాటు కలిగించే భయంకరమైన పేరుపెట్టడం అనవనరమనుకున్నాను. కాదు, నీకు నిజం తెలీదు, యీ రోజుల్లో ఇట్లాంటి పేరు పెడితేనేగాని పాఠకుడు లేచికూర్చుని చదవడు అని నమాధానమిస్తే అది '“ఉరితీయబడ్డ నిజం” గా అనుకుని, నా విమర్శని సమర్థించే యత్నం మానుకుంటాను. కథల్నిగూర్చో వగ్రస్తావించనని హామీ ఇచ్చి, ఆ వనే చేన్తున్నానంటే, కథలు వ్రాసేవారు, ఏ నూత్రానికీ కట్టుబడివుండరన్న నిర్వచనాన్ని క్షమాపణగా స్వీకరించమని, రచయిత వ్యక్తిత్వ పరామర్శ కొనసాగిస్తాను. రచయిత మనోభావాలూ, వాంఛలూ రచననిబట్టి గ్రహించడం నూమూలే. మరొక విశేషంకూడా వుంది. రచయిత తన నిజన్వరూపాన్ని అనుకోకుండా మరుగుపరచడమూ వుంటుంది. తన నిజస్థితికి విభిన్నమైన స్థితిని బహిర్గతం చేస్తాడన్నమాట. ఈ సంపుటిలో మొదటి కథ 'రంగుటద్దాలు' ప్రారంభంలోనే రచయిత
10 రంగుటద్దాలు తన వ్యక్తిత్వాన్ని జిజ్ఞాన లేకుండా బైటపెట్టకున్నట్లు పుస్తకంలో కథలన్నీ చదివాకగాని నేను గ్రహించలేదు. ఆ కథా ప్రారంభంలోని కొన్ని వాక్యాలు పొందుపరుస్తాను-
“ఆ ఊరుతో నాలుగురోజుల పరిచయమే అయినప్పటికీ దాన్ని విడిచిపోవడం చాలా బాధగా వుంది. చీకటిలోంచి వందలాది విద్యుద్దీపాల కళ్ళతో ఆ వూరు చూస్తున్నట్టనిపిస్తోంది. ఆ భావన వచ్చినప్పుడు ఆ ఊరిని ఓ స్త్రీతో పోల్చుకుని, ఎవరి ('పేమనో తిరస్కరించి వెళ్ళిపోతున్నట్ట్లు భావించుకొంటున్నాను.”
ఎవరి (ప్రేమనూ తిరస్కరించలేడు కధలో 'నేను అన్న రచయిత. అతనికి కావల్సింది ప్రేమ - ఏదోగకంగా ఆదర్శమైంది. తిరస్కరించే పరిస్థితే ఏర్పడదు. ఈ సంపుటిలోని కథలలో యువతీయువకులు ఆప్యాయతనీ, అంతరంగ 'స్నేహాన్నీ ఆదర్శమైన ప్రేమనీ అన్వేషిస్తారు. పరిస్థితులకు లాంగిపోయి మరొకర్షి వివాహమాడినా, పరిపూర్ణ జీవితానికి ప్రేమ ఉద్దీపన కలిగిస్తుందన్న నమ్మిక కలవారే వీటిలో వ్యక్తులు. వీరికి ప్రేమ కావాలి. ప్రేమ శాశ్వతంగా వుండాలి. ఎప్పుడో వాకప్పుడు ఆదర్శవ్యక్తి తటస్థపడతాడు అని అనుకుంటారు. బలమైన ఉద్రేకం శాశ్వతమైంది - అన్న భ్రమని నెలకొల్పుతుంది వీరి ఆదర్శతత్వం. ప్రేమ కోరతారు, తిరస్కరించడం జరగదు. ఎవరిప్రేమనో తిరస్కరించి వెళ్ళిపోతున్నట్లు భావించుకొంటే , ఆ భావన ఊహలోనే - కార్యరంగంలో కాదు.
ఈ కథలలో యువతీయువకులు నేటి సమాజంలోని యువతీయువకులకు సరైన ప్రతినిధులుగానే పరిగణిస్తున్నాను. వీరికి ప్రేమను గూర్చిన ఆదర్శాలు, విలువలు ముఖ్యం. కాని, సమాజం నిర్దేశించిన సంప్రదాయంపై తిరుగుబాటుచేసే ధైర్యమూ, తెగింపూ, శక్తీ లేవు. స్త్రీలూ, పురుషులూకూడా లోలోన |పేమించుకుంటారు. పెద్దలు శాసించినదానికి తలవొగ్గుతారు. ఇదే వ్లారిలో విషాదానికి కారణం, ఈ విషాద సంఘర్థణని రచయిత సున్నితంగా, చమత్కారంగా, కొన్నిచోట్ల అద్భుతంగా చిత్రించాడు.
రెండవకథ “మృత్యువు నవ్వుతోంది” లో మాత్రం ప్రధాన వ్యక్తులు ధైర్యంచేసి, ప్రేమకు లొంగిపోయి, సంప్రదాయాన్ని తృణీకరించి తాము కోరినదాన్ని సాధిస్తారు - దాని ఫలితం మృత్యువని తెలిసుండికూడా. వారూ విషాద జీవులే. వారిని చూసి మృత్యువు నవ్వుతుంది.
వీర్రాజు నిజాయితీగల రచయిత అన్నాను. తన అనుభవం బట్టీ, సంస్కృతిని బట్టీ రచయిత శోధించగల కళాజగత్తు నిర్నీతమువుతుంది. అనుభవం నిర్దేశించిన
కథకుని వ్యక్తిత్వం 17 రసజగత్తుకి కొన్ని హద్దులు కల్చించుకుంటాడు. - అవి దాటి వెళ్ళకపోవడమే నిజాయితీ. ఒక సమయంలో పాఠకుల అభిరుచులేవో కనుక్కుని, తనది కాకపోయినా,ఆ వస్తువుకి తన జగత్తులో స్థానం కల్పించకపోవడంకూడా నిజాయితీకి నిదర్శనం. తన దృక్పథంలో తీక్షణంగా తిరుగాడే ఉద్రేకాలు, మమతలు, అనుభవాలు - వీటిని గురించి చెప్పాలి. కొత్త పరికరాలతో, కొత్తలోకంలో కసరత్తు చేయకూడదు. అట్టాచేస్తే ఏ నడుమో, కాలో బెణుకుతుంది. తచయిత సర్వజ్ఞుడుగా వ్యవహారించకూడదు.
జీవితంలో మనుషులు పూర్తిగా అడ్ధంకారు. ఎవరికి వారే అర్థంకారు. సాహిత్యంలోనే వారికి ఒక ఆకృతి, పరిణామము, లయ్య, క్రమము కల్పించబడి అర్థమైనట్టుగా వుంటారు. వీర్రాజు తన పాత్రలనుగురించి అంతా చెప్పివెయ్యడు. పాత్రలను అర్ధమయ్యేటట్లు చెయ్యకపోయినా, అర్ధమవ్వగలరన్న ధ్వని వుంటుంది. పూర్తిగా అర్థమైతే, వారు మనకి రుచించకపోవచ్చుకూడ. జీవితంలో మనకు అర్థంకానిదీ,
= అతీతమైనదీ ఏదో వాక 'మాయ' వుందన్న నాదం వినబడాలి. వీర్రాజు కథల్లో ఆ
నాదం వుండడం వొక విశిష్టత. మొదటి కథ ముగింపు చూడండి-
“అతను ఎందుకు నవ్వాడో నాకు తెలుసు, కాని నేను మీకు చెప్పను'.
చివరి కథ ముగింపు-
“రిక్షా చాలాదూరం వెళ్ళిపోయింతర్వాత ఒకసారి వెనక్కితిరిగి చూశాను. ఆమె యింకా అక్కడే నిల్పొని వుంది.”
ః ఒక మంచి కథని సమకూరుస్తే చాలదు. దానిని చివరిదాకా చదివేటట్లు చేసే
భారం రచయితపైననే వుంటుంది. లి, వర్ణనలు, సంభాషణలే కాకుండా, జీవితంపై రచయిత చేసే నిర్వచనాలు యిందుకు తోడ్పడతాయి. వీర్రాజు చక్కటి నిర్వచనాలు చెయ్యగలడు. నాకు నచ్చిన రెండింటిని యిక్కడ ఉదహరిస్తాను.
“కాలం విడిచేసిన బాటలో నాశనం కాగా మిగిలిపోయిన ప్రతి వస్తువూ ఆనాగరికమే.” 6
“చిన్నప్పుడు గట్టిగా ఏడవగలిగినవాళ్ళు పెద్దయ్యాక ప్రయత్నిస్తే చక్కగా పాడగలరు కూడాను.”
ఒక కథని చివరికేమైందోనన్న ఆతృతతో చదువుతాం. మధ్యలో కొంత వర్ణన, పాత్రల మనస్తశ్వాల పరిశీలన బోలెడుంటుంది. ఇవి మనకు విసుగుగా తోచి, ఇవన్నీ దాటేసి, హంతకుడెవరో తెలుసుకోవాలన్న కుతూహలంతో డిటెక్టివ్ నవల చదివినట్టు
రంగుటద్దాలు
12 చివరి పుటలు శ్రద్ధతో చదువుతాము. కథ ముగింపు మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది, అది మంచి కథే అనుకుంటాము. మంచి కథే కాని గొప్ప కథ కాదేమో. గొప్ప కథ ఏ వాక్యాన్నీ చదవకుండా విడిచెయ్యడానికి వీలుండకూడదు. అంతా చదివాక మరొక్క సారి చదివించేలా వుండాలి. కొంతకాలం గడిచాక మళ్ళా చదువుకుని అనందించగలగాలి. స్నేహితులతో వాదానికి దిగినప్పుడు “చూడండి, యీ కథలో ఎలా వుందో” అని ఉదహరించేటంతటి నైపుణ్యంతో ఆ రచన కొనసాగాలి. వెనక, మంచి కథ వ్రాయడం చాలా కష్టం అనుకునేవాడిని. ఈనాడు వొందలాదిగా వొస్తున్న కధలు చూస్తే నేను అనవసరంగా శంకలు పెట్టకున్నానేమో అనిపిన్తుంది. వీటిల్లో కొన్ని కథలు చదివాక, మంచి కధ వ్రాయడం కష్టం అన్న నా పాత అభిప్రాయం స్థిరపడిపోయింది. ఈనాడు వొస్తున్న కథలలో చాలాభాగం కబుర్లు మాటలు పోగుచేసి సంభాషణ ధోరణిలో అల్లబడినవే కాని, రచయిత తన అంతరంగంలో మునిగిపోయి, ఊహలో తపస్సులాంటిది చేసి, అనుభూతిని సాక్షాత్కరింప చేసుకోవాలన్న తపనతో పూనుకొన్న రచనలు కావేమో,
వీర్రాజువి ఆ విధంగా “రచించిన కథలు _ కబుర్ల ధోరణిలో చెప్పినవి కావు. అందమైన వర్ణనలు ఎన్నో వున్నాయి ఇతని కథల్లో, మనం నిత్యమూ చూసే వొస్తువులని, రచయిత వొక నూతన దృక్చథంతో చూడగలడనడానికి యా ఉదాహరణలు చూడండి-
(చావు బ్రతుకుల సందిట్లో బతకాలనే ఆశ చచ్చిపోని కళ్ళల్లో రాలిపోతోన్న వెలుగుని ఎగదోసే ప్రయత్నాలు”
'ఆమె మాటలు మరీ ముద్దగా ఏనగా వున్నాయి. ఆ ఏన లేకపోతే మరోసారి ఆమె కంఠం విందామనిపిస్తుంది.”
“సూర్యుడు కొండమీదికి ధనుస్ఫులా వాంగుతున్నాడు. మబ్బుతునకలు అప్పుడప్పుడు పిసినారిలా వెలుగుని దౌచేసుకుంటున్నాయి. అందమైన లాండ్స్కేప్ చట్రాల్లోకి వొకటి రెండు పక్షులు తొంగిచూసి పారిపోతున్నాయి. '
మౌడోదాంట్లో లాండ్స్కేప్ అన్నపదానికి మఠో తెలుగు పదం వాడివుంటే మర్ బాగుండుననిపించింది.
“చెమటకు తడిసి కరిగి కిందకు జారిన కుంకుమచార, కొండల మధ్య లోయలో (ప్రవహిస్తున్న ఏ కొండ వాగో ఉదయ కిరణాలతో ఎర్రబడ్డట్టంది.'
సన్నటి దారంగా లాగిన వర్ణన, లావాటి తాడుగా మలచకపోవడంలో అందం వంది. ఒకటి రెండు తప్పటడుగులు వేసినా, వీర్రాజుకి ఎక్కడ నిల్చిపోవాలో తెలును.
కథకుని వ్యక్తిత్వం |
ఈ వర్ణన చూడండి-
“సన్నటి పెదాలు అమెవి. ఆ కొసల్సి బాగా పురిపెట్ట్ బిగించికట్టినట్టు తిన్నగా వుండక మెలితిరిగి వుంటాయి. ”
-అన్నది బాగుంది.
“ఎవరో ఆమె పెదాల కొసల్ని సాగదీసి, చివర్ణలో మేకులు దిగేసి నవ్వడం అలవాటు చేసినట్టున్నారు అన్న దాంట్లో ఆ 'మేకులు' బాగుండలేదు. ఆమెపెదాల వర్ణన యింకా సాగి, దారం తాడై, తాడు గొలుసై కూర్చుందా అనిపించింది -యీ వర్ణన అతిగా కొనసాగిన ధోరణి చూస్తే, ॥
“పెదాలు అల్బమైనవి కావడంవలన చిరుగాలికికూడా యిట్టే కదిలి పోతుంటాయి." అమ్మో! వాటిని గొలుసులతో కట్టెయ్యాల్సిందే, కదలకుండా! -
- వీర్రాజు శైలిలో స్పష్టత ప్రధాన లక్షణం. చటుక్కున స్ఫురించని గుసగుసలు, ఉక్కిరిబిక్కిరి చేసే ఉపమానాలు, విద్యాసంస్కృతుల ప్రకర్షలోని బాఖాసంచా పేల్పులు వుండవు. మెళకువగా, సున్నితంగా, మృదువుగా సాగుతుంది శైలి. సందర్భం వొచ్చినప్పుడు ఉదాత్తంగా నడుస్తుంది. ' నిత్యం తుషార బిందువులు రాలే మృత్యుచ్చాయల శీతలసమాధి యిది.” లాంటి ఉదాత్తమైన వర్ణనలుంటాయి. ఎటొచ్చీ పోలికలు తెచ్చి విలువలు కట్టేటప్పుడు, పాశ్చాత్య నాగరికతకి చిహ్నాలైన వాస్తుసముదాయంతో పోల్చకపోవడం అలవాటు చేనుకోవాలి రచయిత. అల్హాంటి ఉపమానాలు ఏ కొద్దిమందికో తప్ప అర్థంకాకపోవచ్చు.
ఆదర్శంపట్ల ఉద్రేకం రేకెత్తించగల కథకుడు వీర్రాజు. ఆ ఉద్రేకంలో తను కొట్టుకుపోడు. గట్టున నిలబడి కదలిషోతున్న ప్రవాహాన్ని కారుణ్యంతో తిలకించగలడు. తెలుసుకున్న దాన్ని అందంగా చెప్పగలడు. ఎవర్నో ఉద్ధరించాలన్న ఉబలాటం లేదు. తనకి నచ్చనివాటిని నరుకుదామని కత్తికి పదును పెడుతూ కూర్చోడు, ఒక్క కథతో సంఘాన్ని మరమ్మత్తు చెయ్యాలన్న దురుద్దేశం లేదు. కోపగించుకోడు. బాధపడతాడు.
“ల ఒక్ ఇంజనీరు భార్యకావడం చాలా బాధాకరమైన విషయంగా అనిపించింది. ఆమె భర్త దేవుడికి అధునాతనంగా దేవాలయాన్ని కట్టించి యివ్వగలడు, కాని ఆ దేవాలయంలోని దేవుడిని చెక్కలేడు.'
-అని వ్యాఖ్యానిస్తాడు కథకుడు. ఇంజనీర్లు సౌందర్యాన్ని ఆనందించలేరు, ఆరాధించరు-అనలేను నేను, అయినా రచయిత ఎందుకు బాధపడుతున్నాడో గ్రహించగలను.
16 రంగుటద్దాలు పడుతున్నాయి. జనతా బయలుదేరే సరికే పదకొండు కావచ్చింది. మత్తుగా వుంది. ఓపిక పట్టి అతను చెప్పేవన్నీ ఆలకిస్తున్నాను
“వసంతను కలుసుకున్నావా?” అన్నాడు, కాలేజీ విషయాలమీదనుండి ఒక్కసారిగా ఆమె వద్దకు ఎగిరివచ్చి,
“ఏం, ఆమె హైదరాబాదులోనే వుంటున్నదా?” అన్నాను.
“ఇక్కడే రేడియో స్టేషన్లో పనిచేస్తోంది” అన్నాడు.
ఆమె హైదరాబాదులోనే వుంటున్నదని తెలిస్తే అమెను తప్పకుండా కలుసుకుందును. ఆమెన్లు గురించి చాలా చాలా విషయాల్ని విన్నాను. ఆమెను కలుసుకుంటే, అవి ఎంతవరకూ నిజమో కొంతవరకు తెలుసుకోవచ్చు.
కొంతమంది మనుషుల జీవితాలతో విచిత్రంగా చెలగాటాలాడుతూ వుంటారు. అంతకుముందు ఆ విషయాన్ని కథల్లో చదివాను. అ తర్వాత ఆమెను చూచి ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. కనిపించిన వారందరికీ ఆశకల్పించి తనచుట్టూ తిప్పుకొని విచిత్రంగా నవ్వుతూ చూస్తూవుంటుంది. ఆమె జీవితంలో ప్రవేశించిన మగవారి సంఖ్య, బహుశా ఆమెకే జ్ఞాపకం వుండివుండదు. ఒకసారి వ్యంగ్యంగా అన్నాను-మీలాంటివారు తప్పకుండా డైరీ ఒకటి వ్రాస్తూ వుండడం మంచిది. ముందు ముందు ఏ రచయితన్నా దాన్ని చక్కటి నవలగా మలచుకోవచ్చు-అని, ఆ వ్యంగ్యం ఆమెకు అర్థంకాలేదు కాబోలు, ఆమె ముఖంలో ఏ మార్పూ కనిపించలేదు.
“ఈమధ్య వాసమూర్తి వచ్చి చాలారోజులపాటు ఈ ఊళ్ళోనే వున్నాడు”- అన్నాడు కన్నాజీరావు.
వాసమూర్తి వస్తే ఆ విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కనిపించలేదు. అతను చెప్పదలచుకున్నది అంతమాత్రమే కాదని అర్థమైంది.
“వస్తే అందులో విశేషమేముంది?” అన్నాను.
అతను ఓమారు విచిత్రంగా నావైపు చూసి “నీకు తెలీదా?” అన్నాడు.
తెలీదన్నట్టు తల ఊపాను. ఓసారి నవ్వి “భలేవాడివే. మన వాళ్ళల్లో తెలీనివాడివంటూ నువ్వే కనిపించావు! ఏం మనిషివోయ్, కూపస్తమండూకంల నువ్వూ, నీ ఆఫీసూ తప్ప వేరే విషయాలేమీ అక్కర్లేదల్లేవుంది” అన్నాడు.
నేనేమీ మాట్లాడలేదు. అ విషయం వినాలని కుతూహలంగా వుంది.
రంగుటద్దాలు 17 మాటలాడకుండా వుంటే అతనే ఆ విషయం మొదలు పెడతాడు. నేను నిశ్శబ్దంగా అతని ముఖంలోకి చూశాను, వసంతా వానమూర్తుల కథ చెప్పమన్నట్టు. అతను చెప్పడం ప్రారంభించాడు.
“వసంతను అసహ్యించుకున్న వాళ్ళల్లో వాసమూర్తి ఒకడు. తొలిరోజుల్లో ఆమెను గురించి చెడుగా ప్రచారం చేసేవాడు...”
“ఆ విషయాలు నాకు తెలుసు. అనలు విషయం చెప్పు” అన్నాను అతన్ని మధ్యలో అపి.
అతను సర్లే అన్నట్టు చూసి మళ్ళీ మొదలుపెట్టాడు.
“ఆరోజు వర్షం ఉదయంనుంచీ కురుస్తూనే వుంద మధ్యాహ్నానికి కొద్దిగా తెరిపి యిచ్చి సాయంకాలంనుంచి కుండపోతగా పడుతోంది. కాలేజీ విడిచిపెట్టారు. చాలామంది రిక్షాల్టో వెళ్ళిపోయారు. కొద్దిగా వర్షం తగ్గినట్టనిపించగానే, అంతకన్నా తగ్గదని, అదే అవకాశంగా మరికొంతమంది వెళ్ళిపోయారు. మిగిలిన కొద్దిమందీ వరండాలో చేరి కబుర్లు చెప్పుకొంటున్నారు.
వానమూర్తి ఆ రోజు వులెన్ఫేంటు తొడుక్కుని వచ్చాడు. వర్షం పూర్తిగా తగ్గితేగాని వెళ్ళళూడదనుకున్నాడు. రామ్మూర్తిని పిలుచుకొనివచ్చి ఓ గదిలో కబుర్లు చెప్పుతూ కూర్చున్నాడు.
ఆరోజు ఉదయం క్థానులో లెక్చరర్ కోప్పడుతున్నప్పుడు ముఖంతిరిగి పడిపోయిన వసంతమీద వాళ్ళ సంభాషణ నడిచింది.
“ఆ అమ్మాయి నిజంగా ఫిట్సువచ్చి పడిపోయిందంటావా?” అన్నాడు రామ్మూర్తి.
“లేదు. అదంతా నటన. క్సాసులో వందమందిముందూ నిలబెట్టి ఏకధాటిని లెక్చరర్ చీవాట్ట్ళు పెడుతోంటే, తలకొట్టేసినంతపనై మరో మార్గంలేక ఆ ఎత్తు వేసింది.” అన్నాడు వాసమూర్తి. ॥
అ తర్వాత ఆమెను గురించి చాలా చాలా చెప్పాడు. ఓర్లోజు వాసమూర్తి, మిత్రుడితో సెకండ్‌షో సినిమాకు వెళ్ళివస్తోంటే టాపున్న రిక్షాలో వసంత, మరొకతను వెళ్తుండడం చూశాడట. ఇంకో రాత్రి వసంత యింట్లోంచి కృష్ణమూర్తి రావడంచూసి కావాలని కృష్ణమూర్తిని పలకరించాడట.
ఆ ప్రసంగానికి అంతులేదు. అలా చెప్పుకపోతున్నాడు వాసమూర్తి. రామ్మూర్తికి కూడా చాలా సరదాగా ఉన్నట్టుంది, మాట్లాడకుండా వింటున్నాడు.
శశ రంగుటద్దాలు
చివరి కథలో ప్రధానపాత్ర “జీవితంలో తృప్తిపడి సంతోషంగా బతకడం నేర్చు
కుంది" అంటాడు కథకుడు. తనతో తాను సమాధానం కుదుర్చుకొన్న రచయిత
వీర్రాజు, దొని ఫలితంగా సంతోషంతో ఎగిరి గంతులెయ్యాల్సిన విలువలేవీ అతనికి
సాధ్యపడకపోయినా, సమాధానం కుదుర్చుకోవడంలో ఎంతటి సంఘర్షణ, బాధ,
మానసిక వ్యధ వున్నాయో అతనెరుగును. ఆ స్థితిని నిలబెట్టుకోగలిగితే వీర్రాజు యింకా
ఎన్నో మంచి కథలు వ్రాయగలడు.
“ ఇన్నేళ్ళ తర్వాత యీ విషయం వెల్లడై వొక సమన్య తీరిపోయింది. ...” అని
- చివరి కధలో రచయిత వాక్యం పూర్తిచేసి తీర్చిన సమస్య ఏమిటో యిక్కడ చెప్పి, పాఠకుడి కుతూహలం చంపక విడిచేస్తున్నాను.
= బుచ్చిబాబు
1963
రంగుటద్దాలు
బండి కదిలి ఊరికి దూరంగా పరుగెత్తుతూంటే ఆత్రంగా, బాధగా చెట్ల గుబురుల మధ్యనుంచి తాంగి తొంగి చూస్తోంది ఆ ఊరు. ఏమిటో-ఆ వూరితో నాలుగు రోజుల పరిచయమే అయినప్పటికీ దాన్ని విడిచిపోవడం చాలా బాధగా వుంది. ఎవరో అత్మీయుల్సి విడచి వెళ్ళిపోతున్నట్టు దిగులు ఆవరించింది. చీకటిలోనుంచి వందలాది విద్యుద్దీపాల కళ్ళతో ఆ ఊరు చూస్తున్నట్టనిపిస్తోంది. ఆ భావన వచ్చినప్పుడు ఆ ఊరిని ఓ స్త్రీతో పోల్చుకుని, ఎవరి ్రేమనో తిరన్కరించి వెళ్ళిపోతున్నట్ట భావించుకుంటున్నాను. జరీచీర ఒత్తుగా వళ్ళంతా కప్టుకున్నట్టు, చీకటి మధ్య మినుకు మినుకుమనే వందలాది దీపాలతో మెరుస్తోన్న ఆ ఊరిని వెనక్కుతిరిగి చూస్తూ కూర్చున్నాను.
ఒక్కసారిగా నా భుజాల్ని ఎవరో కుడి పేస్తున్నారు. ముందుకు తిరిగి చూశాను. కన్నాజీరావు నవ్వుతూ - హైదరాబాదు ఎప్పుడొచ్చావు?” అంటున్నాడు. చెప్పాను, పనిమీద "హైదరాబాదు వచ్చి వెళ్ళిపోతున్నానని. అతను ఎక్కడికి వెడుతున్నాడో అడిగాను. అతని చిన్నాన్న కూతురు పెళ్ళట. అందుకని కాకినాడ వెళ్తున్నాడట.
మరో సీటులో వున్న తన సామానుల్ని మోసుకొచ్చి నా ఎదురుగా పడేసి కూర్చున్నాడు. కాలేజీ విషయాలు, తన వైవాహిక జీవితంలోని అనుభవాలు ఏకరవు పెడుతున్నాడు. వింటున్నాను. మధ్య మధ్య నిద్రమత్తుతో కళ్ళు మూతలు
75 రంగుటద్దాలు పడుతున్నాయి. జనతా బయలుదేరే సరికే పదకొండు కావచ్చింది. మత్తుగా వుంది. ఓపిక పట్టి అతను చెప్పేవన్నీ ఆలకిస్తున్నాను. “వసంతను కలుసుకున్నావా?” అన్నాడు, కాలేజీ విషయాలమీదనుండి ఒక్కసారిగా ఆమె వద్దకు ఎగిరివచ్చి. “ఏం, ఆమె హైదరాబాదులోనే వుంటున్నదా?” అన్నాను. “ఇక్కడే రేడియో స్టేషన్లో పనిచేస్తోంది” అన్నాడు. ఆమె హైదరాబాదులోనే వుంటున్నదని తెలిస్తే ఆమెను తప్పకుండా కలుసుకుందును. ఆమెన్తు గురించి చాలా చాలా విషయాల్ని విన్నాను. ఆమెను కలునుకుంటే, అవి ఎంతవరకూ నిజమో కొంతవరకు తెలుసుకోవచ్చు. కొంతమంది మనుషుల జీవితాలతో విచిత్రంగా చెలగాటాలాడుతూ వుంటారు. అంతకుముందు ఆ విషయాన్ని కథల్లో చదివాను. ఆ తర్వాత ఆమెను చూచి ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. కనిపించిన వారందరికీ ఆశకల్పించి తనచుట్టూ తిప్పుకొని విచిత్రంగా నవ్వుతూ చూస్తూవుంటుంది. ఆమె జీవితంలో ప్రవేశించిన మగవారి సంఖ్య, బహుశా ఆమెకే జ్ఞాపకం వుండివుండదు. ఒకసారి వ్యంగ్యంగా అన్నాను-మీలాంటివారు తప్పకుండా డైరీ ఒకటి వ్రాస్తూ వుండడం మంచిది. ముందు ముందు ఏ రచయితన్నా దాన్ని చక్కటి నవలగా మలచుకోవచ్చు-అని. ఆ వ్యంగ్యం ఆమెకు అర్థంకాలేదు కాబోలు, ఆమె ముఖంలో ఏ మార్పూ కనిపించలేదు. “ఈమధ్య వానమూర్తి వచ్చి చాలారోజులపాటు ఈ ఊళ్ళోనే వున్నాడు”- అన్నాడు కన్నాజీరావు. వాసమూర్తి వస్తే ఆ విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కనిపించలేదు. అతను చెప్పదలచుకున్నది అంతమాత్రమే కాదని అర్ధమైంది. “వస్తే అందులో విశేషమేముంది?” అన్నాను. అతను ఓమారు విచిత్రంగా నావైపు చూసి “నీకు తెలీదా?” అన్నాడు. తెలీదన్నట్టు తల ఊపాను. ఓసారి నవ్వి “భలేవాడివే. మన వాళ్ళల్లో తెలీనివాడివంటూ నువ్వే కనిపించావు! ఏం మనిషివోయ్, కూపస్తమండూకంల " నువ్వూ, నీ ఆఫీనూ తప్ప వేరే విషయాలేమీ అక్కర్లేదల్లేవుంది” అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. అ విషయం వినాలని కుతూహలంగా వుంది.
రంగుటద్దాలు 17 మాటలాడకుండా వుంటే అతనే ఆ విషయం మొదలు పెడతాడు. నేను నిళ్ళబ్దంగా అతని ముఖంలోకి చూశాను, వసంతా వాసమూర్తుల కథ చెప్పమన్నట్ట్లు. అతను చెప్పడం (ప్రారంభించాడు.
“వసంతను ఆసహ్యించుకున్న వాళ్ళల్లో వానమూర్తి ఒకడు. తొలిరోజుల్లో ఆమెను గురించి చెడుగా ప్రచారం చేసేవాడు...”
“ఆ విషయాలు నాకు తెలుసు. అనలు విషయం చెప్పు” అన్నాను అతన్ని మధ్యలో అపి.
అతను సర్లే అన్నట్టు చూసి మళ్ళీ మొదలుపెట్టాడు.
“ఆరోజు వరం ఉదయంనుంచీ కురుస్తూనే వుందొ మధ్యాహ్నానికి కొద్దిగా తెరిపి యిచ్చి సాయంకాలంనుంచి కుండపోతగా వడుతోంది. కాలేజీ విడిచిపెట్టారు. చాలామంది రిక్షాల్గ్లో వెళ్ళిపోయారు. కొద్దిగా వర్షం తగ్గినట్టనిపించగానే, అంతకన్నా తగ్గదని, అదే అవకాశంగా మరికొంతమంది వెళ్ళిపోయారు. మిగిలిన కొద్దిమందీ వరండాలో చేరి కబుర్లు చెప్పుకొంటున్నారు.
వాసమూర్తి ఆ రోజు వులెన్ఫేంటు తొడుక్కుని వచ్చాడు. వర్షం పూర్తిగా తగ్గితేగాని వెళ్ళళథూడదనుకున్నాడు. రామ్మూర్తిని పిలుచుకొనివచ్చి ఓ గదిలో కబుర్లు చెప్పుతూ కూర్చున్నాడు.
ఆరోజు ఉదయం క్లానులో లెక్చరర్ కోప్పడుతున్నప్పుడు ముఖంతిరిగి పడిపోయిన వసంతమీద వాళ్ళ సంభాషణ నడిచింది.
“ఆ అమ్మాయి నిజంగా ఫిట్సువచ్చి పడిపోయిందంటావా?” అన్నాడు రామ్మూర్తి.
“లేదు. అదంతా నటన. క్లాసులో వందమందిముందూ నిలబెట్టి ఏకధాటిని లెక్చరర్ చీవాట్లు పెడుతోంటే, తలకొట్టేసినగంతవనై మరో మార్గంలేక ఆ ఎత్తు వేసింది.” అన్నాడు వాసమూర్తి, ఇ
ఆ తర్వాత ఆమెను గురించి చాలా చాలా చెప్పాడు. ఓరోజు వాసమూర్తి, మిత్రుడితో సెకండ్‌షో సినిమాకు వెళ్ళివస్తోంటే టొపున్న రిక్షాలో వసంత, మరొకతను వెళ్తుండడం చూశాడట. ఇంకో రాత్రి వసంత యింట్లోంచి కృష్ణమూర్తి రావడంచూసి కావాలని కృష్ణమూర్తిని పలకరించాడట.
ఆ ప్రసంగానికి అంతులేదు. అలా చెప్పుకపోతున్నాడు వాసమూర్తి, రామ్మూర్తికి కూడా చాలా సరదాగా ఉన్నట్టుంది, మాట్లాడకుండా వింటున్నాడు.
12 రంగుటదర్దాలు వసంత అలా వెళ్తూ లోపలినుండి తనపేరు వినిపించడంతో ఆగిపోయింది. వాసమూర్తీ, రామ్మూర్తీ వర్షం తగ్గినట్టుందని గదిలోంచి వరండాలోకి వచ్చేసరికి ఎట్ట ఎదుట వసంత కనిపించింది! ఆమె ఏమీ మాట్లాడలేదు. అయిదు నిమిషాలు నూటిగా వాసమూర్తి ముఖంలోకి చూసి చరచరా అక్కడనుంచి వెళ్ళిపోయింది.
వాసమూర్తి భయపడ్డాడు. మర్నాడు ప్రిన్సిపాల్‌కు రిపోర్టు చేస్తుందేమోనని రెండు రోజులపాటు కాలేజీకు వెళ్ళలేదు.
మూడోరోజు కాలేజీకు వచ్చినప్పుడు ఆమె అతన్ని చూసి ఫక్కున నవ్వింది...”
బండీ ఏటో స్టేషనుకు వచ్చి ఆగింది. జనం బిలబిలమంటూ పెట్టెలోకి వచ్చిపడ్డారు. పెళ్ళివాళ్ళలా వున్నారు. చోటులేకపోతే బెంచీల మధ్యకొచ్చి నుంచున్నారు. కన్నాజీరావు కసురుకున్నాడు మరోపెట్టెలో ఎక్కకూడదా అని.
“రెండు స్టేషన్లావల దిగిపోయేదానికి ఎక్కడయితేనేం బాబూ!” అన్నాడు వాళ్ళలో ఓ ముసలాయన.
ఇద్దరిమధ్యా జనం అడ్డుగోడలా నుంచున్నారు. కన్నాజీరావు సిగరెట్టు కాలుస్తూ కూర్చున్నాడు, నేను కిటికీలోంచి దూరంగా చూస్తూ ఆలోచిస్తున్నాను. కన్నాజీరావు జీవితంతో దాగుడుమూతలాడుతూ అతని కళ్ళకు గంతలుకట్టి వసంత ఎందుకు వెళ్ళిపోవాల్సివచ్చిందో అర్ధంకాలేదు.
మరీ చిన్నప్పుడు కన్నాజీరావు వసంతని వీపుమీద ఎక్కించుకుని గుర్రబ్బండి లాగేవాడు. ఆమె అతని నోటిలోంచి కళ్ళెంలా ఓ తాడును లాగి తన ఇష్టంవచ్చినట్టు అతన్ని నడిపించేది. అతను సరిగ్గా కదలకపోతే ఆమె అతని వీపుమీద వేపబరికెతో నాలుగు వడ్డించేది. ఒక్కోసారి దెబ్బ గట్టిగా తగిలి వీపుమీద శట్టుతేరేది. కళ్ళనీళ్ళు తిరిగేవి. అయినా అది ఆట గనుక అతను ఏడ్చేవాడుకొదు. బాధను భరించేసి, నవ్వేసేవాడు.
ఒక్కొక్కప్పుడు ఆమెను మొయ్యలేక కిందకు పడవేసేవాడు. అప్పుడామె
ఏడ్చుకొంటూ వెళ్ళి అతని తాతగారితో చెప్పేది. ఆయన కన్నాజీరావుని కోప్పడి ఆ
అమ్మాయి చేతిలో రెండు రాగి కానులు పెట్టేవాడు. ఏడుపుమాని ఆ డబ్బుల్ని బొడ్లో
దోపుకుని ఒక్కర్తీపారిపోయి జంతికలు కొనుక్కొని దేవాలయంలో ఒంటరిగా కూర్చుని
రంగుటద్దాలు 79 తినేది. కన్నాజీరావు వెళ్ళి అడిగినా పెట్టేదికాదు. అతనికి యీసారి నిజంగా కళ్ళనీళ్ళు తిరిగేవి. అలిగి, యిక ఎప్పుడూ ఆమెతో మాట్లాడనని బుగ్గలు గిల్లుకొని వెళ్ళిపోయేవాడు. కాని మళ్ళీ ఉదయం అయ్యేసరికి పలకా బలపం పట్టుకుని ఆమె ఇంటికివెళ్ళి, ఆమెను వెంటబెట్టుకోకుండా బడికి వెళ్ళేవాడుకాడు.
ఒకరోజు వసంత గుప్పెటనిండా డబ్బులు పట్టుకొచ్చింది. వాళ్ళ అమ్మమ్మ ఊరువెళ్తూ తలో రెండణాలూ యిచ్చిందట. ఆ రెండణాలు పుచ్చుకుని కోమటి కొట్లో దమ్మిడీలు మార్చిందట.
గుప్పెట చూపుతూ “గుగ్రబ్బండి కడితే నీకు దమ్మిడీ ఇస్తాను” అంది.
అతను వీపుమీద ఎక్కించుకున్నాడు, గుర్రం బయభుదేరేముందు మెల్లమెల్లగా అడుగులు వేస్తుందిగనుక అతనూ మెల్ల మెల్లగా కదిలాడు. “గుర్రం పరుగెత్తాలి” అంది అమె. అతను గబగబా మోకాళ్ళతో పరుగెత్తాడు. ఒకచోట మోకాలు గీరుకుపోయి రత్తం చిమ్మింది. నొప్పిపుట్టి ఆగిపోయాడు.
“గుర్రం ఇప్పుడప్పుడే ఆగకూడదు” అంది వనంత. అయినా అతను కదల్లేదు. “అయితే నీకు దమ్మిడీ యివ్వనమ్మా” అంది వసంత.
అతను కదిలాడు, నాలుగడుగుల దూరం వెళ్ళినతరువాత “గుర్రం గెంతాలి” అంది. అతను మోకాళ్ళమీద ఎగిరి గెంతాడు. పట్టుతప్పి బోరాపడింది వసంత. అక్కడ కంకరరాయి ఒకటి వుంది. కంటి పైభాగంలో అది గుచ్చుకుని నెత్తురు చిమ్మింది. అతనికి భయంవేసి పారిపోయాడు. ఆ రోజల్లా అతను ఇంటికి వెళ్ళలేదు. దేవాలయంలో దాగున్నాడు. మధ్యాహ్నం ఆకలి బాగావేసింది. అయినా యింటికి వెళ్ళలేదు. కుళాయిలో నీళ్ళుతాగి మండపంలో నిద్రపోయాడు. తెలివివచ్చి చూస్తే ఎదురుగా వాళ్ళనాన్న, మావయ్య నుంచున్నారు. వాళ్ళేమీ అనలేదుగాని యింటికి తీసుకుపోయారు.
వసంత కనపడుతుందేమోనని నాలుగురోజులు భీష్మించుకు కూర్చుని స్కూలుకు వెళ్ళలేదు అతను. అయిదో రోజున వసంతే వచ్చింది తలకు కట్టుకట్టుకుని. యిద్దరూ స్కూలుకు వెళ్ళారు. అప్పటినుండి గుర్రబ్బండి ఆట అడ్డం మానేశారు.
నిద్ర ముంచుకొస్తోంది నాకు. కళ్ళు మూతలు పడుతున్నాయి. వనంత, కన్నాజీరావుల రూపాలు అలుక్కుపోయాయి. అంతా చీకటి. చీకటిలో ఒక్కడ్నే నడుచుకొని వన్తున్నాను. అవ్చుడే సినిమా విడచిపెట్టారు. దగ్గర్లోని బన్స్టావు చేరుకుందామని గబగబా నడుస్తున్నాను. ఒక వీధి దీపంకింద డబ్బులు లెక్కపెట్టి రిక్షావాడికిస్తోంది వసంత. పలకరించనా వద్దా అని ఆలోచిస్తున్న నన్ను చూసి నవ్వి
/ 20 రంగుటద్దాలు “హైదరాబాదు ఎప్పుడొచ్చారు?” అంది తనే. చెప్పాను. రిక్ల్షావాడికి డబ్బులిచ్చి పంపేసింది. ఆ దీపంకిందే అరగంట నిలబెట్టి మాట్లాడింది. తనకు రేడియోలో ఉద్యోగం _ వచ్చిందట. అది రావడానికి తను ఎన్ని అవస్తలు పడిందీ చెప్పింది. ప్రస్తుతం తను ఒక్కర్తీ ఉంటున్నదట. సన్నగా వానతుంపర ప్రారంభమైంది. బట్టలు కొద్దిగా తడిశాయి. వర్షంలో తడవడం యిష్టంలేక రిక్షాలో వెళ్ళిపోదామని చూస్తున్నాను. “మా ఇంటికి వెళ్ళాం రండి” అంది వసంత. అ ఎదురుగా ఉన్న డాబాలో ఒక భాగాన్ని చూపించింది. " ్గి నాకెందుకో వెళ్ళాలనిపించలేదు. ఆమెకు కలగాల్సిన భయం నాకు కలిగింది. - మర్నాడు ఉదయం కలుసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాను. ఆమె పెదవులమీద విచిత్రమైన నవ్వు ఒకటి కదిలి చీకటిలో కలిసిపోయింది. మర్నాడు కాఫీతాగి ఆమె వద్దకు బయలుదేరాను. ఇంటికి వెళ్ళేసరికి ఆమె స్నానం చేస్తోందట. గదిలో కూర్చోమని పనిపిల్ల చెప్పింది. కూర్చొని టేబులుమీది పుస్తకం తీసి చదువుతున్నాను. అంతకుముందు ఆ పుస్తకాన్ని ఆమె చదువుతున్నట్టుంది, మధ్యలో ఒకచోట ఆనవాలుగా చిన్నకాగితం పేజీల మధ్యపెట్టింది. ఆ పేజీయే తీశాను. ఒకచోట కొన్ని లైనులు సిరాతో మార్కుచేసి ఉన్నాయి. “.....* స్త్రీకి ఏిదోపని నిర్ణయించాముగా! అది చెయ్యకూడదా అంటారు. ఇంత - విశాల ప్రపంచంలో గూళ్ళవలె ఇల్లుకట్టి వాటిల్లో స్రీలని పెట్టి, జైలులో వలె కొన్ని పనులు చెప్పి కర్రపుచ్చుకొని చేయించడానికి ఎవడిచ్చాడా అధికారం...." మార్కుచేసిన లైనులవి. పుస్తకం థ్రిరగ వేశాను. మధ్యలో యింకా అలాంటివే చాలా గీతలు కనిపించాయి. చలం పుస్తకం అది. వసంత వచ్చింది. చీరకుచ్చిళ్ళను కెరటాల్లా లేవుకుని, పవిట సర్దుకుని “ఆలన్యం అయ్యింది క్షమించండి” అంది, నాతో మాట్లాడుతూనే స్టా వెలిగించి కాఫి కాచి యిచ్చింది. . “ఈ ఒంటరి బ్రతుకు మీకు బాధగా లేదూ?” అన్నాను. “బాధగానే ఉంది, ఏంచెయ్యనూ, తప్పదుమరి. ఒక్కోసారి యీ ఒంటరితనం
రంగుటద్దాలు న! లోంచి దూరంగా పారిపోవాలనిపిస్తుంది” అంది.
“అంటే?” అన్నాను.
నిజానికి ఆమె అన్న వాక్యానికి అర్ధం నాకు తెలుస్త. కాని ఆమె నోటిమీదుగా ఆ అభిప్రాయాన్ని చెప్పిద్దామని నా ఊహ.
“ఈ ఏకాంతం భయంకరంగా అనిపించినప్పుడు 'స్వేచ్ళగా రెక్కలు విప్పుకుని ఎగిరిపోవాలనిపిస్తుంది” అంది.
ఇంకా విపులంగా ఆమెచేత ఆ అభిప్రాయాన్ని చెప్పించాలని వున్నదికాని నాకే అసహ్యం వేసి అడగలేదు. ౮
పదింటివరకూ అక్కడే వున్నాను. ఇక వెళ్ళిపోదామని లేచాను.
“ఎక్కడికి వెళ్తారు. కూర్చోండి. హైదరాబాదు ఏమీ చూడలేదుగా. నేనూ వస్తాను. ఇద్దరం కలిసి వూరుచూద్దొం, ఇవ్వాళ ఆఫీసుకు సెలవు పెడుతున్నాను.” అంది. లోపలికి వెళ్ళి నాలుగైదు మేగజైనులు తెచ్చి నా ముందు పడేసి చూస్తూ ఉండండి, పదినిమిషాల్లో తల దువ్వుకుని వచ్చేస్తాను” అంది.
నాకు పుస్తకాలు చదవాలనిపించలేదు. కుర్చీలో వెనక్కుజారబడి కళ్ళుమూను కున్నాను.
కళ్ళు తెరిచాను. కన్నాజీరావు చాలా సేపటినుంచి లేపుతున్నట్టుంది, నవ్వుతూ “నిద్రపోతున్నావా? భలేవాడివే! మళ్ళీ ఎంత కాలానికి కలుసుకుంటామో, ఈ ఒక్కరాత్రి కబుర్లతో గడి పేద్దుమనుకుంటుంటే కునికిపొట్లు పడుతున్నావేమిటి!! ఇదో-ఈ సిగరెట్టు వెలిగించు, నిద్ర తేలిపోతుంది” అంటూ సిగరెట్టు అందించాడు.
సిగరెట్టు వెలిగించాను. +
పెళ్ళివారు దిగిపోయినట్టున్నారు. పెట్టంతా కాళీగా ఉంది. రైలు గాలిపారల్ని దూసుకుపోతోంది. కిటికీలోంచి బయటకి చూస్తున్నాను. బయట పొలాల్లో వెన్నెల వాలి మేత మేస్తోంది. స్వప్పంలోన్ని ఏదో అందమైన లోకంలా ప్రకృతి వింతకాంతిలో మునిగి పోయింది.
“శరత్కాలపు వెన్నెల ఎంత అందంగా వుంటుందో!” అన్నాను కన్నాజీరావుతో,
“అన్నట్బ! వసంతను గురించి చెప్తూ ఆపివేశాను కదూ?” అన్నాడు అతను.
అవునన్నట్పుతలవూపాను. *'
అతను తిరిగి ప్రారంభించాడు-
22 రంగుటద్దాలు “వాసమూర్తి ఎదురయినప్పుడల్లా వసంత ఫక్కుమని నవ్వేది. ఆ నవ్వు ప్రేమతో విసరడంలేదని, ఏడిపించడానికే అని, అళనిచుట్టూ వున్న మిత్రులకు అర్భవవయిపోయింది. అవృటినుంచీ వాళ్ళూ వానమూర్తిని ఏడిపించడం మొదలుపెట్టారు, మొదట్లో ఆమెను అసహించుకున్నవాడల్లా ఆమె తనను ఏడిపిస్తోంటే సరదా అనిపించేది. అప్పుడప్పుడు బాధకలిగినా అదోరకమైన ఆనందంగా భావించేవాడు. అతన్ని ఏడిపించడం వనంతకు ఓ సరదా అయిపోయింది! ఒకరకంగా ఆమెకు కాలక్షేపంగా ఉంటుండేది. ఒకరోజు కాలేజీ వీడిచిపెట్టిన తరువాత నసంత వానమూర్తి గురించి ఎదురుచూస్తూ వరండాలో నుంచుంది. వాసమూర్తి యింటికి వెళ్ళిపోదామని బయలుదేరుతున్నాడు. ఆమె మృదువుగా అతని పేరెట్టి పిలిచింది. “వాసమూర్తి ఆగిపోయి ప్రశ్నార్ధకంగా ఆమె ముఖంలోకి చూశాడు. “మీతో అవసరమైన పనుంది. రేపు ఉదయం కాలేజీకు వెళ్ళేముందు ఒకసారి మాయింటికి రండి” అంది. అతను “అలానే” అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. అతని చుట్టూ వున్న మిత్రులు వీపుచరిచి “భలే అదృష్ట వంతుడివోయ్” అన్నారు. అతని ఉత్సాహపవు పొంగు మిత్రుల పొగడ్తలతో మరీ ఎక్కువై "పెదవుల మీదనుంచి పార్లిపోయింది. వాళ్ళందరికీ హోటల్లో కాఫీలు యిప్పించాడు. ఆ మర్హాడు ఎనిమిదింటికే అందంగా తయారయి, అతనికి బాగా యిష్టమైన వులెన్ఫేంటు తొడుక్కుని, వైట్సిల్కు బుష్షర్టు వేసుకున్నాడు, టక్‌చేసి, పొడరద్దుకుని అమె ఇంటికి బయలుదేరాడు. అతని గురించే ఆమె ఎదురు చూస్తోంది. అతను రాగానే టిఫిను, కాఫీ ఇచ్చింది. కడుపునిండుగా ఉన్నా (ప్రేమతో ఆమె పెట్టిన కాఫీ టిఫిన్సను వద్దనడం యిష్టంలేక మెల్లగా వూర్తిచేశాడు. “అందాకా కూర్చోండి, యిప్పుడే వస్తాను” అని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అతనికేమీ తోచడం లేదు. ఏమైనా మేగజైనులు వుంటే చదువుతూ గడిపేవాడు, అవికూడా లేవు. ఒక్కడూ అలా గోడలవంక చూస్తూ కూర్చున్నాడు. తొమ్మిదిన్నర అయ్యింది. అంతసేపూ అలానే కూర్చున్నాడు. అవతల
రంగుటడ్ద్డాలు 23 కాలేజీకికూడౌ టయిమవుతోంది. ఇంతకూ, అమె ఎందుకు పిలిచిందో అర్థంకాలేదు.
ఆమె టాయిలెట్ అయి వస్తూనే “పాపం! ఒక్కర్నీ కూర్చోబెట్టి వెళ్ళిపోయాను ఏంచేస్తున్నారు” అంది.
“ఫరవాలేదు లెండి” అన్నాడు బాధను అణచుకుని.
ఆమె నవ్వి ఒకమారు లోపలికి వెళ్ళింది. ఉయ్యాల్లో నిద్రపోతున్న చంటిదాన్ని లేపి తీసుకొచ్చి “మా అక్కకూతుర్ని చూశారా! నాలుగోనెల” అంటూ అతనికందించింది.
అతనికి అంత చిన్న పిల్లల్ని ఎత్తుకోవడం చాతకాదు. అయినా ఆ విషయం పైకి తెలియకుండా ఎత్తుకుని బుగ్గలు గిల్లి, చిటిలువేసి వపిద్దులాడుతున్నాడు. అమె చూస్తూ నిలుచుంది.
“మీ అక్క కూతురు అచ్చం మీ పోలికే!” అన్నాడు.
ఆమె నవ్వి “ఇంతకూ ఇద్దర్లో ఎవరందంగా వున్నామంటారు?” అంది?
అతను కాసేపు తికమకపడి “మీరే” అన్నాడు.
ఆమె నవ్వేందుకు కాబోలు కాస్సేపు వీధిలోకి వెళ్ళిపోయి అయిదు నిమిషాల తర్వాత లోపలికి వచ్చింది.
ఆమె వచ్చేనరికి అతను ఎలాంటి అవస్థలో ఉన్నాడో చూసేసరికి ఆమె నవ్వాపుకోలేకపోయింది.
చంటిపాప అప్పుడే నిద్రలేచిందేమో అతని ఫేంటుని, చొక్కాను తడిపివేసింది. ముచ్చటగా తొడుక్కున్న ఉలెన్ ఫేంటుమీద చిలికి ఖరాబు చేసింది.
వసంత బలవంతంగా నవ్వాపుకుని “అయ్యో! పాపం, ఇప్పుడెలా.” అంటూ చంటిపాపను అందుకుని లోపలికి వెళ్ళిపోయింది. చెంబుతో నీళ్ళు పట్టుకొచ్చి “వరండాలో కడుక్కుందురుగాని రండి. చంటిపిల్లలంటే నాకు అందుకే చిరాకు, ముద్దుగా ఎత్తుకుంటే ముద్దు ముక్కలుచేసి సంభావన వడ్డిస్తారు” అంది.
అతను నీళ్ళు అందుకుని ఫేంటు శుభం చేసుకుందామని వరండాలోకి వచ్చేసరికి రాగలత, మరో ముగ్గురు అతనితో చదువుకునే అమ్మాయిలు వరండాలో నిలబడి పకపకా నవ్వుతున్నారు. వాళ్ళు అప్పుడే వచ్చినట్టు లేరు. అంతకుముందునుంచే అక్కడ ఉన్నట్టనిపించారు.
వాసమూర్తికి తలకొట్టేసినట్టయింది. ఆమె అంత తెలివిగా ఏడిపించినందుకు
న! రంగుటద్దాలు ఒకవైపు దుఃఖం, మరొకవైపు కోపం పుట్టుకొచ్చాయి. బట్టలు శుభ్రంచేసుకుని విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. ఆరోజు అతను కాలేజీకి వెళ్ళలేదు" కన్నాజీరావు చెప్పటం ఆపి సిగరెట్ట తీసి వెలిగించాడు. ఏదో శ్రాసింగు ఉన్నట్టుంది. బండి ఓ పల్లెటూరు స్టేషన్లో ఆగిపోయింది. కన్నాజేరావు చూసాస్తానని క్రిందకు దిగాడు. నన్నూ పెట్టెదిగి రమ్మన్నాడు గాని మత్తుగా వుండి వెళ్ళలేదు. బద్దీలపక్కనే వరుసగా పేర్చిన కర్రపలకలున్నాయి. కన్నాజీరావు వెళ్ళి వాటిమీద కూర్చున్నాడు. అతనికి తోడు మరొకాయనకూడా పక్కన చేరాడు. ఇద్దరూ కబుర్లలోపడ్డారు. | వెన్నెల్లో కన్నాజీరావు అలా కూర్చుంటే చాలాకాలం క్రిందట వాళ్ళడాబామీద వసంతతో వెన్నెల్లో అమాయకంగా కూర్చున్న అతను మనసులో మెదిలాడు. ఆ చిత్రం కళ్ళముందు కనిపిస్తోంది. అలాంటి సమయాలు వాళ్ళజీవితంలో చాలా గడిచాయి. చిన్నప్పుడు గుర్రబ్బండి ఆట ఆడకపోతే అదోలా వృండేది వాళ్ళకు. ఇప్పుడు ఎదురెదురుగా కూర్చుని నిశ్శబ్దంగా ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకోకపోతే అదోలా వుంటుంది. ఆరేళ్ళపాటు ఆమె అతని జీవితానికి దూరంగా వెళ్ళిపోయింది. ఉద్యోగరీత్యా వనంతనాన్నగారు వట్నం వెళ్ళిపోయారు. కన్నాజీరావుకు బడికి వెళ్ళేందుక్సు, ఆడుకోటానికి ఎవరూ తోడులేకుండా పోయారు. ఆ వీధిలో ఇంకా యిద్దరబ్బాయిలు, ఒకమ్మాయి అతని యీడువారు ఉన్నా వాళ్ళు అతనితో కలిసేవారు కాదు. ఆ ఆరేళ్ళు అతని జీవితంలో నిర్మానుష్యమైన ఎడారి. ఆరేళ్ళ తర్వాత కన్నాజీరావు వట్నం వచ్చెయ్యాల్సివచ్చింది. అతనితండ్రి చనిపోయాడు. చిన్నాయన అతని చదువునంధ్యలు చూసుకుంటానని పట్టం రప్పించాడు. అక్కీడే హైస్కూల్లో చేరాడు. వసంతావాళ్ళూ ఎక్కడుంటున్నారో వెళ్ళి కలుసుకోవాలని వుండేది మనసులో అనుకోకుండా ఒకరోజు వసంతే వచ్చింది. లక్ష్మీదేవిలా పసుపు ముఖానికి పులుముకుని నిండుగా మెడకు చేతులకు ఆభరణాలు తగిలించుకుని పేరంటానికి తల్లితో వచ్చింది, అప్పుడు చూశాడు ఆమెను. మొదట్లో గుర్తుపట్టలేదు. వాళ్ళమ్మను చూశాక వనంతే అనిపించింది. య?
రంగుటడ్డాలు వ్
చాలా పొడుగు ఎదిగిపోయింది. వింతైన అందం, ఆకర్షణ శరీరపు అన్ని వంపుల్లోనూ నింపుకుంది. గాలికి వోణీ ఎగిరి టపటపమంది.
ఎడమ కంటి పైభాగంలో మచ్చ మరికాస్తా పెద్దదయింది. “ఇప్పుడు గుర్రబ్బండి కడతానంటే వస్తుందా?' అని అనుకొని తనలో తానే నవ్వుకున్నాడు. ఈ ఆరేళ్ళూ వసంత తనను మర్చిపోయివుండదు.
“నువ్వొచ్చి ఎంతకాలమైంది.?” అంది వసంత.
“నెలదాటుతుంది” అన్నాడు కన్నాజీరావు.
“దప్పు మా ఇంటికి ఒకసారి రాగూడదూ1” అంది. 9
“ఎక్కడుంటున్నారు?”
“పిన్నికి తెలుసులే.అడుగు, చెప్పంది”
“అలానే”.
వసంత తల్లి పిన్నితో అతని గురించే మాట్లాడుతోంది. అతను అక్కడినుండి మరో గదిలోకి వెళ్ళిపోయాడు. వసంతకూడా తన వెనకనే వస్తుందనుకున్నాడు గాని రాలేదు.
వసంత తల్లి “అప్పుడప్పుడు మా యింటికి వస్తుండవోయ్” అంది.
అలానే అన్నట్టుగా తల ఊపాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. “వసంత నడకలో ఎంత అందం ఉంది! అనుకున్నాడతను.
వసంత యింటికి అప్పుడప్పుడు వెళ్తుండేవాడు. ఆమె తల్లి చాలా ఆప్యాయంగా చూస్తుండేది. కన్నాజీరావు ననంత ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరూ కలిసి కూర్చుని లెక్కలు చేసుకునేవారు. ఇంగ్లీషు పద్యాలు ఒకరికొకరు అప్పజెప్పుకునేవారు.
కన్నాజీరావు కొద్దిగా బొమ్మలు గీస్తుండేవాడు. వసంత తన సైన్సు బొమ్మలు, సాంఘికశాస్తంలో ప్రపంచ పటాలు, పౌరశిక్షణలోను, డ్రాయింగులోను చీత్రాలు అతని చేత వేయించేది. “నువ్వు చాలా చక్కగా రాస్తావు. నా నోట్సులు కాస్త రాసిపెట్టవూ![” అంటూ ఆ నోట్పులన్నీ అతనిముందు పడేసేది. వారానికి మూడు రోజులన్నా అతనికి అమె నోట్సులు రాయడం, బొమ్మలు గీయడం తప్పేదికాద్ను
తరచుగా అతన్ని రమ్మంటుండేది ఆమె. అతను వెళ్ళినరోజున యిరువురూ కేరమ్సు ఆడుకుంటూ కూర్చునేవారు. వాళ్ళ నాన్నగారు వచ్చేముందుమా[తం పషసకాలు
28 రంగుటద్దాలు తఈసేవారు. ఆయన ఒక్కొక్కప్పుడు, తీరికనిపిస్తే యిద్దర్నీ కూర్చోబెట్టి పాఠాలు చెప్పేవారు. ఫోర్తుఫారం, ఫిప్పఫారం యిద్దరూ మంచి మార్కులతో పాసయ్యారు. పెద్దవాళ్ళవుతున్న కొద్దీ పూర్వంఅంత స్వేచ్భ తగ్గిపోయింది. “అస్తమానం వాళ్ళింటికి వెళ్ళడం బావుండదు నాయనా!” అంది పిన్ని అతను వెళ్ళడం తగ్గించేశాడు. ఆదివారాల్లో మాత్రం వెళ్ళేవాడు. మునుపటిలా ఒంటరిగా ఆమె అతనితో యిష్పుడు మాట్లాడడంలేదు. నలుగురిమధ్యా కూర్చుని అందరిలాగే మాట్లాడేది. అతనికెందుకో ఒంటరిగా ఆమెతో కూర్చుని మాట్టాడాలనిపించేది. ఆ అభిప్రాయం అతనికి కొత్తకొత్తగా కలుగుతోంది. డాబామీద వెన్నెట్లో అంతకు ముందులా ఆమెళో కలిసి కూర్చోవాలనీ, చిన్నప్పటి విషయాలు జ్ఞాపకం చేసుకుని మధురంగా ఆలోచించుకోవాలనీ, కాలాన్ని మూగగా గడిపేయాలనీ ఏవేవో కోరికలు. స్కూలు ఫైనలు రిజల్టు వచ్చాయి. ఆతను పాసయ్యాడు వసంతకూడా పాసయ్యింది. రిజల్టు చూసినవెంటనే వసంత యింటికి వెళ్ళాడు. ఆ శుభవార్త ఆమె చెవిలో వేశాడు. సంతోషంతో ఎగిరిగంకేసింది. ఇంటిల్లిపాదికీ ఆ వార్త చెప్పింది. “న్సిత్రో పనుంది. అప్పుడే వెళ్ళిపోకోయ్” అంది వసంత తల్లి. వంటింట్లోకి వెళ్ళిపోయింది. స్ట ఇరువురూ డాబామీదకు వెళ్ళి పిట్టగోడకానుకుని కూర్చున్నారు. పిట్టగోడవరకూ వ్యాపించిన పలవల్లో జేతికందేంత దూరంలో ఓ పండు ముగ్గి వాసనకొడుతోంది. మాటలు లేవు. ఆమె గోరింటాకు పండిన చేతివేళ్ళను వయ్యారంగా నేలమీద రాస్తోంది. అతను పిట్టగోడ పగులులో మొలిచిన రావిమొక్కను చూస్తున్నాడు. “ఏ గ్రూపు తీసుకుందా మనుకుంటున్నావ్?” అంది నిళ్ళబ్దాన్ని నెట్టేస్తూ, “ఏమో! కాలేజీలో చేరుతానో లేదో” అన్నాడు అతను బాధగా. ఆమె ఉత్సాహంగా ఏదో చెప్పబోయింది. అతను తిరిగి అన్నాడు. “బాబాయి చదివిస్తాడో లేదో తెలీదు. ఇప్పట్కే ఆయన సంపాదన ఖర్చులకు చాలడంలేదు. నేను కాలేజీలో చేరితే బాబాయి అప్పులు చేయాల్సి వస్తుంది. నా తొలూకా
రంగుటద్దాలు కీ పొలం కొద్దిగా వుంది. అమ్మెయ్యాలని అనుకుంటున్నట్లు మొన్న అమ్మ ఉత్తరం రాసింది. బాబాయేమో, “ఎందుకూ వద్దు' అంటున్నాడు. ఏం చేస్తారో తెలీదు” అన్నాడు.
“నాకు చదవాలని ఉంది. నాన్నగారు ఏమంటారో” అంది ఆమె.
“మంచిదే, చదువు. మీ నాన్నగారితో నేనూ చెప్తాను చదివించమని” అన్నాడు.
చాలాసేపు నిశ్శబ్దంగా గడిచిపోయింది.
కిందనుంచి వాళ్ళమ్మ పిలిస్తే యిద్దరూ దిగి వెళ్ళిపోయారు. ఆమె పాయసం పట్టుకొచ్చి యిచ్చింది. “తాగవోయ్, అమ్మాయి పాసయ్యిందిగా ” అంది. తాగి, కాస్సేపు కూర్చుని అతను వెళ్ళిపోయాడు. ం
అ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు “మొత్తంమీద ఆ పిల్ల భలే గడుసుపిల్లే అబ్బాయ్!” అంది పిన్ని.
అతనికి ఆమె ఏమంటున్నదో అర్థంకాలేదు. ప్రశ్నార్థకంగా ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె ఏమీ మాట్టాడలేదు.
భోజనం పూర్తిచేసి, చొక్కా వేసుకుని పరీక్షపోయిన మిత్రుణ్ణి పరామర్శిద్దామని వెళ్ళాడు. కాని అతను లేడు. తిరిగి యింటికి వచ్చాడు. గదిలోకి అడుగు పెడుతున్నప్పుడు పిన్నిమాటలు వినిపించాయి.
“.... ఇంత సరదాగా ఇద్దరూ కలిసి తిరుగుతున్నారా, ఎందుకన్నదో అర్ధంకాదు! అమ్మాయికూడా పానయిందని నంతోషంకొద్దీ వాళ్ళింటికి వెళ్ళాను. ఆవిడతో మాట్లాడుతూ కూర్చున్నాను. ఏవో పెళ్ళిళ్ళ గొడవలు వచ్చాయి. వసంతకూడా అక్కడే వుంది. “కన్నాజీరావును చస్తే పెళ్ళిచేనుకోను' అంది ముఖంమీద పేడనీళ్ళు చల్లి
అనలు నువ్వావిషయం ఎందుకటిగావే? ఇప్పుడప్పుడే వాడికి పెళ్ళేమిటి, పద్దెనిమిదేళ్ళన్నా లేవు”. .
“మాటవరసకు అన్నాను, ఆవిడ వాళ్ళమ్మాయిని గురించి మాట్టాడుళూ ఎలాటి మొగుడు దొరుకుతాడో అంటే”
కన్నాజీరావు అక్కడ నుంచోలేకపోయాడు. అతనికి వసంత అలా అనడం చాలా బాధగా వుంది. వచ్చినవాడు వచ్చినట్టుగా వీధిలోకి నడిచాడు.
వనంతను ఎవ్వుడూ అతను గ్రుమించానని అనుకోలేదు. వనంతను
28 లంగుటద్దాలు చూసినప్పుడు 'ఈమెను పెళ్లిచేసుకోవాలి' అనుకునేవాడు. అతని ఊహలు అంతకన్నా మధురంగా పోలేదు. వసంత తన పెళ్ళాం అయితే - అన్నంతవరకే పరుగెత్తేవి. ఆమెను గురించి ఆలోచించిన అతనికి ఆమె అలా అనటం బాధ కలిగించింది. ఉక్రోషం వచ్చి “పోనీ పెళ్ళాడకపోతే పోనీ' అనుకున్నాడు. కాస్సేపు ఎక్కడెక్కడో తిరిగి, యింటికి వచ్చి నిద్రపోయాడు. మూడు రోజులు పోయాక వసంత అతని ఇంటికి వచ్చింది. అతనికి ఆమె అంటే కోపంగా వుంది. మాట్టాడాలనిలేదు. ముఖం పక్కకు తిప్పుకుని చూడనట్టు నుంచుంటే దగ్గరకువచ్చి “నీ చదువు మాట ఏమయ్యింది?” అంది. అతను మాట్టాడలేదు. చుట్టూ తిరిగి అతని ముందుకొచ్చి, “మాట్టాడవేం; నిన్నే ఇంట్లో చదవ్వద్దని అన్నారా?” అంది. అయినా అతను మాట్లాడలేదు. “ప్రోన్సీ, నే చెప్తాలే ఇంట్లో, చదివించమని”. ఆమె లోపలికి వెళ్ళబోయింది. వసంత గురించి తను బాధపడుతున్నట్టు పిన్నియెదుట తేలిపోవడం యిష్టం లేకపోయింది. “వాద్దు, ఇల్లారా!' అన్నట్టు కళ్ళతోనే పిలిచాడు. ఆమె దగ్గరకు వచ్చి నిలుచుంది. “బి.ఏ. వరకు చదివిస్తామన్నారు” అన్నాడు. “మరి!” ఆశ్చర్యంగా చూసింది. అతను మాట్టాడలేదా. “డాబామీద కురా! అన్నట్టగా ముందుకు నడిచిపోయాడు. 5 ఆమె అతన్ని అనుసరించి వెళ్ళింది. అతను డాబామీద ఒకవైపుకు తిరిగి చేతులు కట్టుకుని ఆకాశంలోకి చూస్తూ నుంచున్నాడు. అతని వెనుక అమె మౌనంగా నిలబడీ క్రిందకు చూస్తోంది. “నన్ను పెళ్ళాడనన్నావటగా” అన్నాడు ఆకాశంలోకి చూస్తూనే, అంతకన్నా సున్నితంగా ప్రశ్నించడం అతనికి చేతకాలేదు. “ఎవరన్నారు?”
రంపటద్దాలు 29
“పిన్ని”
కిలకిలా నవ్వింది.
“నేను ఇంకా చదువుకోవాలి, ఇప్పుడు పెళ్ళేమిటి అన్నాను. అలా అన కూడదా?” అంది.
అతను మాట్లాడలేదు.
“నన్ను తప్ప యింకెవరినీ ఫెళ్ళిచేసుకోవా ఏమిటి?” అంది తిరిగి నవ్వుతూ.
దానికీ అతను నమాధాన మియ్యలేదు.
“మాట్లాడకపోతే మీయింటికెప్పుడూ నేను రాను” అంది చిరుకోపం నటిస్తూ.
అతను ఆమెవైపు తిరిగాడు.
“భలేవాడివే, రా! పిన్నిపిలుస్తోంది. అన్నట్టు-రేపు కాలేజీకు వెళ్ళేటప్పుడు నాకూ ఓ అప్లికేషను ఫారం తెచ్చిపెట్ట” అంటూ అతని చేతిని పట్టుకుని కుదిపింది.
ఆమె ముందు వెళ్తుంటే ఆ వెనకనే మెల్లగా మెట్టు దిగుతున్నాడు.
మత్తుగా కళ్ళు మూతలు పడ్డాయి. వసంతా కన్నాజీరావుల ఆలోచన దూరంగా ఎగిరిపోయింది. వాళ్ళ ఆకారాలు అలుక్కుపోయి బూడిదరంగులో కలిసిపోయాయి. రైలు చక్రాల శబ్దం, ఇంజనుకూత, ప్రక్కనే నిద్రపోతున్న వాడి గురక-అన్నీ నిశ్శబ్దంలోకి జారిపోయాయి.
వసంత గబగబా మెట్లు దిగుతోంది. మెట్ట దగ్గర వెలుతురు లేదు. చీకటిగా ఉంది. నేను మెల్లగా తడుముకుని తడుముకుని దిగుతున్నాను.
ఆమె ఆగిపోయి “భలేవారే! అంత భయపడుతున్నవారు చార్మీనార్ చూద్దామని ఎందుకన్నారు?” అంది.
“మ్పీక్స అలవాటుమీద భయం అగిపించటంలేదు. అంతకు ముందు ఎన్నిసార్లు వచ్చారో! నాకుమాత్రం కొత్త” అన్నాను. |
“మొదట్లో ఒకసారి వచ్చాను. ఆ తర్వాత వాసమూర్తి వచ్చినప్పుడు మరోసారి- అంతే” అంది.
నాకెందుకో అసూయగా వుంది. వసంత, వాసమూర్తి పేరు ఎత్తకుండావుంటే బాగుండును. చార్మీనార్ చివర నుంచున్నప్పుడు నన్ను గట్టిగా పట్టుకున్నచ్చే వాసమూర్తినీ పట్టుకుంది గాబోలు!
80 రంగుటద్దాలు
చార్మీనార్ చిట్టచివర నుంచుని బితుకు బితుకుగా కిందకు చూస్తున్నప్పుడు “జాగ్రత్తండోయ్! కళ్ళు తిరుగుతాయి. మీ చెయ్యి. యిల్లా యివ్వండి, పట్టుకుం టాను” అంది. నిజానికి ఆ మాట నేను ఆమెను అనాల్సింది.
కిందకు దిగిపోయి నా గురించి ఎదురుచూస్తూ నుంచుంది. మెల్లగా నేనూ ఆమె దగ్గరకు చేరాను.
“సాలార్జంగ్ మ్యూజియం చూడొద్దు?” అంది.
“చూడాలి” అన్నాను.
అక్కడనుంచి మ్యూజియానికి తీసుకెళ్ళింది. తనే టిక్కెట్లు కొనితెచ్చింది.
“అనాగరికతను మానవుడు ్రేమిస్తాడు. గౌరవిస్తాడు. జాగ్రత్తగా భద్రపరచి దొనికెంతో విలువనిస్తాడు. కాలం విడిచేసిన బాటలో నాశనం కాగా మిగిలిపోయిన ప్రతి వస్తువూ అనాగరికమే. ఈనాటి పనిముట్లతో పోల్చిచూస్తే అవి పాతబడిపోయాయి. మరికొంత కాలంపోతే అవి ఉపయోగించినవాళ్ళు అనాగరికులంటుంది ఈ విజ్ఞానం. అనాగరికతను మానవుడు నాగరికతమధ్య భద్రపరుస్తున్నాడు. వాటికి లెక్కకట్టలేనంత విలువను అపాదిస్తున్నాడు.”
ఈ మాటలు వసంత లోపలి కళాఖండాల్ని చూస్తున్నప్పుడు అంది. అని, “ఏమంటారు? అని నా అభిప్రాయాన్ని అడిగింది. నగ్న సత్యాన్ని వొప్పుకోకుండా ఎలా వుండనూ?
మెల్లగా ఒక్కొక్కటే చూస్తూ బయలుదేరాం. ఒక చిత్రంముందు ఆగిపోయి “ఆమె ఏం చేస్తున్నదో చెప్పండి చూద్దాం?” అంది.
నదీతీరంలో అందమైన సాయంకాలం చల్లని శీతలవాయువ్టుల మధ్య రాతి పలక మీద మనోహరంగా జారబడి నిశ్చింతగా నిద్రపోతోంది” అన్నాను.
అమెనవ్వి “బాహ్యాన్నే తప్ప హృడీయాన్ని మీరు చూడలేరు. ఆ హృదయం వెనక సున్నితమైన భావాలు మీకు అర్థంకావు"అంది.
ఆమె వేసిన ప్రశ్నకు, నా సమాధానానికి, దానిమీద ఆమె వాఖ్యానానికి ఎలాంటి సంబంధం వుందో నాకు అర్థంకాలేదు.
ఆమె అక్కడనుండి కదిలింది. ఒక్కొక్క గదే దాటుతూ అందులోని కళాఖండాల్ని చూస్తూ వెళ్తున్నాం. చటుక్కున నాకో అభిప్రాయం తట్టింది. ఇప్పుడే వస్తానని చెప్పి,
రంగుటద్దాలు తో అంతకు ముందు ఆమె చిత్రం చూపించి ప్రశ్శించిన గదిలోకి వచ్చాను. అక్కడ వున్న గైడ్'ని ఆ చిత్రం గురించి అడిగాను.
ప్రియుడు వదిలేసి వెళ్ళిపోతే దుఃఖాన్ని భరించలేక మూర్భపోయిన స్త్రీ అట!
వసంత అంతకుముందు అలా ఎందుకన్నదో ఇప్పుడు నాకు అర్ధమయ్యింది.
నన్ను వెతుక్కుంటూ ఆమె వెనక్కువచ్చింది. “ఏం చేన్తున్నారు”? అంది. “ఇంతకు క్రితం కొన్ని చిత్రాలను చూడలేదు, అవి చూస్తున్నాను” అన్నాను. అబద్ధం అడకూడదని ఎన్నోసార్లు అనుకున్నా అదిమాత్రం సొధ్యంకావడంలేదు నాకు.
వసంత అక్కడనుంచి ముందుకు లాక్కుపోయింది.
ఒక గదిలో పాలరాతి శిల్పాలు వరునగా అమర్చివున్నాయి. వాటిల్లో చాలామట్టుకు నగ్నంగాను, అర్ధనగ్నంగాను వున్నవే.
ఆమె ఎదురుగా వాటిని తీక్షణంగా చూడ్డం ఇష్టంలేక చూసీచూడనట్టు వెళ్ళిపోతున్నాను.
“అదేమిటి! అలా వెళ్ళిపోతారు, ఇంత అందమైన కళాఖండాల్ని వాదిలేసి, భలే మనుషులే! కళాదృష్టి లేనట్టుంది మీకు” అంది.
“కళాదృష్టి' అంటే ఏమిటో ఆమెను అడగాలనుకున్నాను. ఆ అవకాశం అమె ఇవ్వలేదు,
ఒక శిల్పాన్ని చూపించి “చూడండి-ఇది ఎంత బ్రహ్మాండంగా వుందో. కన్నాజీరావే గొని చూస్తే ఈ శిల్చం దగ్గరనుండి ఆరగంటవరకూ కదలడు” అంది.
నిజానికి ఆమె చెప్పినట్టు అంత అందంగానూ వుంది ఆ శిల్పం. నగ్నంగా కూర్చున్న ఓ స్త్రీ చిన్నపిలాడికి పాలిస్తోంది. పాలరాతిలో ఆ శిల్పం మరీ అందంగా కనిపిస్తోంది. కొని ఎక్కువసేపు ఆ శిల్బాన్నిచూడలేకపోయాను. బహుశా వసంత అన్న కళాదృష్టి నాకు లేదేమో! .
మ్యూజియం అంతా చూసి బయటికి వచ్చేసరికి మూడయ్యింది. మధ్యాహ్నం భోజనం చెయ్యలేదనేవిషయం గుర్తొచ్చి ఆకలనిపించింది.
“ముందు ఏదైనా మంచి హోటలు చూపించండి, లేకపోతే మధ్యదారిలో కళ్ళు తిరిగి పడిపోతే ఇంటికి మోసుకెళ్ళాల్సి వస్తుందేమో-మీకు శ్రమ” అన్నాను నవ్వుతూ.
తై రంగుటడ్దాలు
“మిమ్మల్ని మొయ్యడానికి శ్రమపడే వారెవరూ వుండరు లెండి, ఆ భయం అక్కరలేదు” అంది.
మళ్ళీ మాట్లాడలేకపోయాను. నా ఆకారం కేసి ఒకసారి చూసుకుని, కిక్కురుమన కుండా ఆమెను వెంబడించాను.
ఏవో శబ్దాలు, శేకలు చాలా సేపటినుండి అస్పష్టంగావినిపిస్తున్నాయి. కళ్ళు తెరిచాను. పందుం పుల్లలు అమ్మే కుర్రవాడు కిటికీలో తలదూర్చి మరీ అరుస్తున్నాడు. చీకటి తొలగిపోయి వెలుతురు వ్యాపిస్తోంది. కన్నాజీరావు ఎదుటి సీటులో నిద్రపోతున్నాడు.
“ఏ స్టేషను?” అన్నాను పక్కాయనతో
“కంభంమెట్ట” అన్నాడు.
కన్నాజీర్థావును లేపాను. ముఖం కడుక్కుంటే విజయవాడలో కాఫీ తాగవచ్చని.
కళ్ళు నులుముకుంటూ లేచి “అప్పుడే తెల్లారిపోయిందా?”' అంటూ ఆశ్చర్య పోయాడు.
దంతధావనం అయ్యింది. బయటకు చూస్తూ కూర్చున్నాను. విచ్చీ విచ్చని మల్లెమెగ్గలోనే సువాసనా, సౌందర్యం వున్నట్టు, తెల తెలవారుతున్నప్పుడే ప్రకృతి అందంగాను, ఆహ్లాదకరంగాను వుంటుందనిపించింది. చీకటి, వెన్నెల కలిసిన మసక వెలుతుర్ని నెట్టేస్తూ ఉదయపు కాంతి వ్యాపిస్తున్నప్పుడు, ఆ రెండూ కలిసిన వెలుగులో ఎంళ అందం వుంది!
“రాత్రి సరిగా నిద్రలేకపోవడం వలన ఆకలేస్తోంది” అన్నాడు కన్నాజీరావు.
“ఇజవాడ వస్తోందిగా, బాగా తిందువుగాని.”
“అన్నట్టు వాసమూర్తి బెజవాడలోనే వుంటున్నాడుసుమా!”
“ఉద్యోగం చేస్తున్నాడా?”
“ఇప్పుడేం, కాలేజీ వాదిలేసిన దగ్గరనుంచీ పనిచేస్తూనే వున్నాడు-ఫిలిం డిస్టిబ్యూటింగ్ కంపెనీలో. వసంత చెప్పింది = తను ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తూ బెజవాడ వస్తే అక్కడ వాసమూర్తి కలిశాడట”
“ఏడ్రిపించలేదూ?”
“విను. అసలు విషయం చెప్పే నీకే అర్థమవుతుంది.”
రంగుటద్దాలు ! నేను కిటికీలోంచి చూడ్డంమానేసి అతనివైపే చూస్తూ కూర్చున్నాను. అయిదు నిమిషాలపాటు అతను ఆలోచిస్తూ కూర్చుని చెప్పటం ప్రారంభించాడు.
“రిజల్సు వచ్చిన తరువాత ఉద్యోగం గురించి ప్రయత్నం చేన్తూ వాళ్ళ నాన్నగారితో ఒకసారి బెజవాడ వచ్చింది వసంత, ఎవరో తెలిసిన అతని ఇంటి అడ్రసు పట్టుకొని వెతుకుతుంటే వాసమూర్తి కనిపించాడు. చూడగానే ఆశ్చర్యపోయి. అతనే పలకరించాడు. రేడియోలో ఏదో ఉద్యోగం ఖాళీగా ఉన్నదని తెలిసిందట. ఒక పత్రిక ఎడిటరు ఆయనకు నన్నిహిత మిత్రుడుంటే ఆయనతో రికమెండు చేయిద్దామని వచ్చారట.
“ఎక్కడికి వెళ్తున్నారు?” అన్నాడు వాసమూర్తి. "
“స్నేహితుడి యిల్లు వెతుకుతున్నాను, దొరకలేదు” అన్నాడాయన. ఆ అడ్రసు అతనికి చూపించాడు. ఆ అడ్రసు ప్రకారం వాళ్ళను ఆ ఇంటికి చేర్చాడు వాసమూర్తి. తనకు అర్జంటుపని వుండడంవల్ల మరునాడు వచ్చి కలుసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ మరుసటిరోజు సాయంకాలం అతను వెళ్ళాడు. వసంత నాన్నగారు లేరు. ఆయనా ఆయన స్నేహితుడూ-ఇద్దరూ ఎక్కడికో వెళ్ళారట. వసంత ఆ యింటి వాళ్ళబ్బాయిని రెండేళ్ళవాడిని ఎత్తుకొని ఆడిస్తోంది.
“కూర్చోండి!” అని కుర్చీ చూపించింది. అతను కూర్చున్నాడు.
“మీకు పిల్లలంటే ఇష్టం అనుకుంటాను” అన్నాడు నవ్వుతూ.
“ఎత్తుకుంటారా?” అంది అమె కూడా నవ్వి.
“ఇవ్వండి.”
“వద్దులెండీ. తర్వాత నన్ను తిట్టుకుంటారు. ఇప్పటికే నన్ను తిట్టుకున్నది అచ్చులో పెడితే ఓ పెద్ద గ్రథమంత తయారైవుంటుంది” అంటూ చిలిపిగా నవ్వింది.
పాలిపోయిన మొహంతో అతనుకూడా ఓసారి నవ్వేశాడు.
వసంత ఇంట్లోకి వెళ్ళి పిల్లవాడిని ఇచ్చేసి వచ్చింది. ఏవేవో విషయాలు మాట్లాడిన తర్వాత “ఇంతకూ మీ ఉట్యోగం ఏమయ్యింది?” అన్నాడు.
ఆమె నిట్టూర్చి “అయ్యేట్టు ఏమీ కనిపించడంలేదు. అ ఎడిటరుగారికి, రేడియో వాళ్ళకు పడదట, ఏవో కారణాలచేత. 'అయినా ప్రయత్నిస్తాను" అన్నారట. “ఆ పని
త్రిశ లంగుటడ్డాలు నేను చెయ్యలేను' అనే విషయాన్ని తియ్యగా చెప్పడం అన్నమాట అది” అంది వసంత.
“మరి ఇప్పుడు ఏం చెయ్యదలచుకున్నారు?”
నిజానికి ఈ ప్రశ్న అడగడంలో అర్థంలేదు. అతనుగూడా ఆ వ్రళ్శకు సమాధానాన్ని ఆశించి అడగలేదు. ఏం మాట్లాడాలో తోచక ఆ ఫ్రశ్నే మనసుకు తట్టితే అడిగాడు.
ఆమె మాట్లాడలేదు. మౌనంగా తలవంచుకుని చూస్తోంది.
“పోనీ, నేనొక ప్రయత్నం చేస్తాను. అది నెరవేరుతుందని ధైర్యంగా చెప్పలేను కాని శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను. నాకు తెలిసిన రేడియో ఆర్టిస్టు ఒకాయన వున్నాడు. ఆయనద్వారా స్టేషను డైరెక్టరుకు చెప్పిద్దాం.”
అంత నిరాశలోనూ అమెకు కొంత ఆశ, కొంత ఉత్సాహం కలిగాయి. కృతజ్ఞతగా అతనివైపు చూసింది.
వసంత నాన్నగారు వచ్చారు. ఆయనతో మాట్లాడి మరుసటి రోజు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అన్నట్లుగా ఆ మర్నాడు వచ్చీ వసంతను, వసంత నాన్నగారిని వెంటబెట్టుకొని అతని మిత్రుడిదగ్గరకు వెళ్ళాడు. ఆయనతో మాట్లాడి ఆమెచేత ఒక అస్టికేషన్ పెట్టించాడు.
“వారం పదిరోజుల్లో ఏ విషయమూ చెప్తాను” అన్నాడు ఆ మిత్రుడు.
వసంతావాళ్ళూ వెళ్ళిపోయారు. ఆ రోజు వాసమూర్తి స్టేషన్‌కు వెళ్ళి ఇద్దర్నీ సాగనంపాడు.
వాళ్ళు వెళ్ళిపోయాక వసంత దగ్గరనుంచి అతనికి ఉత్తరం వచ్చింది. పదిహేను రోజుల తర్వాత వసంతకు అతను సమాధానం ఇచ్చాడు-ఆ ఉద్యోగం మరొక ఆమెకు వచ్చిందట. మంత్రుల స్థాయిలో రికమెండేషన్ నడిచిందట. ఆ విషయం రాస్తూ ఉత్తరంలో అతను చాలా నొచ్చుకున్నాడు.
ఆ తర్వాత వాళ్ళిద్దరిమధ్యా ఉత్తరాలు నడుస్తుండేవి. మరుసటి సంవత్సరం ఆమెకు హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం రావడానికి పరోక్షంగా వాసమూర్తే కారణం. పత్రికల్లో ఎడ్వర్టయిజ్మెంట్ పడితే చూసి అమెకు ఉత్తరం రాశాడు. ఆమె అంతవరకూ చూడలేదు. వెంటనే ఆ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టింది. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు ఏవేవో ప్రయత్నాలు చేశారు,
రంగుటద్దాలు తల్
“ఈమధ్య హైదరాబాదు వాసమూర్తి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ చాలా ఖుషీగా తిరిగారు. బన్సుల్లోనో, బజార్లోనో, పబ్లిక్ గార్జెన్సులోనో, టాజ్లోనో, దీపక్లోనో ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే వుండేవారు. ఓ నెల్దాళ్ళపాటైనా అతను ఇక్కడ వుండి వుంటాడు...”
బండి ఏదో స్టేషన్లో ఆగింది. కన్నాజీరావు బండి దిగి సిగరెట్టు కొనుక్కొచ్చాడు. అంత ఉదయమే సిగరెట్టు కాల్బాలనిపించలేదు నాకు. అతను కాలుస్తూ కూర్చున్నాడు. బెజవాడ వెళ్ళేవరకూ మరేమీ మాట్లాడలేదు.
బెజవాడలో సైబెర్తు కాళీ అయ్యింది. కాఫీతాగొచ్చి అక్కడకు చేరుకున్నాను. కొద్దిసేపు నిద్రపోతే కాస్త తేలికగా ఉంటుంది. గ “
కన్నాజీరావు ఏదో పత్రిక కొనుక్కొచ్చి చదువుకొంటూ కూర్చున్నాడు. అతని కెదురుగా ఓ అరవామె ప్రళయం తరుముకొస్తున్నట్టుగా భర్తతో మాట్లాడుతున్నా వినిపించుకోకుండా తన చదువులో మునిగిపోయాడు కన్నాజీరావు!
నిజానికి కన్నాజీరావుకు కథలంటే అంత యిష్టంఉండేదికాదు. మొదట్లో అతనికా అలవాటు వసంతే ఏర్పరచింది. ఆమెకు కథలంటే యిష్టం. కథలు రాసి పత్రికలకు పంపుతుండేది. కాలేజీలో రచయిత్రిగా ఆమె పేరు సంపాదించుకుంది. అలా ఆమెకు "పేరు రావడానికి కారకుడు కన్నాజీరావు. వనంత అందుకతన్ని అతితెలివిగా ఉపయోగించుకుంది. తన గొప్పతనాన్ని మగవాళ్ళల్లో ప్రచారంచేసే మనిషి ఆమెకు అవసరం. అందుకు కన్నాజీరావు ఉపయోగపడ్డాడు.
అతనంటే ఆమెకెందుకో ఒక విధమైన ద్వేషం. అతను అవునన్నది ఆమె కాదనేది. అతనికన్నా తను తెలివైనదానినని ఆమె అభిప్రాయం. ఆ అభిప్రాయం ఆమెకు చిన్నప్పటి నుంచీ ఉన్నదే.
ఆ మొగ్గల్లా కాలం కప్పిన ముసుగులో రహస్యంగా పెరిగి పగిలి విషవాసనల్ని విరజిమ్ముతోంది. ౬
ఒకరోజు ఆమె పుట్టినరోజు పండగ చేసుకొంది. ఆ రోజు సాయంకాలం టీపార్టీకు ఆమె యింటికి వెళ్ళినప్పుడు ఆమె అభిమానించే వంగ రచయిత పుస్తకం ఒకటి బహుమతి చేశాడు. ఆమె అందుకుని పైన చుట్టిన అట్టవిప్పి 'యింతేనా' అన్నట్టు చూసింది. చుట్టూ చేరిన అరడజను 'స్నేహితురాళ్ళూ ఫకాలుమని నవ్వారు.
“మీ కన్నాజీరావు నీ కోసం చాలా శ్రమపడి తెచ్చాడు ప్రేమకానుక. భద్రంగా
ర! రంగుటద్దాలు హృదయంలో దాచుకో” అంది వనలత,
“ఆయనేదో ఉంగరం వట్టుకొస్తాడేవోనని నేను తేవడం మానేని టాయ్లెటొసెట్ట పట్టుకొచ్చాను” అంది అజీద్బీచి.
ఆ మాటల్లోని వ్యంగ్యానికి అతనికి తల కొట్టేసినట్టయింది. అవమానంతో, అభిమానంతో ఆవేశం రేగి బయటికి రాలేక కన్నీళ్ళల్లో కరిగి కళ్ళలోనే ఇంకిపోయింది.
ఎందుకొచ్చానా అనుకున్నాడు. తను దగ్గర వుండికూడా స్నేహితురాళ్లచేత అవమానిస్తున్నందుకు ఆమెమీద ఎంతైనా కోపం వచ్చింది. అంతకన్న ఎక్కువ ధర పెట్టి కొనేశక్తి లేదు. ఆమెకు సాహిత్యం అంటే యిష్టమని వున్న డబ్బుతో పుస్తకం కొనుక్కొచ్చాడు. తన శక్తీ ఆమెకు తెలిసివుండికూడా స్నేహితురాళ్ళని మందలించలేదు ఆమె.
పార్టీ అయ్యేవరకూ. ఎలాగో ఓపికపట్టి కూర్చున్నాడు. ఆమె 'స్పేహితురాళ్ళ యికిలింపులు, వ్యాఖ్యానాలకు అతీతంగా మౌనంగా ఆలోచిస్తూ వుండిపోయాడు.
పార్టీ కాగానే వెళ్ళిపోదామని లేచాడు.
“ఏమిటి! సినిమా ప్రోగ్రాం వుంటే వెళ్ళిపోతానంటావు, భలేవాడివే! కూర్చో” అంది వనంత,
“నను రాలేను. వంట్లో అదోలా వుంది, మీరు వెళ్ళండి” అన్నాడు.
అరడజనుమంది అమ్మాయిలూ అతనిచుట్టు చేరిపోయారు.
“అదేమిటండీ, మీ వసంత పుట్టినరోజయితే మీరు రానంటారేమిటీ! మంచివారే, కూర్చోండి” అంది సువర్జ తిలకం.
“కావలసినవారు మీరు లేకుండా మేమంతా ఎందుకు?” అంది వనలత.
వసంతను తన సొంతంచేసి వాళ్ళంతా మాట్లాడుతుంటే, అంతకుముందు ఆమె మీదున్న కోపంఅంతా ఎగిరిపోయింది. వసంత కళ్ళల్లోకి చూశాడు.
“ఊ.. రావాలి" అన్నట్టు చూసింది ఆమె. లేచి నుంచున్న వాడల్లా తిరిగి కూర్చున్నాడు. -
మరో అరగంటలో అంతా సినిమాకు బయలుదేరారు. హాలు దగ్గర “ఇవ్వాళ మనల్నందర్నీ సినిమాకు కన్నాజీరావే తీసుకెడతాడు” అంది వసంత.
“వాళ్ళవసంత పుట్టినరోజేగా, తీసుకెళ్ళడేమిటి” అన్నారు అరడజనులో ఒకరు.
లంగుటద్దాలు తి
అతనికి ఏడుపొచ్చినంత పనైంది. చిల్లరంతా కలిపితే అతని జేబులో రెండు రూపాయలకన్నా ఎక్కువ లేవు. వీళ్ళందరినీ సినిమాకు తీసుకెళ్ళాలంటే పదిహేను రూపాయలన్నా కావాలి. తనదగ్గర డబ్బు లేదనే విషయం తెలిసికూడా, అడిగి తనని చిన్నబుచ్చాలని వసంత చేసిన పనికి అతనికి ఎంకైనా కోపంవచ్చింది. అక్కడనుంచి చరచరా అతను యింటికి వెళ్ళిపోయాడు.
మరో రోజు మరో సంఘటన జరిగింది. అతను పుస్తకాలన్నీ కొనుక్కోలేదు. వసంత వద్దకు వెళ్ళి కావలసినవి తెచ్చుకుని చదివి యిచ్చేస్తుండేవాడు.
ఒక రోజు హిస్టరీగైడ్ గురించని ఆమె యింటిక్సివెళ్ళాడు. పత్రిక చదువుతూ కూర్చుంది ఆమె. అతను వచ్చినట్టు గుర్తించలేదు. ముందుగా అతనే పలకరించాడు.
“ఏం పనిమీద వచ్చావా?” అంది ఆమె. అసలు, ఆమె అలా అడగడమే అతనికి నచ్చలేదు.
“హిష్టరీగైడ్ కావాలి” అన్నాడు.
“వెళ్ళేటప్పుడు తీసుకు వెళ్ళుదువుగానిలే. నీతో మాట్లాడాలి పైకి వస్తావా” అంది. అని, డొబామీదకు నడిచింది. మౌనంగా ఆమెను అనుసరించాడు.
కూర్చోలేదు. ఇద్దరూ నుంచోనే ఉన్నారు.
“ఇవ్వాళ బోర్జుమీద రాసిన రాతలు చూశావుకదూ” అంది. ఆ మాటలు కోపంతో వంపులు తిరిగాయి.
“చూశాను” అన్నాడు నిర్లిప్తంగా అతను.
“అయినా నీకు చీమకుట్టినట్టయినా లేదన్నమాట?”
అతనికి ఆమె మాటలు వింతగా అనిపించాయి. ఆశ్చర్యంగానే ఆమె కళ్ళళ్ళోకి చూశాడు. ౦
“కాలేజీకు రావడమే కష్టమవుతోంది. కనిపించిన ప్రతి వెధివా ఇద్దరి పేర్లూ కలిపి ఏడిపించడమే. మొన్న అమ్మా, నేనూ అంతా సినిమాకు వెడితే, ఓ వెధవాయి “పాపం యింటల్లుడు రాలేనట్బంది' అన్నాడు గట్టిగా. మొన్నటికి మొన్న-లేడీస్ వెయిటింగ్ రూమ్‌కి వెడుతుంటే గుంపులోంచి ఓ రాలుగాయి “రాత్రికి కన్నాజీరావుని వదిలిపెట్టాలి. సినిమా (ప్రోగ్రాం ఉంది' అంటూ కూశాడు. ఎవడుకూశాడో సరిగా కనిపించలేదు. లేకపోతే యింటిముఖం పట్టించేదాన్ని అసలు దీనికంతటికీ కారణం
తతి రొంగుటద్దాలు నువ్వే. నువ్వు గట్టిగా మాట్లాడితే వీళ్ళంతా ఎందుకిలా అంటారు? వాళ్ళనని ఏంలాభం, నిన్ననాలిగాని” అంది వసంత.
ఇందులో తన తప్పేమిటో 'అతనికి అర్థంకాలేదు. అతను నవ్వి “ఇలా ఉడుక్కుంటావు కాబట్టే వాళ్ళు మరీ ఏడిపిస్తుంటారు” అన్నాడు.
అతను నవ్వుతోంటే ఆమెకు కోపం ముక్కు చివర పదునులో మెదిల్సి క్రింద గాడిలోకి జారి, పెదాల్ని పట్టి ఒక్క కుదుపు కుదిపింది.
“అవును. నీకు నవ్వులాటగానే ఉంటుంది. ఆడదాని పేరు తగిలించుకుని మురిసిపోతున్నావు. ఇలా నలుగురికీ చెప్పుకుని మురిసిపోవటంలో అర్థం ఏమిటి- నిన్ను తప్ప యింకెవరినీ పెళ్ళిచేసుకోగూడదని శాసించడమేగా, అంత స్వార్థం మనిషికి పనికి రాదు...”
కన్నాజీరావు ఏమీ మాట్ట్లాడలేకపోయాడు. అరగంటసేపు అక్కడే మౌనంగా నుంచుండిపోయాడు. రెండేళ్ళ క్రిందట పిన్నితో. “కన్నాజీరావును నేను పెళ్ళిచేసుకోను' అన్నవాక్యానికీ, యివ్వాళ వసంతమాటలకూ అతనికి యిప్పుడు అర్ధం బోధపడింది. ఆమె తనకెంత దూరంలో ఉన్నదీ తెలుసుకోగలిగాడు.
పుస్తకం పుచ్చుకోకుండానే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యా మరింత దూరం ఏర్పడింది.
ఇద్దరి రూపాలూ రైలు చక్రాల శబ్దంలోపడి గిరిగిరా తిరిగి చీక్షటై వెలుతుర్జోకి జారి మాయమయ్యాయి. మనస్సు స్వాధీనంలోంచి దార్గి, జాగ్రదావస్థలో బోర్జాపడి లేచి, వళ్ళుదులుపుకుని కలలోకి కదిలి. వెళ్ళిపోయింది.
వసంత వయ్యారంగా చేతుల్ని కట్టుకుని మెల్లగా నడుస్తోంది. పబ్లిక్ గార్డెన్స్‌లో సగానికి పైగా తిప్పి జంతువుల్ని, పక్షుల్ని చూ పెడతానని మరోమూలకు తీసుకొచ్చింది. ఆమె పక్కనే మౌనంగా నడుస్తున్నాను.
“ఆ లేడి ఎంత బావున్నదో!” అంది.
సీతాదేవి శ్రీరాముడితో అలా అనడం జ్ఞాపకానికొచ్చింది. కాని “కావాలా? అని అనలేకపోయాను.
పెద్దపులులు, కోతులు, ఎలుగుగొడ్డులు, రకరకాల పక్షులు, రంగుల సీతాకోక చిలుకలు, వాటిని చూడడానికొచ్చే వన్నెల విననకర్రలు, అందాన్ని ముసుగుల్లో
రంగుటద్దాలు ంం సమాధిచేసిన ఆడవాళ్ళు... ఇంకా...ఇంకా....
ఓ అందమైన అమ్మాయిని చూస్తోంటే ఆమె ఆగిపోయి నవ్వింది. నన్ను చూసేమో అనుకున్నాను. వసంత స్పేహితురాలు కాబోలు, నవ్వుతూ దగ్గరకొచ్చి “ఇవ్వాళ ఆఫీసుకు రాలేదేం?” అంది.
“ఏమీలేదు, ఇవ్వాళ కాస్తో పనితగిలింది” అంది వసంత, వంపుగా నావైపు చూసి మెల్లగా నవ్వి.
అమెను నాకు పరిచయం చేసింది. రేడియోలో పాడుతుందట. నన్నామెకు పరిచయం చేసింది. క
“ఈయన ఆంధ్రదేశంలో పేరు మోసిన పెద్ద ఏక్టరు. చాలా నాటకాలు వేసి పెద్దవాళ్ళ ప్రశంసల్ని బహుమతుల్ని సంపాదించుకున్నారు. క్రిందటేడు ఢిల్లీలో ఓ నాటకం వేసినప్పుడు అక్కడి ఆంధ్రులు ఘనంగా సన్మానించి 'నాట్యశేఖర' బిరుదుకూడా యిచ్చారు. ఈ మధ్యనే సినిమా ఆఫర్ ఒకటి వచ్చింది” అంది.
ఆమె నన్నలా పరిచయం చెయ్యడం చాలా విచిత్రంగా వుంది. ఇంతవరకూ కనీసం ఒక్క నాటకంలో వేషంకూడా వెయ్యలేదు. అసలు నేను నాటకాలనే చూడను, ఆమె అలా ఎందుకు చెప్పిందో అర్థం కాలేదు. నన్ను భంగపరచడానికేమో అనిపించింది. ఆమె మీద చాలా కోపం వచ్చింది. కోపంతోనే ఆమె ముఖంలోకి చూశాను. కళ్ళతో నవ్వేసి “రండి వెళ్లాం” అని, ఆమె వద్ద సెలవు తీసుకుని బయలుదేరింది.
జూబ్లీ హాలుముందు గడ్గిలోకొచ్చి “కూర్చుందామా” అంది. నమాధానం చెప్పకుండానే కూర్చున్నాను. ఆమెమీది కోపంతో ఏమీ మాట్లాడాలనిపించలేదు.
అయిదు నిమిషాలు ఆమెకూడా మౌనంగా కూర్చుని “ఎల్లా ఉంది పబ్లిక్ గార్డెన్స్?” అంది. ౯
కోపం పట్టలేక “నా కథల్లో ప్రేయసీ ప్రియులు కలుసుకునే స్థలంలా ఉంది” అన్నాను. అమె నవ్వి 'కాదామరి!” అన్నట్టు చూసింది.
చాలా సేపు ఆమె ఆఫీను విషయాలూ, అక్కడి మనుషుల గురించీ చెప్తూ కూర్చుంది. పరధ్యానంగా వింటూ కూర్చున్నాను.
మబ్బులు దట్టంగా ఆకాశానికి ముసుగు కప్పాయి. గాలి చల్లగా వీస్తోంది. అమె తలలో వాడిన దవనం పరిమళం మత్తుగా నా ముఖాన్ని తాకుతోంది.
40 రంగుటిద్దాలు వర్షం వస్తుందేమోనని భయంగా ఉంది. లేచి బయలుదేరాం.
బస్స్టావ్ చేరి బన్సు ఎక్కినతర్వాత అనుకున్నట్టే కుండపోతగా వర్షం ప్రారంభమయింది.
“ఇంకా నయం తడవలేదు” అన్నాను.
“వర్షంలో తడిస్తే ఎంత బావుంటుందో!” అంది వసంత,
“తడవలేకపోయారా?' అందామనుకున్నాను.
ఆమాటే వెనకనుంచి ఎవరో అనేశారు! ఆశ్చర్యంతో యిద్దరమూ వెనక్కు తిరిగాం.
బక్కపలచగ్గా వోరగా ఉన్న ఒకాయన సన్నగా నవ్వుతూ “పబ్లిక్ గార్డెన్స్ నుంచా?” అన్నాడు వసంతను ఉద్దేశించి.
“ఆం... అక్కడనుంచే, మీ భాగ్యలక్ష్మి కనిపించింది-ఒంటరిగా. మీరు యివ్వాళ కలుసుకోలేదా?” ఆంది వసంత.
“లేదు. వేరీ పనుండి కలవడం పడలేదు” అన్నాడతను!
ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అంతగా ఆ సంభాషణ నాకు అర్థంకాలేదు. అర్థం చేనుకున్నదాన్నిబట్టి అది ఓ అమ్మాయి- బహూశా భాగ్యలక్ష్మిమీద జరిగిన సంభాషణ.
ఆమె టొట్టు తీసుకుంది.
రెండు స్టాపుల తర్వాత అతను దిగిపోయాడు.
“అతనెవరూ?' అన్నట్టుగా ఆమెవైపు చూశాను. ..
“ఇందాక గార్డెన్సులో కనిపించిందిగా స్పేహితురాలు-ఆమెకు కాబోయే భర్త, అంటే-ఇద్దరూ (ప్రేమించుకుని పెళ్లి చేసుకోబోతున్నారు. ఇతను అప్పుడప్పుడు రేడియో నాటకాల్లో ప్యాల్గొంటాడు. నాటకాలంటే మహాపిచ్చి” అంది.
అంతకు ముందు స్నేహితురాలుకు నన్నాక పెద్ద ఏక్టరుగా ఎందుకు పరిచయం చేసిందో, అలా చెయ్యడంలో ఆమె అభిప్రాయమేమిటో ఇప్పుడు తెలిసింది. ఆమె మీద నాకు ముందటి కోపం లేదు. నవ్వుకున్నాను.
వర్షం యింకా అలా కురుస్తూనే వుంది.
నేను బస్సులో సంపెంగ పరిమళాలను వెతుకుతున్నాను.
రంగుటద్దాలు శే
“దిగండి' అని ఆమె చెయ్యపట్టుకుని కుదిపేవరకూ నా ఆలోచనలు వసంతవైపు మళ్ళలేదు.
“అదేగా ఇల్లు. ముందు ఇలా రండి, తర్వాత ఆలోచిద్దాం” అంటూ యింటికి దారితీసింది.
చిన్న పిల్లల్లా వరుగెత్తడం యిష్టంలేక సగంనగం తడిని ఆమె ఇంటికి చేరుకున్నాం.
తలుపుతీసి లైటు వేసింది.
ఆమె వర్షంలో ఎందుకు తడవాలనుకున్నదో యిప్పుడు అర్థమైంది. వర్షంలో " తడిసినప్పుడు ఆమె శరీరంలోని భాగాలు, వంపులు మరీ అందంగా కనిపిస్తాయి. ఎగ్జిబిషన్లో పాలరాతి శిల్బం జ్ఞాపకానికొచ్చింది నాకు.
“చాక్కా పూర్తిగా తడిసినట్టుంది. విప్పి ఆరబెట్టండి. ఇప్పుడే వస్తాను” అని ఆమె మరో గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఒకే గదిలో బతికే జీవితాల గతేం కాను?-అనిపించింది నాకు,
పావుగంట తర్వాత ఆమె తలుపులు తీసుకుని వచ్చింది, అరచేతి వెడల్పు నల్ల్గంచుల అరవింద రంగు చీర కట్టుకుంది. పసుపు పూల జాకెట్టు తొడుక్కుంది. తలకూడా దువ్వినట్టే అనిపించింది. ముంగురులు చెదిరి ఎగరడంలేదు.
వచ్చి ఎదురుగా కూర్చుంది.
చీర మడతలు వడ్డచోట చీకట్లు దాగి వెలుతుర్సి వెక్కిరిస్తున్నాయి. సన్నని ఒంటిపేట గొలుసు చీర అంచులో కరిగిపోయింది. జాకెట్టు పూల పరిమళంలా ఉఊండిఉండి దవనం గుష్టుమంటోంది?
“అన్నట్టు వాసమూర్తి పెళ్ళట, శుభలేఖ పంపించాడు” అంటూ టేబిలు మీది కవరు తెచ్చి చేతికిచ్చింది.
లేఖలో పెళ్ళికూతురి పేరు వెతుకుతున్నాను నేను.
“అ మధ్య హైదరాబాదు వచ్చినప్పుడే సంబంధం స్థిరపడిందని చెప్పాడు. విశేషమేమిటంటే మరో ఏడాదిపోతేగాని అప్పుడే పెళ్ళిచేసుకోనన్నవాడు రెండు నెలలు తిరక్కుండానే శుభలేఖ పంపించాడు” అంది తిరిగి వసంత.
శి లంగుటద్దాలు నవ్వుతోంది.
ఆ నవ్వులో అసూయను వెతికి అలసి తల వంచుకున్నాను.
వాసమూర్తికి 'పెళ్ళయితే తను బాధపడదేమిటి చెప్మా అనిపించింది నాకు. పదిమందిలో వాసమూర్తి కూడా ఒకడు-అని చెప్పుకుని తృప్తి పడ్డాను.
“మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు?”
ఆ ప్రశ్న ఆమె వేస్తుందని నాకు తెలుసు. అభిమానం వ్యక్తంచేసే ప్రీ ముందు నుంచుని మాట్టాడుతున్నవ్పుడు పెళ్ళికాని ఏ వురుషుడూ ఈ వ్రశ్ననుంచి తప్పించుకోలేడు. /
“పెళ్ళాన్ని భరించగలిగేప్పుడు” అన్నాను.
నవ్వుతూ మెలికలు తిరిగిపోయింది ఆమె. ఆ వంపుల్లో దీపం వెలుతురు చీకట్లను చీల్చుకుని, కరిగి, క్షణం సేపు మేఘాలమధ్య మెరుపులా జిగేల్మంది.
“మిమ్మల్ని భరించే పెళ్ళాం అక్కర్లేదన్నమాట?” అంది. అని పకపకా నవ్వుతోంది.
ఇంత పచ్చిగా మాట్లాడే స్రీ ముందు ఎలా కూర్చోనూ?
నా భావాన్ని పసిగట్టినట్టంది. “అంటే ఉద్యోగంచేసే పెళ్ళాం అక్కర్లేదా మీకు?” అంది తిరిగి.
నేనేమీ మాట్లాడలేదు. ఆమె తెలివికి లోలోపల నవ్వుకున్నాను.
వనిపిల్ల వర్షంలో తడిసి కేరియరు తెచ్చింది. నన్ను కూడా భోజనం చెయ్యమంది. చేసేవరకూ ఊరుకోలేదు.
భోజనం అయినతర్వాత వర్షం ఎప్పుడు వెలిసిపోతుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నాను. పది దాటింది. అయినా వర్షం తగ్గినట్టనిపించలేదు. సగం సగం తడీసయినా రిక్షాలో వెళ్ళిపోదామని లేచాను
“వర్షంలో ఏం వెళతారు, కూర్చోండి” అంది. మరో గంట కూర్చున్నాను.
వర్షం తగ్గినట్టేతగ్గి తిరిగి కుండపోతగా కురుస్తోంది.
“పోనీ యీ రాత్రికి యిక్కడే వుండిపోండి, ఉదయం లేచి వెళ్ళుదురుగాని”
అంది.
“ఇక్కడా!” అన్నాను అప్రయత్నంగానే,
“ఏం, భయమా?”
రంగుటద్దాలు శ్రా
ఆ 'భయం' అనేది ఏ పదానికి అర్థంగా వాడిందో ఊహించుకోగలిగాను. అసలు నేనలా అనకుండా ఉండాల్సింది.
“నాగురించి మిత్రుడు ఎదురు చూస్తుంటాడు” అన్నాను.
“ఫరవాలేదు, ఆడదికాదుగా. ఆడదైతే నేనేమీ అభ్యతరం చెప్పను. కళ్ళల్లో వత్తులుంచుకుని కావలసిన వ్యక్తి గురించి సంవత్సరాలు, యుగాలు నిరీక్షించే శి ఒక్క సీకే ఉంది. అలాంటివారిని నేనేమీ బాధించను” అంది వసంత.
ఇంత అర్థవంతంగా మాట్టాడే శక్తి ఆమెకు చిన్నప్పటినుంచీ ఉన్నదే. అలామాట్లాడ గలిగేవారు లెక్కపెడితే ఎంతమంది ఉంటారు!?
మనసులో కుతూహలంగా ఉంది. అభ్యంతరం చేప్తూనే ఉండిపోయాను.
ముందు గదిలో నాకు పక్క వేసింది, తాను రోజూ నిద్రపోయే మంచంమీద. అవతలిగదిలో తను వేసుకుంది. మంచినీళ్ళవీ పెట్టి వెళ్ళిపోయింది.
తలుపులు వేసుకోలేదు.
మధ్య నీలంరంగు కర్చెను అప్పుడప్పుడు చల్లగాలికి సిగ్గుపడి దగ్గరకు ముడుచు కొంటోంది.
దీపం ఆర్చి మంచం మీదకు వాలాను. తలగడమీద నలిగిన వింత పరిమళాలు తేనెటీగల్లా చెదిరి చుట్టూ ఎగురుతున్నాయి. పక్క గదిలోంచి అప్పుడప్పుడు గాజులు కదిలిన శబ్దం వినిపిస్తోంది.
నిద్ర వస్తోన్నా బలవంతంగా ఆపుకున్నాను. ఎప్పుడో మధ్య రాత్రిలో ఆమె నాదగ్గరకు వస్తుందని నాకు తెలుసు. అలానే మేలుకొని ఉన్నాను-గడియారపు చప్పుద్నీ ఆమె కదలికలోని ప్రతి శబ్బాన్నీ, సిగ్గుతో మూసుకొనిపోతున్న కర్చెను రెపరెపల్నీ ఆలకిస్తూ,
తెల్లవారినట్టు కాకులు అరున్తున్నాయి కాని ఆమె రాలేదు.
ఉదయం స్నానం అదీ అక్కడే చేసి, అమె యిచ్చిన టిఫిను, కాఫీ పూర్తిచేసి వెళ్ళిపోతున్నానని చెప్పి బయలుదేరాను.
వసంత గుమ్మంవరకూ వచ్చి“రచయితకదా మీరు. అనుకోకుండా మీ జీవితంలో ఒక అధ్యాయాన్ని అయిపోయాను. ఎప్పడయినా ఖాళీగా ఉన్నప్పుడు ఆ అధ్యాయాన్ని ఒకమారు చదువుకుని ఉత్తరాలు వ్రాస్తూ ఉండండి” అంది.
“అలానే” అని బయలుదేరాను. దారి తెలియని బాటల్లోంచి అలా నడిచి
వెళ్ళిపోతున్నాను.
శశ రంగుటద్దాలు తెలివి వచ్చేసింది. కన్నాజీరావు భుజంపట్టి కుదుపుతూ ఇంటికి వెళ్ళి నిద్రపోదువుగానిలే, ఊరువచ్చేసింది. పక్క స్టేషనే” అంటున్నాడు. లేచి గబగబా బెడ్డింగు సర్దుకుని, సామానంతా ఒక దగ్గరకు చేర్చుకుని కూర్చున్నాను. కన్నాజీరావు నిశ్చలంగా నావైపే చూస్తున్నాడు. బండి బెటర్ సిగ్బల్ని దొటింది, “హైదరాబాదులో వసంతను కలుసుకున్నాను. ఒక రోజుల్లా కూడాఉండి ఊరంతా చూపించింది” అన్నాను. “అతను ఆశ్చర్యపోయాడు. “మొదట్లో అడిగితే కలుసుకోలేదన్నావేం?” అన్నాడు, నాకెందుళో నిజం చెప్పాలనిపించలేదు. నవ్వి ఊరుకున్నాను. “అయితే నిన్నూ ఓ ఆట ఆడించిందన్నమాట!” అన్నాడు అదోలా నవ్వుతూ, నా మనస్సు చివుక్కుమంది. స్వార్థంతో అబద్ధం ఆడి వసంతను మరీ చెడ్డదానిలా చేస్తున్నాననిపించింది. నిజానికి ఆమెను అంత చెడుగా సృష్టించడం అసలు నా ఉద్దేశం కానేకాదు. వసంత విషయంలో చాలా పొరపాటు చేశాను నేను. పరిమితమైన భావాలతో వనంతను సరిగా అర్థంచేసుకోలేక మొదట్లో మీ అందరితో “వనంత కనిపించిన మగవాళ్ళందరి జీవితాలతోటీ నరదాగా చెలగాటమాడుతుంద ని చెప్పి నమ్మించాన్సు, మీ కళ్లకు రంగుటద్దాలు తగిలించి, ఆ అద్దాల్లోంచి, ఆమెను చూడమన్నాను. ఆమెన్స సరిగా అర్థంచేసుకోకపోవడం అది నా అల్బత్వం. నా అల్బత్వం కారణంగా మీ అందరితోటీ ఆమెను చెడుగా ఊహింపచెయ్యడం నా కిష్చ్టంలేదు. కన్నాజీరావు, వానమూర్తి, నేను-ఎవరమూ ఆమెను నరిగా ఆర్థంచేసుకోలేదు. కన్నాజీరావు, ఆమె తన జీవితంతో చెలగాటం అడిందని అనుకోవడంలో అర్థంలేదు. ఎప్పుడూ ఆమె అతన్ని ప్రేమించలేదు. తన అవసరాల్ని తీర్చుకోడానిక్రి ఒక వన్తువుగా అతన్ని ఉపయోగించుకుంది. చిన్నప్పుడు గుగ్రబ్బండి ఆటలో, పెద్దయినతర్వాత బొమ్మలు నోట్సులు రాయించడంలో, ఆ తర్వాత మగాళ్ళకు తన గొప్పతనాన్ని తెలియజేయడంలో ఆమె ఆధిక్యత వ్యక్తపడుతూనే ఉంది. తనంతతానుగా
రంగుటద్దాలు శీర్ ఆ విషయాన్ని చెప్తేగాని అతను గుర్తించలేకపోయాడు. ఆమె, తనముఖంమీద ఆ విషయం చెప్పిందని ఆమెను కన్నాజీరావు తప్పుపట్టడం మంచిపని కాదు.
వాసమూర్తిని ఆమె మొదట్లో ఏడిపించి, ఆ తర్వాత అతని సహాయాన్ని పాంది, అతనికి కృతజ్ఞత చూపించడంలో ఆశ్చర్యంలేదు.. నాతో సన్నిహితంగా, సరదాగా తిరిగినట్టుగానే అతనితోనూ తిరిగిందని ఎందుకనుకోకూడదు? ఆమెను అర్ధంచేసుకోలేక కన్నాజీరావు రంగుటద్దాల్లోంచి చూపించాడు నాకు. అలానే చూశాను నేను.
బండి స్టేషన్లోకొచ్చి ఆగింది.
సామాన్గు పోర్టరు నెత్తికెత్తి వెళ్ళిపోతూ “వనంతను మనం సరిగా అర్థంచేసుకోలేదోయ్. నువ్వూ, నేనూ, వాసమూర్తీ అంతా ఆమెను అర్థంచేసుకోవడంలో పొరపాటు పడ్డాం. ఆమె చాలా మంచిది” అన్నాను.
అతను క్షణంసేపు విచిత్రంగా నావైపు చూసి పకపకా నవ్వేశాడు. నేనేమీ మాట్లాడదలచుకోలేదు. అతను ఎందుకు నవ్వాడో నాకు తెలుసు. కాని, నేను మీకు చెప్పను.
9
మృత్యువు నవ్వుతోంది
మౌ వీగ్రాజుని శానిటోరియంలో చేర్చించారనే వార్త చాలా భయాన్నీ బాధనీ కలిగించింది. అతనికి ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడుతున్న నాకు, యీ వార్త తెలిసినతరువాత, అతని మీద జాలేసింది.
మా కొమేళ్యరికి అతను ఏదో దూరపు చుట్టం. వరసకు మరిది అవుతాడు. బంధుత్వంకన్న స్నేహమే ఎక్కువ. రెండు మూడు ఆదివారాలకు ఒకసారి వచ్చి ఒకటీ రెండు గంటలు పిచ్చాపాటీ మాట్టాడి వెళ్ళిపోతుంటాడు.
నెలా పదిహేను రోజులుగా అతను కనిపించకపోయేసరికి ఒకరోజు కామేశ్వంని అడిగాను.
ఇవ్వాళ కామేశ్వరి భోజనం వడ్డిస్తున్నపుడు చెప్పింది. “వీర్రాజుని శానిటోరి యంలో చేర్చించారుటండీ. ఓసారి వెళ్ళి చూసిరాగూడదూ” అని.
ఆ తర్వాత అవిడే చెప్పింది. అట్టే ప్రమాదమేమీ లేదుటకానీ, ఎడమవైవు ఊపిరితిత్తిలో కొద్దిగా జబ్బు ప్రవేశించిందట. తెలిసిన ఒక డాక్టరు ఎవరో వుంటే దగ్గరుండి చేర్చించారట. నిన్న సాయంకాలం నుబ్రహ్మణ్యంగారు వచ్చినప్పుడు చెప్పారు. ఆయనకుకూడా తెలీదట. ఎవరికీ చెప్పకుండా చేరిపోయి ఆ తర్వాత ఉత్తరం రాశాడట. సాయంకాలం ఆఫీసునుంచి ఒకసారి అలావెళ్ళి చూసిరండి. తర్వాత మనిద్దరం కలిసివెళ్టాం” అంది.
మృత్యువు నవ్వుతోంది శే?
ఆ సాయంకాలం అతన్ని చూసొద్దామని బయలుదేరాను. బన్సులో ఉన్నంతసేపూ మనసు బితుకుబితుకు మంటూనే వుంది, అతన్ని ఎలాంటి స్థితిలో చూడాల్సి వస్తుందో అని.
నెలా పదిహేను రోజుల కిందట అతన్ని చూసినప్పుడు మనిషి బాగానే వున్నాడు. ఆరోజు కామేశ్వరికూడా ఇంట్లోలేదు. వాళ్ళ బాబాయిగారింటికి వెళ్ళింది. మధ్యాహ్నం వచ్చినవాడు, ఆ సాయంకాలంవరకూ వున్నాడు.
“సినిమాకు వెళ్దాం, రండి” అన్నాను.
“వంట్లో బావుండలేదు. మీరు వెళ్ళండి, నేను రాలేను” అన్నాడు.
ఆమాటకు అర్థం ఇంత బలమైనదని అనుకోలేదు" ఆ రోజున,
బన్సుదిగి హాస్పిటలులోకి అడుగుపెట్టగానే గుండె దడదడ లాడింది. హాస్ప్సిటల్లోకి వెళ్ళడం అంటేనే నాకు భయం. విచిత్రమయిన ఆ పరిసరాల వాసనను భరించలేను నేను.
మాలిన్యాన్ని అసహ్యించుకొనే తెల్లటి బట్టల్లోని అమ్మాయిలు, మనిషిలోని జబ్బుల్సీ, పురుగుల్నీతప్ప వ్యక్తిత్వాన్ని అర్థంచేసుకోలేని డాక్టర్లు, చావుబతుకుల సందిట్లో బతకాలనే ఆశ చచ్చిపోని కళ్ళల్లో రాలిపోతున్న వెలుగును ఎగదోసే ప్రయత్నాలు- వీటన్సిటినీ చూస్తూ భరించలేను నేను. వాటికి సన్నిహితంగా వెళ్ళ ప్రయత్నాలు ఎప్పుడూ చేయలేదు.
చాలాకాలంక్రితం ఒకసారి కొద్దిగా జ్వరం వచ్చింది. డాక్టరు ఏదో ఇంజక్షను యిచ్చాడు. అప్పటినుండీ మళ్ళీ ఇంజక్షను ముఖం చూడలేదు. అదంటే నాకు భయం.
లోపలకు వెళ్ళి, రెండు-మూడు వార్డులు వెతికాను కాని లాభం లేకపోయింది. అలాంటివి చాలా వార్డులు వున్నాయక్కడ, మరికాస్పేపు వెతికితే చివరకు అతనువుండే వార్డు దొరికింది.
అక్కడున్న నర్సుని అడిగాను.
“కొత్తగా వచ్చిన అతనేనా?” అని అడిగింది. కొన్ని గుర్తులు చెప్పింది.
“అతనే” అన్నాను.
“సాయంకాలం కదండీ, వాకింగ్‌కు వెళ్ళుంటారు. అతనూ, మరో అబ్బాయీ రోజూ అటువయిపుగా వెళ్ళి ఏ రాతిబండమీదనో కూర్చుంటారట. చీకటి పడిన
తేర రంగుటద్దాలు తర్వాతగాని రారు. ఇలాగే వెళ్ళండి, బహుశా మీకు కనిపించవచ్చు” అంది.
వార్డును ఆనుకుని దూరంగా వేపచెట్ల్టలో కలిసిపోయిన కాలిబాటను చూపించింది.
అక్కడినుండి కదిలి ఆమె చూపించిన వైపుగా బయలుదేరాను. నాలుగడుగులు వేసి వెనక్కుతిరిగి చూస్తే ఆమె అక్కడే నిలబడి నన్నే చూస్తోంది. చూసినతర్వాత దృష్టి మార్చుకోవడం యిష్టంలేక, మళ్ళీ వెనక్కు వచ్చి “ఒక్కవిషయం |! మావాడికి ఎలా వుందండి? పరవాలేదుకదా?” అన్నాను.
ఆమె నవ్వింది.
పరవాలేదులెండి, హేయిగా వున్నాడు. కాలక్షేపానికి నిత్యానందమూర్తి అనే ఓ అబ్బాయి దొరికాడు - వాగుడుకాయ” అంది.
ఆమె మాటలతో ధైర్యాన్ని నింపుకుని, ఆమె చెప్పినవైపుగా బయలుదేరాను.
చుట్టూ చిట్టడవిలా కనిపించినంతమేరా వేవచెట్టు, చెట్ల అడుగున యెక్కడీకక్కడే వంకరటింకర్షుగా కాలిబాటలు, బాటలవక్కనే గడ్జిలోకలిసి విరియబూసిన అడవి చేమంతి- వాటన్నింటినీ దాటుకొని అయిదునిమిషాలు ఆమె చూపించిన వైపు నడవగా, దూరంగా ఓ రాతిబండమీద ఎర్రని నీరెండ వెనక, మనకగా ఎవరో యిద్దరు కూర్చుని కనిపించారు.
దగ్గరకు వెళ్ళాను.
వారే!
పిలిచేవరకూ నన్ను చూడనేలేదు.
చూశాక నవ్వి “మీకెవరు చెప్పారు? ఇంకా నేను ఉత్తరం రాద్దామను కొంటున్నాను” అన్నాడు. ౬
అతన్ని ఎలాగెలాగో చూడబోతున్నట్టు ఊహించుకున్న నేను, అతన్ని చూసినతర్వాత ధైర్యంగా, తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను.
అతనితో మాట్లాడుతున్న అతన్ని నాకు పరిచయం చేశాడు. తన వక్క మంచమేనట అతనిదీనూ, పేరు నిత్యానందమూర్తి అట.
ఈ నిత్యానందమూర్తినే అంతకు ముందు నర్సు 'అబ్బాయి' అని అనడం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఇంచుమించు పాతికేళ్ళుంటాయి. ఆ నర్భుకన్నా
మృత్యువు నవ్వుతోంది 49 కనీసం ఆరేడేళ్ళు అయినా పెద్దవాడు కొవచ్చు. అలాంటి వ్యక్తిని అమాంతం ఓ చిన్న పిల్లవాడిలా జమకట్టి 'అబ్బాయి' అని అనడం అదోలా అనిపించింది నాకు. బహుశా నర్ఫులు వయనుకు, (ప్రేమలకు అతీశులేమో.
“ఎలావుంది యిక్కడ మీకు?” అన్నాను.
“ఫరవాలేదు. ప్రకృతీ పరిసరాలూ అందమైనవి. బజంటరితనాన్ని నెట్టివేసే మిత్రులు ఏర్పడ్డారు. హాస్పిటల్ అనే విషయం మర్చిపోతే చాలా ఆహ్లాదకరమైన జీవితం. కాని హాస్పిటలు అనీ మర్చిపోవడంమాత్రం ఎవరికీ సాధ్యంకాదు” అన్నాడు వీర్రాజు.
అతను చెప్పింది యధార్థమే అనిపించింది నాకు. హాస్పిటలు దాటి ఫర్జాంగు దూరం నడిస్తే విశాలమైన మైదానం. మైదానానికి అవల వరుసలు తీర్చిన కొండలు, కొండల దిగువనా మైదానంలోనూ అక్కడక్కడ బయటకు పొడుచుకొచ్చిన బండరాళ్ళు- వీటన్నిటిమధ్యా నీరెండ కురిసిన సాయంకాలాలూ, మంచులో తడిసిన ఉదయాలూ ఎంత అందంగా అలంకరించుకుంటాయి యిక్కడ!
ఇల్లాంటి ప్రకృతిలో నన్ను పడేస్తే పిచ్చిగా కథలు రాసుకుంటూ ఎప్పటికీ యిక్కడే వుండిపోతాను.
“మిమ్మల్ని చూస్తే చాలా అసూయగా వుంది” అన్నాను.
వీర్రాజు నవ్వాడు.
“నిజమే. ఈ ప్రకృతిని చూస్తే మీలాంటి కథకులకు అలాగే అనిపిస్తుంది. నిత్యం తుషారబిందువులు రాలే మృత్యుచ్భ్చాయల శీతల సమాధి యిది. ఈ సమాధిలో ఎన్ని జీవితాలు నెలలకొలదీ చీకట్లో కూరుకుపోయాయో, యింకా ఎన్ని అలాంటివి వందలు, వేల నంఖ్యలో జరగబోతాయో ఆలోచించడం మానేస్తే ఈ ప్రదేశాన్ని నేనూ (ేమించేవాడిని. కాని అలా ఆలోచించకుండా వుండడం నాకు సాధ్యంకావడం లేదు” అన్నాడు. ౦
ముగ్గురం చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం,
అకాశంలో శిక్షణకయి ఎగురుతోన్న విమానాలు దీపాల్ని వెలిగించుకొని తిరుగుతున్నాయి. కాస్త దూరంలో పాడయిపోయిన మిలట్రీ బేరక్సులో మొలిచిన తుప్పల్లో ఏదో పక్షి తీతువులా భయంకరంగా అరచి పారిపోయింది. కొండకావల జూడవిలోంచి కద్టెల్ని తెచ్చుకుంటున్న ఇద్దరు లంబాడీ స్రీలు నిళ్ళ్శబ్దపు చీకట్లో భయంకరంగా కదిలి వెళ్ళిపోయారు.
త్0 రంగుటద్దాలు
“వెళ్ళిపోదామా?” అన్నాను, ఇద్దరివైపు చూసి.
“కూర్చోండి. ఆత్మీయుల అభిమానానికీ, ప్రేమకూ దూరమయిన మాకు మీలాంటి అప్పుల రాకలే కొండంత ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మీతో గడిపిన ఈ కొద్దిపాటి నిమిషాలే రాత్రి నిద్రపోబోతూ మధురంగా ఆలోచించుకోవడానికీ, భయంకరమైన ఈ వాతావరణపు అలోచనల్సుండి తప్పించుకోవడానికీ, కలలు కనడానికీ కారణాలవు తాయి, మీరు వెళ్ళిపోతే మళ్ళీ మాకు మామూలు జీవితం - కాఫ్ మిక్చర్... వార్డ్బోయ్! --= ఫ్రైప్టామైసిన్.... సిస్టర్...! .... బ్రోమైడ్... డాక్టర్! - ఇదీ ఇక్కడి జీవితం”- అన్నాడు నిత్యానందమూర్తి.
ఆతని కళ్ళల్లో రాత్రి వెలిగించిన ఆకాశదీపాల మసక వెలుతురు మెరిసినట్టని పించింది. అతని కంఠంలో అంతవరకూ ఉరు కులెత్తిన ఉత్సాహప్పు పొంగు అణగారిపోయి శివరంజనీ స్వరాలు కదలినట్టనిపించాయి.
ఎవరూ మాట్లాడ్డంలేదు. ప్రకృతీ, పరిసరాలూ నిశ్శబ్దంగా వున్నాయి. అప్పుడప్పుడు శిక్షణకని ప్రదక్షిణ చేస్తోన్న విమానం, ఉండి ఉండి భయంకరంగా శబ్దం చేసుకొంటూ పోతోంది. చీకటిలో దాని ఎర్రటి, పచ్చటి దీపాలు రెక్కల్లో రంగుల్ని నింపుతున్నాయి. ఎదురుగా దూరంలోని నల్లటి కొండలు, ఆపైని ముదురు నీలమూ, నలుపూ కలిసిన రంగులో తెలుపు పడి పాలిపోయినట్టు ఆకాశం, కింద పలుచని చీకట్లో ఏడురంగులూ కలిసి ఏ రంగూ తెలీనట్టున్న మైదానం - చూస్తుండగానే పొవుగంట మౌనంగా గడీచిపోయింది.
“ఎప్పుడన్నా ఉదయంపూట రండి, అలా కొండల మీదకు వెళ్ళి వద్దాం” అన్నాడు - నిత్యానందమూర్తి,
కొండలంటే చాలా యిష్టం నాకు. కొండపైన ఎత్తైన రాతి పలకమీద వెల్లకిలా పడుకుని ఆకాశంలోకి చూస్తూ ఎంతసేపయినా ఉండివోగలను.
మరికాసేపు కూర్చుని ముగ్గురమూ లేచి చీకట్లో కరిగి వోస్పిటలుకు బయలుదేరాం.
హాస్పిటలు చెట్ల గుబురుల్లో తెల్లగా వెలిగిపోతోంది. నిశ్శబ్దంగా పరిసరాలు నిద్రపోతున్నాయి. ,
“అన్నట్టు మేం ఈ రాతిబండమీద వున్నట్టు ఎవరు చెప్పారు?” అన్నాడు వీర్రాజు.
మృత్యువు నవ్వుతోంది జలే “వార్డులో వున్న నర్సు చెప్పింది” అన్నాను. “ఎవరూ, ఆగ్నేసా?” అన్నాడు నిత్యానందమూర్తి. “ఏమో, ఆమె పేరు నాకెలా తెలుస్తుంది. సన్నగా, చామన ఛాయలో వుంది” అన్నాను. నిత్యానందమూర్తి మెల్లగా నవ్వుకొని “ఇంకెవరూ ఆగ్నేసే. ఇంకా ఏమన్నా చెప్పిందా మా గురించి?” అన్నాడు. అతన్ని ఓ చిన్నపిల్లాడిగా, వాగుడుకాయగా నా ముందు నిలుచో బెట్టిందని చెప్పి అతన్ని చిన్నబోయేట్టు చేయడం నాకిష్టంలేదు. __ “ఇంకేమీ చెప్పలేదు. మావాడికి కాలక్షేపంగా మంచి మిత్రుడొకడు దొరికాడని మాత్రం అంది” అన్నాను. అతను ముసిముసిగా నవ్వుకున్నాడు. హాస్పిటలు దగ్గరకు వచ్చిన తర్వాత తనలో తనే మళ్ళీ మరొకమారు నవ్వుకొని “భలేమనిషి!” అన్నాడు అప్పష్టంగా. “ఎవరూ? 'అన్నట్టుగా నిత్యానందమూర్తివైపు చూశాను. అతనేమీ మాట్లాడలేదు. వీర్రాజు యిదేమీ గమనించకుండా నడుస్తున్నాడు. వార్డులోకి వెళ్ళేసరికి నర్సు వాళ్ళగురించే ఎదురుచూన్తున్నట్టుగా గుమ్మంవద్దే నిలబడివుంది.
_ “ఇంతసేపూ చలిలో యెక్కడ తిరుగుతున్నారు? చలికి రొంపచేసి తలనాప్పి వస్తే మళ్ళీ సిస్టర్లని సతాయిన్తుంటారా-ఎ.పి.సి పొడరు కావాలి, అది కావాలి, యిది కావాలని, ఉదయం డాక్టరు రానీయండి- చెప్తాను. ఆ కొత్తాయన మంచం మీదనుండి కదిలేవాడుకాదు . ఈ నిత్యానందమూర్తి చెరి ఆయన్నుకూడా చెరుస్తున్నాడు” అంది.
ఆమె మాటలు మరీ ముద్దగా, ఏనగా వున్నాయి.ఆ ఏసలేకపోతే మరోసారి ఆమె కంఠం విందామనిపిస్తుంది.
“భోజనాలు వేరే తీసి ఉంచాను. వెళ్ళి భోంచెయ్యండి. రోజూ యిదోపని అయిపోయింది నాకు” అంటూ గొణుక్కుని లోపలకు వెళ్ళిపోయింది ఆమె.
నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత చిరబురలాడే మనుషులు నర్సులుగా పనికిరారు. రోగులతో కలిసిమెలిసి నవ్వుతూ, నవ్విస్తూ బాధల్ని మరిపింపజేయాలిగాని
క్ రంగుటద్దాలు యిలా అధికారం చెలాయించడం, మాటిమాటికీ విసుక్కోవడం మంచిపనికాదు. ఆప్పుల పరిచర్యలకు, (ప్రేమలకు దూరమయిన వ్యక్తులకు తమ సేవలతో ఉత్సాహాన్నీ బతుకుమీద ఆశనూ కలిగించాలి. తమ దురదృష్టాన్ని తలంచుకొని వారు బాధపడకుండా చేయాలి. వైద్యశాస్త్రం ఎంత బలమైనదైనా మానసిక ఆనందమూ, తృప్తీ లేనిదే ఏ మందూ పనిచెయ్యదు, అందులోనూ టి.బి.లాంటి భయంకరవ్యాధి నివారణ మానసిక శాంతి, గుండె నిబ్బరంమీద ఎక్కువగా ఆధారపడి వుంటుంది.
ఆ నర్చుమీద నాకు చాలా కోపంవచ్చింది.
అయినా ఏమీ చేయలేక వెళ్ళిపోతున్నప్పుడు కొరకొరా ఆమెవంక చూసి వెళ్ళిపోయాను. నేను అలా కోపంగా చూడడం ఆమె చూసింది. నేను వెళ్ళిపోయాక ఆమె నవ్వుకున్నదేమో నాకు తెలీదు.
పదిహేను రోజుల వరకూ మళ్ళీ అటు వెళ్ళలేదు. ఎప్పటికప్పుడు కామేశ్వరిని తీసుకుని వెళ్దాం అనుకుంటూనే ఏదో ఆటంకం వచ్చి వెళ్ళడం పడలేదు. చివరకు నేను ఒక్కడ్నే ఓ ఆదివారం బయలుదేరాను.
ఉదయంపూట కాస్త తీరిగ్గా కూర్చుని పుస్తకం చదువుకొంటున్నాడు వీర్రాజు. నిత్యానందమూర్తీ, మరో యిద్దరూ విడిగా కూర్చుని పేక అడుతున్నారు. నన్ను చూసి పేక అపేసి వచ్చాడు నిత్యానందమూర్తి.
“ఆదివారం డౌక్టర్ల రౌండ్చు ఊండవు. ఏమీతోచక పేక ఆడుతూ కూర్చు న్నాను” అన్నాడు.
వీర్రాజు బట్టలు వేనుకున్నాడు, అలా కొండలమీదకు వెళ్ళివద్దామని. నిత్యానందమూర్తికూడా బయలుదేరాడు.
“పొద్దుటే ఎక్కడకు బయలుదేరారు?” అంది ఆగ్నేసు డ్యూటీరూం బయట నుంచొని. ౧
“కొండలమీదకు వెళ్ళివద్దామని”
“వెళ్ళండి, మీమీద రిపోర్సు రానిపెడతాను.ఇలా యిన్చంవచ్చినట్ను తిరగడానికేమిటి హాస్పిటల్లో చేరింది. అంతగా వెళ్ళాలనుకుంటేసాయంకాలం వెళ్ళండి, వాకింగ్ అవర్స్‌లో” అంది ఆమె.
“పోనీలెండి. ఇక్కడే కూర్చుని మాట్లాడుకుందాం” అన్నాను నేను.
“భలేవారే! ఆమె కోప్పడుతోందనా. అదేమీలేదులెండి. కోపం వున్నచోట
మృత్యువు నవ్వుతోంది 53 అభిమానమూ, (్రేమా తప్పకుండా వుండివుంటాయి. కావలసినవారు కానిపని చేస్తున్నారంటే కోపం రావడం అసహజమేమీ కాదులెండి” అన్నాడు నిత్యానందమూర్తి వెనక్కుతిరిగి ఆమె వైపు చూస్తూ,
అవా మారుమాట్టాడ కుండా లోపలికి వెళ్ళిపోయింది. ముగ్గురమూ బయలుదేరాం.
అర్థగంట నడిచి కొండ అంచు చేరుకున్నాం. కొండ దిగువన, కొండ మధ్య అక్కడ అన్నీ గడ్డిదుబ్బులే.
ఆ గడ్డిదుబ్బుల్ని తప్పించుకొని, రాళ్ళను దాటుక్సుని కొండ అంచుల మీదుగా శిఖరాన్ని చేరుకున్నాం. అదోరకమైన అనుభవం.
అక్కడనుండి చూస్తే చుట్టూ వరసగా నిలబడిన కొండలు ఒకవైపు, దూరంగా చెట్లలో దాగిన హాస్పిటలు మరోవైపు, కొండల్గోంచి దూసుకొనిపోతున్న రైలు పాగ, యింకా దూరంగా ఏరోడ్రోములో రెక్కల్ని చాచుకుని ఎగురుతోన్న విమానాలు, అన్నింటినీ విస్తరించి తలమీదకు వంగిన విశాలమైన ఆకాశం-ఇల్లాంటి అందం అందరికీ లభ్యంకాదు.
“పట్టణంలో ఇల్గాంటి పల్లెటూరి అందం కొనుక్కోవాలంటే ఎంత తగ లెయ్యాలి” అనేవాడు తరచుగా కేశవరావు, ఇల్లాంటి అందాన్ని చూసినప్పుడల్లా.
వీర్రాజు నిటారుగావున్న కొండ అంచుచివర నుంచుని “ఇల్లాంటి అందమైన ప్రదేశంలో చావురావడంకూడా ఓ అదృష్టమే అనిపిస్తుంది నాకు” అన్నాడు.
నాకెందుకో భయం వేసింది. అతన్ని వెంటబెట్టుకుని కొండమీదకు వెళ్ళిపోయాను.
ఆ కొండమీద హనుమంతుడి విగ్రహం ప్రతిష్టించి వుంది. దాని వెనక రెండు నీటిగుండాలు వున్నాయి. గుండొలను ఆనుకుని పెద్ద రాతిబండ వుంది. ముగ్గురమూ వెళ్ళి దాని నీడలో కూర్చున్నాం.
“అందమయిన సాయంకాలాలు నిరర్ధకంగా ఈ కొండల్లో ఎన్ని ఎర్రగామండి, నల్లని నుసిగా రాలిపోతున్నాయో” అన్నాడు వీర్రాజు.
నాకూ అలానే అనిపించింది. నా జీవితమంతా నాగరికత నిర్మించిన కృత్రిమ తెరల మధ్యనే గడిచిపోయింది. ఎప్పుడయినా యిలా నగ్నంగా ప్రకృతిని చూసినప్పుడు, ఆ అందాన్ని నేను అనుభవించలేక పోతున్నానన్న బాధ కలిగి, మనసు అసంతృప్తితో నిండిపోతుంది.
ల్జే రంగుటిద్దాలు
చాలా సేపు కూర్చుని మాట్లాడుకున్నాం. హాస్పిటల్, నర్సులు, విమానాలు, ప్రయాణాలు, ఆఖరిగా కొండల్లో సినిమా షూటింగులు-ఎన్నెన్నో ఆ మాటల్లో దొర్లిపోయాయి.
సూర్యుడు కొండల మీదుగా ధనుస్సులా ఒంగుతున్నాడు. మబ్బు తునకలు అప్పుడప్పుడు పిసినారిలా వెలుతుర్ని దాచేసుకుంటున్నాయి. అందమైన లేండ్స్కేప్ చట్రాల్లోకి ఒకటీ రెండు పక్షులు తొంగిచూసి పారిపోతున్నాయి,
“ఇక వెళ్ళిపోదామా, నర్ఫుకూడా కోప్పడుతుందేమో మిమ్మల్ని. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది” అన్నాను లేచి నుంచుంటూ. నిజానికి నాకుకూడా వేరే పని వుంది. ,
“కోపం ఏమీకాదు లెండి. అది అనసూయ” అన్నాడు నిత్యానందమూర్తి.
ఇద్దరూ లేచి నుంచున్నారు.
మెల్లగా కొండ దిగుతున్నాం.
కొండ పగుల్లోనూ, కొండ దిగువ తుప్పల్గోనూ ఎక్కడబడితే అక్కడ నిండుగా గొబ్బిపూలు పూసి వున్నాయి. నిత్యానందమూర్తి దోసిలి మేరకు పూలను కోసుకున్నాడు.
మౌనంగా మైదానంలోంచి నడున్తున్నాం, నేలమీద నిటాగ్గా నిలుచున్న గడ్జీచేమంతి తలలు పాదాలకేసి కొట్టుకొని దూరంగా ఎగిరివడుతున్నాయి. మైసూరునుంచి విద్యుచ్చక్తి మోసుకొచ్చే తీగలమీద రెండు పాలపిట్టలు దగ్గరగా కూర్చుని మాట్లాడుకుంటూ అలికిడిని విని పారిపోయాయి.
“ఆడవాళ్ళకు అసూయ ఎంత వేగంగా కలుగుతుందో చూశారా!” అన్నాడు నిత్యానందమూర్తి ఆకస్మాత్తుగా నిళ్ళబ్దాన్ని నెట్టేస్తూ.
“ఏమిటి?” అన్నట్టుగా చూశాను అతనివైపు.
“కొత్తగా మా వార్డుకు స్టూడెంటు నర్సు ఒక అమ్మాయి వచ్చింది. ఆమెతో సరదాగా మాట్లాడుతుంటే ఆగ్నేసుకు కోపం. నాతో మాట్లాడుతుంటే ఏదో పనిచెప్పి తీసుకుపోతుంది ఆమెను. ఇదంతా ఏమిటంటారు?” అన్నాడు.
నాకు ఏమని అనడానికీ తోచలేదు. అతనే తిరిగి చెప్పాడు.
“అగ్నేసు భలే అల్లరి చేస్తోందిలెండి. ఉత్తరాలు వస్తే యివ్వకుండా దాచేసి ఏడిపించడం, కళ్లతోనే మాట్లాడడం, వ్యంగ్యంగా సమాధానాలు యివ్వడం, లాకరుమీది పుస్తకాలు తెలీకుండా తీసుకుపోవడం-ఇవన్నీ చూస్తే మనసు పిచ్చెత్తిపోతోంది” అన్నాడు.
మృత్యువు నవ్వుతోంది ల్ల్
నిత్యానందమూర్తి ఏ విషయాన్ని తెలియజేయడానికి ఇదంతా చెప్పుకొచ్చాడో ఆ విషయం నాకు అర్థమయ్యింది ఆగ్నేసు అతన్ని (ప్రేమిస్తోందేమోనని అతని ఊహ.
అంతవరకూ అతన్ని ఓ చిన్న కుర్రాడికింద జమకట్టి అధికారం చెలాయించిన ఆమె, అతన్ని (పేమిస్తుందని అనుకోలేకపోతున్నాను.
నరులు సాధారణంగా (ప్రేమల్ని వెతుక్కుంటూ పోతుండడం ఆశ్చర్యమేమీ కాదు పరిసరాలు, పరిస్థితులు అందుకు దోహదం చేస్తాయి. రోజులో ఎక్కువ భాగం వాళ్ళ జీవితం రోగులు, రోగాలు, మందులు-వీటిమధ్యే గడిచిపోతుంది. వాళ్ళదంతా ఓ లోకం. బాధల జీవితాలమధ్య తిరుగాడుతూ, నటిస్తూ వాట్టికి అతీతంగా వుండిపోవాలి. అలా వుండిపోవాలీ అంటే తేలికయిన ఉత్సాహాన్ని వెతుక్కోవాలి. అందుకు అందుబాటులో వున్నది గ్రేమ ఒక్కటే అ (పేమకై వాళ్ళు వరుగులెత్తడం ఆశ్చర్యకరమైనద్కీ వింతయినదీ కానేకాదు.
అయినా ఆగ్నేసు నిత్యానందమూర్తిని (ప్రేమిస్తోందని అనుకోలేకపోతున్నాను. భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి అతను. అతన్ని (ప్రేమించడమనేది అతని జీవితంతో చెలగాటం ఆడడమే అవుతుంది. రోగుల సేవకై నియమింపబడిన ఆమెకు ఈ విషయం తెలియదని అనుకోలేం.
హాస్పిటలు చేరుకున్నాం.
ఆగ్నేను డ్యూటీరూంలో కూర్చుని మరొక మేల్ నర్చుతో నవ్వుతూ మాట్లాడుతోంది. మేం రావడంచూసి, పగలబడి నవ్వుతున్న నవ్వుని ఆపుకుని “చూసొచ్చారా, రాళ్ళనీ రప్పల్నీ "అంది.
ఆమె వ్యంగ్యంగా అన్నా, నిజానికి ఆ కొండల్లో ఆమెకు కనిపించేవి రాళ్ళూ రప్పలే! కళాదృష్టి యిలాంటి వ్యక్తులకు వుంటుందని అనుకోవడం పొరపాటే అవుతుంది. మరీ తక్కువ ఆలోచనల మనుషులు! సంగీతం వీళ్ళకు అక్కర్లేదు. సాహిత్యం అర్ధంకాదు. మిగిలిన రెండు లలిత కళల గురించీ అసలు వారెప్పుడూ ఆలోచించనైనా ఆలోచించరు. వాళ్ళ దృష్టిలో సంగీతమంటే సినిమా పాటలు పాడడమూ, ఏ హార్మనీయో బుల్బులో వాయించడమూనూ. కవిత్వం (ప్రేమలేఖలవరకే వీళ్ళకు పరిమితం. ఇల్లాంటి వ్యక్తులు కొండల్లో రాళ్ళనీ రప్పల్నీ, అడవుల్లో ఆకుల్నీ కొమ్మల్నీ తప్ప ఇంకేమీ చూడలేరు.
నాకు వేరే పనుండి వాళ్ళిద్దరి దగ్గరా సెలవు తీసుకొని వెళ్ళిపోయాను,
ఆ సాయంకాలం కామేశ్వరీ, నేనూ పల్లిక్ గార్డెన్స్‌కు వెళ్ళివస్తోంటే ఆగ్నేసు
త్ర్ రంగుటద్దాలు కనిపించింది. నలుగురమ్మాయిలు-ఇంచుమించు అదే వయసు వారితో కలిసి బస్‌స్టాపులో బస్సు గురించి ఎదురుచూస్తూ నుంచుంది. వెంటనే ఆగ్నేసును గుర్తుపట్టలేకపోయాను. నన్ను చూపించి పక్కనున్న స్నేహితు రాళ్ళతో ఏటో చెప్తోంటే నిదానించి చూసి కొద్దిసేపటికి గుర్తుపట్టగలిగాను. చీరలో ఆమెను గుర్తుపట్టడం కొద్దిగా కష్టమే అయ్యింది. అంత వరకూ తెల్లబట్టల్లో విసిగిపోయిన ఆమె, లేత నీలంరంగు చీర కట్టుకుంది. ఆమె స్నేహితురాళ్ళూ రంగుబట్టల్లోనే ఉన్నారు. బస్సుగురించి నేనూ అదే స్టాపులో కొద్దిసేపు నుంచోవలసి వచ్చింది. అప్పుడు చూశాను, ఆమె తలలో నాలుగే నాలుగు గొబ్బిపూలు వడిలి వెనక్కు వాలివున్నాయి, ఆశ్చర్యపోయాను నేను. బస్సురాగానే ఆమె వెళ్ళిపోయింది. చాలా రోజులవరకూ మళ్ళీ హాస్పిటలుకు నేను వెళ్ళలేదు. వీర్రాజు అక్కడ వుంటున్నప్పుడే కామేశ్వరీ, నేనూ ఒకసారి వెళ్ళాం. ఆ తర్వాత అతను జబ్బుబాగయి, డిశ్చార్డ్ అయిపోయాడు. కొద్దిరోజులు ఇంటిదగ్గరే వుండి మళ్ళీ ఉద్యోగంలో చేరాడు. అప్పుడప్పుడు, మునుపటిలా ఇప్పుడూ, ఇంటికి వస్తున్నాడు. అతని ద్వారానే నిత్యానందమూర్తిని గురించి వింటూవుండేవాడిని. వీర్రాజు వచ్చేసినతర్వాత మరీ ఒంటరివాడయిపోయాడట అతను. “ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నానండీ” అని అనేవాడట. పరిచయాలు కొద్దిపాటివే అయినా జ్ఞాపకాలు చిరకాలం నిలిచిపోతాయి కొంతమంది విషయంలో. నిత్యానందమూర్తికూడా వాళ్ళల్లో ఒకడు. ఎప్పుడయినా వెళ్ళి కలుసుకుందా మనుకునేవాడినిగాని, ఏవో పనులు తగిలి, ఆ అవకాశంమాత్రం కలగడంలేదు, ఓరోజు ఏమీ తోచక ఒకడ్నే సినిమాకు బయలుదేరాను. కామేశ్వరికి తలనొప్పిగౌ వుండి రానంది. ఒక్కడ్నే వెళ్ళకతప్పలేదు. సినిమా ఆట్టే నచ్చలేదు నాకు. డబ్బు చేసుకోవడానికి మన నిర్మాతలు వాస్తవాన్నుంచి ఎంతదూరమైనా వెళ్ళిపోగలరు అని నిరూపిస్తుంది ఆ చిత్రం. సినిమా అయిపోయాక వచ్చేస్తోంటే వరండాలో నిత్యానందమూర్తి కనిపించాడు. అతని వెనక మరికాస్తా దూరంలో ఆగ్నసు జనాన్ని తప్పించుకొని యిటే వస్తోంది. “సినిమాకు వచ్చారా. ఎలా వుంది?” అన్నాడు నిత్యానందమూర్తి,
మృత్యువు నవ్వుతోంది ర్ ఎలావున్నదీ చెప్పాను.
వీర్రాజును గురించి ఏవేవో అడిగాడు.
చెప్తున్నాను.
ఆగ్నేసు మా పక్కనుంచే చూడనట్బగా వెళ్ళిపోయింది.
వెళ్ళిపోతున్న ఆమెను చూస్తున్నాను.
“అగ్నేసు! తెలునుకదూ మీకు, సినిమాకు వచ్చింది గాబోలు” అన్నాడు నిత్యానందమూర్తి.
జనంలో కలిసిపోయేముందు ఒకసారి ఆమె తలీలోకి చూశాను. తలలో గొబ్బిపూలు రెండు జీవంలేనట్టు వెనక్కు వాలిపోయివున్నాయి!
“ఆమె యింకా అల్లరి చేస్తున్నట్టే వుంది” అన్నాను. ఆ వ్యంగ్యం అతను అర్థం చేసుకున్నాడు గాబోలు, మాట్లాడలేదు.
“వెల్తినండి, బస్సు దొరక్కపోతే చాలా ఆలస్యం అయిపోతుంది. సాయంకాలం నాలుగు గంటలు పర్మిషన్ పెట్టి వచ్చాను. ఎప్పుడైనా వీలుచూసుకుని హాస్పిటలుకు రండి” అన్నాడు. గబగబా జనాన్ని తప్పించుకుని వెళ్ళిపోయాడు.
అతను చేతులారా తన నాశనాన్ని తాను కొనితెచ్చుకుంటున్నాడేమో అనిపించింది నాకు. ఒకసారి వెళ్ళి అతన్ని కలుసుకుని మందలిద్దామని అనుకున్నాను.
రెండు రోజులతర్వాత వీర్రాజు వచ్చి, నేను ఇంట్లో లేకపోతే కామేశ్వరి చేతికి ఓ ఉత్తరం యిచ్చి వెళ్ళాడట. నా అడ్రసు తెలియక, నా పేరుతో అతని అడ్రసుకు నిత్యానందమూర్తి రాశాడట ఆ ఉత్తరాన్ని.
మామూలు పరిచయాలూ, పాగడ్మలూ అయిపోయాక అతను రాశాడు-
“... ఇక్కడి జీవితానికి అర్థం ఏమని నిర్వచించాలో తెలీడంలేదు. భూత భవిష్యద్వర్తమానాలమధ్య కాలం కదలివస్తున్నప్పుడు ఎలాంటి మార్పూ లేకుండా అతి నిరాడంబరంగా ఒకే రూపంలో పయనిస్తోంది. నిన్నే యివ్వాళై, యివ్వాలే రేపై యీ జీవితంలో ఆశించే వింతలు, సాధించే సాధితాలూ ఏవీ అవుపించడంలేదు. ఉదయం లేవడం, మందూ మాకుతోపాటు క్షుద్బాధకు ఏదోయింత తినడం, నిద్రపోయి లేవడం, తిని నిద్రపోయి తిరిగి లేవడం, కొద్దిపాటి నడక, అఖరిగా తిని నిద్రపోవడం-ఇదీ యిక్కడి జీవితం. ఇంతకన్నా ఎక్కువ ఆశించకూడదు. సాయంకాలపు ఆ కొద్దిపాటినడక
ల్తి రంగుటిద్దాలు _ చీకటిని చీల్చిన పగలుకు, వెలుతురును కొటేసిన రాత్రికి ప్రతినిధిగా నిలబడుతుంది. గడిచిపోయిన అలోచనలు ఆ రాత్రి కనబోయే కలలుగా రూపాల్ని మార్చుకునేది ఆ సాయంకాలమే.
అర్థరాత్రి తెలివి వచ్చినప్పుడు ఆలోచనలు యింటిని వెతుక్కుంటూ పోతుంటాయి. పగటి భాగంలో యింటి తలంపు వచ్చినా ఇక్కడి మిత్రులు ప్రసంగంలోకి దింపి ఆలోచనల్ని దూరంగా తరిమేస్తారు కాని, రాత్రి సమయంలో అది సాధ్యంకాదు. అంతా గాఢంగా నిద్రపోతుంటారు. నిద్ర తేలిపోయినవారు, నాలాగా కళ్ళు మూసుకుని చీకటిలోకి చూస్తూ ఒంటరిగా ఆలోచిస్తుంటారు. ఒకరిని ఒకరు పలకరించుకోవడం వుండదు. నిళ్ళబ్దం గంభీరంగా, భయంకరంగా వుంటుంది. ఉండి-ఉండి ఆ గంభీరాన్ని ఛిన్నాభిన్నం చేస్తూ ఏ పక్కనుండో భయంకరంగా ఎడతెరిపిలేకుండా ఎవరో దగ్గుతారు. ఆ తర్వాత మళ్ళీ నిళ్ళబ్దం.
ఆ నిశ్శబ్దంలో అలోచనలు ఆకృతిని దాలుస్తాయి. దూరమయిపోయిన మధురమైన ఆలోచనల్ని తలంచుకోవడానికి ఆ సమయంలో భయం వేస్తుంది. అతి సామాన్యమైన ఇంటి విషయాలే ఆలోచనల్లో దొర్గుతుంటాయి. ఎప్పుడో ఆలోచనల్లోంచి జాగ్రదావస్తలోకి దొర్జి కలలో కరిగి, నిద్రలోకి జారిపోతాయి. ఉదయం ఎప్పటిలాగే ('ప్రభాతం-వెలుతురు గాలి, చీకట్లో కరగి పగలు ప్రారంభమవుతుంది.
ప్రతిరోజూ ఇదే జీవితం, యాంత్రికమైపోయింది. ఈ జీవితంనుంచి ఎప్పటికి విముక్తి లభిస్తుందో అనలు విముక్తే రాదో-తెలియదు.
జీవితంలో అభిమానాలకు, (పేమలకు దూరమయిపోయిన వ్యక్తికి ఏవయివునుంచయినా కొద్దిపాటి ఆత్మీయత కనిపిస్తే కొండంత ఉత్సాహం వస్తుందనే విషయం మీరు కాదనరనుకుంటాను. చీకటి సమాధీలో పండి పాలిపోతున్న నేను వెలుతురు కావాలని, దానికై కళ్ళు కాయలు చేసుకోవడం నింతేమీ కాదు.
ఎప్పుడయినా ఒకసారి మీరు రండి, సన్నిహితంగా మాట్లాడుకోవచ్చు.
మీ నిత్యానందమూర్తి” నిత్యానందమూర్తి వట్టినే నాకు ఉత్తరం రాయలేదని, ఆ రోజు సినిమాలో అడిగినదానికి యివ్వాళ సమాధానం యిచ్చాడని అర్థమయింది. అతని వ్యక్తిగత జీవితంగురించి నాకేమీ తెలియదు. తెలుసుకొంటే బావుండేది,
మృత్యువు నవ్వులోంది తతి
ఆ విషయం ఆ తర్వాత వీర్రాజు వచ్చినప్పుడు అడిగాను.
అతనికి పెళ్ళి అయిందట. ఒక కూతురు కూడాను. అతనికి టి.బి. అని తెలిసిన తర్వాత మావగారు వచ్చి కూతుర్నీ, మనవరాలునీ తీసుకొని వెళ్ళిపోయారట. భార్య నరిగ్గా ఉత్తరాలు రాయదట. ఒకసారి అయిదు రోజులు 'పర్మిషన్' తీసుకొని మావగారింటికి వెళ్తే భార్యను మాట్టాడడానికయినా ఒంటరిగా అతని వద్దకు రానివ్వలేదట. పిల్లను ఎత్తుకోనివ్వలేదట.
వీర్రాజు అ విషయంచెప్పి “ఆశలు చచ్చి జీవించడమంటే అదే. అతనికి బతుకుమీద కూడా నిర్లిప్తత ఏర్పడిపోయింది. “నాకు ఎవరూ లేరు. నేను ఒంటరివాడ్సి' అని తరచు అంటుండేవాడు. ఆ భావనే రాకూడదు. వేస్తే మనిషి మానసికంగా సుఖించలేడు” అన్నాడు,
నిత్యానందమూర్తి మీద చాలా జాలేసింది. జీవితంమీద నిరాశ, నిర్లిప్తత " ఆవరించిన అతను, ఏ పక్కనుంచో కొద్దిపాటి వెలుతురు చారలు అతనిమీద వాలుతున్నప్పుడు తిరిగి ఆశను రగుల్బుకొని వాటిని అందుకోబోతే, అవి నిప్పూసెగలై అతన్ని దహించివేస్తాయేమోనని భయం కలుగుతోంది.
య. “ఆర్నేసు గురించి మీ అభిప్రాయం ఏమిటి?” అన్నాను వీర్రాజుతో,
అతను నవ్వి “మీరెందుకు అడిగారో నాకు తెలుసు. అగ్నేసు మంచిదని అనలేను కాని చెడ్డదిమాత్రం కాదు. నిత్యానందమూర్తితో ఆమె చాలా సరదాగా మాట్లాడుతుంది. ఒక్కొక్కప్పుడు కొంటెగా ఏడిపిస్తుంది. మరొక్కప్పుడు నవ్విస్తుంది. అంతమాత్రంచేత ఆమెను తప్పుగా అర్థంచేసుకోగూడదు. నాకు తెలిసినంతమట్టుకు ఆమె అంతకన్నా సన్నిహితంగా వచ్చిందనిగాని, లేక వస్తుందనిగాని అనుకోలేకపోతున్నాను” అన్నాడు.
అగ్నేసును అనవసరంగా అనుమానించడం మంచిది కాదనిపించింది. నిత్యా నందమూరర్తి కోరినట్స ఒకసారి వెళ్ళి అతన్ని కలునుకుంటే అన్ని విషయాలూ తేలిపోతాయి.
కాని వెళ్ళి కలుసుకోవడం మాత్రం జరగలేదు. ఎప్పుడో స్వగ్రామానికి దగ్గరగా వెళ్ళిపోదామని చేసిన ప్రయత్నాలు యిప్పటికి ఫలవంతమయ్యాయి. “ప్రమోషన్"తో మా వూరికి దగ్గరగా వెళ్ళిపోతున్నాను. ఆర్హర్సు వచ్చాయి, ముఖ్యమయిన మిత్రుల్ని, బంధువుల్ని కలుసుకోవడం, సామాను సర్దుకోవడం, “రిలీవింగు ఆర్జర్సు” తీసుకోవడం- వీటితో అ మూడు రోజులూ తీరికలేకపోయింది. ఈ కొద్దిపాటి వ్యవధిలోనూ
650 రంగుటద్దాలు నిత్యానందమూర్తిని కలుసుకోవాలనే అభిప్రాయానికి ప్రాధాన్యత యివ్వలేకపోయాను. వీర్రాజునిమాత్రం కలుసుకుని, నిత్యానందమూర్తిని అడిగినట్టు చెప్పమన్నాను. ఊరు వెళ్ళిపోయే రోజన వీర్రోటేకూడా స్టేషనుకువచ్చి సాగనంపాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత వీర్రాజుకు ఉత్తరం రాయమన్నాను కామేశ్వరిని. ఆమె మర్చిపోయినట్టుంది, రాయలేదు. చాలా రోజులు చూసిచూసి చివరకు వీగ్రాజే ఉత్తరం రాసేవరకు మా యిద్దరికీ ఈ విషయం జ్ఞాపకం లేనేలేదు! క్షమాపణలతో వీర్రాజుకి ఉత్తరం రాశాను. ఆ ఉత్తరంలో అతన్ని ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోమని హెచ్చరిస్తూ, నిత్యానందమూర్తినికూడా జాగ్రత్తగా వుండాలని చెప్పమని, ఆతని విషయాలు తెలియజేయమని రాశాను. త్వరలోనే అతని వద్దనుండీ సమాధానం వచ్చింది. తన ఆరోగ్యం బావున్నదట. నిశ్యానందమూర్తి డిస్పార్డ్ కాబోతున్నాడట. స్పుటం కల్చర్ “పోజిటివ్” వచ్చిందని, అది “నెగటివ్” రావడంతోనే ఒక నెలరోజుల్లో అతన్ని డిస్పార్డ్ చెయ్యబోతున్నారని, అతని ఎక్సురే రిపోర్భ చాలా బాగా వచ్చిందని రాశాడు. చాలా కాలంతర్వాత అతను వెలుతుర్లోకి రాబోతున్నందుకు, అదృష్టవంతుడై నందుకు అతనికి నా అభినందనలను అందజేయమని వీర్రాజుకు రాశాను. తీరా ఉత్తరం పోస్టుచేసినతర్వాత “ఆతను నిజంగా అదృష్టవంతుడేనా?' అని ఆలోచించినప్పుడు “బెను" అని ధైర్యంగా నమాధానం చెప్పుకోలేక పోయాను. ఎవరివల్లనయితే అతను యింతవరకూ మనస్తాపొన్ని పొందుతూ వచ్చాడో, ఆ వ్యక్తుల మధ్యనే అభిమానాన్ని చంపుకుని సన్నిహితంగా మెలగాల్సివస్తున్నప్పుడు, పూర్వపు అనాదరణనూ, నిర్లక్ష్యాన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండగలడని అనుకోలేక పోతున్నాను. భార్య, అత్త మామలు-అంత్తొ అతన్ని దూరంగా తరిమేశారు. అభిమానపు బంధాన్ని బలవంతంగా తెంచేసుకున్నారు. తీరని వ్యధను కలిగించి మనశ్శాంతిని కొల్లగొట్టారు. ఈనాడు అతను గతాన్ని మర్చిపోయి తెగిపోయిన బంధాలకు అతుకులు వేసుకున్నా బలవంతంగా లాగినప్పుడు ఎక్కడికక్కడే అవి తెగిపోయే ప్రమాదం లేకపోలేదు. అయినా మరీ యింత “సినికల్‌గా' నేను ఆలోచించడం మంచిదికాదేమోం వీర్రాజు ఉత్తరం రాసి మూడు వారాలయినా కాలేదు, పిడుగులాంటి వార్త వచ్చింది.
మృత్యువు నవ్వుతోంది 67 నిత్యానందమూర్తి చనిపోయాడట! అంతకన్న ఆ కార్డులో విశేషాలు లేవు. క్షణంపాటు న్తబ్బుడయిపోయాను. ఇల్లాంటివార్త చూడాల్సి వన్తుందని
అనుకోలేదు. అంతకుముందు అతన్ని చూసినవాళ్ళివరూ ముందుముందు ఈ
వ్యాధితోనే అతని బతుకు తెల్లిరిపోతుందని అనుకుని వుండరు. ఆఖరిసారి నేను
అతన్ని చూసినప్పుడుకూడా అలా ఊహించలేదు.
అతను నెలరోజుల్లో ఆ చీకటిని తప్పించుకొని వెలుతుర్లోకి రాబోతున్నాడని వీర్రాజు రాసి యింకా నెలరోజులయినా కాలేదు, ఇంతలోనే యీ వైపరీత్యం జరుగుతుందని ఎలా అనుకోనూ? వూర్తి ఆరోగ్యవంతుడై త్వరలోనే అతను బైటపడతాడని, ద్వేషాలూ కోపాలూ దాటుకుని, తనచుట్టూ తిరిగి ఆత్మీయతను సృష్టించుకోగలడనీ ఆశించాను. కాని అతను శాశ్వతంగా యీ కోపతొాపాలకు దూరమయిపోతాడని అనుకోలేదు.
ఇదంతా ఏకారణమూ లేకుండా జరిగివుండదు. ఆరోగ్యాన్ని పుంజుకొంటూ నెలరోజుల్లో డిస్పార్డ్ కాబోయే అతను, మూడు వారాలు తిరక్కుండా మృత్యుముఖాన పడ్డాడంటే, ఇందులో విశేషం ఏదో వుండివుంటుంది.
నాకెందుకో అతని చావుకు, ఆగ్నేనుకు నంబంధం వుండివుంటుందని అనిపించింది.
మొదటినుంచీ నేను భయపడుతూనే వున్నాను-ఆగ్నేసు కారణంగా అతను తన జీవితాన్నే చేజేతులా నాశనం చేసుకుంటాడేమోనని. ఈనాడు అతను చనిపోవడానికి అగ్నేసే కారణం అనుకుంటే, అందుకు ఆశ్చర్యపడాల్సినదీ, అనుమాన పడాల్సినదీ ఏమీ లేనేలేదు.
ఆ తర్వాత వీర్రాజు వివరంగా ఉత్తరం రాశాడు. అతను రాసిన దాంట్లో ఆగ్నేసే కారణం అన్న వా అభిప్రాయానికి సంబంధించిన సమాచారమే లేదు.
ఆఖరి రోజుల్లో భార్యకు నాలుగు ఉత్తరాలు రాశాడట. దేనికీ సమాధానం లేదట. అఆ విషయమూ, రక్తం కక్కుకుని వారం రోజులు మంచంమీద వుండి శాశ్వతంగా కన్నుమూయడమూ, బతిికించాలనే డౌక్టర్ల ప్రయత్నమూ-ఇంకా ఏవేవో రాశాడు. నాకు కావలసీన సమాచారం అతనివద్దనుండి రాలేదు.
భార్య ప్రవర్తన కారణంగా తీవ్ర సంచలనంతో అశాంతిరేగి జీవితంమీద విసుగుతో ఆరోగ్యాన్ని అలక్ష్యంచేసి తన నాశనాన్ని తనే కానితెచ్చుకున్నాడనే విషయం
62 రంగుటద్దాలు తప్ప, ఆగ్నేస్తుకు సంబంధించినది ఆ ఉత్తరంలో ఏమీ లేదు.
ఆ తర్వాత కొంతకాలంవరకూ వీర్రాజు ఉత్తరాలు రాస్తుండేవాడు. ఎప్పుడూ ఈ ప్రస్తావన ఉత్తరాల్లో వుండేదికాదు. తర్వాత తర్వాత అసలు ఉత్తరాలు రాయడమే మానేశాడు.
ఏణర్థం తర్వాత హైదరాబాదు వెళ్ళాల్సిన పనిపడింది. కామేశ్వరి బాబాయి కూతురి పెళ్ళి. తప్పకుండా రావాలని వాళ్ళబాబాయి వరసగా మూడు ఉత్తరాలు రాస్తే బలవంతంగా నన్నుకూడా బయలుదేరదీసింది.
పెళ్ళిలో వీర్రాజు కనిపించాడు.
మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత కాస్త తీరిక చిక్కింది. కాస్సేవు మాట్ట్లాడుకుందామని వీర్రాజును పిలిపించాను.
“ఇక్కడేమిటి సందడిలో. అలా బయటికి పోదాంరండి” అన్నాడు.
బట్టలు వేసుకుని బయటపడ్డాను.
అతని ఉద్యోగం, ఆరోగ్యం మొదలయిన విషయాలన్నీ అయిపోయాయి. పెళ్ళిగురించి ఏదో చెప్తున్నాను.
“పాపం! నిత్యానందమూర్తి విషయం చూశారా” అన్నాడు వీర్రాజు,
ఆ విషయం నేను మర్చిపోయినా, అతను జ్ఞాపకం చేశాడు. ఆగ్నేను గురించి నా అభిప్రాయం సరైనదో కాదో ఇప్పటికయినో తెలునుకోవాలని అనిపించింది.
“ఇంతకూ అతను ఎలా చనిపోయాడు?” అన్నాను.
“ఏమో నాకూ తెలీదు. ఉత్తరంవస్తే చూద్దామని వెళ్ళాను. అప్పటికే అతను రెండు రోజులుగా రక్తం కక్కుకుంటున్నాడట, “ఏమిటిది?” అని అడిగితే మాట్లాడలేదు, జాలిగా నవ్వేసి వూరుకున్నాడు” అన్నాడు.
“ఉత్తరంలో ఏం రాశాడు?”
“ఏమీలేదు. నాలుగే నాలుగు మాటలు; ఇంటిదగ్గరకొచ్చేశాం. రండి, ఉత్తరం చూపిస్తాను” అన్నాడు.
మధ్యదారిలో అడగనే అడిగాను-ఆగ్నేనుకు, అతని చావుకు కారణం లేనేలేదంటారా?- అని,
మృత్యువు నవ్వుతోంది 63
“ఇంత అకస్మాత్తుగా రోగం తిరగబెట్టడం చూస్తే అనుమానించాల్సి వస్తోందిమరి. హాస్పిటల్లో అంతా అలానే అనుకున్నారు. విచిత్రమేమంటే, ఏమీ లేకపోయినా నా గురించీ అలానే అనుకున్నారు” అన్నాడు.
ఇల్లు చాలా దగ్గరలోనే వుంది. తీనుకెళ్ళి కాఫీ తెప్పించి యిచ్చాడు. తాగుతున్నాను.
“అఖరి రోజుల్లో వాళ్ళవాళ్ళని రమ్మనమని టెలిగ్రాం యిద్దామనుకుంటే యివ్వనిచ్చాడు కాడు. అయినా అతనికి తెలియకుండా భార్యని, కూతుర్ని వెంటనే బయలుదేరి రమ్మనమని టెలిగ్రాం యిచ్చాను. వాళ్ళు రాలేద్దు. మామగారు చచ్చారు. అప్పటికి జరగవలసినదంతా జరిగిపోయింది” అన్నాడు వీర్రాజు ఉత్తరం తెచ్చియిస్తూ,.
నాలుగే నాలుగు లైనులున్న కార్డు అది. దుమ్ముదులిపితే వివరంగా అక్షరాలు కనిపించాయి.
“*వీర్రాజుగారూ-
పండి రాలిపోయిన ఆకులస్టానే కొత్త చివుళ్ళు తలెత్తుతున్నాయి. ఎందుకో మళ్ళీ బతకాలనిపిస్తోంది. నాలుగు రోజులుగా వంట్లో అదోలా వుంటోంది. ఒకసారి రండి, సన్నిహితంగా మాట్లాడుకుందాం.
మీ నిత్యానందమూర్తి”.
ఉత్తరంలోని మొదటి రెండు లైనులూనా అభిప్రాయాన్ని మరీ బలపరిచాయి. అగ్నేసుమీద నాకెంకైనా కోపం వచ్చింది. విలువైన జీవితాలతో చెలగాటమాడుతూ ఇలా ఎంతమందిని నాశనం చేసిందో, ఇంకా చేన్తుందో తెలీదు. ఉద్యోగంలో ప్రవేశించేముందు అహర్షిశలూ రోగుల ప్రేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని ప్రమాణం చేసిన ఆమె, ఆ రోగుల ప్రాణాల్సే తీస్తోంటే ఏమనుకోవాలి? చట్టరీత్యా ఇటువంటి వారిని శిక్షించినంత మాత్రాన వాళ్ళల్లో మానసిక పరివర్తన ఎలా వస్తుంది?
“ఆగ్నేసు యిక్కడే వుంటోందా?” అన్నాను వీర్రాజుతో,
“ఏమో నాకూ తెలీదు. ఉండేవుంటుంది. ఏం, వెళ్ళికలుద్దామా?” అన్నాడు.
“ఎందుకులెండి, వద్దు” అని వచ్చేశాను.
అ మర్నాటి ఉదయం వీర్రాజు వచ్చాడు. “హాస్పిటలుకు వెల్దాంరండి. నాకు
రీ రంగుటద్దాలు కూడా వేరే పనివుంది, అ ఎదురుగా వున్న కాలనీలో” అన్నాడు. అగ్నేసును కలుసుకుని కాస్త గట్టిగా మందలిద్దామని అనిపించింది. బయలుదేరాను. వీర్రాజు పని చూసుకుని హాస్పిటలుకు వెళ్ళాం. అగ్నేసు గురించి వార్డులన్నీ వెతుకుతున్నాం. మేట్రిన్ యిటేవస్తొంది. ఆగ్నేసును గురించి ఆమెను అడిగాను. “కలుసుకోవాలా?” ఆంది ఆమె. “ఊ” అన్నాను. “మేడమీద ఫిమేల్ వార్డు- త్రీలో వుంది వెళ్ళండి” అంది. ఆ వార్డుని వెతుక్కుని వెళ్లే అక్కడ గుమ్మంలో మరో నర్సు ఎవరో వుంది. ఆగ్నేసు కనిపించలేదు. ఆమెనడగాను. “మీ బంధువా?” అని ప్రశ్నించింది. “కాదు అన్నాడు వీర్రాజు, ఆమె ఒకసారి జాలిగా మా యిద్దరివైపూ చూసి “ఇలా రండి" అంది. అలా చూస్తుందేమిటి? అనిపించిందినాకు. ఆమె వెంబడే మెల్లగా బయలు దేరాం. లా సౌందర్యం నిక్షిపష్తముయిన ఆ గది అంతరాంతరాల్లో భయంకరమెన విష శ్రిములుంటాయని ఎవరనుకోగలరు? క్రిమికిఅందమూ, అనాకారితనము ఉనే భేదం లేదుగాబోలు. నర్సు ఒక మంచంవద్ద ఆగిపోయింది. ఆ ఇరవై నాలుగో నెంబరు మంచంలో మృత్యువు మమ్మల్ని గుర్తుపట్టిం్య గాబోలు, జాలిగా నవ్వుతోంది. అ స్థితిలో ఆగ్నేనును చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు! ఇప్పుడు నిజంగా నా అభిప్రాయానికి బలం వచ్చింది. నిత్యానందమూర్తి చావుక్సు
మృత్యువు నవ్వుతోంది క! ఆగ్నేసే కారకురాలు. ఆ విషయం స్పష్టపడిపోయింది. స్ఫుటం కల్చర్ పోజిటివ్ వున్నప్పుడు శారీరక సంబంధం ఏ స్త్రీతోనన్నా వుంటే, అమెకు కూడా ఆ జబ్బు అంటుకోవచ్చు. అందుచేత నిత్యానందమూర్తి చావుకు ఆగ్నేసే కారకురాలు,.
ఆమె కనిపిస్తే గట్టిగా నాలుగు మాటలూ దులిపి కోపం అంతా వెళ్ళగక్కేద్దామని అనుకొని, తీరా ఆమె, కనిపించినతరువాత ఏమీ అనకుండానే వుండిపోయాను! తాత్కాలికమైన అనందానికి ఒక-వ్యక్తి జీవితం నాశనం చేసిందని కోపంవచ్చిన్నా తన జీవితానికికూడా నాశనాన్ని కొనితెచ్చుకున్నంత తెలివితక్కువది అయిపోయినందుకు ఆమెమీద జాలేసింది.
ఎక్కువసేపు ఆమెతో మాట్టాడాలనిసించలేదు.
వెళ్ళేముందు “జీవితాలు చాలా విలువైనవి. అవి చెలగాటం అడ్డంకొరకు కాదు. ఆడటానికే అని ప్రవర్తిస్తే అది తెలివితక్కువతనమే అవుతుంది” అన్నాను.
ఆమె ఏమీ మాట్లాడలేదు.
వెళ్తూ ఒకసారి వెనక్కు తిరిగి చూసినప్పుడు వెళ్ళిపోతున్న మాకు వీడ్కోలు యిస్తున్నట్టుగా జాలిగా మృత్యువు నవ్వుతోంది!
ఈం
ఉరితీయబడ్డ నిజం “నిజం! వట్టినే అనడంలేదు, ఒక ౦లెదు. ఒక్క అఆర్జ్గగంట అలా కూ
వేసుకుంటాను. ఇవ్వాళ నువ్వు చాలా మం క | మంజరి పెదాల్ని చిరునవ్వుల్లో తడిపి, సంతోషాన్ని కనబడనీయకుండా ృతిమమైన కోపంతో వాటిని అద్ది, మూతిని సున్నాలా చుట్టుకుని కూర్చుంది.
నవ్వినప్పుడు మంజరి మరీ అందంగా వుంటుంది. సన్నని పెదాలు ఆమెవి. ఆ కొసల్ని బాగొ పురిపెట్టి బిగించి కట్టినట్ట తిన్నగా వుండక మెలితిరిగి వుంటాయి వట్టప్పుడే చిరునవ్వుల్ని దొచుకోవడం తెలీని దానిలా అనిపిస్తుంది. ఎవరో ఆమె పెదాల కొసల్ని సాగదీసి, చివర్లలో బిగించిపట్టి నవ్వడం అలవాటు చేసినట్టున్నారు. నవ్వినప్పుడు చివర్లలో సొట్టలు కనిపిస్తాయి. కింది పెదవిమధ్య సన్నని గాడి వుంది. నిరంతరం చిరునవ్వుల్ని వదులుతూ వుండడంవల్ల గాడిపడీ, పూడుకోక అలానే వుండిపోయింది. పెదాలు అల్బమైనవి కావడం వలన చిరుగాలికికూడా యిట్టే కదిలిపోతుంటార్పు. దానికితోడు పెదాలమీద గిలిగింతలు ఎక్కువ. చల్లటిగాలి మృదువుగా స్పర్శిస్తేనే గిలిగింతలు పుట్టి పులకరించిపోతుంటాయి.
ఉరితీయబడ్డ నిజం ర్
శేఖరం ఆమెనే చూస్తున్నాడు. సన్నని ఒంటిరేఖ గీతలాంటి పాపిడి మొదల్లో కుంకుమ అద్దుకుంది. చీకటిమేఘాన్ని చీలుస్తూ వాలిన ఒకేఒక సూర్యకిరణంలా వుందది. ఒత్తుగా పెరిగిన కనుబాములు కొండల్తా నిలబడి వాటిమధ్య ఎర్రటికుంకుమబొట్టు ఉదయిస్తోన్న సూర్యుడిలా వుంది. బొట్టులో చెమికీ రేణువులు, కొండలపై శిఖరాల్ని తాకుతూ కిరణాల్ని నేలమీదకు వంపుతున్నాయి. చెమటకు తడిసి కరిగి కిందకుజారిన కుంకుమచార, కొండల మధ్య లోయలో ప్రవహిస్తోన్న ఏ కొండవాగో ఉదయకిరణాలతో ఎగర్రబడ్డట్టుంది. కళ్ళకు కాటుక పెట్టుకొని, కొసల్ని కాటుక గీతల్తో వంపులు తిప్పింది, అందువల్ల అవి మరీ పొడుగ్గా కనిపిస్తున్నాయి. కొండకింద యేర్చడ్డ నీటి మడుగుల్లాంటి ఆ కళ్ళల్లో అరిచులు కాటుకతో నల్లబడి, చీకట్లు గోతులచుట్టు చేరుకున్నట్టు అనిపిస్తున్నాయి.
ఆ మడుగుల్లో రెండు చేపలు. కొసలవరకూ వెళ్ళి చీకట్లను దాటలేక ఆగిపో తుంటాయి. అక్కడనుండి మళ్ళీ వెనక్కు ఈ చివరకు రాగానే మళ్ళీ అడ్డుగా చీకట్లు. అక్కడినుండి మరోవైపు-అలా అలనటనేది లేకుండా కదులుతూనే వుంటాయి. చీకట్టమధ్య వాటిని బంధించేసినట్ట్లుంది. ఆ బంధికానానుండి విముక్తికై అవి ఎప్పుడూ తిరుగుబాటు చేయడంలోనే ఒక అందం వుంది. కొసలవరకూ వెళ్ళి, బలాన్నంతా కూడగట్టుకొని, అంచుల్ని ఢీకొని, పట్టచిక్కించుకోడానికై పెనుగులాడి, చివరకు అలసిపోయి వెనక్కు వెళ్ళిపోవడంలో నిరాళలేదు. తిరిగి ప్రయత్సం చేయాలనే కొత్త ఉత్సాహం, ఉత్తేజం వున్నాయి.
శేఖరం తననే నిదానించి చూడడం ఆమెకు అదోలా వుంది. అక్కడ నుండి లేచివెళ్ళి టేబిల్ మీది పుస్తకంతీసి పుటలు తిరగేస్తూ “వట్టినే. నాకు లేని అందాన్ని కల్పించి ఎగతాళి చేయాలని చూస్తున్నావు. అంతా అబద్దం. నీ మూటలు నమ్మ కూడదు” అంది. టె
ఆమె కంఠంకూడా అందమైనదే. చిన్నప్పుడు తల్లిదండ్రులు బాగా ఏడిపించి ఆ కంఠాన్ని సొనబెట్టినట్టున్నారు, మాట్టాడేప్పుడు ఆ మాటల వెనక రాగం వున్నట్టనిపిన్తుంది.
చిన్నప్పుడు గట్టిగా ఏడవగలిగినవాళ్ళు పెద్దయ్యాక ప్రయత్నిస్తే చక్కగా పాడగలరు కూడాను. మంజరి ఎప్పుడూ నంగీత సాధన చేయలేదుగానీ, చేస్తే అట్టే కష్టపడకుండా మంచి గాయని అయివుండేది.
రతి రంగుటద్దాలు “ఏమిటి ఆలోచిస్తున్నావు శేఖరం?” అంది తిరిగి ఆమె, అతను ఆలోచించడం చూసి. “ఏమీలేదు. నువ్వు సంగీతం ఎందుకు నేర్చుకోకూడదా అని” -.. “చాల్లే నాకు సంగీతంరాదని నువ్వేమీ వెటకారం చేయనక్కర్లేదు” అంది చిరుకోపాన్ని అభినయిస్తూ, మంజరికి అసలు కోపాన్ని ప్రదర్శించడమే చేతకాదు. సూటిగా అతని కళ్ళల్లోకి చూడాలని కంటిపాపలను కళ్ళమధ్యకు తెచ్చి, శక్తినంతా కేంద్రీకరించి, కదలకుండా పాపల్ని నిలుపుదామని ప్రయత్నించి, చేతగాక ఆ (ప్రయత్నం విరమించుకుంది. పాపలు స్థిరంగా నిలుచోలేక పక్కలకు జారిపోయాయి. కళ్ళల్లో పులుముకున్న ఎరుపురంగును పాపలు చీకట్లోకి నెట్టేశాయి. “సరేలే, ఇలా వచ్చి కూర్చో- ఒక్క అరగంట” శేఖరం లేచివెళ్ళి తన ఎదురుగా మూడు గజాల దూరంలో చాప పరిచాడు. ఆమె వచ్చి కూర్చుంది. మోకాళ్ళను మడిచి, ఎడంచేతిని చాపమీద అన్ని, బరువునంతా దానిమీద నిలిపి, కుడ్డిచేతిని మడిచిన మోకాళ్ళ మీదకు నిర్లక్ష్యంగా వదలి కిందకు చూస్తూ కూర్చుంది. ఆమెకు కుడివైపునవున్న కిటికీలోంచి వెలుతురు చెంపలమీదా, వక్షాలమీదా, భుజాలమీదా పడి నిలువలేనట్టు పక్కలకు జారిపోతోంది. ఒకవైపునుంచే వెలుతురు రావడం వలన చీర పవిటలో, కొండమీదకు చెక్కిన అంతులేని మెట్లల్లా మడతలు ఏర్పడ్డాయి. చిరుగాలిలో ఎగిరి అల్లరిచేసే ఆకతాయి వెంట్రుకల్ని పట్టుకొని కదలనీయకుండా గట్టిగా బంధించి అల్లినజడ జలపాతంలా వెనకనుంచి దూకి, లోయలోంచి ప్రవహించి, మోకాళ్ళమీదుగా జారి కింద పడుతోంది. వంగినప్పుడు పవిటలోనుండి తప్పుకుని నిటాగ్గా కిందకు దిగిన ముత్యాల సరం, నీలరంగు చీరలో నక్షత్రాల్ని దండగాగుచ్చి వేలాడదీస్తున్నట్టుంది. మెల్లగా అతను ఆమె స్కెచ్ గీశాడు. ముక్కు బాగా పాడుగయిపోయింది. చెరిపేసి మళ్ళీ వేద్దామనుకున్నాడు కాని మంజరికి పొడుగుముక్కే బావుంటుంది. సన్నని కంఠమూ, అల్పమైన నడుమూ, కోలముఖమూ, పొడుగు వేళ్ళూ వున్నవాళ్ళకు సూదిగా అఆఖరయిన పొడుగాటి ముక్కే బావుంటుంది. ప్రపంచ ప్రసిద్ధమైన నటరాజు కంచుశిల్పంలో ముక్కు పొడుగు. భారతదేశంలోని శిల్పాల్లో వున్న విశిష్టతే అది. సాధారణంగా ముక్కులు సూదిగా పొడుగ్గా కత్తి అంచులా ఆఖరయి వుంటాయి.
ఉరితీయబడ్డ నిజం 69 ఈజిష్నియను శిల్పాల్లోనూ అంతే. క్లియోపాత్ర ముక్కు పొడుగు. కాని గ్రీకు శిల్పాల్లోనూ, చిత్రాల్లోనూ ముక్కులు పొట్టి. ప్రాక్సిటలస్ 'వీనస్'లో గాని, రాఫెల్ 'మదొన్నా'లోగాని, డావెన్సీ, “'మోనాలిసా'లోగాని ముక్కులు పాడుగ్గాలేవు. ఆ ధోరణే వేరు. చేతి వేళ్ళు పొట్టి. పుష్టిగా ఏపుగా పెరిగి మెలితిరిగిన కండరాలతో శరీరం వుంటుంది. అలాంటివారికి పొట్టిముక్కు బావుండొచ్చు. మంజరిలాంటి సన్నవాళ్ళకు పొడుగు ముక్కే అందం. ఆమెను చూస్తే దక్షిణాది కంచుశిల్బ్పంలో కటకహన్త ముద్రాంకితయైన “ఉమ” జ్ఞాపకానికొస్తుంది.
చిత్రం వేస్తుండగా మధ్యలో ఓసారి రెప్పల్ని విప్పి చూపుల్ని ఎత్తిపట్టకొని అతనివైపు చూసింది మంజరి. అతను చిత్రం వేస్తూ ఆమెవైపే చూస్తున్నాడు. అతని _ చూపులు కంఠం దిగువున ఎత్తుపల్తాల్ని కొలుస్తున్నాయి. ఒకటి, రెండు, మూడు అని. లెక్కపెడుతున్నాడు కూడాను. బహుశా కొండలమీదకు చెక్కిన మెట్లనేమో! అతని చూపులు మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టే ఎక్కి, అలసిపోయినట్లు కొద్ది క్షణాలు అగి, శిఖరాన్ని కొలుస్తూ మళ్ళీ ముందుకు పోతున్నాయి. చిట్టచివరి మెట్టమీదనుండి శిఖరంమీదకు ఒక్క గెంతుగెంతి, ఆ చివర నిలుచుని, అవతల మబ్బుల్లో కూరుకుపోయిన మరో కొండశిఖరాన్ని వెతుకుతున్నాయి.
ఆమెకు చాలా సిగ్గేసింది. తన రహస్యాన్ని అతను తెలును కున్నట్టు అతనిముందు కూర్చోవడానికే ఆమెకు అదోలావుంది. అతను తన శరీరంలోని ప్రతి అణువుని కత్తిరించి, విడదీసి, భూతద్దం కిందవుంచి పరిశీలిస్తున్నట్టు అనిపించింది. ఆ చూపులు శరీరాన్నంతా తడిమి రహస్యాల్ని వెలికితీసి వెలుతుర్లో వుంచుతున్నట్టంది.
అతని ఎదుట కూర్చోలేకపోయింది ఆమె.
“ఇదిగో! అలా అయితే ఎలా? చిత్రం వూర్తికావచ్చింది. ఇంకొద్ది సేపు..- బ్రతిమలాడి, ఎలాగో ఒప్పించి కూర్చోబెట్టాడు.
మరో పదిహేను నిమిషాల్లో చిత్రం పూర్తయిపోతుంది. ఆ చిత్రం వేయడానికి అమె చాలా యిబ్బంది సపెట్తోంది. వట్టుమని రెండు నిమిషాలు నిలకడగా కూర్చోడంలేదు. చేతులు నొప్పెడుతున్నాయనో, నడుం లాగుతున్నదనో, ఇటుతిరిగో, అటు కదిలో చాలా ఇబ్బంది పెట్లోంది. అ
మరీ సుకుమారమైన అమ్మాయి. ముట్టుకుంటే కందిపోయేట్టు వుంటుంది. దానికితోడు, కావాలని ఆమె మరికొంత అల్లరి చేసింది. అతను అనుకున్నంత సులభంగా
70 రంగుటద్దాలు తన అందం అతని చేతుల్లో యిమిడిపోడం ఆమెకు ఇష్టంలేదు. అతన్ని ముప్పుతిప్పలు పెట్టాలి. అతని శక్తిని పరీక్షించాలి. అతనిచేత పదేపదే బతిమాలించుకొని చుట్టూ తిప్పా కొని , ఏడిపించి అప్పుడు లాంగిపోవాలి. అప్పుడే అందంవుంది. అందకుండా వుండి అందడంలోనే ఆనందం వుంది. కనబడీ కనబడకుండా వున్నప్పుడే చూడాలనే ఆతృత.
వినీగించి విసిగించి చివరకు కుదురుగా కూర్చుంది ఆమె. చిత్రం అయిపోయేవరకూ మళ్ళీ కదల్లేదు.
పూర్తయిన చిత్రాన్ని ఆమెకిస్తూ “నువ్వెలా వున్నావో ఒకసారి చూసుకో” అన్నాడు.
ఆమె అందుకుని చూస్తోంది.
ఇతరుల ముఖాల్ని గుర్తుపట్టగలిగినంతగా మనిషి తన ముఖాన్ని తాను గుర్తుపట్టలేడు. మంజరికి ఆ ముఖం తనదేనా అనిపించింది. ముఖంలో ఏదో అందమైన మలుపు కనిపిస్తోంది. ఆ మలుపు ఎక్కడో స్పష్టంగా తెలీడంలేదు.
“బావుంది” అంది ఆ చిత్రాన్ని బేబిలుమీద వుంచి.
“నీలాగే వుందా లేక ఏ మార్చులన్నా అవసర మనిపిస్తున్నాయా?”
“చాలు. అలాగే వుండనియ్యి” అంది కాని ఆమెకు ఒకచోట సందేహంగా వుంది. ఆ విషయం అతనితో చెప్పలేకపోయిందామె. ఒక స్రీ ఒక పురుషుడి ముందు నిలబడి అడగదగ్గ విషయం కాదది.
“ఈ చిత్రం నాకు కావాలి. తీసుకోనా?” అంది మంజరి.
“నీకు బహుమతి చేద్దామనే వేశాను. ఇప్పుడుకాదు, మరో రోజున యిస్తాను” అన్నాడు.
ఆమె పకపకా నవ్వి “బహుమతి యివ్వడానికికూడా తిథులూ, నక్షత్రాలూ చూస్తున్నావేమిటి?” అంది. అంత గట్టిగా భవ్వినప్పుడు శరీరం ఆమెస్వాధీనంలో వుండదు. పట్టుతప్పి అటూ ఇటూ కదిలిపోతుంది. తూలిపోకుండా బేలన్ను కాసుకోవడానికని అకస్మాత్తుగా నవ్వును ఆపి ఊపిరి బిగబెట్టుతుంది. అలాంటప్పుడు కంఠం దిగువున ఎత్తుపల్దాలు మరీ ఎక్కువగా కనిపిస్తాయి. చిత్రం చూసినప్పుడు మంజరికి కలిగిన సందేహానికి సమాధానం అప్పుడు లభించింది. ఆ భాగాల్ని అతను వేస్తున్నప్పుడు తను వూపిరి బిగబెట్టి వుండాలి మరి.
“తిథుల్లూ, నక్షత్రాలూ చూడాలని కాదు. ఏదైనా సమయాన్ని పురస్కరించుకొని
ఉరితీయబడ్డ నిజం 71 యిద్దామని-ఏ పుట్టిన రోజునో, ఏ పండగనాడో అయితే బావుంటుంది.”
“ఏం, పెళ్ళినాడు యివ్వగూడదా?” అంది.
“ఎందుకివ్వగూడదూ” అన్నాడు కాని యిలా అడిగిందేమిటి?-అని అనిపించింది.
ఆతను ఆలోచించడం చూసి తిరిగి ఆవిడే అంది. “పుట్టిన రోజుకన్నా పెళ్ళే ముందు వస్తుందికాబోలు. పోనీ ఆరోజున యిద్దువుగానిలే,”
మంజరి చాలావింతగా మాట్లాడుతున్న ట్టనిపిస్తోంది అతనికి, అమాయకంగా ఆమె అనడంలేదు. అమాయకమైన మాటల్లో పదాల్సి పట్టిపట్టి వదలడం వుండదు. కంటిపొపల్ని కొానలవరకూ పంపి ఓరగా చూడ్డం వుండదు. ఎదుటి ముఖంలోని మార్చుల్ని పరిశీలించే ప్రయత్నం వుండదు.
“ఏం అలా చూస్తున్నావ్. పెళ్ళి చేసుకోకుండా నన్ను ఎప్పుడూ యిలాగే వుండి పోమంటావా యేమిటి?” అంది తిరిగి ఆవిడే.
భుజాలు తడుముకొంటున్నట్టు మంజరి మాట్టాడ్గం అనుమానంగా వుంది. కాని ఏ విషయమూ ఆమెనడిగే ధైర్యం అతనికిలేదు.
మంజరి సమాధానం గురించి కొద్దిసేపు ఎదురుచూసి “సరేలే. ఎప్పుడో ఒకప్పుడు యిద్దువుగానిగాని, నేను వెళ్ళిరానా” అంది. కళ్ళను చక్రాల్లా చుట్టి, పెదాల్ని సాగదీసి ధనుస్సులా వంచింది.
ఆ కవ్వింపే అతనికి కోపాన్ని కలిగిస్తుంది. అవసరం లేకపోయినా ఎదుటివాళ్ళను కట్టిపడేయాలనే ప్రయత్సం ఎందుకు? వాళ్ళను తెలివితక్కువవాళ్ళను చేసి చుట్టూ తిప్పుకుని, తప్పుకుని దూరంగా పారిపోవడం ఎందుకు? కళ్ళను ఎగరేయకుండానే, చిరునవ్వుల్ని వదలకుండానే మాట్లాడొచ్చుగా. "
మంజరి వెళ్ళిపోయింది.
ఏమిటో! మంజరి తనకు అర్థంకానట్టే అనిపించింది అతనిక్సి. మంజరేకాదు ఏ స్తీ అయినా నన్నిహితంగా వచ్చేకొలదీ అనలే అర్ధంకాదు. స్రీ వృాదయం పాగమంచులాంటిది. దూరంనించి చూస్తేనే దానికొక అందమైన రూపం వుంటుంది. దగ్గరకు వెళ్తే ఏమీ వుండదు. ఆ పొగమంచులో కప్పడిపోయినవన్నీ వైటపడతాయి.
మంజరి చెప్పిన విషయాని గురించి వివరంగా ఏమన్నా తెలుస్తుందేమో అని
72 రంగుటద్దాలు
అనీలా ఇంటికి వెళ్ళాడు. అనీలా మంజరి స్నేహితురాలు. ఆతనికి దూరపు బంధువు.
ఆ వూరు వచ్చిన తొలిరోజుల్లో ఆతను అనీలా ఇంట్లోనే కొంతకాలంపాటు వున్నాడు.
అక్కడే మంజరి పరిచయం అయ్యింది.
అనీలాను మంజరి గురించి అడిగితే ఆమె చెప్పింది-
“నిజమే. మంజరికి సంబంధాలు వస్తున్నాయి. ఆ మధ్యనే, కొత్తగా ప్రాక్టీసు పెట్టిన ప్లీడరు తాలూకొవారు వచ్చి చూసుకుని వెళ్ళారు. ఈ ఎండల్లో పెళ్ళిచేసేయ్యొచ్చు. సంబంధాలు చూస్తున్నారు. వరుడుమాత్రం యింకా స్థిరపడ లేదు” అంది.
తిరిగి ఆవిడే “కాన ఆ యింట్లో ఆమెకు కొంత స్వేచ్చ వుంది. ఆ స్వేచ్చను ఆమె ఎలా ఉపయోగించుకొంటుందో మరి” అంది.
- అనీలా ఆ చివరి వాక్యాన్ని ఎందుకు చెప్పిందో అళనికి అర్ధమయ్యింది. ఆనీలాకు అతని గురించీ, మంజరి గురించీ తెలియని రహస్యమంటూ ఏమీ లేదు. వాళ్ళ పరిచయం యింతగా పెరగడానికి కారకుల్లో అనీలాకూడా ఒకర్తి.
శేఖరం అక్కడనుండీ వచ్చేశాడు. ఎందుకో మంజరి మరొకరి సొత్తు కావడం ఆతనికి బాధగా వుంది. ఆమెను పెళ్ళి చేసుకుతీరాలన్న బలమైన అభిప్రాయం ఎప్పుడూ కలగలేదుగొని, అలాంటి అవకాశంవస్తేమాత్రం వదిలిపెట్టగూడ దనుకున్నాడు. ఆమె _. అతి సన్నిహితంగా వచ్చి, అలాంటి అవకాశం తనంతతానుగానే కల్ఫించినట్టనిపించింది. కాని అది వట్టిభ్రమే అయ్యింది. ఇప్పుడు ఎవరో ముక్కూమొహం ఎరుగని ఏ వ్యక్షోవచ్చి *లా' పుస్తకాల రూపాయినోట్లనీ ఏరచూపి, దగ్గరకు రప్పించుకొని బంధించేస్తాడు గౌబోలు, కారులోతిప్పి అందమైన సాయంకాలాల్ని అనుభవించనీయకుండా నిరర్థకం చేస్తాడుగాబోలు. ఎత్తయిన భవంతి రెండో అంతస్తు మధ్యగదిలో ఆమెను వుంచి అకొళపు నీలిమను, అరుణోదయాల్ని చూడనివ్వడుగొబోలు.
కాని మంజరి వీటికి యిష్టపడుతుందా? అతి సామాన్యమైన స్త్రీలా పిల్లల్ని కని, వాళ్ళను పెద్దవాళ్ళనుచేసి, పెళ్ళిచేసి, పిల్లల్ని కనిపించి అజ్ఞాతంగానే కన్నుమూయడానికి వొప్పుకుంటుందా?-ఈ (ప్రశ్నలకు సమాధానం మంజరే యివ్వాలి.
మంజరి ఆ తర్వాతకూడా అప్పుడప్పుడు వస్తుండేది. పూర్వంలాగానే మాట్లాడేది. నవ్వించేది. ఛలోక్తులు విసిరేది. మరీ సన్నిహితంగా వచ్చేస్తున్నట్ట మాట్లాడేది.
కాని అతనికి యిదంతా కృత్రిమమే అనిపిస్తోంది. అంతకుపూర్వం యిచ్చిన
ఉరితీయబడ్డ నిజం 73 చనువుకు అపార్ధం కల్పించుకుని ఆలోచించనీయకుండా, అదికూడా యిలాంటి స్పేహం మాత్రమేనని చెప్పడం ఆమె ఉద్దేశంగాబోలు.
మొదటి రోజుల్లో కావాలనే ఆమె ఆతనికి నన్నిహితంగా వచ్చింది. భవిష్యత్తునుగూర్చి నిర్ణయం చేసుకుంది. తన పరిధులు విశాలంకాని రోజుల్లో చేసుకున్న నిర్ణయమది. తర్వాత తర్వాత తనచుట్టూవున్న మనుషుల్ని, పరిసరాల్ని గూర్చి స్వార్ధంతో ఆలోచించడం చేతనయ్యాక తొలి నిర్ణయానికి బలం యివ్వలేకపోయింది. ఇ విషయం తెలునుకునేటవ్పటికే పెనవేనుకున్న స్నేవావుముడులు విడివడనంతగా బిగుసుకుపోయాయి. అ ముడుల్ని మెల్లమెల్లగా విప్పుకోవాలి. సాగదీయడంవల్ల అవి తెగిపోవచ్చు. ఇద్దరికీ అది ఇబ్బందికరమే కావచ్చు. అందుకని ప్రయత్నపూర్వకంగా, చేసిన స్నేహానికి రంగు పులిమి రూపాన్ని మార్చాలి. ఆ స్నేహాన్ని అలానే వుంచి అందులో ఏ ప్రత్యేకతా లేదని తెలియజెప్పాలి.
ఒకసారి మంజరి అనీలాచేత కబురంపించింది-శేఖరాన్ని అనీలా ఇంటివద్ద కలుసుకొమ్మని. “నీతో ఒక ముఖ్య విషయం మాట్టాడాలట. ఆదివారం మా ఇంట్లో కలుసుకోమంది” అని చెప్పింది అనీలా,
ఆదివారం ఉదయం అనీలా ఇంటికి వెళ్ళాడు. మంజరి అక్కడే వుంది. అతను రావడం చూడలేదు. సోఫాలో పక్కకు తిరిగి కూర్చుని ఏదో వారపత్రిక చదువుకొంటోంది.
తల స్నానం చేసినట్టుంది, తల వెంట్రుకల్ని చీకటి తెర దింపినట్టు వెనక్కు వేలాడేసి, చివర్లని పసుపు రిబ్బనుతో కట్టింది. వెంట్రుకలు పాయలు పాయలుగా పక్కలకు తప్పుకుని ధారల్లా తెల్లటి రవిక మీదకు దూకుతున్నాయి. రిబ్బను ముడి ఊడిపోయి కిందకు జారిపోతోంది. వెంట్రుకలు వీవుమీద అల్లుకుపోయి, వాటి మధ్యనుంచి తెల్లటి రవిక చారలు చారల్లుగా కనిపిస్తోంది. చీకటిని వెలుగు రేఖలతో చీలుస్తున్నట్టందది. ఎడమచెవి పూసల గుత్తి, నల్లని పరదాను పక్కలకు తొలగించి చూస్తున్న ముస్లిమ్ పిల్లలా జడలోంచి కుతూహలంగా తొంగిచూస్తోంది. వీపుమీద జాకెట్టు ఇంగ్లీషు “వి ఆకారంలో వెనక్కు దిగి, శరీరం జైటపడి చీకటి మేఘంలా ఆవరించిన-జుట్టమధ్య ఆకాశంలా మెరుస్తోంది. చుట్టూ గాఢమైన నలుపులో శరీరం మర్ తెల్లగా వుంది. పనుపు దంచిపరచిన కుష్పమీద వెన్నెలవాలి మెరసిన లేత పసుపురంగు శరీరం ఆమెది. ॥
అనీలా లోపలినుండి వస్తూ పలకరించింది. తంతవరకూ మంజరి అతన్ని
7థీ రంగుటద్దాలు చూడనేలేదు. తుళ్ళిపడ్డట్టు సరిగా లేచికూర్చుని “ఎంతసేపయ్యింది నువ్వు వచ్చి?” అంది.
“ఇప్పుడే” అన్నాడు వచ్చి కూర్చుంటూ.
అనీలా కాఫీ పట్టుకొద్దామని వెళ్ళిపోయింది.
ఇద్దరూ చాలాసేపు మౌనంగా కూర్చుండిపోయారు. క్షణం తీరికలేకుండా ఎప్పుడూ పెదాల్ని కదిపే మంజరి మూగదానిలా మౌనంగా వుండిపోవడం ఎబ్బెట్టుగా వుంది. సూర్యాస్తమయంలో రంగుల్ని వెదజల్లకుండానే సూర్యుడు వెళ్ళిపోయినప్పుడూ, తుమ్మెదలు రుంకారం చేయకుండానే ఎగురుతున్నప్పుడూ ఎంత ఎబ్బెట్టుగా, అసంతృప్తిగా వుంటుందో మంజరి మౌనంగా వుండడంలోనూ అంతే ఎబ్బెట్టూ, అసంతృప్తే వున్నాయి. బహుశా అకస్మాత్తుగా ఏ ఆశ్చర్యకరమైన విషయాన్నో తెలియజేసి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసి ఆనందంలో ముంచెత్తడానికై నిశ్శబ్దాన్ని సృష్టించిందేమో.
అనీలా కాఫీ పట్టుకొచ్చింది. ముగ్గురూ కూర్చుని కాఫీలు తాగుతున్నారు.
“నాకు నీ సలహా ఒకటి కావాలి శేఖరం. నా అంతట నేను ఏ విషయాన్నీ నిర్ణయించుకోలేను. నా వైవాహిక జీవితానికి సంబంధించిన ఒకానొక నిర్ణయంలో నీ సలహా అవసరం” అంది అకస్మాత్తుగా మంజరి,
అతనికి చాలా అనందంగా వుంది. ఇక్కడికి వన్తూ ఏఏ విషయాల్ని ఊహించుకున్నాడో ఆ విషయాలు జరగబోతున్నాయి. మధురంగా ఊహించుకున్న జీవితానికి మంజరి రూపకల్పన చేయబోతోంది. తాజ్‌మహల్ తనదే అయిపోయి నప్పుడూ, వెన్నెలంతా తన పెరడులోనే వాలినప్పుడూ ఆనందాన్ని భరించలేకపోయినట్లే యిష్పుడూ అతని హృదయం యీ సంతోషాన్ని భరించలేకపోతోంది.
“ ఏమిటావిషయం? చెప్పు” అన్నాడు.
ఆమె ఓ కవరులోంచి రెండు ఫోటోలు తీసి అతనికిస్తూ “పెళ్ళిచూపులకు పంపించిన ఫాటోలివి. ఈయన డాక్టరు, అతను ప్లీడరు. వీళ్ళిద్దర్లో ఎవరిని పెళ్ళి చేసుకోవాలో నిర్ణయించుకోలేకపోతున్నాను. ఈ విషయంలో నీ సలహా, అనీలా సలహా నాకు కావాలి” అంది.
“న్తబ్బుడై పోయాడు శేఖరం. మంజరి తనను ఏడిపించడానికే యిలా చేసిందనిపించింది. అతని అభిమానం దెబ్బతింది. ఈ సన్నిహితత్వం ఆమె గౌరవంచేత యిన్తున్నదికాదు, తన అదృష్టాన్ని తెలియజేసి ఏడిపించడానికి. ఇదంతా నటన. ఈ
ఉరితీయబడ్త నిజం గ్ అభిమానమంతా కృత్రిమం. స్నేహం అనేది మనుషులు మనుషులుగా మాట్లాడు కోవడానికి. స్నేహంలో నటించడాలు వుండకూడదు. లోకం గురించి మనిషి ఎప్పుడూ నటిస్తూనే వుంటాడు. కాని తనగురించి తాను నటించాల్సిన అవసరం లేదు. నటించి విసుగెత్తిపోయిన సమయాల్లో తను తానుగా బైటపడి స్వేచ్చగా వూపిరి పీల్చడానికి కనీసం ఒక వ్యక్తన్నా అవసరం. స్నేహం అందుకు అవసరమవుతుంది. నటించకుండా తను తానుగా బైటపడ్డచోటనే నిజమైన స్నేహం వుంటుంది. మంజరి నిజమైన స్నేహితురాలిలా మాట్టాడడం లేదు. కావాలని పెదాలమీద చిరునవ్వుల్ని అంటించుకొంటోంది. మాటల్ని అభిమానంలో తడిపి వదులుతోంది.
మంజరి మీద అతనికి కోపం వచ్చింది. 6
అతని ముఖంలోని మార్పుల్ని అనీలా గుర్తుపట్టింది. ఈ వాతావరణంలోంచి తాను తప్పుకోవడం ఉత్తమమనిపించి “ఇప్పుడే వస్తాను” అని చెప్పి ఖాళీ అయిన కాఫీ గ్లాసుల్ని పట్టుకుని వెళ్ళిపోయింది.
“చెప్పు, అలా బుద్ధుడిలా కూర్చుండిపోయావేం” అంది మంజరి కళ్ళరెప్పల్ని ఎగరేసి.
“ఎందుకు మంజరీ యిలా నన్ను బాధపెడ్డావు? నీకు తెలును నిజంగా నేను యీ విషయంలో సంతోషంగా సలహా ఇవ్వలేనని. అయినా నువ్వు నన్ను నొప్పించాలని ప్రయత్నిస్తున్నావు. నేనంటే నీకెందుకంత కక్ష? ఏం చేశానని?”
నిజంగా అతని కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగాయి. కంఠం బొంగురుపోయి, పెళుసులు వూడిపోయినట్టు అక్షరాలు ముక్కలు ముక్కలయిపోయాయి. అక్కడనుంచి లేచి వరండాలోకి వచ్చేశాడు.
“ఏమిటీ! నేను బాధపెడుతున్నానా[!?” అంది మంజరి చాలా అమాయకంగా ముఖంపెట్టి అతని వెనకనే వచ్చి. ఈ ఎ
అమాయకత్వాన్ని ప్రదర్శించడం ఆమెకు చేతకాలేదు. అంత అందమైన ముఖమూ అసహ్యంగా తయారయ్యింది. ఈజిప్టు 'ఉజైమండీస్' శిల్పంలా ప్రాభవాన్ని కోల్పోయి అసహ్యంగా కనిపించింది. అక్కడ యిక ఉండలేక ఆమె పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత మళ్ళీ మంజరిని కలవలేదు.
ఆ వూళ్ళో వుండడం అతనికి ఇష్టంలేకపోయింది. పరీక్షలయిపోయినా అక్కడే
76 రంగుటద్దాలు -- మరికొన్ని రోజులు వుందామనుకున్నాడు గాని మంజరి కలిగించిన మనస్తాపాన్ని తలచుకొంటూ బాధపడడం యిష్టంలేక స్వగ్రామం వెళ్ళిపోయాడు. వెళ్ళేముందు మంజరిని కలవలేదు. అనీలా అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండేది. మంజరిని గురించి ఎప్పుడూ అతను అడిగేవాడు కాడు. ఆమె రాసేదికాదు. వెళ్ళిన మూడు నెలలకు మంజరి వద్దనుండి శుభలేఖ వచ్చింది. దానితో పాటు ఉత్తరమూ రాసింది. “సల్ళురం- ॥ పెళ్ళి నిర్ణయమైంది. తప్పకుండా పెళ్ళికి వస్తావని ఎదురు చూస్తుంటాను. ఇంతకు ముందు తెలిసో తెలియకో నిన్ను నేనేమన్నా కష్టపెడితే నన్ను క్షమించు. ఇంకా నామీద కోపాన్ని పెంచుకోవడంలో అర్థంలేదు,ఏమిటో। నా స్వేళ్ళ నన్నే బంధించేసింది. ఉంటాను మరి మంజరి” ఉత్తరం చూసినతర్వాత మంజరిని వూహించుకోవడం అతనికి సాధ్యంకాలేదు. చాలా నిరాశగా ఆ ఉత్తరాన్ని రాసినట్టనిపించింది. ఉత్తరంలోని ఆ చివరి వాక్యమే లేకపోతే మంజరిని పూర్వపు మంజరే అనుకునేవాడు. కాని ఆ ఒక్కవాక్యం మంజరిలో ఎంతో మార్చుని చూపిస్తోంది. తప్పుచేసినా పశ్చాత్తాపపడే వాళ్ళంటే అతనికి గౌరవం. మంజరి మీద అతనికి కోపంలేదు. తనను పెళ్ళి చేసుకోలేదని అమెను నిందించడం మంచిపనిగా అనిపించలేదు. స్వార్థపరురాలనడంలో అర్థంలేదు. ప్రతిమనిషీ స్వార్ధపరుడే. ఆ స్వార్థం యితరులకు నష్టం కలిగిస్తే అది ప్రమాదకరం. అంతవరకూ స్వార్థం ప్రతి మనిషికీ అవసరమే. అప్పుడది స్వార్థం-కాదు, ఆశయం. అమెను అతను కోరుకున్నాడు. అందగత్తె అనీ, ఆ సౌందర్యం తన ఒక్కడి అస్థీ అయిపోవాలనీ కోరుకున్నాడు. ఆమెకూడా అలానే -చక్కటి ఉద్యోగమూ, మంచి “పెర్సనాలిటీ ఉన్న భర్తను కోరుకుని వుండొచ్చు... ఆరోజు రెండు ఫొటోలూ యిచ్చి నలహా యివ్వమనడంలో ఉద్దేశం-ఇద్దరిలో అందమైనవాళ్ళు ఎవరో చెప్పమని అడగడమే. అంతమాత్రంచేత ఆమె తనను మోసగించిం దనుకోవడం మంచిది కాదనిపించింది.
ఉరితీయబడ్డ నిజం ' 77 శుభలేఖ తీశాడు. వరుడు సివిల్ ఇంజనీరు. ఆరోజు చూపించిన యిద్దర్లోనూ ఎవరూ కారన్నమాట! బహుశా ఆ సంబంధాలు రెండింటికన్నా యిదే ఆమెకు నచ్చివుండొచ్చు. కాని ఆమె ఉత్తరంలోని ఆఖరి వాక్యానికి అర్ధం ఏమైనట్టు? ఎందుకో మంజరి ఒక ఇంజనీరును పెళ్ళాడ్డం అతనికి యిష్టంలేదు. ఏ ఇటాలియన్ శిల్పో, కోణార్క శిల్పో, తంజావూరు శిల్పో చెక్కిన శిల్పం ఏ కలలోనో ప్రాణం పోసుకుని ఎదుటికొచ్చి నుంచున్నట్టుండే మంజరి, ఒక ఇంజనీరుకు భార్య కావడం చాలా బాధాకరమైన విషయంగా అనిపించింది. ఆమె భర్త పది అంతస్తుల మేడల్సి కట్టించగలడు. వబ్లిక్గార్జెన్లకు ప్లానుల్ని గీయగలడు. దేవుడికి అధునాతనంగా దేవాలయాన్ని కట్టించి యివ్వగలడు, కాని ఆ దేవాలయంలోని దేవుడ్ని చెక్కలేడు.
- అతను మనిషికి కావలసీన అవసరాల్ని తీర్చగలడు గాని మనిషికి ప్రతిసృష్టి చేయలేడు. మంజరి లాంటిది ఏ ఆర్చిస్సకు మోడలుగానో, ఏ రసికుడికి భార్యగానో ఉండాల్సిన ఆడది. ప్రపంచంముందు నిలుచోబెట్టాల్సిన స్త్రీ ఆమె. ఆమె అందాల్ని చట్రంలో బిగించి గోడలమీద వేలాడగట్టో, శిల్పాల్లో మలచి భవంతుల ముందు నిలుచోబెట్లో నలుగురికీ చూపించాలి. అమెను పబ్లిక్గార్డెన్లలో పూలమొక్కలమధ్య స్వేచ్ళగొ తిరగనివ్వాలి. మహానగరం మధ్య ఫుట్‌పాత్ మీద నడవనివ్వాలి. నగరం శివారలో నిర్మానుష్యమైన పాలాల్గో విశాలమైన అకాశం కింద పరుగెత్తనివ్వాలి. మూడోతరగతి రైలుపెట్టెలో దేశమంతా తిప్పి తీసుకురావాలి. ఆమె కోరితే డాబామీద వెన్సెల్లో ఒక్కర్తినీ వదిలేసి ఒంటరిగా నిద్రపోనివ్వాలి. అలాంటి స్త్రీ ఆమె. ఏ వ్యక్తి గురించీ ఆమె భవనం నాలుగు గోడలమధ్యా బంధింపబడకూడదు. అలసిపోతుందని పాదాలు నేలమీద అన్ఫనివ్వకుండా కారుల్లో తిప్పగూడదు. అమెభర్త యిందుకు సిద్ధపడగలడా? . అతనికి మంజరి మీద చెప్పలేని దిగుటైంది. బహుశా ఆమె ఉత్తరంలోని ఆఖరి వాక్యానికి అర్థం యిదేనేమో. మంజరి పెళ్ళికి వెళ్ళాం అనుకున్నాడు గాని వీలుపడలేదు. అకస్మాత్తుగా వాళ్ళమ్మకు జబ్బుచేసి ఉండిపోవలసి వచ్చింది. అంతకుముందు వేసిన ఆమె చిత్రాన్ని పెళ్ళికానుకగా పంపిస్తూ, రాలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దని ఉత్తరం రాశాడు. పెళ్ళీ వాడొవిడీ అంతా అయిపోయిన తర్వాత ఒక నెలరోజులకు అత్తగారింటినుంచి అతనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉత్తరం రాసింది. ఆమె భర్త
78 రంగుటడ్డాలు సీలేరు 'ప్రొజెక్టువద్ద ఇంజనీరు. ఉత్తరంలోని అడ్రసునుబట్టి ఆ విషయం తెలిసింది. ఆ వుత్తరంలో ప్రత్యేకించి భర్తను గురించి ఏమీ రాయలేదు. మంజరి గురించిన విషయాలు ఆ తర్వాత అతనికేమీ తెలియలేదు. అనీలా అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండేది గాని, మంజరిని గురించి రాస్తే అతను పాత జ్ఞాపకాలతో బాధపడతాడేమోనని ఆమెను గురించి ఏమీ రాసేదికాదు. అతనుకూడా తనంతతానుగా అడిగేవాడుకాడు. శేఖరానికికూడా ఆ యేడే పెళ్ళయ్యింది. అతని తల్లి ఆరోగ్యం అంతంత మాత్రంగానే వుండడంవల్ల, ఆమె కంగారుపెడితే చేసుకోకతప్పలేదు. మావగారు విశాఖపట్టణంలో రైల్వేలో కేషియరుగా పనిచేసి రిటైరయ్యారు. అమ్మాయి యింటర్ వరకూ చదువుకుంది. పెళ్ళిచూపులకు వెళ్ళి అమ్మాయిని చూసిన తర్వాత వెంటనే వప్పేసుకున్నాడు. గ్రీకు శిల్పాల్లోలాగా భారీమనిషి ఆమె. దూరంనుంచి చూస్తే అతనికన్నా పొడుగ్గా వుంటుంది. అతనిపక్కన నిలుచోబెడితే చెవుల దగ్గర కొస్తుంది. పుష్టిగా పెరిగిన శరీరం ఆమెది. ముక్కు చిన్నదే అయినా ఆ శరీరానికది అందాన్నే యిచ్చింది, కళ్ళు బాగా పెద్దవి. చిన్న నోరు. ఉబ్బిన చెక్కిళ్ళు. కంగారా స్కూల్ పెయింటింగుల్లోని స్రీలలా వుంది. “అన్నయ్య అదృష్టవంతుడు పిన్నీ” ఆంది అనీలా పెళ్ళికూతుర్ని గురించి శేఖరం తల్లితో మాట్టాడుతూ. శేఖరం ఆలకించి “నిజం, అదృష్టవంతుడ్నే' అనుకున్నాడు. పెళ్ళికి మంజరి అభినందనల్ని పంపించింది. పెళ్ళిహడావిడి తగ్గాక మంజరికి కృతజ్ఞతలు తెలువుకొంటూ ఉత్తరం రాద్దామనుకొంటూనే నుర్చిపోయాడు. కోరుకున్న దానికన్న అతని జీవితానికి ఎక్కువే లభించింది. అందమైన భార్య, చేసిన కృషికి ప్రజల గుర్తింపు, ఆర్థిక పుష్టి - యింతకన్న మనిషికి కావలసినవి ఏమున్నాయి? భవిష్యత్తు సుందరంగా కనిపిస్తున్నప్పుడు గతాన్ని తలంచుకోవలసిన అవసరం కనిపించలేదు. జీవితంలో ్రతిరోజురాత్రీ రేపటి సూర్యుడ్ని తలంచుకొంటూ నిద్రపోవడం! ఒకరోజు పనివుండి పట్నం వెళ్ళినపుడు అనీలాను కలుస్తే ఆమె చెప్పింది,
ఉారితీయబడ్త నిజం 78 మంజరి పుట్టింటికి వచ్చిందని. ఆరోగ్యం బాగుండకపోతే మందు పుచ్చుకుందామని యిక్కడకు వచ్చిందట. “నువ్వు వస్తానంటే యిద్దరం కలిసి వెల్దాం అంది ఆమె. అలానే అన్నాడు అతను.
ఆరోజు సాయంకాలం యిద్దరూ వెళ్ళారు. మంజరి రేడియో పెట్టుకుని వింటోంది.
వాళ్ళను చూడగానే కళ్ళు ఎగరేసి “రండి రండి. కలలో కొచ్చినట్టు అకస్మాత్తుగా వచ్చావు. ఇంతకూ ఊరునుంచి ఎప్పుడొచ్చావు?” అంది.
పెళ్లయిన తర్వాత మంజరిలో పెద్దగా వచ్చిన మార్చేమీలేదు. కళ్ళకు కాటుక పెట్టడం మానేసినట్టుంది. కంటిగుడ్లు పాలిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగోలేదని అనీలా చెప్పడంవల్లనోయేమో కొద్దిగా సన్నబడ్డట్టనిపిస్తోంది. చెక్కిళ్ళమీద రంగు పల్బబడింది.
“ఇవ్వాళే వచ్చాను. వంట్లో బాగుండలేదట, ఎలావుంది?” అన్నాడు.
“ఏమీలేదు. ఆ మధ్య నాలుగు రోజులు జ్వరపడ్డాను. వంట్లో కొద్దిగా నీరసంగా వుంటే కోలుకునేవరకూ యిక్కడే వుండమని వారు తీసుకొచ్చి దిగబెట్టి వెళ్ళారు” అంది.
కొత్త జీవితంలో నుంచుని ఎలా ఆమెతో మాట్లాడాలో అతనికి తోచలేదు.
“నేనసలు వెళ్ళనే అన్నాను. వారే కోప్పడి, దగ్గరుండి తీసుకొచ్చారు” అంది తిరిగి.
_ లోపలకు వెళ్ళి కాఫీలు పట్టుకొచ్చింది. చాలా సేపు అనీలా, మంజరీ కబుర్లు
చిప్పుకుంటూ కూర్చుండిపోయారు.
శేఖరం వాళ్ళ ప్రసంగాన్ని విననట్టు వుండిపోయాడు.
ఆప్పల్ళి బాగొ జరిగిందా, రాలేకపోయాను నేను” అంది మంజరి అతన్ని వట్టినే కూర్చోనివ్వడం యిష్టంలేక.
“బాగానే జరిగింది” అన్నాడు.
“నువ్వెందుకు వస్తావులే, ఇంజనీరు భార్యవు” అంది అనీలా.
“వారి తప్పేమీలేదు. వెళ్ళవునే అన్నారు. విశాఖవట్టణవేంకదా, వద్దామనుకున్నాను. కాని సరిగ్గా సమయానికి బంధువులొచ్చారు” అంది మంజరి.
అతనికి చాలా ఆశ్చర్యంగా వుంది. అస్తమానం మంజరి వాళ్ళాయన మంచితనం
80 రంగుటద్దాలు గురించే మాట్లాడడం వింతగా వుంది. అక్కడ కూర్చున్న గంటలోనూ ఆమె వాళ్ళాయన్ను యిరవైసార్లన్నా జ్ఞాపకం చేసుకుని వుండాలి. అస్తమానం ఆమె అలా వాళ్ళాయనగురించే మాట్టాడ్డం అతనికి విసుగ్గా వుంది. కేవలం తనను ఏడిపించడానికే ఆమె అలా మాట్టాడంతున్నదేవో అనికూడా అనిపంచింది. ఎక్కువగా అతనేవీ మాట్లాడలేకపోయాడు. అక్కడనుంచి వచ్చేస్తున్నప్పుడు “మీ ఆవిడ్ని ఒకసారి చూడాలని వుంది, తీసుకుని రాగూడదూ” అంది. “ప్రయత్నిస్తాను” జని చెప్పి బయలుదేరాడు. ఒక విషయం అతనికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. తన వైవాహిక జీవితాన్ని గురించి రాసిన ఉత్తరానికీ, మంజరి ధోరణికీ ఎక్కడా పాత్తు కుదరడంలేదు. భర్తంటే _ యింత అభిమానం చూపించే ఆమె ఎందుకలా ఉత్తరం రాసింది? దానికి చాలా సమాధానాలు లభించాయి. తనను ఓదార్వడౌన్లికైనా-ఆమె అలా రాసివుండొచ్చు. భర్తను పూర్తిగా అర్ధంచేసుకోని తొలిరోజుల్లో అలా రాసినా రాయవచ్చు. కేవలం యథాలాపంగానే కావచ్చు. ఇంటిక్ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి మంజరిని కలుద్దాం అనుకున్నాడుగాని వీలుపడలేదు. ఆ విషయం తెలియజేస్తే “పోనీ మీ ఆవిడ ఫొటోనన్నా పంపించు, చూస్తాను” అని రాసింది మంజరి. అలానే అతను పెళ్ళినాటి ఫొటో-ఇద్దరూ కలిపి తీయించుకున్నది-పంపించాడు. చఎదానితోపాటు ఉత్తరం రాస్తూ వాళ్ళ ఫొటో కూడా ఒకటి పం౦పించమన్నాడు. ఎందువల్లనో ఆ ఉత్తరానికి సమాధానంగాని, పంపమన్న ఫొటోగాని రాలేదు. ఆర్నెల్లతర్వాత ఒకసారి అకస్మాత్తుగా రైల్లో కలిసింది ఆమె. బావమర్షికొడుకు బారసాలకని భార్యతో వెళ్ళి, అది కాగానే భార్యను అక్కడే వదిలేసి ఒక్కడూ వస్తున్నాడు శేఖరం. వాల్తేరు స్టేషన్లో అమె కలిసింది. ఆమె ఒక పెట్టెలో వుంది. అతను చూడలేదు. కాళీగావున్న పెట్టెను వెతుక్కుంటూ వెళ్తోంటే ఆవిడే చూసి పలకరించింది. ఆమెది తిజర్వేషన్. మరోచోట స్థలం వెతుక్కుని అనకాపల్లి స్టేషనులో కలుస్తానని వచ్చేశాడు, “ఎక్కడలేని డబ్బూ ఈ ప్రయాణఖాలకే ఖర్చవుతోంది” అంది ఆమె అనకాపల్లి స్టేషనులో అతను కలిసినప్పుడు. వాళ్ళాయనకు అరకు ట్రాన్స్ఫర్ అయిందట. అంతవరకూ ఆమె పుట్టింట్లోనే వుంటుందట.
ఉరితీయబడ్డ నిజం త్
మనిషి మరికాస్తా సన్నబడింది. కంటికింద గుంటలు కొద్దిగా నల్లబడ్డాయి. ఆ కళ్ళు నీళ్ళతో తడిసి తడిసి, అంచుల్ని కరిగించుకుని మడుగులు విశాలమైనట్టు అనిపిస్తున్నాయి. మాట్టాడేటప్పుడు కంటిపాపలు కదిలి అల్లరిచేయడంలేదు. అలసిపోయినట్ట మందంగా కదులుతున్నాయి. కాటుకలేని కళ్ళు చూపుల్ని లాక్కోవడంలేదు. హృదయంలో రగుల్కొన్న జ్వాలల్లోపడి యినుపగోళాలు ఎగ్రబడ్డట్టు కంటిపాపలు తేనెరంగులో మెరుస్తున్నాయి.
“బాగా చిక్కిపోయావు” అన్నాడు.
ఆమె దిగులుగా నవ్వి “అభిమానంతో చూస్తే అలాగువుంటుంది. వారుకూడా అస్తమానం అలానే అంటుంటారు” అంది.
ఆ తర్వాత ఏం మాట్లాడాలో అతనికి తోచలేదు. ఏం మాట్టాడినా ఆమె వాళ్ళాయన గురించి చెప్పందేమోనని భయం.
బండీ కదిలికే అతను గబగబా వెళ్ళిపోయాడు. తుని స్టేషన్లో మళ్ళీ కలుసుకున్నప్పుడు కేంటినునుండి టిఫిను, కాఫీ పట్టుకొచ్చి యిచ్చాడు.
“ఈ మధ్య కాఫీ తాగడం మానేశాను. వంట్లో బాగోడంలేదని కాఫీ మానిపించి వారే ఓవల్టీను అలవాటు చేశారు. సరేలే తాగకపోతే ఏమన్నా అనుకుంటావు, ఇలా యివ్వు” అంది.
టిఫిను తిని, కాఫీ తాగి “ఎక్కడకు వెళ్ళినా నాకీ అభిమానానికి కొరతలేకుండా వుంటోంది శేఖరం. ఇంతకన్నా నాకు కావలసింది ఏముంది” అంది.
ఆ వాక్యం ఎవరిని అభినందిస్తూ అన్నదో అతనికి అర్ధం కాలేదు. వాళ్ళాయన్ను జ్ఞాపకంచేనుకొని అన్నదో, తనుచూపిస్తోన్న అభిమానానికి కృతజ్ఞతగా అన్నదో తెలియక మౌనంగా వుండిపోయాడు. లి
కాని ఒక విషయం అతనికి అర్థంగాకుండా వుంది. ఇంత అభిమానం చూపిస్తోన్న భరత్తమీద మంజికి గౌరవం, (పేమ వుండడంలో అశ్చర్యంలేదు. కాని అస్తమానం తన ఎదుట ఆయన్ను తలంచుకొని తనను ఏడిపించాలనే ప్రయత్నం చేయడంలో మంజరి ఉద్దేశం ఏమిటి? నిర్ణయగా తన భవిష్యత్తును తొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోయికూడా అంతటితో కసితీరక వెనక్కు తిరిగి వెక్కిరింపేమిటి? తనంటే ఆమె శిందుకంత కోపం?
82 లంగుటద్దాలు
ఇంతగా ఆమె పదేపదే తలంచుకొంటోన్న ఆమె భర్తను ఒకసారి చూడాలని పించింది.
“నేను పంపించిన ఫోటో అందిందా?” అన్నాడు శేఖరం.
అందింది అన్నట్టుగా తల ఆడించింది.
“మరి! మీ ఫోటో పంపించమన్నానుకదా పంపలేదేం?” అన్నాడు.
“పంపకపోవడమేమిటి! అప్పుడే పంపానుకదా. అందలేదా?” అంది అశ్చర్యంగా కళ్ళను విప్పుకుని.
ఎందుకో ఆమె సిజం చెబుతున్నట్టనిపించలేదు. అఆ ముఖంలో అమాయకత లేదు, కావాలని కనుబొమలను పైకెత్తింది. అలా పైకెత్తినప్పుడు నొసటిలో ఆశ్చర్యాన్ని సూచించే ముడతలు ఏర్పడినా పెదాల్లో చలనం లేకపోవడంవలన అది కృత్రిమమే అనిపించింది. ఆశ్చర్యంలో కళ్ళేకాదు పెదాలుకూడా విచ్చుకుంటాయి. కాని మంజరి పెదాల్ని బిగించి, కనుబొమల్ని మాత్రమే పైకి ఎగరేసింది. మంత్రించినట్టు కంటిపాపల్ని బంధించేసింది. ఎప్పుడూ కదిలే ఆ కంటిపాపలు అలా స్థిరంగా వుండిపోవడం ఎబ్బెట్టుగా అనిపిస్తోంది.
“ఇద్దరం కలిసి తీయించుకున్న ఫొటో కాఫీలు లేకపోతే, ఎవరో మంత్రిగారు
. వచ్చినప్పుడు ప్రాజెక్టువద్ద విడిగొ మంత్రిగారితో కలిసి వారు తీయించుకున్న ఫొటో
పంపించాను? బహుశా పోస్టులో ఎవరన్నా కొట్టేశారేమో” అంది తిరిగి మంజరి.
కాని అతనికి నమ్మకం కుదరలేదు. పోస్టులో ఎప్పుడూ అతని వుత్తరాలు పోలేదు. ఆమె అబద్దం ఆడుతున్నట్టే అనిపించింది.
“పొస్టువాళ్ళు కొట్టేయడానికి మీ ఆయన అంత మన్మభుడా?” అన్నాడు నవ్వుతూ.
ఆమె నొచ్చుకున్నట్ట ముఖం మాడ్చుకుని కూర్చుంది. ఆ తర్వాత అతనితో మళ్ళీ స్వేచ్చగా మాట్లాడలేకపోయింది.
రాజమండ్రి స్టేషన్లో యిద్దరూ దిగిపోయారు. అతను అక్కడనుండి బస్సులో మరికొంతదూరం ప్రయాణం చేయాలి. ఆ దగ్గర్గోని ఓ పల్లెటూరు అతనిది.
వెళ్ళేటప్పుడు యథాలాపంగా “వస్తాను శేఖరం, ఎప్పుడన్నా ఒకసారి రా” అని మాత్రం అంది. అలానే అని చెప్పి వెళ్ళిపోయాడు.
నెలరోజుల తర్వాత భార్య వస్తోంటే స్టేషనుకు వెళ్ళి రిసీవు చేసుకుందామని
ఉరితీయబడ్డ నిజం తిం పట్నం వచ్చినప్పుడు అనీలా చెప్పింది-మంజరి భర్త వచ్చాడట. ఊళ్ళోనే వున్నాడు” అందిం
బండి మధ్యాహ్నం రెండింటికి వస్తుంది. దగ్గరదగ్గర మూడు గంటల టయిముంది. ఒకసారి వెళ్ళి కలిసివద్దామని అనీలాను వెంటబెట్టుకుని వెళ్ళాడు.
తీరా వెళ్ళేసరికి అతను లేనేలేడు.
“తెలిసిన ఒకాయన్ని కలిసాస్తానని కాకినాడ వెళ్ళారు. మళ్ళీ రాత్రికి వచ్చే స్తారు” అంది మంజరి. అర్థగంటకన్నా ఎక్కువ అక్కడ వుండలేకపోయాడు. అనీలా ఇంకాస్సేపు ఉంటానంటే అమెను వదిలేసి ఒక్కడూ బయలుదేరాడు. వచ్చేముందు “పదిరోజులపాటు యిక్కడే వుంటారులే, కలుద్దువుగాని. ఉత్తరం రాస్తాను, నువ్వూ మీ ఆవిడా రండి” అంది మంజరి.
వస్తున్నప్పుడు సందుమలుపు తిరుగుతూండగా మంజరి ఇంట్లో పనిచేసే కుర్రాడు ఎదురయి పలకరించి నమస్కారం చేశాడు. వాడి నమస్కారానికి అర్థం చిల్లరడబ్బులనీ అతనికి తెలుసు. మొదట్లో శేఖరమే ఆది అలవాటుచేశాడు.
పావలాబెళ్ళ వాడిచేతుల్లో పెడుతూ “స్టేషనునుంచేమిట్రా వస్తున్నావ్” అన్నాడు.
“లేదండి, ఊరినించి అల్లుడుగారు వచ్చారుకదండీ. ఆరు కాలేజీ
" సూపించమంటే సూపించి వత్తాన్నానండి. ఆరు ఆడ వుండిపోయారు” అన్నాడు వాడు. శేఖరానికి చాలా ఆశ్చర్యంగావుంది. మంజరి ఎందువల్ల అబద్దం చెప్పిందో అతనికి అర్ధంకాలేదు. పరిచయం చేయడంవల్ల భర్త అనుమానిస్తాడనే కావచ్చు. ఇదే నిజమైతే మంజరి చెప్పుతున్నట్టు ఆమె భర్త అంత సహృదయుడు కాడనే అనుకోవాలి. అక్కడినుండి కదిలి స్టేషనుకు వెళ్ళి భార్యను రిసీవుచేసుకుని, ఆ వెంటనే
వాళ్ళ వూరు వెళ్ళిపోయాడు. 9
మంజరి ఎందువల్ల అలా అబద్దం చెప్పిందో కారణం తెలుపవలసిందని అనీలాకు ఉత్తరం రాద్గామనుకుంటుండగానే మంజరి వద్దనుండి వుత్తరం వచ్చింది. అతన్నీ అతని భార్యనూ కలిసిరమ్మనమనీ; వాళ్ళాయనకూడా వున్నారుగనుక అంతా కలిసి ఎక్కడికైనా పిక్నిక్కు వెళ్ళామనీ, వచ్చే ఆదివారం తప్పకుండా రమ్మనీ మరిమరీ
రాసింది. వెళ్ళ, మంజరిని యిబ్బందిలో పెట్టగూడదనుకున్నాడు గాని ఎందుకో ఒకసారి
తశ రంగుటద్దాలు వెళ్ళి ఆమె భర్తను కలుసుకుని మాట్టాడాలనిపించింది. ఆదివారం ఉదయం భార్యతోసహా ఆ వూరు చేరుకున్నాడు. అనీలా బయటికి రావడానికి వీల్లేదు. అందువల్ల వాళ్ళిద్దరీ మంజరి యింటికి వెళ్ళారు. మంజరి మేడమీదనుంచే వాళ్ళను చూసి చేతులూపింది. తెల్లటి చీరమీద కొద్దిగా ఎండపడి చూపులు చెదిరిపోతున్నాయి. ఆమె తలమీద మేఘాలులేని నీలాకాశం, మేడలో నీలిరంగు పూసిన గోడలు, దిగువన కాంపొండులో పచ్చని గడ్జిమైదానం- కిందనుంచి చూస్తోంటే ఆమె సముద్రం వడ్డున “స్టేట్యూ ఆఫ్ లిబర్టీ'లా అనిపిస్తోంది. గబగబా మేడమెట్ట్లు దిగి ఎదురొచ్చి లోపలకు తీసుకెళ్ళింది. మంజరి చూపులన్నీ అతని భార్యమీదనే వున్నాయి. పరిచయాలు, అతిథ్యాలతో పావుగంట గడిచిపోయింది. “మీ ఆయన లోపలవున్నారా?' అన్నట్టుగా కళ్ళతోనే అడిగాడు శేఖరం. “అర్జంటుగా రమ్మని నిన్న రాత్రి టెలిగ్రాం వచ్చింది శేఖరం. రాత్రికి రాశ్రే వెళ్ళిపోయారు” అంది. శేఖరానికి యిదేదో యింద్రజాలంగా అనిపించింది. ఎన్నిసార్లు వచ్చినా ఆయన కలవడంలేదు. మంజరే తనంత తానుగా ఆయన్ను కనబడనీయకుండా దాగుడుమూత లాడీస్తోంది. ఇవ్వాళ అవె చెప్పినదాంట్లో కూడా నిజం వుంటుందని అనుకోలేకపోతున్నాడు. ఆయన ఆదివారం వుండడని తెలిసే తనను ఆ రోజుకు రమ్మనమని ఉత్తరం రాసివుండాలి. ఆమె భర్తకు తనను పరిచయం చేయడం ఆమెకు యిష్టంలేకపోవచ్చు. అతను వట్టి అనుమానం మనిషేమో, ఇటువంటి భర్తతో కావురం చేయడంలో, పైకి కనిపిన్తున్నట్ట, నిజంగా మంజరి సుఖపడడంలేదు. ప్రపంచ ప్రసిద్ధమయిన ఏ కళాఖండమో కావలసిన మంజరి చివరికి యిలా కావడం అతనికి చాలా బాధగా వుంది. " ఆడవాళ్ళు మాట్లాడుతూ కూర్చున్నారు. మంజరి వాళ్ళాయన గురించీ, ఉద్యోగం గురించీ, అక్కడి ప్రదేశాల గురించీ చెప్తోంది. శేఖరానికి అక్కడ వుండాలనిపించలేదు. వరండాలోకొచ్చి ఏదో మేగజైను చదువుకొంటూ వుండిపోయాడు. ఆడవాళ్ళ మాటలు తెమిలేసరికి మధ్యాహ్నమయ్యింది. భోజనాలుకూడా అక్కడే చేశారు.
ఉరితీయబడ్డ నిజం ॥ భోజనం చేస్తున్నప్పుడు శేఖరం అడిగాడు. “పోనీ, మీ అయనా! యిక్కడ లేదా చూడ్డానికి అని.
_ “లేదు శేఖరం! ఆయనకి ఫొటోలు తీయించుకోవడం అంటే ఇష్టంలేదుగటో దానికి ఏదో కథచెప్తారు” అంది. ఆ కథను తలంచుకొని భయపడిపోయినట్టు ఆమె ముఖం పాలిపోయింది. "
సాయంకాలం వరకూ అక్కడే వున్నాడు. మరో రోజు వుండమని మంజరీ, వాళ్ళమ్మా బలవంతంచేశారుగాని వుండలేదు. వచ్చేముందు మంజరితో ఒంటరిగా మాట్లాడే అవకాశం చిక్కింది. అదీ-మూడు నిమిషాలే. వాళ్ళావిడ మంజరి తల్లితో చెప్పివద్దామని మేడమీదకు వెళ్ళినప్పుడు మంజరి ఒక్కర్తే వరండాలో అతని ఎదుట నిలిచివుంది.
చాలా సేపటినుండి ఒక విషయం ఆమెను అడగాలనుకొంటున్నాడు.
“అబద్దాలు ఆడడం ఎప్పుడు నేర్చుకున్నావు మంజరీ! అందమైనవాళ్ళు అబద్దాలు ఆడినా అందంగానే వుంటుందట. నువ్వు ఎంత పచ్చి అబద్దం ఆడుతున్నా ఎబ్బెట్టుగా అనిపించడంలేదు. కాని యింత శ్రమాపడి, కృత్రిమంగా నటించి నువ్వుసాధించిం దేమిటి? మీ ఆయన్ను ఊళ్ళో పెట్టుకొని కూడా లేడని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది?”
ఆమె ఏమీ మాట్లాడలేదు. దెబ్బతిన్న దానిలా కొద్దిక్షణాలు అతని ముఖంలోకి చూసి తల దించుకొంది. రెప్పలు కన్నీళ్ళతో తడిసి కిందకు వాలిపోయాయి. కంఠం దిగువన న్వరపేట్కవేద్ద దుఃఖం గూడుకట్టుకొని ఉబ్బిపోయింది.. పెదాలు బిగునుకుపోయి. అర్ధచంద్రాకారంగా కిందకు దిగిపోయాయి.
“చెప్పు మంజరీ” అన్నాడు శేఖరం తిరిగి. ॥
పాలిపోయిన ముఖం నిష్పాల్లో కాలినట్ట ఎ(ర్రబడిపోయింది. విసురుగా తలెత్తి సూటిగా అతని ముఖంలోకి చూసింది. కనుబొమల్లో కోపం వంపులు తిరిగింది. కళ్ళల్లో నీళ్ళు చేరి ఆ నీళ్ళల్లో ముఖంలోని ఎరుపు పడి ప్రతిఫలిస్తోంది.
“మా ఆయన గురించి నిజంగా నీకేమీ తెలీదా శేఖరం? ఎంధుకలా ఏమీ తెలీనట్బ నటిస్తావు. అనీలా నీకేమీ చెప్పలేదని ఎలా అనుకోనూ? నీకంతా తెలిసికూడా కావాలని ఏడిపిస్తున్నావు నన్ను. మాటిమాటికీ ఆయన గురించి అడగడంలో అర్థం
8 రంగుటిద్దాలు నన్ను బాధపెట్టాలనేగా. ఇలా నన్ను చిత్రహింస చేయడంలో నీకు లాభించేదేమిటి? నామీద కక్ష తీర్చుకోవాలనుకొంటున్నావా శేఖరం? నిన్ను తిరస్కరించినందుకు యీవిధంగా ప్రతీకారం తీర్చుకుంటేనేగాని నీకు మనశ్శాంతి లేదా? నేను నీకు చేసిన అపకారం ఏమిటి? నిన్ను పెళ్ళి చేసుకోకపోవడమేగా. అంతమాత్రంచేత ప్రతిసారీ నా దురదృష్టాన్ని ఎత్తిచూపించి ఎందుకు ఏడిపిస్తావు? నిజం చెప్పాఆయన అందవికారుడని నీకు తెలీదా? చెవుడని నువ్వు వినలేదూ?”
మంజరి కంఠం బొంగురుపోయింది. కంఠం చుట్టు ఉరితాడు బిగుసుకు పోయినట్టుగా మాటలు బైటకు రాలేక ఆమెలోనే అణిగిపోయాయి. కసితో తననుతానే హత్య చేసుకుని, బాధను భరించలేనట్టు వగరుస్తోంది. అక్కడ యిక వుండలేక అతను పిలుస్తున్నా వినకుండా చరచరా మేడమీదకు వెళ్ళిపోయింది. +
అతను క్షణంపాటు స్తబ్బుదడైిపోయాడు. సత్యానికి కత్తిపోటు అది. ఆ బాధ ఆమెకేకాదు, అతనికీను. దెబ్బతిన్నవాడిలా శేఖరం ఓసారి హృదయాన్ని తడుముకుని అక్కడనుండి బయలుదేరాడు.
ఒక్కవిషయం అతనికి అర్థంగాకుండా వుంది. తన వివాహ విషయంలో సంపూర్ణ స్వేచ్చగల మంజరి ఆంత అందవికారుడైన వాడిని ఎందుకు పెళ్ళి చేసుకుంది? చాలాకాలం వరకూ ఆ ప్రశ్నకు సమాధానమే దొరకలేదు.
అయిదు నెలల తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం లభించింది. ఒక రోజు రాత్రి వేగంగా నిద్రరాక, అలమారాలోంచి ఓ కథల సంపుటిని తీసి చదువుతూ కూర్చు. న్నప్పుడు, అందులోని జీవితసత్యం అనే కథ మంజరిని జ్ఞప్తికి తెచ్చి అతని ప్రశ్నకు సమాధానాన్ని యిచ్చింది.
భర్త మంచివాడుకాదని కాపరానికి వెళ్ళడం మానేసిన ఆ కథలోని అమ్మాయి, అకస్మాత్తుగా మనసు మార్చుకుని భర్త దగ్గరకు వెళ్ళడానికి ఏ యౌవ్వనపు పారపాబైతే కారణమైైందో, అదే పారపాటు, మంజరి అందవికారుడైన అ ఇంజనీరును పెళ్ళిచేసుకోవడానికికూడా కారణమై ఉంటుందని అనిపించింది.
చేదులాంటి యీ నిజాన్ని తెలియజేసిన ఆ పుస్తకం మీద విపరీతమైన కోపం వచ్చి, విసురుగా దాన్ని నేలమీదకు గిరాటేశాడు శేఖరం.
ం
చీకటి మడతలు
సేరన్వతి ఆ విషయం చెప్పిన తరువాత చాలా ఆశ్యర్యపోయాను. నేనెప్పుడూ అలాంటి విషయం జరుగుతుందని ఊహించలేదు. విన్నతర్వాత కొద్ది సేపటివరకూ . యీ విషయాన్ని నమ్మలేకపోయాను.
ఆమె ఏవో పరిచయాలను గురించి మాట్లాడుతున్నప్పుడు “మీపేరు నాకు చాలాకాలం క్రిందటే తెలును. అన్నయ్య పరిచయం చెయ్యకముందుకూడా మిమ్మల్ని బాగా ఎరుగుదును. కాలేజీలో మీ పేరు మూడు నాలుగు గదుల్లో , మేం కూర్చునే బెంచీలమీద చెక్కిఉండేది. అప్పటినుండీ మీ పేరు నాకు బాగా జ్ఞాపకం. ఆ తర్వాత అన్నయ్య మిమ్మల్ని పరిచయం చేశాడు! “అంది.
సరస్వతి, కల్పించి యీ విషయం చెప్పిందనుకోను.
నేనెప్పుడూ బెంచీలమీద నా పేరు చెక్కుకోలేదు. నా మిత్రులుకూడా నా పేరు చెక్కి ఉండరు. వారందరికీ నేనంటే గౌరవం ఉంది. ఆడవాళ్ళ బెంచీలమీద నా సరు చెక్కొల్సిన అవసరం వాళ్ళెవరికీ లేదు.
నరన్వతి చెప్పిన విషయాన్ని గురించి ఆ తర్వాత నేను చాలాసార్లు ఆలోచించాను. ఆ అక్షరాల్ని ఎవరు చెక్కిటంటారో ఊహించుకోలేకుండా ఉన్నాను.
తలే రంగుటద్దాలు కాని, తప్పకుండా వాటిని ఎవరో ఒక అమ్మాయి చెక్కిఉండాలి. ఆ అమ్మాయి ఎవరైనదీ తెలియకుండా ఉంది.
ఇప్పుడీ విషయాన్ని తెలుసుకోవడం చాలా కష్టమనిపిస్తోంది. కాలేజీ విడిచిపెట్టి సుమారు నాలుగైదేళ్ళు అయ్యింది. చాలామంది తమతమ జీవితాల్లోకి ప్రవేశించారు. ఇన్నేళ్ళ తరువాత ఆ విషయాన్ని తెలునుకోవడంలో వ్రయెజనం ఉన్నట్టు అనిపించడంలేదు. సరస్వతయినా ముందుగా యీ విషయాన్ని చెప్పిఉండవలసింది.
ముందుగా చెప్పిఉంటే కొంతవరకూ తెలుసుకోడానికి ప్రయత్నించి ఉండేవాడిని, ఈనాడు వరిస్థితులు చ్యేకులు దాటిపోయిన తరువాత, ఎవరో ఒకామె నన్ను (పేమించిందని తెలుసుకోవడంలో ఉపయోగంలేదు. ఒకరకంగా అది బాధకలిగించినా కలిగించవచ్చు. ॥
అయితే ఈ విషయాన్ని గురించి ఆలోచించగూడదనుకున్నా అది సాధ్యం కావడంలేదు. నాకు తెలియకుండా నాగురించి యింతకథ జరిగినప్పుడు కొంతవరకైనా దీనికి కారకులెవరో తెలుసుకోవాలనే కుతూహలం నాలో అధికమైంది.
గడచిన నాలుగేళ్ళ కాలేజీ జీవితాన్ని ఏకాంతంగా కూర్చొని మననం చేసుకున్నప్పుడు అనుమానించదగ్గ వ్యక్తులెవ్వరూ నాకు కనిపించలేదు. పై సంఘటన జరిగిఉంటే బి.ఏ. చదువుతుండగా జరిగి ఉండాలి. ప్రతి చిన్న సంఘటనకూ (ప్రాధాన్యం యిచ్చి ఆలోచించినప్పుడు ముందుగా ఇందిర జ్ఞాపకానికి వచ్చింది.
ఇందిరతో నేనెప్పుడూ అంతగా మాట్లాడలేదు. నిజానికి ఆమె మీద నాకు ఏమాత్రం గౌరవం లేదు. అప్పట్లో ఆమె చంద్రశేఖరాన్ని ేమించినట్టు వదంతి ఉండేది. తరచుగా లెక్చరర్ పారం చెప్తున్నప్పుడు కొద్దిసేపు ఆలకించి బామ్మలు గీస్తూ కూర్చునేది. గుండ్రని సున్నాలో రెండు చిలకలు, పూలగుత్తులు ఆమె తరచుగా వేస్తుండే చిత్రాలు. ఆమెకు డ్రాయింగ్ చేతకాదు. అయినా తనకు వచ్చినట్టుగా గీసి నాకు కనిపించేటట్న పెట్టేది. నేను కొద్దిగా బొమ్మలు గీస్తాననే సంగతి చాలామందికి తెలుసు. నాకు కనిపించేటట్టుగా బొమ్మల్ని గీయడంలో అర్థం యీనాడు ఊహించవలసి వస్తోంది.
జ్ఞానసుందరి అందరికన్నా చలాకీగా ఉండేది. చక్కగా పాటలు పాడేది. చివరిరోజుల్లో ఆమె రెండు మూడుసార్లు మాట్లాడింది. ఆమె ఏం మాట్టాడిందో యిప్పుడంతగా గుర్తులేదు.
ఒకసారి ఆమె చిత్రాన్ని గీశాను. అది మరో మిత్రుడు తీసుకుపోయి నాకు
బీకట్ మడతలు 89 తెలీకుండా ఆమె కిచ్చాడు. దానిమీద నాపేరు లేదు. ఆమె మొదట్లో తీసుకోడానికి అభ్యంతరం చెప్పింది. ఆ తర్వాత ఆ చిత్రం నేను వేసిందని తెలునుకొని, మారుమాట్లాడకుండా తీసుకుంది. ఈ విషయాలన్నీ ఆ మిత్రుడు వచ్చి చెప్పాడు. కొద్దిరోజులతర్వాత ఒక్కడ్నీ వెడుతున్నప్పుడు ఆమె కనిపించి కృతజ్ఞత తెలియజేసింది. కొద్దిసేపు పొగిడింది. ఆ సమయంలో ఆమె ప్రయెగించిన కొన్ని వాక్యాలకు అర్థం ఆ తర్వాత రెండురోజులు ఆలోచించవలసి వచ్చింది. ఇప్పుడవన్నీ జ్ఞాపకం లేవు. ఆమె ఏమన్నదీ జ్ఞాపకం రాకుండా ఉంది.
'స్నేహలత కాలేజీ జీవితం అయిపోయాకనే సన్నిహితంగా పరిచయం అయ్యింది. ఒకరోజు ఏదో మీటింగులో కనిపించి ఎంతో పరిచయం ఉన్నదానిలా మాట్లాడింది. పాత జ్ఞాపకాలు మననంచేసుకొని, “అవి చాలా చక్కటిరోజులు' అంది. తను ఏం చేస్తున్నదీ చెప్పింది. నేను ఊహించని స్వవిషయాలు ఎన్నో ఆమె తెలియజేసింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. చదువుకొనేటప్పుడు కనీసం ఒకసారైనా పలకరించు కోలేదు. తొలిసారిగా కలుసుకున్నప్పుడు ఎంతో పరిచయమైన వ్యక్తిగా, అతినన్నిహితంగా ఆమె మాట్లాడడం విచిత్రం అనిపించింది. ఆ మరుసటిరోజు వాళ్ళింటికి ఒకసారి రమ్మంది. అడ్రసుచెప్పి 'సాయంకాలం ఎదురుచూస్తాను' అంది.
మరుసటిరోజు వెళ్ళాను. ఆమె వీధిలోనే ఉంది. నన్ను చూడగానే చిరునవ్వునవ్వి లోపలకు తీసుకొని వెళ్ళింది. వాళ్ళ తల్లిగారికి పరిచయం చేసింది. ఆ తర్వాత తర్వాత ఆమె చాలా సన్నిహితమైన వ్యక్తి అయింది.
ఈనాడు అమె స్నేహంలో ఏమైనా విశేషం ఉన్నదా అని ఆలోచిస్తున్నప్పుడు, ఆమె నన్ను వాళ్ళమ్మకు పరిచయం చేసిన విధానం గురించి ఆలోచించవలసి వస్తోంది. అమెకు పరిచయం చేస్తూ “అప్పుడప్పుడు యీయన గురించి నీకు చెప్పండేదాన్ని కదూ” అంది. అప్పట్లో ఆ వాక్యాన్ని చాలా తేలికగా తీనుకున్నానుగాని, యీనాడు తిరిగి ఆలోచిస్తున్నప్పుడు దానివెనుక ఏమయినా అర్థం ఉండి ఉండాలి అనిపిస్తోంది. నన్ను గురించి వాళ్ళమ్మతో చెప్పడం ఆశ్చర్యంగా ఉంది!
వీళ్ళుగాక మరో ఐదారుగురు నాతో కలిసి చదువుకున్నారు. అయితే వొళ్ళతో నా కేమాత్రం పరిచయం లేదు. వాళ్ళను గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. వాళ్ళపేర్లుకూడా నాకు తెలియవు.
పైన చెప్పిన ముగ్గురిలోనూ ఎవరో ఒకరు ఆ పేరు చెక్కిఉండాలి. ఈ విషయంలో నేను అనుమానించదగ్గ వ్యక్తిగా జ్ఞానసుందరి కనిపిస్తోంది. ఆ మధ్య
తం రంగుటద్దాలు ఆమె రాసిన ఉత్తరం ఒకసారి బైటకుతీసి చదవాలనిపించింది. పనిమీద వైజాగ్ వెళ్ళినప్పుడు బజార్లో ఆమె కనిపించింది. వాళ్ళ నాన్నగారికి ఆవూరు ట్రాన్స్ఫర్ అయిందట. రెండేళ్ళబట్టి ఆ వూళ్ళోనే ఉంటున్నారట. తాను యూనివర్శిటీలో ఎమ్.ఏ చదివి ఉద్యోగం గురించి ఎదురుచూస్తున్నదట.
ఆ వూరినుంచి వచ్చిన తరువాత ఆమెకు ఉత్తరం రాశాను. వారం పదిరోజులు ఆలస్యంచేసి ఆమె జవాబిచ్చింది. మామూలుగా అన్ని ఉత్తరాలులాగే, ఆ ఉత్తరాన్నీ తీగకు గుచ్చినట్లు జ్ఞాపకం. ఆ ఉత్తరాన్ని తీసి యిప్పుడు మళ్ళీ చదువుతే ఏమైనా కొత్తవిషయాలు తెలియవచ్చనిపించింది.
పాత ఉత్తరాల్లో వెతకగా ఆమె రాసిన ఉత్తరం కనిపించింది. తీసి చదువు కున్నాను.
“సూర్యనారాయణమూర్తిగారికి -
మిమ్మల్ని యింత పెద్దపేరుతో పిలవడం కొంచెం శ్రమే అయినా, రోజూ మిమ్మల్ని పిలవవలసిన అవసరం లేదుగనుక, ఎప్పుడో ఒక్కొక్కప్పుడు యిలా వుత్తరాల్లో వలకరించే మిమ్మల్ని మీ పూర్తి పేరుతో పిలిచేందుకు కొంచెం శ్రమపడినా ఫరవాలేదనిపిస్తోంది. ఒకసారి అలా పిలుస్తే అభ్యంతరం చెప్పారు. అంత శ్రమపడి పూర్తిపేరుతో పిలవవలసిన అవసరం లేదని, సింపుల్‌గా చివరి రెండక్షరాలతోనూ పిలవమన్నారు. నాకు శ్రమ కలిగించకూడదనుకునే మీ అభిమానానికి కృతజ్ఞతలు. ఈ విషయాన్ని మీరు ఇంకొంత ముందుగా తెలియజేసి ఉంటే బావుండేది. ఈనాడు మిమ్మల్ని మీ పూర్తిపేరుతోనే సిలవాలని వుంది. అందుకు నాకు శ్రమేమీలేదు. జీవితంలో మీరు చాలా ఉన్నతమైనస్థానంలోకి వెళ్ళగలిగారు. అందుకు మిమ్మల్ని అభినందించాలి. గెలుపును, ఓటమిని ఒకేదృష్టితో తీసుకుంటారు. చాలా అదృష్టవంతులు మీరు. మీకు బాధలు వుండవు సమస్యలు వుండవు. మీలాంటి దృష్టి లేకపోవడం నా బలహీనత. ఓటమిని మర్చిపోలేను. జీవితంలో గాలిమేడలైపోయిన కోరికల్ని పదేపదే తలంచుకొని కుమిలిపోతుంటాను. మీలా సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిలేదు. పిరికిదాన్ని నా భవిష్యత్తు నాకే భయంగా ఉంటోంది. ఇకముందు మిమ్మల్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తాను.
కొన్ని విషయాల్లో తప్ప యిక్కడి జీవితం చాలా సంతోషంగానే గడిచిపోతోంది.
యూనివర్శిటీలో గడిపిన రోజులు చాలా విలువైనప్పటికీ కాలేజ్ రోజుల్ని మర్చిపోలేక
చీకటి మడతలు 97 పోతున్నాను. ఆ జీవితంలో ఒక ప్రత్యేకత వుంది. ప్రస్తుతం నేను ఉద్యోగం చెయ్యాల్సిన అవసరంలేదు. కాని చెయ్యడంలో ఒక అనందం ఉన్నదనిపిస్తోంది. అందుకై ప్రయత్నిస్తున్నాను. వీలు చూసుకుని జవాబు రాయండి. మీ ఉత్తరం గురించి ఎదురుచూస్తుంటాను. జ్ఞానసుందరి” ఉత్తరం మీద తారీఖు చూశాను. ఎప్పుడో పన్నెండు నెలల క్రిందటి ఉత్తరం అది. ఉత్తరం చదివాక నా అనుమానానికి మరికొంత బలం వచ్చింది. కాని ఆ తర్వాత అమె వద్దనుండి ఉత్తరాలు లేకపోవడం ఆశ్యర్యంగా ఉంది. ఆమె కోరినట్లుగా అప్పట్లో ఆమెకు ఉత్తరం రాశాను. కనీసం అందుకున్నట్టయినా సమాధానం రాలేదు. మళ్ళీ ఆమెకు ఎప్పుడూ ఉత్తరాలు రాయలేదు. ఈనాడు మళ్ళీ ఆమెకు ఉత్తరం రాయాలనిపించింది. పాఠ అడ్రనుకు ఆమె క్షేమసమాచారాల్ని తెలపవలసిందిగా కోరుతూ ఉత్తరం రాశాను. ఆఊత్తరం రెండు వారాల తర్వాత తిరిగి నాకే వచ్చింది. ఒకరోజు చంద్రశేఖరం వచ్చాడు. శుభలేఖ ఇచ్చి “నా పెళ్ళికి తప్పకుండా రావాలి సుమా” అన్నాడు. శుభలేఖ అందుకొని, విప్పిచూడకుండానే “ఎవరు?.... ఇందిరతోనేనా?” అన్నాను నవ్వుతూ, అతను పేలవంగా నవ్వేసి “కాదులే” అన్నాడు. ఆ విషయంమీద అతన్ని యింకేమీ ప్రన్చించదలచుకోలేదు. జరిగినది ఊహించగలను. చంద్రశేఖరం పెళ్ళికి ఇందిరకూడా వచ్చింది, ఆమె వస్తుందని నేను అనుకోలేదు. ఎదురుపడినప్పుడు ముందుగా ఆవిడే పలకరించింది. పెళ్ళి హడావిడిలో అప్పుడు ఇందిరతో ఎక్కువగా మాట్టాడలేకపోయాను. పెళ్ళయిన రాత్రిబండికే ఆమె వెళ్ళిపోతానంది. ఆ సాయంకాలం యింటికి రమ్మని ఆహ్వానించాను. సరే అంది. సాయంకాలం అయిదు దాటిన తర్వాత వేనే వెళ్ళి తీసుకొచ్చాను. కాఫీ తెచ్చి యిచ్చాను. ఆమె అభ్యంతరం చెప్పింది. కాఫీ టీలు తాగడం మానేసి నంవత్ప్సరం
92 రంగుటద్దాలు 'పైబడిందట. నన్ను కూడా మానేయమంది.
నవ్వుకున్నాను.
ఈమధ్య ఆమె చాలా ఊళ్ళు వెళ్ళిందట. అ విషయాలన్నీ చెప్పింది. కలకత్తాలో గోపాలం కనిపించాడట. ఆమెతోపాటు రాయఘడ్ వరకూ వచ్చి మళ్ళీ వెనక్కు వెళ్ళిపోయాడట. హైదరాబాదు వెళ్ళినప్పుడు స్పేహలతను కలుసుకున్నదట. అప్పటికి 'స్నేహలత యిద్దరు పిల్లల తల్లట.
ఆ విషయాలన్నీ వినడంలో నాకేమీ ఉత్సాహం లేదు. అయినా ఆలకిస్తున్నాను.
“మీరెప్పుడు పెళ్ళిచేసుకుంటారు”? అంది మాట్లాడుతూ మాట్లాడుతూ.
“ఏమో చెప్పలేను” అన్నాను.
విచిత్రంగా నా వైపు చూసింది. “అసలు పెళ్ళే చేసుకోరా?” అంది తిరిగి.
ఆమె అడిగిన ప్రశ్నకు నవ్వు పుట్టుకొచ్చింది. “చేసుకోకుండా ఉండలేనేమో” అన్నాను,.
ఆమె ప్రసంగం మార్చేసింది. “మీరు చాలా మారిపోయారు” అంది.
ఈ రకవు నంభాషణ పాతదానిలా అనిపించింది నాకు. చాలామంది నోటిమీదుగా యీ వాక్యాన్ని విన్నాను. ఆమె దృష్టిలో 'మార్చు' అనే పదానికి అర్థం ఏమై ఉంటుందో నాకు తెలీదు. మెల్లగా నవ్వి ఊరుకున్నాను. ఆమె కూడా మౌనంగా కూర్చుంది.
“ఇంకా మీరు బొమ్మల్ని గీస్తున్నారా?” అన్నాను మౌనాన్ని నెట్టేస్తూ. ఆమె ఒకమారు తల పైకెత్తి దించుకుంది. సమాధానంమాత్రం యివ్వలేదు.
జ్ఞానసుందరి గురించి ఆమెను అడిగితే ఏమన్నా చెప్పందేమో అనిపించి అడిగాను. గ
ఈ ఊరినుంచి వెళ్ళిపోయాక ఆమెను గురించిన సంగతులేవీ ఇందిరకు తలియవట.
“మీరంటే ఆమెకు చాలా అభిమానం” అంది ఇందిర. ఆమె అలా అంటుందని నేను ఊహించలేదు. 'ఢ్రేమ” అనే పదానికి బదులు 'అభిమానం' అనే పదం వాడిందేమో అనిపించింది.
“అందులో ఏమన్నా ప్రత్యేకత ఉన్నదా?” అన్నాను. _
చీకటి మడతలు 89
“ప్రత్యేకత ఉన్నదని నేనూ అనలేను. కాని అవ్వుడవ్వుడు మిమ్మల్ని పొగుడుతుండేది” అంది మెల్లగా నవ్వి.
ఆమె అలా నవ్వడం ఏమీ బావుండలేదు. అయినా అదేమీ గుర్తించనట్టు “నన్ను పొగడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకూ ఆమె ఏమని పాగిడేది?”అన్నాను.
“ఏమో ఏమని పాగిడేదో నాకూ తెలీదు. కళావతి నాతో అప్పుడప్పుడు చెప్పండేది, ఆమె ఎదుట పొగుడుతుండేదట” అంది.
“కలావతి ఎవరు?”
“కళావతి మనతోనే చదువుకుంది. తరచుగా నాతోపోటే తిరుగుతుండేది. మీకు జ్ఞాపకమే అనుకుంటాను. ఎకనామిక్సులో తరచుగా ఆమెకు ఫస్టుమార్కులు వస్తుం డేవి” అంది.
ఆమె చెప్పిన తర్వాత జ్ఞాపకం వచ్చింది, కళావతి అంటే - ఎర్రగా, పొట్టిగా వుండే కళ్ళద్దాలు పెట్టుకునే అమ్మాయి.
“ఆమె యిప్పుడు ఎక్కడ ఉంటోంది?” అడిగాను. బహుశా ఆమె ఈ ఊర్లోనే ఊంటే ఎలాగో ప్రయత్నించి వివరాలు సేకరిద్దామని. కాని ఆమె ఈ ఊళ్ళోలేదట. ఇప్పుడు ఎక్కడుంటున్నదీ ఇందిరకుకూడా తెలియదట. పెళ్ళయిన తర్వాత భర్తతో వెళ్ళిపోయిందట.
ఇందిర చెప్పిన విషయం జ్ఞానసుందరి మీద ఉన్న నా అనుమానాన్ని మరీ బలపరిచింది. జ్ఞానసుందరే చెక్కిఉండాలి అన్న అభిప్రాయానికి బలం చాలావరకు చేకూరింది. ఇందిర యింకా ఏమన్నా చెప్పందేమోనని ప్రయత్నించాను కాని యింకేమీ చెప్పలేదు. అంతకుతప్పించి యింకేమీ అమెకు తెలియదట.
ఆరోజు రాత్రిబండికే ఇందిర వెళ్ళివోాయింది. కూడా స్టేషనుకు వెళ్ళాను.
బండి రెండుగంటలు ఆలస్యం. వెయిటింగ్ రూంలో ఆమె కూర్చుంది. నేను బయట అటూ ఇటూ పచార్లు చేస్తున్నాను. అయిదు నిమిషాలు కూడా కాలేదు. ఆమె నా దగ్గరకు వచ్చి “ఇలా వంటరిగా కూర్చుంటే ఏమీ తోచడం లేదు. అలా వెళ్ళి మాట్లాడుకుందాం రండి” అంది.
ఇద్దరం వెళ్ళి ప్లాట్ఫారం చివర సిమెంటు బెంచీమీద కూర్చున్నాం,
మాట్లాడుకుందాం అని తీసుకువచ్చి చాలాసేపు ఏమీ మాట్లాడకుండానే
94 రంగుటద్దాలు కూర్చుండిపోయింది ఆమె. నేనుకూడా మాట్టాడేందుకు ఏమీలేక గోళ్ళు గిల్డు కుంటున్నాను. “గోపాలం మీ గురించి చాలా చెప్పాడు. అతనికి మీరంటే చాలా అభిమానం” అంది చాలాసేపటికి, ఆమె ఆ విషయం చెప్పాల్సిన అవసరం కనిపించలేదు. మెల్లగా నవ్వి ఊరుకున్నాను. “అతను ప్రస్తుతం కలకత్తాలో మందుల కంపెనీలో పనిచేస్తున్నాడట.” అంది. నా కెందుకో ఆమె అతని గురించి మాట్టాడ్డం అప్రస్తుతంగా తోచింది. ఆమె “దూరంగా వెళ్ళి మాట్లాడుకుందాం రండి' అన్నప్పుడు యీ రకంగా మాట్టాడుతుందని అనుకోలేదు. ఆమె ఏవో కొన్నీ రహస్యాల్ని చెప్తుందేమో అనుకున్నాను. కాని అలాకాకుండా ఆమె గోపాలాన్ని గురించి మాట్లాడ్డం ఆశ్యర్యం అనిపించింది. ఇందువల్ల ఆమెకు వచ్చే ప్రయోజనం ఏమిటో నాకు బోధపడలేదు. “బహుశా అతనంటే మీకు మంచి అభిప్రాయం లేనట్టుంది” అంది ఆమె, నేనాలోచించడం చూసి. నిజానికి నాకు అతనిమీద ఎంతమాత్రం మంచి అభిప్రాయంలేదు. చదువుకునే రోజుల్లో ఆడవాళ్ళ వెంటబడి ఏడిపించేవాడు. ఎవరో అమ్మాయి పేరుచెప్పి, ఆ అమ్మాయి తనను/పేమిస్తోందని చాటుకునేవాడు. ఒకసారి ప్రిన్సిపాల్ పిలిచి గట్టిగా మందలించడం కూడొ జరిగింది. ఆ రోజుల్లో అతను ఇందిరను కూడా ఏడిపించేవాడు. చంద్రశేఖరం గురించి ఆమెను అడగాలనుకున్నాను. కాని ఆవెం ఏమనమకుంటుందో అని అడగలేదు. ఆమె బండి వచ్చేవరకూ పొడిపొడిగొనే మాట్లాడింది. బండి వచ్చింది. సామాను తెచ్చుకుని లోపలకు ఎక్కింది. స్ధలం చూసుకొని తలుపు వద్దకు వచ్చి నుంచుంది. నేను ప్లాట్ఫారం మీద నుంచొని బండి కదీలితే వెళ్ళిపోవచ్చని ఎదురు చూస్తున్నాను. “పెళ్ళికి నన్ను పిలుస్తారా?” అంది అమె. ఆమె మాటలు నా కెందుకో కటువుగా అనిపించాయి. ఈ రకంగా మాట్లాడేవారంటే నాకసహ్యం. మాటలతో ఎదుటివారి మనసుల్ని నొప్పిస్తుంటారు. “పిలవనని ఎలా అనుకుంటున్నారు?” అన్నాను. ఆమె నవ్వి “వట్టినేలెండి, మీ పెళ్ళికి రాకుండా వుంటానా” అంది. బండి కదిలింది. ఆమె పెట్టైలోంచి ముందుకువంగి, “వీలు చూసుకుని
చీకటి మడతలు 95 మావూరు ఒకసారి రండి” అంది.
“అలానే” అన్నాను.
బండి దూరంగా వెళ్ళిపోయింది. నాకు తెలియకుండానే నేనామె గురించి బాధపడ్డాను. ఆ విషయం ఆలోచించినప్పుడు ఆశ్చర్యం కలిగింది.
ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత నా శ్రేయోభిలాషులకు నన్ను వంటరిగా వుంచడం యిష్టంలేకపోయినట్టుంది. వారంతా కలిసి నా వివాహ ప్రసక్తిని తీసుకొచ్చారు. మునుపటిలా యీసారి తప్పించుకోవడం సాధ్యం కాలేకపోయింది. ఇప్పట్లో నేను ఏ ఆటంకం చెప్పినా, నేను పాడైపోతున్నానని భావించేస్థితిలో?వున్నారు. వాళ్ళే , సంబంధం వెతికి శుభలేఖలు ఇచ్చు వేయించారు.
పెళ్ళికి బాగా సన్నిహితులైనవారు తప్ప ఎక్కువమంది కాలేజీ మిత్రులు రాలేదు. చాలామంది గ్రీటింగ్స్‌తో తమ బాధ్యతల్ని వదల్చుకున్నారు.
ఇందిర తప్పకుండా పెళ్ళికి వస్తుందని ఎదురుచూశాను. కాని, ఆమె రాలేదు. తను రాలేకపోతున్నందుకు క్షమాపణ చెప్పుకుంటూ మూడుపేజీల ఉత్తరం రాసింది. ఆమె రాలేకపోవడానికి పెద్దధ్దారణంకూడా లేదు. వాళ్ళ అక్కయ్య డెలివరీకి వచ్చిందట, తను తప్పకుండా అక్కడ ఉండాలిట!
ఆమె రాకపోయినందుకు అంతగా బాధపడేవాడిని కాదు గాని, తనంతట తాను తప్పకుండా వస్తానని చెప్పి రాకపోవడం చాలా బాధ కలిగించింది. పెళ్ళయిన తర్వాత ఆమెకు పెద్ద ఉత్తరం రాశాను. అది చదువుకున్నప్పుడు ఆమె బాధపడుతుందని నాకు తెలుసు. ఆమెనుండి దానికి జవాబు రాలేదు. వస్తుందనికూడా నేను అనుకోలేదు.
పెళ్ళయిన తరువాత వీలుచూసుకుని తిరుపతికొండకు వస్తారని యింట్లో మొక్కుకున్నారట. ఆరునెలలయ్యాక. యిద్దర్నీ కలిపి ప్రయాణం కట్టించారు. ఉద్యోగానికి మూడు రోజులు శెలవుపెట్టి ఆవిడతో బయలుదేరాను.
వెళ్ళినరోజు కాస్తా హడావిడిగా ఉంది. కొలనులో స్నానం చేసి వద్దామని వెళ్ళాం. నీళ్ళు పచ్చగా నాచు పట్టివున్నాయి. ఎలాగో శరీరాల్నీ, బట్టల్నీ తడుపుకొని బయటికి వచ్చాం. ఆమె తల ఆరబెట్టుకొంటోంది. నేను వట్టినే చూస్తూనుంచున్నాను. తడిబట్టల్లో ఆమె చాలా అందంగా వుంటుందనిపించింది. ఆమె అందాన్ని చాలా రకాలుగా ఊహించుకొంటున్నాను.
ఎవరో పిలిచినట్టనిపిస్తే ముందకు చూశాను. స్నేహలత! చిరునవ్వు నవ్వుతూ
తిం రంగుటద్దాలు దగ్గరకు వచ్చింది. చంకలో ఏడాది పిల్లవాడున్నాడు. కూడా మూడేళ్ళపిల్ల చెంగుపట్టుకొని వచ్చింది. వెనుక వాళ్ళాయన గాబోలు, అతనుకూడా దగ్గరకు వచ్చాడు.
అప్పటికీ యిప్పటికీ స్నేహలతలో చాలా మార్చు కనిపించింది. వెంటనే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె దగ్గరకు వచ్చి పలకరించకపోతే ఎవరా అని కొద్దిసేపు ఆలోచించవలసి వచ్చేది. చదువుకొనేటప్పుడు యింతలావు వుండేది కాదు. ముఖంలో పెద్ద ముత్తయిదువ పోలికలు కనిపించాయి. తడిజాకెట్టు బింకంగా ఆమె దండల్ని నొక్కి పడుతుండడం చూసినప్పుడు, ఆ లావు ఆమెకు తగదు అనిపించింది.
వాళ్ళ ఆయన్ను నాకీ పరిచయం చేసింది. ఆవిడను వాళ్ళిద్దరికీ పరిచయం చేశాను. పెళ్ళికి రాలేకపోయినందుకు ఏమీ అనుకోవద్దంది. అందుకు ఏవో కారణాలు చెప్పింది.
వాళ్ళు ఎందుకు వచ్చినదీ ఆమె చెప్పింది. చంటాడికి అక్కడే తల వెంట్రుకలు తీయిస్తామన్నారట. అందుకని వచ్చారట. అక్కడ వాళ్ళకు తెలిసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఎవరో ఉన్నారట. అతని ద్వారా వేగంగా పని తెముల్చుకోవచ్చంది. మమ్మల్నికూడా వాళ్ళతోపాటే రమ్మంటే వెళ్ళాం.
మధ్యాహ్నానికి పనంతా పూర్తయిపోయింది. గదిలోకూర్చుని తాపీగా ప్రయాణపు విశేషాల్ని గురించి మాట్లాడుకొంటున్నప్పుడు స్నేహలత వచ్చింది ఆ చుట్టుపట్ల ఏవో గుడులు ఉన్నాయట, చూసివద్దాం రమ్మంది. వాళ్ళతోపాటు బయలుదేరాం.
పాపను వాళ్ళ నాన్నగారు ఎత్తుకొన్నారు. స్నేహలత చంటాడిని ఎత్తుకొంది. మొదటినుంచీ చూస్తూనే వున్నాను, ఆమె చంటాడిని చంక మార్చలేదు. ఆయనమాత్రం పాపను పదిసార్లయినా దింపి వుంటారు! ఆమె ఓర్పుకు ఆశ్చర్యం వేసింది.
సాయంకాలానికి విడిది చేరుకున్నాం.
రాత్రి భోజనాలైన తరువాత వాళ్ళుకూడా వచ్చి కూర్చున్నారు. మరుసటిరోజు ఉదయం వెళ్ళిపోతున్నామని చెప్పాను. వాళ్ళుకూడా అదే అభిప్రాయంలో ఉన్నారట. మాతోపాటు బెజవాడ వరకూ వస్తారట.
మర్హాడు ఉదయం ముందుగా తెముల్చుకొని వాళ్ళదగ్గరకు వెళ్ళాను. స్నేహలత వంగి, పెట్టెతాళం తీస్తోంది. ఆమెను చూస్తోంటే ముందు ముందు ఆమెకు తన శరీరంవల్ల మరీ కష్టపడాల్సిన పరిస్థితి రావచ్చనిపిస్తొంది.
బీకటి మడతలు త్రి నేను రావడం చూసి ఆమె లేచి నుంచుంది. వాళ్ళాయన లేరు. పిల్లలు ఏవో కావాలని ఏడిస్తే చైటకు తీసుకెళ్ళారట.
“మీకు బాధగా లేదూ?” అన్నాను.
అమె నవ్వింది. “ఏం చేయమంటారు. నా అంతట నేను పెంచుకోవడం లేదు. రోజురోజుకూ అదే పెరిగిపోతోంది. అప్పటికీ రాత్రిళ్ళు భోజనం మానేసి ఫలహారం పుచ్చుకొంటున్నాను” అంది.
నాకు ఇందిర జ్ఞాపకానికొచ్చింది. ఇందిర లావెక్కాలనుకొంటోంది. అందుకే కౌఫీ టీలు మానేసింది. స్నేహలత సన్నబడాలనుకొంటోంద్ది. రాత్రిళ్ళు భోజనం మానేసింది. కాని యిద్దరూ అనుకున్నట్టు జరగడంలేదు.నాలో నేనే నవ్వుకున్నాను.
“నవ్వుతున్నారేం?” అంది పసిగట్టి.
“ఏమీలేదు. ఇందిరకు సగం మీ శరీరాన్ని యిచ్చేస్తే బావుంటుంది” అన్నాను. ఆవె కేదో జ్ఞావకం వచ్చినట్టంది, “అన్నట్టు ఇందిర గోపాలాన్ని పెళ్ళి చేసుకోవాలనుకొంటున్నదట. మొన్ననే ఉత్తరం రాసింది” అంది.
నే నాళ్చర్యపోయాను; ఇందిర గోపాలాన్ని సెళ్ళిచేసుకోవడమనేది కలలోని విషయంలా అనిపించింది నాకు. ఇది సాధ్యమని నేనెప్పుడూ అనుకోలేదు.
“చాలా ఆశ్చర్యంగా వుంది నాకు” అన్నాను నేను. ఆమె అతి సామాన్యంగా నవ్వి “ఇందులో ఆశ్చర్యపడాల్సినదేమీలేదు. ఆధునిక పద్ధతులంటే ఆమెకు బాగా యిష్టం. ప్రేమించడమంటే ఆమె దృష్టిలో గొప్ప సాహసం, అదో సరదా” అంది.
ఇందిరమీద స్ప్నేహలతకున్న అభిప్రాయంలో నాలుగోవంతు మాత్రమే చెప్పినట్టనిపించింది. తోటి స్త్రీ అనే అభిమానంచేత అంతగా ఏమీ ఆమెను గురించి చెప్పలేదనుకున్నాను. ఆ రోజు ఇందిర శ్చేషన్లో గోపాలం ప్రనంగం ఎందుకు తీనుకువచ్చిందో యిప్పుడు అర్థమయ్యింది. గోపాలంమీద నా అభిప్రాయాన్ని తెలునుకోవాలని ఆమె ఊహ.
గోపాలాన్ని ఆమె 'పేమించిందన్నమాట!।
కాలేజీలో బెంచీలమీద నా పేరు ఇందిర చెక్కివుండదని తేలిపోయింది.
'స్నేహలత భర్తు పిల్లలు వచ్చారు. నన్ను చూసి “మీరంతా రెడీ అయిపో యారా” అన్నాడు.
98 రంగుటద్దాలు
“అయిపోయినట్టే” అన్నాను నేను. అతను గబగబా సామానుల్ని సర్దేశాడు. ఈలోగా నేనుకూడా సామాను సర్దుకొని ఆవిడను తీసుకొచ్చాను. ఒక పెట్టె, చిన్న బెడ్డింగు తప్ప అట్టే సామానులు లేవు మాకు. వాళ్ళను చూస్తోంటే అంత సామానుతో ఎలా బయలుదేరారో ఆశ్చర్యంవేసింది. మరచెంబు, విసనకర్రలతో సహా చిల్లర చిల్లర సామానులు చాలావున్నాయి!
రైల్లో స్నేహలత, అవిడ కలసి కూర్చున్నారు ఈ రెండు రోజుల్లోనూ అవిడకు 'స్నేహలత బాగా పరిచయం అయిపోయింది.
అతను నా ప్రక్కనే కూర్చున్నాడు. కొద్దిసేపు పేపరు చదివి ప్రక్కన పెట్టి వట్టినే అలా బయటకు చూస్తున్నాను. విశాలమైన పచ్చని పాలాలంటే నాకు చాలాయిష్టం, వాటిని చూస్తూ ఎంతసేపయినా గడిపేయగలను.
పాప కిటికీ దగ్గరకువచ్చి కిటికీలోంచి చూస్తోంది. మధ్య మధ్య గట్టిగా అరుస్తూ గెంతుతోంది. స్నేహలతకు భయం ఎక్కువ. పాపను కోప్పడి సరిగా కూర్చోమంటోంది. పాప వినడంలేదు. పాపను దగ్గరకు తీసుకొని “ఫరవాలేదులెండి” అన్నాను ఆమె భయానికి నవ్వుకున్నాను.
పరధ్యాన్నంగొ బయటికి చూస్తున్నప్పుడు పాప, “మావయ్యా ఎన్ని ఆవులో!” అంది, దూరంలో ఆవులమందని చూపించి. నాకు ఆశ్చర్యంవేసింది. ఆ విధంగా పాప పిలవడం కొత్తగా వుంది. తనంతట తాను అలా పిలిచిఉండదు. బహుశా 'స్పేహలతే అలా పిలవమని చెప్పి ఉండాలి.
పాస నన్ను వదిలిపెచ్చేట్టు లేదు. బెజవాడ వచ్చేవరకూ నా దగ్గరే కూర్చుంది. బెజవాడలో వాళ్ళు దిగిపోయారు. వాళ్ళను విడిచిపెట్టడం చాలా బాధనిపించింది.
వెళ్ళేముందు ఆయన కరచాలనం చేశాడు. “మిమ్మల్ని గురించి మా 'స్నేహలత తరచు చెప్తుండేది. ఎప్పుడన్నా మిమ్మల్ని కలుసుకోవాలనుకునే వాడిని. అనుకోకుండా కలునుకొని, మనం చాలా నన్నిహితులమయ్యాం. మిమ్మల్ని కలవడం, మీతో మూడు రోజులు గడపడం-చాలా సంతోషకరమైన విషయం” అన్నాడు.
నాకు చప్పున స్నేహలత వాళ్ళమ్మకు పరిచయం చెయ్యడం జ్ఞాపకానికొచ్చింది. అప్పట్లో అనుకున్నట్టుగా, ఆ పరిచయం వెనక ఏ ప్రజ్యేకతా ఉండిఉండదు. ఆ విషయంలో నేను పారపాటు పడ్డాను.
బెంచీలమీద అక్షరాలు స్ప్నేహలత చెక్కిఉండదు.
బీకటి్ మడతలు న!
మరో సంవత్సరం గడిచింది. జీవితంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. రోజులు సంతోషంగానే గడిచిపోతున్నాయి. మిగిలిన రోజులుకూడా యిలాగే గడచిపోతే చాలు. అంతకన్నా నేను కోరేదేమీలేదు. అభిరుచులుకూడా పరిమితమయిపోయాయి. ఉద్యోగం ఇల్లు-జీవితమంతా వీటిచుట్టూ పరిధుల్ని సృష్టించుకొన్నట్లనిపిస్తోంది.
ఉద్యోగరీత్యా బొంబాయి వెళ్ళవలసి వచ్చింది. నేను పనిచేస్తోన్న కంపెనీ తాలూకు టెక్ట్సయిలు డిజైను మిషను బొంబాయి వరకూ వచ్చి ఆగిపోయింది. దాన్ని హార్చరునుండి విడిపించి రైల్లో పంపించాలి. మేనేజరు పిలచి నన్ను వెళ్ళమన్నాడు. అక్కడి ఎవరి పేరోచెప్పి, ఆయన్ను కలుసుకుంటే పని వేగంగా అయిపోతుందన్నాడు. అతనిపేర ఉఊత్తరంరాసి, నా చేతికిచ్చాడు. న
బొంబాయి వెళ్ళాక మేనేజరు ఇచ్చిన అడ్రసుప్రకారం అతన్ని కలుసుకునేందుకై వెళ్ళాను. బయట ఎవరో ఆడామె ఉంది. నన్ను చూడగానే లోపలకు వెళ్ళిపోయింది. పనిమనిషి గాబోలు వచ్చి “ఆయన లేరు” అని చెప్పింది. వెళ్ళిపోదామని వెనక్కు తిరిగాను. లోపలినుంచి అమె ఏదో చెప్పినట్టుంది, పనిమనిషి డ్రాయింగు రూం తలుపు తీసి “వారు వచ్చే టయిమయింది, పోనీ కూర్చోండి” అంది . ఆయనకోసం మళ్ళీ రావడం యిష్టంటేక వెళ్ళి కూర్చున్నాను.
ఒక్కసారిగా మల్లెపూల వాసన వేసింది. గదిలో. ఎక్కడన్నా అవి ఉన్నాయేమోనని చుట్టూ చూశాను. ఏవీ కనిపించలేదు. అయిదు నిమిషాల తరువాత ఎదురుగా ఉన్న కిటికీ వెనక గాజులు గలగలమన్నాయి. అటువయిపు చూస్తే కొద్దిగా తెరచిన కిటికీ సన్నని చారలోంచి చీరపవిట కనిపించి మాయమయ్యింది.
అతను వచ్చాడు. మేనేజరు యిచ్చిన ఉత్తరం చూపించాను. అందులో నన్ను పరిచయం చేసినట్బన్నాడు, చిన్న చిరునవ్వు నవ్వి నాతో కరచాలంచేసి “సరేలెండి, మధ్యాహ్నం వెళ్ళి ఆపని చూద్దాం” అన్నాడు.
భోజనానికి అక్కడ ఉండిపొమ్మన్నాడు గాని ఉండలేదు. మధ్యాహ్నం వెళ్ళి అతన్ని కలుసుకున్నాను. సాయంకాలంవరకూ యీ పనిమీదనే తిరిగాం. మొత్తంమీద పని పూర్తయ్యింది.
మరునటిరోజు అక్కడ నుండి వచ్వే[ేముందు ఆయన్ను ఒకసారి కలుసుకోవాలని పించింది. కాఫీ పుచ్చుకుని ఉదయాన్నే అక్కడకు బయలుదేరాను. నవ్వుతూ సరదాగా మాట్లాడడం ఆయనలో ఒక ప్రత్యేకత. వయసు ముప్పయి ఏళ్ళకు
100 రంగుటడ్దాలు మరో రెండు మూడు ఎక్కువగా ఉంటాయి, బట్టతల మరికాస్తా 'పెద్దవాడిలా చూపిస్తుంది.
నేను వెళ్ళేసరికి అతను యింట్లో లేడు. ఉదయమే పనిఉందని వెళ్ళిపోయాడట. అతని భార్యగాబోలు వచ్చి సమాధానం చెప్తోంది. నిన్న నన్ను చూసి లోపలకు వెళ్ళిపోయినదికూడా ఆవిడే. ఆమెను ఎక్కడో చూసినట్టనిపించింది. ఆ విషయం ఆమెను అడగడం సభ్యతకాదని ఆలోచిస్తున్నాను. ఆమె నవ్వుతోంది. “గుర్తుపట్టారా?” అంది.
నాకు చప్పున జ్ఞాపకం వచ్చింది. నాతో రెండేళ్ళు కలిసి చదివినా ఆమెను అంతసేపటివరకూ గుర్తుపట్టలేకపోయినందుకు సిగ్గుపడాల్సివచ్చింది. ఆమె కళావతి! నా క్లాస్మేట్! క
ఆమెలో చాలా మార్చు వచ్చినట్టనిపించింది. బొంబాయి నాగరికతకు అలవాటుపడ్డ మనిషిలా వుంది. తలకు హెయిర్ నెట్ పెట్టుకుంది. చెవులకు గుండ్రని రింగులు వేలాడుతున్నాయి. మెడలో సన్నని గొలుసు తప్ప యింకేమీలేవు. చేతికి చిన్న రిస్టువాచి ఉంది. పూర్వపు కళ్ళజోడు లేదు. అందువల్లే మరీకొత్తగా వుంది.
“చాలా మారిపోయారు” అన్నాను.
అమె నవ్వింది. “మీరు మాత్రం నాకేమీ మారినట్టనిపించలేదు. నిన్న మిమ్మల్ని చూసినప్టుడే అనుమానం వేసింది. రాత్రి వారు వచ్చినతరువాత అడిగాను. అనుమానం నిజమే అయింది” అంది.
ఆమె లోపలకు తీసుకెళ్ళింది. కొద్దిసేపట్లో టిఫిను, కాఫీ తెచ్చి యిచ్చింది . ఎదురుగా ఉన్న కుర్చీలో ఆమె కూర్చుంది. కాఫీ తాగుతూ ఆమెను గురించి ఆలోచిస్తున్నాను.
నా కెందుకో వాళ్ళిద్దరి జంటా అదోలా అనిపించింది. వాళ్ళ మధ్య విపరీతంగా వయసులో తేడా కనిపిస్తోంది. వాళ్లిద్దరూ సినిమాలకూ, షికార్లూ తరచు వెళ్తుంటారని అనుకోలేకపోతున్నాను.
ఆ ఇంట్లో పిల్లలు ఉన్నజాడ నాకేమీ కనిపించలేదు.
“పిల్లలా?” అన్నాను.
లేదన్నట్లు తల ఊపింది. ఆ విషయం తెలియజేసినప్పుడు ఆమె కొద్దిగా బాధపడినట్టే అనిపించింది. ఆ ప్రశ్న అడుగకుండా వుండాల్సింది.
“అయన చాలా సరదా అయిన మనిషి. మీకు మంచి కాలక్షేపం” అన్నాను
బీకటి మడతలు 107 ఆమెను నా ప్రశ్నతో మనసు నొప్పించానేమోనని. బె నన్నట్టు తలూపింది. అ తర్వాత ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి జారిపోయింది.
“మనం అనుకున్నవన్నీ జరగవు. జరిగితే దేవతలమే అయ్యేవాళ్ళం. జీవితంలో తృప్తి పడడం నేర్చుకోవాలి కదా” అంది ఆమె అకస్మాత్తుగా.
తలఊపి “నిజమే” అన్నాను. ఆ తర్వాత ఇంకేమీ మాట్లాడలేదు.
జ్ఞానసుందరి గురించి ఆమెనుఅడగాలనిపించింది. కళావతి ఎదురుగా జ్ఞానసుందరి నన్ను పొగుడుతుండేదట. ఆ విషయం ఇందిర చెప్పింది. కళావతిని యిష్పుడు అడిగితే ఏమన్నా కొత్త సంగతులు చెప్పవచ్చు. ఆ విషయం తప్పకుండా తెలుసుకోవాలనే అభిరుచి లేదు గాని, యింతవరకూ వచ్చి, అది తెలుసుకోకపోవడ మేమిటి?
“జ్ఞానసుందరి యిష్పుడెక్కడుంటున్నదో తెలుసా?” అన్నాను.
“ఏలూరులో ఉంటోంది. అక్కడ కాలేజీలో పనిచేస్తందట. ఈమధ్యనే ఆమె వద్దనుండి ఉత్తరం వచ్చింది. చూపిస్తా, ఉండండి” అంటూ లోపలకు వెళ్ళి ఉత్తరం తెచ్చి చదవమని యిచ్చింది.
మరొకరి ఉత్తరాలు చదివే అలవాటు నాకులేదు.
“చదవక్కరలేదు లెండి, ఏమిటి రాసిందీ చెప్తే చాలు” అన్నాను.
“ఫరవాలేదులెండి, అందులో రహస్యాలు ఏమీలేవు” అంది.
ఉత్తరం తీసుకుని చదివాను.
“ప్రియమైన కళా-
నీ ఉత్తరం అంది చాలాకాలమైనా మనసు బాగుండక వెంటనే నమాధానం ఇవ్వలేకపోయాను. ఏమిటో రోజులు చాలా బరువుగా దొార్డుతున్నట్టనిపిస్తున్నాయి. పూర్తిగా అనందాన్ని పొందలేకపోతున్నాను. కారణం ఏమిటో తెలీదు. ఇక్కడి మనుషులంటే నాకు అనహ్యూం. వారికి నా యోగక్షేమాలు తెలుసుకోవడంకన్న వేరేపనేమీ లేనట్టుంది. నా శ్రేయస్సే వాళ్ళకు ప్రధానమైనట్టు నా ఎదురుగా నటిస్తుంటారు. వాళ్ళప్రవర్తనతో రోజురోజుకు విసిగిపోతున్నాను. సాధ్యమైనంత త్వరగా యిక్కడినుండి మరో చోటికి ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని ఉంది. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూఉండు. నీ ప్రియమైన జ్ఞానసుందరి”
702 రంగుటడ్డాలు ఉత్తరం చదివి ఆమె చేతికిచ్చాను. అందుకొని “పాపం? ఆమెను చూస్తుంటే జాలేస్తుంది. పెళ్ళి చేసుకొంటే యిన్ని సమస్యలు ఉండకపోనేమో” అంది కళావతి. నేను ఆశ్చర్యపోయాను. ఆమె యింతకాలంవరకూ పెళ్ళిచేసుకోకుండా ఉంటుందని అనుకోలేదు.
“ఆమె యింకా పెళ్ళిచేసుకోలేదా?” అని అడిగాను.
లేదన్నట్టుగా ఆమె తల ఊపింది. ఆ తర్వాత ఆవిడే “ఆమె పెళ్ళిచేసుకోకుండా ఉండడానికి నాకు కారణం ఏమీ కనుపించడంలేదు. చాలా విచిత్రమైన మనిషి గతాన్ని తలంచుకుని ఎప్పుడూ బాధపడుతుంది” అంది.
ఆ 'గతం' ఏమిటో నాకు తెలుసు. కాని అంతమాత్రం చేత ఆమె అలా బాధపడడం నాకేమీ నచ్చలేదు. వట్టి సిరికిమనిషిలా అనిపించింది. ఆ విషయమే కళావతితో అన్నాను. “జ్ఞానసుందరి పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోలేదు, వట్టి పిరికి మనిషి” అని.
ఆమె తల ఊపింది. “నిజమే కాని, పిరికి వాళ్ళయినంత మాత్రంచేత అంతా ఆమెలా ప్రవర్తిస్తారని నేను అనుకోను. చాలామంది జీవితంలో కోర్కెలు ఫలించక నిరాశ ఆవరించిన వాళ్ళే. గతాన్ని తలంచుకొని బాధపడుతూ వారంతా గడపరు. తృప్తి అనేదొన్ని ఏర్పరుచు కుంటారు. అప్పుడే కొంతవరకు గతాన్ని మర్చిపోవడానికి ఆస్కారముంటుంది” అంది.
ఆ విషయం ఆమె చెప్తున్నప్పుడు ఆ నిర్ణయం మీద ఆమె స్థిరచిత్తం ఎలా పనిచేసినద్ తెలుస్తోంది. అంత గంభీరంగా ఆమె మాట్లాడుతుందని నేను అనుకోలేదు.
జ్ఞానసుందరి గురించి నాకు కావలసిన సమాచారమంతా అందింది. మరొక్క సంగతి తెలియాలి. “ఆమె నా గురించి మీతో తరచు చెప్పుతూ, నన్ను పొగుడుతుండేది కదూ” అన్నాను,
ఆమె తల ఊపింది. లో
ఇక జ్ఞాననుందరిని గురించి తెలునగ్జక్రోవలనినదేమీ లేదు. అంతా తెలిసిపోయింది. ఆమె ఏమని ప్రాగిడేదీ ఊహించవస్చు. -.
జ్ఞానసుందరి నన్ను [్రేమించిందనే విషయం తెలిసిపోయింది.
ఇప్పుడు మనసు చాలా తేలికగా వుంది నేను అనుమానించినట్టే అయ్యింది.
బీళఠటి మడతలు 103 ఇన్నేళ్ళ తర్వాత యీ విషయం వెల్లడై ఒకసమస్య తీరిపోయింది. నేనూ (ప్రేమించబడ్డాను! అలా అనుకోవడం ఒక రకమైన ఆనందమేకాదు గర్వంకూడా.
చాలాసేపు మౌనంగా గడిచిపోయింది. సంభాషణలను పొడిగించడం నాకు చేతకాదు. అలోచిస్తూ కూర్చున్నాను. ఆమెకూడా ఏమీ మాట్లాడలేదు. పెన్సిలుతో స్టూలుమీద వట్టినే పిచ్చిగీతలు గీస్తోంది.
నేను వచ్చి గంటన్నర కావస్తోంది. ఆయన ఇంకా రాలేదు. వెళ్ళిపోదామని లేచాను. ఆమె విచిత్రంగా చూసి“ఏమిటి! వెళ్ళిపోతున్నారా! లాభంలేదు, భోంచేస్తేనేగాని మిమ్మల్ని వెళ్ళనిచ్చేదిలేదు”అంది. ॥
ఆమె అంత ఆప్యాయంతో కోరుతున్న కోర్కెను తిరస్కరించక తప్పలేదు. మధ్యాహ్నం బండికి వెళ్ళిపోక తప్పదు. ఆమెకు నా క్షమాపణలు చెప్పుకున్నాను. వెళ్ళిపోతున్నందుకు ఆమె చాలా బాధపడింది.
“ఉండండి, కొద్దిగా మజ్జగయినా పుచ్చుకొని వెళ్ళుదురుగాని” అంటూ లోపలికి వెళ్ళి గ్లాసుతో మజ్జిగతెచ్చి యిచ్చింది.
గ్లాసు కాళీచేసి స్టూలుమీద పెడుతున్నప్పుడు నాకళ్ళను నేనే నమ్మలేక పోయాను. స్టూలుమీద పెన్సిలుతో గీసిన పిచ్చిగీతల మధ్య నా పేరు రాసి ఉంది! ఆశ్చర్యపోయాను.
చప్పున కాలేజీలో బెంచీలమీద చెక్కిన అక్షరాలు జ్ఞాపకానికి వచ్చాయి. ఏమిటో విచిత్రంగా ఉంది నాకు. అంతకుముందు ఆమె అన్నమాటలు ఎవరికి అన్వ్నయిస్తాయో యిప్పుడు కొద్దికొద్దిగా తెలుస్తోంది. కాని ఆమెనన్ను గ్రేమించి ఉంటుందని అనుకోలేకపోతున్నాను. ఆమెతో నాకు ఏ మాత్రర పరిచయం ఉండేది కాదు. కనీసం, ఆమె ఎవరో నేనెప్పుడూ తెలుసుకొనేందుకైనా ప్రయత్నించలేదు.
మరోరోజు అక్కడే ఉంటే ఆ విషయం తెలుసుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కాని వెళ్ళిపోతానని చెప్పి తిరిగి ఉండిపోవడంలో అర్థంలేదు. ఆమె వద్ద సెలవు తీసుకొని బయలుదేరాను.
స్టేషనుకు వెళ్ళి టిక్కట్టు కొనేముందు ఒకసారి జ్ఞాననుందరిని కలుద్దామనిపించింది. ఆమెనుకూడా చాలా కాలంనుంచి కలుసుకోలేదు. ఆమె ఉంటున్న ఊరు తోవలోనే గనుక ఒకసారి దిగి కలుసుకుందామని నిర్ణయించుకున్నాను.
టిక్కెట్టు ఏలూరుకు తీసుకున్నాను.
104 రంగుటద్దాలూ
ఏలూరు వచ్చాక, క్లోకురూములో సామానుంచి జ్ఞానసుందరిని కలుసుకొనేందుకై కాలేజీకి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆమె క్లాసులో ఉంది. అరగంటసేపు ఎదురుచూశాక గంటకాగానే ఆమె బయటకు వచ్చింది. నన్ను చూసి ఆశ్చర్యపోయింది. “ఏమిటి? ఎప్పుడొచ్చారు”? అంది.
నాప్రయాణం గురించి ఆమెకు చెప్పాను.
ఇద్దరం స్టాఫరూంలోకి వెళ్ళాం. లోపల అంతా విచిత్రంగా మావైపే చూస్తున్నారు. ఆ చూపుల్ని భరించడం కష్టం అనిపించింది. ఎలాగో ఓపిక పట్టి కూర్చున్నాను.
“ఇప్పుడు చెప్పండి. ఏంచేస్తున్నారు? 'పెళ్ళయిందా? పిల్లలెంత మంది? కళావతి ఏమంటోంది? ....” గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలన్నీ ఒక్కసారే వేసేసింది.
అన్నిటికీ మెల్లగా సమాధానం చెప్పుతూ కూర్చున్నాను.
వైజాగ్‌లో ఉంటుండగా నేను రాసిన ఉత్తరానికి సమాధానం ఎందుక్సు రాయలేదో అడిగాను. ఆ ఉత్తరం ఆమెకు అందలేదట, నేను కలుసుకున్న తర్వాత కొద్దిరోజులకే వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయిందట.
“కళావతి మీకు ఎలా కలిసింది?” అంది.
“చాలా గంభీరమైన మనిషి, ఏ విషయంలోనూ సులభంగా బైటపడేరకం్య కాదు” అంది తిరిగి ఆమె.
ఆమె ఏవిషయాన్ని పురస్కరించుకొని అలా అన్నదో అర్ధమయ్యింది. కళావతిన్ని గురించి జ్ఞానసుందరిని అడిగి మరికొంచెం తెలుసుకుంటే బావుండును.
“ ఆ రోజుల్లో ఆమె నాగురించి మీతో ఎమన్నా చెప్పేదా?” అన్నాను.
“లేదు” అంది ఆమె. కొద్దిసేపు మౌనంగా ఊరుకొని-
“కాని , ఒకరోజు ఆమె నోట్సు తీసుకున్నాను. లోపల ఒకచోట మీ పేరు రాసి కొట్టేసి వుంది” అంది తిరిగి.
నాకంతా పూర్తిగా అర్ధమయిపోయింది. చాలాకాలంగా సమస్యగా ఉండిపోయిన్న ఒక విషయం యివ్వాల్చితో తీరిపోయింది. ఆరేళ్ళ అనంతరం విచిత్రంగా ఈ సమన పరిష్కారమయింది. చీకటి మడతలు విచ్చుకున్నాయి. ఇందిర, జ్ఞానసుందరి, స్నేహలత్తి కళావతి - యీ నలుగుర్లో అసలు కారకులెవరో తెలిసిపోయింది.
బీకటి మడతలు 105
నేను ఊహించినట్టు జ్ఞానసుందరి నన్ను (ప్రేమించింది. అందులో అబద్ధం లేదు. కాని యిష్పుడు మరో కొత్త విషయం తెలిసింది. కళావతి కూడా నన్ను ప్రేమించింది. బెంచీలమీద నా పేరు చెక్కినడి కళావతే- ఇద్దరూ రహస్యంగా (ప్రేమించారు. వ్యక్తంచేసే ధైర్యం యిద్దరికీ లేదు. ఈ విషయంలో యిద్దరూ షిరికివాళ్ళే-.కాని కళావతి మాత్రం గంభీరమైన మనిషి. (ప్రేమిస్తున్నట్లు ఎవరికీ చెప్పలేదు. కనీనం ఇందిరకుకూడా చెప్పిఉండదు. జీవితంలో తృప్తిపడి సంతోషంగా బతకడం నేర్చుకుంది. అది జ్ఞానసుందరికి సొధ్యంకాలేదు. గతాన్ని మర్చిపోలేకపోతోంది.
నాకుచెప్పలేనంత ఆనందమయ్యింది. ఇరువుకి చేత డ్రేుమించబడ్డాను! అదోరకమైన గర్వం.
మరికొద్ది సేపు ఆమెతో మాట్లాడి అక్కడనుండి బయలుదేరాను. ఆమె కాలేజీ అఆవరణ' వరకూ వచ్చి ఆగిపోయింది.
“మీరు యిక పెళ్ళిచేసుకోరా?” అన్నాను. నవ్వింది కాని సంతోషంగా నవ్వలేదు. “ఇలాగే ఉండిపోదా మనుకొంటున్నాను” అంది.
రిక్షా పిలిచాను. వచ్చింది. లోపల కూర్చుని “మీరునిజంగా సంతోషించడం లేదు. మరొకరి మీద కక్షతో మిమ్మల్ని మీరే బాధించుకొంటున్నారు. అది మంచిపని కొదు” అన్నాను.
రిక్షా కదిలింది.
“సరేలెండి, 'పెళ్ళిచేసుకోవాలనే అభిప్రాయమే గాని కలిగితే తప్పకుండా చేసుకుంటాను”అంది.
రిక్షా చాలాదూరం వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి వెనక్కుతిరిగిచూశాను. ఆమె అక్కడే నిలుచొని ఉంది!
ఛం
.. అమ్మెవచ్చి కూర్చుంది; మోకాళ్ళను మడిచి, ఎడంచేతిని చాపమీద అన్ని, బరువునంతా దానిమీద. ... బస షతపుకుని నిటాగ్గా కిందకు దిగిన ముత్యాల, నరం(సీలం, రంగు. చీరలో నక్షత్రాల్ని దండగా గుచ్చి... న సాద నమన నం మా (ఊరితీయబడ్డ నిజం. యల యయా ను రాం న. ల న స ఖై " నమన న న వ లం... వ క (ఫే టో శు. టకు... వ య ల్ . య హా క “ఉట వంత నల దమం లి వ వ్ ళా ” తో | విత
చు చ నచ తంట హా యీ | క్యా
Lalo Learning Hub — Languages, Literature & Cultural Bridges
Maintained by Srinivas Anil Kumar Varanasi
- Language‑Index
- Telugu · Telugu‑Alphabet · Telugu‑Grammar · Telugu‑Phrasebook
- Sanskrit · Trimuni‑Sanskrit‑Grammar · Telugu‐Index · Telugu-Links
- Hindi
- Telangana · Telangana‑Index
- Telangana‑Culture · Telangana‑Language · Telangana‑Grammar · Telangana‑History
- Kaloji: Kaloji‑Na‑Godava‑Poems · Kaloji Telangana Bhasha Bathuku